sri kakulam
-
పొంచివున్న ఫొని
-
వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వస్తే సమస్యలు పరిష్కరిస్తాం
-
శ్రీకాకుళం జిల్లాపై విరుచుకుపడిన టిట్లీ తుఫాన్
-
ఇంటర్ పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు
శ్రీకాకుళం, న్యూస్‌లైన్ : ఈ నెల 12వ తేదీ నుంచి జరగనున్న ఇంటర్మీడియెట్ పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని అదనపు జాయింట్ కలెక్టర్ ఎండీ హషీం షరీఫ్ అధికారులను ఆదేశించారు. పరీక్షల నిర్వహణపై జిల్లా స్థాయి సమన్వయ కమిటీ సమావేశం శుక్రవారం కలెక్టరేట్లో ఏజేసీ అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నెల 12 నుంచి ఏప్రిల్ 1 వరకు జరగనున్న పరీక్షల్లో మాస్ కాపీయింగ్, ఇతర అక్రమాలు జరగకుండా చర్యలు తీసుకోవాలన్నారు. అక్రమాలకు పాల్పడేవారిపై చర్యలు తప్పవని స్పష్టం చేశారు. అక్రమాల నిరోధానికి ఫ్లయింగ్, సిట్టింగ్ స్క్వాడ్లను నియమించాలన్నారు. జిల్లాలోని 93 పరీక్ష కేంద్రాలకు రవాణా సౌకర్యం కల్పించాలన్నారు. పరీక్ష కేంద్రాల్లో ప్రథమ చికిత్స సిబ్బంది, మందులను ఏర్పాటు చేయాలని జిల్లా వైద్యఆరోగ్యశాఖ అధికారులను ఆదేశించారు. పరీక్షలు ముగిసిన అనంతరం జవాబు పత్రాలను స్పీడ్ పోస్టులో పంపేందుకు అవసరమైన ఏర్పాట్లకు సహకరించాలని పోస్టల్ శాఖ అధికారులను కోరారు. పరీక్ష సామగ్రిని భద్రపరిచేందుకు, తరలించేందుకు అవసరమైన రక్షణ కల్పించాలని పోలీసు అధికారులను ఆదేశించారు. ఇంటర్మీడియెట్ బోర్డు ప్రాంతీయ పర్యవేక్షణ అధికారి ఎ.అన్నమ్మ మాట్లాడుతూ పరీక్షలు జంబ్లింగ్ విధానంలో జరుగుతాయని, అవసరమైన సిబ్బందిని నియమించామని చెప్పారు. సమావేశంలో జిల్లా వృత్తి విద్యాశాఖాధికారి పి.పాపారావు, జిల్లా పరీక్షల కమిటీ సభ్యుడు జి.అప్పలనాయుడు, ఆర్టీసీ డీపో మేనేజర్ ముకుందరావు, పోలీస్, వైద్యఆరోగ్యశాఖ అధికారులు పాల్గొన్నారు. -
మూడు ఎన్నికలాట!
అసలే సార్వత్రిక ఎన్నికలు.. లోక్‌సభ, అసెంబ్లీలకు ఉమ్మడిగా జరిగే ఈ ఎన్నికలే అగ్ని పరీక్ష అనుకుంటే.. ఉరుములేని పిడుగులా మున్సిపల్ ఎన్నికలు.. ఇది చాలదన్నట్లు తాజాగా మెరుపులా మెరిసిన జెడ్పీ ఎన్నికలు.. మన దేశ ఎన్నికల చరిత్రలోనే బహుశా ఇంతముందెన్నడూ ఇన్ని రకాల ఎన్నికలు ఒకేసారి జరిగి ఉండవేమో!.. సర్వోన్నత న్యాయస్థానం జోక్యంతో ఏళ్ల తరబడి జాప్యమవుతూ వచ్చిన మున్సిపల్, జెడ్పీ ఎన్నికలు అనూహ్యంగా తెరపైకి వచ్చి.. ముందునుంచీ సన్నాహాలు చేసుకుంటున్న సార్వత్రిక ఎన్నికలను వెనక్కి నెట్టేయడంతో ఇటు రాజకీయ పార్టీలు.. అటు అధికార యంత్రాంగం ఉక్కిరిబిక్కిరవుతోంది. ఈ మూడు ఎన్నికలాటలో తీర్పు చెప్పాల్సింది మాత్రం.. ఆసులాంటి ఓటరు ఒక్కడే. సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం ఎన్నికలే... ఎన్నికలు!.. ఒకటి కొంటే రెండు ఫ్రీ అన్న చందంగా... ఒక ఎన్నికే అనుకుంటే మరో రెండు ఎన్నికలు వచ్చిపడ్డాయి. సాధారణ ఎన్నికల కోసం సన్నద్ధమవుతున్న ప్రధాన పార్టీలపై ఊహించని రీతిలో మున్సిపల్ ఎన్నికలు వచ్చాయి. అందుకు సిద్ధమవుతుండగానే మరో ఎన్నికల పిడుగు పడింది. వెంటనే జెడ్పీ, మండల పరిషత్తులకు ఎన్నికలు నిర్వహించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. దాంతో ‘పరిషత్తు’ ఎన్నికలకు తెర లేచింది. ఇలా మూడు ఎన్నికలూ... అదీ కేవలం రెండు నెలల వ్యవధిలోనే రావడ పార్టీలే కాదు ప్రజలూ ఊహించని పరిణామమే. అందరి కన్నూ జెడ్పీ అధ్యక్ష పీఠంపైనే జిల్లా, మండల పరిషత్తు అధ్యక్షుల రిజర్వేషన్లపై జిల్లా వ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. ఇప్పటికే జెడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాల రిజర్వేషన్లను ఖరారు చేశారు. కాగా కీలకమైన జిల్లా, మండల పరిషత్తు అధ్యక్షుల రిజర్వేషన్లపై అధికార యంత్రాంగం కసరత్తు జరుపుతోంది. శనివారం మధ్యాహ్నానికి వీటిని ఖరారు చేస్తారని తెలుస్తోంది. జిల్లా పరిషత్తు చైర్మన్ పదవి ఈసారి మహిళలకు రిజర్వు కావచ్చని స్పష్టమవుతోంది. కాగా ఇందులో కూడా బీసీ మహిళ, ఎస్సీ మహిళకు కేటాయిస్తారన్నదానిపై ఉత్కంఠ నెలకొంది. ఆ రిజర్వేషన్ ప్రకారం జిల్లాలో మూడు ప్రధాన పార్టీల నుంచి జెడ్పీటీసీ ఎన్నికల బరిలో నిలిచే ముఖ్య నేతలు బయటపడతారు. మూడు ప్రధాన పార్టీల్లోని ప్రముఖ మహిళా నేతలు జిల్లా పరిషత్తు చైర్పర్సన్ పదవిపై ఇప్పటికే కన్నేశారు. ఎమ్మెల్యే అభ్యర్థులుగా అవకాశం దక్కని మహిళా నేతలు జెడ్పీ చైర్పర్సన్ గిరీని దక్కించుకోవడానికి ఇప్పటికే వ్యూహరచనలో నిమగ్నమయ్యారు. అదే విధంగా జెడ్పీటీసీ సభ్యుల రిజర్వేషన్లు ప్రకటించినప్పటికీ ఎంపీపీ రిజర్వేషన్లపై కూడా ఆసక్తి నెలకొంది. ఎందుకంటే అన్ని పార్టీల్లోనూ ప్రతి మండలంలోనూ ఒకటి రెండు వర్గాలు ఉన్నాయి. జెడ్పీటీసీ, ఎంపీపీ స్థానాలను సర్దుబాటు చేసుకోవాలన్న ఉద్దేశంతో ఆశావహులు ఉన్నారు. నోటిఫికేషన్‌పై ఉత్కంఠ జిల్లా, మండల పరిషత్తు ఎన్నికల నోటిఫికేషన్ ఎప్పుడు విడుదల చేస్తారన్నదానిపై భిన్నాభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఈ నెల 10(సోమవారం)న విడుదల చేస్తారని అత్యధికులు భావిస్తున్నారు. ఆ దిశగానే అధికార యం త్రాంగం సన్నాహాలను వేగవంతం చేసింది. అలా అయితే మున్సిపల్ ఎన్నికల జరగ్గానే జిల్లా, మండల పరిషత్తు ఎన్నికలు నిర్వహిస్తారు. అలా కాకుండా నోటిఫికేషన్ విడుదల ఆలస్యమైతే సాధారణ ఎన్నికల తరువాతే ఈ ఎన్నికలు నిర్వహిస్తారు. కానీ అందుకు అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి. నోటిఫికేషన్ విడుదలపై రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఇంతవరకు ఎలాంటి ప్రకటన చేయలేదు. కానీ జిల్లా, మండల పరిషత్తు రిజర్వేషన్ల ప్రక్రియను వెంటనే పూర్తి చేయమని అధికారులను ఆదేశించింది. దాంతో మున్సిపల్ ఎన్నికలు పూర్తయిన వెంటనే జిల్లా, మండల పరిషత్తు ఎన్నికలు నిర్వహించే అవకాశాలు ఉన్నాయని భావిస్తున్నారు. దీనిపై సోమవారం వరకు ఉత్కంఠతో ఎదురుచూడాల్సిందే. ఈ నేపథ్యంలో జిల్లాలోని రాజకీయ పార్టీలు మూడు ఎన్నికలకూ సన్నాహాలకు చేపట్టాయి. వైఎస్సార్సీపీ కార్యాచరణ మూడు ఎన్నికల కార్యాచరణ దిశగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ముందుగానే మేల్కొంది. ఇప్పటికే మున్సిపల్ ఎన్నికల వ్యూహరచనలో ఉన్న పార్టీ పరషత్తు పోరుపైనా దృష్టిసారించింది. పార్టీ అధినేత వై.ఎస్.జగన్మోహన్రెడ్డి హైదారబాద్‌లో నిర్వహించనున్న ప్రత్యేక సమావేశానికి జిల్లా పార్టీ అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్ హాజరుకానున్నారు. మున్సిపల్, పరిషత్తు, సాధారణ ఎన్నికల వ్యూహంపై ఈ సమావేశంలో చర్చించనున్నారు. ఇక ఇప్పటి కే ఖరారైన జెడ్పీటీసీ, ఎంపీసీటీ రిజర్వేషన్ల ఆధారంగా పార్టీ అభ్యర్థులు ఎవరన్నదానిపై ప్రాథమిక సమాలోచన లు చేపట్టారు. ఒకేసారి మూడుఎన్నికలు రావడాన్ని ప్రతికూలంగా కాకుండా సానుకూలం గా మలచుకునేందుకు వైఎస్సార్ కాంగ్రెస్ వ్యూహరచన చేస్తోంది. పార్టీలో ఉన్న అశావాహులందరినీ, అన్ని వర్గాలను సంతృప్తిపరిచేలా టిక్కెట్ల కేటాయింపు చేయాలన్నది పార్టీ అధిష్టానం ఆలోచనగా ఉంది. ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులను నిర్ణయించడంతోపాటు అవకాశం దక్కని ఇతర వర్గాలకు మున్సిపల్, మండల, జెడ్పీటీసీ ఎన్నికల్లో గుర్తింపు ఇవ్వాలన్నది వ్యూహం. దీని వల్ల అశావాహులు, ద్వితీయశ్రేణి నేతలకు అవకాశం కల్పించడంతోపాటు సామాజికవర్గ సమతూల్యం సాధిం చవచ్చని పార్టీ భావిస్తోంది. ఈ మేరకు ఇప్పటికే నియమితులైన నియోజకవర్గ సమన్వయకర్తలు, ఇతర నేతల సామాజిక వర్గాలు, పార్టీ కోసం వారు చేసిన కృషి తదితర అంశాలను భేరీజు వేస్తోంది. ఎంపీపీ, జెడ్పీటీసీ సభ్యులు, జెడ్పీ చైర్మన్ పదవుల రిజర్వేషన్లను ప్రకారం కార్యాచరణను రూపొందించనున్నారు. మరోవైపు పార్టీ విధానాన్ని సక్రమంగా అమలు చేసేందుకు మున్సిపల్, పరిషత్తు ఎన్నికల కోసం పరిశీలకులను నియమించాలని ఆ పార్టీ నిర్ణయించింది. ఇందుకోసం ఇతర జిల్లాలకు చెందిన నేతలను పరిశీలకులుగా నియమించనున్నారు. పార్టీ అధినేత వై.ఎస్.జగన్మోహన్రెడ్డి శనివారం నిర్వహించనున్న సమావేశంలో దీనిపై తుది నిర్ణయం తీసుకుంటారు. అనంతరం జిల్లా పార్టీ విసృ్తతస్థాయి సమావేశం నిర్వహించి ఎన్నికల కార్యాచరణ అమలుకు శ్రీకారం చుడతారు. టీడీపీ, కాంగ్రెస్ సమాలోచనలు టీడీపీ కూడా మండల, జిల్లా పరిషత్తు ఎన్నికలపై దృష్టి సారించింది. మున్సిపల్అభ్యర్థుల ఎంపిక కసరత్తును త్వరగా పూర్తిచేయాలని ఆ పార్టీనేతలు భావిస్తున్నారు. ఆ వెంటనే జిల్లా, మండల పరిషత్తు అభ్యర్థుల ఎంపిక చేపడతారు. ఇప్పటికే జిల్లాలో పార్టీ కార్యక్రమాల కోసం అధినేత చంద్రబాబు ఐదుగురు సభ్యులతో కమిటీని నియమించారు. చౌదరిబాబ్జీ, కళా వెంకట్రావు, గౌతు శివాజీ, అచ్చెన్నాయుడు, కూన రవి ఈ కమిటీ సభ్యులుగా ఉన్నారు. ఈ కమిటీయే జెడ్పీటీసీ, ఎంపీటీసీ సభ్యుల ఎంపిక ప్రక్రియ చేపడుతుంది. కాంగ్రెస్ పార్టీ ఇంతవరకు ఎలాంటి కార్యాచరణ చేపట్ట లేదు. కేంద్రమంత్రి కృపారాణి, కోండ్రు మురళీ తదితరులు ప్రాథమిక చర్చల తోనే సరిపుచ్చారు. ప్రస్తుతం జిల్లా, మండల పరిషత్తు ఎన్నికలు కూడా వచ్చిపడటంతో కాంగ్రెస్ కూడా సీరియస్‌గానే ఎన్నికల దిశగా అడుగులు వేయకతప్పదు. ఈ నేపథ్యంలో జిల్లాలో రానున్న రెండు నెలలు సర్వత్రా ఎన్నికలే సందడే కనిపించనుందనడటం మాత్రం సుస్పష్టం. -
‘ఇన్‌టైమ్ సర్వీసు’కు కాంట్రాక్టు రద్దు
శ్రీకాకుళం, న్యూస్‌లైన్ : జిల్లాలోని కస్తూర్బాగాంధీ విద్యాలయాల్లో ఖాళీగా ఉన్న పోస్టులను కాంట్రా క్టు పద్ధతిపై భర్తీ చేసేందుకు ఇన్‌టైమ్ సర్వీసు సంస్థకు ఇచ్చిన కాంట్రాక్టును కలెక్టర్ సౌరభ్‌గౌర్ రద్దు చేశారు. ఈ సంస్థ అక్రమాలకు పాల్పడుతున్నట్లు ‘సాక్షి’లో కథనం ప్రచురితం కావడంతో స్పందించిన ఆయన ఈ మేరకు నిర్ణయించారు. తిరిగి ప్రకటన వెలువరించాలని ఆర్వీఎం అధికారులకు ఆదేశించారు. ఎఫ్ఏవో సరెండర్ సాధ్యమేనా? ఇదే విషయంలో ఎఫ్ఏవో ప్రముఖ పాత్ర వహించారని కలెక్టర్ గట్టి నమ్మకానికి వచ్చి ఆయనను సరెండర్ చేయాలని పీఓకు ఆదేశించినా అది సాధ్యమయ్యే పనేనా అని పలువురు చర్చించుకుంటున్నారు. జి.రాజు అనే ఖజానా శాఖ ఉద్యోగి అయిదేళ్ల క్రితం డిప్యుటేషన్‌పై రాజీవ్ విద్యామిషన్‌కు వచ్చారు. డిప్యుటేషన్ మూడేళ్లతో ముగియాల్సి ఉన్నప్పటికీ ఫారెన్ సర్వీసెస్ సౌలభ్యం రావడంతో అయిదేళ్లు వరకు ఉండే అవకాశం వచ్చింది. ఈ కాలంలో ఆయన పదోన్నతులు సైతం వదులుకున్నారు. అయిదేళ్ల గడువు ముగిసిన తరువాత పదోన్నతి పొంది ఖజానా శాఖలో ఒకటి, రెండు రోజులు పనిచేసి మళ్లీ ఆర్వీఎంకు డిప్యుటేషన్ వేయించుకున్నారు. దీనివల్ల కొత్తగా డిప్యుటేషన్‌పై నియమించినట్లు అయింది. అందువల్ల ఎఫ్‌ఏఓను సరెండర్ చేయడం సాధ్యం కాదని పలువురు అభిప్రాయపడుతుండగా ఛైర్మన్ హోదాలో కలెక్టర్ ఏ స్థాయి అధికారినైనా సరెండర్ చేసే అధికారం ఉందని ఇంకొందరు ఉద్యోగులు చెబుతున్నారు. ఈ విషయంలో ఏం జరుగుతుందో మరి కొద్ది రోజులు వేచి చూడాల్సిందే. -
అధికారాంతమునా ఆమ్యామ్యానే!
జిల్లాలో ఓ కీలక నేత యవ్వారం ఉద్యోగాల క్రమబద్ధీకరణ పేరిట వసూళ్లు రూ.కోటి ఇవ్వాలని డిమాండ్ ప్రభుత్వ పతనంతో ఆందోళనలో కాంట్రాక్టు హెల్త్ అసిస్టెంట్లు సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం : దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలన్న ఓ కీలక నేత ఆత్రం.. కాంట్రాక్టు ఉద్యోగులపాలిట శాపంగా మారింది. ఉద్యోగాలను క్రమబద్ధీకరించాలని విజ్ఞప్తి చేసిన కాంట్రాక్టు ఉద్యోగులను ఆ ప్రభుత్వ పెద్ద ‘అయితే నాకేంటి?’అని ప్రశ్నించారు. ‘నా సంగతి చూస్తే... మీ సమస్య పరిష్కరిస్తా’అని అసలు విషయాన్ని సూటిగా చెప్పేశారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో ప్రభుత్వం పతనావస్థకు చేరుకున్న వేళ కూడా వారి నుంచి వీలైనంత గుంజుకునేందుకు యత్నించారు. తీరా మొదటి విడత కొంత చెల్లించాక.. రాష్ట్రంలో పరిణామాలు పూర్తిగా మారిపోయాయి. దాంతో తమ ఉద్యోగాల సంగతేమిటి? సమర్పించుకున్న మొత్తం సంగతేమిటని ఆ ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు. ఆ కీలక నేత నుంచి, ఆయన వ్యక్తిగత సహాయకుడి నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో హతాశులవుతున్నారు. ఇదీ సంగతి.. తమ ఉద్యోగాలను క్రమబద్ధీకరించాలని వైద్యశాఖలో పనిచేస్తున్న కాంట్రాక్టు హెల్త్ అసిస్టెంట్లు కొంతకాలంగా ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ఒక్క శ్రీకాకుళం జిల్లాలోనే దాదాపు 300 మంది కాంట్రాక్టు ఉద్యోగులు ఉన్నారు. పదేళ్లకుపైగా పనిచేస్తున్న వీరంతా తమ ఉద్యోగాల క్రమబద్ధీకరణ కోసం చేయని ప్రయత్నమంటూ లేదు. కాగా తమకు న్యాయం చేయమని తన వద్దకు వచ్చిన ఉద్యోగులతో ప్రభుత్వంలోని ఓ కీలక నేత మాట్లాడినపుడు అసలు విషయాన్ని బయటపెట్టారు. రూ.కోటి ఇస్తే ఉద్యోగాలు క్రమబద్ధీకరిస్తానని ఆయన చెప్పినట్లు సమాచారం. ఉద్యోగాల క్రమబద్ధీకరణకు వైద్యశాఖ ఉన్నతాధికారులు వ్యతిరేకంగా ఉన్నారని, కాబట్టి ప్రభుత్వంలోని ముఖ్యనేతతో వారికి చెప్పించాల్సి ఉంటుందన్నారు. కాబట్టి ఆ మాత్రం సొమ్ము సమర్పించుకోవాల్సిందేనని తేల్చిచెప్పారు. అలా అయితేనే ప్రభుత్వస్థాయిలో సహకరిస్తానని తేల్చిచెప్పారు. దాంతో కాంట్రాక్టు ఉద్యోగులు హతాశులయ్యారు. కానీ కీలక నేత తన వ్యక్తిగత సహాయకుడి ద్వారా ఆ ఉద్యోగులపై నిరంతరం ఒత్తిడి చేశారు. చివరికి ఉద్యోగులు మరోదారి లేక సరేనన్నారు. అందులో మొదటి విడతగా కొన్ని రోజుల క్రితం రూ.30 లక్షలు ఆ కీలక నేత వ్యక్తిగత సహాయకుడికి సమర్పించుకున్నారు. ప్రభుత్వ పతనం..పత్తాలేని కీలక నేత వేగంగా మారిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి రాజీనామా చేయటంతో మొత్తం మంత్రిమండలి రద్దైంది. దాంతో హెల్త్ అసిస్టెంట్ల గుండెల్లో దడ మొదలైంది. అసలు సీఎం కిరణ్ రాజీనామా చేస్తారని కొన్నిరోజులుగా వార్తలు వెలువడుతూనే ఉన్నాయి. దీంతో అప్రమత్తమైన హెల్త్ అసిస్టెంట్లు ఉద్యోగాల క్రమబద్ధీకరణపై అధికార పార్టీ కీలక నేత ముందు ఆందోళన వ్యక్తం చేశారు. కానీ వారి భయాన్ని ఆ నేత కొట్టిపారేశారు. ‘అంతా నేను చూసుకుంటాను. మీరు ధీమాగా ఉండండి.. మిగిలిన రూ.70 లక్షలు సమకూర్చుకోండి’అని తన వ్యక్తిగత సహాయకుడి ద్వారా చెప్పిం చారు. ఇంతలో సీఎం కిరణ్ రాజీనామా చేశా రు.. గానీ వారి ఉద్యోగాల సంగతి తేలలేదు. దీంతో తీవ్రంగా ఆందోళన చెందిన హెల్త్ అసిస్టెంట్లు కీలక నేతను సంప్రదించేందుకు బుధ, గురువారాల్లో ఎడతెగని ప్రయత్నాలు చేశారు. కానీ ఆయన కనీసం ఫోన్లో కూడా అందుబాటులోకి రాలేదు. దీంతో శ్రీకుకుళంలో ఉండే ఆయన వ్యక్తిగత సహాయకుడిని కలిసేందుకు ప్రయత్నించారు. కానీ ఆయన కూడా అందుబాటులో లేకుండాపోయారు. ఫోన్లో మాట్లాడేందుకు చేసిన ప్రయత్నాలు కూడా ఫలించలేదు. దాంతో కాంట్రాక్టు హెల్త్ అసిస్టెంట్లు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఈ విషయం జిల్లా వైద్య శాఖలో తీవ్ర చర్చనీయాంశమైంది. ఈ వ్యవహారం ఎలాంటి మలుపు తిరుగుతుందో.. కాంట్రాక్టు హెల్త్ అసిస్టెంట్లకు న్యాయం జరుగుతుందో లేదో వేచి చూడాల్సిందే! -
గ్రామీణాభివృద్ధికే ‘ఉపాధి’!
ఉపాధి హామీ పథకం రాష్ట్ర డెరైక్టర్ కరుణ శ్రీకాకుళం అర్బన్, న్యూస్‌లైన్: ఉపాధి హామీ పథకం గ్రామీణాభివృద్ధికి కేంద్ర బిందువుగా మారిందని ఆ పథకం రాష్ట్ర డెరైక్టర్ వి.కరుణ అన్నారు. జిల్లా అధికార యంత్రాంగం శ్రీకాకుళం కోడిరామ్మూర్తి క్రీడా మైదానంలో.. మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం సమ్మేళనాన్ని గురువారం నిర్వహించింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జిల్లాలో ఉపాధిహామీ పథకం గొప్ప విజయం సాధించిందన్నారు. పనుల నిర్వహణ, రికార్డుల నమోదులో సిబ్బంది బాగా పనిచేస్తున్నారని కితాబిచ్చారు. జిల్లా ప్రాజెక్ట్ డెరైక్టర్ ఎ.కల్యా ణ చక్రవర్తిని యోగిగా ఆమె అభివర్ణించారు. సిబ్బంది ఉద్యోగంపై అభద్రతా భావానికి గురి కావద్దన్నారు. కసి పెరిగి.. కలెక్టర్ సౌరభ్‌గౌర్ మాట్లాడుతూ.. 2011-12 ఏడాదికి జాతీయ అవార్డుకు దరఖాస్తు చేసినపుడు జాతీయ డేటా బేస్‌తో సరిపోల్చడం లేదని అధికారులు చెప్పారని.. దీంతో మరింత పట్టుదలగా పనిచేశామన్నారు. వంద రోజుల పనిపూర్తి చేసిన వారి సంఖ్యను గణనీయంగా పెంచేందుకు కృషి చేశామన్నారు. ఈ పనుల వల్ల రైతులకు చెరువు లు బాగుపడి సాగునీరు అందుతోందని, కూలీలకు రేట్లు పెరిగాయని, వేతన చెల్లిం పులో ఆర్థిక అసమానతలు తొలగాయని చెప్పారు. గిరిజన ప్రాంతాల్లో ఈఏడాది *60 నుంచి *70కోట్లుతో రహదారులు నిర్మిస్తున్నామన్నారు. రోజుకు 5 లక్షల మంది కూలీలు పనికి వచ్చేలా ప్రోత్సహించి.. రికార్డు స్థాపించాలని కోరారు. 3.95 లక్షల కుటుంబాలు, 5.12లక్షల మంది పనికి హాజరవుతున్నారన్నారు. ఎస్సీ, ఎస్టీలలో 64శాతం మంది మాత్రమే 100 రోజుల పనిదినాలను పూర్తి చేసుకున్నారని, నూరు శాతం కుటుంబాలు 150 రోజుల పనిదినాలను పూర్తి చేసుకొనుటకు చర్యలు చేపట్టాలన్నారు. జాయింట్ కలెక్టర్ వీరపాండ్యన్ మాట్లాడుతూ జిల్లాలో ఉపాధిహామీ పథకం చక్కగా అమలవుతోందన్నారు. భద్రాచలం ఐటీడీఏ ప్రాజెక్టు అధికారిగా పనిచేస్తున్నపుడు శ్రీకాకుళం విజయాలు విని..అధ్యయనం చేసేందుకు సిబ్బందిని పంపించానన్నారు. నీటియాజమాన్య సంస్థ ప్రాజెక్టు డెరైక్టర్ ఎ.కల్యాణ చక్రవర్తి మాట్లాడుతూ 2012-13 సంవత్సరంలో *394 కోట్లు ఖర్చు చేశామని, 2013-14లో 2లక్షల కుటుంబాలకు వంద రోజుల పనిదినాలు కల్పించాలని కలెక్టర్ లక్ష్యం గా నిర్ణయించారన్నారు. పథకం సహాయ ప్రాజెక్టు డెరైక్టర్లు, సహాయ ప్రొగ్రాం అధికారులు, క్షేత్ర సహాయకులు, సాంకేతిక సహాయకులు మాట్లాడారు. ఉత్తమ పనితీరు కనబరిచిన 90 మందికి ప్రశంసా పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా రెడ్‌క్రాస్ చిక్కోలు చిరుదివ్వెలు ట్రస్ట్‌కు ఉపాధి హామీ పథకం అధికారులు, సిబ్బంది *2.50లక్షల చెక్కును కలెక్టర్‌కు అందజేశారు. అనంతరం సిక్కోలు ఉపాధి హామీ పథకం సమ్మేళన్ పుస్తకాన్ని ఆవిష్కరించారు. ముందుగా సిబ్బంది ఏర్పా టు చేసిన ఎగ్జిబిషన్ ఆకట్టుకుంది. ఈ కార్యక్రమంలో ఉపాధి పథకం అదనపు ప్రాజెక్టు డెరైక్టర్ ఆర్.గణపతిరావు, పంచాయతీ రాజ్ కార్యనిర్వాహక ఇంజినీర్ ఎ.ప్రభాకరరావు, గాయత్రీ కళాశాల ప్రిన్సిపాల్ పుల ఖండం శ్రీనివాసరావు, ఉపాధిహామీ అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. -
వెలుగునిచ్చిన ‘కిరణాని’కే.. వెన్ను చూపారు!
కిరణ్‌కు చెయ్యిచ్చిన జిల్లా కాంగ్రెస్ చేరదీసి మంత్రిని చేస్తే ఎదురుతిరిగిన కోండ్రు చివరి నిముషంలో జారుకున్న శత్రుచర్ల ముఖం చాటేసిన సత్యవతి, సుగ్రీవులు, నీలకంఠం ఎమ్మెల్యే కొర్ల భారతి ఒక్కరే బాసట ఈ తరుణంలో పార్టీ పెట్టినా దాని ఉనికే ప్రశ్నార్థకం అధికార ‘కిరణా’ల వెలుగు కోసం ఇన్నాళ్లూ అర్రులు చాచినవారు.. ఆ కిరణాల వెలుగులో అధికారభోగం అనుభవించిన వారు.. ఇప్పుడు కిరణాలు అస్తమించే వేళ.. ఇంకా వాటి నీడలోనే ఉంటే తమ భవిష్యత్తూ మసకబారుతుందన్న భయంతో దూరంగా పారిపోయారు. ఇన్నాళ్లూ అధికార కేంద్రాన్ని అంటిపెట్టుకొని.. దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకున్న ప్రజాప్రతినిధులు. నమ్ముకున్న నేతకు అధికారాంతమున చెయ్యిచ్చి.. ఎంచక్కా పక్కకు తప్పుకొన్నారు. సీఎం పదవికి రాజీనామా చేసిన కిరణ్‌కుమార్‌రెడ్డికి జిల్లాకు చెందిన ఇద్దరు మంత్రులు, ముగ్గురు ఎమ్మెల్యేలు అనూహ్యంగా షాక్ ఇచ్చి రాజకీయమంటే.. ఇదే సుమా! అని చేతల్లో చూపెట్టారు. సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డికి జిల్లా కాంగ్రెస్ షాక్ ఇచ్చింది. ‘నీవు నేర్పిన విద్యయే నీరజాక్షా’.. అన్నట్లు అధికారాంతమున ఆయనకు చెయ్యిచ్చింది. నిన్నటి వరకు ఆయన ప్రాపకం కోసం ప్రాధేయపడ్డ నేతలు ఒక్కసారిగా ముఖం చాటేశారు. ప్రాధేయపడి మరీ మంత్రి పదవి పొందిన కోండ్రు మురళి కొన్ని రోజుల ముందే కాడి వదిలేసి.. కిరణ్‌పైనే తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. మరో మంత్రి శత్రుచర్ల క్లైమాక్స్‌కు ముందు జారుకున్నారు. ఎమ్మెల్యేలు సత్యవతి, సుగ్రీవులు, నీలకంఠం అసలు పత్తా లేకుండా పోయారు. రాజకీయంగా ఏమాత్రం ప్రభావం చూపించలేని కొర్ల భారతి మాత్రమే కిరణ్ వర్గంలో కనిపించారు. వెన్నంటి నిలిచేవారేరీ! ‘సీఎంగారు మా జిల్లాకు రండి.. మా నియోజకవర్గంలో పర్యటించండి’ అని కిరణ్‌కుమార్‌రెడ్డిని ఒకప్పుడు ప్రాధేయపడిన జిల్లా కాంగ్రెస్ నేతలు ఒక్కసారిగా ప్లేటు ఫిరాయించారు. ఆయన సీఎం పదవి చెపట్టిన తరువాత తొలిసారి రచ్చబండ కార్యక్రమాన్ని జిల్లాలోనే చేపట్టారు. అనంతరం జిల్లాకు మూడు రోజుల చొప్పున సమీక్ష సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించి, దాన్ని కూడా జిల్లా నుంచే ప్రారంభించారు. ఈ కార్యక్రమంతోపాటు రాజధానిలోనూ ఆయన్ను అంటిపెట్టుకొని తిరిగి పదవులు, పనులు పొందిన నేతలు ఆయన పదవి నుంచి తప్పుకోవాలని నిర్ణయించుకోవడంతో తమ అసలు రంగు చూపించారు. పదవిలో ఉన్నంతకాలం విభజనకు పరోక్షంగా సహకరించిన కిరణ్, రాజీనామా అనంతరం సొంత కుంపటి పెట్టుకోవాలని భావించారు. కానీ జిల్లా కాంగ్రెస్ నుంచి ఆయనకు ఏమాత్రం సానుకూలత వ్యక్తం కాలేదు. కోండ్రు ఫైర్ కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రాపకంతోనే మంత్రి అయిన కోండ్రు మురళి మరోసారి తన అసలు రంగు బయటపెట్టారు. కిరణ్ అధికారాన్ని కోల్పోతున్నారని తెలియగానే తన నిజస్వరూపం చూపించారు. కిరణ్‌పై తీవ్రస్థాయిలో విరుచుకుపడి ముందుగానే జారుకోవడం రాజకీయవర్గాల్లో చర్చనీయాంశమైంది. జిల్లాలో ఆయనే మొదటి నుంచి కిరణ్ వర్గీయుడిగా గుర్తింపు పొందారు. తను ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో పట్టుబట్టి కిరణ్‌ను తన నియోజకవర్గానికి రప్పించారు. సీఎం హోదాలో కిరణ్ తొలి రచ్చబండ కార్యక్రమాన్ని తన రాజాం నియోజకవర్గంలోనే నిర్వహించారు. అనంతరం కూడా సదా కిరణ్ వెన్నంటి ఉంటూ కనిపించారు. ఆయన్ను ప్రాధేయపడి మరీ మంత్రి పదవి సాధించారు. తీరా ఇప్పుడు తానేమిటో చూపించారు. కిరణ్‌పై వ్యక్తిగత విమర్శలు చేయడం ద్వారా పార్టీ అధిష్టానాన్ని ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డారు. క్లైమాక్స్‌కు ముందు జారుకున్న శత్రుచర్ల కిరణ్ నుంచి అత్యంత గౌరవం పొందిన మంత్రి శత్రుచర్ల కూడా చివరి నిముషంలో ఆయనకు చెయ్యిచ్చారు. రెండు రోజుల క్రితం వరకు కిరణ్ నిర్వహించిన ఆంతరంగిక సమావేశాల్లో శత్రుచర్ల కనిపించారు. విజయనగరం జిల్లా కురుపాం ఎమ్మెల్యేగా ఉన్న తన మేనల్లుడు జనార్దన్ థాట్రాజ్‌తో ఆయన కిరణ్‌తో చర్చల్లో పాల్నొన్నారు. ‘ఇంజిన్ ఎటు వెళితే బోగీలూ అటే’ అని వ్యాఖ్యానించడం ద్వారా తాను కిరణ్ తీసుకున్న నిర్ణయానికి కట్టుబడతాననే సంకేతాలు ఇచ్చారు. కానీ కథ క్లైమాక్స్‌కు వచ్చేసరికి ముఖం చాటేశారు. కీలక సమయంలో హైదరాబాద్‌లో ఉండకుండా విజయనగరంలోని తన స్వస్థలానికి వెళ్లిపోయారు. కాంగ్రెస్‌లోనే కొనసాగుతానని చెప్పుకొచ్చారు. ముఖం చాటేసిన ముగ్గురు ఎమ్మెల్యేలు ఎమ్మెల్యేలు బొడ్డేపల్లి సత్యవతి, నిమ్మక సుగ్రీవులు, మీసాల నీలకంఠం సైతం కీలక సమయంలో కిరణ్‌కు ముఖం చాటేశారు. ఆయన వెన్నంటి నిలవలేమని తేల్చి చెప్పేశారు. కిరణ్ వర్గీయులు చేసిన ఫోన్లకు కూడా వారు స్పందించలేదని తెలుస్తోంది. కాంగ్రెస్‌లోనే కొనసాగాలని వారు నిర్ణయించుకున్నారు. భారతి వెన్నంటి నిలిచినా... జిల్లా నుంచి టెక్కలి ఎమ్మెల్యే కొర్ల భారతి ఒక్కరే కిరణ్ వర్గంలో కనిపించారు. సీఎం పదవికి రాజీనామా చేసిన సమయంలో ఆయనతోనే ఉన్నారు. కానీ భారతి వల్ల కిరణ్‌కు జిల్లాలో రాజకీయంగా ఎలాంటి ప్రయోజనం లేదన్నది నిర్వివాదాంశం. సొంత నియోజకవర్గంలోనే ఆమె రాజకీయంగా పట్టు కోల్పోయారు. వచ్చే ఎన్నికల్లో టెక్కలి నుంచి కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థిగా తన భర్త కిల్లి రామ్మోహన్రావు పోటీ చేస్తారని కేంద్ర మంత్రి కృపారాణి ఇప్పటికే ప్రకటించారు. దాంతో కాంగ్రెస్ టిక్కెట్టు భారతికి రానట్లేనని తేలిపోయింది. వైఎస్సార్ కాంగ్రెస్, టీడీపీలలో ఆమెకు అవకాశాల్లేవు. దాంతో మరో దారిలేక ఎమ్మెల్యే భారతి కిరణ్ వర్గంలో కొనసాగాలని నిర్ణయించుకున్నారని తెలుస్తోంది. ఈ పరిణామాలతో జిల్లాలో కిరణ్ వర్గం ఉనికి కనిపించే అవకాశాల్లేవని స్పష్టమైపోయింది. కొత్త పార్టీ పెట్టినా... ప్రత్యేకవర్గంగా కొనసాగినా కిరణ్ కుమార్ రెడ్డి జిల్లా రాజకీయాల్లో ఎలాంటి ప్రభావం చూపించలేరని పరిశీలకులు తేల్చేస్తున్నారు. -
పోస్టాఫీసుల్లో కోర్ బ్యాంకింగ్ సేవలు
టెక్కలి,న్యూస్‌లైన్: ఖాతాదారులకు మెరుగైన సేవలు అందించే దిశగా పోస్టల్ కార్యాలయాల్లో కోర్ బ్యాం కింగ్ సేవలను అందుబాటులోకి తేనున్నట్టు ఆ శాఖ విశాఖ రీజియన్ పోస్టు మాస్టర్ జనరల్( పీఎంజీ) శారదా సంపత్ వెల్లడిం చారు. శుక్రవారం శ్రీకాకుళం జిల్లా టెక్కలి హెడ్ పోస్టాఫీసును సందర్శించిన సందర్భంగా ఆమె విలేకరులతో మాట్లాడారు. కమర్షియల్ బ్యాంకులకు దీటుగా పోస్టల్ సేవలను విస్తృతం చేస్తున్నామని, ఇందులో భాగంగా రాష్ట్రంలోనే తొలిసారిగా శ్రీకాకుళం, టెక్కలి హెడ్ పోస్టాఫీసుల్లో కోర్ బ్యాంకింగ్ విధానాన్ని ప్రవేశ పెడుతున్నట్టు చెప్పారు. ఫిబ్రవరి నెల నుంచి సేవలు అందుబాటులోకి వచ్చే విధంగా చర్యలు చేపట్టామన్నారు. ఇందులో భాగంగా ఆయా కార్యాలయాల్లో ఖాతాదారుల రికార్డులను తనిఖీ చేస్తున్నట్టు పేర్కొన్నారు. మొబైల్ మనియార్డర్ సేవలను పూర్తిస్థాయిలో ఖాతాదారులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. సుమారు 18 ప్రభుత్వ శాఖలకు చెందిన 150 రకాల సేవలను తమ శాఖ ద్వారా అందజేస్తున్నామన్నారు. ఆమె వెంట శ్రీకాకుళం పోస్టల్ సూపరింటెండెంట్ వై.ఎస్.నర్సింహరావు ఉన్నారు. -
సై‘కిల్’ యాత్ర!
జిల్లాలో.. ముఖ్యంగా శ్రీకాకుళం పార్లమెంటరీ నియోజకవర్గంలో తమ కంటిలో నలుసుగా మారుతున్న ‘కళా’ వర్గాన్ని తొక్కిపెట్టేందుకు కింజరాపు శిబిరం ఏ ఒక్క అవకాశాన్ని విడిచిపెట్టడంలేదు. గత కొన్నాళ్లుగా సాగుతున్న ఈ ఆధిపత్య పోరుకు అటు పాతపట్నం.. ఇటు శ్రీకాకుళం అసెంబ్లీ సెగ్మెంట్లలో పతాక స్థాయికి చేరింది. ఒకవైపు శ్రీకాకుళంలో ‘గుండ’కు చెక్ పెట్టేందుకు కొర్ను ప్రతాప్‌ను ఎగదోసి పార్టీ అధిష్టానం వద్దకు పంపిన కింజారపు వర్గం.. మరోవైపు పార్టీ పటిష్టతే లక్ష్యంగా శనివారం నుంచి చేపడుతున్న సైకిల్ యాత్రను పనిలో పనిగా ‘కళా’ వర్గాన్ని కలవరపెట్టేందుకూ వినియోగించుకుంటోంది. అందుకే కళా వర్గానికి చెందిన నేత పార్టీ ఇన్చార్జిగా ఉన్న పాతపట్నం నుంచి వ్యూహాత్మకంగా యాత్రను ప్రారంభిస్తోంది. తమ వర్గానికి చెందిన కలిశెట్టికి యాత్ర నిర్వహణలో ప్రాధాన్యమిస్తూ అక్కడి ఇన్చార్జి కొవగాపును పక్కన పెట్టడంతో మొత్తం కళా వర్గం ఈ యాత్ర బహిష్కరణకు నిర్ణయించుకుంది. సైకిల్ యాత్రతో చేకూరే ప్రయోజనం కంటే కింజరాపు వ్యూహంతో పార్టీకి జరిగే నష్టమే ఎక్కువనే ఆందోళన వ్యక్తమవుతోంది. పాతపట్నంలో పొగ శ్రీకాకుళం సిటీ, న్యూస్‌లైన్: టీడీపీ శ్రీకాకుళం పార్లమెంటరీ నియోజకవర్గ ఇన్చార్జి కింజరాపు రామ్మోహన్ నాయుడు శని వారం నుంచి సైకిల్‌యాత్ర చేపడుతున్నారు. ఏడు అసెంబ్లీ సెగ్మెం ట్ల పరిధిలో జరపనున్న ఈ యాత్రను పాతపట్నం నుంచే ప్రారంభిస్తున్నప్పటికీ, ఆ నియోజకవర్గ పార్టీ ఇన్చార్జి కొవగాపు సుధాకర్‌ను ఏమాత్రం పట్టించుకోకుండా తమ వర్గానికి చెందిన కలిశెట్టి అప్పలనాయుడు ఆధ్వర్యంలోనే ఏర్పాట్లు చేయించారు. తద్వారా అధినేత ఆదేశాలనూ బేఖాతరు చేస్తూ కళా వర్గాన్ని నేరుగా పొమ్మ న లేక పొగ పెట్టారు. అందుకు తగినట్లే కింజరాపు యాత్ర ను బహిష్కరిస్తున్నట్లు కళా వర్గం ప్రకటించింది. పాతపట్నం పార్టీ ఇన్చార్జిగా ఈ వర్గానికి చెందిన కొవగాపు సుధాకర్‌ను సాక్షాత్తు అధినేత చంద్రబాబే నియమించినా.. దాన్ని సైతం ధిక్కరిస్తూ తమ ఆధిపత్యమే లక్ష్యంగా కింజరాపు వర్గం పావులు కదుపుతూ కలిశెట్టి వర్గాన్ని ప్రోత్సహిస్తోంది. కాగా తన నియోజకవర్గంలో యాత్ర ప్రారంభిస్తున్నా తనకు ప్రాధాన్యత ఇవ్వకపోవడంపై కొవగాపు వర్గం భగ్గుమంటోంది. ఎచ్చెర్ల నియోజకవర్గానికి చెందిన వ్యక్తిని ప్రోత్సహిస్తున్నందుకు నిరసనగా సైకిల్ యాత్రను బహిష్కరిస్తున్నట్లు ఎల్‌ఎన్‌పేట మండల పార్టీ అధ్యక్షుడు చింతాడ శ్రీనివాసరావు, ఒమ్మి ఆనందరావు, హిరమండలం తెలుగు యువత అధ్యక్షుడు తులసీ, తదితరులు శుక్రవారం బహిరంగంగా ప్రకటించారు. కాగా అంతకు ముందు జిల్లా పార్టీ అధ్యక్షుడు చౌదరి బాబ్జి సైకిల్ యాత్ర షెడ్యూల్‌ను విడుదల చేశారు. ఈ సందర్భంగా సుధాకర్ కల్పించుకొని యాత్రలో తమ బాధ్యతలేమిటో చెప్పాలని కోరగా.. మీ అవసరం లేదు, అంతా మేం చూసుకుంటామని కింజరాపు వర్గీయులు స్పష్టం చేసినట్లు తెలి సింది. గత రెండు మూడు రోజులుగా ఈ వివాదం నడుస్తున్నా కింజరాపు వర్గం పట్టించుకోకపోవడంతో సైకిల్ యాత్ర సజావుగా సాగేనా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. శ్రీకాకుళంలో సెగ శ్రీకాకుళం సిటీ, న్యూస్‌లైన్: కింజరాపు వర్గం శ్రీకాకుళం అసెంబ్లీ సెగ్మెంట్లో రేపిన అసమ్మతి సెగ పార్టీ అధిష్టానాన్ని తాకింది. శుక్రవారం హైదరాబాద్‌లో పార్టీ పెద్దలను కలిసిన నియోజకవర్గ నాయకుడు కొర్ను ప్రతాప్ వచ్చే ఎన్నికల్లో శ్రీకాకుళం అసెంబ్లీ అభ్యర్థిగా తనకు అవకాశం ఇవ్వాలని పార్టీ అధినేత చంద్రబాబు, యువనేత లోకేష్‌లకు కోరా రు. యువకుడినైన తాను విజయం సాధిం చే అవకాశాలు ఉన్నాయని వారిద్దరినీ విడివిడిగా కలిసి విన్నవించారు. నియోజకవర్గ పరిస్థితులను వివరించా రు. విశ్వసనీయ సమాచారం మేరకు.. జిల్లాలో యువకులకు ప్రాతినిధ్యం కల్పిస్తే అన్ని వర్గాల ఓట ర్లను ప్రభావితం చేయవచ్చని, యువజనుల కోటా లో తనకు అవకాశం ఇవ్వాలని కోరారు. దీనిపై పరి శీలిస్తానని చెప్పి అధినేత చంద్రబాబు వెళ్లిపోగా, ఆయన తనయుడు లోకేష్ మాత్రం యువమంత్రానికి కాస్త లొంగినట్లు తెలుస్తోంది. ఇదే అదనుగా గతంలో పీఆర్పీ అభ్యర్థిగా తాను సాధించిన ఓట్లు, స్థానికంగా టీడీపీ బలం, ప్రస్తుతం నాయకుల్లో ఉన్న భేదాభిప్రాయాలు తదితర అంశాలను ప్రతాప్ వివరించినట్లు తెలిసింది. జిల్లా టీడీపీలో యువకుల ప్రాతినిధ్యం పెంచేందుకు, తద్వారా లోకేష్ పేరుతో ప్రత్యేక వర్గాన్ని తయారు చేసేందు కు ముమ్మర ప్రయత్నాలు సాగుతున్నాయి. ఇందు లో భాగంగా యువ నాయకులకు ప్రత్యేక గుర్తింపునిచ్చే దిశగా లోకేష్ అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోం ది.ప్రతాప్‌తో ఆయన మాట్లాడిన తీరు ఈ అభిప్రాయం కలిగిస్తోందని టీడీపీ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. -
రెడ్‌క్రాస్ సేవలు భేష్
కలెక్టర్ సౌరభ్‌గౌర్ శ్రీకాకుళం కల్చరల్, న్యూస్‌లైన్: జిల్లాలో రెడ్‌క్రాస్ సంస్థ సేవలు మరువలేనివని కలెక్టర్ సౌరభ్ గౌర్ అన్నారు. స్థానిక అంబేద్కర్ ఆడిటోరియంలో శుక్రవారం జరిగిన రె డ్‌క్రాస్ వార్షిక సమావేశంలో ఆయన మాట్లాడారు. పేదలకు ఆపదలో ఉన్న ఉన్నవారికీ సహాయ సహకారాలు అందించేందుకు ప్రజలకు రెడ్‌క్రాస్ ఉన్నదన్న భరోసా కలిగేలా తీర్చి దిద్దుతున్నామన్నారు. ఆరు వేల యూనిట్ల రక్తనిలువలు నేడు 15 వేల యూనిట్లుకు పెంచేందుకు సంస్థ చేస్తున్న కృషి అభినందనీయమన్నారు. అయితే కణవిభణనకుయూనిట్టు జిల్లా కు అవసరమని దీనికై ట్రైమెక్స్ సంస్థ, ఈస్టుకోస్టు ఎనర్జీ, నాగార్జున, అరబొందో వంటి పారిశ్రామిక సంస్థల సేవలు అవసరమని తెలిపారు. రెడ్‌క్రాస్ ద్వారా అనురాగ నిలయం పేరుతో దిక్కుమొక్కులేని వారికి, చిక్కోలు చిరుదివ్వెలు కార్యక్రమంలో భాగంగా పేద విద్యార్థినులకు ఉన్నత విద్య అందించేందుకు కృషి చేస్తున్నామన్నారు. జిల్లాలో 105 మత్స్యకార గ్రామాలను గుర్తించి ఇప్పటికే ఐస్ బాక్సులు తదితర పరికరాలు అందించామని తెలిపారు. ఈ సందర్భంగా రెడ్‌క్రాస్ నేత్ర సేకరణద్వారా నే త్రదానాలు అందుకున్న పలువురిని సంస్థ సభకు, కలెక్టర్‌కు పరిచయం చేశారు. అందులో మూడోతరగతి చదువుతున్న ఒక చిన్నారికి ఒక దాత ఇచ్చిన నేత్రాలను అమర్చడంతో కలెక్టర్ మాట్లాడారు. అనంతరం ఎస్పీ నవీన్ గులాఠీ మాట్లాడుతూ జిల్లాలో రెడ్‌క్రాస్‌కు తమ శాఖ సహాయ సహకారాలు ఎల్లప్పుడూ ఉంటాయన్నారు. ట్రైమెక్స్ ప్రతినిధి కోనేరు ప్రసాద్ మాట్లాడుతూ జిల్లాలో పేదవారికి విద్య, వైద్యం అందించేం దుకుగాను తమ వంతు సహాయ సహ కారాలు అందిస్తున్నానని తెలిపారు. కలెక్టర్ కృషి వల్ల ఈ ఏడాది జిల్లా రెడ్‌క్రాస్ రెండు బంగారు పతకాలకు ఎంపికైందని, ఫిబ్రవరిలో జరిగే సమావేశంలో గవర్నర్ చేతులమీదుగా వీటిని అందుకోనున్నట్లు రెడ్‌క్రాస్ ఛెర్మైన్ పి.జగన్మోహనరావు పేర్కొన్నారు. సేవా స్ఫూర్తిదాతలకు సత్కారం జిల్లాలో రెడ్‌క్రాస్ చేస్తున్న సేవలకు సహాయసహకారాలందించిన పలువురు అధికారులు, వైద్యులు, స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులకు కలెక్టర్ సత్కరించడం తోపాటు అవార్డులను అందించారు. రెడ్‌క్రాస్ రక్తకణాల నిధికి రూ.10 లక్షలు విరాళంగా ఇచ్చిన ఎన్ఆర్ఐ పి.సూర్యనరాయణ తరఫున మాజీ ఎమ్మెల్యే కేఎల్ఎన్ భుక్తకు కలెక్టర్ సత్కరించారు. అలాగే 24 మందితో రక్తదానం చేయించినందుకు ఆర్టీసీ ఒకటో డిపో మేనేజర్ బీఎల్పీ.రావుకు కలెక్టర్ రెడ్‌క్రాస్ అవార్డును కలెక్టర్ అందజేశారు. చిరుదివ్వెలుకు ప్రియాంక గౌర్ రూ.లక్ష విరాళం చిక్కోలు చిరుదివ్వెలకు కలెక్టర్ సతీమణి ప్రియాంక గౌర్ లక్ష రూపా యలు విరాళం అందచేశారు. శాంత అనురాగ నిలయంలో ఉంటున్న 11 మంది పేదవిద్యార్థులకు సంవత్స రానికి ఒక్కొక్కరికి రూ.20 వేలు చొప్పు న విరాళాన్ని అందించారు. రెడ్‌క్రాస్‌కు మత్స్యకార శాఖా డీడీ రూ.50 వేలు, డాక్టర్ దానేటి శ్రీధర్ రూ.20 వేలు విరాళంగా అందిం చారు. చిక్కోలు చిరు దివ్వెలకు అరవల్లి ట్రస్టు బోర్డు మాజీ సభ్యు డు టీఏ.సూర్య నారాయణ రూ.20 వేలు విరాళంగా అందించారు. కార్య క్రమంలో డీఆర్డీఏ పీడీ రజనికాంతరావు, సెట్‌శ్రీ సీఈవో మూర్తి, పాలకొండ ఆర్టీవో తేజ్ భరత్, మెప్మా పీడీ మునుకోటిసత్యనారాయణ, ఈస్టుకోస్టుజనరల్ మేనేజర్ రాజు తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమంలో ఎన్సీఎస్ స్కూల్ విద్యార్థులు రెడ్‌క్రాస్ సేవలపై ప్రదర్శించిన నృత్యాలు ఆకట్టుకున్నాయి. -
7గురు ఎంఈవోలకు చార్జిమెమో
రాజాం, పాలకొండ ఇన్చార్జీల తొలగింపు డీఈవో నిర్లక్ష్యంపై మండిపాటు విద్యాశాఖ తీరుపై భగ్గుమన్న కలెక్టర్ ఫలితాలు మెరుగుపడకపోతే చర్యలు తప్పవు ఉదయం నుంచి సాయంత్రం వరకు సుదీర్ఘ సమీక్ష శ్రీకాకుళం సిటీ,న్యూస్‌లైన్ : కాకి లెక్కలు.. ఏదీ ఖచ్చితంగా చెప్పరు. గట్టిగా అడిగితే సాకులు చెబుతారు. మీరు తీసుకునే జీతాలకు.. చేస్తున్న పనులకు పొంతన కుదరడం లేదు. ఎన్నిసార్లు చెప్పినా అలసత్వమే.. ముఖ్యంగా డిఈవో అరుణకుమారి పనితీరు ఏమీ బాగోలేదు. దీనిపై ఉన్నతాధికారులకు లెటర్ పెడతా’.. అని జిల్లా కలెక్టర్ తీవ్ర అసహనం, ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏడుగురు ఎంఈవోలకు చార్జిమెమోలు ఇవ్వాలని ఆదేశించారు. శుక్రవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు విద్యా శాఖపై స్థానిక జెడ్పీ సమావేశ మందిరంలో జరిగిన సమీక్ష ఆద్యంతం సీరియస్‌గా సాగింది. ముందుగా పదో తరగతి ఉత్తీర్ణత లక్ష్యాలు, అమలు చేస్తున్న ప్రణాళికలు, రాజీవ్ విద్యా దీవెన, నేషనల్ మెరిట్ స్కాలర్షిప్పులు, వైద్య పరీక్షలు, డైస్ సమాచారం, కెజిబివి పాఠశాల పనితీరు ఇలా దాదాపు అన్ని అంశాలపై కూలంకుషంగా సమీక్షించారు. ఈ స్థాయిలో సమీక్ష జరుగుతుందని ఊహించని విద్యాశాఖాధికారులు సరైన సమాచారం లేక కలెక్టర్ ఆగ్రహానికి గురయ్యారు. పదోతరగతి ఫలితాల్లో గత ఏడాది 70 శాతం కంటే తక్కువ వచ్చిన స్కూళ్లలో ఈసారి మెరుగైన ఫలితాలు రాకపోతే చర్యలు తప్పవని కలెక్టర్ హెచ్చరించారు. ‘రెడీ టు రైడ్’ అనే టెన్త్ స్టడీ మెటీరియల్‌ను సరఫరా చేస్తున్నామని, దీన్ని తప్పనిసరిగా విద్యార్థులందరికీ అందించాలని, సి, డి గ్రేడుల్లో ఉన్న విద్యార్థులకు ప్రత్యేక స్టడీ అవర్స్ నిర్వహించాలని ఆదేశించారు. ఎంఈవోలపై సీరియస్ జిల్లాలో ఈ ఏడాది నేషనల్ మెరిట్ పరీక్షలకు బూర్జ, రాజాం, గార, కంచిలి, వీరఘట్టం, పాలకొండ, హిరమండలాల్లో ఒక్క విద్యార్ధి కూడా హాజరుకాకపోవడంపై కలెక్టర్ సీరియస్ అయ్యారు. ఆ ఏడుగురు ఎంఈవోలకు చార్జిమెమోలు ఇవ్వాలని ఆదేశించారు. అలాగే సంబంధిత డిప్యూటీ డిఈవోలకు కూడా మెమోలు జారీ చేస్తామని చెప్పారు. ఇదే సందర్భంలో రాజాం ఇన్చార్జి ఎంఈవోపై తీవ్ర ఆగ్ర హం వ్యక్తం చేశారు. ‘ఏమయ్యా..నువ్వు జి.సిగడాం రెగ్యులర్ ఎంఈవోవి. అదనంగా రాజాం కావాలని మినిస్టర్‌తో చెప్పిస్తావ్..పైగా ఉద్యోగ సంఘాల వారితో రికమెండ్ చేయించావ్.. మరి ఒక్క విద్యార్ధిని కూడా మెరిట్ పరీక్షలకు పంపలేదు... నీకెందుకయ్యా రెండు మండలాలు.. తక్షణమే తప్పుకో...’’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. పాలకొండ ఎంఈవోపైనా అసంతృప్తి వ్యక్తం చేస్తూ ‘మీరు పాలకొండ డిప్యూటీ ఈవోగానే ఉండండి.. ఈ రోజే ఎంఈవో పోస్టును వదిలేయండని’ స్పష్టం చేశారు. ఈ రెండు చోట్ల కొత్త ఎంఈవోలను గుర్తించి ఈ రోజే (శుక్రవారం రాత్రి లోగా) తనకు ఫైలు పెట్టాలని డీఈవో అరుణకుమారిని ఆదేశించారు. డైస్ సమాచారం అప్‌లోడ్‌కు సంబంధించి ప్రభుత్వ, ప్రైవేట్ విద్యార్థుల నుంచి సమాచారం రాకపోవడంపై కలెక్టర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈనెలాఖరులోగా విద్యార్థుల సమాచారం ఇవ్వని ప్రైవేట్ పాఠశాలల గుర్తింపును రద్దు చేయాలని ఆదేశించారు. అలాగే డీఈవో నిర్లక్ష్యంతో 137 మంది విద్యార్థులకు స్కాలర్షిప్పులు రాలేదని చెబుతూ నిర్లక్ష్యం వీడాలని ఆమెను హెచ్చరించారు. ప్రాథమిక, ఉన్నత, కళాశాల విద్యా శాఖలు పనితీరు ఇకనైనా మార్చుకుని,త్వరలో జరగనున్న పరీక్షల్లో మంచి ఉత్తీర్ణత సాధించాలని సూచించారు. ఈ సమావేశంలో ట్రైబల్ వెల్ఫేర్ డీడీ నాగోరావు, డిప్యూటీ డీఎంహెచ్‌వో మెండ ప్రవీణ్, డీవీఈవో పాపారావు తదితరులు పాల్గొన్నారు. -
వలసల జ్వరం
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: జిల్లాలో అధికార, ప్రధాన ప్రతిపక్ష పార్టీలకు వలసల జ్వరం పట్టుకుంది. ఈ రెండు పార్టీలకు చెందిన ముఖ్యనేతలతోపాటు, కిందిస్థాయి క్యాడర్ చాలావరకు సమావేశాలు, పత్రికా ప్రకటనల రూపంలో తమ వైఖరిని స్పష్టం చేస్తుండటంతో ఇప్పటికే ప్రజల విశ్వాసం కోల్పోయిన టీడీపీ, కాంగ్రెస్‌లు ఎన్నికల ముందు పెరుగుతున్న వలసలతో వణికిపోతున్నాయి. ముఖ్యంగా మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు వైఎస్ఆర్ కాంగ్రెస్‌లో చేరాలని నిర్ణయించుకోవడంతో ఆయన బాటలోనే కాంగ్రెస్‌కు చెందిన పలువురు ముఖ్య నేతలు కాంగ్రెస్‌కు గుడ్‌బై చెప్పేందుకు సిద్ధమవుతున్నారు. ఈ మేరకు జిల్లాలోని పలు మండలాల పార్టీ నాయకులు కార్యకర్తల సమావేశాలు పెట్టి తమ నిర్ణయాన్ని బహిరంగంగా ప్రకటిస్తున్నారు. కాంగ్రెస్ నుంచి పలాస ఎమ్మెల్యే జుత్తు జగన్నాయకులు, టెక్కలి ఎమ్మెల్యే కొర్ల భారతిలు వైఎస్ఆర్సీపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నట్లు సమాచారం. తాను ధర్మాన బాటలోనే ఉన్నానని జగన్నాయకులు ఇప్పటికే ప్రకటిం చారు. కొర్ల భారతి బహిరంగంగా బయట పడకపోయినా.. త న బంధువులను వైఎస్ఆర్సీపీలో చేరేందుకు ప్రోత్సహిస్తున్నారు. అమె కూడా చేరే ఆలోచనలో ఉన్నారని అంటున్నారు. గతంలో జగన్మోహన్రెడ్డి నిర్వహిచిన ఓదార్పు యాత్రలో ఆమె పాల్గొన్నారు. శ్రీకాకుళం మున్సిపల్ మాజీ చైర్మన్లు అందవరపు వరాహా నరసింహం(వరం), ఎం.వి. పద్మావతి, డీసీసీ అధ్యక్షుడు నర్తు నరేంద్రయాదవ్, డీసీఎంఎస్ చైర్మన్ గొండు కృష్ణమూర్తి, పలువురు మాజీ ఎంపీపీలు, మాజీ జడ్పీటీసీలు వైఎస్ఆర్సీపీలో చేరనున్నారు. కొత్తగా గెలుపొందిన సర్పంచ్‌ల్లో 300 మందికి పైగా ధర్మాన వెంట వచ్చేందుకు రంగం సిద్ధమైనట్లు సమాచారం. ఈ మేరకు ధర్మాన అనుచరులు ఒక జాబితా రూపొందిస్తున్నారు. నియోజకవర్గాల వారీగా ముఖ్య నేతల చిట్టా ఇప్పటికే సిద్ధమైంది. దాన్ని ధర్మాన పరిశీలిస్తారని, ఆయన సూచన మేరకు ఇంకా ఎవరైనా చేరే అవకాశముంటే వారితో మాట్లాడిన తర్వాత తుది జాబితా తయారు చేస్తామని ఆయన ముఖ్య అనుచరులు పేర్కొంటున్నారు. జిల్లా కేంద్రమైన శ్రీకాకుళం మున్సిపాలిటీలో కాంగ్రెస్‌కు చెందిన 16 మంది మాజీ కౌన్సిలర్లు ధర్మానతో పాటు వైఎస్ఆర్సీపీలో చేరేందుకు రెడీగా ఉన్నారు. ఇచ్ఛాపురం నుంచి నర్తు రామారావు ఇప్పటికే వైఎస్ఆర్సీపీ అధినేత జగన్మోహన్రెడ్డిని కలిశారు. తన అనుచరులతో సహా పార్టీలో చేరేందుకు నిర్ణయించుకున్నారు. మిగిలిన నియోజకవర్గాల నుంచి కూడా భారీ స్థాయిలో కాంగ్రెస్ శ్రేణులు వైఎస్ఆర్సీపీలో చేరేందుకు రంగం సిద్ధమవుతోంది. కాంగ్రెస్ అంత కాకపోయినా టీడీపీ నుంచి సైతం భారీ స్థాయిలో వైఎస్ఆర్సీపీలోకి వలసలు వచ్చే అవకాశం ఉంది. ఈ విషయాన్ని టీడీపీ వర్గాలే అంగీకరిస్తున్నాయి. చాలా మంది సర్పంచ్‌లు, మాజీ సర్పంచ్‌లు, ముఖ్య నాయకులు పార్టీని వీడేందుకు సిద్ధమయ్యారు. ఎర్రన్నాయుడు తర్వాత ముందుండి నడిపించే నాయకుడు టీడీపీలో లేరని, ఉన్నవారు రెండు వర్గాలుగా విడిపోవడంతో, వారితో కలిసి ఉండే కంటే పార్టీని వీడి జన బలం ఉన్న వైఎస్ఆర్సీపీలో చేరడమే మంచిదనే అభిప్రాయంలో పలువురు టీడీపీ నేతలు ఉన్నారు. శ్రీకాకుళం నియోజకవర్గానికి చెందిన చల్లా రవికుమార్ ఇప్పటికే టీడీపీని వీడి, ధర్మాన బాటలో నడిచేందుకు సిద్ధమయ్యారు. ఇప్పటికే పలువురు నాయకులు పార్టీకి దూరంగా ఉన్నారు. నియోజకవర్గంలో ఆ పార్టీ మాజీ మంత్రి గుండా అప్పల సూర్యనారాయణ అనుకూల, వ్యతిరేక వర్గాలుగా విడిపోయింది. కింజరాపు, కిమిడి వర్గాల ప్రభావం కూడా దీనికి కారణమైంది. సారవకోట మండలానికి చెందిన పలువురు టీడీపీ నాయకులు వైఎస్ఆర్సీపీలో చేరనున్నారు. ఇటీవల ఇచ్ఛాపురం నియోజకవర్గ టీడీపీ ఇన్చార్జిని మార్చేందుకు రంగం సిద్ధమైందనే ప్రచారం జరిగింది. ఇందులో వాస్తవాలు ఎలా ఉన్నా ఇక్కడ గ్రూపుల వ్యవహారం ఏ స్థాయిలో ఉందనేది స్పష్టమైంది. రెండు వర్గాల వారిని ఒకతాటిపైకి తీసుకు రావాలనే చంద్రబాబు బెడిసి కొట్టింది. మారిన సమీకరణలు కాంగ్రెస్ పార్టీలో రాజకీయ సమీకరణలు పూర్తిగా మారిపోతున్నాయి. మంత్రుల వద్ద ఒకస్థాయి ఉన్న నాయకులు కనిపించే పరిస్థితులు లేవు. ఇద్దరు కేంద్ర మంత్రులు, ఇద్దరు రాష్ట్ర మంత్రులు ఉన్నా వారితో పాటు కష్టపడి తిరిగి పార్టీలో పనిచేసేవారు కరువయ్యారు. దీంతో మంత్రులు సైతం పార్టీని బలోపేతం చేసే విషయంలో చేతులెత్తేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. డీసీసీ అధ్యక్షుడిని మార్చాలని మూడు నెలల నుంచి అనుకుంటున్నా ఇంతవరకు అది సాధ్యం కాలేదు. రాష్ట్ర విభజనకు సహకరిస్తున్న టీడీపీ, కాంగ్రెస్ పార్టీలను తుడిచి పెట్టాలని ప్రజలు దాదాపు నిర్ణయించుకోవడంతో నాయకులు ఆ పార్టీలో కొనసాగడానికే భయపడుతున్నారు. ప్రత్యామ్నాయం చూసుకోకపోతే రాజకీయ మనుగడ ఉండదని భావించి, వైఎస్ఆర్సీపీ వైపు అడుగులు వేస్తున్నారు. -
ఇద్దరు సర్పంచ్‌లు, 47 వార్డుల్లో ఏకగ్రీవం
శ్రీకాకుళం సిటీ, న్యూస్‌లైన్: పంచాయతీ ఉప ఎన్నికలకు సంబంధించి ఊహించినట్లుగానే జరిగింది. మొత్తం 8 సర్పంచ్, 76 వార్డు సభ్యుల స్థానాలకు నోటిఫికేషన్ జరగ్గా మెజార్టీ స్థానాల్లో ఏకగ్రీవాలయ్యాయి. శుక్రవారం నామినేషన్ల ఉపసంహరణ ఘట్టం పూర్తయ్యాక తుది వివరాలను జిల్లా పంచాయతీ అధికారి వెంకటేశ్వరరావు వెల్లడించారు. బుడితి(సారవకోట), కొల్లివలస(ఆమదాలవలస), చల్లయ్యవలస(పోలాకి) సర్పంచ్ స్థానాలతో పాటు కంచిలి మండలంలో 4 వార్డులకు, నరసన్నపేట మండలం జమ్ము పంచాయతీ 10వ వార్డులోనే ఈ నెల 18న ఎన్నికలు జరుగనున్నాయి. బుడితి నుంచి ముగ్గురు, కొల్లివలస, చల్లయ్యవలసలలో ఇద్దరేసి బరిలో ఉన్నారు. ఇక ఎన్నికలు జరుగనున్న ఐదు వార్డుల్లో ఇద్దరేసి పోటీపడుతున్నారు. ఇదిలావుంటే పొన్నుటూరు(కొత్తూరు), పట్టుపురం(కోటబొమ్మాళి) సర్పంచ్ల స్థానాలకు ఒక్క నామినేషను కూడా దాఖలు కాలేదు. అలాగే 24 వార్డుల్లో కూడా నామినేషన్లు దాఖలు కాలేదు. ఇక బుడుమూరు, సంతబొమ్మాళి, శాసనం సర్పంచ్‌లతో పాటు మొత్తం 47 వార్డుల్లో సింగిల్ నామినేషన్లు పడటంతో ఏకగ్రీవమయ్యాయి. ఎన్నికలు జరగనున్న పంచాయతీల పరిధిలో ఎన్నికల కోడ్ అమల్లో ఉంటుందని పంచాయతీ అధికారులు తెలిపారు. ప్రతి పోలింగ్ కేంద్రానికి పోలింగ్ అధికారుల నియామకాలు చేపడుతున్నట్లు డీపీవో చెప్పారు. బుడుమూరు సర్పంచ్‌గా రమాదేవి లావేరు: బుడుమూరు సర్పంచ్‌గా కింతలి రమావతి ఎన్నికైనట్లు ఎన్నికల అధికారి ఎం.చంటిబాబు ప్రకటించారు. సర్పంచ్ కింతలి శ్రీనివాసరావు గత నవంబర్‌లో రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో ఉప ఎన్నికల అవసరమైంది. ఆయన భార్య రమావతిని సర్పంచ్‌గా ఎకగ్రీవంగా ఎన్నికోవడానికి అన్ని పార్టీల నాయకులు అంగీకరించారు. దీంతో ఆమె ఒక్కరే నామినేషన్ వేశారు. ఉపసంరణ ఘట్టం శుక్రవారం ముగియడంతో రమాదేవి సర్పంచ్‌గా ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ఎన్నికల అధికారి చంటిబాబు ప్రకటించారు. ఆమెకు సర్పంచ్‌గా ఎన్నికైనట్లు ధ్రువపత్రాన్ని అందజేశారు. ఈ కార్యక్రమానికి జిల్లా పంచాయతీ అధికారి వెంకటేశ్వరరావు కూడా హాజరయ్యారు. రమావతిని డీపీవో, ఎన్నికల అధికారి అభినందించారు. కార్యక్రమంలో బుడుమూరు మాజీ ఎంపీటీసీ రేగాన రాంబాబు, కాంగ్రెస్ నాయకులు పెదనాయిని గోవిందరావు, బొడ్డ రవిబాబు, కింతలి కోటి, వైఎస్సార్ సీపీ నాయకులు కింతలి గోపాలరావు, పెదనాయిని సత్యనారాయణ, టీడీపీ నాయకులు పంచాయతీ కార్యదర్శి నారాయణమ్మ తదితరులు పాల్గొన్నారు. -
డీసీసీ అధ్యక్షుడిగా డోల జగన్?
నేడు ప్రకటించే అవకాశం రాష్ట్ర నాయకుల పిలుపుతో రాజధాని పయనం శ్రీకాకుళం, న్యూస్‌లైన్: జిల్లా కేంద్ర సహకార బ్యాంకు చైర్మన్‌గా వ్యవహరిస్తున్న డోల జగన్‌కు జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షునిగా నియమించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. శనివారం హైదరాబాద్‌లో ఆయన పేరును ప్రకటించే అవకాశం ఉంది. రాష్ట్ర నేతలు జగన్‌ను తక్షణం హైదరాబాద్ రావాలని కోరడంతో శుక్రవారం సాయంత్రం బయలుదేరి వెళ్లారు. ప్రస్తుతం డీసీసీ అధ్యక్షునిగా ఉన్న నర్తు నరేంద్రయాదవ్ త్వరలో పార్టీని వీడే అవకాశం ఉందని ప్రచారం జరుగుతుండడంతో అంతకు ముందే ఆయన్ని తప్పించాలని కాంగ్రెస్ అధిష్టానం భావించి జగన్‌ను ఎంపిక చేసినట్టు తెలిసింది. అయితే డోల ఎంపికపై ఆ పార్టీలోని కొందరు నాయకులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. పీఆర్పీలో చేరి ఓటమి చవిచూసిన తరువాత కాంగ్రెస్‌లోకి వచ్చిన జగన్‌కు ఇప్పటికే డీసీసీబీ చైర్మన్ పదవిని కట్టిపెట్టారని, దీనికి అదనంగా డీసీసీ పీఠాన్ని కూడా ఆయనకే ఇవ్వడాన్ని తప్పుపడుతున్నారు. పార్టీలో సుదీర్ఘ కాలంగా సేవలందిస్తున్న ఎందరో సీనియర్లు ఉండగా వారిని కాదని.. జోడు పదవులను పార్టీ ఫిరాయింపుదారునిగా ఉన్న జగన్‌కు ఇవ్వడాన్ని జీర్ణించుకోలేక పోతున్నారు. జగన్ పేరును ప్రకటించిన వెంటనే సమావేశమై భవిష్యత్‌ను నిర్ణయించుకోవాలని వారు భావిస్తున్నారు. -
కేఎన్నార్‌కు కన్నీటి వీడ్కోలు
=జగన్ సహా పలువురు నేతల నివాళులు =జిల్లా నలుమూలల నుంచి తరలివచ్చిన అభిమానులు =అధికార లాంఛనాలతో అంత్యక్రియలు కోసూరు (కూచిపూడి), న్యూస్‌లైన్ : రైతు కుటుంబంలో జన్మించి అంచెలంచెలుగా ఎదిగి అజాతశత్రువుగా పేరుతెచ్చుకున్న జెడ్పీ మాజీ చైర్మన్, వైఎస్సార్సీపీ కేంద్రపాలక మండలి సభ్యుడు కుక్కల నాగేశ్వరరావుకు ప్రజలు, నాయకులు కన్నీటి వీడ్కోలు పలికారు. కృష్ణాజిల్లా పరిషత్‌కు దేశంలోనే పేరు ప్రఖ్యాతులు తీసుకువచ్చిన కేఎన్నార్‌ను కడసారి చూసేందుకు జిల్లా నలుమూలల నుంచి పార్టీలకతీతంగా నాయకులు, అభిమానులు, అధికారులు పెద్ద ఎత్తున కోసూరుకు తరలివచ్చారు. పాలనాదక్షుడిగా పేరు తెచ్చుకున్న కేఎన్నార్ భౌతికకాయాన్ని కడసారి దర్శించి కన్నీటి పర్యంతమయ్యారు. ఒంగోలు గిత్తల పశుపోషకుడిగా, ద్రోణాచార్య అవార్డు అందుకున్న కుక్కల నాగేశ్వరరావును చివరిచూపు చూసేందుకు గుంటూరు, కృష్ణా, పశ్చిమగోదావరి జిల్లాల నుంచి పలువురు నాయకులు, రైతులు, తరలివచ్చి కన్నీటి వీడ్కోలు పలికారు. నాయకుల ఘన నివాళులు... వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి కేఎన్నార్‌కు నివాళులర్పించేందుకు తరలివచ్చారు. పామర్రు నుంచి నిమ్మకూరు, అవురుపూడి, పాలంకిపాడు మీదుగా కోసూరు చేరుకున్న ఆయన కేఎన్నార్ భౌతికకాయాన్ని సందర్శించి నివాళులర్పించారు. అనంతరం కేఎన్నార్ భార్య కృష్ణకుమారి, పెద్ద కుమారుడు వెంకటరామ విద్యాసాగర్, చిన్న కుమారుడు మోహనకుమార్, కుమార్తె డొక్కు సీతాదేవి, అల్లుడు కాశీవిశ్వనాథ్, మేనమామ డొక్కు రామశాస్త్రులును పరామర్శించి ఓదార్చారు. శాసనమండలి చైర్మన్ చక్రపాణి, మంత్రులు రఘువీరారెడ్డి, కొలుసు పార్థసారథి, బందరు ఎంపీ కొనకళ్ల నారాయణరావు, ఎమ్మెల్యేలు పంచకర్ల రమేష్ (పెందుర్తి), డీవై దాస్ (పామర్రు), అంబటి శ్రీహరిప్రసాద్ (అవనిగడ్డ), ఎమ్మెల్సీ ఐలాపురం వెంకయ్య, రాష్ట్ర అధికార భాషా సంఘం చైర్మన్ మండలి బుద్ధప్రసాద్, సమాచార చట్టం కమిషనర్ తాంతియాకుమారి, వైఎస్సార్సీపీ జిల్లా కన్వీనర్ సామినేని ఉదయభాను, మహిళా కన్వీనర్ తాతినేని పద్మావతి, మాజీ ఎమ్మెల్యేలు మేకా ప్రతాప్ అప్పారావు, కొడాలి శ్రీవెంకటేశ్వరరావు (నాని), వంగవీటి రాధాకృష్ణ, జోగి రమేష్, జలీల్‌ఖాన్, ముద్దరబోయిన వెంకటేశ్వరరావు, బూరగడ్డ వేదవ్యాస్, జంగా కృష్ణకుమారి, నాగుల్‌మీరా, మాజీ ఎంపీ కేపీ రెడ్డియ్య, మాజీ ఎమ్మెల్సీ కమ్మిలి విఠల్, గుంటూరు జెడ్పీ మాజీ చైర్మన్ కూచిపూడి విజయమ్మ, రాష్ట్ర గ్రంథాల సంస్థ మాజీ చైర్మన్ కూచిపూడి సాంబశివరావు, వైఎస్సార్సీపీ ప్రోగ్రామింగ్ కమిటీ కన్వీనర్ తలశిల రఘురామ్, వైఎస్సార్ సీపీ నాయకులు దుట్టా రామచంద్రరావు, తాడి శకుంతల, గౌతంరెడ్డి, పడమట సురేష్‌బాబు, దూలం నాగేశ్వరరావు, సింహాద్రి రమేష్‌బాబు, యాసం చిట్టిబాబు, గుడివాక శివరావ్, టీడీపీ అధికార ప్రతినిధి యనమల రామకృష్ణుడు, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కొనకళ్ల జగన్నాథరావు (బుల్లయ్య), బందరు మున్సిపల్ మాజీ చైర్మన్ బచ్చుల అర్జునుడు, కృష్ణా మిల్క్ యూనియన్ చైర్మన్ మండవ జానకిరామయ్య, సన్‌ఫ్లవర్ గ్రూప్ విద్యాసంస్థల చైర్మన్ ఎండీవీఎస్ఆర్ పున్నంరాజు, కొలనుకొండ శివాజీ, దేవినేని అవినాష్, వినియోగదారుల సంఘం చైర్మన్ సైకం భాస్కరరావు తదితరులు నివాళులర్పించినవారిలో ఉన్నారు. శ్రీకాకుళంలో అంత్యక్రియలు... కేఎన్నార్ భౌతికకాయాన్ని తొలుత ఆయన స్వగృహం నుంచి ఒంగోలు గిత్తలను సంరక్షించే పశువులకొట్టం వద్దకు తీసుకువెళ్లి అక్కడ కొద్దిసేపు ఉంచారు. అనంతరం గ్రామం చివరివరకు మోసుకువెళ్లి అక్కడి నుంచి ప్రత్యేక వాహనంలో మొవ్వ మీదుగా ఘంటసాల మండలం శ్రీకాకుళం కృష్ణానది ఒడ్డున అధికార లాంఛనాలతో దహన సంస్కారాలు నిర్వహించారు. -
మళ్లీ నాట్లు వేసుకోవచ్చుకదా..!
శ్రీకాకుళం, న్యూస్‌లైన్/ఒంగోలు, న్యూస్‌లైన్: పై-లీన్ తుపాను, అనంతరం కురిసిన భారీ వర్షాల వల్ల శ్రీకాకుళం జిల్లాలో పెద్ద ఎత్తుననష్టం వాటిల్లిందని, నష్టాల నివేదికను రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి, కేంద్ర ప్రభుత్వానికి అందజేస్తామని కేంద్ర బృందం సభ్యులు వెల్లడించారు. జిల్లాలోని వివిధ మండలాల్లో రెండు రోజులపాటు పంటనష్టాన్ని పరిశీలించిన కేంద్ర బృందం బుధవారం పర్యటనను ముగించింది. అనంతరం బృందం ప్రతినిధి డాక్టర్ పీజీఎస్ రావు మాట్లాడుతూ.. జిల్లా యంత్రాంగం నష్టాలపై నివేదిక అందజేసిందని, తాము భౌతికంగా పరిశీలించేందుకు వచ్చామన్నారు. జిల్లాలో అపారనష్టం జరిగినట్లు అర్థమైందని, వరి, జీడి, బొప్పాయి, కొబ్బరి చెట్లు, రోడ్లు, కాలువలు ధ్వంసమయ్యాయని, మత్స్యకారులకు నష్టం వాటిల్లిందన్నారు. ప్రధాని రూ.వెయ్యి కోట్ల ఆర్థిక సహాయాన్ని ప్రకటించారని, అయితే కేంద్రం అందించే పరిహారం తాత్కాలికమేనని, శాశ్వత ప్రాతిపదికన రాష్ట్రమే చర్యలు తీసుకోవాలన్నారు. కొబ్బరి చెట్లకు సంబంధించి 50 శాతం కంటే అధికంగా నష్టపోయినవారికే పరిహారం వస్తుం దని, ఈ నిబంధనలు ఉద్యానవన పంటలన్నింటికీ వర్తిస్తాయన్నారు. మరోవైపు.. ప్రకాశంజిల్లాలో భారీ వర్షం వచ్చినా.. రైతాంగానికి పెద్దగా నష్టం వాటిల్లలేదని ఆ జిల్లాలో పర్యటించిన కేంద్ర బృందం అభిప్రాయపడింది. ‘వరి నారు దశలోనే ఉంది. మళ్లీ నాట్లు వేసుకోవచ్చు కదా. పత్తి పచ్చగా బాగుంది కదా..’ అంటూ ప్రకాశంలో పర్యటించిన కేంద్ర బృందం వ్యాఖ్యలు చేయడంతో రైతులు, అధికారులు విస్తుపోయారు. వాస్తవానికి జిల్లాలో పంటలన్నీ ధ్వంసం కాగా, మొత్తం రూ.860 కోట్ల నష్టం వాటిల్లినట్లు అధికారులు అంచనావేశారు. అయితే శంభుసింగ్ నేతృత్వంలో జిల్లాకు వచ్చిన కేంద్ర బృందం.. ఉదయం చీరాల రూరల్ మండలంలో మొదలుపెట్టి సాయంత్రం ఒంగోలులో సమీక్షతో మొక్కుబడిగానే పర్యటనను ముగించింది. జిల్లాలో నష్టంపై జాతీయ విపత్తుల నివారణ సంస్థ కమిషనర్‌కు నివేదిక ఇస్తామని చెప్పడంతోపాటు కొన్ని సలహాలు ఇచ్చి సమావేశాన్ని ముగించారు. కాగా, ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఆంధ్రరాష్ట్రంలో పంటనష్టం చాలా ఎక్కువగా ఉందని, 15రోజుల్లో కేంద్రానికి నివేదిక సమర్పిస్తామని బృందం సభ్యులు ఎ.చంద్రశేఖర్, కె.రామవర్మ మహబూబ్‌నగర్ జిల్లా అచ్చంపేటలో వెల్లడించారు. రైతులను ఆదుకుంటామని భరోసా ఇచ్చారు. సెల్‌ఫోన్‌తో పంటనష్టం పరిశీలనా? తుపాన్ బాధితులను ఆదుకోవాలని గవర్నర్‌కు వినతి సాక్షి, హైదరాబాద్: తుపాను, వరద బీభత్సంతో సర్వస్వం కోల్పోయిన వారిని ఆదుకోవడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దారుణంగా విఫలమయ్యాయని బీజేపీ ధ్వజమెత్తింది. పంట నష్టాలను సెల్‌ఫోన్ లైట్ల వెలుగులో ఎలా పరిశీలిస్తారని కేంద్ర బృందాన్ని నిలదీసింది. బాధితులకు తక్షణమే నష్టపరిహారం అందించాలని డిమాండ్ చేసింది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి నాయకత్వంలో పార్టీ ప్రతినిధి బృందం బుధవారం గవర్నర్ నరసింహన్‌ను కలిసి వినతిపత్రాన్ని సమర్పిం చింది. కిషన్‌రెడ్డి, దత్తాత్రేయ మీడియాతో మాట్లాడారు. 19 జిల్లాల్లో 34లక్షల ఎకరాల్లో పంట నష్టపోతే ప్రభుత్వాల్లో కనీస కదలిక లేదన్నారు. వరి పంటకు ఎకరాకు రూ.15వేలు, పత్తికి రూ.20 వేలు, మొక్కజొన్నకు రూ.12వేలు ఇవ్వాలన్నారు. -
విద్యుత్‌శాఖకు ‘పై-లీన్’ నష్టం రూ.72 కోట్లు: సీఎండీ
సోంపేట, న్యూస్‌లైన్: పై-లీన్ తుఫాన్ ప్రభావంతో శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో విద్యుత్ శాఖకు సుమారు 72 కోట్ల రూపాయల నష్టం వాటిల్లిందని సీఎండీ ఎం.శేషగిరిబాబు చెప్పారు. బుధవారం సోంపేటలో విలేకరులతో ఆయన మాట్లాడారు. శ్రీకాకుళం, టెక్కలి, విజయనగరం, బొబ్బిలి డివిజన్ల పరిధిలో విద్యుత్ వ్యవస్థకు తీవ్రనష్టం వాటిల్లిందని పేర్కొన్నారు. భారీ గాలులకు వేలాది స్తంభాలు నేలకొరిగాయన్నారు. 126 కిలోమీటర్ల 33 కేవీ లైన్, 456 కిలోమీటర్ల 11 కేవీ లైన్, 2,348 కిలోమీటర్ల పరిధిలో ఎల్టీ లైన్ వ్యవస్థ దెబ్బతిన్నట్టు వివరించారు. విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లోని 2057 గ్రామాల్లోని నీటి పథకాలకు విద్యుత్ సమస్య తలెత్తగా వారికిలో 1962 గ్రామాల్లోని రక్షిత పథకాలకు సరఫరాను పునరుద్ధరించామన్నారు. మరో రెండు రోజుల్లో పూర్తిగా సమస్యను పరిష్కరిస్తామి చెప్పారు. 40 సంవత్సరాలుగా ఉన్న విద్యుత్ వ్యవస్థ తుఫాన్ పడిన కారణంగా నాశనమైందన్నారు. 200 మంది అధికారులు, 1000 మంది సిబ్బంది యుద్ధప్రాతిపదికన పనులు చేస్తున్నారన్నారు. రెండు జిల్లాల పరిధిలోని నాలుగు డివిజన్లలో 8,19,556 సర్వీసులకు విద్యుత్ అంతరాయం కలిగిందన్నారు. వీటిలో 7,84,735 సర్వీసులకు సరఫరాను పునరుద్ధరించామన్నారు. ఆయన వెంట విద్యుత్ అధికారులు కేఎస్ఆర్ మూర్తి, డి. రమేష్, డివిజనల్ ఇంజినీర్ ప్రతాప్, సోంపేట మండల విద్యుత్ శాఖాధికారి కోటేశ్వరరావు ఉన్నారు. -
తుపాను బాధిత ప్రాంతాల్లో నత్తనడకన సహాయ చర్యలు
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: పై-లీన్ తుపాను తాకిడికి తీవ్రంగా దెబ్బతిన్న ప్రాంతాల్లో సహాయ చర్యలు నత్తనడకన సాగుతున్నాయి. దీంతో బాధితులు అల్లాడిపోతున్నారు. తుపాను తీరం దాటి ఆరు రోజులవుతున్నా వందకు పైగా గ్రామాలు ఇప్పటికీ చీకట్లో మగ్గుతున్నాయి. చాలా గ్రామాలకు నేటికీ తాగునీరు అందడం లేదు. వ్యాధులు ప్రబలే అవకాశం పలు చోట్ల చెట్లు విరిగిపోవడం, పశువులు చనిపోవడం, వ్యర్థ పదార్థాలు బయట ఉండటంతో వ్యాధు లు ప్రబలే అవకాశం ఉందని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. మత్స్యకారుల పరిస్థితి మరీ దయనీయంగా ఉంది. వీరికి పూట గడవడం కూడా కష్టంగా ఉంది. కుటుంబానికి పది కేజీల చొప్పున బియ్యం ఇస్తామని అధికారులు చెప్పారు. కానీ కొన్ని చోట్ల బియ్యం బస్తాలు తీసుకు వ చ్చి పక్కన పడేశారు. దీన్నిబట్టి అధికారుల నిర్లక్ష్యం ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. అందని వైద్యసేవలు తీర ప్రాంతంలోని 11 మండలాల్లోనూ తుపాను ప్రభావం తీవ్రంగా ఉంది. అధికారుల నిర్లక్ష్యం, వైఫల్యాల వల్ల చాలా గ్రామాలకు ఇప్పటికీ తాగునీరు అందటం లేదు. పారిశుధ్య, వైద్యసేవలు, సమాచార వ్యవస్థల పునరుద్ధరణ జరగలేదు, ఇక సర్వేల పేరిట బృందాలు రావ టం తప్ప తక్షణ సహాయ చర్యలు తీసుకోవటం లేదు. దీంతో బాధిత గ్రామాల ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు. విద్యుత్ సరఫరా లేకపోవడంతో తాగునీటి పథకాలు నడవడం లేదు. 47 తాగునీటి పథకాలకుగాను 15 పథకాల పునరుద్ధరణ జరగలేదు. 887 తీరప్రాంత గ్రామాలకు విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడగా ఇప్పటికీ 108 గ్రామాలు చీకట్లో మగ్గుతున్నాయి. 448 గ్రామాల్లో తాగునీటి వసతులు దెబ్బతినగా వంద గ్రామాలకు ఇంకా తాగునీరు అందటం లేదు. 380 ఇళ్లు పూర్తిగాను, 862 ఇళ్లు పాక్షికంగా దెబ్బతిన్నాయని అధికారులు చెబుతున్నారు. వాస్తవానికి వీటి సంఖ్య చాలా ఎక్కువగా ఉంటుందని బాధితులు వాపోతున్నా రు. అలాగే ఆహార పంటలు 7783 హెక్టార్లు, ఉద్యాన పం టలు 5140 హెక్టార్లతో దెబ్బతిన్నాయని అధికారులు అంచనా వేశారు. నష్టం మరింత అధికంగా ఉంటుందని, పొలాల నుంచి నీరు బయటకు వెళితే పూర్తి పరిస్థితి తెలుస్తుందని బాధిత రైతులు చెబుతున్నారు. సర్వే బృందాలు పాతలెక్కలతో సరిపెట్టేసేలా ఉన్నాయని ఆందోళన చెందుతున్నారు. ఉద్దానంలో 3219 హెక్టార్లలో కొబ్బరి పంటకు నష్టం వాటిల్లినట్టు ఆధికారులు లెక్కలు వేశారు. అయితే వంగిన, విరిగిన, పొట్టలు దెబ్బతిన్న కొబ్బరి తోటలను పరిగణనలోకి తీసుకొలేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మండలాల వారీగా పరిస్థితి ఇలా ఉంది. కవిటి మండలంలో తాగునీరు సరఫరా కావ టం లేదు, గురువారం సాయంత్రం పనులు చేపట్టారు. 28 పంచాయతీలకు విద్యుత్ సరఫరా లేదు. ఇప్పటికీ పారిశుద్ధ్య పనులు చేపట్టలేదు. బాధితుల పునరావాసానికి సామగ్రి అందజేయలేదు. మండల కేంద్రం కంచిలి మినహా మిగిలిన 30 పంచాయితీల్లో విద్యుత్ సరఫరా లేదు. తాగునీరు అందటం లేదు. పారిశుద్ధ్య చర్యలు లేవు. ఇచ్ఛాపురం మండలంలో 50 గ్రామాలు ఇంకా అంధకారంలో ఉన్నాయి. పారిశుద్ధ్య పనులు చేపట్టలేదు. మందస మండలంలో 30 పంచాయతీలు ఉండగా కేవలం 4 పంచాయీతీల్లోనే విద్యుత్ సరఫరాను పునరుద్ధరించారు. పారిశుద్ధ్య పనులు గురువారం ప్రారంభించారు. సోంపేట, పోలాకి తదితర తీర మండలాల్లోనూ ఇదే పరిస్థితి ఉంది. -
ఏటీఎం సొమ్ము రూ.70 లక్షలు స్వాహా
శ్రీకాకుళం క్రైం, న్యూస్‌లైన్: ఏటీఎం మిషన్‌లో డిపాజిట్ చేయాల్సిన సుమారు 70 లక్షలు స్వాహా చేసిన వైనం వెలుగులోకి వచ్చింది. ఇందులో ఏటీఎంలో డబ్బు పెట్టే ఏజెన్సీ ఉద్యోగితో పాటు ఒక స్వర్ణవ్యాపారి కుమారుడు కూడా ఉన్నాడని తెలిసింది. డబ్బు తిరిగి చెల్లిస్తామని బ్యాంకు అధికారులకు చెప్పడంతో ఈ విషయం బయటకు తెలియలేదు. పోలీసులకు ఫిర్యాదు చేయకపోవడంతో పూర్తి వివరాలు తెలియకుండా జాగ్రత్తపడుతున్నారు. విశ్వసనీయ సమాచారం మేరకు దీనికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. శ్రీకాకుళం మున్సిపాల్టీలో గత ప్రభుత్వ హయాంలో మున్సిపల్ కో ఆప్షన్ సభ్యుడిగి పని చేసిన వ్యక్తి కుమారుడు, పట్టణంలో జీటీ రోడ్డులో బంగారు దుకాణం వ్యాపారి కుమారుడు స్నేహితులు. శ్రీకాకుళం పట్టణంలోని ఒక బ్యాంకుతో పాటు మరి కొన్ని ప్రాంతాల్లోని బ్యాంకులకు చెందిన ఏటీఎంలలో సొమ్ములు జమ చేసే సెక్యూరిటీ ఏజెన్సీలో కో ఆప్షన్ సభ్యుడి కుమారుడు కొంతకాలంగా పని చేస్తున్నాడు. ఏటీఎంలో డబ్బులు జమ చేసే విధి నిర్వహిస్తున్నాడు. అతని స్నేహితుడైన స్వర్ణవ్యాపారుడి కుమారుడు క్రికెట్ బెట్టింగ్‌లో చాలావరకు నష్టపోయాడు. అధిక మొత్తంలో అప్పులు చేయడంతో, వాటికోసం అప్పుల వాళ్లు బెదిరిస్తున్నారు. దీంతో ఏటీఎం ఏజెన్సీలో పని చేస్తున్న మిత్రుడికి బెట్టింగ్‌పై ఆశకలిగించాడు. తనకు సీసీఎల్ మ్యాచ్‌ల్లో క్రికెట్ బెట్టింగ్‌కు సంబంధించి అధిక మొత్తంలో డబ్బు వస్తుందని చెప్పాడు. తనకు డబ్బు ఇస్తే బెట్టింగ్ కడతానని, గెలిస్తే అందులో వాటా ఇస్తానని లేకపోతే తీసుకున్న సొమ్ముకు పది శాతం వడ్డీతో కలిపి ఇస్తానని చెప్పాడు. దీంతో ఆశపడిన మున్సిపల్ కో ఆప్షన్ సభ్యుడి కుమారుడు ఏటీఎంలో జమచేయాల్సిన డబ్బులో సుమారు రూ.70 లక్షలు మూడు విడతలుగా మిత్రుడికి ఇచ్చాడు. నెల రోజుల్లో ఈ సొమ్ముకు లెక్క చెప్పకపోతే బ్యాంకు అధికారులు గుర్తిస్తారని తెలిసినా బెట్టింగ్‌పై ఆశతో ఇందుకు పూనుకున్నాడు. బెట్టింగ్‌లో డబ్బులు రాకపోగా అసలు విషయం అధికారులకు తెలిసింది. బ్యాంకులో జమకావాల్సిన సొమ్ములో కొంత మొత్తం తగ్గడం గమనించి ఏజెన్సీకి ఫిర్యాదు చేశారు. దీనిపై పరిశీలించిన సెక్యూరిటీ ఏజెన్సీ వారు తమ వద్ద పని చేస్తున్న ఉద్యోగే ఈ పనిచేసినట్లు గుర్తించారు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు బ్యాంకు అధికారులు సిద్ధం కాగా, స్వర్ణవ్యాపారి, మాజీ కో ఆప్షన్ సభ్యుడు వారితో రాజీ ప్రయత్నాలు ప్రారంభించారు. పోలీసులకు ఫిర్యాదు చేయవద్దని, ఆ మొత్తం తాము చెల్లిస్తామని చెప్పడంతో బ్యాంకు అధికారులు ఫిర్యాదు చేయలేదని తెలుస్తోంది. ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చినా పోలీసులకు ఫిర్యాదు చేయకపోవడంతో నిందితుల పేర్లు బయటకు రాలేదు. బ్యాంకు సిబ్బంది సాయంపై అనుమానాలు ఏజెన్సీ సొమ్ము జమచేస్తున్న పలు బ్యాంకుల్లో ఒక బ్యాంకు సిబ్బందికి ఈ విషయం ముందే తెలుసనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. బ్యాంకు సిబ్బంది సహకారంతోనే అంత మొత్తంలో సొమ్మును సెక్యూర్టీ ఏజెన్సీకి తెలియకుండా తీసినట్టు తెలుస్తొంది. ఎప్పటికప్పుడు లావాదేవీలు చూడాల్సిన కొంతమంది సిబ్బంది కొంత మొత్తానికి ఆశపడి సహకారం అందించారని సమాచారం. దీనిపై ఇప్పటికైనా పోలీసులకు ఫిర్యాదు అందుతుందా అన్నది వేచి చూడాలి.