ఉపాధి హామీ పథకం రాష్ట్ర డెరైక్టర్ కరుణ
శ్రీకాకుళం అర్బన్, న్యూస్‌లైన్: ఉపాధి హామీ పథకం గ్రామీణాభివృద్ధికి కేంద్ర బిందువుగా మారిందని ఆ పథకం రాష్ట్ర డెరైక్టర్ వి.కరుణ అన్నారు. జిల్లా అధికార యంత్రాంగం శ్రీకాకుళం కోడిరామ్మూర్తి క్రీడా మైదానంలో.. మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం సమ్మేళనాన్ని గురువారం నిర్వహించింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జిల్లాలో ఉపాధిహామీ పథకం గొప్ప విజయం సాధించిందన్నారు. పనుల నిర్వహణ, రికార్డుల నమోదులో సిబ్బంది బాగా పనిచేస్తున్నారని కితాబిచ్చారు. జిల్లా ప్రాజెక్ట్ డెరైక్టర్ ఎ.కల్యా ణ చక్రవర్తిని యోగిగా ఆమె అభివర్ణించారు. సిబ్బంది ఉద్యోగంపై అభద్రతా భావానికి గురి కావద్దన్నారు.
కసి పెరిగి..
కలెక్టర్ సౌరభ్‌గౌర్ మాట్లాడుతూ.. 2011-12 ఏడాదికి జాతీయ అవార్డుకు దరఖాస్తు చేసినపుడు జాతీయ డేటా బేస్‌తో సరిపోల్చడం లేదని అధికారులు చెప్పారని.. దీంతో మరింత పట్టుదలగా పనిచేశామన్నారు. వంద రోజుల పనిపూర్తి చేసిన వారి సంఖ్యను గణనీయంగా పెంచేందుకు కృషి చేశామన్నారు. ఈ పనుల వల్ల రైతులకు చెరువు లు బాగుపడి సాగునీరు అందుతోందని, కూలీలకు రేట్లు పెరిగాయని, వేతన చెల్లిం పులో ఆర్థిక అసమానతలు తొలగాయని చెప్పారు. గిరిజన ప్రాంతాల్లో ఈఏడాది *60 నుంచి *70కోట్లుతో రహదారులు నిర్మిస్తున్నామన్నారు. రోజుకు 5 లక్షల మంది కూలీలు పనికి వచ్చేలా ప్రోత్సహించి.. రికార్డు స్థాపించాలని కోరారు. 3.95 లక్షల కుటుంబాలు, 5.12లక్షల మంది పనికి హాజరవుతున్నారన్నారు. ఎస్సీ, ఎస్టీలలో 64శాతం మంది మాత్రమే 100 రోజుల పనిదినాలను పూర్తి చేసుకున్నారని, నూరు శాతం కుటుంబాలు 150 రోజుల పనిదినాలను పూర్తి చేసుకొనుటకు చర్యలు చేపట్టాలన్నారు. జాయింట్ కలెక్టర్ వీరపాండ్యన్ మాట్లాడుతూ జిల్లాలో ఉపాధిహామీ పథకం చక్కగా అమలవుతోందన్నారు. భద్రాచలం ఐటీడీఏ ప్రాజెక్టు అధికారిగా పనిచేస్తున్నపుడు శ్రీకాకుళం విజయాలు విని..అధ్యయనం చేసేందుకు సిబ్బందిని పంపించానన్నారు.
నీటియాజమాన్య సంస్థ ప్రాజెక్టు డెరైక్టర్ ఎ.కల్యాణ చక్రవర్తి మాట్లాడుతూ 2012-13 సంవత్సరంలో *394 కోట్లు ఖర్చు చేశామని, 2013-14లో 2లక్షల కుటుంబాలకు వంద రోజుల పనిదినాలు కల్పించాలని కలెక్టర్ లక్ష్యం గా నిర్ణయించారన్నారు. పథకం సహాయ ప్రాజెక్టు డెరైక్టర్లు, సహాయ ప్రొగ్రాం అధికారులు, క్షేత్ర సహాయకులు, సాంకేతిక సహాయకులు మాట్లాడారు. ఉత్తమ పనితీరు కనబరిచిన 90 మందికి ప్రశంసా పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా రెడ్‌క్రాస్ చిక్కోలు చిరుదివ్వెలు ట్రస్ట్‌కు ఉపాధి హామీ పథకం అధికారులు, సిబ్బంది *2.50లక్షల చెక్కును కలెక్టర్‌కు అందజేశారు. అనంతరం సిక్కోలు ఉపాధి హామీ పథకం సమ్మేళన్ పుస్తకాన్ని ఆవిష్కరించారు. ముందుగా సిబ్బంది ఏర్పా టు చేసిన ఎగ్జిబిషన్ ఆకట్టుకుంది. ఈ కార్యక్రమంలో ఉపాధి పథకం అదనపు ప్రాజెక్టు డెరైక్టర్ ఆర్.గణపతిరావు, పంచాయతీ రాజ్ కార్యనిర్వాహక ఇంజినీర్ ఎ.ప్రభాకరరావు, గాయత్రీ కళాశాల ప్రిన్సిపాల్ పుల ఖండం శ్రీనివాసరావు, ఉపాధిహామీ అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
గ్రామీణాభివృద్ధికే ‘ఉపాధి’!
Published Fri, Feb 21 2014 1:24 AM | Last Updated on Sat, Sep 2 2017 3:55 AM
Advertisement