కలెక్టర్ సౌరభ్‌గౌర్
శ్రీకాకుళం కల్చరల్, న్యూస్‌లైన్: జిల్లాలో రెడ్‌క్రాస్ సంస్థ సేవలు మరువలేనివని కలెక్టర్ సౌరభ్ గౌర్ అన్నారు. స్థానిక అంబేద్కర్ ఆడిటోరియంలో శుక్రవారం జరిగిన రె డ్‌క్రాస్ వార్షిక సమావేశంలో ఆయన మాట్లాడారు. పేదలకు ఆపదలో ఉన్న ఉన్నవారికీ సహాయ సహకారాలు అందించేందుకు ప్రజలకు రెడ్‌క్రాస్ ఉన్నదన్న భరోసా కలిగేలా తీర్చి దిద్దుతున్నామన్నారు. ఆరు వేల యూనిట్ల రక్తనిలువలు నేడు 15 వేల యూనిట్లుకు పెంచేందుకు సంస్థ చేస్తున్న కృషి అభినందనీయమన్నారు. అయితే కణవిభణనకుయూనిట్టు జిల్లా కు అవసరమని దీనికై ట్రైమెక్స్ సంస్థ, ఈస్టుకోస్టు ఎనర్జీ, నాగార్జున, అరబొందో వంటి పారిశ్రామిక సంస్థల సేవలు అవసరమని తెలిపారు. రెడ్‌క్రాస్ ద్వారా అనురాగ నిలయం పేరుతో దిక్కుమొక్కులేని వారికి, చిక్కోలు చిరుదివ్వెలు కార్యక్రమంలో భాగంగా పేద విద్యార్థినులకు ఉన్నత విద్య అందించేందుకు కృషి చేస్తున్నామన్నారు. జిల్లాలో 105 మత్స్యకార గ్రామాలను గుర్తించి ఇప్పటికే ఐస్ బాక్సులు తదితర పరికరాలు అందించామని తెలిపారు.
ఈ సందర్భంగా రెడ్‌క్రాస్ నేత్ర సేకరణద్వారా నే త్రదానాలు అందుకున్న పలువురిని సంస్థ సభకు, కలెక్టర్‌కు పరిచయం చేశారు. అందులో మూడోతరగతి చదువుతున్న ఒక చిన్నారికి ఒక దాత ఇచ్చిన నేత్రాలను అమర్చడంతో కలెక్టర్ మాట్లాడారు. అనంతరం ఎస్పీ నవీన్ గులాఠీ మాట్లాడుతూ జిల్లాలో రెడ్‌క్రాస్‌కు తమ శాఖ సహాయ సహకారాలు ఎల్లప్పుడూ ఉంటాయన్నారు. ట్రైమెక్స్ ప్రతినిధి కోనేరు ప్రసాద్ మాట్లాడుతూ జిల్లాలో పేదవారికి విద్య, వైద్యం అందించేం దుకుగాను తమ వంతు సహాయ సహ కారాలు అందిస్తున్నానని తెలిపారు. కలెక్టర్ కృషి వల్ల ఈ ఏడాది జిల్లా రెడ్‌క్రాస్ రెండు బంగారు పతకాలకు ఎంపికైందని, ఫిబ్రవరిలో జరిగే సమావేశంలో గవర్నర్ చేతులమీదుగా వీటిని అందుకోనున్నట్లు రెడ్‌క్రాస్ ఛెర్మైన్ పి.జగన్మోహనరావు పేర్కొన్నారు.
సేవా స్ఫూర్తిదాతలకు సత్కారం
జిల్లాలో రెడ్‌క్రాస్ చేస్తున్న సేవలకు సహాయసహకారాలందించిన పలువురు అధికారులు, వైద్యులు, స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులకు కలెక్టర్ సత్కరించడం తోపాటు అవార్డులను అందించారు. రెడ్‌క్రాస్ రక్తకణాల నిధికి రూ.10 లక్షలు విరాళంగా ఇచ్చిన ఎన్‌ఆర్‌ఐ పి.సూర్యనరాయణ తరఫున మాజీ ఎమ్మెల్యే కేఎల్‌ఎన్ భుక్తకు కలెక్టర్ సత్కరించారు. అలాగే 24 మందితో రక్తదానం చేయించినందుకు ఆర్‌టీసీ ఒకటో డిపో మేనేజర్ బీఎల్‌పీ.రావుకు కలెక్టర్ రెడ్‌క్రాస్ అవార్డును కలెక్టర్ అందజేశారు.
చిరుదివ్వెలుకు ప్రియాంక గౌర్ రూ.లక్ష విరాళం
చిక్కోలు చిరుదివ్వెలకు కలెక్టర్ సతీమణి ప్రియాంక గౌర్ లక్ష రూపా యలు విరాళం అందచేశారు. శాంత అనురాగ నిలయంలో ఉంటున్న 11 మంది పేదవిద్యార్థులకు సంవత్స రానికి ఒక్కొక్కరికి రూ.20 వేలు చొప్పు న విరాళాన్ని అందించారు. రెడ్‌క్రాస్‌కు మత్స్యకార శాఖా డీడీ రూ.50 వేలు, డాక్టర్ దానేటి శ్రీధర్ రూ.20 వేలు విరాళంగా అందిం చారు. చిక్కోలు చిరు దివ్వెలకు అరవల్లి ట్రస్టు బోర్డు మాజీ సభ్యు డు టీఏ.సూర్య నారాయణ రూ.20 వేలు విరాళంగా అందించారు. కార్య క్రమంలో డీఆర్‌డీఏ పీడీ రజనికాంతరావు, సెట్‌శ్రీ సీఈవో మూర్తి, పాలకొండ ఆర్టీవో తేజ్ భరత్, మెప్మా పీడీ మునుకోటిసత్యనారాయణ, ఈస్టుకోస్టుజనరల్ మేనేజర్ రాజు తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమంలో ఎన్‌సీఎస్ స్కూల్ విద్యార్థులు రెడ్‌క్రాస్ సేవలపై ప్రదర్శించిన నృత్యాలు ఆకట్టుకున్నాయి.
రెడ్‌క్రాస్ సేవలు భేష్
Published Sat, Jan 25 2014 2:59 AM | Last Updated on Sat, Sep 2 2017 2:57 AM
Advertisement
Advertisement