Ambedkar Auditorium
-
అంబేద్కర్ విగ్రహంపై చంద్రబాబు మోసం చేశారు: మంత్రి మేరుగ
సాక్షి, విజయవాడ: ప్రపంచం గర్వించదగిన రీతిలో అంబేద్కర్ విగ్రహం మన రాష్ట్రంలో ఏర్పాటైందని మంత్రి మేరుగ నాగార్జున అన్నారు. ఈనెల 19వ తేదీన విగ్రహం ఆవిష్కరణ వైభవంగా నిర్వహిస్తామన్నారు. తుమ్మలపల్లి క్షేత్రయ్యవారి కళాక్షేత్రంలో డా.బీ.ఆర్ అంబేద్కర్ రాష్ట్రస్థాయి సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో మంత్రి ఆదిమూలపు సురేష్, ఎమ్మెల్యే మల్లాది విష్ణు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మయన్మార్ నుంచి వచ్చిన బౌద్ధ భిక్షువులు ప్రత్యేక ప్రార్ధనలు నిర్వహించారు. సమాజంలో ఉన్న అసమానతలను తొలగించేందుకు కృషి చేసిన మహోన్నత వ్యక్తి అంబేద్కర్.. ఆయన భావజాలాన్ని భుజాన వేసుకుని పాలన చేస్తున్న ఒకే ఒక్కడు సీఎం జగన్ అని మంత్రి మేరుగ నాగార్జున కొనియాడారు. అంబేద్కర్ ఆలోచనలతో పాలన చేస్తూ చరిత్ర పుటల్లో సీఎం జగన్ తన పేరు లిఖించుకున్నారన్నారు. సీఎం జగన్ భావితరాల భవిషత్తు కోసం పనిచేస్తున్నారని మంత్రి అన్నారు. ‘‘అంబేద్కర్ విగ్రహం పెడతామని మోసం చేసిన వ్యక్తి చంద్రబాబు. గత పాలనలో అవమానాలు.. అవహేళనలు.. దాడులు.. చూశాం. సీఎం జగన్ వల్లే మేం రాజ్యాధికారం పొందగలిగాం. విజయవాడ నడిబొడ్డున అంబేద్కర్ విగ్రహం పెడతానని సీఎం చెప్పారు. చెప్పినట్లుగానే రూ. 425 కోట్లతో అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు చేశారు’’ అని మంత్రి మేరుగ నాగార్జున అన్నారు. అంబేద్కర్ ఆలోచనలకు అనుగుణంగా సీఎం జగన్ పాలన: మంత్రి ఆదిమూలపు పేదరికం విద్యకు అడ్డు కాకూడదని మంత్రి ఆదిమూలపు సురేష్ అన్నారు. అంబేద్కర్ ఆలోచనలకు అనుగుణంగా సీఎం జగన్ పాలన సాగుతోందన్నారు. బడుగు, బలహీన,అణగారిన,దళిత వర్గాలకు సీఎం పెద్ద పీట వేశారు. చిట్టచివరి వారికి సైతం సంక్షేమం అందాలనే లక్ష్యంతో ఆయన పనిచేస్తున్నారు. అవినీతి లేని పాలన.. పారదర్శకత.. జవాబుదారీ తనం మా ప్రభుత్వం ఎంచుకున్న ప్రధాన లక్ష్యాలు. నేను ఉన్నాను...నేను విన్నానని పాదయాత్రలో ప్రజల కష్టాలు తెలుసుకున్నారు. ఈ నాలుగున్నరేళ్లలో సీఎం జగన్ అండగా నిలిచారు’’ అని మంత్రి అన్నారు. ఇంగ్లీష్ మీడియం పెడుతుంటే తెలుగు భాషను చంపేస్తున్నారని నానా యాగీ చేశారు. సీఎం జగన్ ధైర్యంగా పేదలకు ఇంగ్లీష్ మీడియం విద్యను అందిస్తున్నారు. ఈ రోజు మావంటి వారు క్యాబినెట్లో ఉన్నారంటే సీఎం జగనే కారణమని మంత్రి అన్నారు. అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు ఒక చరిత్ర: మల్లాది విష్ణు 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు ఒక చరిత్ర అని ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. సీఎం జగన్ ఆలోచన అభినందనీయమని.. భారతదేశంలో ఏపీ అగ్రగామిగా నడవాలంటే అంబేద్కర్ ఆలోచనలతోనే సాధ్యమన్నారు. అంబేద్కర్ ఆశయాలను కొనసాగించే ప్రభుత్వం.. వైఎస్ జగన్ ప్రభుత్వమని విష్ణు అన్నారు. -
విజయవాడ అంబేద్కర్ విగ్రహం.. ఎన్నో విశేషాలు (ఫొటోలు)
-
విజయవాడలో ఆకాశమంత అంబేద్కర్ విగ్రహం...ప్రత్యేకతలు ఇవే (ఫొటోలు)
-
జాతి గర్వించేలా.. జగమంతా కనిపించేలా..
నాడు తలదించి నడిచిన బడుగు, బలహీన, అణగారిన వర్గాలు నిలువెత్తు ‘స్ఫూర్తి’ ఎదుట తలెత్తి చూసే కలను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సాకారం చేయబోతున్నారు. బెజవాడ నడిబొడ్డున ఓ చేతిలో రాజ్యాంగాన్ని పట్టుకొని, మరో చేయి చూపుడు వేలితో గొప్ప ఆత్మవిశ్వాసంతో కనిపిస్తున్న ఆకాశమంత ‘ఆదర్శం’ రాష్ట్రానికే తలమానికంగా రూపుదిద్దుకుంటోంది. ఎన్నో చారిత్రక ఘట్టాలకు వేదికై న బెజవాడ స్వరాజ్ మైదానంలో 125 అడుగుల భారీ బాబా సాహెబ్ అంబేడ్కర్ విగ్రహం కొలువుదీరింది. ప్రపంచ స్థాయి పర్యాటకులను సైతం ఆకర్షించే విధంగా స్మృతి వనం ముస్తాబవుతోంది. సాక్షి ప్రతినిధి, విజయవాడ: బెజవాడ స్వరాజ్ మైదానంలో నిర్మిస్తున్న అంబేడ్కర్ స్మృతి వనం పనులు తుది దశకు చేరుకున్నాయి. విజయవాడ నగరానికే సెంటరాఫ్ అట్రాక్షన్‌గా 125 అడుగుల భారీ అంబేడ్కర్ విగ్రహం నిలవనుంది. 18.18 ఎకరాల్లో దాదాపు రూ.400 కోట్లతో పనులు చేపట్టారు. నవంబర్ 26న రాజ్యాంగ దినోత్సవం రోజున డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విగ్రహాన్ని సీఎం వైఎస్ జగన్ చేతుల మీదుగా జాతికి అంకితం చేసే విధంగా పనులు నిర్వహిస్తున్నారు. సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మేరుగ నాగార్జున చైర్మన్‌గా 8 మంది మంత్రులతో ప్రభుత్వం సబ్ కమిటీని ఏర్పాటు చేసింది. క్షేత్ర స్థాయిలో పర్యటిస్తూ ఎప్పటికప్పుడు పనుల ప్రగతిని కమిటీ సమీక్షిస్తోంది. మున్సిపల్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శ్రీలక్ష్మి ఈ ప్రాజెక్టు పనులు స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. అత్యాధునిక సాంకేతికతతో.. ఢిల్లీ నుంచి వచ్చిన డిజైనర్లు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా, నాణ్యతా ప్రమాణాలు పాటిస్తూ పనులు చేస్తున్నారు. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ జీవిత చరిత్ర తెలిపే (డిజిటల్) మ్యూజియం, మిని థియేటర్లు, ఫుడ్‌కోర్టు, కన్వెన్షన్ సెంటర్, వెహికల్ పార్కింగ్ ఉన్నాయి. కన్వెన్షన్ సెంటర్‌ను 1500 మంది సీటింగ్ సామర్థ్యంతో నిర్మిస్తున్నారు. ఫుడ్‌కోర్టు 8,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉంది. బిల్డింగ్ చుట్టూ నీటి కొలను, మ్యూజికల్, వాటర్ ఫౌంటేన్ ఉన్నాయి. నీటి కొలనుకు లైటింగ్, బబ్లింగ్ సిస్టం ఉన్నాయి. అంబేడ్కర్ జీవిత చరిత్ర తెలుపుతూ 38 ఘట్టాలను ప్రదర్శించేలా ఆర్ట్ వర్క్ ఏర్పాటు చేస్తున్నారు. అంబేడ్కర్ జీవితంలో బాల్యం, విద్య, వివాహం, ఉద్యోగం, రాజకీయ జీవితం, పోరాటాలు, రాజ్యంగ నిర్మాణ సమయంలోని ఛాయాచిత్రాలు, వస్తువులను ప్రదర్శించేలా మ్యూజియం ఏర్పాటవుతోంది. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా మనం ఏదైనా ప్రశ్న అడిగితే, ఆయనే స్వయంగా సమాధానం ఇచ్చేలా వీడియో సిస్టం ఏర్పాటు చేస్తున్నారు. విగ్రహం తయారీని షూ దగ్గర నుంచి బెల్ట్ వరకు హనుమాన్ జంక్షన్‌్ వద్ద శిల్పి ప్రసాద్ ఆధ్వర్యంలో కాస్టింగ్ చేశారు. స్థానిక కూలీలతో పాటు, ఢిల్లీ, బీహర్, రాజస్థాన్ నుంచి వచ్చిన కూలీలు, ఏడాదిన్నరకు పైగా పనిచేశారు. ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి మూడు ఫ్లోర్లుగా భవనం.. విగ్రహం బేస్ కింది భాగంలో గ్రౌండ్, ఫస్ట్, సెకండ్ ఫ్లోర్లు ఉంటాయి. ► గ్రౌండ్ ఫ్లోర్లో నాలుగు హాళ్లు ఉంటాయి. ఒక్కో హాలు 4,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉంటుంది. ఇందులో ఓ సినిమా హాలు, మిగిలిన మూడు హాళ్లలో ఆయన చరిత్ర తెలిపే డిజిటల్ మ్యూజియం ఉంటుంది. ► ఫస్ట్ ఫోర్లో 2,250చదరపు అడుగుల విస్తీర్ణం కలిగిన నాలుగు హాళ్లు ఉంటాయి. ఒక హాలులో అంబేడ్కర్‌కు దక్షిణ భారత దేశంతో ఉన్న అనుబంధాన్ని డిస్ప్లే చేస్తారు. ► సెకండ్ ఫ్లోర్లో 1000 చదరపు అడుగుల విస్తీర్ణంలో నాలుగు హాళ్లు ఉంటాయి. ప్రాంగణం చుట్టూ సైక్లింగ్ ట్రాక్.. స్మృతి వనం చుట్టూ రూ.4 కోట్ల వ్యయంతో 2.7 కి.మీ మేర ప్రత్యేకమైన రోడ్లు అభివృద్ధి చేయనున్నారు. దీని పొడవునా గ్రీనరీ, పాత్‌వేస్, సైక్లింగ్ ట్రాక్, ఫుడ్ స్ట్రీట్ వంటివి ఏర్పాటు చేయనున్నామన్నారు. ఉదయం సాయంత్రం వేళల్లో ఈ మార్గంలో వాకింగ్, జాగింగ్ వంటివి చేసుకునే వెసులుబాటును కల్పించనున్నారు. ఇది స్మృతి వనం స్వరూపం.. ► అంబేడ్కర్ విగ్రహం ఎత్తు: 125 అడుగులు ► కింద బేస్(పెడస్టల్ ఎత్తు): 81 అడుగులు ► పెడస్టల్ పరిమాణం: 3,481 చదరపు అడుగులు ►పెడస్టల్‌తో కలిపి విగ్రహం మొత్తం ఎత్తు: 206 అడుగులు ► నిర్మించే గదులు: జీ ప్లస్ టు ►విగ్రహానికి వాడిన బ్రాంజ్: 112 మెట్రిక్ టన్నులు ► విగ్రహం నిర్మాణం లోపల (అర్మేచర్)కు వాడిన స్టీలు: 352 మెట్రిక్ టన్నులు ► మొదటి దశలో మంజూరైన నిధులు: రూ.268.46 కోట్లు ► రెండో దశలో మంజూరైన నిధులు: రూ.106.64 కోట్లు ► పనులు ప్రారంభం: 2022 మార్చి 21 జగనన్న నిర్ణయం చారిత్రాత్మకం అంబేడ్కర్ స్మృతి వనం నిర్మాణం గొప్ప కార్యక్రమం. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి తీసుకున్న ఈ నిర్ణయం చారిత్రాత్మకం. గత టీడీపీ ప్రభుత్వంలో అంబేడ్కర్ విగ్రహం నిర్మించేందుకు సరైన స్థలం కూడా చంద్రబాబు ఇవ్వలేదు. విజయవాడ నడిబొడ్డున అత్యంత ఖరీదైన స్థలాన్ని మన సీఎం కేటాయించారు. – మేరుగ నాగార్జున, సాంఘిక, సంక్షేమ శాఖ మంత్రి ప్రాంగణమంతా పచ్చందాలు.. స్వరాజ్ మైదానంలో 125 అడుగుల విగ్రహ నిర్మాణం పూర్తయింది. మిగిలిన స్మృతి వనం పనులు తుది దశకు చేరాయి. కారిడార్ మొత్తం గ్రానైట్ ఫుట్‌పాత్, ల్యాండ్ చేస్తున్నాం. ఈ ప్రాంగణంలో అందమైన మొక్కలతో ప్లాంటేషన్ చేసే విధంగా చర్యలు తీసుకొంటున్నాం. – స్వప్నిల్ దినకర్ పుండ్కర్, మున్సిపల్ కమిషనర్, విజయవాడ -
నా రికార్డులు బ్రేక్ చేస్తే రూ.లక్ష నజరానా
శ్రీకాకుళంలో రాష్ట్ర స్థాయి వెయిట్ లిఫ్టింగ్ పోటీలు ప్రారంభించిన కరణం మల్లీశ్వరి శ్రీకాకుళం న్యూకాలనీ: ఒలింపిక్స్‌లో తాను నెలకొల్పిన రికార్డులను బ్రేక్ చేసిన వారికి రికార్డుకి రూ.లక్ష చొప్పున బహుమతిగా ఇస్తానని ఒలింపిక్ కాంస్య పతక గ్రహీత, శాప్ బోర్డ్ సభ్యురాలు కరణం మల్లీశ్వరి ప్రకటించారు. శ్రీకాకుళంలోని డా.అంబేడ్కర్ ఆడిటోరియంలో రెండు రోజుల ఖేలో ఇండియా రాష్ట్ర స్థాయి అండర్–14, అండర్–17 బాలబాలికల వెయిట్ లిఫ్టింగ్ చాంపియన్ షిప్ పోటీలు ఆదివారం ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా మల్లీశ్వరి మాట్లాడుతూ.. శ్రీకాకుళంలో తన పేరిట త్వరలో వెయిట్ లిఫ్టింగ్ అకాడమీని ప్రారంభించనున్నట్లు వెల్లడించారు. మిగిలిన క్రీడా అకాడమీలతో పోలిస్తే వెయిట్ లిఫ్టింగ్ ఖర్చుతో కూడుకున్నదని అన్నారు. కాగా, పోటీల్లో సీఎం చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తోన్న చిత్తూరు జిల్లా మినహా అన్ని జిల్లాల నుంచి క్రీడాకారులు పాల్గొన్నారు. చిత్తూరు జిల్లా నుంచి కనీస ప్రాతినిధ్యం లేకపోవడం చర్చనీయాంశమైంది. -
28న వైఎస్సార్ సీపీ జిల్లా విస్తృత సమావేశం
పోలాకి:శ్రీకాకుళంలోని అంబేద్కర్ ఆడిటోరియంలో ఈనెల 28న (శుక్రవారం) ఉదయం 11గంటలకు వైఎస్సార్ సీపీ జిల్లా విస్తృత స్థాయి సమావేశం నిర్వహిస్తామని ఆ పార్టీ రాష్ట్ర బీసీ సెల్ అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్ తెలిపారు. సోమవారం పోలాకిలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ఈ సమావేశానికి పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు విజయ్‌సాయిరెడ్డి, ధర్మాన ప్రసాదరావు, సీనియర్ నాయకులు ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, రోజా, తమ్మినేని సీతారాం తదితరులు హాజరవుతారని తెలిపారు. ఈ సమావేశానికి గ్రామస్థాయి నుంచి పార్టీలో క్రీయాశీలంగా పనిచేస్తున్న శ్రేణులంతా హాజరు కావాలని కృష్ణదాస్ పిలుపునిచ్చారు. -
ఆకట్టుకున్న నృత్యప్రదర్శనలు
ఢిల్లీ తెలుగు అకాడమీ వార్షిక సాంస్కృతికోత్సవాలు మొదలు సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీ తెలుగు అకాడమీ 27వ వార్షిక సాంస్కృతికోత్సవాలు ఆంధ్రప్రదేశ్ భవన్‌లోని అంబేద్కర్ ఆడిటోరియంలో శుక్రవారం ప్రారంభమయ్యాయి. సంప్రదాయ వస్త్రధారణ, అబ్బురపరిచే నృత్యాలతో కళాకారులు ఆకట్టుకున్నారు. తొలి రోజున కూచిపూడి, భరతనాట్య ప్రదర్శనలు ప్రేక్షకులను అలరించాయి. గురు సీతా నాగజ్యోతి శిష్యురాలు ఎం. వైష్ణవి కూచిపూడి నాట్యంలో భాగంగా ప్రదర్శించిన పురంధర దాసుకీర్తన గజవదనాబేడువే , ఆదిశంకరాచార్య విరచితమైన లింగాష్టకం, నారాయణతీర్థులు రాసిన కృష్ణలీలాతరంగిణి గోవర్దన గిరిధారి తరంగం ప్రేక్షకులను ఉర్రూతలూగించాయి. పళ్లెంలోనే తన శరీరాన్ని వెనక్కి వంచి ఆమె గోవర్దన పర్వతాన్ని ప్రదర్శించిన తీరు ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసింది. గురు జయరామారావు శిష్యురాలు టి. రెడ్డి లక్ష్మి ప్రదర్శించిన జయదుర్గే నృత్యం, కృష్ణ లీలలు, శివతరంగం ప్రేక్షకులను మైమరిపించాయి. ఇంకా గురు వెంపటి చినసత్యం శిష్యురాలు జయప్రియ విక్రమన్ ప్రదర్శించినశ్రీ కృష్ణపారిజాతం నృత్యరూపకం మొత్తం కార్యక్రమానికి తలమానికంగా నిలిచింది. చివరగా గురు ఉషారావు శిష్యుబందం అన్నమయ్య కీర్తనలు, త్యాగరాజకీర్తనపై ప్రదర్శించిన భరతనాట్యం, థిల్లానా అలరించాయి. మాజీ ఎన్నికల కమిషనర్ జీవీఈ కృష్ణమూర్తి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఇంకా గురుజయరామారావు తదితర ప్రముఖులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఆద్యంతం ఈ కార్యక్రమం ఉత్సాహపూరిత వాతావరణంలో కొనసాగింది.కాగా మూడు రోజుల పాటు ఈ కార్యక్రమాలు జరగనున్నాయి. ఇందులోభాగంగా పలు సాంస్కృతిక కార్యక్రమాలను ప్రదర్శించడంతో పాటు వివిధ రంగాలలో నిష్ణాతులైన వారిని సన్మానించనున్నారు. శనివారం మధ్యాహ్నం మూడున్నర గంటలకు గురు కె. రామాచారి , లిటిల్ మ్యుజీషియన్స్ అకాడమీ విద్యార్థుల ఆధ్వర్యంలో సినీ భక్తి సంగీత విభావరి కార్యక్రమం జరగనుంది. -
దరఖాస్తులు ‘ఫుల్’
మద్యం దరఖాస్తులు మంచి కిక్ ఇచ్చాయి. దుకాణాలకు లెసైన్సు పొందేందుకు ఆశావహులు పోటీ పడ్డారు. ఆఖరి రోజైన శుక్రవారం దరఖాస్తుదారులు క్యూ కట్టారు. జిల్లాలోని 232 మద్యం దుకాణాలను కైవసం చేసుకునేందుకు పోటాపోటీగా తరలిరావడంతో అంబేద్కర్ ఆడిటోరియం కిటకిటలాడింది. మద్యం దుకాణాలు పొందేందుకు మహిళలు కూడా బారులు తీరారు. శనివారం జిల్లా కలెక్టర్ సమక్షంలో లాటరీ పద్ధతి ద్వారా దుకాణాలను కేటాయించనున్నారు. శ్రీకాకుళం క్రైం: జిల్లాలోని మద్యం దుకాణాలను కైవసం చేసుకునేందుకు దరఖాస్తుదారులు ఎగబడ్డారు. శుక్రవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు దరఖాస్తుదారులతో అంబేద్కర్ ఆడిటోరియం కిటకిటలాడింది. వ్యాపారుల సౌలభ్యం కోసం ఒకే ఈఎండీతో ఎన్ని దరఖాస్తులైనా చేసుకోవచ్చంటూ ఎక్సైజ్‌శాఖ ఇచ్చిన ఆఫర్‌ను దరఖాస్తుదారులు బాగానే సద్వినియోగం చేసుకున్నారు. అమావాస్య కావడంతో మంచి సమయం కోసం వేచి ఉండి చివరి రోజు మధ్యాహ్నం నుంచి దరఖాస్తుల తాకిడి విపరీతంగా పెరిగింది. జిల్లాలో 232 మద్యం దుకాణాలకు సంబంధించి ఎక్సైజ్‌శాఖ దరఖాస్తులను ఆహ్వానించింది. మొదటి రోజు మంగళవారం ఒక దరఖాస్తు కూడా దాఖలు కాకపోగా, రెండో రోజు బుధవారం ఏడు దరఖాస్తులు మాత్రమే దాఖలయ్యాయి. మూడో రోజు గురువారం 90 దుకాణాలకు సంబంధించి 293 దరఖాస్తులు వచ్చాయి. చివరి రోజు అర్ధరాత్రి 12 గంటల వరకు అందిన సమాచారం ప్రకారం సుమారు 1500 దరఖాస్తులు వచ్చాయి. మధ్యాహ్నం నుంచి శుభఘడియలు రావడంతో అధికమంది బ్యాంకుల్లో డీడీలు తీసి దరఖాస్తులతో అంబేద్కర్ ఆడిటోరియంకు పరుగులు తీశారు. దరఖాస్తు చేసుకున్న వారిలో చాలా మంది వారి స్థోమత బట్టి దుకాణాలకు టెండర్లు దాఖలు చేశారు. మధ్యాహ్నం మూడు గంటల సమయంతో దరఖాస్తుల స్వీకరణ సమయం ముగిసింది. అయితే, ఆడిటోరియంలోకి చేరుకున్నవారందరి నుంచి ఎక్సైజ్‌శాఖ అధికారులు దరఖాస్తులు స్వీకరించారు. ఈ ప్రక్రియ రాత్రి 12 గంటల వరకు సాగింది. మొత్తమ్మీద ఈ ఏడాది అధిక సంఖ్యలో దరఖాస్తులు దాఖల య్యాయనే చెప్పాలి. ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ నాగలక్ష్మీ దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియను దగ్గరుండి పర్యవేక్షించారు. శనివారం మద్యం దుకాణాలకు వచ్చిన దరఖాస్తులను లాటరీ పద్ధతిలో దుకాణాలు కేటాయించనున్నారు. మహిళల హడావుడి.. మద్యం దుకాణాలు కైవసం చేసుకునేందుకు పురుషులతో సమానంగా మహిళలు కూడా పోటీ పడ్డారు. ఓ వైపు మహిళా సంఘాల ప్రతి నిధులు మద్యపాన నిషేధానికి పాటుపడు తుండగా... మద్యం దుకాణాలు కైవసం చేసుకునేందుకు పలువురు మహిళలే స్వయం గా దరఖాస్తు చేసుకోవడం పలువురిని ఆలో చనలో పడేసింది. 21 దుకాణాలకు దరఖాస్తులు నిల్... రణస్థలం పరిధిలోని 15 దుకాణాలకు 14 దుకాణాలకు 207 దరఖాస్తులు, నరసన్నపేట పరిధిలో 18 దుకాణాలకు గాను 17 దుకాణాలకు 149 దరఖాస్తులు, పలాస పరిధిలో 98 దుకాణాలకు 80 దుకాణాలకు 623 దరఖాస్తులు వచ్చాయి. పాలకొండ 16 దుకాణాలకు గాను 15 దుకాణాలకే దరఖా స్తులు వచ్చాయి. శ్రీకాకుళం మున్సిపాలిటీ పరిధిలో 22 దుకాణాలకు సుమారు 400 వరకు దరఖాస్తులు దాఖలయ్యాయి. మొత్తంమీద 232 దుకాణాల్లో సుమారు 21 దుకాణాల వరకు దరఖాస్తులు దాఖలు కాలేదు. -
ఓటనే వజ్రాయుధాన్ని ప్రయోగించండి
శ్రీకాకుళం కలెక్టరేట్, న్యూస్‌లైన్: ప్రజాస్వామ్యంలో ఓటుకు ఎంతో విలువ ఉందని, ఓటనే వజ్రాయుధాన్ని ప్రయోగించి మంచివారిని ఎన్నుకోవాలని కలెక్టర్ సౌరభ్ గౌర్ అన్నారు. మంగళవారం ఓటు నమోదు, ఓటు హక్కు వినియోగంపై శ్రీకాకుళం అసెంబ్లీ నియోజకవర్గ అవగాహన కార్యక్రమం అంబేద్కర్ ఆడిటోరియంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎటువంటి ప్రలోభాలకు ఓటర్లు లొంగకుండా నిజాయితీగా ఎవరు మేలు చేస్తారో గుర్తించి వారికి ఓటు వేయాలన్నారు. పండగ సమయాల్లో ఎంత ఉత్సాహంగా ఉంటామో ఓటు హక్కు వినియోగంలోనూ అలాంటి ఉత్సాహాన్ని ప్రదర్శించి ఓటుహక్కును వినియోగించుకోవాలన్నారు. జాయింట్ కలెక్టర్ జి.వీరపాండ్యన్ మాట్లాడుతూ ఎన్నికల వ్యవస్థ దేశంలో బలంగా ఉంద ని, ఓటు హక్కు ద్వారా పాలనలో మార్పు తీసుకురావచ్చన్నారు. అంతకు ముందు పట్టణంలోని వైఎస్ఆర్ కూడలిలో ఓటరు అవగాహనపై కలెక్టర్ బెలూన్లను ఎగురవేసి ప్రతిజ్ఞ ఉన్న కరపత్రాన్ని ఆవిష్కరించారు. ర్యాలీ పాల కొండరోడ్డు మీదుగా అంబేద్కర్ ఆడిటోరియం వరకు నిర్వహించారు. ర్యాలీలో సాని వాడ చెక్క భజన కళాబృందం, జాతీయ నాయకులు, భారతమాత వేషధారణలో చిన్నారులు పాల్గొని ఆకట్టుకున్నారు. నృత్య శిక్షకుడు శివకుమార్ నేతృత్వంలో ఓటు అవగాహనపై నృత్య ప్రదర్శన చేశారు. వారిని కలెక్టర్ అభినందించారు. ఈ కార్యక్రమంలో ఏజేసీ ఎండీ హసన్ షరీఫ్, డీఆర్వో నూర్ భాషా ఖాసి మాట్లాడారు. ఆర్డీవో జి.గణేష్, మెప్మా పీడీ సత్యనారాయణ, రెడ్‌క్రాస్ చైర్మన్ పి.జగన్మోహనరావు, తహశీల్దార్ వీర్రాజు, పి.రమేష్, మున్సిపల్ కమిషనర్ బాపిరాజు తదితరులు పాల్గొన్నారు. -
రెడ్‌క్రాస్ సేవలు భేష్
కలెక్టర్ సౌరభ్‌గౌర్ శ్రీకాకుళం కల్చరల్, న్యూస్‌లైన్: జిల్లాలో రెడ్‌క్రాస్ సంస్థ సేవలు మరువలేనివని కలెక్టర్ సౌరభ్ గౌర్ అన్నారు. స్థానిక అంబేద్కర్ ఆడిటోరియంలో శుక్రవారం జరిగిన రె డ్‌క్రాస్ వార్షిక సమావేశంలో ఆయన మాట్లాడారు. పేదలకు ఆపదలో ఉన్న ఉన్నవారికీ సహాయ సహకారాలు అందించేందుకు ప్రజలకు రెడ్‌క్రాస్ ఉన్నదన్న భరోసా కలిగేలా తీర్చి దిద్దుతున్నామన్నారు. ఆరు వేల యూనిట్ల రక్తనిలువలు నేడు 15 వేల యూనిట్లుకు పెంచేందుకు సంస్థ చేస్తున్న కృషి అభినందనీయమన్నారు. అయితే కణవిభణనకుయూనిట్టు జిల్లా కు అవసరమని దీనికై ట్రైమెక్స్ సంస్థ, ఈస్టుకోస్టు ఎనర్జీ, నాగార్జున, అరబొందో వంటి పారిశ్రామిక సంస్థల సేవలు అవసరమని తెలిపారు. రెడ్‌క్రాస్ ద్వారా అనురాగ నిలయం పేరుతో దిక్కుమొక్కులేని వారికి, చిక్కోలు చిరుదివ్వెలు కార్యక్రమంలో భాగంగా పేద విద్యార్థినులకు ఉన్నత విద్య అందించేందుకు కృషి చేస్తున్నామన్నారు. జిల్లాలో 105 మత్స్యకార గ్రామాలను గుర్తించి ఇప్పటికే ఐస్ బాక్సులు తదితర పరికరాలు అందించామని తెలిపారు. ఈ సందర్భంగా రెడ్‌క్రాస్ నేత్ర సేకరణద్వారా నే త్రదానాలు అందుకున్న పలువురిని సంస్థ సభకు, కలెక్టర్‌కు పరిచయం చేశారు. అందులో మూడోతరగతి చదువుతున్న ఒక చిన్నారికి ఒక దాత ఇచ్చిన నేత్రాలను అమర్చడంతో కలెక్టర్ మాట్లాడారు. అనంతరం ఎస్పీ నవీన్ గులాఠీ మాట్లాడుతూ జిల్లాలో రెడ్‌క్రాస్‌కు తమ శాఖ సహాయ సహకారాలు ఎల్లప్పుడూ ఉంటాయన్నారు. ట్రైమెక్స్ ప్రతినిధి కోనేరు ప్రసాద్ మాట్లాడుతూ జిల్లాలో పేదవారికి విద్య, వైద్యం అందించేం దుకుగాను తమ వంతు సహాయ సహ కారాలు అందిస్తున్నానని తెలిపారు. కలెక్టర్ కృషి వల్ల ఈ ఏడాది జిల్లా రెడ్‌క్రాస్ రెండు బంగారు పతకాలకు ఎంపికైందని, ఫిబ్రవరిలో జరిగే సమావేశంలో గవర్నర్ చేతులమీదుగా వీటిని అందుకోనున్నట్లు రెడ్‌క్రాస్ ఛెర్మైన్ పి.జగన్మోహనరావు పేర్కొన్నారు. సేవా స్ఫూర్తిదాతలకు సత్కారం జిల్లాలో రెడ్‌క్రాస్ చేస్తున్న సేవలకు సహాయసహకారాలందించిన పలువురు అధికారులు, వైద్యులు, స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులకు కలెక్టర్ సత్కరించడం తోపాటు అవార్డులను అందించారు. రెడ్‌క్రాస్ రక్తకణాల నిధికి రూ.10 లక్షలు విరాళంగా ఇచ్చిన ఎన్ఆర్ఐ పి.సూర్యనరాయణ తరఫున మాజీ ఎమ్మెల్యే కేఎల్ఎన్ భుక్తకు కలెక్టర్ సత్కరించారు. అలాగే 24 మందితో రక్తదానం చేయించినందుకు ఆర్టీసీ ఒకటో డిపో మేనేజర్ బీఎల్పీ.రావుకు కలెక్టర్ రెడ్‌క్రాస్ అవార్డును కలెక్టర్ అందజేశారు. చిరుదివ్వెలుకు ప్రియాంక గౌర్ రూ.లక్ష విరాళం చిక్కోలు చిరుదివ్వెలకు కలెక్టర్ సతీమణి ప్రియాంక గౌర్ లక్ష రూపా యలు విరాళం అందచేశారు. శాంత అనురాగ నిలయంలో ఉంటున్న 11 మంది పేదవిద్యార్థులకు సంవత్స రానికి ఒక్కొక్కరికి రూ.20 వేలు చొప్పు న విరాళాన్ని అందించారు. రెడ్‌క్రాస్‌కు మత్స్యకార శాఖా డీడీ రూ.50 వేలు, డాక్టర్ దానేటి శ్రీధర్ రూ.20 వేలు విరాళంగా అందిం చారు. చిక్కోలు చిరు దివ్వెలకు అరవల్లి ట్రస్టు బోర్డు మాజీ సభ్యు డు టీఏ.సూర్య నారాయణ రూ.20 వేలు విరాళంగా అందించారు. కార్య క్రమంలో డీఆర్డీఏ పీడీ రజనికాంతరావు, సెట్‌శ్రీ సీఈవో మూర్తి, పాలకొండ ఆర్టీవో తేజ్ భరత్, మెప్మా పీడీ మునుకోటిసత్యనారాయణ, ఈస్టుకోస్టుజనరల్ మేనేజర్ రాజు తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమంలో ఎన్సీఎస్ స్కూల్ విద్యార్థులు రెడ్‌క్రాస్ సేవలపై ప్రదర్శించిన నృత్యాలు ఆకట్టుకున్నాయి.