
బెజవాడ స్వరాజ్ మైదానంలో నిర్మిస్తున్న అంబేడ్కర్ స్మృతి వనం పనులు తుది దశకు చేరుకున్నాయి. విజయవాడ నగరానికే సెంటరాఫ్ అట్రాక్షన్‌గా 125 అడుగుల భారీ అంబేడ్కర్ విగ్రహం నిలవనుంది.

నవంబర్ 26న రాజ్యాంగ దినోత్సవం రోజున డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విగ్రహాన్ని సీఎం వైఎస్ జగన్ చేతుల మీదుగా జాతికి అంకితం చేసే విధంగా పనులు నిర్వహిస్తున్నారు.

ఢిల్లీ నుంచి వచ్చిన డిజైనర్లు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా, నాణ్యతా ప్రమాణాలు పాటిస్తూ పనులు చేస్తున్నారు.

విగ్రహం బేస్ కింది భాగంలో గ్రౌండ్, ఫస్ట్, సెకండ్ ఫ్లోర్‌లు ఉంటాయి

గ్రౌండ్ ఫ్లోర్‌లో నాలుగు హాళ్లు ఉంటాయి. ఒక్కో హాలు 4,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉంటుంది. ఇందులో ఓ సినిమా హాలు, మిగిలిన మూడు హాళ్లలో ఆయన చరిత్ర తెలిపే డిజిటల్ మ్యూజియం ఉంటుంది

ఫస్ట్ ఫోర్‌లో 2,250చదరపు అడుగుల విస్తీర్ణం కలిగిన నాలుగు హాళ్లు ఉంటాయి. ఒక హాలులో అంబేడ్కర్‌కు దక్షిణ భారత దేశంతో ఉన్న అనుబంధాన్ని డిస్‌ప్లే చేస్తారు

సెకండ్ ఫ్లోర్‌లో 1000 చదరపు అడుగుల విస్తీర్ణంలో నాలుగు హాళ్లు ఉంటాయి

అంబేడ్కర్ విగ్రహం ఎత్తు: 125 అడుగులు

విగ్రహం తయారీని షూ దగ్గర నుంచి బెల్ట్ వరకు హనుమాన్ జంక్షన్ వద్ద శిల్పి ప్రసాద్ ఆధ్వర్యంలో కాస్టింగ్ చేశారు





