Dr B R Ambedkar
-
మరణంలేని మహనీయుడు అంబేద్కర్: సీఎం జగన్
-
పూర్తయిన ప్రపంచంలోనే అతిపెద్ద అంబేడ్కర్ విగ్రహం
-
విజయవాడ అంబేద్కర్ విగ్రహం.. ఎన్నో విశేషాలు (ఫొటోలు)
-
విజయవాడలో ఆకాశమంత అంబేద్కర్ విగ్రహం...ప్రత్యేకతలు ఇవే (ఫొటోలు)
-
జాతి గర్వించేలా.. జగమంతా కనిపించేలా..
నాడు తలదించి నడిచిన బడుగు, బలహీన, అణగారిన వర్గాలు నిలువెత్తు ‘స్ఫూర్తి’ ఎదుట తలెత్తి చూసే కలను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సాకారం చేయబోతున్నారు. బెజవాడ నడిబొడ్డున ఓ చేతిలో రాజ్యాంగాన్ని పట్టుకొని, మరో చేయి చూపుడు వేలితో గొప్ప ఆత్మవిశ్వాసంతో కనిపిస్తున్న ఆకాశమంత ‘ఆదర్శం’ రాష్ట్రానికే తలమానికంగా రూపుదిద్దుకుంటోంది. ఎన్నో చారిత్రక ఘట్టాలకు వేదికై న బెజవాడ స్వరాజ్ మైదానంలో 125 అడుగుల భారీ బాబా సాహెబ్ అంబేడ్కర్ విగ్రహం కొలువుదీరింది. ప్రపంచ స్థాయి పర్యాటకులను సైతం ఆకర్షించే విధంగా స్మృతి వనం ముస్తాబవుతోంది. సాక్షి ప్రతినిధి, విజయవాడ: బెజవాడ స్వరాజ్ మైదానంలో నిర్మిస్తున్న అంబేడ్కర్ స్మృతి వనం పనులు తుది దశకు చేరుకున్నాయి. విజయవాడ నగరానికే సెంటరాఫ్ అట్రాక్షన్‌గా 125 అడుగుల భారీ అంబేడ్కర్ విగ్రహం నిలవనుంది. 18.18 ఎకరాల్లో దాదాపు రూ.400 కోట్లతో పనులు చేపట్టారు. నవంబర్ 26న రాజ్యాంగ దినోత్సవం రోజున డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విగ్రహాన్ని సీఎం వైఎస్ జగన్ చేతుల మీదుగా జాతికి అంకితం చేసే విధంగా పనులు నిర్వహిస్తున్నారు. సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మేరుగ నాగార్జున చైర్మన్‌గా 8 మంది మంత్రులతో ప్రభుత్వం సబ్ కమిటీని ఏర్పాటు చేసింది. క్షేత్ర స్థాయిలో పర్యటిస్తూ ఎప్పటికప్పుడు పనుల ప్రగతిని కమిటీ సమీక్షిస్తోంది. మున్సిపల్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శ్రీలక్ష్మి ఈ ప్రాజెక్టు పనులు స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. అత్యాధునిక సాంకేతికతతో.. ఢిల్లీ నుంచి వచ్చిన డిజైనర్లు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా, నాణ్యతా ప్రమాణాలు పాటిస్తూ పనులు చేస్తున్నారు. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ జీవిత చరిత్ర తెలిపే (డిజిటల్) మ్యూజియం, మిని థియేటర్లు, ఫుడ్‌కోర్టు, కన్వెన్షన్ సెంటర్, వెహికల్ పార్కింగ్ ఉన్నాయి. కన్వెన్షన్ సెంటర్‌ను 1500 మంది సీటింగ్ సామర్థ్యంతో నిర్మిస్తున్నారు. ఫుడ్‌కోర్టు 8,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉంది. బిల్డింగ్ చుట్టూ నీటి కొలను, మ్యూజికల్, వాటర్ ఫౌంటేన్ ఉన్నాయి. నీటి కొలనుకు లైటింగ్, బబ్లింగ్ సిస్టం ఉన్నాయి. అంబేడ్కర్ జీవిత చరిత్ర తెలుపుతూ 38 ఘట్టాలను ప్రదర్శించేలా ఆర్ట్ వర్క్ ఏర్పాటు చేస్తున్నారు. అంబేడ్కర్ జీవితంలో బాల్యం, విద్య, వివాహం, ఉద్యోగం, రాజకీయ జీవితం, పోరాటాలు, రాజ్యంగ నిర్మాణ సమయంలోని ఛాయాచిత్రాలు, వస్తువులను ప్రదర్శించేలా మ్యూజియం ఏర్పాటవుతోంది. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా మనం ఏదైనా ప్రశ్న అడిగితే, ఆయనే స్వయంగా సమాధానం ఇచ్చేలా వీడియో సిస్టం ఏర్పాటు చేస్తున్నారు. విగ్రహం తయారీని షూ దగ్గర నుంచి బెల్ట్ వరకు హనుమాన్ జంక్షన్‌్ వద్ద శిల్పి ప్రసాద్ ఆధ్వర్యంలో కాస్టింగ్ చేశారు. స్థానిక కూలీలతో పాటు, ఢిల్లీ, బీహర్, రాజస్థాన్ నుంచి వచ్చిన కూలీలు, ఏడాదిన్నరకు పైగా పనిచేశారు. ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి మూడు ఫ్లోర్లుగా భవనం.. విగ్రహం బేస్ కింది భాగంలో గ్రౌండ్, ఫస్ట్, సెకండ్ ఫ్లోర్లు ఉంటాయి. ► గ్రౌండ్ ఫ్లోర్లో నాలుగు హాళ్లు ఉంటాయి. ఒక్కో హాలు 4,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉంటుంది. ఇందులో ఓ సినిమా హాలు, మిగిలిన మూడు హాళ్లలో ఆయన చరిత్ర తెలిపే డిజిటల్ మ్యూజియం ఉంటుంది. ► ఫస్ట్ ఫోర్లో 2,250చదరపు అడుగుల విస్తీర్ణం కలిగిన నాలుగు హాళ్లు ఉంటాయి. ఒక హాలులో అంబేడ్కర్‌కు దక్షిణ భారత దేశంతో ఉన్న అనుబంధాన్ని డిస్ప్లే చేస్తారు. ► సెకండ్ ఫ్లోర్లో 1000 చదరపు అడుగుల విస్తీర్ణంలో నాలుగు హాళ్లు ఉంటాయి. ప్రాంగణం చుట్టూ సైక్లింగ్ ట్రాక్.. స్మృతి వనం చుట్టూ రూ.4 కోట్ల వ్యయంతో 2.7 కి.మీ మేర ప్రత్యేకమైన రోడ్లు అభివృద్ధి చేయనున్నారు. దీని పొడవునా గ్రీనరీ, పాత్‌వేస్, సైక్లింగ్ ట్రాక్, ఫుడ్ స్ట్రీట్ వంటివి ఏర్పాటు చేయనున్నామన్నారు. ఉదయం సాయంత్రం వేళల్లో ఈ మార్గంలో వాకింగ్, జాగింగ్ వంటివి చేసుకునే వెసులుబాటును కల్పించనున్నారు. ఇది స్మృతి వనం స్వరూపం.. ► అంబేడ్కర్ విగ్రహం ఎత్తు: 125 అడుగులు ► కింద బేస్(పెడస్టల్ ఎత్తు): 81 అడుగులు ► పెడస్టల్ పరిమాణం: 3,481 చదరపు అడుగులు ►పెడస్టల్‌తో కలిపి విగ్రహం మొత్తం ఎత్తు: 206 అడుగులు ► నిర్మించే గదులు: జీ ప్లస్ టు ►విగ్రహానికి వాడిన బ్రాంజ్: 112 మెట్రిక్ టన్నులు ► విగ్రహం నిర్మాణం లోపల (అర్మేచర్)కు వాడిన స్టీలు: 352 మెట్రిక్ టన్నులు ► మొదటి దశలో మంజూరైన నిధులు: రూ.268.46 కోట్లు ► రెండో దశలో మంజూరైన నిధులు: రూ.106.64 కోట్లు ► పనులు ప్రారంభం: 2022 మార్చి 21 జగనన్న నిర్ణయం చారిత్రాత్మకం అంబేడ్కర్ స్మృతి వనం నిర్మాణం గొప్ప కార్యక్రమం. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి తీసుకున్న ఈ నిర్ణయం చారిత్రాత్మకం. గత టీడీపీ ప్రభుత్వంలో అంబేడ్కర్ విగ్రహం నిర్మించేందుకు సరైన స్థలం కూడా చంద్రబాబు ఇవ్వలేదు. విజయవాడ నడిబొడ్డున అత్యంత ఖరీదైన స్థలాన్ని మన సీఎం కేటాయించారు. – మేరుగ నాగార్జున, సాంఘిక, సంక్షేమ శాఖ మంత్రి ప్రాంగణమంతా పచ్చందాలు.. స్వరాజ్ మైదానంలో 125 అడుగుల విగ్రహ నిర్మాణం పూర్తయింది. మిగిలిన స్మృతి వనం పనులు తుది దశకు చేరాయి. కారిడార్ మొత్తం గ్రానైట్ ఫుట్‌పాత్, ల్యాండ్ చేస్తున్నాం. ఈ ప్రాంగణంలో అందమైన మొక్కలతో ప్లాంటేషన్ చేసే విధంగా చర్యలు తీసుకొంటున్నాం. – స్వప్నిల్ దినకర్ పుండ్కర్, మున్సిపల్ కమిషనర్, విజయవాడ -
కాఫీ పొడితో అంబేడ్కర్ అద్భుత చిత్రం
గాజువాక: రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ చిత్రాన్ని కాఫీపొడితో తయారు చేసి ఆయన పట్ల తన అభిమానాన్ని చాటుకున్నారు విశాఖపట్నం దత్తసాయినగర్‌కు చెంది న నాయన సురేష్. గాజువాక ప్రాంతంలోని ఒక ప్రైవేట్ పాఠశాలలో డ్రాయింగ్ టీచర్‌గా పనిచేస్తున్న సురేష్ తీరిక సమయంలో వరిగడ్డి, చీపురు పుల్లలు, కాగితాలతో కళాఖండాలు రూపొందిస్తుంటారు. అంబేడ్కర్ జయంతిని పురస్కరించుకుని తాజాగా కాఫీపొడితో చిత్రాన్ని రూపుదిద్దారు. దీని రూపకల్పనకు రెండు గంటలు పట్టినట్లు సురేష్ తెలిపారు. -
అంబేడ్కర్ ఆశయాలకు బాబు తూట్లు
-
అంబేడ్కర్ ఆశయాలకు బాబు తూట్లు
హైదరాబాద్: అంబేడ్కర్ జయంతి వేడుకలను వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. సమసమాజ స్థాపనకు అంబేడ్కర్ నిర్ధేశించిన మార్గంలో ప్రతి ఒక్కరు నడవాలని, రాజ్యాంగాన్ని రక్షించుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందని ఎంపీలు మేకపాటి రాజమోహన్‌రెడ్డి, బుట్టా రేణుక అన్నారు. చంద్రబాబు అంబేడ్కర్ ఆశయాలకు తూట్లు పొడుస్తున్నాడని, కేవలం విగ్రహాలు పెట్టి జయంతులు నిర్వహించినంత మాత్రాన ఆయన ఆశయాలు పాటించినట్లు కాదని మేరుగ నాగార్జున అన్నారు. దివంగత వైఎస్సార్ హయాంలో అన్ని వర్గాల వారికి మేలు జరిగేలా అంబేడ్కర్ ఆశయ సాధనకు కృషి జరిగిందని ఆయన గుర్తుచేశారు. రానున్న రోజుల్లో అంబేడ్కర్ ఆశయాలను నెరవేర్చడం కోసం వైఎస్సార్సీపీ కట్టబడి ఉంటుందని మేరుగ అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీలు మేకపాటి, బుట్టా రేణుక, బొత్స సత్యనారాయణ, పార్థసారథి, మేరుగ నాగార్జున , సజ్జల రామకృష్ణారెడ్డి, కొండా రాఘవరెడ్డి, పలువురు సీనియర్ నేతలు పాల్గొన్నారు. -
నేతల్లారా...సమస్యలివిగో..
కరీంనగర్ : తరతరాలుగా అణిచివేతకు గురవుతూ.. సామాజిక న్యాయూనికి దూరమవుతున్న దళితుల సంక్షేమం భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్.అంబేద్కర్ ఎంతగానో తపిం చారు. అణగారిన వర్గాలకు ఆసరాగా ఉండేం దుకు రాజ్యంగంలో హక్కులు కల్పించాడు. ఇది జరిగి ఆరున్నర దశాబ్దాలు అవుతున్నా ఆ ఫలాలు మాత్రం దళిత వర్గాలకు అందడం లేదు. మహానేతల జయంతి, వర్ధంతి రోజుల్లో తప్పితే దళితుల గురించి పట్టని పాలకులు ఆ వర్గాల సంక్షేమాన్ని పూర్తిగా విస్మరించారనే ఆరోపణలున్నారుు. ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ తెచ్చామని ఓవైపు గొప్పలు చెప్పుకుంటూనే.. మరోవైపు ఆ నిధులను పక్కదారి పట్టించి ఎక్కడి సమస్యలను అక్కడే వదిలేశారు. ఫలితంగా దశాబ్దాలుగా పేరుకుపోయిన సమస్యలు పరిష్కారానికి నోచుకోవడం లేదు. మంగళవారం అంబేద్కర్ జయంతి. తమ సమస్యలపై ప్రజాప్రతినిధులను, అధికారులను ప్రశ్నించేందుకు దళితులు సిద్ధమయ్యూరు. ఈ సందర్భంగా జిల్లాలో దళితులు ఎదుర్కొంటున్న సమస్యలపై ప్రత్యేక కథనం. నత్తనడకన భూ పంపిణీ పథకం ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన భూపంపిణీ పథకం ఒక అడుగు ముందుకు... రెండడుగులు వెనక్కి అన్న చందంగా తయారైంది. వెయ్యి ఎకరాలను కోనుగోలు చేసి దళితులకు పంపిణీ చేయాలని లక్ష్యం పెట్టుకోగా ఇప్పటివరకు 58 మంది లబ్దిదారులకు 155 ఎకరాల భూమిని పంపిణీ చేశారు. జిల్లాలో 33 మండలాల నుంచి ఇంతవరకు భూమి కోనుగోలు ప్రతిపాదనలే అధికారులకు రాకపోవడం గమనార్హం. అందని రుణాలు.. ఇబ్బందుల్లో నిరుద్యోగులు గత ప్రభుత్వ హయూంలో స్వయం ఉపాధి కోసం దరఖాస్తులు పెట్టుకున్న నిరుద్యోగుల ఆశలు కలలుగానే మిగిలాయి. ఈ సంవత్సరానికి ఎస్సీ కార్పొరేషన్ ఉపాధి అవకాశాలను పది శాతానికి తగ్గించింది. 2013-14 సంవత్సరానికి 3,175 యూనిట్లకు రూ.32.15 కోట్లు ప్రభుత్వం కేటాయించింది. ఇందులో 2818 మంది యుతకు రూ.25.30 కోట్ల సబ్సిడీ మంజూరు చేసింది. బ్యాంకర్లు రుణాలు ఇచ్చేందుకు ముందుకు రాకపోవడంతో 357 మందికి మంజూరు కాలేదు. మంజూరైన యూనిట్లలో 2249 మందికి సబ్సిడీ విడుదల చేశారు. మూతపడ్డ అంబేద్కర్ స్టడీసర్కిల్ దళిత విద్యార్థులకు వివిధ పోటీ పరీక్షలకు ఉపయోగపడేలా జిల్లా కేంద్రంలో నెలకొల్పిన అంబేద్కర్ స్టడీసర్కిల్ మూతపడింది. స్టడీసర్కిల్ రెండేళ్లు కూడా నడువకుండానే నిధులు లేవనే సాకుతో అధికారులు మూసివేశారు. దీంతో గత ఏడు సంవత్సరాలుగా వివిధ పోటీ పరీక్షలకు శిక్షణ పొందాలనుకునే దళిత విద్యార్థులు ఆశలు అడియాశలుగానే మారాయి. స్టడీసర్కిల్ ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు సందర్శించడానికి మాత్రమే పరిమితమైంది. తెగని లీడ్‌క్యాప్ లొల్లి చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న హయూం లో మలుపు పథకం ద్వారా లీడ్‌క్యాప్ పరిశ్రమను పెట్టి నిరుద్యోగ దళిత యువతకు, చర్మకారులకు ఉపాధి చూపిస్తామని ప్రకటించారు. ఇందుకోసం చొప్పదండి మండలం రుక్మాపూర్‌లో సర్వే నెంబర్ 513, 514, 516లో 135 ఎకరాల స్థలాన్ని కేటాయించారు. ఈ స్థలాన్ని నాలుగేళ్ల క్రితం పోలీస్ బెటాలియన్‌కు కేటాయిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీంతో లీడ్‌క్యాప్ లొల్లి హైదరాబాద్ దాకా చేరి నేటికీ తెగని పంచారుుతీగా మిగిలిపోరుుంది. జిల్లాలో మినీ లెదర్‌పార్కుల కోసం జమ్మికుంటలో 25 ఎకరాలు, రామగుండం మండలంలో 25 ఎకరాలు కేటాయించి నేటికీ నిధులు కేటాయించకుండా చుట్టూ ఫెన్సింగ్ సైతం ఏర్పాటు చేయకుండా ప్రభుత్వం చేతులెత్తేసింది. ఈ విషయంలో ఎమ్మార్పీఎస్ అధినేత మందకృష్ణ నాటి సీఎం చంద్రబాబు నుంచి మొన్నటి వరకు ఉన్న కిరణ్‌కుమార్‌రెడ్డితో చర్చించినా ఫలితం లేకపోరుుంది. అనర్హులకు పట్టాలు... అర్హులకు మొండిచేయి ఇరవై ఏళ్ల క్రితం ఎల్ఎండీలో ముంపుకు గురైన హస్నాపూర్ గ్రామ దళితులకు ఎస్సారెస్పీ భూమిని నివేశన స్థలాల కోసం కేటాయిస్తూ పట్టాలు ఇచ్చారు. పట్టాలు అందుకున్న వారిలో అనర్హులే చాలా మంది ఉన్నారు. నిజమైన అర్హులకు కొందరికి పట్టాలిచ్చినప్పటికీ హద్దులు చూపకోపవడంతో ఇప్పటికీ కలెక్టరేట్ చుట్టూ తిరుగుతూనే ఉన్నారు. అంబేద్కర్, బాబుజగ్జీవన్‌రాం జయంతి వేడుకల్లో వినతిపత్రాలు సమర్పించడమే కాకుండా కలెక్టరేట్ ముందు దీక్షలు చేపట్టినా స్థలాల సమస్య కొలిక్కి రాలేదు. కమ్యూనిటీ భవనం స్థలం కబ్జా కలెక్టరేట్‌కు కూతవేటు దూరంలో ఉన్న ప్రభుత్వ స్థలాన్ని అంబేద్కర్ భవన సముదాయానికి కేటాయిస్తూ అప్పటి కలెక్టర్ సుమితాడావ్రా హయంలో సర్వేనెంబర్ 11404/22లో 19 గుంటలకు పత్రాలు అందజేశారు. సదరు స్థలం తమదేనంటూ ఇతరులు అక్రమణ నిర్మాణాలకు పూనుకున్నారు. ఈ గొడవ పదేళ్లుగా దళిత సంఘాల నేతలకు, భూ అక్రమణదారులకు మధ్య రగులుతూనే ఉంది. ఆరు గుంటలు హాంఫట్ కోర్టు చౌరస్తా వద్ద ఎస్సీ వెల్ఫేర్ అసోసియేషన్ భవనం కోసం అప్పటి కలెక్టర్ 1986లో ఆరు గుంటల స్థలాన్ని కేటాయించి పట్టా కాగితాలు దళిత సంఘ నాయకులకు అందజేశారు. కానీ కొందరు ఎరుకుల కులస్థులు ఆ భూమి తమదేని గుడిసెలు వేసుకున్నారు. పదిహేనేళ్లుగా ఈ స్థలం సమస్యను ఎటూ తేల్చకపోవడం అధికారుల తీరుకు అద్దం పడుతోంది. తేలని సరిహద్దు వివాదాలు... ఎస్సీ కార్పొరేషన్ నుంచి భూమి కొనుగోలు పథకం కింద జిల్లాలో నిరుపేద దళితులకు భూములు కేటాయించిన ప్రభుత్వం పట్టా కాగితాలు ఇవ్వడంలో అలసత్వం వహిస్తోంది. హుస్నాబాద్ మండలం అక్కన్నపేటలో దళితులకు భూమి కేటాయించి పట్టా కాగితాలు ఇచ్చింది. అక్కన్నపేట సరిహద్దు గ్రామాలైన వరంగల్ జిల్లా ప్రజలు ఆ భూమి తమదని గొడవలకు దిగుతున్నారు. గొడవ తారాస్థారుుకి చేరడంతో రెండు జిల్లాల కలెక్టర్లు, డీఆర్ఓలు, కొలతల అధికారులు స్పందించి భూముల వివరాలు సేకరించినానేటికీ సరిహద్దు సమస్య అలాగే ఉంది. మంథని నియోజకవర్గంలోని ధన్వాడ, మహదేవపూర్ మండలం పెద్దంపేట, లెంకలగడ్డ, కాటారం మండలం అంకుషాపూర్, చింతకానీ, ఈరాపూర్, పోతుల వాయి, ఇబ్రహీంపేట, మహాముత్తారం, మల్హర్ మండలాల్లో వందలాది ఎకరాల భూములు ఎస్సీలకు భూమి కోనుగోలు కింద పట్టాలు ఇచ్చారు. వాటికి నేటికి హద్దులు చూపలేదు. అందని వివాహ ప్రోత్సాహకాలు ఎస్సీలను ఇతర కులాల వారు వివాహమాడితే అందించాల్సిన వివాహ ప్రోత్సాహక పారితోషికాలు అందించడంలో సైతం జాప్యం జరుగుతోంది. పారితోషకం కోసం 212 జంటలు నాలుగేళ్లుగా ఎదురుచూస్తున్నారుు. జిల్లాలో ఎస్సీ సంక్షేమ హాస్టళ్లు వంద ఉండగా, అందులో 65కు మాత్రమే పక్కా భవనాలున్నారుు. మిగిలిన హాస్టళ్లు అరకొర వసతులు మధ్య అద్దె భవనాల్లో కొనసాగుతున్నారుు. తేలని అట్రాసిటీ నూతన కమిటీ దళితుల సమస్యల పరిష్కారం కోసం ప్రతి మూడు నెలలకోసారి జరగాల్సిన ఎస్సీ, ఎస్టీ మానిటరింగ్ అండ్ విజిలెన్స్ కమిటీ సమావేశం తూతుమంత్రంగా సాగుతూ వినతులు ఇవ్వడానికే పరిమితమవుతోంది. మూడేళ్ల క్రితం అప్పటి మంత్రి నూతన కమిటీ వేయాలని అధికారులకు సూచించగా కమిటీ ఎంపిక కోసం దరఖాస్తులు స్వీకరించి నాలుగేళ్లు గడుస్తున్నా నేటికి నూతన కమిటీ ఎంపిక ప్రక్రియ అతీగతీ లేకుండా పోయింది. బాధ్యతాయుతమైన కమిటీ సమావేశాలు సైతం సక్రమంగా నిర్వహించకపోవడమే కాకుండా కీలకమైన నిర్ణయాలు తీసుకోనే ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కమిటీ సభ్యులు అధికారులకు, నేతలకు దాసోహమై సొంత పనులకు ప్రాధాన్యత ఇస్తున్నారని దళితుల నుంచి నిరసన వ్యక్తమవుతోంది. విగ్రహాలకు తొలగని ముసుగులు బీఆర్.అంబేద్కర్, బాబుజగ్జీవన్‌రాం విగ్రహాలను ఆయా కుల సంఘాలు, దళిత సంఘాల నాయకులు ఏర్పాటు చేసుకున్నారు. నిధుల లేమితో జిల్లాలో దాదాపు 60పైగా విగ్రహాలు ముసుగులు తొడిగే ఉన్నాయి. అధికారిక కార్యక్రమాల్లో పాల్గొంటున్న నాయకులు, అధికారులు ముసుగేసిన అంబేద్కర్ విగ్రహాలను చూస్తున్నారే తప్ప నిధులు కేటాయించి ముసుగులు తొలగించిన దాఖాలాలు లేవు. -
అంబేద్కర్ వర్సిటీకి సీఎస్ఆర్ అవార్డు
బంజారాహిల్స్, న్యూస్‌లైన్: దూరవిద్య లో విద్యార్థులకు నాణ్యమైన బోధన అందజేస్తున్నందుకు గుర్తింపుగా డా. బి.ఆర్. అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయానికి 2014 సంవత్సరానికి కాంపిటీషన్ సక్సెస్ రివ్యూ (సీఎస్ఆర్)మ్యాగజైన్ ఏటా కేటాయించే ‘సీఎస్ఆర్ టాప్ డిస్టెన్స్ లెర్నింగ్ ఇనిస్టిటూట్స్ ఆఫ్ ఇండియా అవార్డు’ను మంగళవారం న్యూఢిల్లీలో ప్రకటించింది. భారతదేశంలో దూరవిద్యను అందిస్తున్న వివిధ విశ్వవిద్యాలయాలలో అంబేద్కర్ యూనివర్సిటీ ప్రథమస్థానంలో నిలిచిందని నిర్వాహకులు వెల్లడించారు. దేశంలోనే ఈ విశ్వవిద్యాలయంలో బీయస్సీ డిగ్రీ విద్యాబోధన అత్యుత్తమ స్థాయిలో నిలిచిందని 2011లో అవుట్‌లుక్ మ్యాగజైన్ గుర్తించిందని విశ్వవిద్యాలయ వర్గాలు తెలిపాయి. అంతేకాకుండా 2012లో దూరవిద్య కేటగిరిలో ఇండస్ ఫౌండేషన్ అవార్డు ఫర్ ఎడ్యుకేషన్ ఎక్స్‌లెన్స్ అనే అవార్డు కూడా సొంతం చేసుకున్నట్లు వెల్లడించారు. -
మానవ హక్కులపై అవగాహన అవసరం
బళ్లారి అర్బన్, న్యూస్‌లైన్ : రాజ్యాగం ప్రసాదించిన ప్రాథమిక హక్కులు, వ్యక్తిగత హక్కులు, వాక్ స్వాతంత్య్ర మౌలిక సూత్రాలపై ప్రతి ఒక్కరూ అవగాహన పెంచుకోవాలని సీనియర్ న్యాయవాది, బళ్లారి న్యాయవాదుల సంఘం జిల్లాధ్యక్షుడు పాటిల్ సిద్దారెడ్డి అన్నారు. శుక్రవారం రాత్రి స్థానిక బుడా కాంప్లెక్స్‌లోని మానవ హక్కుల జాగృతి కార్యాలయాన్ని ఆ సంఘం రాష్ట్రధ్యక్షులు సమేతనహళ్లి లక్ష్మణసింగ్ ప్రారంభించిన అనంతరం ఆయన మా ట్లాడారు. భారతదేశంలో డాక్టర్ బీఆర్.అంబేద్కర్, రష్యాలో స్టాలిన్, అమెరికాలో అబ్రహాం లింకన్ తదితరులు రాజ్యాంగంలో వివిధ హక్కులను పొం దుపరిచారన్నారు. ప్రజాస్వామ్యంలో హక్కులను అందరూ పొందే అవకాశం ఉందన్నారు. ఇది ఎట్టి పరిస్థితుల్లో మరవరాదన్నారు. రాజ్యాంగం ప్రకారం ఖైదీలు, నేరస్తులకు ఇలా ప్రతి ఒక్కరికీ హక్కులు ఉన్నాయన్నారు. వీటిని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అంతకు ముందు మానవ హక్కుల జాగృతి సమితి రాష్ట్ర అధ్యక్షుడు సమేతనహళ్లి లక్ష్మణసింగ్ మాట్లాడుతూ 2011 నవంబర్ 1న రాష్ట్ర మానవ హక్కుల సమితిని వ్యవస్థాపకుడు డాక్టర్ ఆనంద్‌కుమార్, గౌరవాధ్యక్షుడు సుభాష్ భరణి నేతృత్వంలో ప్రారంభించామన్నారు. ప్రస్తుతం ప్రజలు అనేక సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నారన్నారు. ప్రజల్లో మానవ హక్కులపై చైతన్యం కల్పించేం దుకు రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో జాగృతి కార్యక్రమాలు చేపడుతున్నట్లు తెలిపారు. అందుకు ప్రభుత్వంతో పాటు సంఘ సంస్థలు ఎప్పటికప్పుడు తమకు సహకారం అందించాలని కోరారు. కార్యక్రమంలో మానవహక్కుల జాగృతి సమితి రాష్ట్ర ఉపాధ్యక్షులు జీ.శ్రీనివాస్, పదాధికారులు చాంద్, నాగరాజు గౌళి, కళమళ్లి వెంకటేష్, శంకర్, జిల్లాధ్యక్షులు లోకేష్, కార్యదర్శి శశిధర్, సహకార్యదర్శి ఎస్.శ్యాంప్రసాద్, జంటి కార్యదర్శి కేధర్నాథ్, జిల్లా మహిళా అధ్యక్షులు గౌసియా, కొప్పళ సమితి రాజాసాబ్ తదితరులు పాల్గొన్నారు. -
నేడు అంబేద్కర్ మహాపరినిర్వాణ్
సాక్షి, ముంబై: రాజ్యాంగశిల్పి డాక్టర్ అంబేద్కర్ మహాపరినిర్వాణ్కు సంబంధించి నగరపాలక సంస్థ (బీఎంసీ) సకల ఏర్పాట్లు చేసింది. అంబేద్కర్‌కు నివాళులర్పించేందుకు రాష్ర్టంలోని అన్నిప్రాంతాలకు చెందిన ఆయన అభిమానులు శుక్రవారం దాదర్‌లోని చైత్యభూమికి తరలిరానున్నారు. ఈ నేపథ్యంలో వారు అసౌకర్యానికి గురికాకుండా అక్కడికి సమీపంలోని శివాజీ పార్కును అన్నివిధాలుగా సిద్ధం చేసింది. అదేవిధంగా పెద్దసంఖ్యలో తరలిరానున్న భీం సైనికులకు పూర్తిస్థాయిలో భద్రత కల్పించేందుకు నగర పోలీసుశాఖ కూడా అన్ని ఏర్పాట్లుచేసింది. ఎటువ ంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా అదనపు బలగాలను మోహరించింది. అక్కడక్కడా సీసీటీవీ కెమెరాలను సైతం అమర్చింది. ఇదిలాఉంచితే లక్షలాదిగా తరలిరానున్న ప్రజలకు బీఎంసీ పరిపాలనా విభాగం సకల సదుపాయాలు కల్పిం చింది. వారికోసం సమీపంలోని సముద్ర తీరంవద్ద తాత్కాలిక స్నానాల గదులు, సంచార మరుగుదొడ్లను ఏర్పాటు చేసింది. అన్నదానం, అల్పాహారాలను పంపిణీచేసే స్వయం సేవాసంస్థల సౌకర్యార్థం అక్కడక్కడా ప్రత్యేక వేదికల్ని ఏర్పాటు చేసింది. తాగునీరు, వైద్య సేవలు అందించేందుకు సంబంధించి ఏర్పాట్లు చేసింది. అక్కడికి చేరుకున్నవారు చలి బారినపడకుండా శివాజీపార్కు మైదానంలో టెంట్లతోపాటు వాటిచుట్టూ పరదాలు ఏర్పాటు చేసింది. వంట చేసుకునే వారికి మైదానంలో ప్రత్యేకంగా కొంత స్థలాన్ని కేటాయించింది. మైదానంలో విద్యుద్దీపాలు, ఫ్లడ్లైట్లను అమర్చింది. ఎవరైనా పొరపాటున తప్పిపోతే వివరాలను వెల్లడించేం దుకు మైక్‌సెట్‌ను అందుబాటులో ఉంచింది. దీంతోపాటు అంబులెన్స్‌లు, అగ్నిమాపక వాహనాలు తదితర సదుపాయాలు సమకూర్చింది. అంబేద్కర్ ఫొటోలు, విగ్రహాలు, క్యాలెం డర్లు, క్యాప్‌లు, బ్యాడ్జీలు, లాకెట్లు, ఆయన జీవితచరిత్ర పుస్తకాలు తదితరాలను విక్రయించేందుకు అవసరమైన స్టాళ్లకు స్థలం సమకూర్చింది. చకచకా బ్యానర్ల తొలగింపు మహాపరినిర్వాణ్ దినోత్సవం సందర్భంగా భారీగా తరలివచ్చే భీం సైనికులకు స్వాగతం పలికేందుకు వివిధ రాజకీయ పార్టీలు పోటాపోటీగా నగరంలో పెద్దసంఖ్యలో బ్యానర్లను ఏర్పాటు చేశాయి. దాదర్ రైల్వేస్టేషన్ నుంచి చైత్యభూమి మార్గంలోని వచ్చే రహదారులపై ఎక్కడచూసినా ఇవే దర్శనమిచ్చాయి. వీటిని వెంటనే తొలగించాలంటూ బీఎంసీ అదనపు కమిషనర్ మోహన్ అడ్తాని పరిపాలన విభాగానికి ఆదేశాలు జారీ చేశారు. దీంతో రంగంలోకి దిగిన బీఎంసీ సిబ్బంది యుద్ధప్రాతిపదికన వాటిని తొలగించారు. భారీ పోలీసు బందోబస్త్తు లక్షలాదిగా తరలివచ్చే భీంసైనికులకు రక్షణ కల్పించేందుకు నగర పోలీసు శాఖ నడుం బిగించింది. ముగ్గురు డిప్యూటీ కమిషనర్లు, ఇద్దరు అసిస్టెంట్ పోలీసు కమిషనర్లు, 34 మంది ఇన్స్పెక్టర్లు, 39 మంది సబ్ ఇన్స్పెక్టర్లు, 533 కానిస్టేబుళ్లు, 44 మహిళా కానిస్టేబుళ్లు, ఎస్ఆర్పీఎఫ్ నాలుగు బెటాలియన్లు, రెండు బాంబు నిర్వీర్య బృందాలు, మఫ్టీలో వంద మంది పోలీసు అధికారులు విధులు నిర్వహిస్తారు. అక్కడక్కడా తాత్కాలిక వాచ్ టవర్లను ఏర్పాటుచేశారు. ఈవ్‌టీజింగ్‌లకు పాల్పడే ఆకతాయిలతోపాటు చిల్లర దొంగలపై నిఘా వేసేందుకు ప్రత్యేకంగా కొందరు పోలీసు అధికారులను నియమించారు. కొన్నిప్రాంతాల్లో మద్యం విక్రయాలు నిషేధం అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందు జాగ్రత్త చర్యగా శివాజీపార్కు, చైత్యభూమి, దాదర్ తదితర పరిసరాల్లో మద్యం విక్రయాలను పూర్తిగా నిషేధించారు. శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా దాదర్, మహీం, సైన్, ధారావి, కరీరోడ్, వర్లీ సీఫేస్, వర్లీ కోలివాడ, సంగం నగర్ ప్రాంతాల్లో మద్యం దుకాణాలను మూసి ఉంచాలని నగర కలెక్టర్ ఆదేశించారు. నియమాలను ఉల్లంఘించే మద్యం షాపుల లెసైన్స్ రద్దు చేసి వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని ఈ సందర్భంగా కలెక్టర్ హెచ్చరించారు. సేవకు ముందుకు అంబేద్కర్‌కు నివాళులర్పించేందుకు చైత్యభూమికి వచ్చే అభిమానులకు మార్గదర్శనం చేసేందుకు అనేక స్వయం సేవా సంస్థలు, వివిధ అంబేద్కర్ సంఘాలు కూడా ముందుకు వచ్చాయి. దాదర్‌లో దూరప్రాంతాల, లోకల్ రైలు దిగిన అభిమానులకు శివాజీపార్కు మైదానానికి ఎలా వెళ్లాలి? క్యూ ఎక్కడి నుంచి కట్టాలి, చైత్య భూమి, స్టాళ్లు ఎక్కడున్నాయి? తదిరాలపై మార్గదర్శనం చేసేందుకు వేలాదిమంది సిద్ధంగా ఉన్నారు. వారు బసచేసిన చోట అపశృతులు చోటుచేసుకోకుండా నిఘావేశారు. మరికొన్ని సంస్థలు వారికి ఉచిత భోజనం, అల్పహారం పంపిణీ చేసేందుకు స్వచ్ఛందంగా ముందుకొచ్చాయి.