
అంబేద్కర్ వర్సిటీకి సీఎస్‌ఆర్ అవార్డు
దూరవిద్య లో విద్యార్థులకు నాణ్యమైన బోధన అందజేస్తున్నందుకు గుర్తింపుగా డా. బి.ఆర్. అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయానికి 2014 సంవత్సరానికి కాంపిటీషన్ సక్సెస్ రివ్యూ (సీఎస్‌ఆర్)మ్యాగజైన్ ఏటా కేటాయించే ‘సీఎస్‌ఆర్ టాప్ డిస్టెన్స్ లెర్నింగ్ ఇనిస్టిటూట్స్ ఆఫ్ ఇండియా అవార్డు’ను మంగళవారం న్యూఢిల్లీలో ప్రకటించింది.
బంజారాహిల్స్, న్యూస్‌లైన్: దూరవిద్య లో విద్యార్థులకు నాణ్యమైన బోధన అందజేస్తున్నందుకు గుర్తింపుగా డా. బి.ఆర్. అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయానికి 2014 సంవత్సరానికి కాంపిటీషన్ సక్సెస్ రివ్యూ (సీఎస్‌ఆర్)మ్యాగజైన్ ఏటా కేటాయించే ‘సీఎస్‌ఆర్ టాప్ డిస్టెన్స్ లెర్నింగ్ ఇనిస్టిటూట్స్ ఆఫ్ ఇండియా అవార్డు’ను మంగళవారం న్యూఢిల్లీలో ప్రకటించింది.
భారతదేశంలో దూరవిద్యను అందిస్తున్న వివిధ విశ్వవిద్యాలయాలలో అంబేద్కర్ యూనివర్సిటీ ప్రథమస్థానంలో నిలిచిందని నిర్వాహకులు వెల్లడించారు. దేశంలోనే ఈ విశ్వవిద్యాలయంలో బీయస్సీ డిగ్రీ విద్యాబోధన అత్యుత్తమ స్థాయిలో నిలిచిందని 2011లో అవుట్‌లుక్ మ్యాగజైన్ గుర్తించిందని విశ్వవిద్యాలయ వర్గాలు తెలిపాయి. అంతేకాకుండా 2012లో దూరవిద్య కేటగిరిలో ఇండస్ ఫౌండేషన్ అవార్డు ఫర్ ఎడ్యుకేషన్ ఎక్స్‌లెన్స్ అనే అవార్డు కూడా సొంతం చేసుకున్నట్లు వెల్లడించారు.