హైదరాబాద్: అంబేడ్కర్ జయంతి వేడుకలను వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. సమసమాజ స్థాపనకు అంబేడ్కర్ నిర్ధేశించిన మార్గంలో ప్రతి ఒక్కరు నడవాలని, రాజ్యాంగాన్ని రక్షించుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందని ఎంపీలు మేకపాటి రాజమోహన్‌రెడ్డి, బుట్టా రేణుక అన్నారు. చంద్రబాబు అంబేడ్కర్ ఆశయాలకు తూట్లు పొడుస్తున్నాడని, కేవలం విగ్రహాలు పెట్టి జయంతులు నిర్వహించినంత మాత్రాన ఆయన ఆశయాలు పాటించినట్లు కాదని మేరుగ నాగార్జున అన్నారు. దివంగత వైఎస్సార్ హయాంలో అన్ని వర్గాల వారికి మేలు జరిగేలా అంబేడ్కర్ ఆశయ సాధనకు కృషి జరిగిందని ఆయన గుర్తుచేశారు. రానున్న రోజుల్లో అంబేడ్కర్ ఆశయాలను నెరవేర్చడం కోసం వైఎస్సార్‌సీపీ కట్టబడి ఉంటుందని మేరుగ అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీలు మేకపాటి, బుట్టా రేణుక, బొత్స సత్యనారాయణ, పార్థసారథి, మేరుగ నాగార్జున , సజ్జల రామకృష్ణారెడ్డి, కొండా రాఘవరెడ్డి, పలువురు సీనియర్ నేతలు పాల్గొన్నారు.