
గోల్డ్‌మెడల్ అందుకున్న శ్రీకాకుళం కలెక్టర్ ధనంజయరెడ్డిని అభినందిస్తున్న గవర్నర్
సాక్షి, విశాఖపట్నం,శ్రీకాకుళం పాతబస్టాండ్ : విశాఖలోని వుడా చిల్డ్రన్ ఎరీనాలో శనివారం రెడ్‌క్రాస్ 2015–16, 2016–17 సంవత్సరాలకు సేవా అవార్డులు, బంగారు పతకాలను రాష్ట్ర గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్ అందజేశారు. కార్యక్రమంలో శ్రీకాకుళం, కృష్ణా జిల్లాల కలెక్టర్ కె.ధనంజయరెడ్డి, లక్ష్మీకాంతం, విశాఖ కలెక్టర్ ప్రవీణ్‌కుమార్ తరఫున జేసీ సృజనలతో పాటు పలువురు ఐఏఎస్, రెవెన్యూ, పంచాయతీరాజ్‌శాఖల అధికారులు అవార్డులను అందుకున్నారు. కాగా సంస్థకు విరాళాలిచ్చిన వారిని గవర్నర్ అభినందించారు. అవార్డులు అందుకున్న వారిలో కలెక్టర్ ధనంజయరెడ్డితోసహా రెడ్‌క్రాస్ చైర్మన్ పి.జగన్మోహనరావు, సంయుక్త కలెక్టర్ కె.వి.ఎన్.చక్రధరబాబు, సంయుక్త కలెక్టర్–2 పి.రజనీకాంతరావు, రెడ్‌క్రాస్ సంస్థకు కోటి రూపాయలకు పైగా విరాళాలు అందించిన సి.వి.ఎన్.మూర్తి, కె.దుర్గా శ్రీనివాస్, రాజేంద్రకుమార్ కర్నానీ, పి.వైకుంఠరావు, బలివాడ మల్లేశ్వరరావు ఉన్నారు.