Dhanunjaya Reddy
-
మద్యం కుంభకోణం పూర్తిగా కట్టుకథే... ఇది ముమ్మాటికీ రాజకీయ ప్రేరేపిత కేసే... ధనుంజయ్‌రెడ్డి, కృష్ణమోహన్‌రెడ్డి తరపున ఏసీబీ కోర్టులో వాదనలు వినిపించిన మాజీ అడ్వొకేట్ జనరల్ శ్రీరామ్.. దర్యాప్తు నివేదిక పేరిట మరోసారి కనికట్టు చేసిన సిట్
-
రాజకీయ ప్రేరేపిత కేసే..
వైఎస్సార్సీపీ ప్రభుత్వం ధరలను పెంచలేదు.. మద్యం ఉత్పత్తులపై పన్నులనే పెంచారు. గత టీడీపీ ప్రభుత్వంలో కంటే వైఎస్సార్సీపీ ప్రభుత్వం మద్యం విక్రయాలను గణనీయంగా తగ్గించింది. కానీ, పన్నులను పెంచడంతో ఎక్సైజ్ శాఖకు ఆదాయం పెరిగింది. దాంతోనే ప్రభుత్వ ఖజానాకు ఆదాయం పెరిగింది. మరి ఎక్సైజ్ శాఖ ఆదాయం పెరిగితే ఇక ప్రభుత్వ ఖజానాకు నష్టం ఎక్కడ వాటిల్లింది..? కుంభకోణం ఎక్కడ జరిగింది..? అంటే ప్రభుత్వ ఖజానాకు రూ.3,200 కోట్ల నష్టం వాటిల్లిందని సిట్ చెబుతున్నది అంతా అవాస్తవమే కదా? సాక్షి, అమరావతి: ‘సిట్ నమోదు చేసింది పూర్తిగా రాజకీయ ప్రేరేపిత కేసు. వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో మద్యం విధానంపై ప్రస్తుత ప్రభుత్వం రాజకీయ కారణాలతోనే అక్రమ కేసు పెట్టింది. గతంలో టీడీపీ ప్రభుత్వంలో చంద్రబాబు అవినీతిపై నమోదైన కేసులను కప్పిపుచ్చేందుకే ఈ కేసును నమోదు చేసింది’ అని మాజీ అడ్వకేట్ జనరల్, సీనియర్ న్యాయవాది శ్రీరామ్ ఏసీబీ న్యాయస్థానానికి వివరించారు. 2019–24 మధ్య మద్యం విధానంతో ప్రభుత్వ ఖజానాకు రూ.3,200 కోట్లు నష్టం వాటిల్లిందన్న సిట్ అభియోగానికి ఎలాంటి ప్రాతిపదిక లేదని స్పష్టం చేశారు.అందుకు సంబంధించి న్యాయస్థానానికి కనీసం ఒక్క ఆధారాన్ని కూడా చూపించలేకపోయారని గుర్తు చేశారు. దీన్నిబట్టి స్కామ్ అనేది ఒక కట్టుకథ అని స్పష్టం చేశారు. సీఐడీ కేసును ఆ దర్యాప్తు సంస్థ పరిధిలోని ఇతర పోలీసు అధికారులు నిబంధనలకు విరుద్ధంగా దర్యాప్తు చేస్తున్నారని చెప్పారు. ఈ కేసులో సిట్ అక్రమంగా అరెస్టు చేసిన రిటైర్డ్ ఐఏఎస్ అధికారి కె.ధనుంజయ్‌రెడ్డి, పి.కృష్ణమోహన్‌రెడ్డిల తరపున సీనియర్ న్యాయవాది శ్రీరామ్ విజయవాడ ఏసీబీ న్యాయస్థానంలో శనివారం వాదనలు వినిపించారు. వారిద్దరిని సిట్ అధికారులు అక్రమంగా అరెస్టు చేశారని నిబంధనలను ఉటంకిస్తూ వివరించారు. అంశాల వారీగా శ్రీరామ్ వినిపించిన వాదనలు ఇలా ఉన్నాయి... చంద్రబాబు ప్రభుత్వం 5 డిస్టిలరీల నుంచే 69% మద్యం కొనుగోళ్లు చేసింది చంద్రబాబు అవినీతి కేసులను కప్పిపుచ్చేందుకే సిట్ ఈ అక్రమ కేసు నమోదు చేసింది. ఇది పూర్తిగా రాజకీయ ప్రేరేపిత కేసు. దీనివెనుక రాజకీయ దురుద్దేశాలు ఉన్నాయని.. వాటిని ఎంతమాత్రం కొట్టిపారేయలేమని సుప్రీంకోర్టు కూడా అభిప్రాయపడింది. నిందితుల ముందస్తు బెయిల్ పిటిషన్‌ను విచారిస్తూ ఆ విషయాన్ని స్పష్టం చేసింది. రాజకీయ పక్షపాతం, దురుద్దేశాలకు న్యాయపరంగా తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించింది కూడా. 2014–19 మధ్యన చంద్రబాబు ప్రభుత్వ హయాంలో జరిగిన అవినీతిపై పలు కేసులు న్యాయస్థానాల్లో విచారణలో ఉన్నాయి.ఆ ఐదేళ్లలో ప్రభుత్వ మద్యం విధానం ద్వారా పాల్పడిన అవినీతిని ఇప్పటికే సీఐడీ నిర్ధారించి చంద్రబాబుతో పాటు పలువురిపై ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. ఈ కేసులో ఆయన ముందస్తు బెయిల్‌పై ఉన్నారు. చంద్రబాబు ప్రభుత్వం కేవలం 5 డిస్టిలరీల నుంచే ఏకంగా 69 శాతం మద్యం కొనుగోళ్లు చేసినట్లు అప్పటి సిట్ తన రిమాండ్ రిపోర్టులోనే పేర్కొంది. మంత్రి మండలికి తెలియకుండా మద్యం దుకాణాలు, బార్లపై ప్రివిలేజ్ ఫీజును రద్దు చేశారు. ఆ కేసులో ఆయన ముందస్తు బెయిల్‌పై ఉన్నారు. దాన్నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకే సిట్ ద్వారా ఈ అక్రమ కేసు నమోదు చేయించారు. అంతెందుకు ఇప్పుడు అడ్డగోలుగా వేధిస్తున్న సిట్ రాజ్ కేసిరెడ్డి రిమాండ్ రిపోర్టులో కూడా 2014–19 మధ్య టీడీపీ ప్రభుత్వం కేవలం నాలుగు డిస్టిలరీల నుంచే 54 శాతం మద్యం కొనుగోళ్లు చేసిందని పేర్కొనడం నిజం కాదా? వైఎస్సార్సీపీ హయాంలో ఖజానా ఆదాయం పెరిగింది 2019–24లో రూ.3,200 కోట్ల కుంభకోణం జరిగిందని ఏ ప్రాతిపదికన నిర్ధారించామన్నది సిట్ చెప్పడమే లేదు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం కొత్తగా ఒక్క డిస్టిలరీకి కూడా అనుమతి ఇవ్వలేదు. 2014–19 మధ్య కంటే 2019–24 మధ్య రాష్ట్ర ఎక్సైజ్ శాఖ ఆదాయం పెరిగింది. 2018–19లో ఎక్సైజ్ శాఖ ఆదాయం రూ.16 వేల కోట్లు ఉంటే 2023–24లో రూ.24 వేల కోట్లకు చేరుకుంది. ఇక కుంభకోణంపై సిట్ వద్ద ఒక్క ఆధారం కూడా లేదు. కనీసం న్యాయస్థానానికి సమర్పించిన నివేదికలోనూ ఒక్క ఆధారాన్ని కూడా చూపలేకపోయింది. ప్రభుత్వ ఆధ్వర్యంలోని బెవరేజెస్ కార్పొరేషన్ రికార్డుల్లో కూడా అటువంటి సమాచారం ఏమీ లేదు. ఉంటే సిట్ చూపించి ఉండేది కదా. కేవలం సిట్ అధికారులు తాము బెదిరించి తీసుకున్న కొందరు డిస్టిలరీల ప్రతినిధుల వాంగ్మూలాలను మాత్రమే చూపిస్తున్నారు. ఆ డిస్టిలరీలన్నీ 2014–19లో అప్పటి ప్రభుత్వ హయాంలో లబ్ధి పొందినవే. అవే డిస్టిలరీలను తర్వాతి ప్రభుత్వం 2019–24లోనూ కొనసాగించింది. సీఐడీ కేసును పోలీసులు ఎలా దర్యాప్తు చేస్తారు? అసలు ఈ కేసు రాజకీయ ప్రేరేపితం. కేసు నమోదు నుంచి సీఐడీకి అప్పగించడం, సిట్ ఏర్పాటు అంతా చట్టానికి విరుద్ధంగా సాగుతోంది. ఈ కేసును సీఐడీ డీజీ పర్యవేక్షిస్తారు అని సిట్‌ను ఏర్పాటు చేస్తూ జారీ చేసిన జీవోలో ప్రభుత్వం పేర్కొంది. సిట్‌ను ప్రత్యేక పోలీస్ స్టేషన్‌గా గుర్తించింది. కానీ, సిట్‌లో ఉన్న సభ్యుల్లో అత్యున్నత అధికారి విజయవాడ పోలీస్ కమిషనర్. మిగిలిన సభ్యులు ఆయన కంటే జూనియర్లు. మరి వీరందరూ సీఐడీ పరిధిలోకి వస్తారా? తాము సీఐడీ పరిధిలోకి వస్తామని వారిని న్యాయస్థానంలో అఫిడవిట్ సమర్పించమనండి. వారు అలా అఫిడవిట్ సమరి్పస్తే తదనుగుణంగా మేం తదుపరి చర్యలు చేపడతాం. సీఐడీ పరిధిలోకి రాని పోలీస్ అధికారులు ఈ కేసును ఎలా దర్యాప్తు చేస్తారు? అంటే ఈ కేసు దర్యాప్తే పూర్తి నిబంధనలను విరుద్ధంగా సాగుతోంది. సిట్ కేసు ఈ న్యాయస్థానం పరిధిలోకి రాదు సిట్ నమోదు చేసిన ఈ కేసు విజయవాడ ఏసీబీ న్యాయస్థానం పరిధిలోకి రాదు. ఏసీబీ నమోదు చేసే అవినీతి నిరోధక కేసులను విచారించేందుకు ప్రత్యేక చట్టం ద్వారా ఈ న్యాయస్థానాన్ని ఏర్పాటు చేశారు. సీఐడీ నమోదు చేసే అవినీతి నిరోధక కేసులు కూడా ఈ న్యాయస్థానం పరిధిలోకి వస్తాయని చట్టం చేశారు. కానీ, సిట్‌ను ప్రత్యేక పోలీస్ స్టేషన్‌గా గుర్తిస్తూ ఈ ప్రభుత్వం జీవో ఇచి్చంది. సిట్ నమోదు చేసే కేసులు అసలు ఈ న్యాయస్థానం పరిధిలోకి రానే రావు. ప్రతి ఒక్కరికి 17ఏ కింద ముందస్తు అనుమతి తీసుకోలేదు ఈ కేసులో నిందితులు ప్రతి ఒక్కరిపై దర్యాప్తునకు 17ఏ కింద ముందే అనుమతి తీసుకోవాలి. మొత్తంగా అందరిపై ఒకేసారి 17ఏ కింద అనుమతి తీసుకున్నామని.. కేరళ హైకోర్టు తీర్పును ఉటంకిస్తూ సిట్ చెబుతున్నది సరికాదు. ప్రతి ఒక్కరిపై విడివిడిగా 17ఏ కింద అనుమతి తీసుకోవాలని సుప్రీంకోర్టు విస్పష్టంగా ప్రకటించింది. (ఈ అంశంపై సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనానికి నివేదించిందని సిట్ న్యాయవాదులు చేసిన వాదనను న్యాయవాది శ్రీరామ్ తోసిపుచ్చారు). 2023లో అప్పటి మాజీ సీఎం చంద్రబాబు అరెస్టుకు సంబంధించి 17ఏ వర్తిస్తుందా వర్తించదా అనే అంశంపై సుప్రీంకోర్టు చెప్పినదాన్ని ప్రస్తుతం సిట్ న్యాయవాదులు వక్రీకరిస్తున్నారు.స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణం 2018 కంటే ముందే జరిగింది కాబట్టి 17ఏ వర్తించదు. 2018కు ముందు జరిగిన కేసులకు 17ఏ వర్తిస్తుందా వర్తించదా అనే విషయాన్ని పరిశీలించేందుకు ప్రత్యేక ధర్మాసనానికి నివేదించారు. అంతేగానీ, 2018 ఆ తర్వాత నమోదయ్యే కేసుల్లో నిందితులు ప్రతి ఒక్కరిపై విడివిడిగా 17ఏ కింద దర్యాప్తునకు అనుమతి తీసుకోవాల్సిందేనని సుప్రీంకోర్టు స్పష్టంగా పేర్కొంది. ఆ ప్రకారం సీఎంవోలో కార్యదర్శిగా చేసిన కె.ధనుంజయ్ రెడ్డి, ఓఎస్డీ పి.కృష్ణమోహన్‌రెడ్డి ప్రభుత్వ ఉద్యోగులు. వారిపై కేసులకు విడివిడిగా 17ఏ కింద అనుమతి తీసుకోవాల్సిందే. ఈ నిబంధనను సిట్ ఉల్లంఘించింది కాబట్టి ఇది అక్రమ అరెస్టే అవుతుంది. హడావుడిగా అరెస్టు చేయొద్దని సుప్రీంకోర్టు చెప్పింది ముందస్తు బెయిల్ ఇవ్వనంత మాత్రాన నిందితులను హడావుడిగా అరెస్టు చేయకూడదని సుప్రీంకోర్టు చెప్పింది. అరెస్టుకు ఉన్న అధికారాన్ని పోలీసులు దుర్వినియోగం చేయొద్దని ఇటీవలే స్పష్టం చేసింది. కచి్చతమైన ఆధారాలు ఉంటేనే అరెస్టు చేయాలని చెప్పింది. కానీ, ఈ అక్రమ కేసులో ధనుంజయ్‌రెడ్డి, కృష్ణమోహన్‌రెడ్డికి వ్యతిరేకంగా సిట్ స్పష్టమైన ఆధారాలేమీ చూపలేకపోయింది. కనీసం న్యాయస్థానానికి కూడా సమర్పించనే లేదు. ఇక ధనుంజయ్‌రెడ్డి, కృష్ణమోహన్‌రెడ్డి దేశం విడిచివెళ్లే అవకాశం ఉంది కాబట్టి అరెస్టు చేస్తున్నామని సిట్ చెప్పడం పూర్తిగా అవాస్తవం. నిందితులుగా చేర్చకముందే వారికి వ్యతిరేకంగా సిట్ లుక్ ఔట్ నోటీసులు జారీ చేసింది. సిట్ అక్రమంగా అరెస్టు చేసింది. నిబంధనలకు విరుద్ధంగా అరెస్టు ధనుంజయ్‌రెడ్డి, కృష్ణమోహన్‌రెడ్డిలను శుక్రవారం రాత్రి అరెస్టు చేసే క్రమంలో సిట్ అధికారులు నిబంధనలను ఉల్లంఘించారు. అరెస్టుకు ప్రాతిపదిక, కారణాలను నిందితులకు తెలపాలి. కానీ, వారికి ఎలాంటి సమాచారం ఇవ్వలేదు. వారి కారు డ్రైవర్‌కు చెప్పామని రిమాండ్ నివేదికలోనే సిట్ అధికారులు పేర్కొన్నారు. నిందితులకు తెలపాలన్న నిబంధనను సిట్ అధికారులు కావాలనే ఉల్లంఘించారు. కాపీ పేస్ట్ కుట్ర.. అదే సిట్ రిమాండ్ నివేదిక రెడ్‌బుక్ కుట్రనే సిట్ తన దర్యాప్తు నివేదిక పేరిట మరోసారి కనికట్టు చేసింది. ధనుంజయ్‌రెడ్డి, కృష్ణమోహన్‌రెడ్డికి జ్యుడిషియల్ రిమాండ్ విధించాలని కోరుతూ న్యాయస్థానంలో దాఖలు చేసిన రిమాండ్ నివేదికే ఆ విషయాన్ని వెల్లడించింది. పూర్తిగా అవాస్తవాలు, అభూత కల్పనలతోనే రిమాండ్ నివేదిక రూపొందించిందని స్పష్టమైంది. ఈ కేసులో ఇప్పటికే అరెస్టు చేసిన రాజ్ కేసిరెడ్డి, శ్రీధర్‌రెడ్డి, ఇతర నిందితుల రిమాండ్ నివేదికల్లో పేర్కొన్న కట్టుకథనే కాపీ పేస్ట్ చేసింది. ధనుంజయ్‌రెడ్డి, కృష్ణమోహన్‌రెడ్డికి వ్యతిరేకంగా కనీసం ఒక్క ఆధారాన్ని కూడా చూపించలేకపోయింది. ఈ కేసు దర్యాప్తు పేరిట డిస్టిలరీల ప్రతినిధులు, ఇతర సాక్షులను తాము బెదిరించి నమోదు చేసిన అబద్ధపు వాంగ్మూలాలనే అరెస్టుకు ప్రాతిపదికగా చూపించడం సిట్ కుట్రను బట్టబయలు చేసింది. 20 వరకు రిమాండ్ విధించిన న్యాయస్థానం సిట్ అరెస్టు చేసిన రిటైర్డ్ ఐఏఎస్ కె.ధనుంజయ్‌రెడ్డి, పి.కృష్ణమోహన్‌రెడ్డికి న్యాయస్థానం ఈ నెల 20 వరకు రిమాండ్ విధించింది. వారిద్దరిని సిట్ అధికారులు శనివారం ఉదయం విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి వైద్య పరీక్షలు చేయించారు. అనంతరం విజయవాడ ఏసీబీ న్యాయస్థానంలో హాజరుపరిచారు. ఇరు పక్షాల వాదనల అనంతరం న్యాయస్థానం రిమాండ్ విధించింది. వారికి ప్రత్యేక వసతులు కలి్పంచాలని తన ఆదేశాల్లో పేర్కొంది. అనంతరం ధనుంజయ్‌రెడ్డి, కృష్ణమోహన్‌రెడ్డిని సిట్ అధికారులు విజయవాడ జిల్లా జైలుకు తరలించారు. శ్రీధర్‌రెడ్డికి ముగిసిన కస్టడీ విజయవాడ లీగల్: మద్యం కుంభకోణం ఆరోపణలపై అరెస్టయి విజయవాడ జిల్లా జైలులో రిమాండ్ ఖైదీగా వున్న శ్రీధర్‌రెడ్డి మూడు రోజుల కస్టడీ శనివారంతో ముగిసింది. పోలీసులు ఆయనకు ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో పరీక్షలు నిర్వహించి, ఏసీబీ న్యాయమూర్తి ముందు హాజరుపరిచారు. అనంతరం జిల్లా జైలుకు తరలించారు. -
ధనుంజయరెడ్డి, కృష్ణమోహన్ రెడ్డికి రిమాండ్
విజయవాడ: కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యల్లో భాగంగా మద్యం కేసులో తప్పుడు సాక్ష్యాలు, తప్పుడు వాంగ్మూలం సృష్టించి అరెస్ట్ చేసిన రిటైర్డ్ అధికారులు ధనుంజయరెడ్డి, కృష్ణమోహన్‌రెడ్డికి ఏసీబీ కోర్టు మూడు రోజుల రిమాండ్ విధించింది. వీరిని మే 20వ తేదీ వరకూ రిమాండ్ ఇస్తూ తీర్పునిచ్చింది. అదే సమయంలోవీరి వయసును దృష్టిలో పెట్టుకుని జైల్లో ప్రత్యేక వసతులు కల్పించాలని కోర్టు ఆదేశించింది. వీరికి వెస్ట్రన్ కమోర్డ్, మంచం, దిండు, దుప్పటి, డ్రై ఫ్రూట్స్ వంటి వాటికి అనుమతి ఇచ్చింది కోర్టు. అంతే కాకుండా ధనుంజయరెడ్డికి కావాల్సిన ఇన్సులిన్ ఇంజక్షన్లు స్టోర్ చేసుకునేందుకు ఫ్రిజ్ సదుపాయం కల్పించాలని కోర్టు ఆదేశించింది.ఇది రాజకీయ ప్రేరేపితమైన కేసు..రిటైర్డ్ అధికారులు కె. ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డిల అరెస్టుకు ఆధారాల్లేవని, ఇది రాజకీయ ప్రేరేపితమైన కేసు అని న్యాయవాది, మాజీ అడ్వొకేట్ జనరల్ శ్రీరామ్ స్పష్టం చేశారు. ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి రిమాండ్ రిపోర్ట్ పై ఈరోజు(శనివారం) విజయవాడ ఏసీబీ కోర్టులో వాదనలు జరిగాయి.. ఈ కేసుకు సంబంధించి కె. ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డిల తరఫున న్యాయవాది, మాజీ అడ్వొకేట్ జనరల్ శ్రీరామ్ వాదనలు వినిపించారు‘రిటైర్డ్ అధికారులు ధనుంజయరెడ్డి, కృష్ణమోహన్ రెడ్డిల అరెస్ట్ సక్రమం కాదు. ఇది రాజకీయ ప్రేరేపితమైన కేసు. ఇద్దరి అరెస్ట్‌కు అధారాల్లేవ్. కోర్టుకు కూడా అరెస్ట్ కు సంబంధించిన ఆధారాలు ఏవీ ఇవ్వలేదు. ఈ కేసులో సిట్ ఏర్పాటు చట్ట విరుద్ధం. సిట్ కు ఈ కేసు విచారించే అర్హత లేదు.అసలు రూ. 3200 కోట్లు స్కామ్ కి అసలు ఆధారాలు ఏవి?, రూ. 3200 కోట్లు స్కామ్ ఆధారాలు కోర్టుకి కూడా ఇవ్వలేదు.ప్రభుత్వ సొంత కార్పొరేషన్ రికార్డుల్లో ఉన్న సమాచారం కూడా ఇవ్వలేదు. గత 5 ఏళ్ల పాలనలో లిక్కర్ ఆదాయం పెరిగింది. లిక్కర్ వినియోగం తగ్గి ఆదాయం పెరిగింది. మరి రూ. 3200 కోట్లు స్కామ్ ఎక్కడ జరిగింది?, రూ. 16 వేల కోట్ల నుండి రూ. 24 వేల కోట్లకు ఆదాయ పెరిగింది. మరి ప్రభుత్వంకి నష్టం ఎక్కడొచ్చింది. అరెస్ట్ కారణాలను కూడా కాపీ పేస్ట్ చేశారు. ఇది రాజకీయ ప్రేరేపితం కూడా అయ్యి ఉండొచ్చు అని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది’ అని శ్రీరామ్ స్పష్టం చేశారు. -
‘ఇది రాజకీయ ప్రేరేపితమైన కేసు.. అరెస్టుకు ఆధారాల్లేవ్’
విజయవాడ: రిటైర్డ్ అధికారులు కె. ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డిల అరెస్టుకు ఆధారాల్లేవని, ఇది రాజకీయ ప్రేరేపితమైన కేసు అని న్యాయవాది, మాజీ అడ్వొకేట్ జనరల్ శ్రీరామ్ స్పష్టం చేశారు. ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి రిమాండ్ రిపోర్ట్ పై ఈరోజు(శనివారం) విజయవాడ ఏసీబీ కోర్టులో వాదనలు జరిగాయి.. ఈ కేసుకు సంబంధించి కె. ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డిల తరఫున న్యాయవాది, మాజీ అడ్వొకేట్ జనరల్ శ్రీరామ్ వాదనలు వినిపించారు ‘రిటైర్డ్ అధికారులు ధనుంజయరెడ్డి, కృష్ణమోహన్ రెడ్డిల అరెస్ట్ సక్రమం కాదు. ఇది రాజకీయ ప్రేరేపితమైన కేసు. ఇద్దరి అరెస్ట్‌కు అధారాల్లేవ్. కోర్టుకు కూడా అరెస్ట్ కు సంబంధించిన ఆధారాలు ఏవీ ఇవ్వలేదు. ఈ కేసులో సిట్ ఏర్పాటు చట్ట విరుద్ధం. సిట్ కు ఈ కేసు విచారించే అర్హత లేదు.అసలు రూ. 3200 కోట్లు స్కామ్ కి అసలు ఆధారాలు ఏవి?, రూ. 3200 కోట్లు స్కామ్ ఆధారాలు కోర్టుకి కూడా ఇవ్వలేదు. ప్రభుత్వ సొంత కార్పొరేషన్ రికార్డుల్లో ఉన్న సమాచారం కూడా ఇవ్వలేదు. గత 5 ఏళ్ల పాలనలో లిక్కర్ ఆదాయం పెరిగింది. లిక్కర్ వినియోగం తగ్గి ఆదాయం పెరిగింది. మరి రూ. 3200 కోట్లు స్కామ్ ఎక్కడ జరిగింది?, రూ. 16 వేల కోట్ల నుండి రూ. 24 వేల కోట్లకు ఆదాయ పెరిగింది. మరి ప్రభుత్వంకి నష్టం ఎక్కడొచ్చింది. అరెస్ట్ కారణాలను కూడా కాపీ పేస్ట్ చేశారు. ఇది రాజకీయ ప్రేరేపితం కూడా అయ్యి ఉండొచ్చు అని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది’ అని శ్రీరామ్ స్పష్టం చేశారు.ఇదీ చదవండి: రాజకీయ దురుద్దేశాలకు తీవ్ర పర్యవసానాలు తప్పవు: సుప్రీంకోర్టు -
IAS, IPSల అరెస్టులు సరికావు.. అడ్వకేట్ సుదర్శన్ రెడ్డి
-
కూటమి నేతలు దిగజారిపోతున్నారు.. ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి అరెస్ట్ పై సీరియస్
-
రాజకీయ దురుద్దేశాలకు తీవ్ర పర్యవసానాలు తప్పవు
ఈ కేసు నమోదు వెనుక రాజకీయ దురుద్దేశాలు..పక్షపాతం ఉందని పిటిషనర్లు కొంతమేర ప్రాథమికంగా రుజువు చేయగలిగారు. రాజకీయ దురుద్దేశాలు.. పక్షపాతానికి న్యాయపరమైన పర్యవసానాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఈ విషయాన్ని తగిన సమయంలో తేలుస్తాం.థర్డ్ డిగ్రీ ఉపయోగించినా.. బెదిరించినా.. ఒత్తిడి చేసినా.. ప్రలోభపెట్టినా వీటిని మేము చాలా తీవ్రంగా పరిగణిస్తాం. నిందితులు, సహ నిందితుల నుంచి వాంగ్మూలాలను సేకరించే సమయంలో దర్యాప్తు సంస్థ కొన్ని సందేహాస్పద పద్ధతులను అనుసరిస్తోంది. పిటిషనర్లు, ఇతర సహ నిందితుల విషయంలో థర్డ్ డిగ్రీ ఉపయోగించడం, బెదిరించడం, ఒత్తిడి తేవడం, ప్రలోభపెట్టడం చెయ్యడానికి వీల్లేదు. సాక్షి, అమరావతి: ఏపీ మద్యం వ్యవహారంలో కేసు నమోదు వెనుక రాజకీయ దురుద్దేశాలు ఉన్నాయని, వాటిని ఎంతమాత్రం కొట్టిపారేయలేమని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. రాజకీయ పక్షపాతం, దురుద్దేశాలకు న్యాయపరంగా తీవ్ర పర్యవసానాలను ఎదుర్కోవాల్సి ఉంటుందని రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించింది. అయితే, రాజకీయ దురుద్దేశాల కారణంతో.. నిందితులను కస్టోడియల్ ఇంటరాగేషన్ చేయకుండా దర్యాప్తు అధికారిని నిరోధించలేమని పేర్కొంది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ జంషేడ్ బుర్జోర్ పార్థివాలా, జస్టిస్ ఆర్.మహాదేవన్‌తో కూడిన ధర్మాసనం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది.\మద్యం వ్యవహారంలో రిటైర్డ్ ఐఏఎస్ ధనుంజయరెడ్డి, కృష్ణమోహన్‌రెడ్డిలకు ముందస్తు బెయిల్ ఇవ్వలేమని చెబుతూ, వారి పిటిషన్లను కొట్టివేసింది. పిటిషనర్లపై థర్డ్ డిగ్రీ ఉపయోగించడానికి వీల్లేదని ఏపీ సీఐడీ అధికారులను సుప్రీంకోర్టు ఆదేశించింది. అలాగే, ఫలానా విధంగా వాంగ్మూలం ఇవ్వాలని ఒత్తిడి చేయడం గానీ, బెదిరించడం గానీ, ప్రలోభపెట్టడం గానీ చేయరాదంది. దర్యాప్తును నిష్పాక్షికంగా, పారదర్శకంగా కొనసాగించాలని ఆదేశించింది. పిటిషనర్లు రెగ్యులర్ బెయిల్ పిటిషన్ దాఖలు చేసుకుంటే, కేసు పూర్వాపరాల ఆధారంగా విచారించి తగిన నిర్ణయం వెలువరించాలని కింది కోర్టు, హైకోర్టుకు సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. విచారణ సమయంలో న్యాయవాదులు ఉండాలనుకుంటే, ఆ అభ్యర్థనతో హైకోర్టును ఆశ్రయించాలని పిటిషనర్లకు సూచించింది. సీఐడీ దర్యాప్తునకు పూర్తిగా సహకరిస్తున్నారు మద్యం కేసులో తమకు ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ రిటైర్డ్ ఐఏఎస్ ధనుంజయరెడ్డి, కృష్ణమోహన్‌రెడ్డి దాఖలు చేసిన పిటిషన్లపై శుక్రవారం జస్టిస్ పార్థివాలా ధర్మాసనం మరోసారి విచారణ జరిపింది. పిటిషనర్ల తరఫున సీనియర్ న్యాయవాదులు అభిషేక్ మను సింఘ్వీ, వికాస్ సింగ్ వాదనలు వినిపించారు. మద్యం కేసు నమోదు వెనుక రాజకీయ దురుద్దేశాలు ఉన్నాయని, ప్రభుత్వం మారగానే కేసు నమోదైందని వారు ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు. సీఐడీ దర్యాప్తునకు పిటిషనర్లు పూర్తిగా సహకరిస్తున్నారని తెలిపారు. ఇప్పటికే 13 గంటల చొప్పున వీరిని దర్యాప్తు అధికారి ప్రశి్నంచారన్నారు. ఎలాంటి అక్రమాల్లేవనీ సీసీఐ తేల్చింది... కొత్త మద్యం కంపెనీలకు అవకాశం కల్పించడం వెనుక అక్రమాలు జరిగాయని సీఐడీ ఆరోపిస్తోందని.. కానీ, ఈ ఆరోపణల్లో వాస్తవం లేదని కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) తేల్చిందని అభిషేక్ మను సింఘ్వీ, వికాస్ సింగ్ పేర్కొన్నారు. సీఐడీ రిమాండ్ రిపోర్టులో ఇప్పుడు చేస్తున్న ప్రతి ఆరోపణ.. గతంలో సీసీఐకి చేసిన ఫిర్యాదులో ఉన్నవేనని గుర్తు చేశారు. నాటి ఫిర్యాదును సీసీఐ క్షుణ్నంగా పరిశీలించి క్లీన్చిట్ ఇచ్చిందని వివరించారు.ఈ మేరకు సీసీఐ ఉత్తర్వులను వారు ధర్మాసనం ముందు ఉంచారు. అక్రమాలే లేవని తేలిన వ్యవహారంలో సీఐడీ కేసు నమోదు చేసిందని, రాజకీయ కక్ష సాధింపులకు ఈ కేసు ఓ ప్రత్యక్ష ఉదాహరణ అని తెలిపారు. ఈ కేసులో సాక్షులను సీఐడీ పలు రకాలుగా భయపెడుతోందన్నారు. కావాల్సిన విధంగా వాంగ్మూలం ఇవ్వకుంటే నిందితులుగా చేర్చేందుకు కూడా వెనుకాడడం లేదని తెలిపారు. వాంగ్మూలాలు తప్ప సాక్ష్యాలు ఏమీ చూపడం లేదని నివేదించారు. పిటిషనర్లకు మద్యం వ్యవహారంలో ఎలాంటి సంబంధం లేదని, వారు కేవలం ప్రభుత్వ అధికారులుగా సమావేశాల్లో మాత్రమే పాల్గొన్నారని చెప్పారు. ఇదే నేరం అంటూ కేసులు నమోదు చేశారని పేర్కొన్నారు. పారదర్శక విధానాన్ని పూర్తిగా మార్చేశారు రాష్ట్ర ప్రభుత్వం తరఫున సీనియర్ న్యాయవాదులు ముకుల్ రోహత్గీ, సిద్ధార్థ లూథ్రా, సిద్ధార్థ అగర్వాల్ వాదనలు వినిపిస్తూ, ఇదో భారీ కుంభకోణమన్నారు. గతంలో మద్యం కొనుగోళ్లు చాలా పారదర్శకంగా జరిగేవని, గత ప్రభుత్వ హయాంలో దానిని పూర్తిగా మార్చేశారన్నారు. కీలక స్థానాల్లో కావాల్సిన వ్యక్తులను నియమించుకున్నారని తెలిపారు. ఈ సమయంలో ధర్మాసనం స్పందిస్తూ... రాజకీయ దురుద్దేశాలను, ప్రాథమిక ఆధారాలను ఎలా సమతుల్యం చేస్తారని ప్రశ్నించింది. దీంతో ఇది విచారణకు స్వీకరించదగ్గ నేరమే కాదని వికాస్ సింగ్ సమాధానం ఇచ్చారు.ఈ విషయాన్ని పరిగణనలోకి తీసుకోవాలని కోర్టును కోరారు. అలాగైతే ఎఫ్ఐఆర్ కొట్టివేతకు పిటిషన్ దాఖలు చేసుకోవాలని ధర్మాసనం సూచించింది. ఆ పని కచి్చతంగా చేస్తామని వికాస్ తెలిపారు. సింఘ్వీ వాదనలు వినిపిస్తూ... పిటిషనర్లు ప్రభుత్వాధికారులుగా పదవీ విరమణ చేశారని, వారు ఎక్కడికీ పారిపోయే అవకాశం లేదని అన్నారు. ఆ అవసరం కూడా వారికి లేదన్నారు. కావాలంటే పాస్‌పోర్ట్ జప్తునకు ఆదేశాలు ఇవ్వొచ్చునన్నారు. అలాంటప్పుడు దేశం విడిచివెళ్లిపోతారన్న ఆందోళన అనవసరమని పేర్కొన్నారు. ప్రభుత్వ న్యాయవాది సిద్ధార్థ లూథ్రా స్పందిస్తూ, ఈ వ్యవహారంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కూడా ఈసీఆర్ నమోదు చేసిందన్నారు. ఇరుపక్షాల వాదనలను విన్న ధర్మాసనం, పిటిషనర్లకు ముందస్తు బెయిల్ ఇవ్వలేమంటూ పిటిషన్లు కొట్టేసింది. బెయిల్ పిటిషన్ దాఖలుకు గోవిందప్పకు అనుమతి వికాట్ సంస్థ డైరెక్టర్ బాలాజీ గోవిందప్ప అరెస్ట్ నేపథ్యంలో తాము దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్‌ను ఉపసంహరించుకుంటున్నట్లు ఆయన తరఫు సీనియర్ న్యాయవాది సిద్ధార్థ దవే సుప్రీంకోర్టుకు వివరించారు. రెగ్యులర్ బెయిల్ పిటిషన్‌కు అనుమతి కోరగా.. ధర్మాసనం అనుమతిచ్చింది. బాలాజీ గోవిందప్ప రెగ్యులర్ బెయిల్ పిటిషన్ దాఖలు చేసుకుంటే కేసు పూర్వాపరాల ఆధారంగా నిర్ణయం వెలువరించాలని కింది కోర్టు, హైకోర్టుకు సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఈ సమయంలో దవే స్పందిస్తూ, ముందస్తు బెయిల్ పిటిషన్ పెండింగ్‌లో ఉండగానే గోవిందప్పను అరెస్ట్ చేశారన్నారు. ఇది ఏమాత్రం సహేతుకం కాదని, ఇలా అరెస్ట్ చేయడం తగదంటూ ఇదే కోర్టు గతంలో స్పష్టమైన తీర్పు ఇచ్చిందని ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు. పరిశీలించాలంటూ సంబంధిత తీర్పు కాపీని ధర్మాసనం ముందు ఉంచారు. ఇప్పుడు ఈ అంశాలన్నీ అవసరం లేదని, తాము బాలాజీ గోవిందప్పకు ముందస్తు బెయిల్ ఇవ్వలేదని ధర్మాసనం తెలిపింది. సుప్రీంకోర్టు హెచ్చరికలు ఇవీ... రాష్ట్ర ప్రభుత్వానికి... ఏపీ మద్యం వ్యవహారంలో కేసు నమోదు వెనుక రాజకీయ దురుద్దేశాలు ఉన్నాయి. వాటిని ఎంతమాత్రం కొట్టిపారేయలేం. రాజకీయ పక్షపాతం, దురుద్దేశాలు ఉంటే, వాటికి న్యాయపరంగా తీవ్ర పర్యవసానాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది.సీఐడీ అధికారులకు..పిటిషనర్లపై థర్డ్ డిగ్రీ ఉపయోగించడానికి వీల్లేదు. ఫలానా విధంగా వాంగ్మూలం ఇవ్వాలని ఒత్తిడి చేయడం గానీ, బెదిరించడం గానీ, ప్రలోభపెట్టడం గానీ చేయరాదు. దర్యాప్తును నిష్పాక్షికంగా, పారదర్శకంగా కొనసాగించాలి.రెగ్యులర్ బెయిల్ పిటిషన్‌పై... పిటిషనర్లు రెగ్యులర్ బెయిల్ పిటిషన్ దాఖలు చేసుకుంటే, కింది కోర్టులు కేసు పూర్వాపరాల ఆధారంగా విచారించి తగిన నిర్ణయం వెలువరించాలి. విచారణ సమయంలో న్యాయవాదులు ఉండాలనుకుంటే, ఆ అభ్యర్థనతో పిటిషనర్లు హైకోర్టును ఆశ్రయించాలి. -
ఈ అరెస్టులు అప్రజాస్వామికం: వైఎస్సార్సీపీ
సాక్షి, అమరావతి: చంద్రబాబు కక్షపూరిత రాజకీయాలు చేస్తున్నారని.. మాజీ ఐఏఎస్ అధికారి ధనుంజయరెడ్డి, మాజీ ప్రభుత్వాధికారి కృష్ణమోహన్‌రెడ్డి అరెస్టులను ఖండిస్తున్నామని శాసన మండలి విపక్షనేత బొత్స సత్యనారాయణ అన్నారు. చంద్రబాబు కక్ష రాజకీయాల వల్ల వ్యవస్థలు దెబ్బతింటున్నాయన్నారు. తప్పుడు కేసులు పెట్టి తప్పుడు సాక్ష్యాలు, వాంగ్మూలాలు సృష్టిస్తున్నారని.. ప్రభుత్వాధికారులను, మాజీ ప్రభుత్వాధికారులపై కూడా రాజకీయ విరోధం చూపిస్తున్నారంటూ బొత్స మండిపడ్డారు.చంద్రబాబు తీసుకొచ్చిన తప్పుడు సంప్రదాయాలు రాష్ట్రానికి చేటు చేస్తాయి. లిక్కర్ వ్యవహారంలో ఇప్పటివరకూ ఎలాంటి ఆధారాలు చూపడం లేదు. కాని.. బెదిరించి, భయపెట్టి తప్పుడు వాంగ్మూలాలు తీసుకుని, అరెస్టులు చేస్తున్నారు. వైఎస్సార్సీపీ హయాంలో మద్యం కల్తీ జరుగుతోందని ఆరోపించారు. మరి ఇప్పుడు అవే డిస్టలరీల నుంచి మద్యాన్ని కొనుగోలు చేస్తున్నారు. వైఎస్సార్సీపీ హయాంలో ఖజానా వల్ల నష్టం వచ్చిందన్నారు. మరి ఈ ప్రభుత్వంలో విచ్చలవిడిగా మద్యం అమ్ముతున్నా ఆదాయాలు ఎందుకు పెరగడంలేదు?’’ అంటూ బొత్స సత్యనారాయణ ప్రశ్నించారు.కక్ష రాజకీయాలు తార స్థాయికి.. గడికోట శ్రీకాంత్‌రెడ్డి ఆంధ్రప్రదేశ్‌లో కక్ష రాజకీయాలు తార స్థాయికి చేరాయని ప్రభుత్వ మాజీ చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్‌రెడ్డి మండిపడ్డారు. ‘‘ఐఏఎస్‌లను, ఐపీఎస్‌లను ఇప్పటికే టార్గెట్‌చేసి వారిపై సస్పెన్షన్ వేటు వేశారు. ఇప్పుడు మాజీ ఐఏఎస్, మాజీ ప్రభుత్వాధికారులపైనా చంద్రబాబు కక్ష రాజకీయం చేస్తున్నారు. ఈ పరిణామాలు ఆంధ్రప్రదేశ్‌కు మంచివి కావు. చంద్రబాబు కక్ష రాజకీయాలు రాష్ట్రాన్ని, ప్రజలను దెబ్బతీస్తాయి...పరిపాలనలో చంద్రబాబు ఘోరంగా విఫలం కావడంవల్లే ప్రజల దృష్టిని మళ్లించేందుకు తప్పుడు రాజకీయాలు చేస్తున్నారు. వాగ్దానాల అమలు లేదు, ఏ వర్గంకూడా సంతోషంగా లేరు. రాష్ట్రంలో ఎవ్వరికీ భద్రతలేదన్న సంకేతాన్ని చంద్రబాబు ఇస్తున్నారు. మాజీ ఐఏఎస్ ధనుంజయ్‌రెడ్డి, కృష్ణమోహన్‌రెడ్డిల అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్నాను. తప్పుడు రాజకీయాలు మాని, రాష్ట్రంపై చంద్రబాబు దృష్టిపెట్టాలి. అణచివేసినంత మాత్రాన ప్రభుత్వంపై వ్యతిరేకత సద్దుమణగదు’’ అని శ్రీకాంత్‌రెడ్డి చెప్పారు.అరెస్ట్ క్రూరమైన రాజకీయ కక్ష సాధింపు.. మేరుగ నాగార్జునధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి అరెస్ట్ క్రూరమైన రాజకీయ కక్ష సాధింపు అని మాజీ మంత్రి మేరుగ నాగార్జున అన్నారు. కూటమి ప్రభుత్వం తప్పుడు చర్య అని.. ప్రతిపక్ష పార్టీపై ప్రతీకారం తీర్చుకోవడానికి కూటమి ప్రభుత్వం ఏర్పాటుచేసిన సిట్ ప్రైవేట్ సైన్యంలా పనిచేస్తోంది. ఈ అరెస్ట్‌లకు తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు’’ అని మేరుగ నాగార్జున హెచ్చరించారు.చంద్రబాబువి కక్ష రాజకీయాలు: మాజీ మంత్రి చెల్లుబోయిన వేణుమాజీ ఐఏఎస్ అధికారి ధనుంజయ్ రెడ్డి, మాజీ ప్రభుత్వ అధికారి కృష్టమోహన్ రెడ్డిల అరెస్టును ఖండిస్తున్నాను. ఈ అరెస్టులు అప్రజాస్వామికం. ప్రజలకిచ్చిన హామీల అమల్లో కూటమి ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. పాలనా వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకే డైవర్షన్ పాలిటిక్స్‌కు పాల్పడుతున్నారు. విపక్ష పార్టీ నేతలతో పాటు ప్రభుత్వాధికారులతో పాటు మాజీ అధికారులను లక్ష్యంగా చేసుకుని అక్రమ కేసులు నమోదు చేస్తున్నారు. లిక్కర్ వ్యవహారంలో ఆధారాలు లేకపోయినా అరెస్టులు చేస్తున్నారు. ప్రభుత్వ అరాచకాలను ప్రజలు గమనిస్తున్నారు. సరైన సమయంలో చంద్రబాబు ప్రభుత్వానికి బుద్ధి చెప్పడం ఖాయం. ధనుంజయ్ రెడ్డి, కృష్ణమోహనరెడ్డిల అక్రమ అరెస్టులను ఖండిస్తున్నాను.వైఎస్సార్సీపీని ఇబ్బంది పెట్టడమే ప్రభుత్వ లక్ష్యం.. మాజీ మంత్రి ఉషాశ్రీచరణ్ధనుంజయ రెడ్డి, క్రిష్ణమోహన్ రెడ్డి అరెస్ట్ రాజకీయ కక్ష సాధింపు. వైఎస్సార్సీపీని ఇబ్బంది పెట్టడమే ప్రభుత్వ లక్ష్యం. రాజకీయ దురుద్దేశంతో తప్పుడు విచారణలు. ఆ ప్రక్రియలో అంతులేని దారుణ వేధింపులు. ఇది ఇంకా కొనసాగితే ఏ మాత్రం సహించబోము. ప్రభుత్వ తీరును కచ్చితంగా ప్రజల్లో ఎండగడతాం. అక్రమ కేసుల్లో అరెస్టయిన వారికి వైఎస్సార్సీపీ అండగా ఉంటుంది. తగిన న్యాయ సహాయం అందిస్తాం.పాలనా వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకే.. తిరుపతి ఎంపీ గురుమూర్తిచంద్రబాబువి కక్ష రాజకీయాలు. మాజీ ఐఏఎస్ అధికారి ధనుంజయ్ రెడ్డి, మాజీ ప్రభుత్వ అధికారి కృష్టమోహన్ రెడ్డిల అరెస్టును ఖండిస్తున్నాను. చంద్రబాబు నీచ రాజకీయాలు చేస్తున్నారు. పాలనా వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకే డైవర్షన్ పాలిటిక్స్‌కు చేస్తున్నారు. లిక్కర్ వ్యవహారంలో ఆధారాలు లేకపోయినా అరెస్టులు చేస్తున్నారు. ప్రభుత్వ అరాచకాలను ప్రజలు చూస్తున్నారు. -
రిటైర్డ్ ఐఏఎస్ ధనుంజయరెడ్డి, కృష్ణమోహన్‌రెడ్డి అరెస్ట్
విజయవాడ: మద్యం కేసులో రిటైర్డ్ ఐఏఎస్ ధనుంజయరెడ్డి, కృష్ణమోహన్‌రెడ్డిలను సిట్ అధికారులు అరెస్ట్ చేశారు. మూడు రోజుల విచారణ అనంతరం సిట్ అరెస్ట్ చేసింది. ఈ అరెస్టులు కక్ష పూరితమని.. ఐఏఎస్‌లు, ఐపీఎస్‌లను అరెస్టు చేసే సంస్కృతి సరికాదని ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్‌రెడ్డి తరపు అడ్వకేట్ సుదర్శన్ రెడ్డి అన్నారు. లిక్కర్ కేసులో రిటైర్డు ఐఏఎస్ ధనుంజయ్ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డిలను ఇవాళ రాత్రి 7.15కి అరెస్టు చేశారని.. రేపు(శనివారం) ఉదయం వైద్య పరీక్షల తర్వాత కోర్టులో హాజరు పరిచే అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు.కాగా, మద్యం విధానంపై చంద్రబాబు ప్రభుత్వం నమోదు చేసిన అక్రమ కేసుకు అనుకూలంగా అబద్ధపు వాంగ్మూలం ఇవ్వాలంటూ రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ధనుంజయ్‌రెడ్డి, కృష్ణమోహన్‌రెడ్డిని సిట్ తీవ్ర వేధింపులకు గురి చేసిన సంగతి తెలిసిందే. నిన్న (గురువారం) 13 గంటలకుపైగా విచారణ పేరుతో ప్రహసనం సాగించడం సిట్ కుట్రలకు అద్దం పడుతోంది.సిట్ చీఫ్‌గా ఉన్న విజయవాడ పోలీస్ కమిషనర్ ఎస్వీ రాజశేఖర్‌బాబు, ఇతర అధికారులు వారిని విడివిడిగా రోజంతా విచారించారు. మొదటి రోజు అడిగిన ప్రశ్నలనే మళ్లీ మళ్లీ అడగడం గమనార్హం. వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో మద్యం విధానంతో తమకు ఏమాత్రం సంబంధం లేదని ధనుంజయ్‌రెడ్డి, కృష్ణమోహన్‌రెడ్డి మరోసారి స్పష్టం చేశారు. సీఎంవో కార్యదర్శి, ఓఎస్డీలకు మద్యం విధానం రూపకల్పన, అమలుతో ఎలాంటి సంబంధం ఉండదని నిబంధనలను ఉటంకిస్తూ తేల్చి చెప్పారు.ఆ అంశం పూర్తిగా ఎక్సైజ్ శాఖ, బెవరేజస్ కార్పొరేషన్‌కు సంబంధించినదని పేర్కొన్నారు. అయినా సరే సిట్ అధికారులు పదే పదే అవే ప్రశ్నలు వేస్తూ వారిని వేధించారు. ఉద్దేశపూర్వకంగానే కాలయాపన చేస్తూ వారిపై మానసిక ఒత్తిడికి గురి చేసేందుకు యత్నించారు. ఇక మెయిల్ ఐడీలు, పాస్ వర్డ్ చెప్పమని సిట్ అధికారులు అడిగారు. అందుకు వారిద్దరూ సున్నితంగా తిరస్కరించారు. న్యాయస్థానం ఆదేశాల మేరకు నడుచుకుంటామని స్పష్టం చేశారు. -
సాక్షి ఎడిటర్ పై ఏపీ సర్కార్ కక్ష సాధింపు విజయవాడ జర్నలిస్ట్ లు ఫైర్
-
ఎలాంటి నోటీసులు లేకుండా నేరుగా R.ధనుంజయ రెడ్డి ఇంటికి ఏపీ పోలీసులు
-
ప్రభుత్వం హద్దులు దాటుతోంది.. నిజాలు ఉన్నది ఉన్నట్టు చెప్తే కేసు పెడతారా?
-
పత్రికా స్వేచ్ఛకు సంకెళ్లు.. ‘సాక్షి’పై ఏపీ సర్కార్ కక్ష సాధింపు
సాక్షి, విజయవాడ: ఏపీలో పత్రికా స్వేచ్చకు సంకెళ్లు పడ్డాయి. కూటమి ప్రభుత్వంలో సాక్షిపై కక్షసాధింపు చర్యలు కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగానే చంద్రబాబు ప్రభుత్వ అవినీతి, అక్రమాలపై వార్తలు రాసినందుకు సాక్షి పత్రిక ఎడిటర్ ధనుంజయ రెడ్డిపై పోలీసులు వేధింపు చర్యలకు దిగారు. సోదాల పేరుతో ఏపీ పోలీసులు గురువారం ఉదయం.. సాక్షి ఎడిటర్ ధనుంజయ రెడ్డి ఇంటికి చేరుకున్నారు. ఎలాంటి నోటీసులు లేకుండానే ధనుంజయ రెడ్డి ఇంటికి పోలీసులు చేరుకుని ఆయన కుటుంబ సభ్యులను ఇబ్బందులకు గురిచేశారు. ఇంట్లోకి వెళ్లిన పోలీసులు.. కాసేపటికే ఇంటి తలుపులు మూసివేసి గంటల తరబడి సోదాలు చేశారు. అయితే, గతంలోనూ ధనుంజయ రెడ్డిపై పోలీసులు కేసు పెట్టిన విషయం తెలిసిందే. ఇప్పటికే చంద్రబాబు ప్రభుత్వ అక్రమాలను ప్రశ్నిస్తూ కథనాలు రాసిన పలువురు సాక్షి విలేకర్లపై కూడా పోలీసులు కేసులు నమోదు చేశారు.ఏసీపీ ప్రవర్తన దుర్మార్గం: ధనుంజయ రెడ్డి అనంతరం, సాక్షి పత్రిక ఎడిటర్ ధనుంజయ రెడ్డి మాట్లాడుతూ.. ఈరోజు ఉదయం 9:45కి పది మంది పోలీసులు ఇంటికి వచ్చారు. సోదాలకు సంబంధించి నోటీసులు లేకుండా ఇంట్లోకి దూసుకొచ్చేశారు. ఏసీపీ మరింత దుర్మార్గంగా ప్రవర్తించారు. నోటీస్ కూడా ఇవ్వకుండా సోదాలు చేయాలని ఆదేశాలు ఇచ్చారు. ఇలాంటి చర్యలు పత్రికా స్వేచ్ఛకి విఘాతం కలిగిస్తాయి. ప్రజల గొంతుకై ‘సాక్షి’ నిలుస్తుంది అని కక్ష సాధింపు చర్యలకు దిగుతున్నారు. ఇప్పటికే నాలుగు సార్లు కేసులు పెట్టారు. ప్రస్తుతం హైకోర్టు పరిధిలో కేసు ఉంది. సంబంధం లేదని వాళ్లే చెబుతారు. మళ్లీ వారే సోదాలు చేస్తారు. ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకి కూడా మేము ఫిర్యాదు ఇస్తాం. మానసిక స్థైర్యాన్ని దెబ్బ తీయడానికి ఇటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రజాస్వామ్యవాదులంతా ఈ పద్ధతిని ఖండించాలి’ అని అన్నారు. ఖండించిన పాత్రికేయులుఏపీలో ఎమర్జెన్సీ నాటి పరిస్థితులు నెలకొన్నాయని పాత్రికేయులు మండిపడుతున్నారు. కూటమి ప్రభుత్వ వైఫల్యాలను, ప్రజా వ్యతిరేక చర్యలను ప్రశ్నిస్తున్నందుకే సాక్షిపై చంద్రబాబు సర్కారు కక్ష సాధిస్తోందని ఆరోపిస్తున్నారు. కూటమి ప్రభుత్వ కక్ష సాధింపు చర్యలను ప్రజాసంఘాలతో పాటు ప్రజలు ముక్త కంఠంతో వ్యతిరేకిస్తున్నారని తెలిపారు. ప్రభుత్వంలో జరుగుతున్న అక్రమాలను నిగ్గదీసి అడుగుతున్నందుకు, కక్ష గట్టి ప్రజల గొంతును నొక్కాలని చేస్తున్న ప్రయత్నంలో భాగంగానే కూటమి సర్కారు ఇదంతా చేస్తోందని ఆరోపించారు. ప్రజలకు జరుగుతున్న అన్యాయాన్ని ప్రశ్నిస్తూనే ఉంటామని, ఇచ్చిన హామీలను నిలబెట్టుకునేలా ప్రభుత్వంపై ఒత్తిడి కొనసాగిస్తామన్నారు. సాక్షిపై కక్ష సాధింపు చర్యలను పత్రికా స్వేచ్ఛపై జరిగిన దాడిగా పాత్రికేయులు పేర్కొన్నారు. ప్రభుత్వం రాజ్యాంగబద్దంగా నడుచుకోవాలని కక్ష సాధింపు చర్యలు మానుకోవాలని హితవు పలికారు. -
అరెస్ట్ నుంచి రక్షణ కల్పించండి
సాక్షి, అమరావతి: మద్యం కొనుగోళ్ల వ్యవహారంలో ఏసీబీ నమోదు చేసిన అక్రమ కేసులో అరెస్ట్ నుంచి తమకు రక్షణ కల్పించాలని కోరుతూ అప్పటి సీఎంవో కార్యదర్శి ధనుంజయరెడ్డి, ఓఎస్డీ కృష్ణమోహన్‌రెడ్డి, భారతీ సిమెంట్స్‌కు చెందిన బాలాజీ గోవిందప్ప సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ మేరకు శుక్రవారం అత్యవసరంగా మూడు స్పెషల్ లీవ్ పిటిషన్లు దాఖలు చేశారు. విచారణ జరపాలని సుప్రీంకోర్టును అభ్యర్థించారు. కాగా, తమకు ముందస్తు బెయిల్ మంజూరు చేయాలంటూ ధనుంజయరెడ్డి, కృష్ణమోహన్‌రెడ్డి, బాలాజీ గోవిందప్పలు ఇప్పటికే హైకోర్టులో వేర్వేరుగా పిటిషన్లు వేశారు. వీటిపై శుక్రవారం హైకోర్టు విచారణ జరిపింది. అరెస్ట్ నుంచి రక్షణ కల్పించాలని పిటిషనర్ల తరఫు సీనియర్ న్యాయవాదులు వికాస్‌సింగ్, నాగముత్తు కోరారు. ఈ లోపు ఏసీబీ అరెస్ట్ చేస్తే తాము దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్లు నిరర్థకం అవుతాయని తెలిపారు.అయితే, ఏసీబీ వాదన వినకుండా ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వలేమని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ తల్లాప్రగడ మల్లికార్జునరావు స్పష్టం చేశారు. అరెస్ట్ నుంచి రక్షణ కల్పిస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చేందుకు నిరాకరించారు. తదుపరి విచారణను వచ్చే బుధవారానికి వాయిదా వేశారు. పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని ఏసీబీని ఆదేశించారు. ఈ నేపథ్యంలో ధనుంజయరెడ్డి తదితరులు అత్యవసరంగా సుప్రీంకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు కనీస స్థాయిలో కూడా మా వాదన వినలేదుఅరెస్ట్ నుంచి రక్షణ కల్పించేందుకు హైకోర్టు నిరాకరించడాన్ని తమ వ్యాజ్యాల్లో ధనుంజయరెడ్డి తదితరులు ప్రశ్నించారు. ఈ వ్యవహారంలో తమ వ్యక్తిగత స్వేచ్ఛ ముడిపడి ఉందని, న్యాయస్థానాలు ఎప్పుడూ కూడా పౌరుల వ్యక్తిగత స్వేచ్ఛకు ఎంతో ప్రాధాన్యతనిస్తాయని తమ పిటిషన్లలో పేర్కొన్నారు. హైకోర్టు తీరు తమ హక్కులను కాలరాసే విధంగా ఉందన్నారు. అరెస్ట్ విషయంలో తమ ఆందోళనను హైకోర్టు కనీస స్థాయిలో పట్టించుకోలేదని, తమ సీనియర్ న్యాయవాదులకు వాదన వినిపించే అవకాశం కూడా ఇవ్వలేదని చెప్పారు. ముందస్తు బెయిల్ మంజూరు అంశాన్ని కనీస స్థాయిలోనూ పరిశీలించకపోవడం, వాదన వినిపించే అవకాశం ఇవ్వకపోవడం రాజ్యాంగ విరుద్ధమని అన్నారు. వాస్తవానికి ఏసీబీకి ఎలాంటి నోటీసు ఇవ్వకుండానే మధ్యంతర ముందస్తు బెయిల్ మంజూరు చేసే అధికారం హైకోర్టుకు ఉందన్నారు. గుర్భక్ష్ సింగ్ కేసులో సుప్రీంకోర్టు ఇదే విషయాన్ని స్పష్టం చేసిందని తెలిపారు. అరెస్ట్ విషయంలో ఆందోళన ఉన్నప్పుడు ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేసుకోవచ్చునని సుప్రీంకోర్టే చెప్పిందన్నారు. మద్యం కొనుగోళ్ల వ్యవహారంలో ఏసీబీ దాఖలు చేసిన రిమాండ్ రిపోర్టుల్లో తమను కుట్రదారులుగా పేర్కొందని, ఆ ఆరోపణలన్నీ నిరాధారమని ధనుంజయరెడ్డి, కృష్ణమోహన్‌రెడ్డి తమ వ్యాజ్యాల్లో వివరించారు.మద్యం కొనుగోళ్లతో మాకేం సంబంధం లేదుమద్యం కొనుగోళ్లతో తమకు ఎలాంటి సంబంధం లేదని ధనుంజయరెడ్డి, కృష్ణమోహన్‌రెడ్డి వివరించారు. ఇదంతా పూర్తిగా ఏపీ బెవరేజస్ కార్పొరేషన్ లిమిటెడ్ పరిధిలోనిదని తెలిపారు. తాము కుట్రదారులని చెప్పేందుకు ప్రాథమికంగా ఎలాంటి ఆధారాలు లేవన్నారు. ఇదే వ్యవహారంలో సుప్రీంకోర్టు ఇప్పటికే ఎంపీ మిథున్‌రెడ్డికి అరెస్ట్ నుంచి రక్షణ కల్పించిందని పేర్కొన్నారు. మద్యం కొనుగోళ్లలో ఎలాంటి అక్రమాలు జరగలేదని కాంపిటేషన్ కమిషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) ఇప్పటికే తేల్చి చెప్పిన సంగతిని గుర్తుచేశారు. అయినా కూడా తమపై ఆరోపణలు చేయడం వేధింపుల్లో భాగమేనని పేర్కొన్నారు. మద్యం కొనుగోళ్లలో తమ పాత్ర ఉందన్న ఆరోపణలకు ఆధారాలుంటే అవి ఏసీబీ వద్దే ఉంటాయని, అలాంటప్పుడు తాము ఆధారాలను ఎలా తారుమారు చేయగలమని వారు ప్రశ్నించారు. ప్రజల్లో తమ స్థాయిని తగ్గించి, అవమానించాలన్న ఉద్దేశంతోనే ఏసీబీ అధికారులు కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారని తెలిపారు. వీటన్నింటినీ పరిగణనలోకి తీసుకుని మధ్యంతర ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని సుప్రీంకోర్టును కోరారు. -
ఎంత ఖర్చయినా వైద్యం చేయించండి: సీఎం జగన్ ఆదేశం
సాక్షి, అమరావతి: వెన్నెముక సంబంధిత సమస్యతో బాధపడుతున్న చిన్నారి సాయిలక్ష్మీచంద్రకు ప్రభుత్వం పూర్తివైద్యం చేయిస్తుందని ఆమె తల్లి ఆరుద్రకు ముఖ్యమంత్రి కార్యదర్శి ధనుంజయరెడ్డి భరోసా ఇచ్చారు. ఆయన శుక్రవారం కాకినాడకు చెందిన రాజులపూడి ఆరుద్రతో తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో మాట్లాడారు. అనారోగ్యానికి గురైన తన కుమార్తెను ఆదుకోవాలంటూ రెండురోజుల కిందట ఆరుద్ర సీఎం కార్యాలయానికి విన్నవించారు. ఈ క్రమంలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆరుద్రను ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డిల్లీరావు, విజయవాడ సీపీ కాంతిరాణా టాటా, సీఎం ప్రత్యేక కార్యదర్శి హరికృష్ణ పరామర్శించి వివరాలు తెలుసుకుని సీఎంకు నివేదించారు. దీంతో మరోసారి ఆమెతో మాట్లాడి సమస్యను త్వరగా పరిష్కరించాలని సీఎం జగన్ తన కార్యదర్శి ధనుంజయరెడ్డిని ఆదేశించారు. కలెక్టర్ డిల్లీరావు స్వయంగా ఆరుద్రను సీఎం కార్యాలయానికి తీసుకొచ్చారు. సాయిలక్ష్మీచంద్ర వైద్యానికి అయ్యే ఖర్చును పూర్తిగా ప్రభుత్వం భరిస్తుందని, ఈమేరకు సీఎం ఆదేశాలు జారీచేశారని ధనుంజయరెడ్డి ఆమెకు వివరించారు. జీవనోపాధి కోసం ఉద్యోగం కల్పిస్తామని హామీ ఇచ్చి.. ఆమె సమక్షంలోనే కాకినాడ జిల్లా కలెక్టర్‌కు ఆదేశాలు జారీచేశారు. స్థిరాస్తిని అమ్ముకునే క్రమంలోను ఎవరైనా ఇబ్బందిపెడితే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టంచేశారు. ఈ వ్యవహారంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న కానిస్టేబుళ్లపై చర్యలు తీసుకోవాలని కాకినాడ ఎస్పీకి సూచించారు. ప్రభుత్వం అన్ని విధాలా తోడుగా ఉంటుందని, నిరాశకు గురికావద్దని ధైర్యం చెప్పారు. అనంతరం ఆరుద్ర మాట్లాడుతూ తనలాంటి నిస్సహాయులకు సీఎం అండగా నిలుస్తారనే ధైర్యం, నమ్మకంతోనే ఇక్కడికి వచ్చానన్నారు. తన కుమార్తెకు వైద్యం చేయించడంతోపాటు తనకు ఉద్యోగం ద్వారా జీవనోపాధి కల్పిస్తున్నందుకు సీఎంకు కృతజ్ఞతలు తెలిపారు. రెండురోజులుగా అధికారులు ఎప్పటికప్పుడు తన యోగక్షేమాలు కనుక్కుంటూనే ఉన్నారని ఆనందం వ్యక్తం చేశారు. -
సీఎంఓ అదనపు కార్యదర్శిగా ధనుంజయరెడ్డి
సాక్షి, అమరావతి/రాయచోటి: ముఖ్యమంత్రి కార్యాలయం(సీఎంఓ) అదనపు కార్యదర్శిగా ఐఏఎస్ అధికారి కె.ధనుంజయరెడ్డి నియమితులయ్యారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. ఇప్పటివరకూ ధనుంజయరెడ్డి రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ మేనేజింగ్ డైరెక్టర్‌గా ఉన్నారు. వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో ఈయన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోని గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్(జీహెచ్ఎంసీ) అదనపు కమిషనర్‌గా, అనంతరం రాజీవ్ ఆరోగ్యశ్రీ ముఖ్య కార్యనిర్వహణ అధికారి(సీఈఓ)గా, రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ, విపత్తు నిర్వహణ శాఖల డైరెక్టర్‌గా, శ్రీకాకుళం జిల్లా కలెక్టరుగా సమర్థవంతంగా బాధ్యతలు నిర్వర్తించారు. విపత్తు నిర్వహణ శాఖ డైరెక్టర్‌గా పనిచేస్తూనే గోదావరి పుష్కరాల ఇన్ఛార్జిగా కూడా రేయింబవళ్లు పనిచేసి ప్రశంసలందుకున్నారు. ధనుంజయరెడ్డికి ఏ బాధ్యతలు అప్పగించినా సమర్థంగా నిర్వహిస్తారనే గుర్తింపు పొందారు. ఆయన ఇప్పటివరకూ పనిచేసిన ప్రతిచోటా ప్రణాళికాబద్ధంగా కష్టపడి పనిచేయడం ద్వారా మంచి ఫలితాలు సాధించారని అధికారవర్గాల్లో పేరుంది. వైఎస్సార్ జిల్లా రాయచోటికి చెందిన ధనంజయరెడ్డికి వైఎస్ రాజశేఖరరెడ్డి కుటుంబంతో మంచి అనుబంధం ఉంది. వైఎస్ కుటుంబానికి అత్యంత నమ్మకస్తుల్లో ఆయన ఒకరు. వీటన్నింటికీ తోడు సమర్థవంతమైన అధికారిగా మంచి పేరుండటంతో ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి ఆయన్ను తన అదనపు కార్యదర్శిగా ఎంపిక చేసుకున్నారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన పేషీలో నియమితులైన మొట్టమొదటి అధికారి ధనుంజయరెడ్డి కావడం గమనార్హం. సర్పంచ్ నుంచి అదనపు కార్యదర్శిగా.. ధనుంజయరెడ్డి 1988లో కడప జిల్లా రాయచోటి మండల చెన్నముక్కపల్లె సర్పంచిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. సర్పంచిగా గ్రామాభివృద్ధిలో భాగస్వాములవుతూ సివిల్స్‌లో ఉత్తీర్ణతను సాధించారు. 1992లో సర్పంచి పదవికి రాజీనామా చేసి.. ఢిల్లీ పరిపాలనా విభాగంలో చేరారు. పాలనాదక్షుడిగా పేరు సంపాదించారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ కొలువులో గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ అసిస్టెంట్ కమిషనర్‌గా పనిచేశారు.అభివృద్ధితో పాలకులు, ఉన్నతాధికారుల మన్ననలు అందుకున్నారు. టీడీపీ పాలనలో విపత్తుల శాఖ రాష్ట్రాధికారిగా, వ్యవసాయ శాఖ కమిషనర్‌గా, శ్రీకాకుళం కలెక్టరుగా, అనంతరం పర్యాటక శాఖ రాష్ట్ర అధికారిగా ఉంటూ ప్రగతిపై తనదైన ముద్రను వేసుకున్నారు. ఎక్కడున్నా ప్రాజెక్టుల నిర్మాణాలను వేగవంతంగా పూర్తి చేసేందుకు, కొత్త ప్రాజెక్టుల రూపకల్పనకు ప్రాధాన్యత ఇస్తూ ప్రజలతో మమేకమయ్యే తత్వముంది. విశిష్ట లక్షణాలున్న ఈ అధికారి రాష్ట్ర ప్రగతిలో కీలక భూమిక వహించగలరనే నమ్మకంతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రమాణస్వీకారానికి ముందే ధనుంజయరెడ్డిని అడిషనల్ సెక్రటరీగా నియమించుకున్నారు. -
తిత్లీ బాధితులకు తగిన న్యాయం!
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: జిల్లాను తిత్లీ తుపాను అతలాకుతలం చేసేసి దాదాపు 23 రోజులు గడిచిపోయింది. పంటలు, పాడి, తోటలు, ఇళ్లు, పాకలు ఇదీ అదీ అని కాదు ఆ బీభత్సానికి ప్రజలు సర్వం కోల్పోయారు. జీవనాధారం కనిపించట్లేదు. ఇలాంటి సమయంలో జిల్లా అధికార యంత్రాంగంపై బాధ్యతలు రెట్టింపు అవుతాయి. కుటుంబాలకు సైతం దూరమై రేయింబవళ్లు సేవలు అందించాల్సి ఉంటుంది. ఈ కార్యక్రమాన్ని సమర్థంగా నడిపించడానికి అహర్నిశలు కష్టపడుతున్న వారిలో జిల్లా కలెక్టరుగా కె.ధనంజయరెడ్డి ముందున్నారు. తుపాను, వరద బాధిత ప్రాంతాల్లో చేపట్టిన, చేస్తున్న, చేయబోయే పనుల గురించి శనివారం ‘సాక్షి’ ఇంటర్వ్యూలో వెల్లడించారు. సాక్షి:తిత్లీ తుపాను, వరద ప్రభావిత ప్రాంతాల్లో రైతులు, ఇతర వర్గాల ప్రజలు సర్వం కోల్పోయారు. వారికి ఉపాధి కూడా కరువైంది. ఈ నేపథ్యంలో మీరు తీసుకుంటున్న చర్యలేమిటి? కలెక్టరు: తిత్లీ వంటి తుపానైనా, వరదలైనా, లేదంటే కరువైనా రైతులు, కూలీలు పంట నష్టపోవడమే కాదు ఉపాధి కూడా దొరకని పరిస్థితి ఏర్పడుతుంది. సాధారణంగా మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (నరేగా) కింద వంద రోజుల పనిదినాలు ఇప్పటికే కల్పిస్తున్నాం. తిత్లీ తుపాను బాధితులకు తక్షణమే ఉపాధి చూపించే ఉద్దేశంతోనే అదనంగా మరో యాభై పనిదినాలు కల్పిస్తున్నాం. వాస్తవానికి ఈ సీజన్లో శ్రీకాకుళం జిల్లాలో కరువు మండలాలు లేవు. తుపాను వల్ల జిల్లా నష్టపోయింది. ఇది కూడా ప్రకృతి విపత్తే కాబట్టి 25 మండలాల్లో ఈ పనిదినాల పెంపు ఉంటుంది. ఇందుకు సంబంధించిన ఉత్తర్వులు కూడా వెలువడ్డాయి. సాక్షి: జిల్లాలో ఏయే మండలాలను తిత్లీ తుపాను, వరద ప్రభావిత ప్రాంతాలుగా గుర్తించారు? కలెక్టరు: ఇచ్ఛాపురం, కంచిలి, కవిటి, సోంపేట, మందస, వజ్రపుకొత్తూరు, కోటబొమ్మాళి, నందిగాం, సంతబొమ్మాళి, టెక్కలి, జలుమూరు, ఎల్ఎన్ పేట, సరుబుజ్జిలి, నరసన్నపేట, పోలాకి, గార, పాతపట్నం, కొత్తూరు, హిరమండలం, సారవకోట, భామిని, మెళియాపుట్టి, వీరఘట్టం, సీతంపేట, పలాస మండలాలను తిత్లీ తుపాను, భారీవర్షాలు, వరద ప్రభావిత ప్రాంతాలుగా గుర్తిస్తూ ప్రభుత్వం 16వ నంబరు జీవోను విడుదల చేసింది. సాక్షి: తుపానుతో ప్రజలకు జరిగిన నష్టాన్ని భర్తీ చేయడానికి ఈ ‘ఉపాధి’ సరిపోతుందా? కలెక్టరు: ఉపాధి హామీ పథకం కింద చేపట్టడానికి తుపాను బాధిత ప్రాంతంలో అనేక పనులు ఉన్నాయి. ఒక్క టెక్కలి రెవెన్యూ డివిజన్‌లోనే ఈ ఏడాది ఏప్రిల్ నుంచి ఇప్పటివరకు రూ. 98.8 కోట్లు విలువగల పనులు జరిగాయి. మెటీరియల్ కాంపోనెంట్ పనులు రూ. 32.82 కోట్లు వరకూ చేశారు. ఈ డివిజన్లో ఎక్కువ మంది నరేగా పనులపై ఆధారపడినవారు ఉన్నారు. 11,194 శ్రమశక్తి (ఎస్ఎస్ఎస్) సంఘాలు ఉన్నాయి. వీటిలో సుమారు 1,56,904 మంది వేతనదారులు ఉన్నారు. వారిలో ప్రతి రోజూ ఉపాధి పనులకు వెళ్లేవారు 1,10,760 మంది ఉన్నారు. ఇప్పుడు అదనంగా 50 పనిదినాలు వచ్చాయి. ఇప్పటివరకు వంద రోజుల పాటు పనిదినాలు చేయని కుటుంబాలు కూడా వచ్చే ఏడాది మార్చిలోగా 150 పనిదినాలు చేసుకొనే వెసులుబాటు ఉంటుంది. తుపాను వల్ల పాడైపోయిన పొలాలు, గట్లు బాగు చేసుకోవడం వంటి పనులు కూడా చేసుకునే వెసులుబాటు ఉంది. సాక్షి: తిత్లీ తుపానుతో నేలకొరిగిన చెట్లను తొలగించుకోవడానికి రైతులకు ఏవిధమైన సహాయం అందిస్తారు? కలెక్టరు: కూలిపోయిన అన్ని రకాల చెట్లను తొలగించే బాధ్యత ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, అగ్నిమాపక శాఖలు తీసుకుంటున్నాయి. అందుకుకావాల్సిన డీజిల్ ఆధారిత రంపాలను సమకూర్చాం. అలాగే ప్రతి చెట్టును జియోట్యాగింగ్ చేసి తొలగించుకోవడానికి రైతులకు మెటీరియల్ కాంపొనెంట్ కింద జీడిమామిడి చెట్టుకు రూ.300, కొబ్బరి చెట్టుకు రూ.240 చొప్పున చెల్లిస్తాం. ఇప్పటికే 60 వేల చెట్లను తొలగించారు. ఇలా రెండు వేల ఎకరాల్లో తొలగింపు పూర్తయ్యింది. సాక్షి: ఇంకా చాలామంది బాధితులు తమ పేర్లు లేవని, నష్టం నమోదు ప్రక్రియ సరిగా చేయలేదనే విమర్శలు వస్తున్న నేపథ్యంలో ఏం చర్యలు తీసుకుంటున్నారు. కలెక్టరు: నష్టాల గణన సత్వరమే పూర్తి చేయాలనే లక్ష్యంతో పనిచేయడం వల్ల అక్కడక్కడా తప్పులు దొర్లిన మాట వాస్తవమే. బాధితులు ఎవ్వరైనా సరే ఈ విషయంలో దరఖాస్తు చేయవచ్చు. వాస్తవానికి నష్టాల నమోదు ప్రక్రియ శనివారంతో పూర్తయ్యింది. కానీ రానున్న మూడు నాలుగు రోజుల వరకూ వచ్చే ఫిర్యాదులను, దరఖాస్తులను క్షేత్రస్థాయిలో పరిశీలించేందుకు బృందాలను ఏర్పాటు చేస్తున్నాం. నిజమైన బాధితులను గుర్తించి న్యాయం చేస్తాం. రెండో దఫా జాబితాలో వారికి నష్టపరిహారం చెల్లిస్తాం. సాక్షి: బాధితులు కోలుకునేందుకు మీరు చేపట్టనున్న దీర్ఘకాలిక చర్యలు ఏమిటి? కలెక్టరు: సర్వం కోల్పోయిన బాధితులను సాంఘికంగా, ఆర్థికంగా, ప్రాథమిక వసతులపరంగా దీర్ఘకాలిక పునరుద్ధరణ చర్యలు చేపట్టేందుకు ‘తిత్లీ ఉద్ధానం పునరుద్ధరణ కార్యక్రమం’ (టీయూఆర్‌పీ– తూర్పు) చేపట్టనున్నాం. ఇళ్లు మంజూరు, మొక్కల అందజేత, రాయితీపై విత్తనాలు, ఎరువుల సరఫరా, కావాల్సినవారందరికీ జలసిరి బోర్ల మంజూరు, మూడేళ్ల పాటు మొక్కల నిర్వహణకు నిధులు హెక్టారుకు రూ.40 వేల చొప్పున విడుదల వంటి ప్రతిపాదనలు చేస్తున్నాం. అంతర పంటల వైపు రైతులను ప్రోత్సహించాలనే ఆలోచన ఉంది. అలాగే భవిష్యత్తులో విపత్తులను తప్పించలేం. కానీ తుఫానుల సమయంలో పక్కాఇళ్లు ఉంటే నష్టాన్ని తగ్గించవచ్చు. రేకుల ఇళ్లు, పూరిళ్లు కోల్పోయినవారికి 25వేల పక్కాఇళ్లను ఇవ్వాలని గుర్తించాం. తుపాను బాధితులకు మెరుగైన జీవనోపాధి కల్పించి వారు ఎక్కడికీ వలస పోవాల్సిన పరిస్థితి తలెత్తకుండా చేయాలనేది లక్ష్యం. సాక్షి: పంటనష్టం నమోదులో అవకతవకల నిరోధానికి ఏం చర్యలు తీసుకుంటున్నారు? కలెక్టరు: మా దృష్టికి వచ్చిన అవకతవకలను మండలస్థాయిలోనే గుర్తించి సరిచేస్తున్నాం. కొన్నిచోట్ల తక్కువ విస్తీర్ణంలో నష్టం జరిగితే ఎక్కువగా రాయించడం, భూములు లేకపోయినా ఉందని నమోదు చేయడం వంటి అక్రమాలన్నీ చాలావరకూ నిరోధించగలిగాం. పొరపాట్లను గుర్తించాం. ఇద్దరు ముగ్గురు అధికారులపై చర్యలు కూడా తీసుకున్నాం. అందుకే ప్రాథమిక జాబితాకు ఇప్పటికీ చాలా తేడా వచ్చింది. వరి పంటనష్టం 93వేల హెక్టార్ల నుంచి ఇప్పుడు 76 వేల హెక్టార్లకు తగ్గింది. నష్టపోయిన కొబ్బరి చెట్లు సంఖ్య 14 లక్షల నుంచి దాదాపు 10 లక్షలకు తగ్గిపోయింది. ఏదిఏమైనా బాధితులను ఆదుకోవడానికి అధికార యంత్రాంగం ఎంతో బాధ్యతాయుతంగా పనిచేసింది. అంతా రేయింబవళ్లు కష్టపడ్డారు. ఎంతో ఒత్తిడి ఉన్నా ప్రజల కోసం కాబట్టి భరించక తప్పదు. సాక్షి: తిత్లీ తుపాను ప్రభావిత ప్రాంతాల్లో ఇంకా ఏమేమి చేయాలనుకుంటున్నారు? కలెక్టరు: పునరావాస కార్యక్రమాలు దాదాపుగా పూర్తయ్యాయి. విద్యుత్, తాగునీరు తదితర సౌకర్యాల విషయంలో సాధారణ పరిస్థితి వచ్చింది. ఇక నష్టపరిహారాల చెల్లింపు ప్రక్రియ వేగవంతం చేస్తున్నాం. పంటలు, తోటలు, ఇళ్లు, ఇతరత్రా ఆస్తి నష్టాలకు సంబంధించి గణన జరుగుతోంది. నాలుగు లక్షలకు పైగా బాధితులకు ఈనెల 5వ తేదీ నుంచి పరిహారం చెల్లింపు ప్రక్రియ ప్రారంభమవుతుంది. అవి వారి ఖాతాల్లోనే జమ అవుతోంది. దాదాపు రూ.450 కోట్ల వరకూ చెల్లించాల్సి ఉంటుంది. -
కలెక్టర్‌కు రెడ్‌క్రాస్ గోల్డ్‌మెడల్
సాక్షి, విశాఖపట్నం,శ్రీకాకుళం పాతబస్టాండ్ : విశాఖలోని వుడా చిల్డ్రన్ ఎరీనాలో శనివారం రెడ్‌క్రాస్ 2015–16, 2016–17 సంవత్సరాలకు సేవా అవార్డులు, బంగారు పతకాలను రాష్ట్ర గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ అందజేశారు. కార్యక్రమంలో శ్రీకాకుళం, కృష్ణా జిల్లాల కలెక్టర్ కె.ధనంజయరెడ్డి, లక్ష్మీకాంతం, విశాఖ కలెక్టర్ ప్రవీణ్‌కుమార్ తరఫున జేసీ సృజనలతో పాటు పలువురు ఐఏఎస్, రెవెన్యూ, పంచాయతీరాజ్‌శాఖల అధికారులు అవార్డులను అందుకున్నారు. కాగా సంస్థకు విరాళాలిచ్చిన వారిని గవర్నర్ అభినందించారు. అవార్డులు అందుకున్న వారిలో కలెక్టర్ ధనంజయరెడ్డితోసహా రెడ్‌క్రాస్ చైర్మన్ పి.జగన్మోహనరావు, సంయుక్త కలెక్టర్ కె.వి.ఎన్.చక్రధరబాబు, సంయుక్త కలెక్టర్–2 పి.రజనీకాంతరావు, రెడ్‌క్రాస్ సంస్థకు కోటి రూపాయలకు పైగా విరాళాలు అందించిన సి.వి.ఎన్.మూర్తి, కె.దుర్గా శ్రీనివాస్, రాజేంద్రకుమార్ కర్నానీ, పి.వైకుంఠరావు, బలివాడ మల్లేశ్వరరావు ఉన్నారు. -
ప్రొటోకాల్ ఉల్లంఘిస్తే సస్పెండ్ చేస్తా
శ్రీకాకుళం సిటీ: అధికార యంత్రాంగం ప్రొటోకాల్ పాటించకపోతే బాధ్యులను సస్పెండ్ చేస్తానని కలెక్టర్ కె.ధనంజయరెడ్డి స్పష్టం చేశారు. పాలకొండ నియోజకవర్గంలో అధికార యంత్రాంగం ప్రొటోకాల్ పాటించడం లేదన్న ఎమ్మెల్యే కళావతి ఫిర్యాదు మేరకు కలెక్టర్ పైవిధంగా స్పందించారు. గ్రామ సర్పంచ్ నుంచి మంత్రుల వరకు అధికారులు విధిగా ప్రొటోకాల్‌ను పాటించాలని ఆదేశించారు. శ్రీకాకుళం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో మంగళవారం జరిగిన స్థాయి సంఘ సమావేశం వాడీవేడిగా జరిగింది. ప్రతిపక్ష నేతలతో పాటు అధికార పార్టీ నాయకులు సైతం పలు శాఖల పనితీరుపై ధ్వజమెత్తారు. అధికారులకు, సభావేదికపై ఉన్న వారికి ప్రశ్నల వర్షం కురిపించారు. వారి సమాధానాలతో అసంతృప్తి వ్యక్తం చేసారు. మొత్తం 47 శాఖల ఉండగా, కేవలం ఏడుశాఖల పనితీరుపై మాత్రమే చర్చ కొనసాగింది. ఉదయం 11.20 నుంచి మధ్యాహ్నం 3 వరకు జెడ్పీలో జరిగిన స్థాయి సంఘాల సమావేశం తీరును పరిశీలిస్తే... చర్చించిన శాఖలు.. ఆర్అండ్బీ, ఇరిగేషన్, పంచాయతీరాజ్, హౌసింగ్, మార్కెటింగ్, ఆర్డబ్ల్యూఎస్, ఎస్ఎస్ఏ శాఖలపై చర్చిం చారు. జిల్లా పరిషత్ చైర్పర్సన్ చౌదరి ధనలక్ష్మి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు, విప్ కూన రవికుమార్, కలెక్టర్ కె.ధనంజయరెడ్డి, జాయింట్ కలెక్టర్ చక్రధరబాబు, జెడ్పీ సీఈఓ బి.నగేష్, ఎంపీ కింజరాపు రామ్మోహన్నాయుడు, ఎమ్మెల్యే కంబా ల జోగులు, విశ్వాసరాయి కళావతి, గౌతు శ్యాం సుందర్శివాజీ, కలమట వెంకటరమణ, బగ్గు రమణమూర్తి, జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, అధికారులు పాల్గొన్నారు. మరుగుదొడ్లు లేకపోతే పింఛన్ కట్.. మరుగుదొడ్లు నిర్మించకపోతే వ్యక్తిగత పింఛన్, రేషన్ సరుకులు నిలుపుదల చేస్తామని కలెక్టర్ ధనంజయరెడ్డి స్పష్టం చేశారు. ఈ విషయంలో సర్పంచ్‌లు అశ్రద్ధ చేస్తే 14వ ఆర్థిక సంఘ నిధులు ఆపేస్తామని చెప్పారు. స్వచ్చభారత్‌లో భాగంగా మరుగుదొడ్ల నిర్మాణానికి రూ.15 వేలు, ఏజెన్సీ ప్రాంతాల్లో రూ.18వేలు ఇస్తున్నామన్నారు. జిల్లాకు జీవనాడి వంశధార.. వంశధార నది జిల్లాకు జీవనాడి వంటిదని మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు. 19 నిర్వాసిత గ్రామాల్లో ప్రజలను ఖాళీ చేయించడంలో కలెక్టర్, ఎస్పీ, అధికార యంత్రాం గం కష్టపడి పనిచేశారని కితాబిచ్చారు. నిర్వాసితులకు నష్టపరిహారంగా రూ.12 కోట్లు అదనంగా ఖర్చు పెట్టామన్నారు. నిర్వాసితి కాలనీలకు ప్రత్యేకంగా బృందాలను పంపిస్తూ ఉపాధి జాబ్‌కార్డులను ఇస్తామని చెప్పారు. -
వ్యవస్థలో మార్పులు చేస్తేనే ఆర్టీసీ మనుగడ
► అధికార, కార్మిక భాగస్వామ్యంతోనే ప్రగతిబాట ► ఎన్ఎంయూ రాష్ట్ర చీఫ్ ఎగ్జిక్యూటివ్ ధనుంజయరెడ్డి నెల్లూరు(బృందావనం) : ఆర్టీసీలో అధికారులు పాత విధానాలకు స్వస్తి పలికి, వ్యవస్థలో మార్పులు తెచ్చి కార్మికులను భాగస్వామ్యం చేస్తేనే సంస్థ మనుగడ సాగిస్తుందని ఎన్ఎంయూ రాష్ట్ర చీఫ్ ఎగ్జిక్యూటివ్ కొడవలూరు ధనుంజయరెడ్డి అన్నారు. నెల్లూరులోని పురమందిరంలో గురువారం జరిగిన ఏపీఎస్ఆర్టీసీ నేషనల్ మజ్దూర్ యూనియన్ నెల్లూరు రీజియన్ 10వ మహాసభలో ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. ఆర్టీసీ ప్రగతిచక్రంలో పయనించేందుకు ఎన్నో మార్గాలు ఉన్నాయన్నారు. అయితే ప్రభుత్వ యంత్రాంగం సుమారు 70 ఏళ్లనాటి విధానాలనే అమలుపరుస్తోందన్నారు. ఈ కారణంగా ఆర్టీసీ మనుగడ రోజురోజుకు ప్రశ్నార్థకంగా మారిందని ఆవేదన వ్యక్తంచేశారు. ఆర్టీసీ లాభాలబాటలో పయనించేందుకు ఎన్నో మార్గాలు ఉన్నాయన్నారు. ఆ దిశగా ప్రభుత్వ యంత్రాంగం ఆలోచన చేయాలన్నారు. ఆర్టీసీని ప్రైవేట్ పరంచేసే ఆలోచన విరమించుకోవాలన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర చైర్మన్ ఆర్‌వీవీఎస్‌డీ ప్రసాద్, అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు చల్లాచంద్రయ్య, వై.శ్రీనివాసరావు, రాష్ట్రకార్యనిర్వాహక అధ్యక్షుడు పీవీ రమణారెడ్డి, నెల్లూరు రీజియన్ నాన్ ఆపరేషన్ గౌరవాధ్యక్షుడు గాదిరాజు అశోక్‌కుమార్ తదితరులు పాల్గొని మాట్లాడారు. -
జెడ్పీలో బదిలీలకు బ్రేక్..!
► ఖరారుకు ముగిసిన గడువు ► జెడ్పీ చైర్పర్సన్, సీఈవోల మధ్య కుదరని ఏకాభిప్రాయం! ► పైరవీల ప్రాధాన్యత కోసమేనని ప్రచారం ► ఒక్కో పోస్టుకు నాలుగు సిఫారసులు అరసవిల్లి(శ్రీకాకుళం) :జిల్లా పరిషత్ ఉద్యోగుల బదిలీలకు బ్రేక్ పడిందా.. అంటే అవుననే ప్రచారం జోరుగా సాగుతోంది. రాజకీయ ప్రాధాన్యం ఉన్న జిల్లా పరిషత్‌లో బదిలీల పర్వం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. నిబంధనల ప్రకారం ఈ నెల 24 నాటికి బదిలీల ఖరారు పూర్తి కావాల్సి ఉంది. అయితే మితిమీరిన రాజకీయ జోక్యంతో బదిలీలపై ఇంకా స్పష్టత రాలేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. దీనికి తోడు అనుకూల పోస్టింగులకు ప్రత్యేక ధర పలుకుతుండటంతో కొందరు ఉద్యోగులు ఇదే బాటలో రాజకీయ ఒత్తిళ్లు పెంచారనే ప్రచారం జోరందుకుంది. దీంతో బదిలీల ప్రక్రియ పూర్తి స్థాయిలో జరగకుండా నిలిచిపోయింది. ఈ నెల 22న జిల్లా పరిషత్ ఉద్యోగుల బదిలీల కౌన్సెలింగ్ జరిగింది. ఈ ప్రక్రియలో మొత్తం 206 మంది ఉద్యోగులు బదిలీలకు అర్హత సాధించగా, వీరిలో ఆప్షన్లు ఇవ్వకుండా గైర్హాజరైన వారు 66 మంది ఉన్నారు. మిగిలిన వారి బదిలీల జాబితాతో కూడిన ప్రత్యేక ఫైలు మాత్రం ఈ నెల 23 నాటికే సిద్ధమైంది. ఈ ఫైలుపై జెడ్పీ చైర్పర్సన్ చౌదరి ధనలక్ష్మి ఆమోదముద్ర పడాల్సి ఉంది. అయితే ఈ విషయంలో జెడ్పీ సీఈఓ నగేష్ తీసుకుంటున్న పలు నిర్ణయాలతో చైర్పర్సన్ కొంత మేరకు విభేదిస్తున్నట్లు తెలుస్తోంది. కలెక్టర్ ధనుంజయరెడ్డికి ఈ బదిలీ ఫైలు పంపించే విషయంలోనూ ఇరువురి మధ్య అభిప్రాయ భేదాలు తలెత్తినట్లు సమాచారం. అందుకే బదిలీ లకు తాత్కాలికంగా బ్రేక్ పడిందనే వాదనలు బలంగా విన్పిస్తున్నాయి. ఈ నేపథ్యంలో జెడ్పీ ఉద్యోగుల బదిలీల భవిష్యత్ ఎప్పుడు తేలుతుందా అని వేచి చూడాల్సిన పరిస్థితి నెలకొంది. పైరవీల ప్రాధాన్యతే ప్రధాన ఎజెండా..! జెడ్పీ యాజమాన్యంలో పనిచేస్తున్న ఉద్యోగుల బదిలీలకు సంబంధించి గంటగంటకూ మారిపోతున్న నిర్ణయాలతో జెడ్పీ ప్రాంగణం రెండ్రోజులుగా వేడెక్కిపోయింది. ఇదంతా పైరవీల ప్రాధాన్యతకు పెద్దపీట వేసేందుకే ఇలా జరుగుతుందనే ప్రచారం జోరందుకుంది. రూ.లక్షలు, వేలల్లో చేతులు మారడం, దూరాన్ని బట్టి, ఆదాయ వనరులను బట్టి పోస్టింగులకు ఓ ప్రత్యేక రేట్లు పెట్టడం వంటి అంశాలతో పాటు ప్రధానంగా జిల్లాలో రాజకీయ నేతలు, స్థానిక రాజకీయ పెద్దల సిఫారసులకు ప్రాధాన్యతపై ఆధిపత్య పోరే తాత్కాలిక బదిలీల నిలిపివేతకు కారణమంటూ గుసగుసలు విన్పిస్తున్నాయి. ఇదే ప్రధాన ఎజెండాగా బదిలీల పర్వం తుది దశ మెరుగులు దిద్దుకుంటోందని తెలుస్తోంది. జెడ్పీ చైర్‌పర్సన్‌కు కూడా జిల్లా నుంచి రాజకీయ నేతల ఒత్తిళ్లు, సామాజిక అంశాలు తీవ్ర ఒత్తిడికి గురిచేస్తున్నాయని సమాచారం. ఈ విషయంలో జిల్లాకు చెందిన ఇద్దరు మంత్రులు, ఎమ్మెల్యేల నుంచి భారీగా సిఫారసులు రావడంతో ఏం చెయ్యాలో తోచక అయోమయంలో పడ్డారని తెలుస్తోంది. దీనికితోడు తన సామాజిక వర్గానికి చెందిన వారికి అనుకూల పోస్టింగులు ఇచ్చేందుకు కూడా చైర్పర్సన్ పావులు కదుపుతున్నారని ప్రచారం జరుగుతోంది. అయితే పలు మండలాల నుంచి ఒకే పోస్టింగుకు రెండు నుంచి నాలుగు సిఫారసు లేఖలు రావడంతో ఎలా సంతృప్తి చెయ్యాలా అన్న సందిద్ధంలో పడ్డారు. చైర్పర్సన్ ఆమోదం పొందగానే.. జెడ్పీ ఉద్యోగుల బదిలీల ప్రక్రియ ఈ నెల 24 నాటికే పూర్తి కావాల్సి ఉంది. అయితే చైర్పర్సన్ వద్దకు ఫైలు పంపాం. ఆమె ఆమోదం పొందగానే బదిలీలపై ఉత్తర్వులు ఇస్తాం. వెంటనే కొత్త స్థానాల్లో ఉద్యోగులు జాయిన్ కావాల్సి ఉంటుంది. ఇంకా ఆప్షన్లు ఇవ్వని ఉద్యోగులను కచ్చితంగా మిగిలిన స్థానాలకు బదిలీలు చేస్తాం. – బి.నగేష్, జెడ్పీ సీఈవో, శ్రీకాకుళం -
డొల్ల కంపెనీలపై ఈడీ ఉక్కుపాదం
-
రుణాలిచ్చేందుకు ప్రణాళికలు
డీసీసీబీ చైర్మన్ మెట్టుకూరు నెల్లూరు(అర్బన్): వచ్చే సంవత్సరం(2017–18)కి సంబంధించి పంటరుణాలను రైతులకు విరివిగా అందించేందుకు ప్రణాళికలను సత్వరమే పూర్తి చేయాలని జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ చైర్మన్ మెట్టుకూరు ధనుంజయరెడ్డి అధికారులను కోరారు. స్థానిక గాంధీబొమ్మ సమీపంలోని కేంద్రసహకార బ్యాంకులో జిల్లా స్థాయి టెక్నికల్ కమిటీతో శుక్రవారం పంటరుణాలపై సమీక్ష సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పంట రకాన్ని బట్టి ఎకరాకు ఎంత రుణం ఇవ్వాలో నిర్ణయించాలో అధికారులు అభిప్రాయాలు తెలపాలని సూచించారు. రబీలో 35 పంటలకు, ఖరీఫ్‌లో 33 రకాల పంటలకు స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ ప్రకారం రుణాలు ఇచ్చే విషయమై చర్చించారు. ఈ ఏడాది వర్షాలు సరిగా పడనందువల్ల రైతులు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. అందువల్ల వారిని దృష్టిలో ఉంచుకుని రుణాలను సరళతరం చేయాలని నిర్ణయించారు. సమావేశంలో డీసీసీబీ జీఎం సరిత, డీసీఓ రాజేశ్వరరావు, ఉద్యానవనశాఖ ఏడీ ఉమాదేవి, వ్యవసాయశాఖ ఏడీ మురళీ, మత్య్సశాఖ అధికారులు, బ్యాంకర్లు పాల్గొన్నారు. -
రబీకి ప్రత్యామ్నాయ ప్రణాళిక
ఆరు తడుల పంటలను ప్రోత్సహించండి సరిపడా విత్తనాలను అందుబాటులో ఉంచండి వ్యవసాయ శాఖ కమిషనర్ ధనుంజయరెడ్డి నెల్లూరు రూరల్ : వర్షాభావ పరిస్థితుల్లో రబీ ప్రత్యామ్నాయ ప్రణాళికను సమర్థవంతంగా అమలు చేయాలని వ్యవసాయ శాఖ కమిషనర్ కె.ధనుంజయరెడ్డి ఆ శాఖ జిల్లా అధికారులకు సూచించారు. స్థానిక గోల్డెన్ జూబ్లీహాల్లో మండల వ్యవసాయ శాఖ అధికారులతో శనివారం ప్రత్యేక సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. కమిషనర్ మాట్లాడుతూ జిల్లాలో గత రబీలో వర్షాలు ముంచెత్తగా ఈ రబీకి వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయన్నారు. సాగు నీరు అందుబాటులో ఉండే ప్రాంతంలో వరి, కరువు ప్రాంతాల్లో అపరాలు సాగు చేసేలా రైతులను ప్రోత్సహించాలన్నారు. వ్యవసాయ ఉత్పత్తిలో నెల్లూరు జిల్లా కీలకమని, పంటల నిర్దేశించిన లక్ష్యం చేరుకునేలా ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. మండలంలో ఆయా ప్రాంతాల డిమాండ్‌కు అనుగుణంగా విత్తనాలను అందుబాటులో ఉంచాలని, విత్తన కొరత లేకుండా పూర్తిస్థాయిలో ముందస్తు చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లాకు అవసరమైన విత్తనాలు, ఎరువులు ఇన్డెంట్ పెట్టాలన్నారు. రైతులకు అందుబాటులో ఉండి సాగు విస్తీర్ణం పెంచాలని, పొలంబడి, పొలం పిలుస్తోంది కార్యక్రమం ద్వారా సూక్ష్మపోషకాల వాడకం, పురుగు మందులు తగ్గించడం, సరైన యాజమాన్య పద్ధతులపై రైతులకు అవగాహన కల్పించాలన్నారు. బయోప్రొడక్ట్ పేరుతో నకిలీ మందులు మార్కెట్లోకి వచ్చాయని, రైతులను ఆర్థికంగా నష్టపరుస్తున్న నకిలీలపై దృష్టి సారించాలన్నారు. డీలర్ల వద్ద నుంచి శాంపిల్స్ సేకరించి ల్యాబ్‌కు పంపించాలని, నకిలీ అని తేలితే బాధ్యులపై చర్యలు తీసుకోవాలన్నారు. డీలర్లతో ఏఓకు కుమ్మక్కయి రైతులకు అన్యాయం చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. పంటలను కాపుడుకునేందుకు రెయిన్‌గన్స్ ఉపయోగించాలన్నారు. రాష్ట్ర అపరాల స్పెషలిస్టు ఎన్డీఆర్కే శర్మ, జేడీఏ హేమమహేశ్వరారవు, ఆత్మ పీడీ దొరసాని, డీడీఏలు విజయభారతి, నాగజ్యోతి, ఏడీఏలు, ఏఓలు పాల్గొన్నారు. -
ఖాతాదారులకు మెరుగైన సేవలు
డీసీసీబీ చైర్మన్ మెట్టుకూరు ధనుంజయరెడ్డి నెల్లూరు రూరల్ : జిల్లా కేంద్ర సహకార బ్యాంకు ద్వారా ఖాతా దారులకు మెరుగైన సేవలు అందిస్తున్నట్లు డీసీసీబీ చైర్మన్ మెట్టుకూరు ధనుంజయరెడ్డి తెలిపారు. నెల్లూరు గాంధీబొమ్మ సెంటర్లోని ఆ బ్యాంక్ ప్రధాన కార్యాలయం ఆవరణలో తొలి ఏటీఎంను ఆయన శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బ్యాంకు సేవలను విస్తరిస్తున్నట్లు చెప్పారు. వాణిజ్య బ్యాంకులకు దీటుగా బ్యాంకు సేవలు అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. జిల్లా వ్యాపితంగా 10 ఏటీఎం కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. ఈ ఏడాది రూ.190 కోట్లు డిపాజిట్లు సేకరించామని, రూ.వెయ్యి కోట్ల వ్యాపాల లావాదేవీలతో బ్యాంకు లాభాల బాటలో పయనిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో బ్యాంకు వైస్ చైర్మన్ నల్లపరెడ్డి జగన్మోహన్రెడ్డి, సీఈఓ రాజారెడ్డి, డీసీఎంలు సరితా, ఉషారాణి, డైరెక్టర్లు పాల్గొన్నారు. -
లారీ ఢీకొని యువకుడి మృతి
బద్వేలు: వైఎస్సార్ జిల్లాలో బుధవారం మధ్యాహ్నం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు మృతిచెందాడు. బద్వేల్లోని నెల్లూరు జాతీయ రహదారిపై ద్విచక్ర వాహనాన్ని లారీ ఢీకొంది. ఈ ఘటనలో బద్వేలు విద్యానగర్‌కి చెందిన ధనుంజయ్ రెడ్డి(24) అనే యువకుడు అక్కడిక్కడే మృతిచెందగా..మరో వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. కృష్ణపట్నం నుంచి బళ్లారి వెళుతున్న బొగ్గులారీ ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించనున్నారు. -
సైకిలెక్కిన నెల్లూరు కాంగ్రెస్ నేతలు
హైదరాబాద్: నెల్లూరు జిల్లాకు చెందిన పలువురు కాంగ్రెస్ నేతలు ఆదివారం సీఎం చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరారు. ఎమ్మెల్సీ వాకాటి నారాయణరెడ్డి, డీసీసీబీ అధ్యక్షుడు ధనుంజయరెడ్డి, ఉపాధ్యక్షుడు ఎన్. జయకుమార్‌రెడ్డి, ఆనం జయకుమార్‌రెడ్డి తదితరులు టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. వీరిని పార్టీ కండువా కప్పి చంద్రబాబు ఆహ్వానించారు. -
ఎన్నికలు సమర్థంగా నిర్వహించండి
విజయనగరం మున్సిపాలిటీ, న్యూస్‌లైన్: రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు ఈ నెల 30న జరగనున్న పురపాలక సంఘ ఎన్నికలను పారదర్శకంగానూ, సమర్థంగా నిర్వహించాలని ఎన్నికల పరిశీలకుడు ధనుంజయరెడ్డి ఆదేశిం చారు. విజయనగరంలోని రాజీవ్ క్రీడా మైదానంలో ఎన్నికల సిబ్బందికి ఈవీఎంలపైన ఇస్తున్న శిక్షణను ఆదివారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పోలింగ్ రోజున రాజకీయ పార్టీల ఏజెంట్ల సమక్షంలో ఈవీవిఎం యూనిట్లను పరిశీలించి ఓటింగ్‌కు సిద్ధం చేయాలన్నారు. ప్రతి పోలింగ్ కేంద్రంలో వెబ్ కాస్టింగ్, వీడియోగ్రఫీ, మైక్రో అబ్జర్వర్లలో ఏదో ఒకటి ఉండేలా చర్యలు చేపట్టాల న్నారు. పకడ్బందీగా ఎన్నికల ప్రవర్తనా నియమావళి మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి ఎన్నికల ప్రవర్తనా నియామవళి పకడ్బందీగా అమలుచేయాలని ధనుంజయ్ రెడ్డి ఆదేశించారు. ఎన్నిక ల వ్యయానికి సంబంధించిన నివేదికలు అభ్యర్థిపరంగా పారదర్శకంగా నివేదించాలన్నారు. ప్రవర్తనా నియమావళి ఉల్లంఘనలు, ఎన్నికల వ్యయంపై ఫిర్యాదులను 9177745658 నంబరుకు ఫోన్ చేసి నేరుగా తనను సంప్రదించవచ్చన్నారు. కార్యక్రమంలో సంయుక్త కలెక్టర్ బి.రామారావు, ఏజేసీ యూసీజీ నాగేశ్వరరావు, ఆర్డీఓ జె.వెంకటరావు, పోలింగ్ సిబ్బంది పాల్గొన్నారు.