ఖాతాదారులకు మెరుగైన సేవలు | Efficient services to customers | Sakshi
Sakshi News home page

ఖాతాదారులకు మెరుగైన సేవలు

Published Sat, Sep 10 2016 1:02 AM | Last Updated on Mon, Sep 4 2017 12:49 PM

ఖాతాదారులకు మెరుగైన సేవలు

ఖాతాదారులకు మెరుగైన సేవలు

 
  • డీసీసీబీ చైర్మన్‌ మెట్టుకూరు ధనుంజయరెడ్డి
 
నెల్లూరు రూరల్‌ :
జిల్లా కేంద్ర సహకార బ్యాంకు ద్వారా ఖాతా దారులకు మెరుగైన సేవలు అందిస్తున్నట్లు డీసీసీబీ చైర్మన్‌ మెట్టుకూరు ధనుంజయరెడ్డి తెలిపారు. నెల్లూరు గాంధీబొమ్మ సెంటర్‌లోని ఆ బ్యాంక్‌ ప్రధాన కార్యాలయం ఆవరణలో తొలి ఏటీఎంను ఆయన శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బ్యాంకు సేవలను విస్తరిస్తున్నట్లు చెప్పారు. వాణిజ్య బ్యాంకులకు దీటుగా బ్యాంకు సేవలు అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. జిల్లా వ్యాపితంగా 10 ఏటీఎం కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. ఈ ఏడాది రూ.190 కోట్లు డిపాజిట్లు సేకరించామని, రూ.వెయ్యి కోట్ల వ్యాపాల లావాదేవీలతో బ్యాంకు లాభాల బాటలో పయనిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో బ్యాంకు వైస్‌ చైర్మన్‌ నల్లపరెడ్డి జగన్‌మోహన్‌రెడ్డి, సీఈఓ రాజారెడ్డి, డీసీఎంలు సరితా, ఉషారాణి, డైరెక్టర్లు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement