రుణాలిచ్చేందుకు ప్రణాళికలు | Disbursing of loans a priority | Sakshi
Sakshi News home page

రుణాలిచ్చేందుకు ప్రణాళికలు

Published Sat, Dec 10 2016 1:30 AM | Last Updated on Mon, Sep 4 2017 10:18 PM

రుణాలిచ్చేందుకు ప్రణాళికలు

రుణాలిచ్చేందుకు ప్రణాళికలు

  • డీసీసీబీ చైర్మన్‌ మెట్టుకూరు 
  • నెల్లూరు(అర్బన్‌):
    వచ్చే సంవత్సరం(2017–18)కి సంబంధించి పంటరుణాలను రైతులకు విరివిగా అందించేందుకు ప్రణాళికలను సత్వరమే పూర్తి చేయాలని జిల్లా కేంద్ర సహకార బ్యాంక్‌ చైర్మన్‌ మెట్టుకూరు ధనుంజయరెడ్డి అధికారులను కోరారు. స్థానిక గాంధీబొమ్మ సమీపంలోని కేంద్రసహకార బ్యాంకులో జిల్లా స్థాయి టెక్నికల్‌ కమిటీతో శుక్రవారం పంటరుణాలపై సమీక్ష సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పంట రకాన్ని బట్టి ఎకరాకు ఎంత రుణం ఇవ్వాలో నిర్ణయించాలో అధికారులు అభిప్రాయాలు తెలపాలని సూచించారు. రబీలో 35 పంటలకు, ఖరీఫ్‌లో 33 రకాల పంటలకు స్కేల్‌ ఆఫ్‌ ఫైనాన్స్‌ ప్రకారం రుణాలు ఇచ్చే విషయమై చర్చించారు. ఈ ఏడాది వర్షాలు సరిగా పడనందువల్ల రైతులు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. అందువల్ల వారిని దృష్టిలో ఉంచుకుని రుణాలను సరళతరం చేయాలని నిర్ణయించారు. సమావేశంలో డీసీసీబీ జీఎం సరిత, డీసీఓ రాజేశ్వరరావు, ఉద్యానవనశాఖ ఏడీ ఉమాదేవి, వ్యవసాయశాఖ ఏడీ మురళీ, మత్య్సశాఖ అధికారులు, బ్యాంకర్లు పాల్గొన్నారు.
     
     

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement