లారీ ఢీకొని యువకుడి మృతి | youth died in road accident at ysr district | Sakshi
Sakshi News home page

లారీ ఢీకొని యువకుడి మృతి

Published Wed, Feb 3 2016 4:45 PM | Last Updated on Wed, Sep 18 2019 3:24 PM

youth died in road accident at ysr district

బద్వేలు: వైఎస్సార్ జిల్లాలో బుధవారం మధ్యాహ్నం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు మృతిచెందాడు. బద్వేల్‌లోని నెల్లూరు జాతీయ రహదారిపై  ద్విచక్ర వాహనాన్ని లారీ ఢీకొంది.

ఈ ఘటనలో బద్వేలు విద్యానగర్‌కి చెందిన ధనుంజయ్ రెడ్డి(24) అనే యువకుడు అక్కడిక్కడే మృతిచెందగా..మరో వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. కృష్ణపట్నం నుంచి బళ్లారి వెళుతున్న బొగ్గులారీ ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించనున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement