ఎన్నికలు సమర్థంగా నిర్వహించండి | manage elections effectively | Sakshi
Sakshi News home page

ఎన్నికలు సమర్థంగా నిర్వహించండి

Published Mon, Mar 24 2014 3:50 AM | Last Updated on Thu, Jul 11 2019 8:26 PM

manage elections effectively

విజయనగరం మున్సిపాలిటీ, న్యూస్‌లైన్:  రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు ఈ నెల 30న జరగనున్న పురపాలక సంఘ ఎన్నికలను పారదర్శకంగానూ, సమర్థంగా నిర్వహించాలని  ఎన్నికల పరిశీలకుడు ధనుంజయరెడ్డి ఆదేశిం చారు. విజయనగరంలోని రాజీవ్ క్రీడా మైదానంలో ఎన్నికల సిబ్బందికి ఈవీఎంలపైన  ఇస్తున్న శిక్షణను ఆదివారం ఆయన పరిశీలించారు.
 
ఈ సందర్భంగా మాట్లాడుతూ  పోలింగ్ రోజున రాజకీయ పార్టీల ఏజెంట్ల సమక్షంలో ఈవీవిఎం యూనిట్లను పరిశీలించి ఓటింగ్‌కు సిద్ధం చేయాలన్నారు. ప్రతి పోలింగ్ కేంద్రంలో వెబ్ కాస్టింగ్, వీడియోగ్రఫీ, మైక్రో అబ్జర్వర్లలో ఏదో ఒకటి ఉండేలా చర్యలు చేపట్టాల న్నారు.
 
పకడ్బందీగా ఎన్నికల ప్రవర్తనా నియమావళి
మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి ఎన్నికల ప్రవర్తనా నియామవళి పకడ్బందీగా అమలుచేయాలని ధనుంజయ్ రెడ్డి ఆదేశించారు. ఎన్నిక ల వ్యయానికి  సంబంధించిన నివేదికలు అభ్యర్థిపరంగా పారదర్శకంగా నివేదించాలన్నారు.
 
ప్రవర్తనా  నియమావళి ఉల్లంఘనలు, ఎన్నికల వ్యయంపై ఫిర్యాదులను 9177745658 నంబరుకు ఫోన్ చేసి నేరుగా తనను సంప్రదించవచ్చన్నారు. కార్యక్రమంలో సంయుక్త కలెక్టర్ బి.రామారావు, ఏజేసీ యూసీజీ నాగేశ్వరరావు, ఆర్డీఓ జె.వెంకటరావు, పోలింగ్ సిబ్బంది పాల్గొన్నారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement