షుగర్ ఫ్యాక్టరీ తెరిపిస్తాం | Sugar Factory open Attempt ram mohan naidu | Sakshi
Sakshi News home page

షుగర్ ఫ్యాక్టరీ తెరిపిస్తాం

Published Mon, Jun 2 2014 1:10 AM | Last Updated on Sun, Sep 2 2018 4:48 PM

షుగర్ ఫ్యాక్టరీ తెరిపిస్తాం - Sakshi

షుగర్ ఫ్యాక్టరీ తెరిపిస్తాం

 ఆమదాలవలస రూరల్, న్యూస్‌లైన్: ఆమదాలవలస షుగర్ ఫ్యాక్టరీని తప్పనిసరిగా తెరిపించేందుకు ప్రయత్నిస్తామని శ్రీకాకుళం ఎంపీ కింజారాపు రామోహన్ నాయుడు అన్నారు. మున్సిపాలిటీలోని నాలుగవ వార్డు గేదలవానిపేట కౌన్సిలర్ స్వతంత్ర అభ్యర్థిగా ఎన్నికైన రుప్ప రామచంద్రారావు, మండలంలోని చిట్టివలస పంచాయితీ సర్పంచ్ గుజ్జల జగదీశ్వరీలు ఏర్పాటు చేసిన విజయోత్సవ సభకు ఆయనతోపాటు ఎమ్మెల్యే కూన రవికుమార్, శ్రీకాకుళం ఎమ్మెల్యే గుండ లక్ష్మీదేవిలు అతిధిలుగా హాజరయ్యారు. ఈ సందర్బంగా ఎంపీ మాట్లాడుతూ అభివృద్ధి అంటే ఏమిటో ఈ ఐదేళ్ళ పాలనలో చూపిస్తామన్నారు. ఆమదాలవలస మున్సిపాలిటీలో టీడీపీ జెండా ఎగరవేస్తామని కాబట్టి మున్సిపాలిటీ నుంచి గాని, శ్రీకాకుళం రూరల్ నుంచి అభివృద్ధి పనులు కోసం మా ముగ్గురిలో ఎవరినైనా కలవవచ్చునని తెలిపారు.అలాగే ఆమదాలవలస నియోజకవర్గంలో కుటుంబాల పాలన పోయిందని అందుకే నిజాయితీ, నిబద్దత కలిగిన కూన రవికుమార్‌ను గెలిపించారన్నారు. కార్యక్రమంలో తమ్మినేని విద్యాసాగర్, కిల్లి రామ్మోహనరావు, తమ్మినేని గీత, ఇంజరాపు విశ్వనాథం,గుడ్ల రాజ్యలక్ష్మీ, బొడ్డేపల్లి లక్ష్మణరావు, యండ అప్పలనాయుడు, మొదలవలస రమేష్, జీడి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement