శ్రీకాకుళం జిల్లా రేగిడి మండలంలోని సంకలి చక్కెర కర్మాగారంలో ప్రమాదం చోటు చేసుకుంది.
రేగిడి: శ్రీకాకుళం జిల్లా రేగిడి మండలంలోని సంకలి చక్కెర కర్మాగారంలో ప్రమాదం చోటు చేసుకుంది. ఫ్యాక్టరీలోని ఇథనాల్ ట్యాంక్‌లో శుభ్రపరుస్తుండగా ఆక్సిజన్ అందక ముగ్గురు కార్మికులు మృతి చెందారు. మృతులు లక్ష్మీపురానికి చెందిన కెంబూరి చంద్రరావు, ఎర్నేని సోంబాబు, ఆబోతుల తవిటి నాయుడుగా గుర్తించారు. యాజమాన్య నిర్లక్ష్యం కారణంగానే ప్రమాదం జరిగిందని మృతదేహాలతో ఫ్యాక్టరీ గేటు ముందు బంధువులు ఆందోళనకు దిగారు.