ఢిల్లీ: దేశ రాజధాని హస్తినలో భారీ వర్షాల కారణంగా ఢిల్లీ విమానాశ్రయంలోని టెర్మినల్-1 రూఫ్ కూలిపోయింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతిచెందారు. ఇక, ప్రమాదానికి గల కారణాలను తెలుసుకుంటామని పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు తెలిపారు. అలాగే, అక్కడ సహాయక చర్యలు కొనసాగుతున్నాయన్నారు.
కాగా, విమానాశ్రయంలో పైకప్పు కూలిన ప్రదేశాన్ని శుక్రవారం ఉదయం రామ్మోహన్ నాయుడు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కూలిపోయిన టర్మినల్ వద్ద సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. విమాన ప్రయాణీకులు అందరికి తగిన ఏర్పాట్లు చేశాం. ఈ ప్రమాదానికి కారణాలను తెలుసుకుంటాం. ఈ టెర్మినల్‌ను ప్రధాని మోదీ చేతుల మీదుగా ప్రారంభించినట్టు ప్రతిపక్ష నేతలు చెబుతున్నారు. అది నిజం కాదు. 2009లో టెర్మినల్ నిర్మాణం జరిగిందని క్లారిటీ ఇచ్చారు.
మరోవైపు.. ఈ ఘటనలో చనిపోయినవారి కుటుంబానికి రూ.20లక్షలు ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. అలాగే, గాయపడిన వారికి రూ.3 లక్షల సాయం అందించనున్నట్టు తెలిపారు. అలాగే, గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను రామ్మోహన్ పరామర్శించారు.
ఇక, ఈ ప్రమాదంపై కాంగ్రెస్ నేతలు మల్లికార్జున ఖర్గే, ప్రియాంక గాంధీ స్పందించారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ ఈ టెర్మినల్‌ను ప్రారంభించారు. 2024వ ఏడాదిలోనే దీన్ని ప్రారంభించారు. మోదీ ప్రభుత్వంలో అవినీతి పెరిగిపోయింది. బీజేపీ హయాంలో గత పదేళ్లలో పలు నిర్మాణాలు కూలిపోతున్నాయి. ఇలాంటి ఘటనపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment