ఢిల్లీ ఎయిర్‌పోర్టు ప్రమాదానికి కారణం అదేనా?.. వీడియో వైరల్‌ Delhi Heavy Rains Effect Airport Terminal Collapse | Sakshi
Sakshi News home page

ఢిల్లీ ఎయిర్‌పోర్టు ప్రమాదానికి కారణం అదేనా?.. వీడియో వైరల్‌

Published Fri, Jun 28 2024 10:16 AM | Last Updated on Fri, Jun 28 2024 11:30 AM

Delhi Heavy Rains Effect Airport Terminal Collapse

సాక్షి, ఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో భారీ వర్షాలు కురుస్తున్నాయి.  ఈ క్రమంలో ఢిల్లీ విమానాశ్రయంలో టెర్మినల్‌-1 పైకప్పు శుక్రవారం తెల్లవారుజామున కుప్పకూలింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతిచెందగా ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ప్రమాదం సందర్బంగా టెర్మినల్‌ పైకప్పు ట్యాక్సీలు సహా పలు కార్లపై పడిపోవడంతో వాహనాలు నుజ్జునుజ్జయ్యాయి.

అయితే, భారీ వర్షం నేపథ్యంలో టెర్మినల్‌ పైకప్పు కూలినట్లు తమకు ఉదయం 5:30 గంటల సమయంలో సమాచారం అందినట్లు అధికారులు చెబుతున్నారు. అయితే, ఇదురుగాలుల కారణంగా పైకప్పు కూలినట్టు తెలిపారు. మరోవైపు.. టెర్మినల్‌ పైకప్పుపై పెద్ద మొత్తంలో వరద నీరు ఆగిపోయింది. పైకప్పునకు ఉన్న లీకేజీల కారణంగా కొన్ని గంటల పాటు వర్షపు నీరు కిందకు పారుతూనే ఉంది. ఈ కారణంగానే పైకప్పు కూలిపోయిందని తెలుస్తోంది. 

ఇక, దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. మరోవైపు టెర్మినల్‌1 నుంచి బయలుదేరే అన్ని విమాన సర్వీసులను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు విమానాశ్రయ అధికారులు ప్రకటించారు. కూలిన టెర్మినల్‌ వద్ద సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.

మరోవైపు ప్రమాదంపై ఎక్స్‌ ద్వారా స్పందిన కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి  కింజారపు రామ్మోహన్‌ నాయుడు.. కాసేపటికే ఘటనాస్థలికి చేరుకున్నారు. అక్కడ ప్రమాదంపై ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘‘భారీ వర్షాల కారణంగా ఎయిర్‌పోర్టు వెలుపల ఉన్న రూఫ్‌ భాగం కొంత భాగం కూలిపోయింది. ఈ విషాద ఘటనలో చనిపోయిన వ్యక్తి కుటుంబానికి సంతాపం తెలియజేస్తున్నాం. అలాగే గాయపడిన నలుగురికి మెరుగైన వైద్యం అందించే ప్రయత్నాలు చేస్తున్నాం. ఘటన జరిగిన వెంటనే ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్, ఫైర్ సేఫ్టీ టీమ్‌ను ఇక్కడికి పంపించాం. ప్రమాద నేపథ్యంలో టెర్మినల్ భవనంలోని మిగిలిన భాగాన్ని మూసివేశారు. ఇక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అంతా క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు అని తెలిపారు.    

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement