ఒకరి మృతి, ఆరుగురికి గాయాలు
విమాన సర్వీసులకు అంతరాయం
న్యూఢిల్లీ: భారీ వర్షాలకు దేశ రాజధానిలోని ఇందిరాగాంధీ జాతీయ విమానాశ్రయంలో టెరి్మనల్ 1 (పాతది) పై కప్పు పాక్షికంగా కుప్పకూలింది. కొంత భాగం కూలి నేరుగా కింద ఉన్న కార్లపై పడింది. దాంతో రమేశ్ కుమార్ (43) అనే ట్యాక్సీ డ్రైవర్ దుర్మరణం పాలయ్యాడు. ఆరుగురు గాయపడ్డారు. శుక్రవారం ఉదయం 5:30 గంటల సమయంలో ఈ దుర్ఘటన జరిగింది. అగి్నమాపక యంత్రాలు హుటాహుటిన సహాయక చర్యలు చేపట్టాయి. కూలిన బీమ్‌ల కింద ఉన్న కారులోంచి ఒకరిని కాపాడారు. క్షతగాత్రులను ఆస్పత్రులకు తరలించారు.
‘‘శుక్రవారం తెల్లవారుజాము నుంచి కురుస్తున్న భారీ వర్షంతో రూఫ్ షీట్, సపోర్ట్ బీమ్‌లు కూలాయి. పార్క్ చేసిన 4 కార్లు దెబ్బతిన్నాయి’’ అని అధికారులు తెలిపారు. ఈ ఘటనతో టెరి్మనల్ 1 నుంచి అన్ని విమాన సేవలనూ నిలిపివేశారు. చెకిన్ కౌంటర్లను కూడా మూసేశారు. ప్రయాణికులకు ప్రత్యామ్నాయ విమానాల్లో వసతి కలి్పంచారు. కొందరికి టికెట్ డబ్బులు తిరిగిచ్చారు. ఈ టెరి్మనల్‌లో ఇండిగో, స్పైస్‌జెట్ దేశీయ విమాన కార్యకలాపాలు సాగిస్తాయి. అవి కార్యకలాపాలను తాత్కాలికంగా టెరి్మనల్ 2, 3కి మార్చాయి. విస్తరించిన టెరి్మనల్ 1ను ప్రధాని మోదీ మార్చిలో ప్రారంభించారు.
పూర్తిస్థాయి విచారణ: కింజరాపు
పౌర విమానయాన మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు టెరి్మనల్ 1ను సందర్శించారు. అధికారులతో పరిస్థితిని సమీక్షించారు. ఘటనపై పూర్తి స్థాయి విచారణకు ఆదేశించినట్టు చెప్పారు. మృతుని కుటుంబానికి రూ.20 లక్షలు, క్షతగాత్రులకు రూ.3 లక్షల పరిహారం ప్రకటించారు.
ప్రచార యావ వల్లే: ప్రతిపక్షాలు
మోదీ సర్కారు ప్రచార యావ వల్లే టెరి్మనల్ పై కప్పు కూలిందని విపక్షాలు ఆరోపించాయి. నిర్మాణం పూర్తవకుండానే లోక్‌సభ ఎన్నికల ప్రచారం కోసం మోదీ దాన్ని హడావుడిగా ప్రారంభించారంటూ ఆప్ దుయ్యబట్టింది. ప్రభుత్వ నేరపూరిత నిర్లక్ష్యమే దీనికి కారణమని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే
మండిపడ్డారు.
Comments
Please login to add a commentAdd a comment