24 గంటల్లో 228 మిల్లీమీటర్లు.. ఢిల్లీ వాన సరికొత్త రికార్డు Delhi Weather Updates: Heavy Rain Lashes Out Latest News | Sakshi
Sakshi News home page

వీడియోలు: కుండపోత.. 24 గంటల్లో 228 మిల్లీమీటర్లు.. ఢిల్లీ వాన సరికొత్త రికార్డు

Published Fri, Jun 28 2024 7:41 AM | Last Updated on Fri, Jun 28 2024 10:24 AM

Delhi Weather Updates: Heavy Rain Lashes Out Latest News

న్యూఢిల్లీ, సాక్షి: రాత్రంతా ఎడతెరిపి లేకుండా కురిసిన వాన.. ఢిల్లీని నీట ముంచింది. తెల్లారి చూసేసరికి.. నీట మునిగిన రోడ్లు.. కాలనీలు, అందులో బైకులు, కార్లు నగరవాసుల్ని బిత్తరపోయేలా చేశాయి. మరోవైపు ఢిల్లీఎయిర్‌పోర్ట్‌ టెర్మినల్‌-1 వద్ద పైకప్పు కూలిన ఘటనలో ఒకరు మృతి చెందినట్లు అధికారులు ప్రకటించారు. మరో ముగ్గురికి తీవ్ర గాయాలుకాగా, టెర్మినల్‌-1 వద్ద కార్యకలాపాల్ని అధికారులు నిలిపివేశారు.

వేసవి తాపంతో అల్లలాడిపోతున్న దేశరాజధానిని వరుసగా రెండో రోజు వరుణుడు పలకరించాడు. అయితే వర్షం నాన్‌స్టాప్‌గా కురవడంతో రోడ్లన్నీ జలమయం అయ్యాయి. పొద్దుపొద్దున్నే ట్రాఫిక్‌జామ్‌తో జనాలు అవస్తలు పడ్డారు. గత 24 గంటల్లో 228 మిల్లీమిటర్ల వర్షపాతం నమోదు కాగా, కేవలం అర్ధరాత్రి 2.30గం. నుంచి 5.30గం. మధ్యలోనే 150 మిల్లీమీటర్ల​ వర్షం నమోదైంది. ఢిల్లీ జూన్‌ వర్షాల్లో ఇది కొత్త రికార్డు అని అధికారులు అంటున్నారు. 

1936లో జూన్‌ 28వ తేదీన 235.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. కాగా, నిన్న కురిసిన వర్షం రెండో అత్యధికం అనేది అధికారికంగా ధృవీకరణ కావాల్సి ఉంది.


 

 

శుక్రవారం వేకువజామున ఈదురు గాలుల వాన ధాటికి ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌ టెర్మినల్‌-1 వద్ద పైకప్పు కూలిపోయింది. ఘటనలో కొన్ని వాహనాలు ధ్వంసం అయ్యాయి. పలువురు అందులో చిక్కుకుపోయారు. సమాచారం అందుకున్న వెంటనే సహాయక చర్యలు మొదలయ్యాయి. ఫైర్‌ సిబ్బంది క్షతగాత్రుల్ని  బయటకు తీసి ఆస్పత్రికి తరలించారు. అయితే  ఈ ఘటనలో ఒకరు మరణించినట్లు అధికారులు ధృవీకరించారు. ఆరుగురికి గాయాలయ్యాయని, అందులో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయని వైద్యులు తెలిపారు.

శుక్రవారం ఉదయం 5.30గం. ప్రాంతంలో ఘటన జరిగిందని సమాచారం వచ్చిందని, వాళ్లను రక్షించి బయటకు తీసి ఆస్పత్రికి తరలించామని ఫైర్‌ విభాగం డైరెక్టర్‌ అతుల్‌ గార్గ్‌ తెలిపారు. ప్రస్తుతం అక్కడ సహాయక చర్యలు కొనసాగుతుండడంతో.. టెర్మినల్‌ వద్ద కార్యకలాపాలను పూర్తిగా నిలిపివేశారు. దీంతో ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు. 

 

 

మరోవైపు ఈ ఘటనసహాయక చర్యలను వ్యక్తిగతంగా పర్యవేక్షిస్తున్నట్లు కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి రామ్మోహన్‌నాయుడు ఎక్స్‌ ద్వారా తెలియజేశారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement