సాక్షి, ఢిల్లీ: మైక్రోసాఫ్ట్ సర్వర్‌లో సాంకేతిక సమస్య భారత్ సహా ఇతర దేశాలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ఈ కారణంగా పలు విమాన సర్వీసులు రద్దు కాగా, మరికొన్ని చోట్ల ఆలస్యంగా నడుస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రయాణీకుల ఇబ్బందులకు దృష్టిపెట్టుకుని వారికి తగిన ఏర్పాట్లు చేయాలని పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు తెలిపారు.
ఇక, మైక్రోసాఫ్ట్ సర్వర్ సమస్య నేపథ్యంలో రామ్మెహన్ నాయుడు తాజాగా మీడియాతో మాట్లాడుతూ.. ప్రయాణికుల పట్ల విమానాశ్రయ అధికారులు, విమానయాన సంస్థలు సానుభూతితో వ్యవహరించాలి. విమాన సర్వీసుల ఆలస్యం కారణంగా ప్రయాణికులకు అదనపు సీటింగ్, వాటర్, ఆహారాన్ని అందించండి. ప్రయాణీకుల సురక్షిత ప్రయాణం కోసం టెక్నికల్ టీమ్ పనిచేస్తోంది. ఇలాంటి సమాయాల్లో ప్రయాణీకుల సహకారం కూడా తప్పకుండా అవసరం. టెక్నికల్ సమస్య, విమాన సర్వీసుల రాకపోకలపై ఎలాంటి అప్‌డేట్ ఉన్నా ప్రయాణీకులకు వెంటనే తెలియజేయాలని ఆదేశించినట్టు తెలిపారు.
విమానాశ్రయాల్లో ప్రయాణీకుల అవసరాల కోసం అదనపు సిబ్బందిని కూడా ఏర్పాటు చేశామన్నారు. మైక్రోసాఫ్ట్ సంస్థతో అధికారులు టచ్‌లోనే ఉన్నారు. వీలైనంత త్వరగా మామూలు పరిస్థితులు నెలకొంటాయని ఆశాభావం వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment