
సాక్షి, శ్రీసత్యసాయి జిల్లా: కర్ణాటకలో జరిగిన రోడ్డు ప్రమాదంలో శ్రీసత్యసాయి జిల్లాకు చెందిన నలుగురు మృతి చెందారు. డివైడర్‌ను బొలెరో వాహనం ఢీకొట్టింది. రాయ్‌చూర్ జిల్లా దేవదుర్గ తాలూకా గబ్బురు పోలీస్ స్టేషన్ పరిధిలోని అమలాపురం వద్ద వీరి వాహనం డివైడర్‌ను ఢీకొట్టింది.
మృతులను హిందూపురానికి చెందిన మురళి, నాగరాజు, సోము, భూషణ్‌గా గుర్తించారు. వీరంతా కర్ణాటకలోని యాద్గిర్ జిల్లా షహపూర్ మార్కెట్‌లో గొర్రెలను కొనుగోలు చేయడానికి వెళ్లినట్లు సమాచారం. వాహనం డ్రైవర్ ఆనంద్ గాయాలతో బయటపడ్డాడు. స్థానికులు అతన్ని వైద్య చికిత్స కోసం సమీపంలోని ఆసుపత్రికి తరలించారు.