Road Accident
-
తిరుపతిలో రోడ్డు ప్రమాదం, బస్సు బోల్తా
సాక్షి, తిరుపతి: తిరుపతి జిల్లా రేణిగుంట మండలం మర్రిగుంట జాతీయ రహదారి దగ్గర రోడ్డు ప్రమాదం జరిగింది. ట్రాక్టర్‌ను తప్పించబోయి డిక్షన్ కంపెనీ బస్సు బోల్తా పడింది. 50 మందికి తీవ్ర గాయాలు కాగా, ఆసుపత్రికి తరలించారు. సంఘటన స్థలానికి చేరుకున్న రేణిగుంట పోలీసులు.. సహాయక చర్యలు చేపట్టారు. ట్రాఫిక్ క్లియర్ చేయించారు. మరో ఘటనలో.. జాతీయ రహదారిపై ఆగి ఉన్న లారీని వెనుక నుంచి మరో లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో లారీలోని డ్రైవర్, క్లీనర్లు ఇద్దరు క్యాబిన్లో ఇరుక్కు పోయి నరకయాతన పడిన సంఘటన పోటుపాళెం క్రాస్ రోడ్డు సమీపంలో సోమవారం చోటుచేసుకుంది. గూడూరు రూరల్ ఎస్ఐ మనోజ్‌కుమార్ కథనం.. గుంటూరు నుంచి మిర్చీ లోడ్డుతో వెళుతున్న లారీ పోటుపాళెం క్రాస్ రోడ్డు సమపంలోకి వేకువజామున వచ్చింది.అప్పటికే అక్కడ రోడ్డుపై ఆగి ఉన్న మరో లారీని వెనుక వైపు నుంచి వేగంగా ఢీకొట్టి బోల్తాపడింది. లారీ క్యాబిన్ నుజ్జునుజ్జు కాగా అందులోనే డ్రైవర్, క్లీనర్ ఇరుక్కు పోయారు. రోడ్డుపై లారీ బోల్తా పడడంతో నెల్లూరు వైపు నుంచి వచ్చే వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని క్యాబిన్లో ఇరుక్కుపోయిన మిర్చిలోడ్డు లారీ డ్రైవర్, క్లీనర్‌ను బయటకు తీసి గూడూరు ఏరియా ఆస్పత్రికి తరలించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం నెల్లూరుకు తీసుకువెళ్లారు. రోడ్డుకడ్డంగా పడిన లారీని తొలగించి ట్రాఫిక్‌ను పునరుద్ధరించారు. -
చిన్నారిని ఛిదిమేసిన కారు
గోదావరిఖని(రామగుండం): రెండోకాన్పు కోసం తల్లిగారింటికి వచ్చింది.. పండంటి పాపకు జన్మనిచ్చింది. అంతా సంతోషంగా ఉన్న సమయంలో ఆమె మొదటి సంతానం మూడేళ్ల బాలున్ని కారు రూపంలో మృత్యువు బలితీసుకుంది. గోదావరిఖని వన్‌టౌన్ ఎస్సై భూమేశ్ కథనం ప్రకారం.. స్థానిక గంగానగర్‌లో శివరాజ్‌కుమార్(3) ఆదివారం కారు ఢీకొని మృతిచెందాడు. ముత్తారం మండలం మచ్చుపేట గ్రామానికి చెందిన పులిపాక రమేశ్ కొండగట్టు జేఎన్టీయూలో కాంట్రాక్టు కార్మికుడిగా పనిచేస్తున్నాడు. అతడికి గంగానగర్‌కు చెందిన సంధ్యతో వివాహం జరిగింది. వీరికి మూడేళ్ల శివరాజ్‌కుమార్ ఉండగా, సంధ్య రెండో కాన్పుకోసం తల్లిగారింటికి గంగానగర్ వచ్చింది. పాప జన్మించి మూడు నెలలు అయ్యింది. ఆదివారం కుటుంబ సభ్యులతో శివరాజ్‌కుమార్ ఆడుకుంటూ అనుకోకుండా ఒక్కసారిగా రోడ్ పైకి రాగా, మంచిర్యాల్ నుంచి గంగానగర్‌కు వెళ్తున్న కార్ ఢీకొట్టింది. ఈప్రమాదంలో శివరాజ్‌కుమార్ మెడపై భాగంలో గాయాలయ్యాయి. స్థానిక ప్రైవేట్ ఆసుపత్రికి, అక్కడ నుంచి ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లగా అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు పేర్కొన్నారు. బాలుడి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. అప్పటివరకు అందరితో ఆడుకుంటూ క్షణాల్లో మాయమైన కుమారున్ని చూసి తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించడం అందరినీ కంటతడి పెట్టించింది. -
ఇద్దరు సాఫ్ట్వేర్ ఉద్యోగుల దుర్మరణం
దుండిగల్(హైదరాబాద్): ఓఆర్ఆర్పై వేగంగా దూసుకువచ్చిన కారు అదుపు తప్పి విద్యుత్ స్తంభాన్ని ఢీకొన్న ప్రమాదంలో ఇద్దరు సాఫ్వేర్ ఇంజినీర్లు అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ఘటన దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆదివారం చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. ఒడిశా రాష్ట్రానికి చెందిన భాను ప్రకాశ్ (36), నళినికంఠ బిస్వాల్ (37)లు స్నేహితులు. వీరు తమ కుటుంబాలతో కలిసి రాజేంద్రనగర్ మంచిరేవులలోని ఓ అపార్ట్మెంట్లో నివాసముంటూ సాఫ్ట్వేర్ ఇంజినీర్లుగా పని చేస్తున్నారు. వీరిద్దరు ఆదివారం తెల్లవారుజామున 3.30 గంటల సమయంలో మేడ్చల్ నుంచి పటాన్చెరు వైపు కారులో వస్తున్నారు. ఈ క్రమంలో మల్లంపేట ఓఆర్ఆర్ ఎగ్జిట్ వద్ద వేగంగా వస్తున్న కారు అదుపు తప్పి విద్యుత్ స్తంభాన్ని ఢీ కొట్టింది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన భాను ప్రకాశ్, బిస్వాల్ అక్కడికక్కడే మృతి చెందారు. భాను ప్రకాశ్ భార్య సాయి లక్ష్మి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. నిద్రమత్తుతో పాటు అతివేగం కారణంగానే ప్రమాదం జరిగిందని పోలీసులు భావిస్తున్నారు. -
Hit And Run: స్విగ్గీ డెలివరీ బాయ్ దుర్మరణం
హైదరాబాద్: కానిస్టేబుల్ పోటీ పరీక్షలకు ప్రిపేరవుతున్న యువకుడు వేసవి సెలవుల్లో స్విగ్గీబాయ్గా చేరి రోడ్డు ప్రమాదంలో ప్రాణాలను పోగొట్టుకున్న ఘటన నార్సింగి పోలీస్‌స్టేషన్ పరిధిలోని పుప్పాలగూడలో శుక్రవారం ఉదయం చోటుచేసుకుంది. నార్సింగి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్‌కు చెందిన కుతాడి జీవన్ కుమార్ (21) కానిస్టేబుల్ పరీక్షలకు సన్నద్ధమవుతున్నాడు. వేసవి సెలవులు ఉండటంతో నగరానికి వచ్చి స్విగ్గీ డెలివరీ బాయ్‌గా చేరాడు. తన తండ్రికి ఇటీవల గుండె ఆపరేషన్ కావటం, కుటుంబ ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉండటంతో నగరానికి వచ్చి పని చేస్తున్నాడు. విధుల్లో భాగంగా శుక్రవారం ఉదయం పుప్పాలగూడ ఈఐపీఎల్ కార్నర్ స్టోన్ సమీపంలో జీవన్ ద్విచక్ర వాహనాన్ని ఎదురుగా వచ్చిన కారు ఢీకొట్టింది. కింద పడిన అతడిపై నుంచి వెనకగా వచ్చిన టిప్పర్ వెళ్లడంతో తీవ్ర గాయాలపాలై అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడి ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టిన కారు, టిప్పర్ల డ్రైవర్లు పరారయ్యారు. మృతుడి తండ్రి తిరుపతి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
కర్ణాటకలో రోడ్డు ప్రమాదం.. నలుగురు ఏపీ వాసుల మృతి
సాక్షి, శ్రీసత్యసాయి జిల్లా: కర్ణాటకలో జరిగిన రోడ్డు ప్రమాదంలో శ్రీసత్యసాయి జిల్లాకు చెందిన నలుగురు మృతి చెందారు. డివైడర్‌ను బొలెరో వాహనం ఢీకొట్టింది. రాయ్‌చూర్ జిల్లా దేవదుర్గ తాలూకా గబ్బురు పోలీస్ స్టేషన్ పరిధిలోని అమలాపురం వద్ద వీరి వాహనం డివైడర్‌ను ఢీకొట్టింది.మృతులను హిందూపురానికి చెందిన మురళి, నాగరాజు, సోము, భూషణ్‌గా గుర్తించారు. వీరంతా కర్ణాటకలోని యాద్గిర్ జిల్లా షహపూర్ మార్కెట్లో గొర్రెలను కొనుగోలు చేయడానికి వెళ్లినట్లు సమాచారం. వాహనం డ్రైవర్ ఆనంద్ గాయాలతో బయటపడ్డాడు. స్థానికులు అతన్ని వైద్య చికిత్స కోసం సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. -
వన్ వే.. సెల్‌ఫోన్ డ్రైవింగ్
పెద్దపల్లిరూరల్: పెద్దపల్లి జిల్లా అప్పన్నపేట శివారులో గురువారం ఆర్టీసీ పల్లెవెలుగు బస్సు ఎదురుగా వస్తున్న చెరువుమట్టి టిప్పర్‌ను బలంగా ఢీ కొట్టింది. ఈ ఘటనలో 27మంది ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. బస్సు ప్రయాణికులు, పోలీసుల కథనం ప్రకారం.. కరీంనగర్ నుంచి గోదావరిఖని వైపు వెళ్తున్న ఆర్టీసీ బస్సు, జిల్లాలోని అంతర్గాం మండలం ముర్మూరు నుంచి చెరువు మట్టిని రంగాపూర్ ఇటుకబట్టీకి తరలిస్తున్న టిప్పర్‌ను బలంగా ఢీకొట్టింది. ఆ సమయంలో బస్సులో 32 మంది ప్రయాణికులున్నారు. 27మందికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను అంబులెన్సులో పెద్దపల్లి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. చికిత్స తరువాత కొందరిని ఇళ్లకు పంపించారు. కండక్టర్ కూకట్ల శ్రీనివాస్‌కు తీవ్రగాయాలు కావడంతో కరీంనగర్‌కు తరలించారు.సెల్‌ఫోన్ డ్రైవింగ్‌తోనే ప్రమాదంపెద్దపల్లిలోని శాంతినగర్ నుంచి అప్పన్నపేట వరకు రాజీవ్ రహదారి మరమ్మతు పనులు చేపట్టారు. వాహనాలను వన్ వే లో నడిపిస్తున్నారు. బస్సు డ్రైవర్ నాగేందర్ సెల్‌ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేస్తుండడంతో ప్రమాదం జరిగిందని కమాన్‌పూర్ ప్రాంత ప్రయాణికుడు సదయ్య తెలిపాడు. ప్రమాదంలో 27మంది గాయపడగా 22 మంది మహిళలే ఉన్నారు. పెద్దపల్లి ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను ఎమ్మెల్యే విజయరమణారావు పరామర్శించారు. మెరుగైన వైద్యం అందించాలని సూపరింటెండెండ్ శ్రీధర్‌ను ఆదేశించారు. ఏసీపీ గజ్జి కృష్ణ, సీఐ ప్రవీణ్‌కుమార్, ఎస్సై మల్లేశం పర్యవేక్షించారు.క్షతగాత్రులకు మెరుగైన వైద్యసేవలుపెద్దపల్లి మండలం అప్పన్నపేట శివారులో జరిగిన రోడ్డుప్రమాదంలో గాయాలపాలైన ప్రయాణీకులకు పెద్దపల్లి ప్రభుత్వాసుపత్రిలో మెరుగైన వైద్య సేవలందించారని కలెక్టర్ కోయ శ్రీహర్ష తెలిపారు. క్షతగాత్రులు వారి బంధువులు ఎవరూ ఆందోళన పడాల్సిన అవసరం లేదన్నారు. ఆసుపత్రి సూపరింటెండ్ శ్రీధర్ మరో 10 మంది వైద్యబృందం అందుబాటులో ఉంటూ బాధితులకు మెరుగైన సేవలందిస్తారని పేర్కొన్నారు. -
మాలాంటి క్షోభ మరెవ్వరికీ వద్దు..వారికి సాయం చేయాలి : బాబూ మోహన్
చౌటుప్పల్: యువత వాహనాలు నడిపేటప్పుడు తమ కుటుంబాన్ని గుర్తుచేసుకోవాలని సినీ నటుడు, మాజీ మంత్రి బాబూమోహన్ సూచించారు. చౌటుప్పల్ పట్టణ కేంద్రంలోని అమ్మానాన్న అనాథాశ్రమాన్ని మంగళవారం ఆయన సందర్శించారు. ఆశ్రమంలోని ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అక్కడ ఆశ్రయం పొందుతున్న వారికి భోజనం వడ్డించారు. మతిస్థిమితం కోల్పోయిన వ్యక్తికి జుట్టు కత్తిరించారు. అనాథలతో ఆప్యాయంగా ముచ్చటించారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. వాహనాలు నడిపేటప్పుడు ఒక్క క్షణం ఆలోచన చేయకపోవడం మూలంగా చోటుచేసుకునే ఘటనలతో జీవింతాం క్షోభ అనుభవించాల్సి వస్తుందన్నారు. ఇదీ చదవండి: నాన్న అంటే అంతేరా...! వైరల్ వీడియోతాము సరైన పద్ధతిలో వెళ్తే సరిపోదని, ఎదుటి వ్యక్తులు సైతం సరైన పద్ధతిలో వస్తేనే ప్రమాదాలు జరగవన్నారు. గతంలో తన కుమారుడు ఓ పాపను తప్పించే క్రమంలో రోడ్డు ప్రమాదానికి గురై చనిపోయాడని గుర్తుచేసుకున్నారు. అనాథలకు సేవ చేసే భాగ్యం ఊరికనే రాదని, భగవంతుడు సంకల్పిస్తేనే అది సాధ్యమవుతుందన్నారు. ఆర్థికంగా ఉన్నత స్థాయిలో ఉన్న వ్యక్తులు అనాథలకు సేవలందించేందుకు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. అమ్మనాన్న అనాథాశ్రమాన్ని సందర్శించడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. పేదలు, అనాథలు, అభాగ్యులకు సేవ చేస్తే ఎంతగానో సంతృప్తినిస్తుందన్నారు. తాను కూడా తన కుమారుడైన పవన్ బాబూమోహన్ పేరిట ట్రస్ట్ ఏర్పాటు చేసి పేదలకు సేవలు అందిస్తున్నామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో టీయూడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్షుడు విరాహత్ అలీ, ఆశ్రమ నిర్వాహకుడు గట్టు శంకర్, పవన్ బాబూమోహన్ ట్రస్ట్ ప్రతినిధి రాజ్‌కుమార్, ఆశ్రమ ప్రతినిధులు గట్టు శ్రావణి, గట్టు శ్రావణ్ పాల్గొన్నారు.చదవండి: ఎయిర్ హోస్టెస్‌పై లైంగిక దాడి, వెంటిలేటర్‌పై ఉండగానే అమానుషం! -
ఘోర రోడ్డు ప్రమాదం.. ఎగిరిపడిన స్కార్పియో టాప్
ఒంటిమిట్ట/నంద్యాల: వైఎస్సార్ కడప జిల్లా ఒంటిమిట్ట మండలంలోని కడప–చెన్నై జాతీయ రహదారి సోమవారం నెత్తురోడింది. స్కార్పియో, బస్సు ఢీకొన్న ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే మరణించారు. పోలీసులు తెలిపిన వివరాలివీ.. తిరుపతి నుంచి నంద్యాలకు వెళ్తున్న స్కార్పియో(ఏపీ31 cw 7479) వాహనం ఒంటిమిట్ట మండల పరిధిలోని నడింపల్లి వద్దనున్న కడప–చెన్నై జాతీయ రహదారిపైకి రాగానే తిరుపతికి వెళ్తున్న ఏపీఎస్ ఆర్టీసీ ఎలక్ట్రిక్ బస్సు(ఏపీ 39 యుఎం 9771)ను వేగంగా ఢీకొంది.స్కార్పియో పల్టీకొట్టి ఎలక్ట్రిక్ బస్సు వెనుక వస్తున్న పెట్రోలింగ్ వాహనాన్ని కూడా ఢీ కొట్టింది. ప్రమాదంలో స్కార్పియోలోని నలుగురిలో తేజనాయుడు(19), ధర్మారెడ్డి(26), వినోద్(25)లు అక్కడికక్కడే మరణించారు. మహానంది పోలీసు స్టేషన్లో కానిస్టేబుల్‌గా పని చేస్తున్న సునిల్‌నాయుడుకి తీవ్రగాయాలు అయ్యాయి. ఇతనితో పాటు పెట్రోలింగ్ వాహనం నడుపుతున్న కానిస్టేబుల్ రఘురాంరెడ్డి కూడా తీవ్రంగా గాయపడ్డాడు. మృతుడు ధర్మారెడ్డిచేత మద్యం మాన్పించేందుకు తిరుపతికి నాటుమందు కోసమని వెళ్లి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. విషయం తెలుసుకున్న సీఐ బాబు, ఎస్ఐ శివప్రసాద్‌రెడ్డి ఘటనా స్థలానికి చేరుకొని గాయపడిన వారిని 108లో కడప రిమ్స్‌కు తరలించారు. ప్రమాదం జరిగిన సమాచారాన్ని కడప డీఎస్పీ వెంకటేశ్వర్లకు చేరవేయడంతో ఆయన సంఘటనా స్థలానికి చేరుకుని, మృతదేహాలను పరిశీలించి, ప్రమాదానికి కారణాలు తెలుసుకున్నారు. ఘటనపై రోడ్డు రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల వివరాలు ⇒ తేజనాయుడు స్వస్థలం నంద్యాలలోని హౌసింగ్ బోర్డు కాలనీ. తల్లిదండ్రులు భద్ర, రాజేశ్వరి. ఇతను పట్టణంలోని ఓ కళాశాలలో ఐటీఐ చదువుతున్నాడు. ⇒వినోద్ స్వస్థలం బండిఆత్మకూరు మండలంలోని సోమయాజులపల్లె. తల్లిదండ్రులు వెంకటలక్ష్మమ్మ, వెంకటరాముడు. టవర్ల వద్ద జనరేటర్ మెకానిక్‌గా పనిచేస్తున్నాడు. ⇒ ధర్మారెడ్డి స్వస్థలం చాగలమర్రి మండలం డి.కొత్తపల్లె. తండ్రి శివశంకర్‌రెడ్డి వ్యవసాయం చేస్తుండగా, తల్లి అన్నమ్మ ఉన్నారు. నంద్యాలలోని జియో కంపెనీలో పనిచేస్తున్నాడు. ఇటీవల అక్క జ్యోతి వివాహం కాగా, తమ్ముడు శ్రీనివాసరెడ్డి ట్రాన్స్ఫారం కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు.స్కార్పియో మితిమీరిన వేగమే కారణం రోడ్డు ప్రమాద స్థలాన్ని కడప ఆర్టీసీ ఆర్ఎం పి.గోపాల్‌రెడ్డి పరిశీలించారు. అక్కడ ఉన్న పరిస్థితిని చూస్తే స్కార్పియో వాహనం నడిపిన వారిదే తప్పుగా తెలుస్తోందన్నారు. మితిమీరిన వేగంతో బస్సు మోటును ఢీకొట్టడంతో స్పీడ్ మీదు తిరుగుకుంటూ వెళ్లి బస్సు వెనుక వైపు వస్తున్న పెట్రోలింగ్ వాహనాన్ని ఢీకొట్టి ఉంటారన్నారు. పూర్తిగా తెలుసుకునేందుకు ఎలక్ట్రిక్ బస్సుకు ఉన్న సీసీ ఫుటేజీని పరిశీలిస్తామని తెలిపారు. -
కారు కొన్న సంతోషం ఎంతోసేపు నిలవలేదు..చివరికి...
చిత్తూరు: ఉపాధ్యాయ దంపతులు నూతన కారు కొనుగోలు చేశారు.. అదే సమయంలో కుమారై ఇంటర్లో అధిక మార్కులు సాధించడంతో సంతోషంగా తీర్థ యాత్రలకు వెళ్లి తిరిగీ ఇంటికి వెళ్లే సమయంలో తీర్థయాత్ర అంతిమ యాత్రగా మారింది. ఓ లారీ మృత్యువు రూపంలో వచ్చి ఆ సంతోషాన్ని క్షణాల్లో చిదిమేయడంతో తల్లి మృతి చెందగా భర్త , కుమారై ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్న విషాదకర సంఘటన ఆదివారం జరిగింది. దీంతో మూడు జిల్లాల్లో విషాదం నెలకొంది. వివరాలిలా ఉన్నాయి. పుట్టపర్తి జిల్లా కదిరి పట్టణంలో నివాసం ఉన్న వెంకటరమణ (48) , శారద (45) ఉపాధ్యాయులుగా పని చేస్తున్నారు. వీరికి కుమారై కీర్తన (17) , కుమారుడు శ్రీకర్ (12) ఉన్నారు. ఇలా ఉండగా వెంకటరమణ నూతనంగా కారు కొనుగోలు చేశారు. కుమారై ఇంటర్ ద్వితీయ సంవత్సరం పరీక్షల్లో 976 మార్కులతో ఉత్తీర్ణత సాధించింది. కుమారుడు శ్రీకర్ గుడివాడలో 7వ తరగతి చదువుతున్నాడు. అంతా సంతోషంగా పున్నమి రోజున శనివారం తమిళనాడులోని తిరువణ్నామలైలో గిరి ప్రదక్షిణానికి వెళ్లారు. స్వామి వారిని భక్తితో పూజించుకుని , మొక్కులు చెల్లించుకుని ఆదివారం ఉదయం అక్కడి నుంచి కదిరికి బయలు దేరారు. మార్గ మధ్యలో పుంగనూరు మండలం సుగాలిమిట్ట వద్దకు కారు రాగానే ఎదురుగా మదనపల్లె నుంచి అతివేగంగా వచ్చిన ఐషర్ లారీ కారును ఢీకొంది. ఈ ప్రమాదంలో శారద అక్కడికక్కడే మృతి చెందింది. వెంకటరమణ, కుమారై కీర్తన తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు గమనించి బాధితులను మదనపల్లె ఆసుపత్రికి తరలించారు. వీరిద్దరి పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన వైద్యం కోసం బెంగళూరుకు తరలించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి శవాన్ని పోస్టుమార్టంకు తరలించి, దర్యాప్తు చేపట్టారు. మూడు జిల్లాల్లో విషాదం రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన శారద, వెంకట రమణ కుటుంబం పుట్టపర్తి జిల్లా కదిరిలో నివాసం ఉన్నారు. శారద అదే మండలం బాలప్పగారిపల్లెలో టీచర్‌గా పనిచేస్తున్నారు. అలాగే వెంకటరమణ అన్నమయ్య జిల్లా సోంపల్లెలో స్కూల్ అసిస్టెంట్‌గా పని చేస్తున్నారు. కాగా వెంకటరమణ స్వగ్రామం కలకడ మండలం ఎర్రయ్యగారిపల్లె కావడంతో అంత్యక్రియలు అక్కడ నిర్వహించనున్నారు. ఈ ప్రమాద వార్త తెలియగానే మూడు జిల్లాల్లో విషాదం చోటు చేసుకుంది. ఉపాధ్యాయులు, బంధుమిత్రుల రోదనలు పలువురిని కలచివేసింది. -
ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకోబోయి.!
హైదరాబాద్ : బాలానగర్ డివిజన్ పరిధిలోని ఐడీపీఎల్ పోలీసులు వాహనాలు తనిఖీ చేస్తుండగా ఓ వ్యక్తి తన బైక్‌ను వేగంగా వెనక్కి మళ్లించి వేగంగా వెళ్లే క్రమంలో ఆర్టీసీ బస్సు కింద పడి మృతి చెందిన ఘటన బాలానగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఆదివారం చోటుచేసుకుంది. సీఐ నరసింహ రాజు తెలిపిన వివరాల ప్రకారం.. షాపూర్ నగర్లో నివసించే జోషిబాబు (35) కార్పెంటర్ పని చేస్తున్నాడు. జీడిమెట్ల నుంచి బాలానగర్ వైపు వస్తున్న క్రమంలో ట్రాఫిక్ పోలీసులు వాహనాలు తనిఖీ చేస్తున్నారు. వీరిని చూసి భయపడి తిరిగి వేగంగా వెనక్కి వెళ్లే క్రమంలో తన ద్విచక్ర వాహనం పడిపోయింది. దీంతో అతని తలపై నుంచి ఆర్టీసీ దూసుపోయింది. తల ఛిద్రమై అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడి తమ్ముడి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు బాలానగర్ పోలీసులు తెలిపారు. -
వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో నలుగురు మహిళల మృతి
పరిగి/పుంగనూరు: రాష్ట్రంలో వేర్వేరు ప్రాంతాల్లో జరిగిన రోడ్డు ప్రమాదాల్లో నలుగురు మహిళలు మృతి చెందారు. శ్రీసత్యసాయి జిల్లాలో ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు. రొద్దం మండలం దొడగట్ట గ్రామానికి చెందిన 13 మంది ఆదివారం ఉదయం హిందూపురం మండలం కొటిపి గ్రామంలోని చౌడమ్మ ఆలయానికి వెళ్లి వస్తుండగా.. ధనాపురం సమీపంలో ఆటో డ్రైవర్ బాబుకు నిద్ర మత్తుగా ఉండటంతో మొహం కడుక్కోవాలని ఆటోను పక్కకు నిలిపి ఉంచగా గుర్తు తెలియని వాహనం వెనుక వైపు నుంచి వేగంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఉప్పర అలివేలమ్మ (45), ఉప్పర సాకమ్మ(65), బోయ వెంకటలక్ష్మమ్మ (65) అనే మహిళలు అక్కడికక్కడే చనిపోయారు. వీరంతా కూలీలే. ఆటోడ్రైవర్ సహా 11 మంది గాయపడ్డారు. వీరిలో ఏడుగురికి తీవ్ర గాయాలయ్యాయి. అతివేగంతో కారును ఢీకొన్న లారీ.. అతివేగంగా వస్తోన్న లారీ ఎదురుగా వస్తోన్న కారును ఢీకొనడంతో ఉపాధ్యాయురాలు మృతి చెందగా ఆమె భర్త, కుమార్తె తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన చిత్తూరు జిల్లా సుగాలిమిట్ట వద్ద ఆదివారం జరిగింది. శ్రీసత్యసాయి జిల్లా కదిరి నివాసి వెంకటరమణ (48) అన్నమయ్య జిల్లా మొలకలచెరువు మండలం సొంపల్లెలో స్కూల్ అసిస్టెంట్. ఆయన భార్య శారద (45) శ్రీసత్యసాయి జిల్లా కదిరి మండలం బాలప్పగారిపల్లెలో టీచర్.వీరికి కుమార్తె కీర్తన (17), కుమారుడు శ్రీకర్ (12) ఉన్నారు. వెంకటరమణ భార్య, కుమార్తెతో కలిసి శనివారం తిరువణ్ణామలైలో గిరి ప్రదక్షిణకు వెళ్లాడు. ఆదివారం అక్కడి నుంచి కదిరికి బయలుదేరగా..సుగాలిమిట్ట వద్దకు కారు రాగానే ఎదురుగా అతివేగంగా వచ్చిన లారీ వీరి కారును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో శారద అక్కడికక్కడే మృతి చెందగా..వెంకటరమణ, కీర్తన తీవ్రంగా గాయపడ్డారు. -
Hyd: బస్సు కింద పడి యువకుడు దుర్మరణం.. రోడ్డుపై బంధువుల ఆందోళన
హైదరాబాద్: నగరంలోని బాలా నగర్ పరిధిలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఓ యువకుడు బస్సు కింద పడి దుర్మరణం చెందాడు. ట్రాఫిక్ పోలీసులు ఆపడంతో తప్పించుకునే క్రమంలో అదుపు తప్పి బస్సు కింద పడ్డాడు ఆ క్రమంలోనే బస్సు అతనిపై నుంచి వెళ్లడంతో అక్కడికక్కడే దుర్మరణం చెందాడు. ఐడీపీఎల్ నుంచి బాలా నగర్ రోడ్డు మార్గంలో ఈ ఘటన చోటు చేసుకుంది. యువకుడు మృతి వార్త తెలుసుకున్న బంధువులు బాలా నగర్-ఐడీపీఎల్ ప్రధాన రహదారిపైకి వచ్చి ధర్నా చేపట్టారు. యువకుడు మృతికి ట్రాఫిక్ పోలీసులే కారణమంటూ ఆందోళనకు దిగారు. రోడ్డుపై బైఠాయించి తమకు న్యాయం చేయాలంటూ నిరసన చేపట్టారు. దాంతో ట్రాఫిక్ భారీగా నిలిచిపోయింది. ఐడీపీఎల్ నుంచి బాలా నగర్ వరకూ కిలో మీటర్ల మేర ట్రాఫిక్ ఆగిపోయింది. దాంతో వాహన దారులు తీవ్ర కష్టాల్లో పడ్డారు. -
కూతురి పెళ్లి రోజే.. నిండు ముత్తైదువుగా తల్లి కాటికి
తమిళనాడు: కుమార్తె పెళ్లికి భర్తతో కలిసి బైక్‌పై వెళ్తుండగా రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి చెందింది. అయితే తల్లి మరణవార్త కుమార్తెకు తెలియనివ్వకుండా బంధువులు పెళ్లి జరిపించారు. వివరాలు.. తంజావూరు జిల్లా అయ్యనార్పురం గ్రామానికి చెందిన రంగస్వామి (55). ఇతని భార్య మాలతి (50). ఇద్దరూ రోజువారీ కూలీలు. వీరి కుమార్తె సుకీర్త, సతీష్ కుమార్ వివాహం గురువారం ఊరణిపురంలోని ఆలయంలో జరిగింది. కుమార్తె వివాహానికి ఏర్పాట్లు చేసిన దంపతులు రంగస్వామి, మాలతి ఇంటి నుంచి మోటారు సైకిల్‌పై వివాహానికి వెళ్లారు. మోటారు సైకిల్‌ను రంగస్వామి నడిపాడు. మాలతి వెనక కూర్చుంది.తిరువోణం సమీపంలోని కాళయరాయన్ రోడ్డులోని నరియట్రు వంతెన వైపు వెళ్తుండగా.. ద్విచక్రవాహనం అనూహ్యంగా రోడ్డు పక్కన ఉన్న బ్రిడ్జి బారికేడ్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో మాలతి తలకు గాయమై అక్కడికక్కడే మృతి చెందింది. తీవ్రంగా గాయపడిన రంగస్వామిని చికిత్స నిమిత్తం తంజావూరు ప్రభుత్వ వైద్య కళాశాలలో అసుపత్రిలో చేర్చారు. కూతురు పెళ్లి చేయబోతున్న సమయంలో ప్రమాదంలో రంగస్వామి తీవ్రంగా గాయపడగా.. మాలతి మృతి చెందడం బంధువులను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది.కూతురు పెళ్లి చేయబోతున్న సమయంలో ప్రమాదంలో రంగస్వామికి తీవ్రగాయాలు కాగా మాలతి మృతి చెందడం బంధువులను దిగ్భ్రాంతికి గురి చేసింది. అయితే యాక్సిడెంట్లో తల్లి మరణించిన విషయాన్ని వధువుకు తెలియజేయకుండా పెళ్లి జరిపించాలని బంధువులు నిర్ణయించారు. ఆ ప్రకారమే సుకీర్త, సతీష్ పెళ్లి చేశారు. తర్వాత ప్రమాదంలో తల్లి చనిపోయిందని, తండ్రికి తీవ్రగాయాలు అయ్యాయని బంధువులు వధువు సుకీర్తకు తెలిపారు. అది విని బోరున ఏడ్చింది. బంధువులు ఆమెను ఓదార్చారు. కూతురి పెళ్లి రోజునే ప్రమాదంలో తల్లి మృతి చెందడం బంధువులు, గ్రామస్తుల్లో తీవ్ర విషాదాన్ని నింపింది. -
HYD: మియాపూర్ మెట్రోస్టేషన్ వద్ద లారీ బీభత్సం
హైదరాబాద్,సాక్షి: మియాపూర్ మెట్రోస్టేషన్ వద్ద ఓ లారీ బీభత్సం సృష్టించింది. కూకట్పల్లి నుంచి మియాపూర్ వైపు వేగంగా వచ్చి ట్రాఫిక్ కానిస్టేబుల్స్‌పైకి లారీ దూసుకెళ్లింది. అంబ్రెల్లాను ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో ట్రాఫిక్ విధులు ముగ్గురు పోలీసులకు తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాదంతో అప్రమత్తమైన స్థానికులు అత్యవసర చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అయితే ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న హోంగార్డ్ సింహాచలం మరణించారు. కానిస్టేబుళ్లు వికేందర్,రాజవర్థన్‌లు చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం, వారి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ప్రమాదానికి కారణమైన లారీ డ్రైవర్ పరారయ్యాడు. కేసు నమోదు చేసుకున్న మియాపూర్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. -
AP: రోడ్డు ప్రమాదంలో స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ మృతి
అన్నమయ్య జిల్లా,సాక్షి : సంబేపల్లె మండలంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఏపీ10బీఎఫ్ 4990 కారులో ప్రయాణిస్తున్న హంద్రీనీవా స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ రమాదేవీ మరణించారు.చిత్తూరు-కర్నూలు జాతీయ రహదారిపై సోమవారం ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది. పీలేరు-రాయచోటి రహదారిలో రెండు కార్లు బలంగా ఢీకొన్నాయి. ఈ ప్రమాద సమయంలో ఓ కారులో ప్రయాణిస్తున్న స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ రమాదేవి తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాదంపై అప్రమత్తమైన స్థానికులు క్షతగాత్రుల్ని అత్యవసర చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ రమాదేవి మరణించినట్లు వైద్యులు తెలిపారు. -
మరో పదిహేను రోజుల్లో పెళ్లి.. నేడు పుట్టిన రోజు.. అంతలోనే విషాదం
గండేపల్లి/జగ్గంపేట(కాకినాడ): మరో పదిహేను రోజుల్లో పెళ్లి.. నేడు పుట్టిన రోజు.. ఈ నేపథ్యంలో కొత్త దుస్తులు కొనుక్కుని.. ఎంతో ఆనందంగా తిరిగి వస్తున్న ఆ యువకుడిపై మృత్యువు కన్నెర్ర చేసింది. లారీ రూపంలో దూసుకువచ్చి, అతడి ఆయువు హరించేసింది. పెళ్లి చేసుకుని, కొడుకు, కోడలు చిలకాగోరింకల్లా తమ కళ్ల ముందు తిరుగుతూంటే చూసి మురిసిపోవాలనుకున్న కలలు కల్లలు కావడంతో ఆ తల్లిదండ్రుల ఆవేదనకు అంతేలేకుండా పోయింది. ఈ విషాద ఘటన వివరాలివీ.. గండేపల్లి మండలం మల్లేపల్లికి చెందిన చిక్కాల కాటమస్వామి, సావిత్రి దంపతులకు కుమార్తె, కుమారుడు చిక్కాల శ్రీను (28) ఉన్నారు. కుమార్తెకు గతంలోనే వివాహం చేశారు. శ్రీను ట్రాక్టర్ డ్రైవర్‌గా జీవనం సాగిస్తున్నాడు. తండ్రి కాటమ స్వామి వ్యవసాయం చేస్తున్నారు. శ్రీనుకు గోకవరం మండలం మల్లవరం గ్రామానికి చెందిన అమ్మాయితో ఈ నెల 20న వివాహం చేయాలని నిశ్చయించారు. శనివారం శ్రీను పుట్టిన రోజు. ఈ నేపథ్యంలో పుట్టిన రోజు, పెళ్లి వేడుకలకు అవసరమైన దుస్తులు కొనుగోలు చేసేందుకు స్నేహితుడితో కలిసి, శ్రీను శుక్రవారం మోటార్ సైకిల్‌పై పెద్దాపురం వెళ్లాడు. అక్కడ మిత్రులిద్దరూ కొత్త దుస్తులు కొనుకున్నారు. సాయంత్రం ఆనందంగా ఇంటికి తిరిగి వస్తూండగా, వారి బైక్‌ను జగ్గంపేట మండలం కాట్రావులపల్లి పెట్రోల్ బంకు వద్ద వెనుక నుంచి వస్తున్న లారీ వేగంగా ఢీకొంది. ఈ ప్రమాదంలో శ్రీను (28) అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యాడు. మోటార్ సైకిల్‌పై ఉన్న స్నేహితుడు స్వల్పంగా గాయపడ్డాడు. ఈ ప్రమాదంపై జగ్గంపేట ఎస్సై రఘునాథరావు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు. పెళ్లింట పెను విషాదం శ్రీను పెళ్లి సమయం సమీపిస్తూండటంతో కుంటుంబ సభ్యులందరూ పెళ్లి పనుల్లో నిమగ్నమయ్యారు. ఇంతలోనే పెళ్లి దుస్తుల కోసం వెళ్లిన వరుడు శ్రీను రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడనే సమాచారంతో కుటుంబం తల్లడిల్లిపోయింది. పుట్టిన రోజు వేడుక, పెళ్లి సంబరాలతో ఆనందం నిండాల్సిన ఆ ఇంట్లో ఒక్కసారిగా రోదనలు మిన్నంటాయి. పరిసరాల్లో విషాదం నెలకొంది. అందరితోనూ స్నేహభావంతో ఉండే శ్రీను మృతి అందరినీ కలచి వేసింది. -
కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం
-
‘నాన్న.. సౌదీ వెళ్లేందుకు పనిపూర్తయ్యింది..’
కరీంనగర్: వాళ్లిద్దరూ మంచి స్నేహితులు.. ఎవరికి ఆపద వచ్చినా సహకరించుకుంటారు.. సుఖదుఃఖాలనూ పంచుకుంటారు.. చివరకు మరణంలోనూ ఇద్దరూ కలిసే వెళ్లారు.. హృదయం ద్రవింపజేసిన ఈ ఘటన రాజీవ్ రహదారిపై గురువారం రాత్రి చోటుచేసుకుంది. ప్రమాదంలో మహమ్మద్ గౌస్(34), షేక్ ఇమ్రాన్(28) దుర్మరణం చెందారు. ఎస్సై శ్రావణ్‌కుమార్, కుటుంబసభ్యుల కథనం ప్రకారం.. రామగుండానికి చెందిన మహమ్మద్‌గౌస్ ఎన్టీపీసీలో జీమ్ ట్రైనర్. విదేశాలకు వెళ్లేందుకు యత్నిస్తున్నాడు. ఈక్రమంలో వీసా దరఖాస్తు చేసేందుకు తన ఇంటిసమీపంలో ఉండే స్నేహితుడు, కారు డ్రైవర్ షేక్ ఇమ్రాన్‌తో కలిసి బంధువుల కారులో గురువారం ఉదయం హైదారాబాద్ వెళ్లారు. అక్కడ పనులు పూర్తిచేకుని రాత్రివేళ బయలు దేరారు. శుక్రవారం తెల్లవారుజామున సుల్తానాబాద్ చేరుకున్నారు. ఇక్కడి రాజీవ్ రాహదారిపై ఆగిఉన్న లారీని అదుపుతప్పి వెనకాల ఢీకొన్నారు. తీవ్రగాయాలైన ఇమ్రాన్ అక్కడికక్కడే మృతి చెందాడు. మహమ్మద్గౌస్ను స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించేలోపే చనిపోయాడు. మహమ్మద్ గౌస్ కారు నడుపుతుండగా ఇమ్రాన్ పక్క సీట్లో కూర్చున్నాడు. ఆగిఉన్న లారీని ఢీకొట్టగా రెండు బెలూన్స్ తెరుకున్నాయి. అయినా, ఇద్దరి ప్రాణాలు దక్కలేదు. కారు నుజ్జునుజ్జు అయ్యింది. గౌస్‌కు భార్య, పాప(4), బాబు(1.5) ఉన్నారు. ఇమ్రాన్‌కు ఇంకా పెళ్లికాలేదు. ‘నాన్న.. సౌదీ వెళ్లేందుకు పనిపూర్తయ్యింది..’ రామగుండం: ‘నాన్న.. సౌదీ వెళ్లేందుకు అవసరమైన వీసా పనిపూర్తయ్యింది.. నాలుగైదు రోజుల్లో వీసా వస్తుంది..’ అని తన తండ్రి పాషాతో ఫోన్లో మాట్లాడిన మహ్మద్ గౌస్ రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో ఆ కుటుంబంలో విషాదం నెలకొంది. మహ్మద్ గౌస్ ఉరఫ్ నిసార్ బాడీబిల్డర్. స్థానికంగా పలు వ్యాపారాలు నిర్వహించినా నష్టాలు వచ్చాయి. దీంతో ఉపాధి కోసం సౌదీ వెళ్లేందుకు నిర్ణయించారు. హైదరాబాద్ కారులో వెళ్లి వీసాకు సంబంధించిన ప్రక్రియ పూర్తిచేసుకుని తండ్రి పాషాతో మాట్లాడారు. అంతలోనే సుల్తానాబాద్ వద్ద రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందడంతో కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. ఇదే ప్రమాదంలో చనిపోయిన ఇమ్రాన్ కారు డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. నాలుగు నెలల్లో నలుగురు స్నేహితులు.. పట్టణానికి చెందిన ఎండీ గౌస్, ఇమ్రాన్, షేక్ అఫ్సరొద్దీన్, సయ్యద్ ఇమ్రాన్ నలుగురూ మంచి స్నేహితులు. వీరిలో సయ్యద్ ఇమ్రాన్ గతేడాది అక్టోబర్ 8న అంతర్గాం గోదావరి నది ఒడ్డున స్నేహితులతో కలిసి విందు చేసుకునే క్రమంలో ప్రమాదవాశాత్తు నీటిలో పడి మృతిచెందాడు. అదే ఏడాది డిసెంబర్ 24న షేఖ్ అఫ్సరొద్దీన్ ద్విచక్ర వాహనంపై రామగుండం నుంచి హైదరాబాద్ వెళ్తుండగా కరీంనగర్ శివారులో జరిగిన రోడ్డు ప్రమాదంలో చనిపోయాడు. నలుగురు మంచిస్నేహింతులు నా లుగు నెలల్లోనే కానరానికి లోకాలకు వెళ్లడం వారి కుటుంబాన్ని తీరని విషదం నింపినట్లయ్యింది. అంత్యక్రియలకు హాజరు రామగుండం: మృతుల అంత్యక్రియలు శుక్రవారం పట్టణంలో నిర్వహించారు. వీటికి ఎమ్మెల్యే మక్కాన్‌సింగ్‌ఠాకూర్ హాజరయ్యారు. మృతుల కుటుంబీకులను పరామర్శించారు. -
కర్ణాటకలో ఘోర ప్రమాదం.. ఒకే ఫ్యామిలీలో ఐదుగురు మృతి
బెంగళూరు: కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాద ఘటన చోటుచేసుకుంది. లారీని జీపు కొట్టిన ప్రమాదంలో ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందగా.. మరో పది మంది తీవ్రంగా గాయపడ్డారు. మృతులంతా ఒకే కుటుంబానికి చెందిన వారిగా పోలీసులు గుర్తించారు.వివరాల ప్రకారం.. కర్ణాటకలోని కలబుర్గి జిల్లాలోని జీవరగి సమీపంలో శనివారం తెల్లవారుజామున లారీని అధిక వేగంతో వస్తున్న జీపు అదుపు తప్పి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఘటనా స్థలంలోనే ఐదుగురు దుర్మరణం చెందారు, పది మందికి పైగా గాయాలయ్యాయి. బాగల్ కోట నుంచి కలబుర్గిలోని హజరత్ కాజా గరీబ్ నవాజ్ దర్గాకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో మృతులంతా ఒకే కుటుంబానికి చెందినవారిగా గుర్తించారు. గాయపడిన వారిని స్థానిక ఆసుపత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్టు పోలీసులు తెలిపారు. Kalaburagi, Karnataka | Five people died and 10 injured after a van rammed into a parked truck near Nelogi Cross in Kalaburagi district at around 3.30 am. The deceased have been identified as residents of Bagalkote district. The injured have been admitted to Kalaburagi Hospital.… pic.twitter.com/3i04s2SNVF— ANI (@ANI) April 5, 2025 -
నాన్న.. నువ్వు మా ప్రాణం!
తండ్రీ కూతుళ్ల ప్రేమ అనిర్వచనీయం.. కూతురంటే ప్రతి తండ్రికీ ఎనలేని ప్రేమ.. తన కళ్లలో సంతోషం కోసం ఎంతటి కష్టమైనా సునాయసంగా భరిస్తుంటాడు తండ్రి.. తన తండ్రి రోజంతా కష్టపడి పనిచేసేది తన కోసమేనని తెలుసుకుంటుంది కూతురు. ప్రతిరోజూ సమయానికి ఇంటికి వచ్చే నాన్న.. కాస్త ఆలస్యం అయితే చాలు అమ్మా.. నాన్న ఎప్పుడొస్తాడని తల్లి వెంటపడుతుంది. తండ్రి ఇంట్లోకి అడుగు పెట్టగానే ఎగిరిగంతేస్తుంది. ఇది తండ్రీ కూతుళ్ల మధ్య నిత్యం జరిగేదే.. అయితే.. యాక్సిడెంట్లో తన తండ్రి ప్రాణాలు విడిచాడని, ఇక ఎప్పటికీ ఇంటికి రాడనే వార్త విన్న కూతురిని ఓదార్చడం ఎవరి తరమూ కాదు. ఇలాంటి ఘటనలు ఎక్కడా చోటుచేసుకోవద్దని ట్రాఫిక్ రూల్స్‌పై ఎన్ని అవగాహన కార్యక్రమాలు నిర్వహించినా చాలామందిలో మార్పు రావడం లేదు. దాంతో కూతురితో అవగాహన కలి్పస్తే తండ్రిలో తప్పకుండా మార్పు వస్తుందనే ఆలోచనతో ‘సర్వేజన ఫౌండేషన్’.. ‘స్టాప్ రోడ్ యాక్సిడెంట్స్’ పేరుతో కొత్త తరహా ప్రచారానికి శ్రీకారం చుట్టింది. నాన్న! నేను ఇటీవల ఒక వార్త చదివాను. 2024లో 1.57 కోట్ల ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘనలు నమోదయ్యాయని, ఇది మన రాష్ట్ర జనాభాలో దాదాపు సగంగా ఉండటం ఆశ్చర్యానికి గురిచేసింది. ఆ కేసుల్లో ఒకటి మీదైతే? ఒక చిన్న తప్పు మా జీవితాన్ని మార్చగలదనే ఆలోచన కూడా నన్ను భయపెడుతోంది. ప్రమాదాల్లో తల్లిదండ్రులను కోల్పోయిన కుటుంబాలను నేను చూశాను. తల్లిదండ్రుల కోసం ఏడుస్తూ వాళ్లు లేని జీవితం ఎలా ఉంటుందో తెలియక భయపడే పిల్లల్ని చూశాను. అందుకే నిన్ను కోల్పోవడం తలచుకుంటేనే నా గుండె భారంగా మారుతోంది నాన్న.. నాన్న! ఒక రోజు మేమంతా నీ రాకకోసం ఎదురుచూస్తుంటే.. నీవు ఇక ఎప్పటికీ రాకపోతే? ఒక నిర్లక్ష్య క్షణం నిన్ను మా నుంచి దూరం చేసేస్తే? నీ ప్రేమ, నీ నవ్వు, నీ మార్గనిర్ధేశం లేకుండా మేము ఎలా బతకుతాం? నాన్న దయచేసి ఎప్పుడూ రోడ్డు భద్రతా నిబంధనలను పాటిస్తానని నాకు మాటివ్వు. ఎప్పుడు మద్యం తాగి వాహనం నడపకూడదు, అధిక వేగంతో ప్రయాణించకూడదు, హెల్మెట్, సీటు బెల్ట్ తప్పనిసరగా ధరించాలి, డ్రైవింగ్ చేస్తూ ఫోన్ మాట్లాడకూడదు. ఇవి చేయనని నాకు మాటివ్వు నాన్న.. ఎందుకంటే నీవు లేకుండా మా జీవితం ఊహించుకోలేం.. – అంతులేని ప్రేమతో.. నీ ప్రియమైన కుమార్తె ప్రతిరోజూ రోడ్డు ప్రమాదాల్లో వేల కుటుంబాలు తమ ప్రియమైన వారిని కోల్పోతున్నాయి. 90శాతం ప్రమాదాలు మానవ తప్పిదాల వల్లనే జరుగుతున్నాయి.. అతివేగం, హెల్మెట్ ధరించకపోవడం, సీటు బెల్ట్ పెట్టుకోకపోవడం, డ్రైవింగ్ సమయంలో ఫోన్ మాట్లాడటం, సిగ్నల్ జంపింగ్, మద్యం తాగి వాహనం నడపడం, రాంగ్ రూట్ డ్రైవింగ్ వంటివి ఎంతో మంది ప్రాణాలు పోయేందుకు కారణం అవుతున్నాయి.మానవ తప్పిదాల వల్ల జరిగే రోడ్డు ప్రమాదాలపై అవగాహన కల్పించి ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని అవగాహన కల్పించి రోడ్డు ప్రమాదాలను అరికట్టాలనే లక్ష్యంతో ‘సర్వేజనా ఫౌండేషన్’.. ‘స్టాప్ రోడ్ యాక్సిడెంట్స్’ కార్యక్రమం ద్వారా రోడ్డు ప్రమాదాల నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కార్యక్రమాలు చేపడుతోంది. మానవ తప్పిదాల వల్ల జరిగే ప్రమాదాలను నివారించేందుకు ఓ కూతురు తండ్రికి ప్రేమతో అవగాహన కల్పించేలా ‘స్టాప్ రోడ్ యాక్సిడెంట్ యాప్’ ద్వారా అవగాహన కల్పిస్తోంది. ఇందులో భాగంగా ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు ఈ అవగాహన కార్యక్రమానికి బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తుండగా ఈ మహత్ కార్యాన్ని ముందుకు తీసుకువెళ్తున్నామని సర్వేజన ఫౌండేషన్ చైర్పర్సన్, కిమ్స్ సన్‌షైన్ హాస్పిటల్స్ ఎండీ డాక్టర్ ఏవీ గురవారెడ్డి అన్నారు. ప్రతి నెలా యాప్ ద్వారా పోటీలు నిర్వహించి నగదు బహుమతులు అందజేస్తున్నామని, కూతురితో తల్లిదండ్రులకు అవగాహన కల్పిస్తున్నట్లు ఫౌండేషన్ సీఈఓ బి.జనార్దన్‌రెడ్డి తెలిపారు.రోడ్డు ప్రమాదాల గణాంకాలను పరిశీలిస్తే 2022లో రోడ్డు ప్రమాదాల్లో 1.63 లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు. ఇది కేవలం ఒక సంఖ్య మాత్రమే కాదు ఇవి 1.63 లక్షల మంది కుటుంబాలు తల్లడిల్లిన సంఘటనలు.. వారి కలలు, భవిష్యత్తు నాశనమై, తల్లిదండ్రుల ప్రేమకు దూరమైన పిల్లలు, పిల్లలను కోల్పోయి కన్నీళ్లు మిగిలిన తల్లిదండ్రులూ ఉన్నారు. అయితే వీరిలో 50 వేల మంది హెల్మెట్ లేకుండా ద్విచక్రవాహనాలను నడిపినవారయితే, మరొక 17 వేల మంది సీటు బెల్ట్ లేకుండా ప్రయాణించి ప్రాణాలు కోల్పోయారు. -
హైవేపై రెండు బస్సులు, కారు ప్రమాదం.. పలువురు మృతి
ముంబై: మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాద ఘటన చోటుచేసుకుంది. ప్రైవేటు బస్సు, కారు ఢీకొన్న ప్రమాదంలో ఐదుగురు మృతిచెందగా.. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. అనంతరం, క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.వివరాల ప్రకారం.. మహారాష్ట్రలోని బుల్దానాలో బుధవారం తెల్లవారుజామున 5:30 గంటల ప్రాంతంలో రోడ్డు ప్రమాదం జరిగింది. షీగాన్-కామ్గాన్ హైవేపై వేగంగా వెళ్తున్న కారు.. బస్సు ఒకదానికొకటి ఢీకొన్నాయి. ఈ క్రమంలో ప్రమాదానికి గురైన రెండు వాహనాలను మరో ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఐదుగురు మృతి చెందగా మరో 24 మంది తీవ్రంగా గాయపడ్డారు. దీంతో, క్షతగాత్రులను వెంటనే స్థానిక ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది. Buldhana, Maharashtra: A triple accident on Shegaon-Khamgaon Highway involving a Bolero, an ST bus, and a private bus killed five people and injured 24. The injured are receiving treatment at Khamgaon government hospital pic.twitter.com/dIWmrwPEN9— IANS (@ians_india) April 2, 2025 -
బస్సును ఓవర్టేక్ చేయబోయి..
హైదరాబాద్: బస్సును ఓవర్టేక్ చేసే క్రమంలో అదుపు తప్పిన ఇన్నోవా వాహనం ఎదురుగా వస్తున్న బైక్‌ను ఢీ కొట్టింది. ఈ ఘటనలో భర్త మృతి చెందగా, భార్య, ఇద్దరు పిల్లలు తీవ్రంగా గాయపడిన సంఘటన సోమవారం చర్లపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఇన్స్పెక్టర్ రవికుమార్ కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి.గుంటూరుకు చెందిన కొండేపాటి పుల్లారావు నగరానికి వచ్చి బీఎన్‌రెడ్డి నగర్లో నివాసం ఉంటున్నాడు. సోమవారం అతను భార్య పిల్లలతో కలిసి బైక్‌పై ఈసీనగర్ నుంచి పెద్ద చర్లపల్లి వైపుగా వెళ్తుండగా ఎదురుగా వచ్చిన ఇన్నోవా వాహనం బస్సును ఓవర్ టేక్ చేయబోయి అదుపుతప్పి ఎదురుగా వస్తున్న బైక్‌ను ఢీ కొట్టింది. ఈ ఘటనలో పుల్లారావు (32) అక్కడికక్కడే మృతి చెందగా, అతడి భార్య నాగరాణి, కుమారులు రుత్విక్, రాజేష్‌లకు తీవ్ర గాయాలయ్యాయి. బాధితులను పోలీసులు చికిత్స నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. వారు ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిపారు. బంధువుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఇన్స్పెక్టర్ పేర్కొన్నారు. ఇన్నోవా డ్రైవర్ అజాగ్రత్త కారణంగా ఈ ప్రమాదం జరిగిందన్నారు. -
దైవసన్నిధికి వెళుతూ... మృత్యు ఒడికి..
అవనిగడ్డ: కృష్ణా జిల్లా అవనిగడ్డ మండలం పులిగడ్డ వద్ద సోమవారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతిచెందారు. పోలీసుల కథనం మేరకు... గుంటూరు జిల్లా తెనాలి చెంచుపేటకు చెందిన జిడుగు సందీప్ తన తల్లిదండ్రులు మోహన్‌బాబు(57), అరుణ(50), భార్య పల్లవి, కుమార్తె సాత్విక(5), కుమారుడు షణ్ముఖ(3 నెలలు)తో కలసి కారులో కృష్ణా జిల్లా మోపిదేవిలోని శ్రీసుబ్రహ్మణ్యేశ్వరస్వామి ఆలయానికి బయలుదేరారు. వారి కారును పులిగడ్డ–పెనుమూడి వంతెన టోల్‌ప్లాజా మధ్య ఎదురుగా పామాయిల్ లోడుతో వస్తున్న లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో మోహన్‌బాబు, అరుణ, షణ్ముఖ అక్కడికక్కడే మృతిచెందారు. తీవ్రంగా గాయపడిన సాతి్వకను అవనిగడ్డ ప్రభుత్వ వైద్యశాలకు తీసుకువెళ్లి ప్రథమ చికిత్స చేయించిన అనంతరం మచిలీపట్నం తరలిస్తుండగా, మార్గంమధ్యలో మరణించింది. గాయపడిన పల్లవి, సందీప్‌లను మచిలీపట్నం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పల్లవి పరిస్థితి విషమంగా ఉంది. మోపిదేవి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వరస్వామి ఆలయంలో చిన్నారి షణ్ముఖను ఊయలలో వేసేందుకు వస్తుండగా జరిగిన ఈ ప్రమాదంలో నలుగురు మృత్యువాత పడటం చూపరులను కలచివేసింది. -
ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు దుర్మరణం
కృష్ణాజిల్లా: జిల్లాలోని అవనిగడ్డ మండలం పులిగడ్డ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. పులిగడ్డ పెనుమూడి వారధి సమీపంలో ఎదురుగా వస్తున్న లారీని కారు ఢీకొట్టింది. ఈ ఘటనలో ముగ్గురు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. మృతుల్లో ఒక పసికుందు కూడా ఉంది. మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి.మృతుల్లో ఒకరు తెనాలికి చెందిన జిడుగు రామ్మోహన్ గా పోలీసులు గుర్తించారు. తీవ్రంగా గాయపడిన మిగతా ముగ్గురిని మెరుగైన చికిత్స కోసం మచిలీపట్నం ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. -
రోడ్డు ప్రమాదంలో ఐపీఎస్ అధికారి దుర్మరణం
నాగర్ కర్నూల్: జిల్లాలోని చోటు చేసుకున్న రోడ్డు ప్రమాదంలో మహారాష్ట్రకు ఐపీఎస్ అధికారి దుర్మరణం చెందారు. అమ్రాబాద్ మండలం శ్రీశైలం హైవేలో పగవరపల్లిదోమల పెంట మధ్యలో ఎదురుగా వస్తున్న బస్సును కారు ఢీకొట్టింది. అయితే ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందగా, అందులో సుధాకర్ పటేల్ అనే ఐపీఎస్ అధికారి ఉన్నట్లు గుర్తించారు. వీరంతా కారులో మహారాష్ట్ర నుంచి బయల్దేరి శ్రీశైలం వెళుతున్నట్లుగా సమాచారం. ఈ ప్రమాదంలో గాయపడిన మరొకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. -
రోడ్డు ప్రమాదంలో దంపతులు మృతి
నాగర్ కర్నూల్: లారీ రూపంలో వచ్చిన మృత్యువు వారి కుటుంబం పాలిట యమపాశమైంది. అప్పటివరకు నలుగురు(ఇద్దరు కూతుళ్లు, ఇద్దరు కుమారులు) పిల్లలతో సరదాగా సాగిపోతున్న వారి జీవితంలో అనుకోని సంఘటన ఎదురైంది. రంగారెడ్డి జిల్లా తిమ్మాపూర్ సమీపంలో మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో దంపతులు మృతి చెందారు. వివరాల్లోకి వెళితే.. నాగర్‌కర్నూల్ జిల్లా కల్వకుర్తి మండలం రఘుపతిపేటకు చెందిన భార్యభర్తలు సక్కభాయి (40), పాండు (45) 12 ఏళ్ల క్రితం హైదరాబాద్‌లోని రామంతాపూర్‌కు వెళ్లి అక్కడే స్థిర నివాసం ఏర్పాటు చేసుకున్నారు. వారికి నలుగురు పిల్లలు మధుమిత, మధురుషిత, యాద్విక్, యశిత్..పిల్లలున్నారు. సక్కుభాయి మహేశ్వరం మండలంలోని ఎన్‌డీతండాలో పంచాయతీ కార్యదర్శిగా, పాండు అంబర్‌పేట్‌లోని పోలీస్ కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్నారు. మంగళవారం మధ్యాహ్నం స్కూటీపై సుక్కుభాయి తమ అమ్మగారి గ్రామమైన కొందుర్గులో ఉన్న తమ వ్యవసాయ పొలంలో జరుగుతున్న పండ్లతోట పనులను పరిశీలించి తిరిగి సాయంత్రం రామంతాపూర్‌కు బయల్దేరారు. కొత్తూరు మున్సిపాలిటీ పరిధిలోని తిమ్మాపూర్ శివారు ప్రాంతంలో వీరు ప్రయాణిస్తున్న స్కూటీని లారీ అతివేగంగా ఢీ కొట్టింది. దీంతో సక్కుభాయి అక్కడికక్కడే మృతి చెందగా, భర్త తీవ్ర గాయాలతో హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బుధవారం తెల్లవారుజామున మృతి చెందాడు. రోడ్డు ప్రమాదంలో తల్లిదండ్రులను కోల్పోవడంతో ఆ నలుగురు చిన్నారులు అనాథలుగా మారారు. ఈ ఘటనతో వారి స్వగ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. పోస్టుమార్టం ముగిసిన అనంతరం మృతదేహాలను రఘుపతిపేటకు తరలించి బుధవారం సాయంత్రం అంత్యక్రియలు ముగించారు. -
పిల్లలు ఎవరిని అమ్మా అని పిలవాలి సంధ్యా..
జయశంకర్: రెక్కాడితే గాని డొక్కాడని రెండు నిరుపేద కుటుంబాలను మృత్యువు వెంటాడింది. ఉదయం కూలీకి వెళ్లి మధ్యాహ్నం ఇంటికి వచ్చారు. ఖాళీగా ఉంటే ఏముంటుంది..? అదనపు కూలీకి వెళ్తే పూట అయినా గడుస్తుంది కదా అనే ఆశతో సాయంత్రం కూడా వెళ్లారు. అయితే ఈ కూలే వారికి చివరిది అవుతుందని అనుకోలేదు. పాపం.. పని వెళ్లకున్నా బతికేవారేమో. మృత్యువు లారీ రూపంలో ఇద్దరు మహిళా కూలీలను కబలించింది. ఈ ఘటన జయశంకర్ భూపాలపల్లి జిల్లా టేకుమట్ల మండలం రామకిష్టాపూర్(టి)లో మంగళవారం చోటు చేసుకుంది. ప్రత్యక్షుల కథనం ప్రకారం.. రామకిష్టాపూర్(టి) గ్రామానికి చెందిన మోకిడి పూలమ్మ(45), మోకిడి సంధ్య(30)తోపాటు మరో ఆరుగురు కూలీలు ఉదయం పనులకు వెళ్లి మధ్యాహ్నం ఇంటికి వచ్చారు. సాయంత్రం వేళలో కూడా మళ్లీ అదే గ్రామానికి చెందిన సల్పాల బుచ్చయ్య అనే రైతు పొలంలోని పని చేయడానికి వెళ్తున్నారు. సరిగా పొలం వద్దకు చేరుకునే సమయానికి చిట్యాల మండలం శాంతినగర్ శివారు కాటన్ మిల్లు నుంచి అతివేగంగా పత్తి గింజల లోడ్‌తో మూలమలుపు వద్ద నుంచి వస్తున్న లారీని గమనించిన కూలీలు కొంత దూరం పరుగులు తీశారు. ఇందులో ముగ్గురు పొలంలోకి వెళ్లడంతో అక్కడే లారీ అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో పత్తి గింజల బస్తాలు పడడంతో ఇద్దరు మహిళలు అక్కడికక్కడే మృతి చెందగా, మరో మహిళ తృటిలో తప్పించుకుంది. తోటి మహిళా కూలీలు భయంతో కేకలు వేయడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించగా ఏఎస్సై అమరేందర్‌రెడ్డి సిబ్బందితో ఘటనాస్థలికి చేరుకుని జేసీబీ సాయంతో లారీని లేపారు. మృతదేహాలను పత్తి గింజల బస్తాల కింద నుంచి బయటకు తీసి 108లో చిట్యాల సివిల్ ఆస్పత్రి మార్చురీకి తరలించారు. అప్పటి వరకు అందరి మధ్యలో ఉన్న ఇద్దరు విగత జీవులుగా మారడంతో తోటి మహిళా కూలీల రోదనలు మిన్నంటాయి. కాగా, ప్రమాదం జరిగిన వెంటనే లారీ డ్రైవర్ పరారైనట్లు మహిళా కూలీలు తెలిపారు.పిల్లలు ఎవరిని అమ్మా అని పిలవాలి సంధ్యా..మన పిల్లలు ఇక నుంచి ఎవరిని అమ్మా అని పిలవాలి సంధ్యా.. ఒక్కసారి చూడు సంధ్యా.. నా ప్రాణం పోయేలా ఉంది.. అయ్యో దేవుడా ఒక్కసారి బతికించమంటూ సంధ్య భర్త రాజు రోదించిన తీరు చిట్యాల సివిల్ ఆస్పత్రిలో ప్రతీ ఒక్కరిని కంట తడి పెట్టించింది. అమ్మా లే.. అమ్మా లే.. అంటూ చిన్నారుల రోదనలు మిన్నంటాయి. పూలమ్మ భర్త, కూతురు సైతం కన్నీరుమున్నీరయ్యారు. సంధ్య, పూలమ్మ కుటుంబ సభ్యులు పెద్దఎత్తున చిట్యాల సివిల్ ఆస్పత్రికి చేరుకుని వారి మృతదేహాల మీద పడి గుండెలవిసేలా రోదించారు. -
రోడ్డు ప్రమాదంలో ధనుశ్రీ మృతి
బెంగళూరు: బైక్‌పై వెళ్తున్న విద్యార్థిని కిందపడగా వెనుక నుంచి వచ్చిన క్యాంటర్ ఆమె పైనుండి దూసుకెళ్లగా మరణించిన సంఘటన బెంగళూరు–మంగళూరు జాతీయ రహదారి మార్గంలో చోటుచేసుకుంది. మాగడి తాలూకా బ్యాడరహళ్లి గ్రామానికి చెందిన సిద్ధరాజు, జగదాంబ దంపతుల కుమార్తె ధనుశ్రీ (20) మృతురాలు. వివరాలు.. ఈమె మంగళూరు ఆళ్వాస్ కాలేజీలో ఇంజినీరింగ్ చదువుతోంది. గ్రామంలో జాతర ఉండడంతో వచ్చింది. తిరిగి మంగళూరు వెళ్లేందుకు తమ్ముడు రేణుకేశ్తో కలిసి బైక్‌పై కుణిగల్ రైల్వేస్టేషన్‌కు బయలుదేరింది. తాళెకెరె హ్యాండ్ పోస్టు వద్ద జాన్సన్ ఫ్యాక్టరీ ముందు ప్రమాదవశాత్తు బైక్ పైనుండి కిందపడింది. వెనుకనే వేగంగా వచ్చిన క్యాంటర్ ఆమెపై దూసుకుపోయింది. ప్రమాదంలో ఆమె అక్కడికక్కడే మృతిచెందింది. కుణిగల్ పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. -
Hyderabad: ఇంజినీరింగ్ విద్యార్థుల దుర్మరణం
హైదరాబాద్: అతి వేగం ఇద్దరు విద్యార్థుల నిండు ప్రాణాలను తీసుకుంది. ఈ సంఘటన ఉస్మానియా యూనివర్సిటీ పోలీసు స్టేషన్ పరిధిలో ఆదివారం రాత్రి చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. భద్రాద్రి కొత్తగూడెం దుమ్ముగూడెం ప్రగలపల్లి గ్రామానికి చెందిన బంటు రాజ్‌కుమార్(20), పెద్దపల్లి జిల్లా, గోదావరిఖనికి చెందిన అటికెటి సిద్దార్ధ(21) ఓయూ ఇంజనీరింగ్ కాలేజీలో ఇంజినీరింగ్ చదువుతున్నారు. ఆదివారం రాత్రి వీరు ఓయూ హాస్టల్ నుంచి బైక్‌పై విద్యానగర్ వెళుతుండగా అడిక్‌మెట్ ఫ్లైఓవర్‌పై వారు ప్రయాణిస్తున్న వాహనం అదుపుతప్పి కిందపడింది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన ఇద్దరూ అక్కడిక్కడే మృతి చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని విద్యార్థుల మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సోమవారం పోస్టుమార్టం అనంతరం మృతదేహాలను వారి కుటుంబ సభ్యులకు అప్పగించారు. -
విహారయాత్రలో విషాదం
మోతీనగర్: విహారయాత్రలో విషాదం నెలకొన్న సంఘటన సనత్‌నగర్ పోలీస్ స్టేషన్ వీ రామారావునగర్‌లో చోటు చేసుకుంది. మృతురాలి బంధువులు, యాత్రికుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. కూకట్పల్లి నియోజకవర్గం, అల్లాపూర్ డివిజన్ వీ రామారావు నగర్‌కు చెందిన 12 మంది యాత్రికులు ఈ నెల 16న కాశీ యాత్రకు వెళ్లారు. తిరుగు ప్రయాణంలో ఆదివారం తెల్లవారుజామున వారు ప్రయాణిస్తున్న బస్సు మధ్యప్రదేశ్ రాష్ట్రం పియోలి జిల్లాలోని ఘాట్‌రోడ్డులో లోయలో పడిపోయింది. బస్సులో ప్రయాణిస్తున్న మల్లమ్మ అక్కడికక్కడే మృతి చెందగా మరో 11 మందికి గాయాలు కావడంతో సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న స్థానిక బీఆర్ఎస్ నాయకులు నాగుల సత్యం ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు దృష్టికి తీసుకెళ్లారు. ఎమ్మెల్యే నాగపూర్ అధికారులు, పోలీసులతో మాట్లాడి నగరానికి మృతదేహాన్ని నగరానికి తీసుకు వచ్చేందుకు ఏర్పాట్లు చేశారు. గాయపడిన వారికి ప్రథమ చికిత్స నిర్వహించారు. -
Suryapet: ఘెర రోడ్డు ప్రమాదం.. నలుగురు దుర్మరణం
సూర్యాపేట జిల్లా: జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. చివ్వెంల మండలం బీబీ గూడెం వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో నలుగురు దుర్మరణం చెందారు. ఆర్టీసీ బస్సు, కారు ఢీకొనడంతో నలుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, ఆరుగురికి తీవ్ర గాయాలయ్యాయి. వీరిని స్థానిక ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఇందులో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ రోడ్డు ప్రమాదంలో మరణించి వారిలో ముగ్గురిని గడ్డం రవి, గడ్డం రేణుకు, గడ్డం రీతులుగా గుర్తించారు. వీరంతా ఒకే కుటుంబానికి చెందిన వారు. కారు నుజ్జు నుజ్జు కావడంతో వీరు స్పాట్ లో మరణించారు. గడ్డం రవి, ఇతర బంధువులు కలిసి మోతె మండలం కోటపహాడ్ లో శుభకార్యానికి వెళ్లి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. అతి వేగమే ప్రమాదానికి కారణంగా తెలుస్తోంది. బస్సును కారు బలంగా ఢీకొట్టడంతో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. మరో రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మృతిహనుమకొండ జిల్లా హసన్పర్లి మండలం చెరువు కట్ట వద్ద మరో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ద్విచక్ర వాహనాన్ని టిప్పర్ లారీ ఢీ కొట్టడంతో ఇద్దరు యువకులు అక్కడక్కడే దుర్మరణం చెందారు. మృతులు సీతం పేటకు చెందిన మహేష్, పవన్ లుగా గుర్తించారు పోలీసులు. -
పరీక్ష రాసి వస్తూ.. పైలోకాలకు..
హైదరాబాద్: గచ్చిబౌలి ఫ్లైఓవర్‌పై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పదో తరగతి పరీక్ష రాసి సోదరుడితో కలిసి ద్విచక్ర వాహనంపై ఇంటికి వస్తుండగా డబుల్ డెక్కర్ బస్సు ఢీకొట్టడంతో విద్యారి్థని మృతి చెందింది. ఆమె సోదరుడు గాయాల పాలయ్యాడు. పోలీసుల చెప్పిన వివరాల ప్రకారం.. గచ్చిబౌలిలోని టీఎన్జీఓ కాలనీలో ఉంటున్న పెనుదాస్ చత్రియా, సబితా చత్రియా దంపతులకు కుమారుడు సుమన్ చత్రియా, కుమార్తె ప్రభాతి చత్రియా (16) ఉన్నారు. ప్రభాతి చత్రియా రాయదుర్గంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠ«శాలలో ఆమె పదో తరగతి పరీక్షలు రాస్తోంది. శనివారం ఆమె పరీక్ష రాసిన అనంతరం సోదరుడు సుమన్ ద్విచక్ర వాహనంపై ఇంటికి బయలుదేరింది. మార్గంమధ్యలో గచ్చిబౌలి ప్లైఓవర్‌పైకి రాగానే వీరి ద్విచక్ర వాహనాన్ని వెనుక నుంచి మితిమీరిన వేగంతో వచ్చిన డబుల్ డెక్కర్ ఎలక్ట్రికల్ బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ద్విచక్ర వాహనం నడుపుతున్న సుమన్ ఎడమ వైపు పడిపోగా ప్రభాతి కుడివైపు పడిపోయింది. బస్సు వెనుక చక్రం ప్రభాతి పైనుంచి వెళ్ళడంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది.సుమన్‌కు స్వల్ప గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న రాయదుర్గం పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని ప్రభాతి మృతదేహాన్ని పోస్టు మార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. ప్రమాదానికి కారణమైన బస్సు డ్రైవర్‌ను అదుపులోకి తీసుకుని కేసు దర్యాప్తు చేస్తున్నారు. భవిష్యత్‌పై ఎన్నో ఆశలతో పదో తరగతి పరీక్షలు రాస్తున్న తమ కుమార్తె రోడ్డు ప్రమాదంలో మృత్యువాత పడటంతో ప్రభాతి తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపించిన దృశ్యం స్థానికులను కంటతడి పెట్టించింది. -
రోడ్డు ప్రమాదం.. ముగ్గురు దుర్మరణం
నెల్లూరు: జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మనుబోలు మండలం గోట్లపాలెం సమీపంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ముగ్గురు దుర్మరణం చెందారు. ఒక ఆటోను ద్విచక్ర వాహనం డీకొనడంతో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరో వ్యక్తి తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సమయంలో తుదిశ్వాస విడిచాడు. మృతులు ఊటుకూరుకు చెందిన మృతులు వరుణ్ కుమార్(17), నందకిషోర్(18), సురేంద్ర(40)లుగా గుర్తించారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. -
హైదరాబాద్ హయత్ నగర్ సమీపంలో రోడ్డు ప్రమాదం
-
హైదరాబాద్‌లో విషాదం.. మార్నింగ్ వాక్కు వెళ్లి అడిషనల్ ఎస్పీ మృతి
సాక్షి, హైదరాబాద్: నగరంలోని హయత్‌నగర్‌లో విషాదకర ఘటన చోటుచేసుకుంది. రోడ్డు ప్రమాదంలో అడిషనల్ ఎస్పీ టీఎం. నందీశ్వర బాబ్జీ అక్కడికక్కడే మృతిచెందారు. దీంతో, ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టినట్టు పోలీసులు తెలిపారు.వివరాల ప్రకారం.. హయత్‌నగర్ పోలీసు స్టేషన్ పరిధిలోని లక్ష్మారెడ్డి పాలెం కాలనీ జాతీయ రహదారిపై శనివారం తెల్లవారుజామున రోడ్డు ప్రమాద ఘటన చోటుచేసుకుంది. అడిషనల్ ఎస్పీ టీఎం. నందీశ్వర బాబ్జీ రోడ్డు దాటుతున్న సమయంలో అతడిని ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నందీశ్వర బాబ్జీ అక్కడిక్కడే మృతి చెందారు. ప్రస్తుతం రాచకొండ కమిషనరేట్ కంట్రోల్ రూమ్‌లో ఆయన విధులు నిర్వహిస్తున్నారు. మూడు రోజుల క్రితమే ఆయనకు ప్రమోషన్ వచ్చింది. ఈ క్రమంలో ఇంకో మూడు రోజుల్లో డీజీపీ ఆఫీసుల్లో రిపోర్టు చేయాల్సి ఉంది. -
ఆటోను ఢీ కొట్టిన లారీ.. మహిళా కూలీల పరిస్థితి విషమం
మహబూబాబాద్, సాక్షి: నర్సింహులపేట మండలం పెద్దనాగారం స్టేజ్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. మహిళా కూలీలతో వెళ్తున్న ఓ ఆటోను లారీ ఢీ కొట్టడంతో పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఏరియా ఆస్పత్రికి తరలించగా.. వీళ్లలో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. తొర్రూర్ మండలం చెర్లపాలెం గ్రామానికి చెందిన 14 మంది, ఫతేపురం గ్రామానికి చెందిన ముగ్గురు మహిళలు మిర్చి తోట ఏరడానికి బంగ్లా వైపు ఆటోలో వెళ్తున్నారు. ఆ సమయంలో ఆటోను లారీ వేగంగా వచ్చి ఢీ కొట్టింది. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు రంగంలోకి దిగారు. స్థానికుల సాయంతో మూడు ఆంబులెన్సులలో మహబూబాబాద్ ఏరియా ఆసుపత్రికి తరలించారు. ప్రమాదంలో 13 మందికి గాయాలు కాగా.. వాళ్లలో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ప్రమాద ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. -
కానిస్టేబుల్‌ను ఢీకొన్న కారు.. అక్కడికక్కడే మృతి
సాక్షి, కామారెడ్డి: కామారెడ్డి జిల్లాలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. విధుల్లో ఉన్న కానిస్టేబుల్‌ను కారు ఢీకొట్టడంతో అతడు అక్కడికక్కడే మృతిచెందాడు. దీంతో, కానిస్టేబుల్ కుటుంబ సభ్యులు కన్నీటిపర్యంతమవుతున్నారు.వివరాల ప్రకారం.. కానిస్టేబుల్ రవి గాంధారి మండల కేంద్రంలో విధుల్లో ఉన్నాడు. ఈ క్రమంలో గురువారం వేగంగా దూసుకొచ్చిన కారు అక్కడే ఉన్న రవిని ఢీకొట్టింది. ఈ క్రమంలో రవి అక్కడికక్కడే మృతిచెందాడు. ఈ ప్రమాదంలో రవితో పాటు విధులు నిర్వహిస్తున్న సుభాష్ అనే కానిస్టేబుల్‌కు గాయాలయ్యాయి. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు.. దర్యాప్తు చేపట్టినట్టు తెలిపారు. -
Rajasthan: కారుపై డంపర్ బోల్తా.. ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు మృతి
బికనీర్: రాజస్థాన్‌లోని బికనీర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం(Road accident) చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు దుర్మరణం పాలయ్యారు. ఓవర్ బ్రిడ్జిపై వెళుతున్న కారుపై డంపర్ బోల్తా పడటంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. కారులో ఉన్నవారంతా పెళ్లికి వెళ్లి వస్తుండగా, ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఈ ఘటన బుధవారం అర్థరాత్రి దాటాక దేశ్నోక్ ఓవర్‌బ్రిడ్జిపై చోటుచేసుకుంది. అత్యంత వేగంగా వెళుతున్న ఒక డంపర్ ఉన్నట్టుండి నియంత్రణ(Control) కోల్పోయి, పక్కనే ఉన్న కారుపై బోల్తా పడింది. భారీగా ఉన్న డంపర్ పడటంతో కారు నుజ్జునుజ్జయిపోయింది. ఈ సమయంలో కారులో ఉన్న ఆరుగురు అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ప్రమాదం దరిమిలా ఓవర్ బ్రిడ్జిపై ట్రాఫిక్ నిలిచిపోయింది.ప్రత్యక్ష సాక్షులు తెలిపిన వివరాల ప్రకారం ఓవర్ బ్రిడ్జిపై కారు, డంపర్ ఒక దిశలో వెళుతున్నాయి. డంపర్ ఒక్కసారిగా కారుపై తిరగబడగానే కారులో ఉన్నవారికి తప్పించుకునే మార్గం లేకపోయింది. ప్రమాద ఘటన గురించి తెలియగానే దేశ్నాక్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. స్థానికుల సాయంతో జేసీబీని వినియోగించి డంపర్‌ను రోడ్డుకు ఒక పక్కగా తీసుకువచ్చారు. మృతులలో ఒక మహిళతో పాటు ఆరుగురు పురుషులు ఉన్నారని పోలీసులు తెలిపారు. మృతదేహాలను పోస్టుమార్టం కోసం తరలించిన పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.ఇది కూడా చదవండి: బంగ్లాలో హిందువుల దాడులపై అమెరికా నిఘా -
అందొచ్చిన కొడుకు అమ్మ మందులకోసం వెళ్లి.. ఆగం!
వలేటివారిపాలెం: రోడ్డు ప్రమాదంలో సాఫ్ట్వేర్ ఇంజినీర్ మృతిచెందిన ఘటన మండలంలోని పోకూరు ఆక్స్ఫర్డ్ స్కూల్ వద్ద వే బ్రిడ్జి సమీపంలో 167–బీ జాతీయ రహదారిపై మంగళవారం జరిగింది. పోలీసుల కథనం మేరకు.. మండలంలోని శింగమనేనిపల్లి గ్రామానికి చెందిన బాశం వెంకటేశ్వర్లు – మాధవి దంపతుల కుమారుడు బాశం దినేష్ (25) వర్క్ ఫ్రం హోం చేస్తున్నాడు. అంతేకాకుండా తల్లిదండ్రుల వ్యవసాయ పనుల్లో చేదోడువాదోడుగా ఉన్నాడు. బడేవారిపాళెం నుంచి పొలం అరక దున్నే కూలీని తీసుకురావాలని తండ్రి వెంకటేశ్వర్లు కుమారుడికి చెప్పాడు. దీంతో తన బుల్లెట్‌పై బయలుదేరిన దినేష్‌కు ఊరు దాటగానే తండ్రి ఫోన్ చేసి అమ్మకి ఆరోగ్యం బాగోలేదు.. ముందు పోకూరు వెళ్లి మందులు తీసుకొని అక్కడి నుంచి బడేవారిపాళెం వెళ్లమని చెప్పాడు. దినేష్ మందులు తీసుకుని బడేవారిపాళెం వెళ్తున్నాడు. హైవేపై ముందు వెళ్తున్న కారును ఓవర్ టేక్ చేయబోయి ఎదురుగా కందుకూరు వైపు వస్తు న్న ఆటోను ఢీకొట్టాడు. రోడ్డుపై పడిపోయిన దినేష్ తలకు బలమైన గాయమై అక్కడికక్కడే మృతిచెందాడు. సమాచారం అందుకున్న ఎస్సై మరిడి నాయుడు ఘటనా స్థలాన్ని పరిశీలించి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కందుకూ రు ఏరియా వైద్యశాలకు తరలించారు. అప్పటి వరకు గ్రామంలో ఉత్సాహంగా తిరిగిన దినేష్ మృతితో శింగమనేనిపల్లిలో విషాదం నెలకొంది. వెంకటేశ్వర్లుకు ఒక అబ్బాయి, అమ్మాయి సంతానం. మరో ఆరునెలల్లో దినేష్ అక్కకు వివాహం చేయాల్సి ఉంది. అన్ని తానై చూసుకుంటున్న యువకుడి మృతితో తల్లిదండ్రులు, బంధువులు కన్నీరుమున్నీరవుతున్నారు. -
అమెరికాలో రోడ్డుప్రమాదం తెలంగాణ వాసులు దుర్మరణం
-
అమెరికాలో రోడ్డు ప్రమాదం.. తెలంగాణవాసులు ముగ్గురు మృతి
కొందుర్గు/ సిద్దిపేట అర్బన్: అమెరికాలోని ఫ్లోరిడా లో సోమవారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో రాష్ట్రానికి చెందిన ముగ్గురు మృత్యు వాత పడ్డారు. వీరు ప్రయాణిస్తున్న కారును ట్రక్కు ఢీకొట్టడంతో ఈ దుర్ఘటన జరిగింది. మృతులను పురుమాండ్ల సునీత (56), ఆమె కోడలు ప్రగతిరెడ్డి (35), మనవడు హర్వీన్‌రెడ్డి (6)గా గుర్తించారు. బాధిత కుటుంబానికి చెందినవారు తెలిపిన వివరా లు ఇలా ఉన్నాయి. సిద్దిపేట అర్బన్ మండలం బక్రిచెప్యాల గ్రామానికి చెందిన పురుమాండ్ల దుర్గా రెడ్డి, భార్య సునీతతో కలిసి 40 సంవత్సరాలుగా విదేశాల్లోనే ఉంటున్నారు. ప్రస్తుతం ఉగాండాలో ఉంటున్నారు. వీరి కుమారుడు రోహిత్‌రెడ్డి వివా హం రంగారెడ్డి జిల్లా కొందుర్గు మండలం టేకుల పల్లి గ్రామానికి చెందిన పవిత్ర, మోహన్‌రెడ్డి దంపతుల కుమార్తె ప్రగతి రెడ్డితో జరిగింది. రోహి త్, ప్రగతి ఫ్లోరిడాలోని హర్లాండోలో సాఫ్ట్వేర్ ఉద్యోగులుగా పని చేస్తు న్నారు. వీరికి హర్వీన్ (6)తో పాటు 8 నెలల వయస్సు గల మరో కుమారుడు ఉన్నారు. భార్య సునీతతో కలిసి ఇటీవల ఫ్లోరిడా వచ్చిన దుర్గారెడ్డి తిరిగి ఉగాండా వెళ్లిపోగా సునీత అక్కడే ఉండిపోయారు. కాగా ప్రగతిరెడ్డి అక్క ప్రియాంక రెడ్డి కూడా భర్త నవీన్‌రెడ్డి, కుమారుడు, కుమార్తెతో కలిసి ఫ్లోరిడాలోనే జాక్సన్ విల్లేలో ఉంటున్నారు. రెండు నగరాల మధ్య దూరం సుమారు 200 కి.మీ కాగా వారాంతంలో రెండు కుటుంబాలు కలిసి రెండు కార్లలో టూర్‌కు వెళ్లాయి. సోమవారం తెల్లవారుజామున తిరిగి వస్తుండగా..రోహిత్‌రెడ్డి కుటుంబం ప్రయాణిస్తున్న కారును ట్రక్కు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ప్రగతిరెడ్డి, హర్వీన్, సునీత అక్కడికక్కడే మృతి చెందినట్లు బంధువులు తెలిపారు. రోహిత్, బాబు మాత్రం ప్రమాదం నుంచి బయట పడ్డారని, అయితే బాలుడికి తీవ్ర గాయాలైనట్లు సమాచారం. కాగా మృతుల అంత్యక్రియలు ఫ్లోరిడాలోనే నిర్వహించనున్నట్లు తెలిసింది. సిద్దిపేటలో నివాసం ఉంటున్న దుర్గారెడ్డి తమ్ముడు ప్రభాకర్‌రెడ్డి కుటుంబసభ్యులు హుటాహుటిన అమెరికాకు ప్రయాణమయ్యారు.10 నిమిషాల ముందే ఆ కారెక్కిన హర్వీన్హర్వీన్ తిరుగు ప్రయాణంలో తొలుత తమ పెద్దమ్మ వాళ్ల కారు ఎక్కాడు. ప్రమాదం జరగడానికి పది నిమిషాల ముందే అమ్మానాన్న ప్రయాణిస్తున్న కారులోకి వచ్చాడని, అంతలోనే దుర్ఘటన చోటు చేసుకుందని తెలిసింది. ప్రమాద వార్త తెలియడంతో ఇటు టేకులపల్లిలో, అటు బక్రిచెప్యాలలో విషాద ఛాయలు అలుముకున్నాయి.మూడు రోజుల క్రితమే మాట్లాడింది..తన కూతురు మూడురోజుల క్రితమే ఫోన్లో మాట్లాడిందని, ఇంతలోనే మృత్యు ఒడికి చేరిందంటూ ప్రగతి తల్లి పవిత్ర విలపించారు. అమెరికా వెళ్లిన తాము గత డిసెంబర్ 3న తిరిగి వచ్చామని, తాము వచ్చే ముందే చిన్నబాబును చూసుకోవడానికి సునీత అమెరికా వెళ్లారని తెలిపారు. ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ తదితరులు ప్రగతిరెడ్డి తల్లిదండ్రులను పరామర్శించారు. -
అతివేగం ఇద్దరి ఆయుష్షు రేఖను కుదించేసింది...
మరో కుటుంబంలో ‘కారు’ చీకటి కమ్ముకుంది. అతివేగం ఇంకో ఇద్దరి ఆయుష్షు రేఖను కుదించేసింది. కొత్తగా రూపుదిద్దుకున్న హైవే రెండు ప్రాణాలను బలి తీసుకుంది. కడదాకా కలిసుందామని బాసలు చేసుకున్న దంపతులకు ఇదే ఆఖరి ప్రయాణమైంది. కాలం ఎంత కర్కశమైందంటే.. అమ్మానాన్న చనిపోతే ఆ విషయం అదే వాహనంలో ఉన్న బిడ్డకు తెలియరాలేదు. సారవకోట, పాతపట్నం: సారవకోట మండలంలోని చిన్నకిట్టాలపాడు పంచాయతీ కురిడింగి గ్రామ సమీపంలో ఆదివారం మధ్యాహ్నం జరిగిన రోడ్డు ప్రమాదంలో పాతపట్నం శ్రీరామ్‌నగర్‌కు చెందిన పెద్దగోపు వెంకటప్రసాద్(56), ఆయన భార్య పెద్దగోపు వాణి(45) అక్కడికక్కడే మృతి చెందారు. పోలీసులు, స్థానికులు, లారీ డ్రైవర్ తెలిపిన వివరాల ప్రకారం.. పాతపట్నం శ్రీరామ్‌నగర్‌కు చెందిన పెద్దగోపు వెంకటప్రసాద్ ఆయన భార్య వాణి, కుమారుడు కీర్తి విహార్ ఒడిశాలోని పర్లాకిమిడి రాజవీధికి చెందిన తులగ హేమలత, ఇంజు చక్రవర్తిలు కలిసి ఆదివారం ఉదయం కారులో శ్రీకాకుళంలో వివాహానికి హాజరయ్యారు. పెళ్లికి హాజరై తిరుగు ప్ర యాణంలో సారవకోట మండలం కురిడింగి గ్రామ సమీపానికి వస్తుండగా.. సరిగ్గా మధ్యాహ్నం 3.35 గంటల సమయంలో ఎదురుగా వస్తున్న లారీని వీరి కారు ఢీకొట్టింది. ఆ దెబ్బకు లారీ ముందు యాక్సిల్ విరిగిపోయి ముందు చక్రం డీజిల్ ట్యాంకుకు ఢీకొట్టింది. ఆ ధాటికి కారు డ్రైవింగ్ చేస్తున్న వెంకటప్రసాద్, వెనుక సీట్లో కూర్చున్న భార్య వాణి తీవ్రగాయాలపాలై అక్కడికక్కడే మృతి చెందారు. డ్రైవర్‌కు పక్క సీట్లో కూర్చున్న ఇంజు చక్రవర్తికు, వెనుక సీట్లో కూర్చున్న కీర్తి విహార్‌కు, తులగ హేమలతకు తీవ్రగాయాలయ్యాయి. ఘటన జరిగిన వెంటనే స్థానికులు స్పందించి హైవే అంబులెన్స్‌కు సమాచారం అందించారు. వారు వచ్చి క్షతగాత్రులను పాతపట్నం సీహెచ్‌కు తరలించారు. అనంతరం శ్రీకాకుళం తీసుకెళ్లారు. అతివేగమే కారణమా..? ⇒ కారు లారీని ఢీకొన్న ధాటికి కారు ముందు భా గం పూర్తిగా నుజ్జునుజ్జైపోయింది. కారు భాగాలు చెల్లాచెదురుగా పడిపోయాయి. ఎయిర్ బెలూన్స్ ఓపెన్ అయి పాడైపోయాయి. ⇒ లారీ ముందు భాగం యాక్సిల్ విరిగిపోయి డీజిల్ ట్యాంకును సైతం ఢీ కొనడంతో డీజిల్ పూర్తిగా కారిపోయింది. ⇒ ప్రమాదం జరిగిన స్థలంలో ఆ సమయంలో ఎవరూ లేకపోవడంతో లారీ డ్రైవర్, బైక్‌పై అటుగా వస్తున్న పెద్దలంబకు చెందిన శ్రీను, బొంతుకు చెందిన జయరామ్, స్థానికుల సాయంతో కారు డోర్‌ను గునపాలతో పొడిచి తీశారు. ⇒ సంఘటన స్థలాన్ని నరసన్నపేట సీఐ జె.శ్రీనివాసరావు, సారవకోట ఎస్ఐ అనిల్ కుమార్ పరిశీలించారు. మృతదేహాలను పాతపట్నం సీహెచ్‌సీకు తరలించారు. ఆదివారం కాకపోయి ఉంటే.. కురిడింగి ప్రాథమిక పాఠశాల ఎదురుగా జరిగిన రోడ్డు ప్రమాదం స్థానికులను భయభ్రాంతులకు గు రి చేసింది. పాఠశాల విడిచిపెట్టే సమయం, ప్రమాదం జరిగిన సమయం ఒకటే కావడం గమనార్హం. ఆదివారం ప్రమాదం జరగడంతో పిల్లలు రోడ్డు మీదకు రాలేదని, లేదంటే మరింత ఘోరం జరిగి ఉండేదని స్థానికులు చెబుతున్నారు. ఇక్కడ సర్వీస్ రోడ్డు లేక పోవడం, హైవే సిబ్బంది పాఠశాల జోన్ అని కనిపించేలా బోర్డులు ఏర్పాటు చేయకపోవడంపై స్థానికులు భయాందోళన చెందుతున్నారు. అయ్యో ఆ కుటుంబం.. ప్రమాదంలో చనిపోయిన వెంకటప్రసాద్(56) వాణి(45) దంపతులది పర్లాకిమిడిలోని రాజవీధి. వెంకటప్రసాద్ అమరావతి ట్రావెల్స్ బస్సులకు భాగస్వామి. గత ఎనిమిదేళ్లుగా పాతపట్నంలో నివాసం ఉంటున్నారు. మృతుడికి ఇద్దరు కుమారులు. పెద్ద కుమారుడు విశాల్ అమెరికాలో జాబ్ చేస్తున్నాడు. రెండో కుమారుడైన కీర్తి విహార్ ఇదే ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డాడు. ఇతను భువనేశ్వర్‌లో బీటెక్ చేస్తున్నాడు. ప్రమాదంలో అతడు తీవ్రంగా గాయపడడంతో తల్లిదండ్రులు చనిపోయిన విషయం కూడా చాలా సేపటి వరకు తెలియలేదు. -
శ్రీకాకుళం జిల్లాలో ఘోర ప్రమాదం.. నలుగురు మృతి
సాక్షి, శ్రీకాకుళం: జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కారు ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టడంతో నలుగురు మృతి చెందగా, ఇద్దరు వ్యక్తులకు తీవ్రంగా గాయపడ్డారు. లావేరు మండలం బుడుమూరు జాతీయ రహదారిపై ఘటన చోటుచేసుకుంది. కారులో ప్రయాణిస్తున్న ముగ్గురు వ్యక్తులు, ద్విచక్ర వాహనంపై ప్రయాణిస్తున్న మరో వ్యక్తి మృతి చెందారు. కారులో ఉన్న మరో ఇద్దరు వ్యక్తులకి తీవ్ర గాయాలయ్యాయి.గాయపడిన వారిని శ్రీకాకుళం రిమ్స్ హాస్పిటల్‌కు తరలించారు. మృతులు పాతపట్నం మండలం లోగిడి గ్రామానికి చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. కారులో ప్రయాణిస్తున్న దువ్వారి మీనమ్మ, భాస్కరరావు ,లక్మీపతి మృతి చెందగా దువ్వారి కాళిదాసు, కుసుమ తీవ్రంగా గాయపడ్డారు. పాత పట్నం మండలం లోగిడి గ్రామం నుంచి విశాఖపట్నం పుట్టినరోజు వేడుకల కోసం వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. -
పశ్చిమ బెంగాల్లో ఘోర రోడ్డు ప్రమాదం.. ఏడుగురు మృతి
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్‌లోని నదియా జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఏడుగురు మృతిచెందారు. వేగంగా వస్తున్న కారు మూడు ఆటోలను ఢీకొట్టింది. ఈ ఘటనలో ముగ్గురు మహిళలు, చిన్నారి సహా ఏడుగురు మృతిచెందారు. ఎనిమిది మంది గాయపడ్డారు. వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని పోలీసులు తెలిపారు.ఈద్ పండుగ కోసం షాపింగ్ చేసి ఇంటికి తిరిగి వస్తుండగా చాప్రా ప్రాంతంలోని లక్ష్మీగచ్చ వద్ద ఈ సంఘటన జరిగింది. బాధితులను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. కారు డ్రైవర్ వాహనాన్ని వదిలి పారిపోగా, అతని కోసం పోలీసులు గాలింపు చర్యలు ప్రారంభించారు.మరో ఘటనలో వడోదర రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి చెందింది. శుక్రవారం తెల్లవారుజామున గుజరాత్‌లోని వడోదర నగరంలో 20 ఏళ్ల లా విద్యార్థి నడుపుతున్న కారు వారి ద్విచక్ర వాహనాలను ఢీకొట్టడంతో ఒక మహిళ మృతి చెందగా, పలువురు గాయపడ్డారు. నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. స్థానికుల కథనం ప్రకారం నిందితుడు మద్యం మత్తులో ఉన్నాడని పోలీసులు తెలిపారు. -
ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు దుర్మరణం..
తాడేపల్లిగూడెం(ప.గో.జిల్లా): పశ్చిమగోదావరి జిల్లాలోని తాడేపల్లిగూడెం మండలం కంచనపల్లి వద్ద జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. జాతీయ రహదారిపై పనులు చేస్తున్న వాహనాన్ని శాంట్రో కారు ఢీకొట్టింది. ఏలూరు నుంచి తణుకు వైపుకు వెళుతుండగా ఈ దుర్ఘటన సంభవించింది. ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు దుర్మరణం చెందారు. కారులో నలుగురు ప్రయాణిస్తుండగా ఒకరికి తీవ్ర గాయాలయ్యాయి.భోగెళ్ల వెంకల సత్య సురేన్, భార్య నవ్య అక్కడక్కడే మృతి చెందగా, వారి కుమార్తె వాసవి(4) తన/కు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి చికిత్స చేస్తున్న క్రమంలో మృత్యువాత పడింది. మరొకవైపు అదే కారులో ప్రయాణిస్తున్న ఉప్పులూరి శ్రీరమ్య పరిస్థితి విషమంగా ఉంది, ఆమెను రాజమండ్రి ప్రైవేటు ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వీరంతా హైదరాబాద్ నుండి మండపేటలోని ఏడిదకు వెళ్తుండగా ప్రమాదం చోటు చేసుకుంది. -
Vadodara: కారుతో నలుగురిని ఢీకొని.. ‘అనెదర్ రౌండ్’ అంటూ..
వడోదర: గుజరాత్‌లోని వడోదర(Vadodara)లో కారు బీభత్సం సృష్టించింది. మద్యం మత్తులో ఒక యువకుడు అత్యంత నిర్లక్ష్యంగా కారును నడిపి, పలువురిని ఢీకొన్నాడు. ఈ ఘటన కరోలీబాగ్లోని ఆమ్రపాలీలో చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఒక మహిళ మృతిచెందింది. నలుగురు తీవ్రంగా గాయపడ్డారు.ఈ రోడ్డు ప్రమాదం జరిగిన దరిమిలా జనం సంఘటనా స్థలంలో గుమిగూడారు. దీంతో ట్రాఫిక్ జామ్(Traffic jam) అయ్యింది. ప్రమాదం జరిగిన సమయంలో కారులోని ఎయిర్ బ్యాగ్ కూడా తెరుచుకుంది. కారు నడుపుతున్న వ్యక్తి మద్యం మత్తులో ఉండటాన్ని స్ణానికులు గుమనించారు. అతను గట్టిగా అరుస్తూ కారు నడిపాడని వారు తెలిపారు. ప్రమాదం జరిగిన అనంతరం కారు దిగిన ఆ యువకుడు ‘అనెదర్ రౌండ్’ అంటూ అరవసాగాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.స్థానికులు ఆ యువకుడిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. డీసీపీ పన్నా మోయాన్ మీడియాతో మాట్లాడుతూ ఈ ఘటనలో ఒక మహిళ మృతి చెందిందని, నలుగురు గాయపడ్డారని తెలిపారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించామన్నారు. నిందితుడిని అరెస్ట్ చేశామని, అతనిని వారణాసికి చెందిన రవీష్ చౌరాసియాగా గుర్తించామన్నారు. రవీష్ లా చదువుకుంటున్నాడని, ప్రమాదం జరిగిన సమయంలో అతని స్నేహితులకు కూడా అతనితో పాటు ఉన్నారని, ఆ తరువాత పరారయ్యారన్నారు. వారిని పట్టుకునేందుకు పోలీసు బృందాలు(Police teams) గాలిస్తున్నాయన్నారు. కారు ఓవర్ స్పీడ్ కారణంగానే ప్రమాదం జరిగిందన్నారు. కేసు దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.ఇది కూడా చదవండి: కార్గిల్‌లో భూకంపం -
HYD: బాలకృష్ణ ఇంటి వద్ద కారు బీభత్సం
సాక్షి, హైదరాబాద్: నగరంలోని జూబ్లీహిల్స్‌లో రోడ్డు ప్రమాద ఘటన చోటుచేసుకుంది. నటుడు బాలకృష్ణ వద్ద ఓ కారు బీభత్సం సృష్టించింది. అతివేగంతో దూసుకొచ్చిన కారు.. బాలకృష్ణ ఇంటి ముందున్న ఫెన్సింగ్‌ను ఢీకొట్టింది.వివరాల ప్రకారం.. జూబ్లీహిల్స్‌లోని రోడ్డు నంబర్-1లో నటుడు బాలకృష్ణ ఇంటి ముందున్న ఫుట్‌పాత్‌పైకి శుక్రవారం తెల్లవారుజామున ఓ కారు దూసుకెళ్లింది. అతివేగంతో ఉన్న కారు.. బాలకృష్ణ ఇంటి ముందున్న ఫెన్సింగ్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఫెన్సింగ్‌తో పాటు కారు ముందు భాగం ధ్వంసమైంది. అయితే, కారు డ్రైవర్ నిద్రమత్తు కారణంగానే ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు చెబుతున్నారు. ఇక, సదరు కారు.. మాదాపూర్ నుంచి జూబ్లీహిల్స్ రోడ్డు నంబర్ 45 మీదుగా చెక్‌పోస్ట్ వైపు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది. -
రెండు వాహనాలను ఢీకొన్న గ్యాస్ ట్యాంకర్.. ఏడుగురు మృతి
మధ్యప్రదేశ్(Madhya Pradesh)లోని ధార్ జిల్లాలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఒక గ్యాస్ ట్యాంకర్ రెండు వాహనాలను ఢీకొంది. ఈ ప్రమాదంలో ఏడుగురు మృతిచెందారు. ముగ్గురు గాయపడ్డారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. ట్యాంకర్ రాంగ్ రూట్లో రావడంతోనే ఈ ప్రమాదం జరిగిందని తెలుస్తోంది.పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఈ ప్రమాదం బుధవారం రాత్రి 11 గంటల ప్రాంతంలో జరిగింది. బద్నావర్-ఉజ్జయిని హైవేలోని బమన్సుత గ్రామ సమీపంలోని రోడ్డుపై గ్యాస్ ట్యాంకర్ రాంగ్ రూట్(Wrong route) నుండి వస్తూ, ఎదురుగా వస్తున్న ఒక కారు, జీపును బలంగా ఢీకొంది. ప్రమాదం తర్వాత ట్రక్కు డ్రైవర్ అక్కడి నుంచి పారిపోయాడని ధార్ ఎస్పీ మనోజ్ కుమార్ సింగ్ తెలిపారు. ఈ ప్రమాదంలో నలుగురు అక్కడికక్కడే మృతిచెందారు. మరో ముగ్గురు ఆస్పత్రిలో మృతిచెందారు.ప్రమాదం గురించి సమాచారం అందగానే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించారు. స్థానికులు కూడా సహాయక చర్యల్లో పాల్గొన్నారు. క్రేన్ సహాయంతో వాహనాల్లో చిక్కుకున్న వారిని బయటకు తీశారు. ఈ ఘోర ప్రమాదంలో గాయపడిన వారిని రత్లం జిల్లా ఆస్పత్రికి తరలించారు.ఇది కూడా చదవండి: Balochistan: జిన్నా చేసిన ద్రోహమే.. పాక్‌కు ముప్పుగా మారిందా? -
పెరుగుతున్న రోడ్డు ప్రమాదాలు ఆర్టీఐ సమాచారంలో షాకింగ్ లెక్కలు
సాక్షి ముంబై: రాష్ట్రంలో తొమ్మిదేళ్లలో జరిగిన వివిధ రోడ్డు ప్రమాదాల్లో 1.22 లక్షల మంది మృత్యువాత పడగా 2.58 లక్షల మంది తీవ్రంగా గాయపడినట్లు ఆయా పోలీసు స్టేషన్లలో నమోదైన కేసులను బట్టి తెలుస్తోంది. ఇటు ట్రాఫిక్ పోలీసులు అటు ప్రాంతీయ రవాణా కార్యాలయాల (ఆర్టీఓ) అధికారులు అనేక విధాలుగా ప్రయత్నిస్తున్నప్పటికీ రోడ్డు ప్రమాదాల సంఖ్య తగ్గకపోవడం ఆందోళనకు గురిచేస్తోంది. రోడ్డు ప్రమాదాలను తగ్గించే ప్రయత్నంలో భాగంగా ట్రాఫిక్ నియమాలను ఉల్లంఘించే డ్రైవర్లపై క్రమశిక్షణ పేరట ట్రాఫిక్ పోలీసులు, ఆర్టీఓ అధికారులు క్రమశిక్షణ చర్యలు తీసుకుంటున్నారు. కానీ ప్రమాదాలకు కారణమవుతున్న రోడ్ల దుస్ధితిని ఎవరూ పట్టించుకోవడం లేదని, తప్పంతా తమమీదే మోపడం అన్యాయ మని డ్రైవర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వేగంగా వెళుతున్న వాహనం ముందు ఆకస్మాత్తుగా గుంతలు ప్రత్యక్షం కావడం, రిపేరు వచ్చి రోడ్డుపై లేదా పక్కన నిలిపి ఉంచిన వాహనాల వల్ల అత్యవసరంగా బ్రేక్ వేయాల్సిన పరిస్థితి వస్తోందని చెబుతున్నారు. దీని వల్ల వాహనాలు ఒకదాన్నొకటి ఢీకొని ప్రమాదాలు జరుగుతున్నాయని అంటున్నారు. పోలీసులదాకా వచ్చేవి కొన్నే... కాగా పెద్ద ప్రమాదాలకు సంబంధించిన కేసులే పోలీసు స్టేషన్లలో నమోదవుతున్నాయి. వాటి వల్లే ప్రమాదాల సంఖ్య తెలుసుకునే అవకాశముంటుంది. చిన్నచిన్న ప్రమాదాల విషయంలో బాధితుడు, కారకుల మద్య సయోధ్య కుదిరి కేసు పోలీసులదాకా వెళ్లని సందర్భాలు లక్షల్లో ఉంటాయి. ఇలా 2016 నుంచి 2024 డిసెంబరు వరకు గడచిన తొమ్మిదేళ్లలో 3,03,531 రోడ్డు ప్రమాదాలు జరిగాయి. ఈ ప్రమాదాల్లో 1,22,270 మంది మృతి చెందగా 2,58,723 మంది గాయపడినట్లు సమాచార హక్కు చట్టం ద్వారా సేకరించిన వివరాలను బట్టి తెలిసింది. ముంబైదే మొదటిస్థానం... రోడ్డు ప్రమాదాల్లో దేశ ఆరి్ధక రాజధాని ముంబై నగరం మొదటి స్ధానంలో ఉండగా మృతుల సంఖ్యకు సంబంధించి పుణే జిల్లా అగ్రస్ధానంలో ఉంది. ముంబైలో 23,519 రోడ్డు ప్రమాదాలు జరగ్గా 3,802 మృత్యువాత పడ్డారు. ఇక అతి తక్కువ రోడ్డు ప్రమాదాలు జరిగిన జిల్లాగా సోలాపూర్ నిలిచింది. ఈ జిల్లాలో 1,925 రోడ్డు ప్రమాదాలు జరగ్గా 694 మంది మరణించారు. అలాగే సింధుదుర్గ్ జిల్లాలో 1,982 ప్రమాదాలు జరగ్గా 652 మంది బలయ్యారు. ఎన్ని చర్యలు చేపట్టినా... స్టేట్, నేషనల్ హై వే లపై జరుగుతున్న రోడ్డు ప్రమాదాలను తగ్గించేందుకు ట్రాఫిక్ పోలీసులు, ఆర్టీఓ అధికారుల అనేక విధాలుగా ప్రయతి్నస్తున్నారు. ప్రమాదకర మలుపులవద్ద హెచ్చరిక బోర్డులు ఏర్పాటు, ఏదైనా పల్లె, గ్రామం మొదట్లో స్పీడ్‌బ్రేకర్ల ఏర్పాటుతోపాటు . జాతీయ, రాష్ట్ర రహదారులతోపై వేగ నియంత్రణ కోసం అక్కడక్కడా స్పీడ్‌గన్ కెమెరాలు ఏర్పాటు చేశారు. అలాగే ట్రాఫిక్ నియమాలను ఉల్లంఘించే వారిపై జరిమానా విధిస్తున్నారు. కఠిన చర్యలు తీసుకుంటున్నారు. అయినాసరే రోడ్డు ప్రమాదాలు తగ్గకపోగా మరింతగా పెరుగుతుండటం అందరినీ కలవరానికి గురిచేస్తోంది. -
నా బర్త్‌డే కదా.. అమ్మానాన్నలేరీ?
రోజూ ఒడిలో కూర్చోబెట్టుకొని గోరుముద్దలు తినిపించే అమ్మ ఎక్కడికెళ్లిందోనని ఆ చిన్నారి ఇంట్లోకి, బయటికి తిరుగుతోంది.. బయటకు వెళ్లిన నాన్న ఏదో ఒకటి తీసుకొచ్చి తినిపిస్తాడని ఆశగా అందరినీ అడుగుతోంది.. ఎప్పుడూ ఎవరో ఒకరు తోడుంటారు కానీ, ఇప్పుడు అమ్మానాన్న ఇద్దరూ కనిపించకపోయే సరికి ఆ పసికందు బేలచూపులు చూస్తోంది.. అయ్యే పాపం అన్నా అర్థం కాదు.. అందరూ ఎందుకు ఏడుస్తున్నారో తెలుసుకోలేదు.. నా పుట్టిన రోజు అన్నారు కానీ, ఇంట్లో సందడే లేదన్నట్లుగా అందరి ముఖాల్లోకి చూస్తోంది.. అవ్వాతాతలు కొత్త డ్రెస్సు చూపిస్తూ నెత్తీనోరు కొట్టుకుంటుంటే వాళ్ల చుట్టూనే తిరుగుతూ వచీ్చరాని మాటలు చెబుతోంది.. వచ్చిపోయే వారు ఎత్తుకుని లాలిస్తున్నారే కానీ, అమ్మానాన్నలను తీసుకురాలేకపోతున్నారు.. .. ఆదోని మండలం కుప్పగల్‌కు చెందిన పూజారి ఈరన్న, ఆదిలక్ష్మి దంపతుల ఒక్కగానొక్క కుమార్తె సుస్మిత పుట్టిన రోజు నేడు. దంపతులు ఇద్దరూ రోడ్డు ప్రమాదంలో మరణించడంతో ఈ చిన్నారి తల్లిదండ్రుల ప్రేమను బస్సు కబళించింది.కంటికి రెప్పలా చూసుకునే అమ్మానాన్నలు.. జీవితాంతం రక్షణగా నిలిచే సోదరుడు.. నాన్నకు ఆసుపత్రిలో చూపించుకునేందుకని వెళ్లారు.. త్వరగా వస్తామని చెప్పారు, ఎంతకీ ఇంటికి రాలేదు.. ఒక్క ఫోన్ లేదు, ఎక్కడున్నారో తెలియదు.. ముగ్గురు ఆడ పిల్లలు, ఇంటి వద్ద ఎదురుచూస్తున్నారు.. ఇంకా ఎప్పుడు వస్తారో, తమ కోసం ఏమి తెస్తారోనని! ఇంతలో వచ్చిన ఓ ఫోన్ కాల్‌తో గుండె ఆగినంత పనైంది.. ఆసుపత్రికి వెళ్లిన అమ్మానాన్న ఇక తిరిగిరారని, ఆటపట్టించే అన్న, తోడూనీడగా నిలిచే తోబుట్టువు మరి లేడని.. తెలిసిన క్షణాన ఆ ఇల్లు కన్నీటి సంద్రమైంది.. ముగ్గురినీ పోగొట్టుకున్న ఆ ఇంట్లో నలుగురు ఆడపిల్లలు సంతానం.. ఒకరికి పెళ్లి కాగా, మరో ముగ్గురు దిక్కులేని వాళ్లయ్యారు... కర్ణాటక రాష్ట్రం మాన్విక చెందిన హేమాద్రి, నాగరత్నమ్మ దంపతులు తమ కుమారుడు దేవ రాజ్‌తో కలిసి ఆసుపత్రికి వెళ్తూ మృత్యుఒడి చేరారు.ఐదుగురిని బలిగొన్న బస్సు – ఆదోని టౌన్ కర్ణాటక రాష్ట్రం గంగావతి డిపోకు చెందిన బస్సు మంత్రాలయానికి మంగళవారం 14 మంది ప్రయాణికులతో బయలుదేరింది. ఆదోని మండలం పాండవగల్ సమీపంలో కల్వర్టు వద్ద వేగాన్ని నియంత్రించుకోలేక రెండు ద్విచక్ర వాహనాలను ఢీకొంది. ఈ ప్రమాదంలో ఐదుగురు మరణించారు. బస్సు పక్కనే ఉన్న పొలంలోకి దూసుకెళ్లి నిలిచిపోవడంతో అందులోని ప్రయాణికులంతా ఊపిరిపీల్చుకున్నారు. డ్రైవర్ నిర్లక్ష్యానికి రెండు కుటుంబాల్లో చీకటి కమ్ముకుంది. -
విధి రాత: ప్రసవం కోసం వెళ్తూ..!
మరో రెండు రోజుల్లో ఆమెకు ప్రసవం. ఆ దంపతుల ఆలోచనలన్నీ పుట్టబోయే బిడ్డపైనే ఉన్నాయి. అంతా సవ్యంగా జరగాలని దేవుళ్లందరికీ మొక్కారు. డాక్టర్లు సోమవారం నుంచే ఆస్పత్రిలో ఉండిపొమ్మన్నారు. కానీ వారి విధిరాత మరోలా ఉంది. వస్తువులన్నీ సర్దుకుని వస్తామని చెప్పి వచ్చేశారు. అదే వారి తప్పైపోయింది. ఇంటికి వెళ్తుంటే బస్సు రూపంలో మృత్యువు ఎదురొచ్చింది. తల్లిని, కడుపులోని బిడ్డను తనతో తీసుకెళ్లిపోయి.. కుటుంబానికి శోకం మిగిల్చింది. శ్రీకాకుళం క్రైమ్ : జిల్లా కేంద్రంలోని డేఅండ్‌నైట్ కూడలి సమీపంలో సోమవారం జరిగిన ప్రమాదంలో యంపాడ రాజేశ్వరి(20)(Rajeshwari) అనే నిండు గర్భిణి దుర్మరణం పాలయ్యారు. మరో 48 గంటల్లో ఆమె ప్రసవానికి సిద్ధమవుతుండగా.. ఈ దుర్ఘటన జరగడంతో కుటుంబం తల్లడిల్లిపోతోంది. స్కూటీని(Scooty) ఆర్టీసీ బస్సు (rtcbus)ఢీకొట్టడంతో ఆమె బస్సు చక్రాల కింద నలిగిపోయి ప్రాణాలు విడిచారు. ఘటనలో ఆమె భర్త దుర్గారావు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. ట్రాఫిక్ సీఐ నాగరాజు, మృతురాలి కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల మేరకు.. ఎచ్చెర్ల మండలం కుంచాల కూర్మయ్యపేటకు చెందిన యంపాడ దుర్గారావు అర్బన్ కాలనీలో తన ఇంటికి సమీపంలోనే టిఫిన్‌షాపు నడుపుతున్నారు. ఆయనకు అదే గ్రామానికి చెందిన రాజేశ్వరితో నాలుగేళ్ల కిందట వివాహమైంది. వీరికి ఏడాదిన్నర వయసు గల పాప ఉంది. రాజేశ్వరి మళ్లీ గర్భం(pregnant woman) దాల్చడంతో శ్రీకాకుళం రిమ్స్‌లో తరచూ చూపిస్తున్నారు. ఆ క్రమంలోనే సోమవారం ఉదయం 9:30 గంటలకు దంపతులిద్దరూ స్కూటీపై బయల్దేరారు. రిమ్స్‌లో వైద్యులకు చూపించాక బుధవారం ప్రస వం జరిగే అవకాశం ఉందని, ఇప్పుడు వెళ్తే రావడం కష్టమవుతుంది కాబట్టి సోమవారమే ఇక్కడ ఉండిపోవాలని వైద్యులు సూచించారు. కానీ వస్తువులన్నీ సర్దుకుని వచ్చేస్తామని భార్యాభర్తలు తిరుగు ప్రయాణమయ్యారు. డేఅండ్‌నైట్ కూడలి సమీపానికి ఉదయం 11.48గంటలకు వారు బండిపై చేరుకున్నారు. కూడలి దాటుకుని బ్రి డ్జి వైపు వెళ్లిన కొద్ది సేపటికే విశాఖ వెళ్తున్న ఆర్టీసీ పల్లెవెలుగు బస్సు వీరిని దాటుకుంటూ వెళ్లింది. అయితే బస్సు స్కూటీ అద్దాన్ని తాకడంతో.. బండి అదుపు తప్పి దుర్గారావు డివైడర్ వైపు పడిపోయా రు. రాజేశ్వరి మాత్రం బస్సు వెనుక చక్రాల కింద పడిపోవడంతో తీవ్ర రక్తస్రావమైంది. ప్రమాదం జ రిగినా బస్సు డ్రైవర్ ఆపకుండా వెళ్లిపోవడం అక్కడి వారిని నిశ్చేషు్టలను చేసింది.వెంటనే అక్కడున్న వా రి సాయంతో భర్త దుర్గారావు రాజేశ్వరిని ఆటోలో మెడికవర్ ఆస్పత్రికి తీసుకెళ్లాడు. కానీ తీవ్రంగా గాయపడిన ఆమె సాయంత్రం నాలుగు గంటలకు మృతిచెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. ప్రమాద దృశ్యాలన్నీ మెడిల్యాబ్ సీసీ కెమెరా ఫుటేజీలో నిక్షిప్తమయ్యాయి. దాని ప్రకారం పోలీసులు బస్సును గుర్తించి డ్రైవర్‌కు ఫోన్ చేసి రమ్మని పిలిచారు. అయితే తనకు ఏం జరిగిందో తెలియ దని డ్రైవర్ చెప్పడం గమనార్హం. దీనిపై కేసు నమో దు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ మెట్ట సుధాకర్ తెలిపారు. 20 ఏళ్లకే .. చనిపోయిన రాజేశ్వరి వయసు కేవలం 20 ఏళ్లు. పదహారేళ్లు దాటాక పెళ్లి చేసుకుని 18 ఏళ్లకు తల్లిగా మారిన రాజేశ్వరికి 20 ఏళ్లకే ఆయుష్షు రేఖ ఆగిపోయింది. ఇంత చిన్న వయసులో అది కూడా గర్భిణిగా చనిపోవడంతో ఊరంతా శోకసంద్రమైంది. -
అన్నం తినిపించే విషయమై గొడవ సాఫ్ట్వేర్ ఉద్యోగి ఆత్మహత్య
హైదరాబాద్: కుటుంబ కలహాల నేపథ్యంలో ఓ సాఫ్ట్వేర్ ఉద్యోగి ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఎస్ఐ రాజేశ్వర్ రెడ్డి కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. నంద్యాల పట్టణానికి చెందిన సంగిరెడ్డి నర్సింహారెడ్డి (28) విష్ణుప్రియ దంపతులు మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆదిత్య నగర్ కృష్ణకాలనీలో నివాసముంటున్నారు. నర్సింహారెడ్డి సాఫ్ట్వేర్ ఇంజినీర్‌గా పని చేస్తున్నాడు. సోమవారం మధ్యాహ్నం కుమారుడికి అన్నం తినిపించే విషయమై భార్యాభర్తల మధ్య గొడవ జరిగింది. దీంతో ఆగ్రహానికి లోనైన నర్సింహారెడ్డి గదిలోకి వెళ్లి తలుపులు వేసుకున్నాడు. అతను ఎంత సేపటికీ బయటికి రాకపోవడంతో విష్ణు ప్రియ స్థానికుల సహాయంతో తలుపులు బద్దలు కొట్టి చూడగా నరసింహారెడ్డి సీలింగ్ ఫ్యాన్‌కు ఉరివేసుకుని కనిపించాడు. అతడిని కిందకు దింపి చూడగా అప్పటికే మృతి చెందాడు. కుటుంబ సభ్యుల సమాచారంతో సంఘటనా స్థలానికి చేరుకున్న మియాపూర్ పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. మృతుడి భార్య విష్ణుప్రియ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. రోడ్డు ప్రమాదంలో సాఫ్్టవేర్ ఉద్యోగి దుర్మరణం మియాపూర్: టిప్పర్ లారీని ఓవర్ టెక్ చేయబోయి స్కూటీని ఢీకొని అదుపుతప్పి బుల్లెట్ పై వెళ్తున్న సాఫ్్టవేర్ ఉద్యోగి మృతి చెందిన సంఘటన మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. కడప జిల్లాకు చెందిన రోషన్(27) మూడేళ్లుగా చందానగర్‌లో స్నేహితులతో కలిసి ఉంటూ సాఫ్్టవేర్ ఇంజినీర్‌గా పని చేస్తున్నాడు. ఆదివారం రాత్రి అతను బైక్‌పై చందానగర్ నుంచి మియాపూర్ వైపు వెళ్తుండగా మదీనాగూడ దీప్తీశ్రీనగర్ కాలనీ కమాన్ సమీపంలో ముందు వెళ్తున్న టిప్పర్‌ను ఓవర్ టెక్ చేసే క్రమంలో స్కూటీని ఢీనడంతో అతడి బైక్ అదుపుతప్పింది. హెల్మెట్ లేకపోవడంతో తలకు తీవ్ర గాయాలు కావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. స్థానికుల సమాచారంతో సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించి, అతడి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. మృతుడి తల్లి జహరాబాను ఫిర్యాదు మేరకు మియాపూర్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
ఘోర రోడ్డు ప్రమాదం.. సజీవదహనమైన తల్లి, కుమారుడు..
కర్ణాటక: చిక్కబళ్లాపురం జిల్లా చింతామణి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం(Road Accident) జరిగింది. సొంతూరులో బంధువులను పలకరించి సంతోషంగా బెంగళూరుకు(Bangalore) వస్తున్న కుటుంబంలో విషాదం చిందింది. తల్లీ కుమారుడు సజీవ దహనమయ్యారు. చింతామణి సమీపంలోని కంచార్లపల్లి పోలీసు స్టేషన్ పరిధిలోని మదనపల్లి రోడ్డులో జోగ్యానహళ్లి–గోపల్లి మధ్య ఆదివారం ఉదయం 10 గంటలప్పుడు దుర్ఘటన జరిగింది. వారు ప్రయాణిస్తున్న బ్యాలెనో కారును ప్రైవేటు బస్సు ఢీకొనడంతో కారు మంటల్లో కాలిపోయింది. బంధువుకు కొడుకు పుట్టాడని.. వివరాలు.. ధనుంజయ రెడ్డి (Dhanunjaya Reddy)(30), ఆయన తల్లి కళావతి (52), ధనుంజయరెడ్డి భార్య శోభారాణి, కొడుకు మాన్విత్ రెడ్డి (3), శోభారాణి తల్లి మహాలక్ష్మీ కారులో బెంగళూరుకు బయల్దేరారు. ధనుంజయరెడ్డి కారు నడుపుతున్నారు. ఆయన తండ్రి గోపాల్‌రెడ్డి ఆంధ్రప్రదేశ్‌లో కడప నగరంలోని రాఘవేంద్ర టౌన్ షిప్లో నివాసముంటూ ఆకాశవాణిలో ఉద్యోగం చేస్తున్నారు. ధనుంజయరెడ్డి, భార్య ఐటీ ఉద్యోగులు కాగా, బెంగళూరు మహదేవపురలో నివాసముంటున్నారు. కడపలో శోభారాణి అన్న సుబ్బారెడ్డికి కొడుకు పుట్టడంతో శనివారం అందరూ వెళ్లి చిన్నారిని చూసి సంతోషంగా గడిపారు. బెంగళూరుకు తిరిగి వస్తుండగా చింతామణి దగ్గర ఎదురుగా బెంగళూరు నుంచి తిరుపతికి వెళుతున్న శ్రీ భారతి ప్రైవేటు బస్సు వేగంగా కారును ఢీకొట్టింది. కారు రోడ్డు పక్కన పడి మంటల్లో చిక్కుకుంది. అప్పటికే కారులోని వారు బయటకు ఎగిరిపడ్డారు. ధనుంజయరెడ్డి, తల్లి కళావతికి మంటలు అంటుకుని సజీవ దహనమయ్యారు. మిగతా ముగ్గురికి గాయాలయ్యాయి. బస్సు కూడా బోల్తా పడింది. అందులోని కొందరికి చిన్న చిన్న గాయాలు అయ్యాయి. కారు పూర్తిగా దగ్ధం స్థానికులు చేరుకుని క్షతగాత్రులకు సాయం చేశారు. ఫైర్ సిబ్బంది మంటలను ఆర్పివేసేటప్పటికి కారు పూర్తిగా దహనమైంది. జిల్లా ఎస్పీ కుశాల్ చౌక్సి, డీఎస్పీ మురళీధర్, సీఐ వెంకటరమణప్ప తదితరులు పరిశీలించారు. మృతదేహాలకు చింతామణి ప్రభుత్వ ఆస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించి బంధువులకు అప్పగించారు. శోభారాణి, కొడుకు మన్విత్, మహాలక్ష్మీలకు ప్రథమ చికిత్స నిర్వహించి బెంగళూరు ఆస్పత్రికి తరలించారు. ఆస్పతి దగ్గర బంధువుల రోదనలు మిన్నంటాయి. -
దుర్గమ్మ.. ఈ స్నేహితులపై దయ లేదా..!
నార్కట్‌పల్లి(నల్లగొండ): దైవ దర్శనానికి వెళ్తుండగా నల్లగొండ జిల్లాలో జరిగిన రోడ్డుప్రమాదంలో ఇద్దరు స్నేహితులు మృతిచెందారు. నార్కట్‌పల్లి ఎస్ఐ క్రాంతికుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. మేడ్చల్ జిల్లా ఓల్డ్ అల్వాలకు చెందిన ఐదుగురు స్నేహితులు ప్రవీణ్, సాయికుమార్ గౌడ్, చిల్లాసాగర్ సాయి సందీప్ గౌడ్, హరీష్, మధుకర్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విజయవాడలోని శ్రీకనకదుర్గ అమ్మవారి దైవ దర్శనం కోసం ప్రవీణ్ కారులో శనివారం అర్ధరాత్రి దాటిన తర్వాత1:30గంటల సమయంలో బయలు దేరారు. ఆదివారం తెల్లవారు జామున 5:30గంటల సమయంలో మార్గమధ్యంలోని నార్కట్‌పల్లి మండలం ఏపీ లింగోటం గ్రామ శివారులో గల హైదరాబాద్– విజయవాడ జాతీయ ప్రధార రహదారి వద్ద రోడ్డు పై ఆగి ఉన్న లారీని వెనుక నుంచి ఢీకొట్టారు. కారులో ప్రయాణిస్తున్న కుంచ సాయికుమార్ గౌడ్(32), సాయిసందీప్ గౌడ్ (23) అక్కడికక్కడే మృతి చెందారు. హరీష్, మధుకర్లకు గాయాలయ్యాయి. డ్రైవింగ్ చేస్తున్న ప్రవీణ్‌కు ఎలాంటి గాయాలు కాలేదు. సమాచారం అందుకున్న నార్కట్‌పల్లి పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని వివరాలు అడిగి తెలుసుకున్నారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం నార్కట్‌పల్లిలోని కామినేని హాస్పిటల్‌కు తరలించారు. మృతదేహాలను ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ క్రాంతికుమార్ తెలిపారు. తెల్లవారు జామున పొగ మంచు కమ్ముకోవడంతోపాటు, నిలిచి ఉన్న లారీకి వెనుక భాగంలో రెడ్ స్టిక్కర్ కూడా లేకపోవడంతో ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్లు భావిస్తున్నారు. -
ట్రక్కును ఢీకొన్న వాహనం.. ఏడుగురు భక్తులు మృతి
భోపాల్: మధ్యప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాద ఘటన చోటుచేసుకుంది. భక్తులతో వెళ్తున్న ఎస్యూవీ వాహనం ట్రక్కును ఢీకొన్న ప్రమాదంలో ఏడుగురు మృతిచెందగా.. మరో 14 మంది తీవ్రంగా గాయపడ్డారు. దీంతో, క్షతగాత్రులను స్థానిక ఆసుపత్రికి తరలించారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది.వివరాల ప్రకారం..‘మధ్యప్రదేశ్‌లోని సిద్ధి జిల్లాలో సోమవారం తెల్లవారుజామున రెండు గంటల ప్రాంతంలో బహ్రీ వద్ద ట్రక్కు, ఎస్యూవీ వాహనం ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఘటనా స్థలంలోనే ఏడుగురు మృతిచెందారు. మరో 14 మంది తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిలో 9 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఆసుపత్రిలో క్షతగాత్రులకు చికిత్స జరగుతోంది. అయితే, వీరంతా మైహార్ ఆలయానికి వెళ్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగినట్టు పోలీసులు తెలిపారు. ఈ ఘటన అనంతరం, ట్రక్కు డ్రైవర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.VIDEO | Madhya Pradesh: Several people died, while some others got injured after a car collided with a truck in Sidhi last night.DSP Gayatri Tiwari says, “Last night at around 2 am, we received the information about the accident between a bulker and a car near Utni Petrol Pump.… pic.twitter.com/LVxoYGOrRe— Press Trust of India (@PTI_News) March 10, 2025 -
‘అమ్మా..నాన్నా.. ఒక్కసారి మాట్లాడండి’
తిరుపతి: మండల కేంద్రమైన సైదాపురంలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. గురువారం సైదాపురం–తిప్పవరపాడు మార్గమధ్యంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో సైదాపురానికి చెందిన దొడ్డగా మునెయ్య, భార్య జ్యోతి అక్కడికక్కడే మృతిచెందారు. కుమార్తె వైష్ణవి రక్తగాయాలతో బయటపడింది. ఈ క్రమంలో శుక్రవారం సైదాపురంలో మృతదేహాలకు అంతిమ వీడ్కోలు పలికారు.కంటతడి పెట్టించిన కుమార్తెల మాటలుకళ్లెదుటే తల్లిదండ్రులు విగత జీవులుగా పడి ఉండడంతో ఆ పసి హృదయాలు తల్లడిల్లిపోయాయి. ‘అమ్మా..నాన్నా.. ఒక్కసారి మాట్లాడండి’ అంటూ వారిపై పడి గుండెలు బాదుకోవడం అక్కడి వారిని కలచివేసింది. గాయపడిన వైష్ణవి చివరగా తల్లిదండ్రుల అంతిమయాత్రలో టాటా చెప్పడం స్థానికులకు కన్నీళ్లు తెప్పించింది.గోకుల బృందావనంలో పుట్టి..మండల కేంద్రమైన సైదాపురం సమీపంలోనే ఉన్న గోకుల బృందావనం గ్రామంలో దొడ్డగ మునెయ్య జన్మించారు. ఆయనకు అన్నలు భాస్కర్, చంద్రయ్య ఉన్నారు. వారంతా గోకులబృందావనం గ్రామం వీడి సైదాపురానికి చేరుకుని అక్కడే స్థిరపడ్డారు. మునెయ్యకు పెళ్లి చేసి సైదాపురంలోనే ఇల్లు కటించి బాగోగులు చూసుకునే వారు. ఈ క్రమంలో గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో మునెయ్యతోపాటు భార్య జ్యోతి మరణించడంతో విషాదంలో మునిగిపోయారు. ముక్కుపచ్చలారని పసిబిడ్డలను వదిలివెళ్తున్నారా..! అంటూ కన్నీరుమున్నీరయ్యారు. మృతుని కుటుంబాన్ని వైఎస్సార్సీపీ మండల కన్వీనర్ మన్నారపు రవికుమార్ పరామర్శించారు. మృతుని కుటుంబానికి అండగా ఉంటానని భరోసా ఇచ్చారు.‘అమ్మా..నాన్నా మమ్మల్ని వదిలి వెళ్లిపోయారా..! -
యాన్యువల్ డేకి వెళ్లాలి డాడి లే..
సాక్షి ప్రతినిధి, ఏలూరు: గోకవరం మండలం కొత్తపల్లి శివారున పెట్రోల్‌బంక్ సమీపంలో శుక్రవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో(road accident) ఉపాధ్యాయుడు(Govt School Teacher) మృతి చెందగా అటవీశాఖ ఉద్యోగిని తీవ్రంగా గాయపడ్డారు. వివరాల ప్రకారం అల్లూరి సీతారామరాజు జిల్లా వై.రామవరం మండలం దొలిపాడుకు చెందిన వలాల చిన్నబ్బాయి (52) జగ్గంపేట మండలం గోవిందపురం జిల్లా పరిషత్ హైసూ్కల్లో 2023 నుంచి సాంఘిక శాస్తం ఉపాధ్యాయుడిగా పని చేస్తున్నారు. కొంత కాలంగా గోకవరంలో నివాసం ఉంటూ బైక్‌పై వెళ్లి వస్తున్నారు. శుక్రవారం ఉదయం ఆయన వెళ్తుండగా అటవీశాఖలో గార్డుగా పని చేస్తున్న రెడ్డి విజయదుర్గ లిఫ్ట్ అడగడంతో ఆమెను ఎక్కించుకుని మళ్లీ ముందుకు సాగిపోయారు. కొత్తపల్లి శివారున పెట్రోల్ బంకు సమీపంలో వారు ప్రయాణిస్తున్న బైక్‌ను జగ్గంపేట వైపు నుంచి ఎదురుగా వస్తున్న కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో చిన్నబ్బాయి అక్కడికక్కడే మృతి చెందగా విజయదుర్గ తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న 108 సిబ్బంది ఆమెను రాజమహేంద్రవరం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలిసింది. విషయం తెలుసుకున్న గోకవరం ఎస్సై పవన్‌కుమార్ ఘటనా స్థలానికి చేరుకుని కారు డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం రాజమహేంద్రవరం ప్రభుత్వాస్పత్రికి తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు. మృతుడికి భార్య, ఇద్దరు ఆడ పిల్లలు ఉన్నారు. పిల్లలను పాఠశాల వద్ద దించి.. చిన్నబ్బాయికి భార్య పార్వతి, తొమ్మిదో తరగతి చదువుతున్న మేఘవర్షిణి, ఎనిమిదో తరగతి చదువుతున్న స్నేహిత ఉన్నారు. స్థానికంగా ఓ ప్రైవేటు పాఠశాలలో చదువుతున్న వారిని పాఠశాల వద్ద దించి, అనంతరం ఇంటి నుంచి బయలుదేరి కొద్దిసేపటికే ఆయన మృత్యువాతపడ్డారు. యాన్యువల్ డేకి వెళ్లాలి డాడి లే.. ఆ చిన్నారులు చదువుతున్న పాఠశాల వార్షికోత్సవం శనివారం జరగనుంది. తన పిల్లలు ఆ కార్యక్రమానికి రావాలి డాడీ అని పిలవగా నేను రాను అన్న ఆయన మాటే నిజమైందని చిన్నబ్బాయి భార్య రోదించారు. యాన్యువల్డేకి వెళ్లాలి లే డాడీ అంటూ చిన్నారులు పోలీసులు వద్ద రోదించిన తీరు చూపరులను కంటతడి పెట్టించింది. పోలీస్‌స్టేషన్ వద్ద నుంచి ఆయన మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలించడానికి వాహనాన్ని నిలపగా భార్య, కుమార్తెలు మృతదేహంపై పడి గుండెలవిసేలా రోదించారు. ఈ క్రమంలో వారిని ఎవరూ వారించలేకపోయారు. హెల్మెట్ ఉన్నా.. బైక్ నడిపే సమయంలో చిన్నబ్బాయి హెల్మెట్ కచ్చితంగా వాడతారు. ప్రమాదం జరిగినపుడు కూడా హెల్మెట్ ధరించినప్పటికీ కారు ఢీకొట్టిన వేగానికి హెల్మెట్ ముక్కలైపోయి తలకు గట్టి దెబ్బ తగలడంతో ఆయన అక్కడికక్కడే మృతి చెందారు. ఉపాధ్యాయుడి మృతి విషయం తెలుసుకున్న సహచర ఉపాధ్యాయులు భారీగా అక్కడకు చేరుకుని విచారం వ్యక్తం చేశారు. -
ORR Accident: రోడ్డు ప్రమాదంలో తీగల కృష్ణారెడ్డి మనువడు మృతి
హైదరాబాద్: ఓఆర్ఆర్పై గురువారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో(ORR Accident) మూసారంబాగ్ మాజీ కార్పొరేటర్ తీగల సునరితా అజిత్‌రెడ్డి పెద్ద కుమారుడు కనిష్క్ రెడ్డి(19)(Kanishk Reddy) దుర్మరణం పాలయ్యాడు. కనిష్క్ రెడ్డి మేడ్చల్ టెక్ మహీంద్ర యూనివర్సిటీలో బీటెక్ రెండో సంవత్సరం చదువుతున్నాడు. గురువారం రాత్రి అతను జూబ్లీహిల్స్‌లోని స్నేహితుడి ఇంట్లో ఫంక్షన్‌కు హాజరై బెంజ్ కారులో తుక్కుగూడలోని ఇంటికి తిరిగి వెళుతుండగా ఔటర్ రింగ్‌రోడ్డుపై గొల్లపల్లె కలాన్ వద్ద కారు ముందు వెళుతున్న ట్రాలీని ఢీకొనడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో కనిష్క్ రెడ్డి తలకు తీవ్ర గాయాలు అయ్యాయి. సమాచారం అందుకున్న శంషాబాద్ పోలీసులు ఘటనా స్ధలానికి చేరుకుని బాధితుడిని చికిత్స నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. హుటాహుటిన అక్కడికి చేరుకున్న కుటుంబ సభ్యులు అతడిని మెరుగైన చికిత్స నిమిత్తం మలక్‌పేట యశోద ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ శుక్రవారం ఉదయం మృతి చెందాడు. ఉస్మానియా ఆసుపత్రిలో పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని మూసారంబాగ్ డివిజన్ సలీంనగర్‌లోని స్వగృహానికి తీసుకొచ్చారు. రెండు నిమిషాల్లో ఇంట్లో ఉంటా అన్నాడు.. ఆలస్యమైంది ఎక్కడ ఉన్నావ్ అని ఫోన్ చేయగా.. రెండు నిమిషాల్లో ఇంట్లో ఉంటానని చెప్పాడని, అంతలోనే ఘోరం జరిగిపోయిందని అతడి తల్లిదండ్రులు కన్నీటి పర్యంతమయ్యారు. కనిష్క్ రెడ్డి మృతితో సలీంనగర్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. ప్రముఖుల పరామర్శ... కనిష్క్ రెడ్డి మరణ వార్త తెలియడంతో పలువురు ప్రజా ప్రతినిధులు, నాయకులు కనిష్క్ రెడ్డి మృతదేహం వద్ద శ్రద్ధాంజలి ఘటించారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. అజిత్‌రెడ్డి, సునరితారెడ్డిలను ఓదార్చి ధైర్యం చెప్పారు. మాజీ హోంమంత్రి మహమూద్ అలీ, మేయర్ గద్వాల విజయలక్ష్మి, ఎమ్మెల్యేలు అహ్మద్ బలాల, దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్, పలువురు కార్పొరేటర్లు మృతుడి కుటుంబ సభ్యులను పరామర్శించారు. శుక్రవారం సాయంత్రం నాగోల్ ఫతుల్లాగూడ మహాప్రస్థానం హిందూ శ్మశాన వాటికలో కనిష్క్ రెడ్డి అంత్యక్రియలు నిర్వహించారు. -
‘అమ్మా..నాన్నా మమ్మల్ని వదిలి వెళ్లిపోయారా..!
విధి ఆడిన వింత నాటకంలో ఆ కుటుంబం చిన్నాభిన్నమైంది. భార్య, చిన్నకుమార్తెతో కలిసి బంధువుల ఇంటికి వెళ్లి తిరిగి వస్తుండగా మృత్యువు రూపంలో ఆటో దూసుకొచ్చింది. ఈ ప్రమాదంలో తన కళ్లెదుటే తల్లిదండ్రులు కన్నుమూయడం ఆ బాలిక మనసును కలచివేసింది. తన గాయాలు లెక్కచేయక అమ్మా..నాన్నా..! మాట్లాడండి నాన్నా..? అంటూ రోదించిన తీరు చూపరులను కంటతడి పెట్టించింది. మరో బాలిక ఆస్పత్రికి చేరుకుని చికిత్స పొందుతున్న చెల్లిని, విగత జీవులుగా పడి ఉన్న తల్లిదండ్రులను చూసి గుండెలు బాదుకున్న తీరు అక్కడి వారిని కంటతడి పెట్టించింది.సైదాపురం/తిరుపతి: ‘అమ్మా..నాన్నా మమ్మల్ని వదిలి వెళ్లిపోయారా..! అంటూ తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న చిన్న కుమార్తె, ఆమె అక్క రోదించడం స్థానికంగా కలచివేసింది. సైదాపురం – తిప్పవరపాడులో గురువారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో తల్లిదండ్రులు మృతి చెందగా.. చిన్న కుమార్తె తీవ్ర గాయాలతో ఆస్పత్రిపాలైన ఘటన తీవ్ర విషాదాన్ని నింపింది. స్థానికులు, గూడూరు రూరల్ పోలీసుల వివరాల మేరకు.. శ్రీపొట్టిశ్రీరాముల నెల్లూరు జిల్లా, సైదాపురానికి చెందిన దొడ్డగ మునెయ్య బట్టల దుకాణం నడుపుకుంటున్నారు. భార్య జ్యోతి టైలరింగ్ చేస్తూ కుటుంబానికి ఆదరువుగా ఉండేది. ఈ క్రమంలో వారికి నిహారిక, వైష్ణవి ఇద్దరు ఆడ బిడ్డలు ఉన్నారు. వారు స్థానిక పాఠశాలల్లో 8, 7 తరగతులు చదువుకుంటున్నారు. మునెయ్య బంధువులు కోట మండలంలోని విద్యానగర్‌లో ఉండడంతో వారి వద్దకు వెళ్లేందుకు భార్య జ్యోతి, చిన్న కుమార్తె వైష్ణవిని తీసుకుని స్కూటీపై వెళ్లి తిరిగి ఇంటికి వస్తున్నారు. ఈ క్రమంలో సైదాపురం నుంచి గూడూరు వైపు వస్తున్న ఆటో స్కూటీని ఢీకొట్టి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో మునెయ్య, జ్యోతిలిద్దరూ అక్కడికక్కడే మృతి చెందారు. వైష్ణవికి తీవ్ర గాయాలు కావడంతో గూడూరు ఏరియా ఆస్పత్రికి తరలించారు. తల్లిదండ్రులు కళ్లెదుటే దుర్మరణం చెందడంతో బాలిక్ షాక్‌కు గురైంది. అమ్మా..నాన్న వెళ్లిపోయారా..అంటూ కన్నీటిపర్యంతమవడం స్థానికులను కలచివేసింది. -
మిత్రుడ్ని చూసేందుకెళ్లి.. మృత్యుఒడిలోకి
సాక్షి, చెన్నై / నెల్లూరు(క్రైమ్): చెన్నైలోని ఓ కళాశాలలో చదువుతున్న మిత్రుడ్ని చూసి సరదాగా గడపాలని భావించారు. అనుకున్నదే తడవుగా అక్కడికెళ్లి ఉత్సాహంగా గడిపారు. వీరు ఒకటి సంకల్పంచగా, విధి మరోలా తలచి రోడ్డు ప్రమాద(road accident) రూపంలో ఇద్దర్ని పొట్టనబెట్టుకున్న హృదయ విదారక ఘటన చెన్నైలో బుధవారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. ఆనందం.. అంతలోనే ఆవిరి పోలీసుల వివరాల మేరకు.. నెల్లూరుకు చెందిన ధనిష్ రెడ్డి (21) చెన్నై శివార్లలోని ఓ ప్రైవేట్ కళాశాలలో బీటెక్(B.Tech students) తృతీయ సంవత్సరం చదువుతున్నారు. నెల్లూరులోని ఓ కళాశాలలో చదువుకుంటున్న శ్రేయాష్ (21), మరో ఇద్దరు విద్యార్థులు.. ధనిష్రెడ్డిని చూసేందుకు కారులో వచ్చారు. బుధవారం రాత్రి కలిసి, అర్ధరాత్రి వేళ వీరితో పాటు ధనిష్ కళాశాల మిత్రుడు జయంత్‌తో పాటు కారులో సిటీ వైపు బయల్దేరారు. మార్గమధ్యలో ఊరపాక్కం దాటగానే కిలాంబాక్కం బస్ టెర్మినల్‌కు కూతవేటు దూరంలో ముందుగా వెళ్తున్న లారీ హఠాత్తుగా ఆగడంతో వెనుక వేగంగా వస్తున్న కారు ఢీకొంది. కారు ముందు భాగం నుజ్జునుజ్జు కాగా, ఘటన స్థలంలోనే ధని‹Ùరెడ్డి, శ్రేయాష్ మరణించారు. గాయపడిన ఇద్దరు విద్యార్థులు, జయంత్‌ను చికిత్స నిమిత్తం పోతేరిలోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. పోస్ట్‌మార్టం నిమిత్తం మృతదేహాలను చెంగల్పట్టు జీహెచ్‌కు తరలించారు. కుటుంబసభ్యులకు సమాచారం అందించారు. మృతదేహాలను కుటుంబీకులకు అప్పగించారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. శోకసంద్రం చెన్నై శివార్లలో జరిగిన రోడ్డుప్రమాదంలో నగరానికి చెందిన ఇద్దరు యువకులు మృతి చెందడంతో వారి కుటుంబాల్లో విషాదఛాయలు అలుముకున్నాయి. స్టోన్‌హౌస్‌పేటకు చెందిన ప్రముఖ ట్రాన్స్పోర్ట్ నిర్వాహకుడు సుధాకర్‌రెడ్డి కుమారుడు ఎర్రగుంట ధని‹Ùరెడ్డి, రితి్వక్ ఎన్‌క్లేవ్‌కు చెందిన న్యాయవాది గుడుగుంట వేణుగోపాల్ కుమారుడు శ్రేయాష్ మరణవార్తతో కుటుంబసభ్యులు హతాశులయ్యారు. విషయం తెలుసుకున్న వారు హుటాహుటిన చెన్నై వెళ్లారు. మృతదేహాలు నెల్లూరుకు గురువారం రాత్రి చేరుకున్నాయి. పలువురు ప్రముఖులు నివాళులరి్పంచి బాధిత కుటుంబాలను ఓదార్చారు. -
ఏలూరు: ఘోర రోడ్డు ప్రమాదం.. బస్సును ఢీకొన్న లారీ.. ముగ్గురి మృతి
సాక్షి, ఏలూరు జిల్లా: ఏలూరు సమీపంలోని చొదిమెళ్ల వద్ద జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. సిమెంట్‌ను లారీని ప్రైవేటు ట్రావెల్స్ బస్సు వెనుక నుంచి ఢీకొనడంతో ముగ్గురు మృతి చెందగా, 20 మంది గాయపడ్డారు. క్షతగాత్రులను ఏలూరు ఆసుపత్రికి తరలించారు. బస్సు హైదరాబాద్ నుంచి కాకినాడ వెళ్తుండగా ప్రమాదం జరిగింది.లారీ లోయలో పడి ముగ్గురి మృతిమరో ఘటనలో వైఎస్సార్ జిల్లా చింతకొమ్మదిన్నె మండల పరిధిలోని మద్దిమడుగు ఘాట్ పైన బుధవారం మధ్యాహ్నం లారీ లోయలోకి పడిన ఘటనలో ముగ్గురు మృత్యువాత పడ్డారు. వివరాల్లోకి వెళితే.. చేపల మేత లోడుతో బెంగళూరు నుంచి ఏలూరుకు వెళ్తున్న లారీ మద్దిమడుగు ఘాట్ పైన నాలుగో మలుపు వద్దకు రాగానే బ్రేక్ ఫెయిల్ అయి అదుపుతప్పి 50 అడుగులున్న లోయలోకి పడిపోయింది.లారీలోని డ్రైవర్ సాంబయ్య, క్లీనర్ అక్కడికక్కడే మృతి చెందగా.. చక్రాయపేట మండలం కప్పకుంటపల్లెకు చెందిన కె.వివేకానందరెడ్డి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. ప్రమాద తీవ్రత కారణంగా లారీ మూడు ముక్కలుగా విడిపోయి కేబిన్ నుజ్జునుజ్జు అయ్యింది. ప్రమాదం జరిగిన వెంటనే సమాచారం అందుకున్న రక్షక్ సిబ్బంది అగ్ని మాపక సిబ్బందిని, 108 అంబులెన్స్‌ను పిలిపించి క్షతగాత్రులను కాపాడే ప్రయత్నం చేశారు. అయితే అప్పటికే లారీ డ్రైవర్, క్లీనర్ మృతి చెందారు. -
అనంతపురం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం..నలుగురు దుర్మరణం
సాక్షి,అనంతపురం: పుట్టింట్లో ఒడి బియ్యం పెట్టుకుని తిరిగి అత్తారింటికి వెళ్తుండగా ముగ్గురు అక్కాచెల్లెళ్లను,వారి సంతానాన్ని మృత్యువు రోడ్డు ప్రమాదం రూపంలో కబళించింది. అనంతపురం జిల్లా మండలం కమ్మూరు వద్ద ఆదివారం సాయంత్రం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆటోను కారు ఢీకొట్టింది. ఈ ఘోర ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు అక్కా చెల్లెళ్లు, మూడు నెలల కూతురుతో సహా మొత్తం నలుగురు దుర్మరణం పాలయ్యారు. రాయంపల్లికి చెందిన సరస్వతి తన అక్కా చెల్లెళ్లతో కలిసి అనంతపురం వద్ద ఉన్న మార్తాడు గ్రామంలో పుట్టింట్లో ఒడి బియ్యం పెట్టుకుని తిరిగి అత్తారింటికి ప్రయాణమైంది. తిరుగు ప్రయాణంలో బళ్లారి వైపు నుండి అనంతపురంకు వెళ్తున్న కారు.. ఎదురుగా ఉన్న ఆటోను డీకొట్టింది. ఈ ప్రమాదంలో సర్వసతితో పాటు ఆమె మూడునెలల కుమార్తె విద్య శ్రీ అక్కడికక్కడే కన్నుమూశారు. మరో ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి.ఘోర రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ క్షతగాత్రుల్ని అత్యవసర చికిత్స నిమిత్తం అనంతపురం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ నీలమ్మ, యోగేశ్వరి మృతి చెందారు. మృతులు ముగ్గురు ఒకే కుటుంబానికి చెందిన అక్క చెల్లెళ్లు కావడంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. -
కలసివెళ్లి.. కానరాని లోకాలకు
మైసూరు: ఐదుమంది భవిష్యత్తు గురించి ఎన్నో కలలు కన్నారు. ఇంజినీరింగ్ కోర్సు అయిపోయిన తరువాత మంచి ఉద్యోగాలు చేద్దామని, లేదా మరింత ఉన్నత చదువులు చదవాలని భావించారు. అయితే వీకెండ్ టూర్ ఆలోచన– ఓ టిప్పర్ లారీ వారి స్వప్నాలను భగ్నం చేశాయి. ఐదుగురి కుటుంబాలలో అంతులేని విషాదాన్ని కలిగించాయి. సరదాగా సాగుతున్న విహారయాత్రలో టిప్పర్ లారీ డ్రైవర్ యమదూత మాదిరిగా విరుచుకుపడ్డాడు. మైసూరు నుంచి బయల్దేరి.. చామరాజనగర జిల్లా కొళ్లేగాళ వద్ద కారును టిప్పర్ లారీ ఢీకొన్న ప్రమాదంలో ఐదుమంది ఇంజినీరింగ్ విద్యార్థులు దుర్మరణం చెందారు. కొళ్లేగాల రూరల్‌లోని చిక్కందువాడి గ్రామం వద్ద రహదారిలో ఈ విషాదం సంభవించింది. వివరాలు.. మైసూరు సిటీలో నివసించే శ్రీలక్ష్మీ, లిఖిత, మండ్యకు చెందిన సుహాన్, నితిన్, శ్రేయస్‌లు మైసూరు ఎంఐటీ ఇంజినీరింగ్ కాలేజీలో చదువుతున్నారు. వీరి వయస్సు 20– 23 ఏళ్లలోపు ఉంటుంది. అందరూ మంచి స్నేహితులు. మలె మహదేశ్వర బెట్టలో జరుగుతున్న శివరాత్రి ఉత్సవాలను చూసుకుని, ఆ తరువాత హొగెనేకల్ జలపాతానికి వెళ్లాలని బయల్దేరారు. ఓ గంటన్నర పాటు ప్రయాణం సాగింది. మృత్యుశకటమైన టిప్పర్ ఇంతలో ఓ టిప్పర్ లారీ వేగంగా వస్తూ మరో వాహనాన్ని ఓవర్ టేక్ చేసింది, ఈ క్రమంలో కారును ఢీకొని కొంత దూరం ఈడ్చుకెళ్లి రెండు వాహనాలు రోడ్డు పక్కకు పడిపోయాయి. కారు వెళ్లి ఓ నీటి గుంతలోకి పల్టీలు కొట్టింది. కారు చాలా భాగం నుజ్జయింది. ఈ తాకిడికిలో అందులో ఐదుగురు యువతీ యువకులు గాయాలతో ప్రాణాలు కోల్పోయారు. స్థానిక ప్రజలు చేరుకుని కారులో చిక్కుకుపోయిన మృతదేహాలను బయటకు తీసుకొచ్చారు. మరోవైపు టిప్పర్ డ్రైవర్ అక్కడి నుంచి పరారయ్యాడు. కొళ్లేగాల రూరల్ పోలీసులు చేరుకుని సహాయక చర్యలను చేపట్టారు. ఘటనాస్థలి భీతావహంగా మారింది. ఇరుకు, మలుపుల రోడ్డు : ఎస్పీజిల్లా ఎస్పీ బీటీ కవిత ఘటనాస్థలిలో మాట్లాడుతూ ఉదయం 9 గంటల సమయంలో మహదేశ్వర బెట్ట నుంచి వస్తున్న టిప్పర్ లారీ ఓవర్ టేక్ చేయబోతూ ఎదురుగా వస్తున్న విద్యార్థుల కారును ఢీకొట్టింది, ఆపై 26, 30 మీటర్ల దూరం లాక్కెళ్లింది. రెండు వాహనాలూ రోడ్డుపక్కన బోల్తా పడ్డాయి అని తెలిపారు.పరారీలో ఉన్న టిప్పర్ డ్రైవర్ కోసం గాలిస్తున్నట్లు ఆమె చెప్పారు. అక్కడ రోడ్డు ఇరుకుగా, అనేక మలుపులతో ఉండగా, టిప్పర్ డ్రైవర్ నిర్లక్ష్యం ప్రమాదానికి కారణమని తెలిపారు. కొళ్లేగాల రూరల్ పోలీసులు కేసు నమోదు చేసి మృతదేహాలను స్థానిక ప్రభుత్వ ఆస్పత్రి మార్చురీకి తరలించారు. ఘోరం గురించి తెలియగానే తల్లిదండ్రులు, బంధుమిత్రులు ఆస్పత్రికి వచ్చారు. వారి రోదనలతో ఆస్పత్రిలో విషాదం నెలకొంది. -
ఎదురెదురుగా ఢీకొన్న రెండు బస్సులు.. 37 మంది మృతి
బొలివియా: బొలివియా దేశంలో ఘోర రోడ్డు ప్రమాద ఘటన చోటుచేసుకుంది. రెండు బస్సులు ఢీకొన్న ప్రమాదంలో దాదాపు 37 మంది ప్రయాణీకులు మృతిచెందారు. అలాగే, మరో 30 మంది తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదంలో గాయపడిన వారిని స్థానిక ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.ఈ ప్రమాదంపై బొలివియా మీడియా తెలిపిన వివరాల ప్రకారం.. బొలివియాలోని ఉయుని సమీపంలో బస్సులు ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో 37 మంది మృతిచెందగా, మరో 30 మంది గాయపడ్డారు. అయితే, లాటిన్ అమెరికాలో అతిపెద్ద ఉత్సావాల్లో ఒకటైన ప్రఖాత ఒరురో కార్నివాల్‌కు బస్సులు వెళ్తున్న సమయంలో ప్రమాదం జరిగినట్టు అధికారులు తెలిపారు. ప్రమాద సమాచారం అందిన వెంటనే ఘటనా స్థలానికి పోలీసులు, సహాయక బృందం చేరుకుంది. సహాయక చర్యలు చేపట్టి క్షతగాత్రులను బయటకు తీశారు. గాయపడిన వారిని స్థానిక ఆసుపత్రికి తరలించి వైద్య సాయం అందిస్తున్నారు.ఈ ప్రమాదంలో డ్రైవర్లు ఇద్దరూ ప్రాణాలతో బయటపడ్డారు. ఈ క్రమంలో తీవ్రంగా గాయపడిన ఒక బస్సు డ్రైవర్‌కు ఐసీయూలో చికిత్స అందిస్తున్నారు. వీరికి డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టు నిర్వహించనున్నట్టు పోలీసులు తెలిపారు.Dos autobuses chocaron en Bolivia y dejaron al menos 37 muertos y decenas de heridos. El incidente ocurrió en horas de la madrugada de hoy, en una ruta en la región andina de Uyuni. pic.twitter.com/DkMSqx7562— Chikistrakiz (@chikistrakiz) March 1, 2025 -
వచ్చే నెలలో వివాహం.. అంతలోనే విషాదం
కీసర: బైక్‌ను కారు ఢీకొన్న ప్రమాదంలో అన్నదమ్ములిద్దరూ మృతి చెందిన విషాద ఘటన సోమవారం రాత్రి యాద్గార్పల్లి ఓఆర్ఆర్ సర్వీసు రోడ్డులో జరిగింది. మృతుల్లో తమ్ముడికి వచ్చే నెలలో వివాహం జరగాల్సి ఉండగా.. అంతలోనే రోడ్డు ప్రమాదం అతడిని బలిగొనడంతో ఆ ఇంట తీవ్ర విషాదం నెలకొంది. కీసర సీఐ శ్రీనివాస్, ఎస్ఐ నాగరాజు చెప్పిన వివరాల ప్రకారం.. యాదాద్రి–భువనగిరి జిల్లా ఆత్మకూరు మండలం రహీంఖాన్‌గూడకు చెందిన గూడూరు చంద్రశేఖర్ (36) బతుకుదెరువు నిమిత్తం కొన్నేళ్ల క్రితం నగరానికి వలస వచ్చాడు. తార్నాక ప్రాంతంలో టైలర్‌గా పని చేస్తున్నాడు.లాలాపేట శాంతినగర్‌లో ఉండే అతని సోదరుడు మత్స్యగిరి (27) విజయ డెయిరీలో పని చేస్తున్నాడు. వీరిద్దరూ కలిసి సోమవారం తమ అల్లుడు శ్రీను (17)తోకలిసి సోమవారం యాద్గార్‌పల్లిలోని బంధువుల ఇంటికి ద్విచక్ర వాహనంపై వచ్చారు. ఇదే రోజు రాత్రి తిరిగి నగరానికి వెళ్తుండగా యాద్గార్పల్లి– చీర్యాల ఓఆర్ఆర్ సర్వీస్ రోడ్డులో ఎదురుగా అతివేగంతో వచ్చిన కారు వీరి బైక్‌ను ఢీకొట్టింది. దీంతో ముగ్గురు రోడ్డుపై పడిపోయారు. తీవ్ర గాయాలతో చంద్రశేఖర్ ఘటనా స్థలంలోనే మృతి చెందాడు. మత్స్యగిరి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్ను మూశాడు. చంద్రశేఖర్‌కు భార్య, ముగ్గురు పిల్లలున్నారు. మార్చి 20న మత్స్యగిరి వివాహం జరగాల్సి ఉంది. రోడ్డు ప్రమాదంలో అన్నదమ్ములిద్దరూ మృత్యువాత పడటంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. నగరంలోని గాంధీ ఆసుపత్రిలో పోస్టు మార్టం అనంతరం మృతదేహాలను కుటుంబ సభ్యులకు అప్పగించారు. ప్రమాదంలో గాయపడిన శ్రీను ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. -
రోడ్డు ప్రమాదంలో తల్లీకుమార్తె మృతి
గుంటూరు రూరల్: రోడ్డు ప్రమాదంలో తల్లికూతురు మృతి చెందిన ఘటన మంగళవారం చోటుచేసుకుంది. నల్లపాడు పోలీసులు తెలిపిన వివరాలు.. అడవితక్కెళ్లపాడులోని రాజీవ్‌గృహకల్పకు చెందిన విజమూరి నాగమణి(45), కుమార్తె శరణ్య(14) రాజీవ్‌గాంధీ కాలనీలోని తమ బంధువులకు పూలను ఇచ్చేందుకు ద్విచక్ర వాహనంపై ఇచ్చేందుకు వెళ్తుండగా ఘటన చోటుచేసుకుంది. అమరావతి రోడ్డులోని చిల్లీస్ సెంటర్ వద్ద లాడ్జి సెంటర్ నుంచి అమరావతి వెళ్తున్న లారీ మితిమీరిన వేగంతో వచ్చి ద్విచక్ర వాహనాన్ని వెనుక నుంచి ఢీకొంది. ప్రమాదంలో ఇద్దరూ ఘటన స్థలంలోనే మృతి చెందారు. నాగమణి భర్త పుల్లయ్య 2014లో అనారోగ్యంతో మృతి చెందటంతో టైలరింగ్ చేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటుంది. ఆమెకు ఒక కుమారుడు గోపిచంద్, కుమార్తె శరణ్య(14) ఉన్నారు. గోపిచంద్ బీటెక్ పూర్తి చేసి విజయవాడలో ప్రైవేట్ ఉద్యోగం చేస్తున్నాడు. శరణ్య స్థానికంగా 9వ తరగతి చదువుతోంది. ఘఽటనా స్థలాన్ని నల్లపాడు పోలీస్ స్టేషన్ సీఐ వంశీధర్, ఎస్ఐ నాగరాజు పరిశీలించారు. మృతదేహాలను జీజీహెచ్ మార్చురీకి తరలించి పోస్ట్ మార్టం నిర్వహించి మృతుని బంధువులకు అప్పగించారు. ఘటనపై మృతురాలి కొడుకు గోపిచంద్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
మహా కుంభమేళాకు వెళ్లి ముగ్గురు మృతి
న్యాల్కల్(జహీరాబాద్): మహా కుంభమేళా యాత్ర రెండు కుటుంబాల్లో తీరని విషాదాన్ని నింపింది. రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి చెందడంతో మామిడ్గి, గంగ్వార్, మల్గి గ్రామాలు శోకసంద్రమయ్యాయి. రెండు రోజుల్లో తిరిగి వస్తామంటూ చిన్నారులను చెప్పి వెళ్లిన వారు తిరిగి రాని లోకాలకు వెళ్లడంతో ప్రజలు కన్నీటి పర్యంతమయ్యారు. వివరాల్లోకి వెళ్తే.. మామిడ్గికి చెందిన వెంకట్రాంరెడ్డి, భార్య విలాసిని, వదిన విశాల, ఇటికెపల్లి చెందిన జ్ఞానేశ్వర్‌రెడ్డి, మల్గికి చెందిన మల్లారెడ్డి, సంగారెడ్డికి చెందిన ఉపాధ్యాయుడు మోతిలాల్ కలిసి 22న కారులో మహా కుంభమేళాకు వెళ్లారు. పుణ్య స్నానాలు చేసి కాశీకి బయలు దేరగా మార్గమధ్యలో ఎదురుగా వస్తున్న వాహనాన్ని తప్పించబోయి ట్రక్కును ఢీకొట్టారు. ఈ ప్రమాదంలో వెంకట్రాంరెడ్డి, విలాసిని, డ్రైవర్ మల్లారెడ్డి అక్కడికక్కడే మృతి చెందారు. మరో ముగ్గురికి గాయాలు కాగా విశాల వారణాసి ట్రామా సెంటర్లో చికిత్స పొందుతున్నారు. వెంకట్రాంరెడ్డి సంగారెడ్డిలో ఉంటూ జహీరాబాద్ ఇరిగేషన్ డీఈఈగా, కోహీర్ ఇన్చార్జి అధికారిగా విధులు నిర్వహిస్తున్నాడు. అలాగే.. మల్లారెడ్డి కొంత కాలంగా జహీరాబాద్‌లో ఉంటున్నాడు. కూతురు, కుమారుడు ఉన్నారు. కూతురు ప్రియాంశీ 5వ తరగతి, కుమారుడు సాయి స్లోక్ రెడ్డి 7వ తరగతి చదువుతున్నారు. తెలంగాణ ప్రభుత్వ ఆదేశాల మేరకు న్యూఢిల్లీలోని తెలంగాణ రెసిడెంట్ కమిషనర్ కార్యాలయం ఆయా జిల్లా కలెక్టర్లతో సమన్వయం చేస్తూ పరిస్థితిని ఎప్పటికప్పుడూ పర్యవేక్షిస్తోంది. గాయాలైన వారికి మెరుగైన చికిత్స అందించడంతోపాటు మృతదేహాలను స్వస్థలాలకు తరలించేందుకు చర్యలు తీసుకుంటోంది. వెంకట్రాంరెడ్డి సౌమ్యుడు జహీరాబాద్: రోడ్డు ప్రమాదంలో మరణించిన నీటిపారుదల శాఖ డీఈఈ వెంకట్రాంరెడ్డి విధి నిర్వహణలో అందరికీ ఆదర్శంగా ఉండేవారు. తాను ఉన్నత ఉద్యోగిని అనేవిషయాన్ని పక్కన పెట్టి తానే స్వయంగా పనులు చూసేవారు. విధి నిర్వహణలో ఏ మాత్రం అలక్ష్యం చేయకుండా అన్నీ తానై చూసేవారు. పనుల నాణ్యత విషయంలో ఏ మాత్రం రాజీ పడేవాడు కారని, పని సంతృప్తి కరంగా ఉన్నట్లయితేనే బిల్లులు మంజురు సేచేవారనే అభిప్రాయాన్ని పలువురు వ్యక్తం చేస్తున్నారు. జహీరాబాద్‌లోని శ్రీసరస్వతీ శిశుమందిరంలో 1998లో 10వ తరగతి పూర్తి చేసుకున్నారు. అనంతరం ఉన్నత చదువులు హైదరాబాద్‌లో పూర్తి చేసుకుని 2007 జహీరాబాద్‌లో ఉద్యోగం పొందాడు. నీటిపారుదల శాఖలో ఏఈగా విధుల్లో చేరారు. అనంతరం పటాన్చెరు, నారాయణఖేడ్‌లో ఏఈగా పని చేశారు. డీఈఈగా పదోన్నతిపై తిరిగి జహీరాబాద్ వచ్చారు. తోటి ఉద్యోగులు, సిబ్బంది, స్నేహితులు, బంధువులతో మర్యాదగా మసలుకుంటూ సౌమ్యుడిగా పేరుతెచ్చుకున్నారు. రోడ్డుప్రమాదంలో మరణించిన డీఈఈ వెంకట్రాంరెడ్డికి దైవభక్తి అధికం. ప్రతి ఏటా కుటుంబంతో కలిసి తీర్థయాత్రలకు వెళ్లివచ్చే వారు. సడెన్‌గా యాత్రకు వెళ్లాలని నిర్ణయం ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న మహా కుంభమేళాకు వెళ్లిరావాలనే నిర్ణయం అప్పటికప్పుడు తీసుకున్నట్లుగా బంధువుల ద్వారా తెలుస్తోంది. యాత్రకు వెళుతున్న విషయం సన్నిహితులకు కూడా సమాచారం లేదు. కుంభమేళ ముగుస్తుండడంతో ఎలాగైనా వెళ్లిరావాలని బంధువులంతా నిర్ణయించి ప్రయాణమయినట్లు బంధువర్గాల సమాచారం. -
ట్రాక్టర్‌ను ఢీకొన్న పెళ్లి బస్సు.. ఒకరు మృతి, పలువురికి గాయాలు
సాక్షి, నల్లగొండ: నల్లగొండ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాద ఘటన చోటుచేసుకుంది. నార్కట్‌పల్లి-అద్దంకి హైవేపై ఓ ప్రైవేటు బస్సు..ట్రాక్టర్‌ను ఢీకొట్టింది. ఈ పప్రమాదంలో ఒక మహిళ మృతిచెందగా.. మరో 12 మంది తీవ్రంగా గాయపడ్డారు. దీంతో, గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.ఈ ఘటనకు సంబంధించి వివరాల ప్రకారం.. మిర్యాలగూడ సమీపంలో నార్కట్‌పల్లి-అద్దంకి హైవేపై ఆదివారం తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం జరిగింది. రోడ్డుపై వెళ్తున్న ట్రాక్టర్‌ను ఓ ప్రైవేటు ట్రావెల్స్ బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ట్రాక్టర్‌పై ప్రయాణిస్తున్న మహిళ మృతిచెందింది. ఇదే సమయంలో బస్సులో ప్రయాణిస్తున్న వారిలో 12 మంది గాయాలయ్యాయి. దీంతో, వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అయితే, వీరంతా హైదరాబాద్‌లో ఓ వివాహ వేడుకకు హాజరై నెల్లూరుకు వెళ్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది, ఇక, ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 36 మంది ఉన్నట్టు సమాచారం. -
ఘోర రోడ్డు ప్రమాదం.. ట్రక్కును ఢీ కొట్టిన బస్సు.. ఏడుగురు మృతి
గాంధీ నగర్ : గుజరాత్లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. కచ్ జిల్లాలో జరిగిన ఘోరరోడ్డు ప్రమాదంలో ఏడుగురు ప్రయాణికులు దుర్మురణం పాలయ్యారు. శుక్రవారం కీరా ముంద్రా రహదారి మార్గంలో 40మంది ప్రయాణికులతో వెళ్తున్న ఓ బస్సు ట్రక్కును బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఏడుగురు ప్రయాణికులు అక్కడికక్కడే మరణించారు. పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.రోడ్డు ప్రమాదంతో అప్రమత్తమైన స్థానికులు, ఇతర వాహనదారులు క్షతగాత్రులను అత్యవసర చికిత్స నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించారు. వారికి చికిత్స కొనసాగుతుండగా.. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు సహాయక చర్యల్ని ముమ్మరం చేశారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. -
'నా కుమారుడిది ముమ్మాటికీ హత్యే ...
అల్లూరి సీతారామరాజు జిల్లా: రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి చెందిన సంఘటన బుధవారం మండలంలో చోటుచేసుకుంది. దీనికి సంబంధించి పోలీసులు అందించిన వివరాలు ఇలా ఉన్నాయి. పాడేరు–హుకుంపేట ప్రధాన రహదారిలో పాటిమామిడి గ్రామం సమీపంలో ద్విచక్రవాహనంపై పాడేరు నుంచి వస్తు డివైడర్‌ను ఢీకొని పాడి శ్రీకాంత్(28) సంఘటన స్థలంలో మృతి చెందినట్టు పోలీసులు తెలిపారు. ఈ ప్రమాదంలో డివైడర్‌ను ఢీకొనగా వాహనం అతనిపై పడినట్టు పేర్కొన్నారు. దీనిపై మృతుడు తండ్రి పాడి చంటిబాబు తన కుమారుడు ప్రమాదంలో మృతి చెంది ఉండరని హత్యచేసి ఉంటారని అనుమానం వ్యక్తం చేస్తు స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ప్రమాదంలో కేసు నమోదు చేసి పోస్టుమార్టం చేపట్టి యువకుడి మృత దేహాన్ని కుటుంబ సభ్యులకు అందించినట్టు ఎస్ఐ సురేష్ కుమార్ తెలిపారు. అదృశ్యమైన జ్యోతిష్యుడు.. అస్థిపంజరమై! -
ఇల్లరికం అల్లుడితో కలిసి భర్తను హత్య చేసిన భార్య
పాపన్నపేట(మెదక్): భర్త వైద్యానికి అయ్యే ఖర్చును భరించలేక అతడిని..అల్లుడితో కలిసి ఉరేసి హత్య చేసింది ఓ భార్య. పైగా దీనిని సహజ మరణంగా చిత్రీకరించేందుకు ప్రయత్నించింది. తీరా మృతుడి మెడపై కమిలిపోయిన గాయాలు ఉండటంతో పోలీసుల వరకు వెళ్లింది. ఈ ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. పోలీసుల కథనం ప్రకారం.. మెదక్ జిల్లా పాపన్నపేట మండల పరిధిలోని బాచారం గ్రామానికి చెందిన కర్రెల ఆశయ్య (45), శివ్వమ్మ దంపతులకు కూతురు లావణ్య, కుమారుడు శివకుమార్ ఉన్నారు. ఎకరంన్నర అసైన్డ్ భూమిలో పంటలు పండక, నగరానికి కూలీలుగా వలస వెళ్లారు.రోడ్డు ప్రమాదంలో కొడుకు చనిపోయాడు. దీంతో స్వగ్రామానికి వచ్చారు. కూతురు లావణ్యను జూకల్కు చెందిన రమేశ్‌కు ఇచ్చి వివాహం చేసి ఇల్లరికం తెచ్చారు. ఆశయ్య గ్రామంలోనే పశువులు కాస్తున్నాడు. ఇటీవల బోరు వేసి ఆ భూమిని వ్యవసాయ యోగ్యంగా మార్చారు. శనివారం పొలం పనులకు వెళ్లిన ఆశయ్య జారిపడగా, తుంటి ఎముక విరిగింది. ఆశయ్యకు శస్త్ర చికిత్సకు రూ.50 వేలు ఖర్చు అవుతుందని డాక్టర్లు చెప్పారు. ఇంటికెళ్లిన తర్వాత వైద్య ఖర్చులు ఎలా భరించాలి అనుకున్నారో, అవిటితనంతో కుటుంబానికి భారమవుతాడని భావించారో, లేక రైతు బీమా కోసం ఆశ పడ్డారో తెలియదు కానీ ఆదివారం అర్ధరాత్రి అల్లుడు రమేశ్‌తో కలిసి, శివ్వమ్మ నిద్రలో ఉన్న భర్త ఆశయ్య మెడకు తువ్వాలతో ఉరేసి హత్య చేసింది. పొద్దున ఆశయ్యది సహజ మరణంగా చిత్రీకరించారు. సోమవారం సాయంత్రం ఆశయ్య మృతదేహాన్ని దింపుడు కల్లం వద్ద ఆపారు. అదే సమయంలో అక్కడకు చేరుకున్న పాపన్నపేట ఎస్సై శ్రీనివాస్‌గౌడ్ శవాన్ని స్వాధీనం చేసుకొని మెదక్ ఏరియా ఆస్పత్రికి తరలించారు. మృతుడి సోదరి గంగమణి ఫిర్యాదు మేరకు మంగళవారం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు. -
ఇసుక లారీ బీభత్సం
అల్లిపురం: మంగళవారం ఉదయం 6.50 గంటలు.. ప్రభాత వేళ సముద్రపు అలలు తీరాన్ని తాకుతుండగా, అంతటా ప్రశాంత వాతావరణం నెలకొంది. ఇంతలో ఒక్కసారి పెద్ద శబ్దం. ఇసుక లారీ సృష్టించిన బీభత్సం. నోవాటెల్ హోటల్ రోడ్డులో పైనుంచి వస్తున్న లారీ బ్రేకులు ఫెయిలై బీచ్‌రోడ్డుపైకి దూసుకొచ్చింది. ఆ సమయంలో బీచ్‌రోడ్డులో వాహనాల నిషేధం అమలులో ఉండటంతో పెను ప్రమాదం తప్పింది. మరో పది నిమిషాల తర్వాత ఈ ఘటన జరిగి ఉంటే, ఊహించని ఘోరం జరిగిపోయేది. ఈ ఘటనలో ఒక పాదచారికి గాయాలు కాగా, డ్రైవర్ స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. పోలీసులు క్రేన్ సాయంతో లారీని తొలగించారు. పోలీసులు, ప్రత్యక్ష సాక్షులు తెలిపిన వివరాలివీ..శ్రీకాకుళం నుంచి ఫిషింగ్ హార్బర్‌కు 40 టన్నుల ఇసుకతో ఓ లారీ బీచ్‌రోడ్డు మీదుగా వస్తోంది. బీచ్‌రోడ్డులో నగర ప్రజలు వాకింగ్ చేసుకోవడానికి వీలుగా వేకువజాము 4.30 నుంచి ఉదయం 7 గంటల వరకు, వీఎంఆర్డీఏ పార్కు నుంచి ఎన్టీఆర్ విగ్రహం వరకు భారీ వాహనాల నిషేధం ఉంటుంది. వీఎంఆర్డీఏ పార్కు వద్ద రోడ్డు మూసివేసి ఉండటంతో లారీ డ్రైవర్ ఏయూ మీదుగా పందిమెట్ట పైనుంచి నోవాటెల్ డౌన్‌కు దిగాడు. ఆ సమయంలో లారీకి బ్రేకులు ఫెయిల్ కావడంతో అదుపు తప్పి, బీచ్ వైపు దూసుకుపోయింది. ప్రమాదాల నివారణకు రోడ్డుపై పోలీసులు ఏర్పాటు చేసిన పెద్ద ప్లాస్టిక్ ఇసుక డబ్బాలను ఢీకొట్టింది. ఫుట్‌పాత్ మీదుగా గోడను ఢీకొట్టి, అవతలి వైపు సర్వీసు రోడ్లోకి ఎగిరిపడి.. పార్కులోకి చొచ్చుకెళ్లింది. ఆ సమయంలో వాహనాలు, ప్రజల రాకపోకలు లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. రెల్లివీధికి చెందిన తుపాకుల వెంకట రవికుమార్ నేవల్ కోస్టల్ బ్యాటరీ నుంచి ఆర్.కె.బీచ్‌కు వాకింగ్‌కు వెళ్తుండగా, ఈ ప్రమాదంలో గాయపడ్డాడు. లారీ డ్రైవర్‌కు స్వల్ప గాయాలయ్యాయి. పార్కు గోడ దెబ్బతింది. ప్రాణనష్టం లేకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. సమాచారం అందుకున్న మహారాణిపేట పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని, క్రేన్ సాయంతో లారీని అక్కడి నుంచి తొలగించారు. రవికుమార్‌ను కేజీహెచ్‌కు తరలించి చికిత్స అందించారు. అతని ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.గతంలో ఇక్కడే రెండు ప్రమాదాలుగతంలో ఇదే ప్రాంతంలో రెండు ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. స్కూల్ బస్సు ప్రమాదానికి గురి కాగా.. బస్సులో పిల్లలు లేక పోవడంతో ప్రాణనష్టం తప్పింది. మరో ప్రమాదంలో ఓ లారీ బ్రేకులు ఫెయిల్ కావడంతో రక్షణ గోడను ఢీకొట్టి అవతలి వైపు గల సర్వీ సు రోడ్డులోకి వెళ్లింది. ఆ సమయంలో ఐపీఎస్ అధికారి తన కుటుంబంతో సహా అక్కడ సేదతీరుతున్నారు. ఈ ప్రమాదంలో అతని తండ్రి చనిపోగా, అధికారికి కాళ్లు విరిగిపోయాయి. ఇక్కడ ప్రమాదాలు జరగకుండా ట్రాఫిక్ పోలీసులు తగిన రక్షణ చర్యలు తీసుకోవాలని స్థానికులు, పాదచారులు కోరుతున్నారు. -
రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మహిళా కూలీలు మృతి
చేబ్రోలు: గుంటూరు జిల్లా చేబ్రోలు మండలం నారాకోడూరు గ్రామ శివారులో మహిళా కూలీలతో వెళుతున్న ఆటోను సోమవారం తెల్లవారుజామున ఆర్టీసీ బస్సు ఢీకొట్టడంతో ముగ్గురు మహిళా కూలీలు మృతి చెందారు. వివరాల్లోకి వెళితే.. సుద్దపల్లి గ్రామానికి చెందిన 12 మంది మహిళా కూలీలు మినుము కోత కోసేందుకు నీరుకొండ ప్రాంతానికి ఆటోలో బయలుదేరారు.మార్గమధ్యంలోని నారాకోడూరు గ్రామ శివారులో దట్టమైన పొగుమంచు కారణంగా ప్రమాదవశాత్తు ఆర్టీసీ బస్ కూలీల ఆటోను వేగంగా ఢీ కొట్టింది. ఈ ఘటనలో తోట సీతారావమ్మ (41), అల్లం శెట్టి అరుణ (39), కుర్రా నాంచారమ్మ (40) అక్కడికక్కడే మృత్యువాత పడ్డారు. ఆటో డ్రైవర్ ఇబ్రహీంకు, మరో ఎనిమిది మంది మహిళలకు తీవ్ర గాయాలయ్యాయి. వీరు గుంటూరు ప్రభుత్వ వైద్యశాల్లో చికిత్స పొందుతున్నారు. -
Mahakumbh: కుంభమేళాకు వెళ్తుంటే అపశృతి
ఉండవెల్లి: కర్ణాటక నుంచి ప్రయాగ్‌రాజ్ (కుంభమేళా)కు వెళ్తున్న ఓ కుటుంబం తెలంగాణలోని మహబూబ్‌నగర్ జిల్లాలో రోడ్డు ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో ఓ యువతి దుర్మరణం చెందగా.. ఆరుగురు గాయపడ్డారు. కుక్క అడ్డు రావడంతో స్థానికుల వివరాల మేరకు.. బెంగళూరు దగ్గర రామనగరకు చెందిన నవ్యశ్రీ (18), ప్రతిభ, రేణుక, శోభ, శివప్రసాద్, రాజన్న, మంజునాథ్, డ్రైవర్ బస్వరాజు కారులో శుక్రవారం కుంభమేళాకు బయలుదేరారు. శనివారం తెల్లవారుజామున ఉండవెల్లి మండలం ఇటిక్యాలపాడు శివారుకు చేరుకున్న వీరి కారుకు కుక్క అడ్డు రావడంతో అదుపుతప్పి రోడ్డు పక్కనున్న చెట్టును బలంగా ఢీకొట్టింది. ప్రమాదంలో నవ్యశ్రీ, ప్రతిభ, బస్వరాజు, రేణుకకు తీవ్రగాయాలయ్యాయి. వీరిని హైవే అంబులెన్స్‌లో కర్నూలు ఆస్పత్రికి తరలిస్తుండగా.. నవ్యశ్రీ మృతిచెందింది. శోభ, శివప్రసాద్, రాజన్నకు స్వల్పగాయాలు కావడంతో స్థానిక ఆస్పత్రికి తరలించారు. పోలీసులు పరిశీలించి కేసు నమోదు చేశారు. -
రోడ్డు ప్రమాదంలో స్టార్ నటుడు మృతి అంటూ ప్రచారం
చిత్ర పరిశ్రమలో ప్రముఖ కమెడియన్‌గా రాణిస్తున్న యోగిబాబు రోడ్డు ప్రమాదంలో మరణించారంటూ వస్తున్న వార్తలపై క్లారిటీ ఇచ్చారు. కొంత సమయం క్రితం సోషల్‌మీడియా ద్వారా ఒక పోస్ట్ ద్వారా ఆయన వివరణ ఇచ్చారు. యోగిబాబు ప్రమాదానికి గురైనట్లు వస్తున్న వార్తల్లో నిజం లేదని తెలిపారు. రోడ్డు ప్రమాదంలో తాను మరణించినట్లు తప్పుడు ప్రచారం చేయడం చాలా బాధాకరమని చెప్పుకొచ్చారు. ఇలాంటి కల్పిత వార్తల పట్ల తాను చింతిస్తున్నట్లు యోగిబాబు తెలిపారు.చెన్నై - బెంగళూరు జాతీయ రహదారిపై తెల్లవారుజామున 3 గంటలకు జరిగిన రోడ్డు ప్రమాదంలో నటుడు యోగిబాబు మరణించారని కోలీవుడ్‌లో వార్తలు వచ్చాయి. ఆపై కొన్ని క్షణాల్లోనే నెట్టింట ట్రెండ్ అయిపోయింది. దీంతో యోగి బాబు తన ఎక్స్ పేజీలో వివరణ ఇస్తూ ఒక పోస్ట్‌ను పంచుకున్నారు. 'నాకు ఎలాంటి ప్రమాదం జరగలేదు. ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.. నేను చాలా సంతోషంగా ఉన్నాను. రోడ్డు ప్రమాదం అయితే జరిగింది. కానీ, ఆ కారులో ఉన్నది నేను కాదు. కనీసం నా సహాయకుడు కూడా ఆ కారులో ప్రయాణించలేదు. సినిమా షూటింగ్ కోసం వచ్చిన వాహనాల్లో ఒకటి ప్రమాదానికి గురైంది. అందులో ఉన్న వారందరూ కూడా క్షేమంగానే ఉన్నారు. మీ దృష్టికి వచ్చిన వార్తలు పూర్తిగా అవాస్తవం అని తెలుపుతున్నాను. తప్పుడు వార్తల వల్ల నా స్నేహితులు, సినీ ప్రముఖులు, అభిమానులు, పత్రికాధిపతులు వంటి అనేకమంది నాకు ఫోన్ కాల్స్ చేస్తూనే ఉన్నారు. నా క్షేమం గురించి అడిగి తెలుసుకున్నారు. నా పట్ల వారు చూపిన ప్రేమకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.' అని ఆయన తెలిపారు.Im fine all. This is false news pic.twitter.com/EwO3MB3T2Q— Yogi Babu (@iYogiBabu) February 16, 2025 -
పల్నాడు: ఘోర ప్రమాదం.. ఒకే కుటుంబంలో ముగ్గురు మృతి
సాక్షి, పల్నాడు: పల్నాడు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాద ఘటన చోటుచేసుకుంది. లారీని కారు ఢీకొన్న ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతిచెందారు. ఈ ప్రమాదంలో మృతిచెందిన వారు ప్రకాశం జిల్లాలకు చెందినట్టు పోలీసులు గుర్తించారు.వివరాల ప్రకారం.. పల్నాడు జిల్లాలోని రాజుపాలెం మండలం పెదనెమలిపూరి దగ్గర ఆదివారం ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది. హైదరాబాద్ నుంచి ప్రకాశం జిల్లా మద్దిపాడు వెళ్తున్న కారు.. లారీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారు ప్రయాణిస్తున్న ముగ్గురు మృతిచెందారు. మృతుల్లో తల్లి షేక్ నజీమా (50).. ఆమె కుమారులు ఇద్దరు షేక్ నూరుల్లా (26), షేక్ హబీబుల్లా(24) ఉన్నారు. ఇక, వీరిని ప్రకాశం జిల్లా మద్దిపాడు మండలం కొత్తపల్లి చెందిన వారిగా గుర్తించారు. ప్రమాద సమాచారం అందిన వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టం కోసం ఆసుపత్రికి తరలించారు. -
యూపీలో ఘోర రోడ్డు ప్రమాదం
-
కుంభమేళాకు వెళ్తుండగా రోడ్డు ప్రమాదం.. 10 మంది మృతి
ప్రయాగ్‌రాజ్: ఉత్తరప్రదేశ్(Uttar Pradesh)లో ఘోర రోడ్డు ప్రమాద ఘటన చోటుచేసుకుంది. మీర్జాపుర్- ప్రయాగ్‌రాజ్ రహదారిపై బొలేరో వాహనం బస్సును ఢీకొన్న ప్రమాదంలో దాదాపు 10 మంది భక్తులు మృతిచెందారు. ఈ ఘటనలో మరో 19 మంది తీవ్రంగా గాయపడ్డినట్టు తెలుస్తోంది. వీరంతా మహాకుంభామేళకు వెళ్తున్న సమయంలోనే ప్రమాదం జరిగింది.వివరాల ప్రకారం.. మీర్జాపుర్-ప్రయాగ్‌రాజ్(Prayagraj) జాతీయ రహదారిపై మహా కుంభమేళా(Maha KumbhaMela)కు భక్తులతో వెళ్తున్న బొలెరో వాహనం ఓ ట్రావెల్ బస్సును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో పది మంది భక్తులు అడికక్కడే మృతిచెందారు. మరో 19 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఇక, మృతులందరూ ఛత్తీస్‌గఢ్‌కు చెందినవారిగా అధికారులు గుర్తించారు. అర్థరాత్రి రెండు గంటల సమయంలో మేజా సమీపంలో ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు వెల్లడించారు. అతి వేగంగా వచ్చిన బొలెరో బస్సును ఢీకొట్టింది. ఈ ఘటనలో బొలెరో నుజ్జునుజ్జయింది. మరణించిన భక్తులందరూ బొలెరోలో ప్రయాణిస్తున్నవారేనని పోలీసులు తెలిపారు. 19 మంది బస్సులో ఉన్నవారు గాయపడినట్టు చెప్పుకొచ్చారు. ఈ ప్రమాదానికి సంబంధించిన సమాచారం అందిన వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాలను బయటకు తీశారు. చనిపోయిన వారంతా ఛత్తీస్‌గఢ్‌లోని కోర్బా జిల్లా నివాసితులని తెలిపారు. మృతుల్లో అందరూ పురుషులే ఉన్నట్టు వెల్లడించారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది. VIDEO | At least 10 people have been killed and several injured in a head-on collision between a car and a bus in Prayagraj. More details awaited.(Full video available on PTI Videos - https://t.co/n147TvqRQz) pic.twitter.com/06t5TkNd4m— Press Trust of India (@PTI_News) February 15, 2025 -
రోడ్డు ప్రమాదంలో యువతి దుర్మరణం
మూసాపేట: చిన్ననాటి స్నేహితునితో కలిసి స్కూటీపై వెళ్తున్న యువతిని రెడీమిక్స్ లారీ ఢీకొనడంతో దుర్మరణం పాలైంది. కూకట్పల్లి పోలీసులు, స్థానికులు తెలిపిన మేరకు.. శ్రీకాకుళం జిల్లా, పాతపట్నం గ్రామానికి చెందిన కుమారి తన కుమార్తె మమత, కుమారుడితో కలిసి మూసాపేటలోని ముష్కిపేటలో ఉంటోంది. కుమారి కూతురు మమత(17) మంగళవారం రాత్రి తన స్నేహితురాలి ఇంటికి వెళ్తున్నానని చెప్పి వెళ్లింది. రాత్రి 11 గంటల సమయంలో మమత తన చిన్ననాటి స్నేహితుడైన నరేశ్‌తో కలిసి మూసాపేట నుంచి కూకట్పల్లి వైపు స్కూటీపై వెళ్తుండగా మూసాపేట మెట్రో స్టేషన్ పిల్లర్ 878 వద్ద గుర్తు తెలియని రెడీమిక్స్ లారీ ఢీ కొట్టింది. దీంతో ఇద్దరూ కింద పడిపోగా రెడీమిక్స్ వాహనం మమత నడుం మీదనుంచి వెళ్లడంతో తీవ్రంగా గాయపడింది. వెంటనే ఇద్దర్నీ స్థానిక ఆస్పత్రికి తరలించగా మమత మృతిచెందినట్లు వైద్యులు వెల్లడించారు. తల్లి ఫిర్యాదు మేరకు కూకట్పల్లి పోలీసులు కేసు నమోదు చేసి..మృతదేహాన్ని గాంధీ ఆసుపత్రికి తరలించారు. కాగా ఢీకొట్టిన రెడీమిక్స్ లారీ వివరాలు తెలియవని, సీసీ ఫుటేజీలు పరిశీలించాక వివరాలు తెలుస్తాయని పోలీసులు తెలిపారు. ఇదిలా ఉండగా..మమత మృతిపై తమకు అనుమానాలు ఉన్నాయని మృతురాలి బంధువులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. -
అయ్యో.. మౌనిక!
హైదరాబాద్, సాక్షి: నగరంలో నిర్లక్ష్యపు డ్రైవింగ్ మరో నిండు జీవితాన్ని బలిగొంది. మూసాపేట వై జంక్షన్ వద్ద బుధవారం ఉదయం ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ఓ యువతి అక్కడికక్కడే మృతి చెందింది. మృతురాలిని మౌనికగా పోలీసులు నిర్ధారించారు. స్కూటీపై వెళ్తున్న మౌనికను వేగంగా వచ్చిన ఓ లారీ వచ్చి ఢీ కొట్టింది. దీంతో మౌనిక అక్కడికక్కడే మృతి చెందింది. యాక్సిడెంట్ నేపథ్యంలో భారీగా ట్రాఫిక్ ఝామ్ కాగా.. పోలీసులు రంగంలోకి దిగి క్లియర్ చేశారు. మౌనిక మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. -
పిల్లలకేం చెప్పాలి.. దేవుడా..
ఉప్పల్/మలక్‌పేట: మహాకుంభ మేళాకు వెళ్లి తమవాళ్లు క్షేమంగా ఇంటికి తిరిగి వస్తారనుకున్న ఆ కుటుంబ సభ్యులకు రోడ్డు ప్రమాదం వార్త తీరని శోకాన్ని మిగిల్చింది. ఆనందంతో బయలుదేరి విగత జీవులుగా మారి తిరిగి రావడం తీరని దుఃఖాన్నే మిగిల్చింది. కుటుంబ పెద్ద దిక్కును కోల్పోయిన బాధితులు భోరుమంటూ విలపిస్తున్నారు. తాము కుశలమేనంటూ ఫోన్లో మాట్లాడిన కొన్ని గంటల్లోనే పిడుగులాంటి వార్త వారి గుండెలను పిండేసింది. మహా కుంభ మేళా నుంచి మినీ బస్సులో తిరిగి వస్తుండగా మధ్యప్రదేశ్ జబల్పూర్ వద్ద ట్రక్కు ఢీకొట్టిన ప్రమాదంలో ఏడుగురు నగర వాసులు మృత్యువాత పడ్డారు. నాచారం ప్రాంతానికి చెందిన ఆరుగురు, మూసారంబాగ్‌కు చెందిన ఒకరు దుర్మరణం చెందారు. మరొకరు తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ప్రయాగ్ రాజ్ కుంభ మేళాకు వెళ్లిన వారంతా స్నేహితులే కావడం గమనార్హం. కాగా.. మృత దేహాలు బుధవారం మధ్యాహ్నం వరకు నగరానికి చేరుకోవచ్చని భావిస్తున్నారు.బై బై అంటూ బయలుదేరి.. మూసారంబాగ్‌కు చెందిన గోల్కొండ ఆనంద్‌కుమార్ (47) ఇంటి నుంచి బయలుదేరే ముందు భార్యా పిల్లలకు బై బై అని చెప్పి కుంభ మేళాకు వెళ్లి తిరిగిరాని లోకాలకు వెళ్లాడు. ఆనంద్ కుమార్ సలీంనగర్లో గోల్డ్ వర్క్‌షాప్ నిర్వహిస్తున్నాడు. స్నేహితులతో కలిసి శనివారం ఉదయం నాచారం నుంచి మినీ బస్సులో కుంభమేళాకు బయలుదేరారు. త్రివేణి సంగమంలో స్నానం చేశామని, ట్రాఫిక్ జామ్ ఉందని, వస్తే ఇక్కడ ఇబ్బంది పడతారని, ట్రాఫిక్ క్లియర్ కావడానికి 24 గంటలు పడుతుందని, ఎవరూ రావొద్దని సోమవారం రాత్రి ఫోన్ చెసి చెప్పాడని బంధువులు తెలిపారు. పెళ్లి రోజుకు ఒక్క రోజు ముందే.. భోరంపేట సంతోష్ భార్య గత ఏడాది క్రితం కన్నుమూశారు. బుధవారం ఆయన పెళ్లి రోజు. వచ్చే నెల్లో భార్య సంవత్సరీకం నిర్వహించాల్సి ఉంది. ప్రస్తుతం ఆయన ఇద్దరు కుమారులు హాస్టల్లో ఉంటున్నారు. తన పెళ్లి రోజుకు ఒక్క రోజు ముందే భార్య వద్దకే వెళ్లిపోయాడంటూ కుటుంబీకులు విలపిస్తున్నారు. బతుకు బండికి డ్రైవర్.. వృత్తిరీత్యా డ్రైవర్ అయిన కల్కూరి రాజు కుటుంబ పరిస్థితి దయనీయం. ఆయన డ్రైవింగ్ చేస్తేనే వారి ఇల్లు గడిచేది. సంపాదించే పెద్ద దిక్కును కోల్పోయామని, అంతా రోడ్డునపడ్డామంటూ కుటుంబం విలపిస్తోంది. రాజు మరణ వార్త తెలియడంతోనే శ్రీరామ్ కాలనీ బస్తీ శోకసంద్రంలో మునిగిపోయింది. భర్త లేడన్న వార్త తెలిసి రాజు భార్య మహేశ్వరి గుండెలు పగిలేలా రోదిస్తోంది. కాలనీ సమస్యలపైనే దృష్టి మా నాన్న అందరికి రోల్ మోడల్‌గా ఉండేవారు. అందరికీ సాయపడే వ్యక్తి ఆయన. అందరితో కలిసి మెలిసి ఉండే వారు. నిత్యం స్థానికులతోనే గడిపే వారు. కాలనీయే ఆయనకు సర్వస్వం. సోమవారం గంగ స్నానం అయిందంటూ మాట్లాడారు. తిరిగి వచ్చేస్తున్నా అని కూడా చెప్పాడు. కాని నాన్న ఇంక రాలేరు. – మల్లారెడ్డి కుమారుడు శ్రావణ్ రెడ్డిపిల్లలకేం చెప్పాలి.. దేవుడా.. ‘నా కొడుకు పిల్లలు హాస్టల్లో ఉన్నారు. తండ్రి మరణ వార్త వారికి ఇంకా తెలియదు. గత ఏడాది వారి తల్లి మృతి చెందింది. ఇప్పుడు తండ్రి కూడా చనిపోయాడు. పిల్లలు హాస్టల్ నుంచి వస్తే నేనేం సమాధానం చెప్పాలి దేవుడా’ అంటూ సంతోష్ తల్లి భోరున విలపిస్తోంది. – విలపిస్తున్న సంతోష్ తల్లి -
‘మహా’ విషాదం.. మరణంలోనూ వీడని స్నేహబంధం
ఉప్పల్/మల్లాపూర్: మహా కుంభమేళా ప్రయాణం హైదరాబాద్‌కు చెందిన ఏడు కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని నింపింది. ప్రయాగ్‌రాజ్‌లోని త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలు ఆచరించి తిరుగుప్రయాణంలో ఉన్న ఆ ఇంటి పెద్దల్ని రోడ్డు ప్రమాదం కబళించింది. మరో ఇద్దరిని తీవ్రంగా గాయపర్చింది. మహా కుంభమేళా నేపథ్యంలో వివిధ ప్రాంతాలకు చెందిన 8 మంది స్నేహితులు ఈనెల 8న నాచారం కార్తికేయ నగర్ నుంచి మ్యాక్సీ క్యాబ్‌లో ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌కు వెళ్లారు. ఈ వాహనంలో డ్రైవర్ సహా తొమ్మిది మంది ఉన్నారు. వీరంతా వారివారి కుటుంబాలను పోషించే వారే కావడం గమనార్హం. సోమవారం ప్రయాగ్‌రాజ్‌లో పుణ్యస్నానాలు ఆచరించి, చుట్టుపక్కల ఉన్న ఆలయాల్లో దర్శనాలను పూర్తి చేసుకుని మంగళవారం హైదరాబాద్‌కు తిరుగుపయనమయ్యారు. ఈ విషయం తమ కుటుంబీకులకు ఫోన్ ద్వారా తెలిపారు. అయితే వీరి తిరుగు ప్రయాణం ప్రారంభమైన కొన్ని గంటల్లోనే ట్రక్కు రూపంలో మృత్యువు ముంచుకొచ్చింది. మధ్యప్రదేశ్‌లోని సిహోరా పోలీసుస్టేషన్ పరిధిలోని మోహ్లా–బార్గీ గ్రామాల మధ్య వీరి మ్యాక్సీ క్యాబ్ వాహనం ఘోర ప్రమాదానికి గురైంది. కత్నీ వైపు నుంచి జబల్పూర్ వైపు వస్తుండగా.. ఓ వంతెనపై ఎదురుగా అతివేగంతో దూసుకొచ్చిన ఓ ట్రక్ బలంగా వారి వాహనాన్ని ఢీ కొట్టింది. ఈ దుర్ఘటనలో ఏడుగురు అక్కడిక్కడే చనిపోగా... తీవ్రగాయాలపాలైన శ్రీరాం బాలకిషన్ (62), నవీన్‌చారి జబల్పూర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ దుర్ఘటనతో నాచారంలోని కార్తికేయ నగర్, శ్రీరాంనగర్, చైతన్యపురిలో విషాదఛాయలు అలముకొన్నాయి. కుంభమేళాకు వెళ్లిన వీరంతా ప్రాణ స్నేహితులని, మంచిచెడులను పంచుకుంటూ కలివిడిగా ఉంటుండేవారని స్థానికులు చెబుతున్నారు. ఎక్కడకు వెళ్లినా కలిసే వెళ్తారని, మరణంలోనూ వీరి స్నేహబంధం వీడలేదని అంటున్నారు. సీఎం రేవంత్ దిగ్భ్రాంతి మధ్యప్రదేశ్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. హైదరాబాద్‌లోని నాచారం ప్రాంతానికి చెందిన వారు చనిపోయినట్లు సమాచారం అందడంతో వెంటనే అధికారులను అప్రమత్తం చేశారు. గాయపడిన వారికి మెరుగైన వైద్య అందేలా అందేలా ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. రోడ్డు ప్రమాదంలో ఏడుగురు మృతి చెందడంపై కేంద్ర మంత్రులు కిషన్‌రెడ్డి, బండి సంజయ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మధ్యప్రదేశ్ ప్రభుత్వ అధికారులతో మాట్లాడి మృతుల కుటుంబాలకు అవసరమైన సహాయ, సహకారాలను అందించాలని, గాయపడిన వారికి సరైన చికిత్స అందించాలని కోరారు. ఫోన్లో బాధిత కుటుంబసభ్యులతో మాట్లాడి పరామర్శించారు. మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ ప్రమాద ఘటనపై విచారం వ్యక్తం చేశారు. అమ్మా... నాన్నకు ఏమైంది? ప్రమాదమృతుల్లో ఒకరైన శశికాంత్ కుమార్తె శ్రీ మూడో జన్మదిన వేడుకల్ని సోమవారం ఇంట్లో ఘనంగా నిర్వహించుకున్నారు. ఈ దృశ్యాలను భార్య కళ్యాణి వీడియో కాల్ ద్వారా శశికాంత్‌కు చూపించారు. మంగళవారం పిడుగులాంటి వార్త రావడంతో కళ్యాణి సహా కుటుంబీకులంతా కన్నీరుమున్నీరయ్యారు. ఇది చూసిన శ్రీ అమాయకంగా అమ్మా... నాన్నకు ఏమైందంటూ ప్రశి్నస్తుండగా... ఏం చెప్పాలో అర్థం కాక విలపించడంతో అందరూ కంటతడిపెట్టారు. వస్తానని చెప్పాడు.. కానీ.. నా భర్త రాజు ఈ రోజు ఉదయాన్నే ఫోన్ చేసి మాట్లాడాడు. ఇంటికి వస్తున్నా అంటూ నాకు మాట ఇచ్చాడు. కానీ ఇప్పుడు తిరిగిరాని లోకాలకు వెళ్లాడని తెలిసింది. నేను ఇద్దరు చిన్న పిల్లలతో ఎలా బతికాలి. మమ్మల్ని విడిచి ఎలా వెళ్లిపోయాడో తెలియడం లేదు. - రాజు భార్య మహేశ్వరి మృతులు: 1. సూరకంటి మల్లారెడ్డి (64), నాచారం కార్తికేయనగర్ కాలనీ అధ్యక్షుడు. స్థానికంగా పాల వ్యాపారం చేస్తున్నారు. 2. రాంపల్లి రవి కుమార్ (56) కార్తికేయనగర్ తిరుమల రెసిడెన్సీ వాసి. స్థానికంగా తిరుమల మెడికల్ షాపు నిర్వహిస్తున్నారు. 3. బోరంపేట సంతోష్ (47), కార్తికేయ నగర్ సాయిలీలా రెసిడెన్సీ నివాసి. 4. కల్కూరి రాజు (38), నాచారం శ్రీరాంనగర్ కాలనీ, వాహనం డ్రైవర్. 5. సోమవారం శశికాంత్ (38), నాచారం రాఘవేంద్రానగర్ వాసి, సాఫ్ట్వేర్ ఉద్యోగి. 6. టి.వెంకట ప్రసాద్ (55) తార్నాక గోకుల్ నగర్ వాసి. బ్యాంక్ ఆఫ్ బరోడా ఉద్యోగి. 7. గోల్కొండ ఆనంద్ కుమార్ (47) దిల్‌సుఖ్‌నగర్‌లోని వివేకానందనగర్ వాసి -
జబల్పూర్ ప్రమాదంపై వైఎస్ జగన్ విచారం
తాడేపల్లి, సాక్షి: మధ్యప్రదేశ్ జబల్పూర్ జిల్లా సిహోరాలో ఇవాళ జరిగిన రోడ్డు ప్రమాదంపై వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ప్రమాదంలో మహా కుంభమేళా నుంచి తిరిగి వస్తున్న హైదరాబాద్ వాసులు మృతి చెందిన సంగతి తెలిసిందే. తెలుగు భక్తులు మృతి చెందటంపై వైఎస్ జగన్ విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేసిన ఆయన.. క్షతగాత్రులు, బాధిత కుటుంబాలను వెంటనే ప్రభుత్వాలు ఆదుకోవాలని ఒక ప్రకటనలో విజ్ఞప్తి చేశారు. హైదరాబాద్ నాచారం నుంచి కొందరు భక్తులు మినీ బస్సుల్లో ప్రయాగ్‌రాజ్ మహా కుంభమేళాకు వెళ్లారు. పుణ్య స్నానాలు ముగించుకుని తిరిగి వస్తుండగా.. సిహోరా వద్ద 30వ నెంబర్ జాతీయ రహదారిపై మంగళవారం ఉదయం రాంగ్ రూట్లో వచ్చిన ఓ ట్రక్కు ఢీ కొట్టింది. ఈ ఘటనలో ఏడుగురు అక్కడికక్కడే చనిపోగా.. మరొకరు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించినట్లు తెలుస్తోంది. -
జబల్పూర్ వద్ద ట్రక్కును ఢీకొట్టిన మినీ బస్సు
-
మధ్యప్రదేశ్‌లో తెలుగువారిని బలిగొన్న ఘోర ప్రమాదం
హైదరాబాద్, సాక్షి: మధ్యప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం తెలుగువారిని బలిగొంది. మంగళవారం ఉదయం హైవేపై ఓ మినీ బస్సును ట్రక్కు ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఏడుగురు అక్కడికక్కడే మృతి చెందగా.. మరొకరు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. మరొకరికి తీవ్ర గాయాలవ్వగా.. చికిత్స అందుతోంది. మృతులంతా హైదరాబాద్ నాచారం ప్రాంతానికి చెందినవాళ్లుగా నిర్ధారణ అయ్యింది. హైదరాబాద్ నాచారంలోని కార్తికేయ నగర్, రాఘవేంద్ర నగర్‌లకు చెందిన స్థానికులు మూడు మినీ బస్సుల్లో మహా కుంభమేళా యాత్రకు వెళ్లారు. అయితే తిరుగు ప్రయాణంలో అందులోని ఓ బస్సును.. రాంగ్ రూట్లో వచ్చిన సిమెంట్లోడ్ ట్రక్కు ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఏడుగురు అక్కడికక్కడే చనిపోయారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వాళ్లను ఆస్పత్రులకు తరలించారు. జబల్పూర్(Jabalpur) సిహోరా దగ్గర జాతీయ రహదారి 30పై మంగళవారం ఉదయం 9 గంటల ప్రాంతంలో ఈ ఘోరం చోటు చేసుకుందని కలెక్టర్ దీపక్ కుమార్ సక్సేనా మీడియాకు తెలిపారు. ప్రమాదానికి గురైన మినీ బస్ నెంబర్ AP29 W1525 అని తెలిపారు. ఘటనపై నాచారం పోలీసులకు సమాచారం అందించినట్లు తెలిపారు. అలాగే.. మృతుల వివరాలను ఆయన మీడియాకు వివరించారు. మృతుల వివరాలుబాలకృష్ణ శ్రీరామ్, సంతోష్ ఖాన్సారీ, శశికాంత్ ఖాన్సారీ,ఆనంద్ ఖాన్సారీటీవీ ప్రసాద్మల్లా రెడ్డిరవి వైశ్య, నవీన్ గాయపడ్డవాళ్లువీ సంతోష్ మృతుల్లో.. సాఫ్ట్వేర్ ఇంజినీర్‌గా పని చేసే శశికాంత్ కుటుంబ సభ్యులే ఉన్నట్లు సమాచారం. ఏడుగురి మృతితో ఆ కుటుంబంలో తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి.హైదరాబాద్వాసులేప్రమాదంలో మరణించినవాళ్లంతా ఏపీ వాసులంటూ తొలుత ప్రచారం జరిగింది. అయితే.. వాళ్లంతా హైదరాబాద్ నాచారం ప్రాంతానికి చెందిన వాళ్లుగా తర్వాత అధికారులు నిర్ధారించుకున్నారు. ప్రమాద సమయంలో అందులో 9 మంది ఉన్నట్లు అక్కడి పోలీసులు వెల్లడించారు.సీఎం రేవంత్ దిగ్భ్రాంతిమధ్యప్రదేశ్ లోని జబల్పూర్ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ దుర్ఘటనలో హైదరాబాద్ నాచారం ఏరియాకు చెందిన వారు చనిపోయినట్లు సమాచారం అందటంతో వెంటనే అధికారులను అప్రమత్తం చేశారు. గాయపడిన వారికి మెరుగైన వైద్య సాయం అందేలా ఏర్పాట్లు చేయాలని, అవసరమైన సహాయక చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి ఆదేశించారు.కేంద్రమంత్రి కిషన్ రెడ్డి దిగ్భ్రాంతిజబల్పూర్ ప్రమాదంపై కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి, బీజేపీ తెలంగాణ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు జి.కిషన్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఘటన సమాచారం తెలిసిన వెంటనే.. మధ్యప్రదేశ్ ప్రభుత్వ అధికారులతో మాట్లాడారు. మృతుల కుటుంబాలకు అవసరమైన అన్ని రకాల సహాయ, సహకారాలను అందించాలని, గాయపడిన ఇద్దరికి సరైన చికిత్సనందించాలని కేంద్రమంత్రి సూచించారు. రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాల కలెక్టర్ల తోనూ మాట్లాడి, ఆయా కుటుంబాలకు అవసరమైన సహాయాన్ని అందించాలని ఆదేశించారు. బాధిత కుటుంబసభ్యులనూ ఫోన్లో కేంద్రమంత్రి పరామర్శించారు. Jabalpur, MP: A bus from Andhra Pradesh returning from Prayagraj collided with a truck near Sihora on NH-30, killing seven people. The accident occurred around 9:15 AM near Mohla-Bargi. Officials, including the Collector and SP, have reached the site pic.twitter.com/j6uQD592Wl— IANS (@ians_india) February 11, 2025 -
మెక్సికో ప్రమాదంలో 41 మంది మృతి
మెక్సికో సిటీ: మెక్సికోలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. దక్షిణ ప్రాంతంలోని టబాస్కోలో శనివారం తెల్లవారుజామున బస్సు ట్రక్కును ఢీకొనడంతో 41 మంది మృతి చెందారు. మరణించిన వారిలో 38 మంది ప్రయాణికులు, ఇద్దరు డ్రైవర్లు ఉన్నారు. బస్సు 48 మంది ప్రయాణికులతో దక్షిణ మెక్సికోలోని కాన్కున్ నుంచి టబాస్కోకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. బస్సు ట్రక్కును ఢీకొనడంతో తీవ్రమైన మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో బస్సు పూర్తిగా కాలిపోయింది. మెటల్ ఫ్రేమ్ మాత్రమే మిగిలిపోయింది. 41 మంది సజీవ దహనమయ్యారు. మృతదేహాలు పూర్తిగా కాలిపోవడంతో వారిని గుర్తించడం కష్టమవుతోంది. 18 మందిని మాత్రమే గుర్తించగలిగామని టబాస్కో రాష్ట్ర ప్రభుత్వం ఒక ప్రకటనలో తెలిపింది. -
ట్రాక్టర్ ప్రమాదంపై వైఎస్ జగన్ దిగ్భ్రాంతి
తాడేపల్లి : పల్నాడు జిల్లాలో జరిగిన ట్రాక్టర్ ప్రమాదంపై వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ట్రాక్టర్ బోల్తా పడి నలుగురు మహిళలు మృత్యువాత పడటంపై విచారం వ్యక్తం చేశారు వైఎస్ జగన్. మృతుల కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని వైఎస్ జగన్ విజ్ఞప్తి చేశారు. అదే సమయంలో ప్రమాదంలో గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలన్నారు.కాగా, పల్నాడు జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. మిర్చి కోత కోసి పోలం నుంచి ఇంటికి తిరిగి వస్తుండగా ముప్పాళ్ళ మండలం బొల్లవరం అడ్డరోడ్డు వద్ద 30మంది మిర్చి కూలీలతో వెళ్తున్న ట్రాక్టర్ బోల్తా పడింది. ఈ దుర్ఘటనలో నలుగురు కూలీలు మృతి చెందారు. పలువురు గాయపడ్డారు. గాయపడ్డ క్షతగాత్రుల్ని అత్యవసర చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. -
పల్నాడు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం
సాక్షి,పల్నాడు : జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. మిర్చి కోత కోసి పోలం నుంచి ఇంటికి తిరిగి వస్తుండగా ముప్పాళ్ళ మండలం బొల్లవరం అడ్డరోడ్డు వద్ద 30మంది మిర్చి కూలీలతో వెళ్తున్న ట్రాక్టర్ బోల్తా పడింది. ఈ దుర్ఘటనలో నలుగురు కూలీలు మృతి చెందారు. పలువురు గాయపడ్డారు. గాయపడ్డ క్షతగాత్రుల్ని అత్యవసర చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. -
ఒక్కొగానొక్క కుమారుడు..ఆశల దీపం ఆరిపోయింది
చేబ్రోలు/వెల్దుర్తి : ఒక్కొగానొక్క కుమారుడు. బాగా చదివి ప్రయోజకుడై కుటుంబానికి ఆసరాగా ఉంటాడని తల్లిదండ్రులు కలలుగన్నారు. వారి కలలను మృత్యువు పొట్టన పెట్టుకుంది. ఉన్నత విద్య చదువుకునేందుకు వెళ్లిన కుమారుడు విగతజీవిగా తిరిగిరావడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. గుంటూరు జిల్లా చేబ్రోలు మండలం వడ్లమూడి గ్రామ పరిధిలోని గుంటూరు – తెనాలి రహదారిలో బుధవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో కర్నూలుకు చెందిన ఓ యువకుడు దుర్మరణం చెందాడు. కర్నూలుకు చెందిన లక్ష్మీరెడ్డి, ఊర్మిల దంపతులకు కుమారుడు, కుమార్తె ఉన్నారు. సొంతూరు వెల్దుర్తి కాగా ఉపాధి నిమిత్తం కర్నూలుకు చేరుకుని అక్కడే స్థిర పడ్డారు. వీరి కుమారుడు మణికంఠేశ్వరరెడ్డి(25) గుంటూరు జిల్లా చేబ్రోలు మండలంలోని విజ్ఞాన్ యూనివర్సిటీలో ఎంబీఏ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. బుధవారం రాత్రి యూనివర్సిటీ సమీపంలో రెండు బైక్‌లు ఢీకొన్న ప్రమాదంలో మణికంఠేశ్వరరెడ్డి దుర్మరణం చెందాడు. మృతుడి తండ్రి లక్ష్మీరెడ్డి కర్నూలు నగరంలోని బళ్లారి చౌరస్తా ఏరియాలో ఆటో నడుపుతూ కుటుంబాన్ని పోషిస్తున్నారు. కుమార్తెకు వివాహం చేశారు. కుమారుడు మణికంఠేశ్వరరెడ్డి బీఎస్సీ అగ్రికల్చర్ డెహ్రాడూన్‌లో పూర్తి చేశాడు. ఎంబీఏ కోసం చేబ్రోలు వచ్చాడు. ప్రమాద సమాచారం తెలుసుకున్న వెల్దుర్తి వైఎస్సార్సీపీ మండల అధ్యక్షుడు బొమ్మన రవిరెడ్డి, పలువురు నేతలు, కుటుంబసభ్యులు చేబ్రోలు చేరుకున్నారు. చేబ్రోలు ఎస్ఐ డి.వెంకట కృష్ణ కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. మృతదేహాన్ని పోస్టుమార్టం అనంతరం కుటుంబసభ్యులకు అప్పగించారు. కుమారుడి మృతితో తల్లిదండ్రులు రోదిస్తున్న తీరు పలువురిని కలిచివేసింది. -
హైదరాబాద్- బెంగుళూరు హైవేపై ఘోర ప్రమాదం
సాక్షి, వనపర్తి జిల్లా: హైదరాబాద్- బెంగుళూరు జాతీయ రహదారి 44పై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పెద్ద మందడి మండలం వెల్టూర్ స్టేజి సమీపంలోని జాతీయ రహదారిపై హైదరాబాద్ నుంచి కర్నూలు వైపు వెళుతున్న షిఫ్ట్ కారును వెనక నుండి డీసీఎం ఢీకొట్టడంతో కారు ముందు వెళ్తున్న ఎయిర్ ఫోర్స్‌కు సంబంధించిన లారీని కారు ఢీ కొట్టింది.దీంతో కారులో ప్రయాణిస్తున్న ఒకే కుటుంబానికి చెందిన నలుగురిలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందగా మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. 108 అంబులెన్స్‌లో వనపర్తి ఏరియా ఆసుపత్రికి తరలించారు. మృతి చెందిన వారిలో పదేళ్ల బాలుడు, మరో మహిళ ఉన్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగా కారులో వెళ్తున్న వారి వివరాలు తెలియాల్సి ఉంది. -
పెద్ద అంబర్‌పేట్‌లో విషాదం.. బస్సు కిందపడి చిన్నారి మృతి
సాక్షి, రంగారెడ్డి జిల్లా: పెద్ద అంబర్‌పేట్‌లో విషాదం జరిగింది. హయత్‌నగర్ శ్రీచైతన్య టెక్నో స్కూల్లో ఎల్కేజీ చదువుతున్న నాలుగేళ్ల విద్యార్థిని స్కూల్ బస్సు కింద పడి ప్రాణాలు కోల్పోయింది. బాలిక రోడ్డు దాటుతున్న విషయాన్ని గమనించకుండా వ్యాన్‌ను డ్రైవర్ రివర్స్ చేయడంతో వెనక టైర్ల కింద పడి చిన్నారి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.మరో ఘటనలో ఓ ప్రైవేటు పాఠశాల బస్సు.. బైక్‌ను ఢీకొట్టిన ఘటనలో ఇంజనీరింగ్ విద్యార్థి అక్కడికక్కడే మృతిచెందగా మరొకరికి గాయాలయ్యాయి. శంకర్పల్లి మండల పరిధిలోని ఎన్సీడీ రాయల్ పెవిలియన్ వద్ద బుధవారం సాయంత్రం జరిగింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కృష్ణా జిల్లా విజయవాడ అర్బన్ మండల కేంద్రానికి చెందిన శ్రీహర్ష(19)కు దొంతన్‌పల్లిలోని ఇక్ఫాయ్ డీమ్డ్ విశ్వవిద్యాలయంలో ఇంజనీరింగ్ సీటు వచ్చింది. దీంతో అతని తల్లి మోకిలతండాలో ఓ గదిని అద్దెకు తీసుకుని ఇక్కడే ఉంటూ కొడుకును చదివిస్తోంది. శ్రీహర్ష నిత్యం బైక్‌పై కాలేజీకి వెళ్లివస్తుంటాడు.ఇదిలా ఉండగా బుధవారం కళాశాల ముగిసిన తర్వాత ఉప్పల్‌కు చెందిన క్లాస్మేట్ హర్షనందన్(19)ను తీసుకుని ఫ్రెషప్ అయ్యేందుకు మోకిలతండాకు వచ్చారు. సుమారు గంటపాటు రూంలో గడిపిన అనంతరం హర్షనందన్ను కాలేజీ వద్ద వదిలిపెట్టేందుకు బైక్‌పై తిరుగు ప్రయాణమయ్యారు. ఎన్సీడీ రాయల్ పెవిలియన్ సమీపంలో కొండకల్ వైపు అతివేగం, అజాగ్రత్తగా వెళ్తున్న ఏపీ మోడల్ పాఠశాల బస్సు వీరిని బలంగా ఢీ కొట్టింది. బైక్ నడుపుపుతున్న శ్రీహర్షకు బలమైన గాయాలు కావడంతో అక్కడికక్కడే మృతి చెందగా.. హర్షనందన్ పాక్షిక గాయాలతో బయటపడ్డాడు. అతన్ని శంకర్‌పల్లిలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న మోకిల పోలీసులు శ్రీహర్ష మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం చేవెళ్ల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. -
రోడ్డు ప్రమాదం: 8 మంది దుర్మరణం
జైపూర్: రాజస్థాన్‌లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఎనిమిది మంది దుర్మరణం చెందారు. ఓ బస్సు అదుపు తప్పి కారును ఢీకొట్టడంతో భారీ సంఖ్యలోప్రాణనష్టం వాటిల్లింది. రాజస్థాన్‌లోని దుడు రీజియన్లజజైపూర్-అజ్మీర్ హైవేపై మౌంఖపూరాకు అతి దగ్గర్లో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. గురువారం మధ్యాహ్న సమయంలో జరిగిన ఈ ప్రమాదంలో ఎనిమిది మంది మృతి చెందగా, ఆరుగురికి తీవ్ర గాయ్యాలయ్యాయి.బస్సు ముందు టైర్ పేలిపోవడంతో అది కాస్తా అదుపు తప్పింది. ఆ సమయంలో బస్సును కంట్రోల్ చేయడానికి యత్నించిన డ్రైవర్ ఎదురుగా వస్తున్న కారును ఢీకొట్టాడు. దాంతో కారులో ఉన్న వారు పలువురు ప్రాణాలు కోల్పోగా, కొంతమంది తీవ్ర గాయాల పాలయ్యారు. గాయపడిన వారిని స్థానికంగా ఉన్న ఆస్పత్రి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేపట్టారు. -
జగిత్యాల: రోడ్డు ప్రమాదంలో ఎస్ఐ శ్వేత మృతి
సాక్షి, జగిత్యాల జిల్లా: గొల్లపల్లి మండలం చిల్వాకోడూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. క్రైం రికార్డ్స్ బ్యూరో ఎస్ఐ శ్వేత మృతి చెందారు. కారులో ధర్మారం వైపు నుంచి జగిత్యాల వస్తుండగా ఘటన చోటుచేసుకుంది. చిల్వాకోడూర్ వద్ద ఎదురుగా వస్తున్న బైక్‌ను ఆమె కారు ఢీకొట్టింది. ఆ తర్వాత చెట్టును ఢీకొట్టడంతో తీవ్రంగా గాయపడిన ఎస్ఐ.. ఘటనా స్థలంలోనే మృతిచెందారు.కారు, బైక్‌ను ఢీకొనడంతో ఎస్ఐతో పాటు, బైక్‌పై ప్రయాణిస్తున్న యువకుడు మృతి చెందాడు. బైక్‌పై వెళ్తున్న వ్యక్తిని ముత్యంపేట వాసిగా పోలీసులు గుర్తించారు. బైక్‌పై వెళ్తున్న వ్యక్తిని ముత్యంపేట వాసిగా గుర్తించారు. ఎస్ఐ శ్వేత గతంలో వెల్గటూరు, కథలాపూర్, కోరుట్ల, పెగడపల్లిలో ఎస్ఐగా పనిచేశారు. -
రోడ్డు ప్రమాదంలో సాఫ్ట్వేర్ ఇంజినీర్ దుర్మరణం
గచ్చిబౌలి (హైదరాబాద్): రాంగ్ రూట్లో వచ్చిన ట్రాలీ ఆటో ఢీ కొట్టడంతో బైక్‌పై వెళుతున్న ఓ సాఫ్ట్వేర్ ఇంజినీర్ దుర్మరణం పాలైన సంఘటన గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఎస్ఐ మహేష్ గౌడ్ కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. మసీద్‌బండలో పీజీ హాస్టల్లో ఉంటున్న ప్రతిభా చంద్(25) గచ్చిబౌలిలోని ఓ ఐటీ కంపెనీలో సాఫ్ట్వేర్ ఇంజినీర్‌గా పని చేస్తున్నాడు. ఆదివారం తెల్లవారుజామున అతను బైక్‌పై గచ్చిబౌలి నుంచి మసీద్‌బండకు వెళుతున్నాడు. గచ్చిబౌలి స్టేడియం ఎదుట పాలప్యాకెట్ల లోడ్‌తో రాంగ్ రూట్లో వచ్చిన టాటా ఏసీ ట్రాలీ ఆటో అతడిని ఢీ కొట్టింది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన ప్రతిభా చంద్‌ను కేర్ ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ప్రమాదానికి కారణమైన ఆటో డ్రైవర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించారు. మృతుడి హెల్మెట్ ధరించనందునే తలకు తీవ్ర గాయాలు కావడంతో మృతి చెందినట్లు పోలీసులు పేర్కొన్నారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
యువ వైద్యుడి ప్రాణం తీసిన అతివేగం
మణికొండ: అతివేగంతో దూసుకొచ్చిన కారు అదుపు తప్పి రోడ్డు మధ్యలోని హోర్డింగ్ స్తంభాన్ని ఢీకొన్న ప్రమాదంలో ఓ యువ వైద్యుడు అక్కడికక్కడే మృతి చెందారు. మరో మహిళా డాక్టర్ గాయాల పాలయ్యారు. నార్సింగి పోలీస్‌స్టేషన్ పరిధిలోని ఖానాపూర్ గ్రామం వద్ద శనివారం తెల్లవారుజామున ఈ రోడ్డు ప్రమాదం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... ఎల్బీ నగర్‌లోని కామినేని ఆస్పత్రిలో వి.జస్వంత్ (25), భూమిక హౌస్ సర్జన్లుగా పని చేస్తున్నారు. శుక్రవారం రాత్రి వీరు కారులో రంగారెడ్డి జిల్లాలోని శంకర్‌పల్లికి ఓ వివాహానికి వెళ్లారు. తిరుగు ప్రయాణంలో తెల్లవారు జామున ఖానాపూర్ వద్ద రోడ్డు మలుపును గమనించకుండా వేగంగా రావడంతో కారు అదుపు తప్పింది. రోడ్డు మధ్యలో డివైడర్‌పై ఉన్న హోర్డింగ్ స్తంభాన్ని ఢీకొట్టింది. డ్రైవింగ్ చేస్తున్న జస్వంత్ తీవ్ర గాయాలతో అక్కడికక్కడే మృతి చెందారు. పక్క సీటులో కూర్చున్న భూమికకు తీవ్ర గాయాలు కావటంతో చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. -
రోడ్డు ప్రమాదంలో ఐదుగురు మహాకుంభ్ యాత్రికులు మృతి
యూపీలోని ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న కుంభమేళాకు జనం పోటెత్తుతున్నారు. కుంభమేళా సందర్భంగా పలు ఆసక్తికర ఘటనలతో పాటు విషాదకర ఉదంతాలు కూడా చోటుచేసుకుంటున్నాయి. అటువంటి ఉదంతం బీహార్‌లోని ముజఫర్‌పూర్‌లోని మధుబని నాలుగు లేన్ల రోడ్డులో చోటుచేసుకుంది.బైక్ రైడర్లను కాపాడే ప్రయత్నంలో స్కార్పియో వాహనం(Scorpio vehicle) రోడ్డుపై బోల్తా పడింది. ఈ ఘటనలో స్కార్పియోలోని ఐదుగురు అక్కడికక్కడే మృతిచెందారు. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. రూరల్ ఎస్పీ విద్యా సాగర్ తన బృందంతోపాటు సంఘటనా స్థలానికి చేరుకుని, మృతదేహాలను పోస్ట్ మార్టం కోసం ఎస్‌కేఎంసీహెచ్‌కు తరలించారు. గాయపడిన వారిని ఆసుపత్రిలో చేర్చారు. ఈ ప్రమాదంలో స్కార్పియో వాహనం పూర్తిగా ధ్వంసమైంది.మీడియాకు అందిన వివరాల ప్రకారం నేపాల్‌లోని మొహతారికి చెందిన కొందరు ప్రయాగ్‌రాజ్(Prayagraj)లో జరుగుతున్న మహా కుంభ్‌లో స్నానం చేసి, స్కార్పియో వాహనంలో తిరిగి నేపాల్ వెళుతుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటన గురించి స్థానికులు మాట్లాడుతూ ఈ ఘటనకు ముందు కొంతమంది యువకులు నాలుగు లేన్లలో బైక్‌లపై విన్యాసాలు చేస్తుండగా, ఒక స్కార్పియో వాహనం చాలా వేగంగా వారికి ఎదురుగా వచ్చిందన్నారు. ఆ వాహనం బైక్ నడుపుతున్నవారిని తప్పించే ప్రయత్నంలో డివైడర్‌ను ఢీకొని, ఆపై బోల్తా పడిందన్నారు. ఇది చూసిన ఆ యువకులు బైక్‌లతో సహా అక్కడి నుంచి పారిపోయారని తెలిపారు. స్కార్పియో వాహనం మూడు సార్లు బోల్తా పడటంతో దానిలో ఉన్న ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందారని వివరించారు. కాగా మృతుల్లో ముగ్గురు మహిళలు, ఇద్దరు పురుషులు ఉన్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.ఇది కూడా చదవండి: Mahakumbh-2025: తొక్కిసలాట బాధితులను పరామర్శించిన సీఎం యోగి -
ఐర్లాండ్‌లో రోడ్డు ప్రమాదం..ఇద్దరు తెలుగు విద్యార్థుల దుర్మరణం
డబ్లిన్:ఐర్లాండ్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఇద్దరు యువకులు దుర్మరణం పాలయ్యారు. ఒకరు ఎన్టీఆర్ జిల్లాకు చెందిన చిట్టూరి భార్గవ్ (25) కాగా మరొకరిని పల్నాడు జిల్లాకు చెందిన చెరుకూరి సురేష్ (26)గా గుర్తించారు. యువకుల మృతితో రెండు కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంది. కృష్ణా జిల్లా జగ్గయ్యపేట పట్టణానికి చెందిన భార్గవ్(25) ఉన్నత చదువుల కోసం ఐర్లాండ్ వెళ్ళాడు. భార్గవ్ శుక్రవారం(జనవరి31) రాత్రి స్నేహితులతో కలిసి బయటికి వెళ్లగా కారు అదుపుతప్పి చెట్టును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో భార్గవ్‌తో పాటు పల్నాడు జిల్లా రొంపిచర్లకు చెరుకూరి సురేశ్(26) కూడా ప్రాణాలు కోల్పోయాడు. చేతికి అందివచ్చిన కుమారులు చనిపోవడంతో వారి తల్లిదండ్రులు రోదిస్తున్నారు.ఇటీవలి కాలంలో అమెరికా సహా విదేశాల్లో చదువుకుంటున్న తెలుగు విద్యార్థుల మరణాలు ఎక్కువవడం కలవరం కలిగిస్తోంది. విదేశాల్లో చదువులు, ఉద్యోగాలకు పిల్లలను పంపాలంటే ఎప్పుడు ఏం వార్త వినాల్సి వస్తుందోనని తల్లిదండ్రులు భయాందోళనలకు గురయ్యే పరిస్థితి నెలకొంది. విదేశాల్లో రోడ్డు ప్రమాదాలతో పాటు దుండగుల కాల్పుల్లో విద్యార్థులు చనిపోతున్న ఘటనలు తరచుగా జరుగుతుండడం వారి కుటుంబాల్లో విషాదం నింపుతోంది. -
వాహనం ఢీకొని చిరుత మృతి
చిన్నశంకరంపేట(మెదక్): గుర్తు తెలియని వాహనం ఢీకొట్టడంతో చిరుత పులి మృతి చెందిన ఘటన మెదక్ జిల్లా నార్సింగి మండలం వల్లూర్ అటవీ ప్రాంతంలో జరిగింది. గురువారం రాత్రి నార్సింగి–వల్లూర్ మధ్యన నర్సరీ సమీపంలో రహదారిపై తీవ్రగాయాలతో పడి ఉన్న చిరుతను వాహనదారులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు వైద్యం కోసం చిరుతను తరలించేందుకుప్రయత్నిస్తున్నా క్రమంలో మృత్యువాత పడింది. మెదక్ జిల్లా అటవీ శాఖ అధికారి జోజీ, రామాయంపేట రేంజీ ఆఫీసర్ అక్కడికి చేరుకొని వివరాలు తెలుసుకున్నారు. ముందు ఒక వాహనం ఢీకొన్న అనంతరం చిరుత పరుగెత్తేందుకు ప్రయతి్నంచిన క్రమంలో మరో వాహనం ఢీకొని ఉండవచ్చని, నడుముకు, పొట్ట భాగంలో తీవ్ర గాయాలు కావడంతో అది మృతి చెందిందని అటవీశాఖ అధికారులు తెలిపారు. గుర్తుతెలియని వాహనం ఢీకొని నడిరోడ్డుపై చిరుత మృతిమెదక్ జిల్లా నార్సింగి మండలం వల్లూరు శివారులో NH-44పై రోడ్డు దాటుతున్న చిరుతను ఢీకొట్టిన గుర్తుతెలియని వాహనంనడుము విరిగి పలు చోట్ల గాయాలు కావడంతో నడిరోడ్డు పైనే చిరుత మృతి pic.twitter.com/KpHzjenKCw— Telugu Scribe (@TeluguScribe) January 31, 2025 -
రోడ్డు ప్రమాదంలో ముగ్గురు దుర్మరణం
పెడన: కృష్ణా జిల్లాలో గురువారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ముగ్గురు దుర్మరణం చెందారు. బైక్‌ను లారీ ఢీకొన్న ఈ ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మరణించగా, ఆస్పత్రికి తరలిస్తుండగా మరో వ్యక్తి ప్రాణాలు విడిచాడు. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం.. కృష్ణా జిల్లా బంటుమిల్లి మండలం ఆర్తమూరు దళితవాడకు చెందిన పాపవర్తి శాంతరాజు (26)తోపాటు బాపట్ల విజయచందర్ (40), పీతల అజయ్ (24) పెయింటింగ్ పనికోసం గురువారం ఉదయం మచిలీపట్నం వెళ్లారు.పని ముగించుకుని సాయంత్రం ముగ్గురూ బైక్‌పై తిరుగు ప్రయాణమయ్యారు. పెడన సమీపంలోని పెడన– బంటుమిల్లి బైపాస్ రోడ్డులో వస్తుండగా మచిలీపట్నం వైపు వేగంగా వస్తున్న లారీ ముందు వెళ్తున్న వాహనాన్ని ఓవర్ టేక్ చేసేందుకు రాంగ్ రూట్లో వచ్చి, శాంతరాజు బైక్‌ను బలంగా ఢీకొట్టింది. దాదాపు వంద మీటర్ల దూరం బైక్‌ను ఈడ్చుకుపోయింది. విజయచందర్, శాంతరాజు, అజయ్ రోడ్డుపై పడిపోయారు. విజయచందర్, శాంతరాజు అక్కడిక్కడే చనిపోగా అజయ్‌ను మచిలీపట్నం ఆస్పత్రికి తరలిస్తుండగా మృతి చెందాడు. మచిలీపట్నం డీఎస్పీ సీహెచ్ రాజా, పెడన సీఐ కె నాగేంద్రప్రసాద్ సంఘటన స్థలాన్ని పరిశీలించారు. మృతదేహాలను మచిలీపట్నం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. లారీ డ్రైవర్ పుప్పాల పవన్‌కుమార్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.ఆ కుటుంబాలకు వారే ఆధారంమృతులు పెయింటింగ్ పనులు చేసి రోజువారీ కూలీతో కుటుంబాలను నెట్టుకొస్తున్నారు. వీరు ముగ్గురి మృతితో ఆ కుటుంబాలు జీవనాధారం కోల్పోయాయి. బాపట్ల విజయచందర్‌కు భార్య, ఇద్దరు ఆడపిల్లలు, ఒక మగపిల్లాడు ఉన్నారు. వీరు పది, ఎనిమిది, ఐదో తరగతి చదువుతున్నారు. ఆ కుటుంబానికి దిక్కు విజయచందరే. శాంతరాజుకు తండ్రి లేడు. అన్న, శాంతరాజు సంపాదిస్తూ ఆఖరి తమ్ముడ్ని చదివించుకుంటున్నారు. పీతల అజయ్‌కి కూడా తండ్రి లేడు. సోదరుడితో కలిసి పెయింటింగ్ పనులు చేస్తూ కుటుంబానికి అండగా ఉన్నాడు. -
రోజుకు 71 రోడ్డు ప్రమాదాలు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో రోడ్డు ప్రమాదాలు ఆందోళన కలిగిస్తున్నాయి. రాష్ట్రంలో 2024లో సగటున రోజుకు 71 రోడ్డు ప్రమాదాలు జరిగాయి. ఆయా ఘటనల్లో రోజూ సగటున 18 మంది మృత్యువాత పడ్డారు. అత్యధికంగా రోడ్డు ప్రమాదాలు జరిగిన మొదటి పది రాష్ట్రాల్లో తెలంగాణ సైతం ఉంది. రాష్ట్ర రవాణాశాఖ ఈ వివరాలను వెల్లడించింది. 2024లో రాష్ట్రంలో సుమారు 26,000 రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. ఈ ప్రమాదాల్లో మొత్తం 7,700 మంది మరణించగా, కనీసం 20 వేల మంది గాయపడినట్లు రవాణాశాఖ తాజా గణాంకాలు వెల్లడించాయి. రహదారి భద్రతపై ప్రజల్లో సరైన అవగాహన లేకపోవడం, అపరిమిత వేగంతో వాహనాలు నడపడం, ర్యాష్ డ్రైవింగ్, రోడ్డు ఇంజినీరింగ్‌లో లోపాలు తదితర కారణాల వల్ల ప్రమాదాలు పెరుగుతున్నాయి. రవాణాశాఖ జనవరి నెలను జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవంగా ప్రకటించింది. ఈ నేపథ్యంలో స్కూళ్లు, కళాశాలల్లో రోడ్డు భద్రతపైన ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహిస్తోంది. ఇందులో భాంగా శుక్రవారం (జనవరి 31) నెక్లెస్‌రోడ్డులో రోడ్డు భద్రతా వాకథాన్ నిర్వహించనున్నారు. రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. మానవ తప్పిదాలే కారణం.. గత మూడేళ్లలో నమోదైన రోడ్డు ప్రమాదాల్లో 80 శాతం మానవ తప్పిదాల వల్లనే జరిగినట్లు రవాణాశాఖ తెలిపింది. సెల్‌ఫోన్ మాట్లాడుతూ వాహనాలు నడపడం, ఓవర్ స్పీడ్, మద్యం సేవించి వాహనాలు నడపడం, విశ్రాంతి లేకుండా డ్రైవింగ్ చేయడం వంటి కారణాల వల్ల ఎక్కువ ప్రమాదాలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో ప్రమాదాల నియంత్రణకు రవాణాశాఖ పలు చర్యలు చేపట్టింది. వాహనదారుల్లో అవగాహన కల్పించేందుకు ‘4ఈస్’ (ఎడ్యుకేషన్, ఎన్ఫోర్స్మెంట్, ఇంజనీరింగ్, ఎమర్జెన్సీ కేర్)పై దృష్టి సారించింది. మరోవైపు రహదారులపై బ్లాక్‌స్పాట్స్‌ను గుర్తించేందుకు చర్యలు చేపట్టినట్లు రవాణాశాఖ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. ట్రాఫిక్ చిల్డ్రన్స్ పార్క్.. నెల రోజుల పాటు చేపట్టిన రోడ్డు భద్రతా కార్యక్రమాల్లో భాగంగా ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో ట్రాఫిక్ చిల్డ్రన్స్ పార్కును ఏర్పాటు చేశారు. స్కూల్ విద్యార్థుల్లో అవగాహనకు ఇది దోహదం చేస్తుంది. గవర్నర్ జిష్ణుదేవ్‌వర్మ ఈ పార్కును ప్రారంభించారు. అలాగే హెల్మెట్ల పంపిణీ, వైద్య, ఆరోగ్య శిబిరాలు, విద్యార్థులకు క్విజ్ పోటీలు వంటివి నిర్వహించారు. -
అమెరికాలో రోడ్డు ప్రమాదం..
-
అమెరికాలో రోడ్డు ప్రమాదం హైదరాబాద్ యువకుడు మృతి
ఖైరతాబాద్: అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో నగరంలోని ఖైరతాబాద్‌కు చెందిన మహ్మద్ వాజిద్ దుర్మరణం చెందాడు. కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. ఖైరతాబాద్ ఎంఎస్ మక్తాలో నివసించే మహ్మద్ అజీజ్ జలమండలి ఉద్యోగి. ఆయన రెండో కుమారుడు మహ్మద్ వాజిద్ (28) 2021లో ఎంఎస్ చేసేందుకు అమెరికాలోని చికాగోకు వెళ్లాడు. వాజిద్ తమ్ముడు మహ్మద్ మాజిద్ కూడా అక్కడే ఎంఎస్ చేస్తున్నాడు. బుధవారం తెల్లవారుజామున 5 గంటలకు మాజిద్ అనారోగ్యం బారిన పడటంతో మందులు తీసుకువచ్చేందుకు వాజిద్ కారులో బయటకు వెళ్లాడు. ఆ సమయంలో కారును ట్రక్కు ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. పెళ్లి చేసే యోచనలో ఉండగానే.. మహ్మద్ వాజిద్‌కు ఈ ఏడాది డిసెంబర్లో వివాహం చేసే ప్రయత్నాల్లో ఉండగానే.. అతని మరణవార్త తెలియడంతో కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. తల్లిదండ్రులను అమెరికా రావాలంటూ వాజిద్ వారం రోజుల క్రితం వీసా కూడా పంపించినట్లు సమాచారం. వారు రెండు మూడు రోజుల్లో వెళ్లేందుకు సిద్ధమవుతుండగానే కుమారుడి మరణవార్త తెలియడంతో కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. అమెరికాలోనే వాజిద్ అంత్యక్రియలు చేస్తామని కుటుంబ సభ్యులు తెలిపారు. మహ్మద్ వాజిద్ గతంలో ఖైరతాబాద్ యూత్ కాంగ్రెస్ లీడర్‌గా పని చేశాడని, ప్రస్తుతం అమెరికాలో ఎన్ఆర్ఐ కాంగ్రెస్ కమిటీ సభ్యుడిగా ఉన్నట్లు తెలిసింది. ఎంఎస్ మక్తాలోని వాజిద్ కుటుంబ సభ్యులను ఎంపీ అనిల్‌కుమార్ యాదవ్ తదితరులు పరామర్శించారు. -
సౌదీ అరేబియాలో ఘోర రోడ్డు ప్రమాదం.. 9 మంది భారతీయులు దుర్మరణం
రియాద్ : సౌదీ అరేబియాలో బుధవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ రోడ్డు ప్రమాదంలో తొమ్మిది మంది భారతీయులు దుర్మణం పాలయ్యారు. ప్రమాదంపై భారత రాయబార కార్యాలయం సంతాపం తెలిపింది. బాధిత కుటుంబాలకు అండగా ఉంటామని, ప్రమాదంపై స్థానిక అధికారులతో మాట్లాడుతున్నట్లు ఒక ప్రకటనలో పేర్కొంది. Grieved to learn of this accident and the loss of lives. Spoke with our Consul General in Jeddah, who is in touch with the concerned families. He is extending fullest support in this tragic situation. https://t.co/MHmntScjOT— Dr. S. Jaishankar (@DrSJaishankar) January 29, 2025ప్రమాదంపై జిజాన్‌లో భారత రాయభార కార్యాలయం మృతులకు సంతాపం తెలిపింది. ప్రమాద బాధిత కుటుంబాలకు తాము అండగా ఉంటామని, స్థానిక అధికారులతో మాట్లాడుతున్నామని తెలిపింది. ప్రమాదంపై విదేశాంగ మంత్రి జైశంకర్ విచారం వ్యక్తం చేశారు. జెడ్డాలోని రాయబార కార్యాలయంతో తాను మాట్లాడినట్లు తెలిపారు. ప్రమాదం గురించి సమాచారం అడిగి తెలుసుకున్నామన్న జైశంకర్ ఈ విషాద పరిస్థితుల్లో బాధిత కుటుంబాలకు తమ పూర్తి సహకారం ఉంటుందని ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. -
ఫిల్మ్‌నగర్ పాపం.. ట్రాఫిక్ పోలీసులదే..!
కొందరు అవినీతి ‘తెల్ల’ఖాకీల నిర్లక్ష్యం... ఓ లారీ డ్రైవర్ నిర్వాకం... వెరసీ.. ఓ కుటుంబాన్ని పెను విషాదంలో నింపాయి. ముక్కుపచ్చలారని చిన్నారిని చిదిమేసి కనీసం కన్నవారికి ‘ముఖం’ చూసే అదృష్టం కూడా లేకుండా చేశాయి. మంగళవారం (Tuesday) ఉదయం షేక్‌పేట ఆంజనేయస్వామి దేవాలయం వద్ద చోటుచేసుకున్న రోడ్డు ప్రమాదం పదేళ్ల చిన్నారి అథర్వి ఉసురుతీసింది. ఈ పాపం కచ్చితంగా ట్రాఫిక్ పోలీసులదేనని చెప్పక తప్పదు. ఉత్తర్వులు ఉత్తవేనా? హైదరాబాద్ (Hyderanad) నగరంలో నానాటికీ పెరిగిపోతున్న ట్రాఫిక్ ఇబ్బందుల దృష్ట్యా అధికారులు అనేక ఆంక్షలు విధించారు. ఈ మేరకు గత ఏడాది ఫిబ్రవరి 20న ఉత్తర్వులు జారీ చేశారు. నగరంలో ప్రవేశించే అనుమతి ఉన్న వాహనాలకు సైతం నిర్ణీత సమయాలు కేటాయించారు. నగరంలో ఉన్న రహదారుల్ని మొత్తం 91 రకాలైన రూట్లుగా పోలీసులు విభజించారు. వీటిలో కొన్నింటిలో కొన్ని రకాలైన వాహనాలను నిషేధించడం, నిర్దేశిత సమయాలు కేటాయించడం చేశారు. ఈ మార్గాల్లో ప్రత్యేక సందర్భాల్లో ఆయా వాహనాలు ప్రయాణించాలంటే తప్పనిసరిగా ముందస్తు అనుమతి తీసుకోవాలని అధికారులు స్పష్టం చేశారు. 10 టన్నుల కంటే మించొద్దు.. ఇతర జిల్లాలు, రాష్ట్రాల నుంచి వచ్చే 10 టన్నుల కంటే ఎక్కువ బరువుతో కూడిన కమర్షియల్ వాహనాలు నగరంలోకి ప్రవేశించడాన్ని పూర్తిగా నిషేధించారు. లోకల్ లారీలతో పాటు నిర్మాణ సామగ్రి తరలించే 10 టన్నుల కంటే ఎక్కవ బరువుతో కూడిన వాహనాలు రాత్రి 11 ఉదయం 7 గంటల మధ్య మాత్రమే నగరంలో సంచరించాలి. డీసీఎం, ఐచర్, స్వరాజ్ మజ్దా వంటి మధ్య తరహా గూడ్స్ వాహనాలు (3.5 టన్నుటు–12 టన్నుల మధ్య బరువుతో కూడినవి) మధ్యాహ్నం 12 నుంచి సాయంత్రం 4 వరకు, రాత్రి 9 నుంచి ఉదయం 8 వరకు మాత్రమే తిరగాలి. కాసులు కురిపించడమే కారణమా? షేక్‌పేటలో చిన్నారిని చిదిమేసిన లారీ పంచదార లోడ్‌తో ప్రయాణిస్తోంది. ఇది కేవలం రాత్రి 11 నుంచి ఉదయం 7 వరకు మాత్రమే నగరంలో తిరగాలి. అయితే.. ప్రమాదం చోటు చేసుకున్న 8.10 గంటలకు అది నగరంలోనే ఉంది. ఈ తరహా లారీలే కాదు... నగరంలో మరికొన్ని వాహనాలు తిరుగుతూ కొందరు ట్రాఫిక్ పోలీసులకు కాసులు పండిస్తున్నాయి. అక్కడ నుంచి మట్టి తరలించే, నిర్మాణానికి అవసరమైన మెటీరియల్‌ను తీసుకువచ్చే వాటిని ‘వదిలేయడం’ కోసం యజమానులతో ఒప్పందాలు కుదుర్చుకుని మరీ వసూళ్లకు పాల్పడుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. రాత్రయితే చాలు రాకాసులే.. ప్రమాదం చోటు చేసుకున్న ప్రాంతం చాలా కీలకమైంది. నగర శివార్లలో ఉన్న, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్‌లో ఉన్న అనేక కార్యాలయాలు, పాఠశాలలకు చెందిన బస్సులు, వాహనాలతో ఆ రోడ్లన్నీ కిక్కిరిసిపోతాయి. అలాంటి సమయంలోనూ ఓ లారీ మృత్యు శకటంగా దూసుకొచ్చిందంటే దానికి కారణం అయితే మామూళ్ల మత్తయినా అయి ఉండాలి.. లేదంటే నిబంధనలు అతిక్రమించిందంటూ ‘ఉక్కుపాదం’ మోపిన ట్రాఫిక్ పోలీసులు ఓ చలానా రాసి వదిలేసైనా ఉండాలనే వాదన వినిపిస్తోంది. చదవండి: ‘మమ్మీ బాయ్..’ఈ రెంటిలో ఏది జరిగినా ఆ పాపం మాత్రం కచ్చితంగా ట్రాఫిక్ పోలీసులదే. నగరంలోకి పగలంతా లారీల ప్రవేశం లేకపోవడంతో రాత్రయిందంటే చాలు ఒక్కసారిగా రోడ్లపైకి వస్తాయి. వాయు వేగంతో దూసుకుపోయే ఇవి రాకాసులుగా మారుతున్నాయి. ఆ సమయంలో ట్రాఫిక్ పోలీసులు సైతం పాయింట్స్‌లో ఉండకపోవడంతో విజృంభిస్తున్నాయి. -
‘మమ్మీ బాయ్..’
ఫిలింనగర్: ‘మమ్మీ బాయ్..’ అంటూ తండ్రితో కలిసి ద్విచక్ర వాహనంపై స్కూలుకు బయలుదేరిన చిన్నారిని అక్రమంగా నగరంలోకి ప్రవేశించిన లారీ బలితీసుకుంది. తన కళ్లెదుటే కుమార్తె లారీ చక్రాల కిందపడి ఛిద్రం కావడాన్ని జీర్ణించుకోలేకపోయిన ఆ తండ్రి తల్లడిల్లిపోయాడు. ఈ హృదయవిదారకమైన ఘటన ఫిల్మ్‌నగర్ పోలీసుస్టేషన్ పరిధిలోని షేక్‌పేట ప్రధాన రహదారిలో మంగళవారం చోటు చేసుకుంది. షేక్‌పేట మై హోం రెయిన్ బో రెసిడెన్స్‌లో నివసించే గడ్డం హేమ సుందర్‌రెడ్డి కుమార్తె అథర్వి (10) మణికొండలోని ఢిల్లీ స్కూల్ ఆఫ్ ఎక్సలెన్స్‌లో ఐదో తరగతి చదువుతోంది. ఎప్పటిలాగే మంగళవారం ఉదయం 8.00 గంటల సమయంలో హేమ సుందర్‌రెడ్డి తన కుమార్తెను స్కూల్లో దింపడానికి యాక్టీవా వాహనంపై బయలుదేరారు. వీరి వాహనం 8.10 గంటలకు షేక్‌పేటలోని ఆంజనేయస్వామి ఆలయం వద్దకు చేరుకుంది. అదే సమయంలో వెనుక వైపు నుంచి చక్కెర లోడ్‌తో వచి్చన లారీ హేమ సుందర్‌రెడ్డి నడుపుతున్న బైక్‌ను ఢీ కొట్టింది. ఈ ధాటికి తండ్రీకుమార్తె వాహనం పైనుంచి ఇద్దరు కిందపడ్డారు. అథర్వి లారీ వెళ్తున్న వైపు పడటంతో దాని వెనుక చక్రాలు ఆమె పైనుంచి వెళ్లాయి. దీంతో శరీరం ఛిద్రమై అక్కడికక్కడే చనిపోయింది. హేమ సుందర్‌రెడ్డికి ఎలాంటి గాయాలు కాలేదు. ఆ ప్రాంతంలోని రోడ్డంతా రక్తసిక్తమైంది. మరికొద్దిసేపట్లో కూతుర్ని స్కూల్ దగ్గర దింపాల్సి ఉండగా కళ్లెదుటే ఆమె రక్తపు మడుగులో పడి ఉండటాన్ని ఆయన జీరి్ణంచుకోలేకపోయారు. ఈ ప్రమాద విషయం తెలుసుకున్న అథర్వి కుటుంబీకులు ఘటనా స్థలానికి చేరుకుని కన్నీరుమున్నీరయ్యారు. ఫిల్మ్‌నగర్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. అనుమతి లేని వేళల్లో అక్రమంగా సిటీలోకి లారీతో ప్రవేశించి, చిన్నారి మృతికి కారణమైన లారీ డ్రైవర్ యాసిన్ ఖురేషిని అరెస్ట్ చేశారు. -
వరంగల్-ఖమ్మం హైవేపై ఘోర ప్రమాదం.. నలుగురు మృతి
సాక్షి, వరంగల్: వరంగల్-ఖమ్మం జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అధిక వేగంతో ఉన్న లారీ అదుపు తప్పి ఆటోలపై పడిపోవడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో నలుగురు మృతి చెందారు.వివరాల ప్రకారం.. ఖిల్లా వరంగల్ మామునూరు నాలుగో బెటాలియన్ సమీపంలో వరంగల్-ఖమ్మం జాతీయ రహదారిపై ఆదివారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఇనుప స్తంభాల లోడుతో వెళుతున్న లారీ బోల్తా పడింది. ఈ సందర్భంగా రెండు ఆటోలపై లారీ పడిపోవడంతో అందులో ప్రయాణిస్తున్న నలుగురు మృతిచెందారు. ఈ ప్రమాదంలో డ్రైవర్ తీవ్రంగా గాయపడినట్టు తెలుస్తోంది. మృతిచెందిన వారిలో ముగ్గురు మహిళలు, ఓ బాలుడు ఉన్నారు. అయితే, లారీ డ్రైవర్ మద్యం మత్తులో ఉన్నాడని స్థానికులు చెబుతున్నారు. -
బస్సు ప్రయాణికురాలి తల కట్
మైసూరు: కిటికీలో తల, చేతులు బయటపెట్టరాదు అని బస్సుల్లో హెచ్చరిక బోర్డులు కనిపిస్తాయి. కానీ కొందరు ఏదో కారణంతో తల బయటపెట్టి ప్రమాదాలకు గురవుతుంటారు. ఆర్టీసీ బస్సు, టిప్పర్ లారీ మధ్య నలిగి బస్సు ప్రయాణికురాలు దుర్మరణం చెందింది. శనివారం జిల్లాలోని నంజనగూడు తాలూకా సింధువళ్లి గ్రామం వద్ద జరిగింది. వివరాలు.. గుండ్లుపేటె తాలూకా బేగూరు సమీపంలోని ఆలహళ్లి గ్రామ నివాసి శివలింగమ్మ (58) మృతురాలు. ఆమె మైసూరు నుంచి గుండ్లుపేటెకు నంజనగూడు మీదుగా వెళుతున్న ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తున్నారు. సింధువళ్లి గ్రామం వద్ద మహిళ బస్సు కిటికీలో నుంచి తల బయట పెట్టింది, అదే సమయంలో వెనుక నుంచి వచ్చిన వేగంగా దూసుకొచ్చిన టిప్పర్ లారీ, బస్సును రాసుకుంటూ వెళ్లిపోయింది. దీంతో శివలింగమ్మ తల, కుడి చేయి తెగి రోడ్డు మీద పడిపోయాయి. ఆమె సీట్లోనే ప్రాణాలు విడిచింది. అది చూసి బస్సులోని ప్రయాణికులు భయంతో హాహాకారాలు చేశారు. టిప్పర్ డ్రైవర్ వాహనంతో పరారయ్యాడు. నంజనగూడు ట్రాఫిక్ పోలీసు స్టేషన్ పీఎస్ఐ సిద్దరాజు, సిబ్బంది మహేంద్ర స్థలాన్ని పరిశీలించారు. ఆర్టీసీ బస్సును సీజ్ చేశారు. మహిళ మృతదేహాన్ని కేఆర్ ఆస్పత్రికి పోస్టుమార్టం కోసం తరలించారు. -
అదుపు తప్పి.. వేగంగా ఢీకొట్టి..
బంజారాహిల్స్: ఫుట్‌పాత్‌పై నిద్రిస్తున్నవారి నుంచి కారు దూసుకెళ్లడంతో ఒకరు మృతి చెందగా.. మరో ఇద్దరికి తీవ్ర గాయాలైన ఘటన బంజారాహిల్స్‌లో చోటుచేసుకుంది. శనివారం తెల్లవారుజామున జరిగిన ఈ ఘటన వివరాలు ఇలా ఉన్నాయి. నిజామాబాద్‌కు చెందిన ఆభరణాల వ్యాపారి తనయుడు సాధుల హర్షవర్ధన్ మరో ఐదుగురు స్నేహితులతో కలిసి బంజారాహిల్స్ రోడ్డు నెంబర్–13లోని సాయి మెన్షన్ అపార్ట్మెంట్లో అద్దెకు ఉంటున్నాడు. ఆయనే నిర్మాతగా, హీరోగా అర్జున్ దేవర అనే సినిమాలో నటిస్తున్నాడు. శుక్రవారం రాత్రి హర్షవర్ధన్ తన స్నేహితులు సాంకేత్ శ్రీనివాస్ అలియాస్ తేజ, మాడే కార్తీక్, వంశీ, రాకేష్ నేతతో కలిసి ఉంటున్నాడు. హర్షవర్ధన్, వంశీలు గదిలో మద్యం తాగుతుండగా.. రాకేష్ అనే మరో స్నేహితుడు జూబ్లీహిల్స్‌లోని ఎయిర్‌లైవ్ పబ్‌లో ఉండగా తనను పికప్ చేసుకోవడానికి రావాలని హర్షవర్ధన్‌కు ఫోన్ చేశాడు. తాను మద్యం మత్తులో ఉన్నానని, మీరు వెళ్లి తీసుకురావాలంటూ కార్తీక్‌కు చెప్పి కారు తాళంచెవి ఇచ్చాడు. అర్ధరాత్రి 1.04 గంటల ప్రాంతంలో కార్తీక్.. థార్ కారు నడుపుతుండగా తేజ పక్కన కూర్చొని రాకే‹Ùను తీసుకురావడానికి జూబ్లీహిల్స్ పబ్‌కు బయలుదేరారు. బంజారాహిల్స్ రోడ్డునెంబర్–12 నుంచి అగ్రసేన్ చౌరస్తా మీదుగా అతి వేగంగా కేబీఆర్ పార్కు వైపు వెళ్తుండగా బసవతారకం కేన్సర్ హాస్పిటల్ సమీపంలో కారు అదుపుతప్పి ఫుట్‌పాత్‌ను ఢీకొట్టి అక్కడ నిద్రిస్తున్న గుర్తు తెలియని వ్యక్తి పైకి దూసుకెళ్లి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఫుట్‌పాత్‌పై నిద్రిస్తున్న వ్యక్తి (40) అక్కడికక్కడే మృతి చెందగా మరో ఇద్దరికి గాయాలయ్యాయి. ఈ ఘటన తెల్లవారుజామున 1.15 గంటల ప్రాంతంలో చోటుచేసుకుంది. సమాచారం అందుకున్న బంజారాహిల్స్ ఏసీపీ సామల వెంకట్‌రెడ్డి సిబ్బందితో కలిసి ప్రమాదం జరిగిన ప్రాంతాన్ని పరిశీలించారు. ఘటన వివరాలను ప్రత్యక్ష సాక్షుల ద్వారా అడిగి తెలుసుకున్నారు. కారు డోర్ తీసి పరారైన యువకులు.. కారు బోల్తా పడిన తర్వాత డోర్ నుంచి ఇద్దరు యువకులు బయటకు వచ్చి పరుగులు తీశారని అక్కడ ఉన్నవారు తెలిపారు. రంగంలోకి దిగిన పోలీసులు కారు నెంబర్ ఆధారంగా ఫోన్ నెంబర్ సేకరించి సీసీ ఫుటేజీల ఆధారంగా కారు ఎక్కడి నుంచి వచి్చందో గుర్తించారు. ప్రమాదం జరిగిన తర్వాత భయంతో కార్తీక్, తేజ పారిపోతూ గదిలో ఉన్న హర్షవర్దన్, వంశీ, నేతను కూడా పారిపోవాలని చెప్పడంతో అంతా ఉడాయించారు. అయితే తెల్లవారుజామున ఇంటికి వచ్చిన రాకే‹Ùకు గదికి తాళం వేసి ఉండడం కనిపించింది. పోలీసులు రాకేష్ ను అదుపులోకి తీసుకుని విచారించగా ఈ మిస్టరీ వీడింది. పరారీలో ఉన్న కార్తీక్, తేజ, హర్షవర్ధన్, వంశీ, నేత తదితరులను అదుపులోకి తీసుకున్నారు. కారు నడిపిన కార్తీక్ పక్కనే కూర్చొన్న తేజలపై బీఎన్ఎస్ సెక్షన్ 105 (2), 337, ఎంవీ యాక్ట్ 184, 187, పీడీపీపీ యాక్ట్ కింద కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. కారు ఇచి్చన హర్షవర్దన్‌పై కూడా కేసు నమోదైంది. కారు నడుపుతున్న కార్తీక్‌కు డ్రైవింగ్ లైసెన్స్ లేదని గుర్తించారు. కార్తీక్, తేజకు డ్రంకన్ డ్రైవ్ నిర్వహించగా వారు మద్యం తాగలేదని తేలింది. బంజారాహిల్స్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
పోటీ పరీక్ష రాసేందుకు వెళుతూ..
మర్రిపాలెం: రాజమహేంద్రవరం శివారు గామన్ వంతెనపై బుధవారం అర్ధరాత్రి కావేరి ట్రావెల్స్‌కు చెందిన బస్సు బోల్తాపడిన ఘటనలో నగరంలోని 53వ వార్డు మర్రిపాలెం పార్వతీనగర్‌కు చెందిన హోమిని కల్యాణి (21) మృతి చెందింది. దువ్వాడలోని ఓ ప్రైవేట్ ఇంజినీరింగ్ కళాశాలలో ఫైనల్ ఇయర్ చదువుతున్న కల్యాణి కాంపిటేటివ్ పరీక్ష రాయడానికి హైదరాబాద్ బయలుదేరింది. బుధవారం రాత్రి ఎన్ఏడీ కొత్తరోడ్డులో బస్సు ఎక్కగా..అర్ధరాత్రి రాజమండ్రి గామన్ వంతెన వద్ద బస్సు అదుపుతప్పి పల్టీలు కొట్టింది. ప్రమాదంలో కల్యాణి అక్కడికక్కడే మృతి చెందగా, మరో పది మందికి తీవ్రగాయాలయ్యాయి. మృతురాలు శరీరం నుజ్జునుజ్జవ్వడం అందర్నీ కలచి వేసింది. గురువారం సాయంత్రం కల్యాణి మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. అందివచ్చిన కుమార్తె ఇలా విగతజీవిగా ఉండడాన్ని తల్లిదండ్రులు, బంధువులు జీర్ణించుకోలేకపోతున్నారు. కల్యాణి తండ్రి రాఘవదాస్ రైల్వే ఉద్యోగి కాగా.. తల్లి లక్ష్మి(లత) గృహిణి. వీరికి ఇద్దరు కుమార్తెలు, కాగా పెద్ద కుమార్తె మేఘన ఇంజినీరింగ్ పూర్తి చేసి ఉన్నత చదువులకు సిద్ధమవుతోంది. కల్యాణి ఇంజినీరింగ్ ఫైనల్ ఇయర్ చదువుతూ పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతోంది. ఈ క్రమంలో కాంపిటేటివ్ పరీక్ష రాసేందుకు వెళుతూ మృతిచెందడంతో పార్వతినగర్‌లో విషాదఛాయలు అలుముకున్నాయి. -
యూపీలో ఘోర రోడ్డు ప్రమాదం.. మృతులకు సీఎం యోగి సంతాపం
లక్నో : ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అనంతరం ఇంటికి వెళ్తున్న ఓ కుటుంబాన్ని రోడ్డు ప్రమాదం రూపంలో మృత్యువు కబళించింది. బాధితులు ప్రయాణిస్తున్న వ్యాన్‌పై టయోటా ఇన్నోవో దూసుకెళ్లింది. ఈ ఘోర రోడ్డు ప్రమాదంలో వ్యాన్‌లో ప్రయాణిస్తున్న నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు. 11మంది తీవ్రంగా గాయపడ్డారు.గురువారం అర్ధరాత్రి ఉత్తర ప్రదేశ్ లక్నోలోని దేవా రోడ్డులో ఈ ప్రమాదం జరిగింది. బాధితురాలు కిరణ్, ఆమె కుమారుడు కుందన్ యాదవ్, ఇతర కుటుంబసభ్యులు బంటీ యాదద్,శోబిత్ యాదవ్‌లు ఆస్పత్రి నుంచి ఇంటికి వ్యాన్‌లో బయలు దేరారు. దేవా రోడ్డులో ప్రయాణిస్తున్న వ్యాన్‌ను టయోటా మెరుపు వేగంతో ఢీకొట్టింది. ఎదురుగా ఉన్న భారీ ట్రక్‌ను వ్యాన్ డీకొట్టడంతో అందులోని ప్రయాణికులు ప్రాణాలొదిలారు.రోడ్డు ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. రోడ్డు ప్రమాదంలో 11మందికి తీవ్రగాయాలయ్యాయని, నలుగురు మరణించినట్లు పోలీస్ అధికారి పంకజ్ సింగ్ వెల్లడించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ క్షతగాత్రుల్ని అత్యవసర చికిత్స నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించారు. ప్రమాద వివరాల్ని ఈస్ట్ డీసీపీ శశాంక్ సింగ్ మీడియాతో మాట్లాడారు. బాధిత మహిళ ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అనంతరం ఓ వ్యాన్‌లో ఇంటికి బయలు దేరారు. ఆ వ్యాన్‌లో మొత్తం తొమ్మిదిమంది కుటుంబ సభ్యులు ప్రమాణిస్తున్నారు. అయితే ఆ వ్యాన్‌పైకి వెనుక నుంచి టయోటా ఇన్నోవా దూసుకొచ్చింది. ప్రమాదం తీవ్రతకు ఎదురుగా ఉన్న ట్రక్‌ను వ్యాన్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నలుగురు మరణించారు’ అని తెలిపారు. సీఎం యోగి సంతాపంఘోర రోడ్డు ప్రమాదంపై ఉత్తర ప్రదేశ్ సీఎం యోగి ఆధిత్యనాథ్ సంతాపం తెలిపారు. వారి కుటుంబ సభ్యులు ధైర్యంగా ఉండాలని భరోసానిచ్చారు. ప్రమాదంపై జిల్లా అధికార యంత్రాంగానికి సీఎం యోగి ఆదేశాలకు జారీ చేశారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని సంబంధిత అధికారులకు సూచించారు. -
రోడ్డు ప్రమాదం: కావేరి ట్రావెల్స్ బస్సు బోల్తా
కంబాలచెరువు (రాజమహేంద్రవరం): విశాఖపట్నం నుంచి హైదరాబాద్ వెళ్తున్న కావేరీ ట్రావెల్స్ బస్సు(Bus Accident) బుధవారం అర్థరాత్రి 12.30 సమయంలో రాజమహేంద్రవరం సమీపంలో బోల్తా పడింది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా, 18 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. వివరాలు.. విశాఖపట్నం నుంచి హైదరాబాద్‌కు కావేరి ట్రావెల్స్ బస్సు సుమారు 50 మంది ప్రయాణికులతో బయల్దేరింది. ఈ బస్సు రాజమహేంద్రవరం రూరల్ కాతేరు– కొంతమూరు మధ్యలో అగ్రహారం వద్దకు వచ్చేసరికి బోల్తా పడింది(Road Accident). రోడ్డు పనులు జరుగుతుండటంతో డైవర్షన్ ఇచ్చిన విషయాన్ని డ్రైవర్ దగ్గరకు వచ్చేవరకూ గమనించకపోవడం, ఒక్కసారిగా వేగంగా కుడివైపునకు బస్సు తిప్పడంతో బోల్తా పడింది. ఈ ఘటనలో ఓ యువతి (20) అక్కడికక్కడే మృతి చెందింది. 25 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. అయితే క్షతగాత్రుల్లో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉండటంతో ముగ్గుర్ని కాకినాడ ఆస్పత్రికి, ఇద్దర్ని రాజమండ్రి ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అయితే క్షతగాత్రుల్లో 13 మందిని ప్రాథమిక చికిత్స అనంతరం డిశ్చార్జ్ చేశారు. -
సింధనూరు ప్రమాదంపై వైఎస్ జగన్ దిగ్ఫ్రాంతి
గుంటూరు, సాక్షి: కర్ణాటక రాయ్‌చూర్ జిల్లా సింధనూర్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఏపీ విద్యార్థులు మరణించడంపై వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి దిగ్ఫ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సంతాపం తెలుపుతూ, క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని ప్రభుత్వాన్ని కోరుతూ ఓ ప్రకటన విడుదల చేశారాయన. కర్నూలు జిల్లా మంత్రాలయం నుంచి కర్ణాటకలోని హంపీ ఆరాధన కార్యక్రమాలకు వెళ్తుండగా...వాహనం బోల్తా పడిన ఘటనలో ముగ్గురు వేదపాఠశాల విద్యార్ధులు, డ్రైవర్ చనిపోయిన ఘటన అత్యంత బాధాకరం. ఈ ఘటన తీవ్ర దిగ్భాంత్రికి గురి చేసింది. .చనిపోయిన వారి ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుడ్ని ప్రార్థిస్తున్నాను. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం అండగా నిలబడాలని కోరుతున్నాను అని తన ప్రకటనలో పేర్కొన్నారాయన. In a tragic incident near Sindhanur taluk in #Raichur district, four people lost their lives when a vehicle carrying devotees overturned.The victims include three students from the Mantralayam Sanskrit School—Ayavandan (18), Sujendra (22), and Abhilash (20)—along with the… pic.twitter.com/ze2dALIfk1— South First (@TheSouthfirst) January 22, 2025మంగళవారం రాత్రి మంత్రాలయం నుంచి వేదపాఠశాల విద్యార్థులు కర్ణాటకలోని హంపి క్షేత్రానికి బయల్దేరారు. అక్కడ నరహరి తీర్థుల ఆరాధనకు 14 మంది విద్యార్థులతో వాహనం బయల్దేరింది. ఈ క్రమంలో సింధనూరు సమీపంలో వాహనం బోల్తాపడింది. డ్రైవర్ శివ, ముగ్గురు విద్యార్థులు అభిలాష, హైవదన, సుజేంద్ర అక్కడికక్కడే మృతిచెందారు. మరికొందరు విద్యార్థులకు గాయాలయ్యాయి. క్షతగాత్రులను సింధనూరు ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఘటనపై ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్‌తో పాటు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రులు వేర్వేరు ప్రకటనల్లో దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. -
అయ్యో..దేవుడా.. ఎలా బతికేది స్వామీ..!
రేణిగుంట: ‘నీపై భక్తితో ఇంతదూరమొచాము. నిన్ను దర్శించి పునీతులయ్యాము. నీకు మొక్కులు చెల్లించి రుణం తీర్చుకున్నాము. ఇంతలోనే మాకు అంత నరకం చూపావు.. మా తల్లిదండ్రులను తీసుకెళ్లి దిక్కులేని వాళ్లను చేశావు..! అయ్యో..దేవుడా.. ఎలా బతికేది స్వామీ..! అంటూ ఆ పసిమనసులు తల్లడిల్లడం తీరు చూపరులకు కన్నీళ్లు తెప్పించింది. ఈ విషాద ఘటన రేణిగుంట–కడప మార్గంలోని రేణిగుంట మండలం, మామండూరు పంచాయతీ కుక్కలదొడ్డి సమీపంలో సోమవారం చోటు చేసుకుంది. ట్రావెల్స్ బస్సు, కారు ఢీకొట్టిన ఘటనలో ఇద్దరు మృతిచెందగా.. నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి.దైవభక్తి ఎక్కవతెలంగాణ రాష్ట్రం, సంగారెడ్డి జిల్లా, పటాన్చెరువు, అంబేడ్కర్ కాలనీకి చెందిన సందీప్‌షా(36)కు భార్య అంజలీదేవి(31), పిల్లలు లితికా షా(12), సోనాలీ షా(09), రుద్రప్రతాప్(06) ఉన్నారు. పటాన్‌చెరువులో ట్రేడింగ్ చేస్తూ సందీప్‌షా కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఎంతో అన్యోన్యంగా పిల్లలను చదివిస్తూ వారి భవిష్యత్ కోసం శ్రమిస్తున్నారు. సందీప్షాకు చిన్నతనం నుంచి దైవభక్తి ఎక్కువ. కుటుంబ సమేతంగా ప్రఖ్యాత ఆలయాలకు తరచూ వెళ్లి దర్శించుకునే వాడు. ఈ క్రమంలోనే సంక్రాంతి పండుగ ముగియగానే, ఈనెల 16వ తేదీన తన భార్య, పిల్లలు, అతని స్నేహితుడు నరేష్‌తో కలసి మొత్తం ఆరుగురు కారులో తిరుమలకు బయల్దేరారు. 17వ తేదీన తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఆ తర్వాత ఆదివారం తిరుచానూరు పద్మావతి అమ్మవారు, శ్రీకాళహస్తిలోని శ్రీకాళహస్తీశ్వరుని దర్శించుకున్నారు. సోమవారం కారులో సొంతూరుకు తిరుగుపయనమయ్యారు. రేణిగుంట మండలం, కుక్కలదొడ్డి సమీపంలో ఎదురుగా వస్తున్న ట్రావెల్స్ బస్సును కారు అదుపు తప్పి ఢీకొంది. దీంతో కారు, బస్సు ముళ్లపొదల్లోకి దూసుకెళ్లాయి. కారు ముందుభాగం నుజ్జునుజ్జు అయ్యింది. కారు నడుపుతున్న సందీప్‌షా, అతని పక్కన కూర్చున్న భార్య అంజలీదేవి సీట్ల మధ్యలో ఇరుక్కుపోయి అక్కడికక్కడే మృతి చెందారు. వెనుక కూర్చున్న లితికా షా, సోనాలిషా, రుద్రప్రసాప్, నరేష్‌కు రక్తగాయాలయ్యాయి. పెద్ద పాప లితికా షా తలకు బలమైన రక్తగాయమైంది. వెంటనే వారిని రేణిగుంట సమీపంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో తరలించారు. లితికాషా పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం.టూరిస్ట్ బస్సులోనూ భక్తులతో దైవయాత్రఈ ప్రమాదంలో కారును ఢీకొన్న ట్రావెల్స్ బస్సు జమ్మూ నుంచి 50 మంది భక్తబృందంతో దేశంలోని వివిధ పుణ్యక్షేత్రాలను సందర్శిస్తూ తిరుమలకు వచ్చే క్రమంలో ప్రమాదానికి గురైంది. 28 రోజుల కిందట వీరు జమ్ములో బయల్దేరారు. మరో 25 రోజులు వీరి యాత్ర సాగనుంది. అయితే అనూహ్య ప్రమాదంలో బస్సులోని యాత్రికులంతా తీవ్రంగా కలత చెంది రోడ్డు పక్కన దిగాలుగా కూర్చుండిపోయారు.ఎయిర్ బెలూన్స్ ఓపెన్ అయినా..వారు ప్రయాణిస్తున్న కారుకు ప్రమాద సమయంలో రక్షణ కవచంగా నిలిచే ఎయిర్ బెలూన్స్ ఓపెన్ అయ్యాయి. అయినప్పటికీ కారు ముందుభాగం నుజ్జునుజ్జు కావడంతో ప్రమాద తీవ్రత దృష్ట్యా వారు మృత్యుఒడికి చేరారు.డీఎస్పీ పరిశీలనరేణిగుంట డీఎస్పీ శ్రీనివాసరావు, అర్బన్ ఎస్ఐ అరుణ్‌కుమార్‌రెడ్డి తమ సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. కారులో ఇరుక్కున్న సందీప్‌షా, అంజలీదేవి మృతదేహాలను అతికష్టం మీద బయటకు తీశారు. అనంతరం పోస్ట్‌మార్టం నిమిత్తం తిరుపతి ఎస్వీ వైద్యకళాశాలకు తరలించారు. ఆస్పత్రి వద్దకు చేరుకున్న మృతుల బంధువులు ఆ పిల్లలకు ఇక దిక్కెవరంటూ రోదించడం అక్కడివారిని కలిచివేసింది. -
ఓ వైపు తండ్రి మరణం.. మరోవైపు కూతురి వివాహం
యశవంతపుర: తండ్రి బైక్ ప్రమాదంలో చనిపోగా, పెళ్లిపీటలపై ఉన్న కూతురికి ఆ వార్త చెప్పకుండా పెళ్లిని పూర్తి చేశారు. ఈ ఘటన చిక్కమగళూరు జిల్లా తరీకెరెలో సోమవారం జరిగింది. ఏ తండ్రి అయినా తన కూతురు పెళ్లి ఆటంకాలు లేకుండా ఘనంగా జరగాలని కోరుకుంటాడు. అలాగే తండ్రి చేతుల మీదుగా వివాహం జరగాలని కూతురు ఆకాంక్షిస్తుంది. కానీ విధి నాటకంలో అంతా తారుమారైంది.పెళ్లి పత్రికలు పంచి వస్తుండగాతరీకెరెకి చెందిన చంద్రు కూతురు దీక్షిత అనే యువతికి పెళ్లి నిశ్చయమైంది. ఆదివారం సాయంత్రం చంద్రు మరో ఇద్దరితో కలిసి పెళ్లిపత్రికలను పంచడానికి బైక్‌లో వెళ్లాడు. తిరిగి వస్తుండగా గుర్తు తెలియని వాహనం బైకును ఢీకొనటంతో చంద్రు, జతలో వెళ్లిన ఇద్దరు అక్కడికక్కడే మరణించాడు. ఈ విషయం తెలిసి బంధువులు విషాదంలో మునిగిపోయినా తల్లీ, కూతురికి చెప్పలేదు. ఆ వార్త తెలిసినా, మృతదేహాన్ని ఇంటికి తీసుకువచ్చినా పెళ్లి నిలిచిపోయి మరింత విషాదం ఏర్పడుతుందని భావించారు. అందుకే చివరి నిమిషం వరకు చంద్రు పెళ్లి పనుల్లో ఉన్నాడని చెబుతూ సోమవారం మూడుముళ్ల వేడుకను పూర్తి చేయించారు. తండ్రి స్థానంలో మరో వ్యక్తిని ఉంచి కన్యాదానం చేశారు. అక్షింతలు, అతిథుల భోజనాల తరువాత చంద్రు భార్య, కూతురికి ఈ చేదు వార్త చెప్పగానే వారు బోరుమంటూ రోదించారు. అప్పటివరకు ఉన్న పెళ్లి కళ దూరమైంది. పెళ్లికి వచ్చిన బంధుమిత్రులే అంత్యక్రియల పనులు పూర్తిచేశారు. -
త్వరలో పెళ్లి.. అంతలోనే మృత్యుకేళి
దొడ్డబళ్లాపురం: రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొన్న ప్రమాదంలో యువతి ప్రాణాలు కోల్పోయింది. మళవళ్లి తాలూకా హలగూరు గ్రామం సమీపంలోని బసాపుర గేట్ వద్ద చోటుచేసుకుంది. బళెహొన్నిగ గ్రామానికి చెందిన శరణ్య (25) గత ఏడాది నుంచి కనకపుర తాలూకా సాతనూరు పంచాయతీలో నరేగా ఇంజినీర్‌గా పని చేస్తోంది. ఫిబ్రవరి 16న ఆమె వివాహం కూడా నిశ్చయమైంది. శనివారం సాయంత్రం స్కూటర్లో బళెహొన్నిగ నుంచి హలగూరుకు వస్తుండగా ఎదురుగా వేగంగా వచ్చిన బైక్ ఢీకొంది. ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ శరణ్య అక్కడికక్కడే చనిపోయింది. హలగూరు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. -
తెలుగురాష్ట్రాల్లో రక్తమోడిన రహదారులు
-
చిత్తూరు వద్ద ఘోర ప్రమాదం
-
మొక్కు తీర్చుకుని వస్తూ మృత్యుఒడికి..
మొక్కు తీర్చుకోవడానికి షిర్డీ వెళ్లిన ఓ కుటుంబం ప్రయాణిస్తున్న వాహనాన్ని ట్రాక్టర్ ఢీకొనడంతో నలుగురు దుర్మరణం చెందారు. అలాగే సంక్రాంతి పండుగకు సొంతూరు వెళ్లి తిరిగివస్తున్న వారి కారు అదుపుతప్పి లారీ కింద ఇరుక్కోవడంతో ఇద్దరు మృతిచెందారు. మృతిచెందిన వారిలో ఇద్దరు చిన్నారులు ఉన్నారు. మహారాష్ట్రలోని గంగాపూర్ వద్ద ఓ ఘటన చోటుచేసుకోగా, భువనగిరి జిల్లా కేంద్రం సమీపంలో మరో ఘటన చోటుచేసుకుంది. వివరాలు.. భువనగిరి: యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు మున్సిపాలిటీ పరిధిలోని కొండగడప గ్రామానికి చెందిన శ్యాంశెట్టి కృష్ణమూర్తి, ప్రేమలత దంపతులు తమ కొడుకు, కోడలుతో సరూర్‌నగర్ గ్రీన్ పార్కు ఏరియాలో నివాసం ఉంటూ కిరాణా దుకాణం నిర్వహిస్తున్నారు. వీరికి మనవడు పుట్టిన సందర్భంగా మొక్కుతీర్చుకోవడానికి షిర్డీకి వెళ్లాలని అనుకున్నారు. భోగి పండుగ రోజు పెద్ద కూతురు ప్రసన్నలక్ష్మి, చిన్న కూతురు బజ్జూరి స్రవంతి కుటుంబాలతో కలిసి హైదరాబాద్ నుంచి ప్రైవేట్ బస్సులో వెళ్లి షిర్డీ సాయిబాబా దర్శనం చేసుకున్నారు. ఆ తర్వాత స్థానికంగా తుఫాన్ వాహనం కిరాయికి తీసుకొని ఔరంగాబాద్‌లోని మినీ తాజ్‌మహల్‌ను సందర్శించారు. ఔరంగాబాద్ – షిర్డీ మధ్యలో గంగాపూర్ వద్ద బుధవారం రాత్రి వీరు ప్రయాణిస్తున్న తుఫాన్ వాహనాన్ని ట్రాక్టర్ ఢీకొట్టడంతో శ్యాంశెట్టి ప్రేమలత (57) ఆమె కుమారుడి కొడుకు వైది్వక్ (6 నెలల బాలుడు), పెద్ద కూతురు తొల్పునూరి ప్రసన్నలక్ష్మి (42)తో పాటు ప్రసన్నలక్ష్మి పెద్ద కూతురు తొల్పునూరి అక్షిత (21) మృతిచెందారు. ప్రేమలత పెద్ద అల్లుడు శ్రీనివాస్, ప్రసన్నలక్ష్మి రెండో కూతురు శరణ్యతో పాటు ప్రేమలత భర్త కృష్ణమూర్తి, కుమారుడు వెంకన్నకు తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వారు ఔరంగాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వీరి పరిస్థితి విషమంగా ఉంది. ప్రేమలత చిన్న కూతురు బజ్జూరి స్రవంతి, అల్లుడు రాంబాబుతో పాటు వీరి కుమారుడు, కుమార్తె ప్రమాదం నుంచి సురక్షితంగా బయటపడ్డారు. మృతదేహాలను పోస్టుమార్టం అనంతరం ఔరంగాబాద్ నుంచి స్వగ్రామానికి తరలించారు. సంక్రాంతి పండుగకు వచ్చి వెళ్తూ... మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం వెంకట్రాంతండాకు చెందిన గుగులోతు రవి, భూక్య సంతోష్ బావాబావమరుదులు. రవికి భార్య భవాని, కుమార్తె మోక్ష ఉండగా.. సంతోష్ కు భార్య అనూష (26), ఇద్దరు కుమార్తెలు ప్రణశ్వని, చైత్ర (6) ఉన్నారు. రవి, సంతోష్‌లు కుటుంబాలతో కొంతకాలంగా హైదరాబాద్‌లోని రామంతాపూర్‌లో ఉంటున్నారు. రవి, సంతోష్‌లు తమ భార్యాపిల్లలతో కలిసి సంక్రాంతి పండుగ జరుపుకునేందుకు కారులో స్వగ్రామం వెంకట్రాంతండాకు వెళ్లారు. బుధవారం అర్ధరాత్రి దాటిన తర్వాత తిరిగి హైదరాబాద్‌కు బయల్దేరారు. సంతోష్ కారు నడుపుతుండగా.. అతడి భార్య అనూషతో పాటు చిన్న కుమార్తె చైత్ర అతడి పక్కన కారు ముందు భాగంలో కూర్చున్నారు. మిగతావారు వెనక కూర్చున్నారు. గురువారం తెల్లవారుజామున 6.30 గంటల సమయంలో భువనగిరి జిల్లా కేంద్రానికి సమీపంలోని రాయగిరి వద్దకు రాగానే వరంగల్–హైదరాబాద్ హైవే బైపాస్ రోడ్డుపై ముందు వెళ్తున్న లారీ డ్రైవర్ నిర్లక్ష్యంగా ఇండికేటర్ వేయకుండా పక్కనే ఉన్న పెట్రోల్ బంక్‌లోకి ఒక్కసారిగా టర్న్ తీసుకున్నాడు. వెనకాలే వస్తున్న వీరి కారు అదుపుతప్పి లారీని ఢీకొట్టింది. కారు లారీ కిందిభాగంలో ఇరుక్కుపోవడంతో నుజ్జునుజ్జు అయ్యింది. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కారును జేసీబీ సహాయంతో బయటకు తీయగా.. అప్పటికే అనూష, చైత్ర మృతిచెందారు. తీవ్రంగా గాయపడిన మిగతా ఐదుగురిని భువనగిరి జిల్లా కేంద్ర ఆస్పత్రికి తరలించారు. భూక్య సంతోష్ సోదరుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ చంద్రబాబు, ఎస్హెచ్ఓ సంతోష్ కుమార్ తెలిపారు. కాగా, ఈ ప్రమాదంలో గాయపడిన రవి భార్య భవాని 8 నెలల గర్భంతో ఉంది. ఆస్పత్రికి తరలించిన అనంతరం వైద్యులు ఆమెకు పరీక్షలు నిర్వహించారు. కడుపులో ఉన్న శిశువుకు ఎలాంటి ప్రమాదం లేదని తేల్చారు. -
ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు దుర్మరణం
యాదాద్రి భువనగిరి జిల్లా: మహారాష్ట్రలోని షిరిడి దగ్గర జరిగిన రోడ్డు ప్రమాదం(Road Accident)లో నలుగురు దుర్మరణం చెందారు. గురువారం మధ్యాహ్న ప్రాంతంలో ఈ విషాద ఘటన(Accident) చోటు చేసుకుంది. ప్రమాదంలో నలుగురు అక్కడకక్కడే మృతి చెందగా, ఎనిమిది మందికి గాయాలయ్యాయి. మృతుల్లో ఆరు నెలల చిన్నారి ఉంది. ఈ ఘటనలో మృతిచెందిన వారంత యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూర్ మున్సిపాలిటీ పరిధిలోని కొండగడప(Konda gadapa) వాస్తవ్యులుగా గుర్తించారు.వీరంతా రెండు రోజుల క్రితం షిరిడి పర్యటనకు వెళ్లినట్లు తెలుస్తోంది. మృతలంతా ఒకే కుటుంబానికి చెందిన వారిగా గుర్తించారు. ఈ రోడ్డు ప్రమాదంలో ప్రేమలత(59, వైద్విక్ నందన్(6 నెలలు), అక్షిత(20), ప్రసన్న లక్ష్మీ(45)లు మృతిచెందారు. -
కర్ణాటక మంత్రి లక్ష్మికి తప్పిన ప్రమాదం
బెంగళూరు: కర్ణాటక మంత్రి లక్ష్మి హెబ్బాళ్కర్ ఘోర ప్రమాదం నుంచి బయటపడ్డారు. ఆమె ప్రయాణిస్తున్న కారు మంగళవారం బెళగావి వద్ద ప్రమాదానికి గురైంది. అయితే అదృష్టంకొద్దీ గాయాలతోనే ఆమె బయటపడ్డారు.మహిళ, శిశు సంక్షేమశాఖ మంత్రి లక్ష్మి హెబ్బాళ్కర్(Lakshmi Hebbalkar) ప్రయాణిస్తున్న కారు ప్రమాదవశాత్తూ ఓ చెట్టును ఢీకొట్టింది. ఆ సమయంలో కారులో మంత్రితో పాటు ఆమె సోదరుడు, ఎమ్మెల్సీ చెన్నరాజ్ హత్తిహోళి కూడా ఉన్నారు. ఈ ప్రమాదం కారణంగా వీరిద్దరికీ స్వల్ప గాయాలవగా.. వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ఉదయం 5గం. సమయంలో ప్రమాదం జరిగినట్లు పోలీసులు వెల్లడించారు. ఈ ప్రమాదంలో ఆమె ముఖం, వెన్నెముకకు, ఎమ్మెల్సీ చెన్నరాజ్(Chennaraj) తలకు గాయాలైనట్లు చెప్పారు. ప్రస్తుతం వీరికి చికిత్స అందిస్తున్నారని, ఆరోగ్యం నిలకడగానే ఉందని మృణాల్ వెల్లడించారు. ఓ వీధి శునకాన్ని తప్పించబోతుండగా కారు అదుపుతప్పి చెట్టును ఢీకొట్టినట్లు మంత్రి కుమారుడు మృణాల్ హెబ్బాళ్కర్ చెబుతున్నారు. లక్ష్మి హెబ్బాళ్కర్ 2023, 2018 ఎన్నికల్లో బెళగావి రూరల్ నుంచి కాంగ్రెస్ తరఫున పోటీ చేసి గెలుపొందారు. -
గమ్యానికి చేరువై.. అంతలోనే దూరమై..
గోదావరిఖని(రామగుండం): మరో నిమిషంలో ఇంటికి చేరుకునేవారు.. ఇంకో రెండుగంటలు గడిస్తే భోగి పండుగతో ఆ ఇంట్లో సంతోషాలు వెల్లివిరిసేవి. ఈలోగా మృత్యువు ముంచుకొచి్చంది. కుటుంబానికి పెద్దదిక్కు, అతడి కొడుకు మృతిచెందడం, ఇల్లాలు ఆసుపత్రి పాలు కావడంతో ఖనిలో విషాదఛాయలు నెలకొన్నాయి. సోమవారం వేకువజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో సింగరేణి కార్మికుడు, అతడి కొడుకు అక్కడికక్కడే మృతిచెందారు. గోదావరిఖని వన్‌టౌన్ సీఐ ఇంద్రసేనారెడ్డి తెలిపిన వివరాలు.. జీడీకే–11గనిలో పనిచేస్తున్న గిన్నారపు సతీశ్(32) తనకు వరుసకు సోదరుడు అయిన వ్యక్తికి హైదరాబాద్‌లోని ఆస్పత్రిలో కొడుకు జన్మించాడు. వారిని చూసేందుకు ఆదివారం సతీశ్ తన భార్య కీర్తి, కుమారుడు నవీశ్(11నెలలు), బావ ఎ.సతీశ్, చెల్లె అనూషతో కలిసి కారులో హైదరాబాద్ వెళ్లారు. తిరిగి రాత్రి 11 గంటలకు గోదావరిఖనికి పయనమయ్యారు. ఎన్టీపీసీ బీ పవర్‌హౌజ్ వరకు తన బావ కారు డ్రైవ్ చేయగా అక్కడ కొద్ది సేపు మూత్ర విసర్జన కోసం ఆగారు. తర్వాత సతీశ్ డ్రైవింగ్ చేస్తూ వచ్చాడు. ఈక్రమంలో సోమవారం వేకువజామున 3గంటలకు ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ వద్దకు వచ్చేసరికి కుక్క అడ్డు రావడంతో రోడ్డుపక్కన నిలిపి ఉన్న లారీని వెనుక నుంచి ఢీకొనగా, సతీశ్, అతడి కుమారుడు అక్కడికక్కడే మృతి చెందారు. మృతుడి భార్య, బావ, చెల్లె గాయాలపాలయ్యారు. ఒక్క నిమిషం గడిస్తే..ప్రమాదం జరిగిన ప్రాంతం నుంచి సతీశ్ ఇల్లు ఐదువందల మీటర్ల దూరంలో ఉంది. ఒక్క నిమిషం గడిస్తే ఇంటికి చేరుకునేవారు. ఈలోగా జరిగిన ప్రమాదం సింగరేణి యువ కార్మికుడు, అతడి ముక్కుపచ్చలారని 11నెలల చిన్నారిని కబలించింది. తన ఎదపైన ఆడాల్సిన చిన్నారి బాబును పోస్టుమార్టం అనంతరం తండ్రి మృతదేహంపై పడుకోబెట్టిన దృశ్యం ప్రతీ ఒక్కరిని కంటతడి పెట్టించింది. అంత్యక్రియల కోసం మృతదేహాలను తిమ్మాపూర్ మండలం పోరండ్లకు తరలించారు. -
తమ్ముళ్లతో కలిసి, భార్యను కడతేర్చాడు.. విషయం ఏమిటంటే!
మార్కాపురం: మార్కాపురం మండలం కుంట – జమ్మనపల్లి గ్రామాల మధ్య ఈ నెల 9వ తేదీ జరిగిన రోడ్డు ప్రమాదం కేసులో కుట్రకోణాన్ని వెలికితీశారు పోలీసులు. హత్యచేసి రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించేందుకు ప్రయత్నించిన ఈ కేసులో ఇద్దరు నిందితులను అరెస్టు చేసి టిప్పర్‌ను స్వాధీనం చేసుకున్నట్లు మార్కాపురం డీఎస్పీ నాగరాజు తెలిపారు. ఆదివారం సాయంత్రం స్థానిక డీఎస్పీ కార్యాలయంలో సీఐ సుబ్బారావుతో కలిసి ఏర్పాటు చేసిన ప్రెస్మీట్లో ఆ వివరాలను డీఎస్పీ వెల్లడించారు. ఈ కేసును సవాలుగా తీసుకుని తమ ఎస్సై అంకమరావు, సిబ్బంది దర్యాప్తు చేపట్టి 3 రోజుల్లోనే సంఘటనకు కారణమైన ఇద్దరిని అరెస్టు చేశామన్నారు. మరొకరిని త్వరలో అరెస్టు చేస్తామని చెప్పారు. డీఎస్పీ తెలిపిన వివరాల ప్రకారం..కొత్తపల్లి గ్రామానికి చెందిన ఈర్నపాటి సుబ్బలక్ష్మమ్మకు 30 ఏళ్ల క్రితం ఈర్నపాటి వెంకటేశ్వర్లుతో వివాహమైంది. వీరికి ఇద్దరు పిల్లలు. 2005లో తిప్పనబోయిన వెంకట నారాయణతో తన భార్య సుబ్బలక్ష్మమ్మకు అక్రమ సంబంధం ఉందనే అనుమానంతో వెంకట నారాయణను గొడ్డలితో నరికి చంపడంతో 9 సంవత్సరాలు జైలు శిక్ష అనుభవించి 2019లో జైలునుంచి వెంకటేశ్వర్లు విడుదలయ్యాడు. అయితే, తన భార్య సుబ్బలక్ష్మమ్మ పద్ధతి మార్చుకోలేదని, కుటుంబ పరువు తీస్తోందని, ఆస్తి విషయంలో గొడవపడుతోందని, కేసులు పెట్టి ఇబ్బందులకు గురిచేస్తోందన్న కారణంతో సుబ్బలక్ష్మమ్మను చంపాలని భర్త పెద్ద వెంకటేశ్వర్లు, ఆయన ఇద్దరు తమ్ముళ్లైన చిన్న వెంకటేశ్వర్లు, వెంకట రమణ కలిసి నిర్ణయించుకున్నారు. సుబ్బలక్ష్మమ్మ కొన్నేళ్లుగా మార్కాపురం పట్టణంలో నివాసముంటూ దుస్తుల వ్యాపారం చేస్తోంది. అందులో భాగంగా ఈ నెల 9న సుబ్బలక్ష్మమ్మ కొత్తపల్లి గ్రామానికి వెళ్లి దుస్తులమ్ముకుని తన మేనకోడలైన ఏడుమళ్ల రాధ అలియాస్ రాధాంజలి (17)ని తన టూవీలర్‌పై ఎక్కించుకుని మార్కాపురం బయలుదేరింది. కోమటికుంట జంక్షన్‌కు 2 కిలోమీటర్ల దూరంలో ఉండగా, ముందుగా వేసుకున్న పథకం ప్రకారం సుబ్బలక్ష్మమ్మను తమ టిప్పర్‌తో ఢీకొట్టించి చంపాలనే ఆలోచనతో ఈర్నపాటి పెద్ద వెంకటేశ్వర్లు, చిన్న రమణయ్య ప్రోద్భలంతో చిన్న వెంకటేశ్వర్లు టిప్పర్ నడుపుకుంటూ వచ్చాడు. పథకం ప్రకారం స్కూటీని ఢీకొట్టడంతో సంఘటన స్థలంలోనే రాధాంజలి మృతి చెందింది. సుబ్బలక్ష్మమ్మ కూడా లారీ కింద పడి గాయాలతో ఉండటంతో ఆమె చనిపోలేదని భావించి చిన్న వెంకటేశ్వర్లు టిప్పర్ దిగి కర్రతో ఆమైపె హత్యాప్రయత్నం చేయబోయాడు. కానీ, రోడ్డుపై వెళ్తున్న జనాలు గమనించడంతో అక్కడే కర్ర వదిలి పారిపోయాడు. ఈ సంఘటనపై ముందుగా యాక్సిడెంట్ కేసు నమోదు చేశారు. అనంతరం కేసును లోతుగా దర్యాప్తు చేసి కుట్రకోణం బయటకు రావడంతో హత్యకేసుగా మార్చారు. పూర్తిగా దర్యాప్తు చేసి ఆదివారం చిన్న వెంకటేశ్వర్లు, రమణయ్యలను అదుపులోకి తీసుకొని విచారించారు. వారు నేరం ఒప్పుకోవడంతో అరెస్టు చేసినట్లు డీఎస్పీ తెలిపారు. నిందితులిద్దరినీ కోర్టులో హాజరుపరుస్తామన్నారు. మరో నిందితుడైన పెద్ద వెంకటేశ్వర్లును త్వరలో అరెస్టు చేస్తామని చెప్పారు. ఈ కేసు దర్యాప్తు చేపట్టి 3 రోజుల వ్యవధిలో నిందితులను అరెస్టు చేసిన సీఐ సుబ్బారావు, రూరల్ ఎస్సై అంకమరావును ఎస్పీ దామోదర్ అభినందించినట్లు తెలిపారు. -
పండుగ వేళ భయానక రోడ్డు ప్రమాదాలు.. 14 మంది మృతి
ముంబై/డెహ్రాడూన్: ఉత్తరాఖండ్, మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాద ఘటనలు చోటుచేసుకున్నాయి. ఆదివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదాల కారణంగా 14 మంది మృతిచెందారు. మరో 20 మందికి పైగా ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. దీంతో, గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.ఉత్తరాఖండ్‌లో ఘోర బస్సు ప్రమాదం జరిగింది. పౌరీ జిల్లాలోని దహల్చోరి ప్రాంతంలో బస్సు అదుపు తప్పి 100 మీటర్ల లోతైన లోయలో పడిపోయింది. ఈ ప్రమాదంలో ఆరుగురు మృతి చెందగా, 16 మంది తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదంపై సమాచారం అందుకున్న రెస్క్యూ టీం ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టింది. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించినట్టు అధికారులు తెలిపారు. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 22 మంది ప్రయాణికులు ఉన్నట్లు అధికారులు తెలిపారు.VIDEO | Uttarakhand: Five people feared dead as bus meets with an accident in Pauri. More details awaited.(Full video available on PTI Videos - https://t.co/n147TvqRQz) pic.twitter.com/F9RQzVuvpP— Press Trust of India (@PTI_News) January 12, 2025ఈ ప్రమాదంపై ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.మరోవైపు.. మహారాష్ట్రలోని నాసిక్‌లోని ద్వారకా సర్కిల్ వద్ద ఆదివారం రాత్రి టెంపో-ట్రక్కు ఢీకొన్న ప్రమాదంలో ఎనిమిది మంది మృతిచెందారు. ఈ ఘటనంఓ మరో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. దీంతో, వారిని స్థానిక ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ప్రమాదం జరిగిన సమయంలో టెంపో వాహనంలో 16 మంది ప్రయాణిస్తున్నట్టు పోలీసులు తెలిపారు. వీరంతా పుణ్యక్షేత్రాలు దర్శించుని ఇంటికి వెళ్తున్న సమయంలో ప్రమాదం జరిగినట్టు సమాచారం. #WATCH | Maharashtra | Visuals from the Nashik Mumbai Highway flyover where 6 people lost their lives in an accident between a pickup and a mini truck.5 other people are injured out of which 2 are in critical condition. The injured are being treated at the district hospital:… pic.twitter.com/RIYbwNCxFd— ANI (@ANI) January 12, 2025 -
Bus Accident: నలుగురు దుర్మరణం
ఉత్తరాఖండ్: ఉత్తరాఖండ్(Uttarakhand)లో జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు మరణించారు. పౌరీ గర్వాల్ జిల్లాలో ఓ బస్సు(Bus Accident) అదుపుతప్పి కొండపై నుంచి లోయలోకి పడిపోవడంతో నలుగురు మృత్యవాత పడ్డారు. ఈ ఘటనలో 15 మంది వరకూ గాయాలయ్యాయి,. బస్సు అదుపు తప్పడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. బస్సు ప్రమాదానికి గురైందన్న వార్త తెలుసుకున్న పోలీసులు, జిల్లా అధికారులు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. దాంతో పాటు స్థానికంగా ఉన్నవారు కూడా ఆ ప్రాంతానికి తమ సాయం అందిస్తున్నారు. గాయపడ్డవారిని ఆస్పత్రి తరలించి చికిత్స అందిస్తున్నారు. -
షాద్‌నగర్ వద్ద రోడ్డు ప్రమాదం
-
మీకు తెలుసా? ప్రమాద బాధితుల్ని కాపాడితే కేంద్రం డబ్బులిస్తుంది!
ఢిల్లీ : రోడ్డు ప్రమాద బాధితులకు తక్షణ వైద్యం కోసం ఆస్పత్రులకు తరలించే గుడ్ సమరిటన్ల (good samaritans) రివార్డ్ మొత్తాన్ని రూ.5 వేల నుంచి రూ.25వేలకు పెంచుతున్నట్లు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ (nitin gadkari) శనివారం తెలిపారు.రోడ్డు భద్రతపై నటుడు అనుపమ్ ఖేర్ జరిగిన ఇంటర్వ్యూలో గడ్కరీ మాట్లాడుతూ.. గంటలోపు రోడ్డు ప్రమాద బాధితుల్ని ఆస్పత్రికి తరలించడంతో పాటు వారి ప్రాణాల్ని రక్షించే వారికి అందించే రివార్డ్ (reward) తక్కువగా ఉందని, ఆ మొత్తాన్ని పెంచుతున్నట్లు రోడ్డు రవాణా మంత్రిత్వ శాఖకు ఆదేశించినట్లు చెప్పారు.అక్టోబర్ 2021 నుంచి రోడ్డు ప్రమాద బాధితులకు సహాయం చేసే వారికి ప్రోత్సహించేలా రివార్డ్‌ను అందించే కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఈ పథకంలో భాగంగా రోడ్డు ప్రమాద బాధితులకు గంటలోపు ఆస్పత్రికి తరలించి, వారి ప్రాణాల్ని కాపాడేందుకు రూ.5వేల రివార్డ్ అందిస్తోంది. గుడ్ సమరిటన్ రివార్డ్ పొందాలంటేకేంద్రం అందించే గుడ్ సమరిటన్ రివార్డ్ పొందాలంటే ఆఫ్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ముందుగా ప్రమాదంలో గాయపడ్డ క్షతగాతుల్ని గంటలోపు ఆస్పత్రికి తరలించి ప్రాణాల్ని కాపాడిన ప్రాణదాతలు పోలీసులకు సమాచారం అందించాల్సి ఉంది. పోలీసులు అధికారిక లెటర్ ప్యాడ్‌పై మిమ్మల్ని ప్రాణదాతగా గుర్తించి మీ వివరాల్ని మోదు చేసుకుంటారు. అంనతరం మీకో ఎక్నాలెడ్జ్మెంట్ ఇస్తారు. ఆ ఎక్నాలెడ్జ్మెంట్ను జిల్లాస్థాయి అప్రైజల్ కమిటీకి పంపుతారు. అక్కడి నుంచి ప్రాణదాతకు ప్రోత్సాహం అందించాలంటూ రాష్ట్ర రవాణా కమిషనర్‌కు సిఫార్సు చేస్తారు. రవాణాశాఖ సంబంధిత వ్యక్తికి బ్యాంకులో రూ.5 వేలు జమ చేయడంతోపాటు ప్రశంసాపత్రం అందజేస్తుంది. బాధితుల్ని కాపాడిన వ్యక్తులకు వేధింపులు ఇతర ఇబ్బందుల నుంచి గుడ్ సమరిటన్ చట్టం రక్షిస్తుంది.👉చదవండి : నా భార్యను చూడటం నాకు చాలా ఇష్టం -
కాకినాడ జిల్లా కత్తిపూడి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం
-
సూర్యాపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం
-
లారీని ఢీకొన్న ట్రావెల్స్ బస్సు.. నలుగురు మృతి
సాక్షి, సూర్యాపేట: సూర్యాపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాద ఘటన చోటుచేసుకుంది. ఓ ప్రైవేటు ట్రావెల్స్ బస్సు.. ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన ప్రమాదంలో నలుగురు మృతిచెందగా.. మరో 17 మంది గాయపడ్డారు. దీంతో, గాయపడిన వారిని స్థానిక ఆసుపత్రికి తరలించారు.వివరాల ప్రకారం.. సూర్యాపేట జిల్లాలోని చివ్వెంల మండలం ఐలాపురం వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న లారీని ప్రైవేట్ బస్సు ఢీకొనడంతో నలుగురు మృతి చెందారు. మృతుల్లో ఇద్దరు పురుషులు, ఇద్దరు మహిళలు ఉన్నారు. అలాగే, 17 మంది కూలీలు గాయపడ్డారు. ప్రమాద సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని సహాయ చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను సమీప ఆసుపత్రికి తరలించారు. కూలీలు పనుల కోసం ఒడిశా నుంచి హైదరాబాద్ వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసిన పోలీసులు.. దర్యాప్తు చేపట్టినట్టు తెలిపారు. -
ఆస్పత్రికి వెళ్తూ.. అనంత లోకాలకు
పహాడీషరీఫ్: అనారోగ్యంతో ఉన్న కూతురుకు చికిత్స చేయించేందుకు వెళ్తుండగా రోడ్డు ప్రమాదం రూపంలో మృత్యువు వెంటాడింది. ఈ ప్రమాదంలో మృతి చెందిన తల్లీకూతుళ్లు చివరకు అదే ఆస్పత్రికి పోస్టుమార్టం నిమిత్తం విగతజీవులుగా వెళ్లాల్సి వచ్చింది. ఈ హృదయ విదారక ఘటన పహాడీషరీఫ్ ఠాణా పరిధిలో బుధవారం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన ప్రకారం.. కల్వకుర్తి మున్సిపాలిటీ పరిధిలోని తిమ్మరాసిపల్లికి చెందిన చిత్తారి గోపాల్(36), లక్ష్మమ్మ(34) దంపతులకు ముగ్గురు ఆడపిల్లలు సంతానం.వీరి పెద్ద కూతురు విజయ(14)కు రక్తకణాలు తక్కువగా ఉండడంతో చికిత్స నిమిత్తం ఉదయం 7.30గంటలకు వారిబైక్పై హైదరాబాద్‌లోని ఉస్మానియా ఆస్పత్రికి బయలుదేరారు. ఉదయం 9.45గంటల సమయంలో తుక్కుగూడ ఓఆర్ఆర్ బ్రిడ్జి సమీపంలోకి రాగానే వెనుక ఉంచి వస్తున్న టిప్పర్ డ్రైవర్ ఒక్కసారిగా శంషాబాద్ టోల్ వైపునకు వాహనాన్ని మళ్లించాడు. ఈ క్రమంలో టిప్పర్ బైక్‌ను ఢీకొట్టడంతో పడిపోయిన లక్ష్మమ్మ, విజయ తల మీదుగా లారీ వెనుక చక్రాలు వెళ్లడంతో తల్లీకూతురు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. గోపాల్ కాలు, చేతులకు తీవ్రగాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రి మార్చురీకి తరలించారు. లారీ డ్రైవర్ పరారీలో ఉన్నారు. -
నగదు రహిత చికిత్స పథకం తీసుకురావాలి
న్యూఢిల్లీ: రోడ్డు ప్రమాద బాధితులకు చికిత్స అందించే విషయంలో సుప్రీంకోర్టు కీలకమైన తీర్పు వెలువరించింది. ప్రమాదం జరిగిన తర్వాత గోల్డెన్ అవర్ కాలంలో బాధితులకు నగదు రహిత వైద్య చికిత్స అందించేలా ఒక పథకాన్ని తీసుకురావాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. మోటార్ వాహనాల చట్టం–1988లోని సెక్షన్ 162(2) ప్రకారం ఈ పథకం అమల్లోకి తేవాలని పేర్కొంది. ఈ ఏడాది మార్చి 14వ తేదీలోగా పథకాన్ని రూపొందించి, అమలు చేయాలని స్పష్టంచేసింది. దీనివల్ల విలువైన ప్రాణాలను కాపాడవచ్చని పేర్కొంది. సెక్షన్ 2(12–ఎ) ప్రకారం గోల్డెన్ అవర్ అంటే ప్రమాదం జరిగిన తర్వాత తొలి గంట. రోడ్ ప్రమాదంలో క్షతగాత్రులుగా మారిన వారికి తొలి గంటలో చికిత్స అందిస్తే వారి ప్రాణాలు కాపాడే అవకాశాలు అధికంగా ఉంటాయని డాక్టర్లు చెబుతున్నారు. చికిత్స ఆలస్యమవుతున్న కొద్దీ ప్రాణాలు కాపాడడం కష్టమవుతుందని పేర్కొంటున్నారు. చట్టప్రకారం గోల్డెన్ అవర్‌లో బాధితు లకు నగదు రహిత చికిత్స అందించేలా కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌పై జస్టిస్ అభయ్ ఎస్.ఓకా, జస్టిస్ అగస్టీన్ జార్జి మాసిహ్‌తో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం బుధవారం విచారణ చేపట్టింది. ఈ ఏడాది మార్చి 14వ తేదీలోగా పథకాన్ని తీసుకురావాల్సిందేనని, ఈ గడువును పొడిగించే ప్రసక్తే లేదని తేల్చిచెప్పింది. -
వివాహమైన రెండు నెలలకే..
అన్నానగర్: వివాహమైన రెండు నెలలకే బైక్‌ను బస్సు ఢీకొన్న ప్రమాదంలో భర్తతో పాటూ మహిళా పోలీసు దుర్మరణం చెందిన ప్రమాదం సోమవారం చిదంబరంలో కలకలం రేపింది. వివరాలు.. కడలూరు జిల్లా చిదంబరం సమీపంలో ఉన్న జయంకొండాన్కు చెందిన మహిళ ఇలవరసి. ఈమె చిదంబరం సమీపంలో కుమరాట్చి పోలీసు స్టేషన్లో డిప్యూటీ ఇన్స్పెక్టర్గా విధులు నిర్వహిస్తున్నారు. ఈమె భర్త కలైవేందన్ ప్రైవేటు సంస్థలో ఉద్యోగం చేస్తున్నారు. ఈ స్థితిలో ఇలవరసి తన భర్తతో కలిసి చిదంబరం సమీపంలోని వీరన్కోవిల్దిట్టు గ్రామంలో జరుగుతున్న ఓ శుభకార్యక్రమంలో పాల్గొనడం కోసం బైకులో వెళ్లారు. వారు చిత్తాలపట్టి గ్రామం సమీపంలో వెళుతుండగా ఎదురు వైపుగా కొడియంపాళయం గ్రామం నుంచి చిదంబరం వైపుగా వచ్చిన ప్రభుత్వ బస్సు అకస్మాత్తుగా ఇలవరసి బైక్‌ను ఢీకొంది. ఈ ప్రమాదంలో బైక్‌తో పాటు ఇద్దరిని బస్సు ఈడ్చుకెళ్లింది.దీంతో తీవ్రంగా గాయపడి ఇలవరసి, కలైవేందన్ ఘటనా స్థలంలోనే దుర్మరణం చెందారు. సమాచారం అందుకున్న వెంటనే అన్నామలైనగర్ పోలీసులు బస్సు కింద శిథిలాల్లో చిక్కుకున్న దంపతుల మృతదేహాలను శవపంచనామా నిమిత్తం చిదంబరం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. కాగా వీరికి గత నవంబర్ నెలలో వివాహం కావడం గమనార్హం. వివాహమైన రెండు నెలలకే నవ దంపతులు మృతి చెందిన ఘటన ఆ ప్రాంతం వారిని శోకంలో ముంచేసింది. -
తిరుపతి: భక్తులపైకి దూసుకెళ్లిన అంబులెన్స్.. ఇద్దరు మృతి
సాక్షి, తిరుపతి: తిరుపతి జిల్లాలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. కాలినడకన తిరుమలకు వెళ్తున్న భక్తులపైకి 108 అంబులెన్స్ దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మహిళలు మృతిచెందగా.. ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు.వివరాల ప్రకారం.. తిరుపతిలో కాలినడకన తిరుమలకు వెళ్తున్న భక్తులపైకి 108 అంబులెన్స్ దూసుకెళ్లింది. భక్తులంతా పుంగనూరు నుంచి తిరుమలకు పాదయాత్రగా వస్తున్న సమయంలో చంద్రగిరి మండలం నరిశింగాపురం నారాయణ కళాశాల వద్ద ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మహిళలు మృతిచెందగా.. మరో ముగ్గురు గాయపడ్డారు. దీంతో, గాయపడిన వారిని స్థానిక ఆసుపత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు.ఇక, ఈ ప్రమాదంలో మృతిచెందిన మహిళలు అన్నమయ్య జిల్లా రామసముద్రం మండలం చెంపాలపల్లికి చెందిన పెద్దరెడ్డమ (40), శేగంవారిపల్లికి చెందిన లక్ష్మమ్మ (45)గా గుర్తించారు. అయితే, 108 అంబులెన్స్ మదనపల్లి నుంచి తిరుపతి రుయా ఆసుపత్రికి రోగిని తీసుకెళ్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది. -
విషాదం.. గేమ్ ఛేంజర్ ఈవెంట్‌కు వెళ్లి వస్తుండగా ఇద్దరు మృతి..!
ఏపీలో విషాదం చోటు చేసుకుంది. తూర్పు గోదావరి జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృత్యువాత పడ్డారు. రాజమండ్రిలో శనివారం జరిగిన గేమ్ రేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు వెళ్లి తిరిగి వస్తూ ఇద్దరు యువకులు ప్రాణాలు కోల్పోయారు. రంగంపేట మండలం కార్గిల్ ఫ్యాక్టరీ సమీపంలో ఐచర్ వ్యాన్ ఢీకొని మరణించారు. వారిద్దరిని కాకినాడకు చెందిన తోకడ చరణ్, ఆరవ మణికంఠ గుర్తించారు.ఘటనా స్థలంలోనే ఆరవ మణికంఠ మృతి చెందగా.. తీవ్ర గాయాల పాలైన తోకడ చరణ్‌ను ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో కన్నుమూశారు. తమ అభిమాన హీరోను చూసేందుకు తిరిగిరాని లోకాలకు వెళ్లి పోయారని మృతుల కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వారి మరణంతో రెండు కుటుంబాలు ఆధారాన్ని కోల్పోయాయి.భర్త చనిపోవడంతో మణికంఠకు అన్ని తానే చదివించానని తల్లి రోదిస్తూ ఆవేదన వ్యక్తం చేసింది. తండ్రితో కలిపి పళ్ల వ్యాపారం చేస్తున్న చరణ్ మృతితో వారి కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయింది. అయితే ఇప్పటివరకు బాధిత కుటుంబాలను సినీ ప్రముఖులు కానీ, అధికారులు కానీ పరామర్శించలేదని తెలుస్తోంది. తమకు న్యాయం చేయాలని బాధిత కుటుంబాల సభ్యులు వేడుకుంటున్నారు. -
మేడ్చల్‌లో ఘోర ప్రమాదం.. లారీ బీభత్సం.. ముగ్గురి మృతి
సాక్షి, మేడ్చల్: మేడ్చల్ చెక్‌పోస్టు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అతి వేగంగా దూసుకొచ్చిన లారీ ముగ్గురిని ఢీకొట్టింది. ద్విచక్ర వాహనంపై ఓ వ్యక్తి తన భార్య, కుమార్తెను తీసుకెళ్తుండగా.. అదుపు తప్పిన లారీ వేగంగా వచ్చి ఢీకొంది. ఈ ప్రమాదంలో ముగ్గురూ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. కుమారుడికి తీవ్ర గాయాలు కాగా, ఆసుపత్రికి తరలించారు. ఘటన తర్వాత లారీ డ్రైవర్ అక్కడి నుంచి పరారయ్యాడు. -
నల్లగొండ జిల్లా తిప్పర్తి దగ్గర రోడ్డు ప్రమాదం
-
ఘోర రోడ్డు ప్రమాదంలో నలుగురి దుర్మరణం
జిన్నారం (పటాన్చెరు): అతివేగంగా వస్తున్న ఓ కారు..ఎదురుగా ఉన్న రెండు ఆటోలను ఢీకొట్టడంతో నలుగురు అక్కడికక్కడే మృతి చెందగా, మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మండల పరిధిలోని నర్సాపూర్–బాలానగర్ జాతీయ రహదారిపై శుక్రవారం చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. గుమ్మడిదల పరిధిలోని నల్లవల్లి అటవీ ప్రాంతంలోని మేడాలమ్మ ఆలయం వద్ద రహదారిపై నర్సాపూర్ నుంచి అతివేగంగా వస్తున్న ఓ కారు.. ఎదురుగా వస్తున్న రెండు ఆటోలను ఢీకొట్టింది. మొదటి ప్యాసింజర్ ఆటోలో ప్రయాణిస్తున్న ఐశ్వర్య లక్ష్మి (20), పాపగారి మనీషా (25), ప్రవీణ్ (30), అక్కడికక్కడే మృతి చెందగా.. అనసూయ (62) న గరంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో ప్రాణాలొదిలారు. డ్రైవర్ మాత్రం ప్రాణాలతో బయటపడ్డారు. రెండో ఆటోలో ప్రయాణిస్తున్న వారిలో సంతో‹Ù, వడ్డే రాజు, గూని ప్రవీణ్, నవీన్‌లు తీవ్రంగా గాయపడ్డారు. వీరిని గుమ్మడిదల ఎస్సై మహేశ్వర్ రెడ్డి చికిత్స నిమిత్తం నగరంలోని వేర్వేరు ప్రైవేట్ ఆస్పత్రులకు తరలించారు. ⇒ ఐడీఏ జీడిమెట్ల సంజయ్ గాంధీనగర్‌కు చెందిన పాపగారి మనీషా నర్సాపూర్‌లోని పంచాయతీరాజ్ శాఖలో ఏఈగా పనిచేస్తోంది. ఈమె విధుల నిమిత్తం నర్సాపూర్ వెళ్లేందుకు ప్యాసింజర్ ఆటో ఎక్కారు. æ నర్సాపూర్ మండలం రుస్తుంపేటకు చెందిన ఐశ్వర్య లక్ష్మి (20) కొంపల్లిలోని ఇగ్నైట్ ఐఏఎస్ అకాడమీలో డిగ్రీ మూడవ సంవత్సరం చదువుతోంది. ఉదయం కాలేజీకి వెళ్లి అక్కడ విద్యార్థులు లేకపోవడంతో తిరిగి బహుదూర్‌పల్లిలో ఆటో ఎక్కింది. ⇒ ప్రవీణ్ నర్సాపూర్ మండలం ఎల్లారెడ్డిగూడ తండా వాసిగా, అనసూయ కౌడిపల్లి గ్రామానికి చెందిన వారుగా గుర్తించారు. æ కారు నడిపిన వ్యక్తి మెదక్‌లో తన పిల్లలను హాస్టల్లో వదిలి తిరిగి హైదరాబాద్ వస్తున్నారని తెలిసింది. ఈయన వివరాలు ఇంకా తెలియలేదు. ప్రమాదంలో 2 ఆటోలు నుజ్జునుజ్జు అయ్యాయి. మితిమీరిన వేగమే ప్రమాదానికి కారణమని పోలీసులు చెబుతున్నారు. -
మృత్యువు కబళించింది
తుగ్గలి/పెద్దవడుగూరు: అనంతపురం జిల్లా పెద్దవడుగూరు మండలం క్రిష్టిపాడు వద్ద శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో తుగ్గలి మండలం చెన్నంపల్లికి చెందిన దంపతులు మృతి చెందారు. గ్రామానికి చెందిన వలుకూరు రాజు(35), సుమలత (30) దంపతులు వ్యవసాయం చేసుకుంటూ జీవ నం సాగిస్తున్నారు. వీరికి కూతురు, కుమారుడు ఉన్నారు. ఊర్లో ఈనెల 22న జరిగే దేవర ఉత్సవాలు ఉన్నందున నేత చీరల తెచ్చుకునేందుకు ద్విచక్ర వాహనంపై అనంతపు రం జిల్లా యాడికి వెళ్లారు. అక్కడ పట్టుచీరలు కొనుగోలు చేసిన అనంతరం తిరిగి మోటారు సైకిల్‌పై వ స్తుండగా పెద్దవడుగూరు మండలం క్రిష్టిపాడు సమీపంలో 67వ జాతీయ రహదారిపై పెట్రోల్ బంక్ వద్ద గుత్తి వైపు నుంచి యాడికికి శరవేగంగా వెళుతున్న బొలెరో వాహనం ఢీకొంది. ఘటనలో దంపతులిద్దరూ మృతిచెందారు. బొలెరో వాహనంలో ఉన్న యాడికి గ్రామానికి చెందిన యువకుడు సాయి మణికంఠకూ తీవ్ర గాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న యాడికి ఎస్ఐ ఆంజనేయులు, సిబ్బంది అక్కడికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. సమాచారం అందుకున్న మృతుల కుటుంబ సభ్యులు ఘటనా స్థలానికి చేరుకుని బోరున విలపించారు. మృతుడి తండ్రి శంకరయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. దంపతుల మృతితో చెన్నంపల్లి గ్రామంలో తీవ్ర విషాదఛాయలు నెలకొన్నాయి. -
కొత్త సంవత్సర వేడుకలకు వస్తూ ప్రమాదం.. ముగ్గురు మృతి
జమ్మలమడుగు: ఏడాది చివరి రోజే వారి జీవితానికి ఆఖరు రోజు అవుతుందని అనుకోలేదు. అతివేగం వారి ప్రాణాలను హరించింది. సంఘటన స్థలంలోనే ఒకరు మరణించగా మరొకరు ఇద్దరు ప్రభుత్వాసుపత్రిలో మరణించారు. ఇంకొకరి పరిస్థితి విషమంగా ఉంది. మరో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. వివరాలు ఇలా..పులివెందుల నియోజకవర్గంలోని వే ముల, లింగాల, పులివెందుల ప్రాంతాల కు చెందిన ఏడుగురు స్నేహితులు జనవరి వేడుకలను నిర్వహించుకునేందుకు పర్యాటక కేంద్రమైన గండికోటకు పులివెందుల నుంచి బయలు దేరారు. వీరిలో లింగా ల మండలం పెద్దకుడాల గ్రామానికి చెందిన అబ్దుల్, వేముల మండలం భూమ య్యగారిపల్లికి చెందిన నందీష్, పులివెందులకు చెందిన జగన్, షాహుల్, సింహాద్రిపురం అగ్రహారానికి చెందిన చైతన్య, షాజహాన్, ప్రేమ్ ఉన్నారు. ముద్దనూరు కొండ దిగిన తర్వాత చిటిమిటి చింతల గ్రామానికి సమీపంలో ఉన్న దర్గా మలుపు వద్దకు రాగానే వేగంగా వస్తున్న స్కార్పియోను అదుపు చేయలేక రోడ్డు పక్కన ఉన్న డివైడర్‌ను ఢీకొన్నారు. వేముల మండలం భూమయ్యగారిపల్లి గ్రామానికి చెందిన నందీష్(21) అక్కడికక్కడే మృతి చెందగా కొన ఊపిరితో ఉన్న లింగాల మండలం పెద్ద కుడాల గ్రామానికి చెందిన అబ్దుల్(25)ను జమ్మలమడుగు ప్రభుత్వాసుపత్రికి తీసుకు రాగా చికిత్స పొందుతూ మరణించాడు. పులివెందులకు చెందిన జగన్ పరిస్థితి విషమించడంతో ప్రొద్దుటూరు ఆసుపత్రికి తరలించారు. ఈ రోజు ఉదయం ఆసుపత్రిలో చిక్సిత పొందుతూ జగన్ మృతి చెందాడు . చైతన్య, షాజహాన్, ప్రేమ్, షాహుల్ జమ్మలమడుగు ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అర్బన్ పోలీసులు కేసు నమో దు చేసుకుని విచారణ చేస్తున్నారు. -
బ్రేకులు ఫెయిలై.. షాపులోకి దూసుకెళ్లి..
అక్కిరెడ్డిపాలెం: బ్రేకులు ఫెయిలైన ఇసుక లారీ బీభత్సం సృష్టించింది. ఎత్తు నుంచి వేగంగా దూసుకొచ్చిన లారీ ఓ షాపులోకి దూసుకెళ్లడంతో ఒకరు మృతి చెందారు. డ్రైవర్‌కు తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాదాన్ని గమనించిన ఓ మహిళ త్రుటిలో తప్పించుకుని ప్రాణాలతో బయటపడింది. గాజువాక ట్రాఫిక్ ఎస్ఐ విజయ్‌కుమార్ తెలిపిన వివరాలివీ.. సుందరయ్య కాలనీలోని పాత కర్ణవానిపాలెంలో నివాసం ఉంటున్న గొలిశెట్టి వెంకటరమణ(58) స్టీల్ ప్లాంట్‌లోని కోక్ ఓవెన్స్ విభాగంలో సీనియర్ ఫోర్‌మెన్‌గా పనిచేస్తున్నారు. మంగళవారం మధ్యాహ్నం తన ఇంటి దగ్గరలోని జిరాక్స్ షాపునకు పనిమీద వెళ్లారు. అదే సమయంలో ఇసుక లోడుతో వస్తున్న లారీ ఎత్తు నుంచి దిగుతుండగా బ్రేకులు ఫెయిల్ అవ్వడంతో అదుపు తప్పి నేరుగా షాపులోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో లారీ వెంకటరమణను ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందారు. లారీ డ్రైవర్ రామసత్యప్రసాద్ చేతికి తీవ్ర గాయాలయ్యాయి. లారీ దూసుకొస్తుండటం చూసిన ఓ మహిళ వెంటనే పక్కకు తప్పుకోవడంతో ప్రాణాపాయం తప్పింది. సమాచారం అందుకున్న గాజువాక ఎస్ఐ విజయ్‌కుమార్ ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. వెంకటరమణ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కేజీహెచ్‌కు తరలించారు. వెంకటరమణకు భార్య నాగలక్ష్మి, కుమార్తె ఉన్నారు. ఆయన మధ్యాహ్నం విధులకు వెళ్లాల్సి ఉందని ఎస్ఐ తెలిపారు. -
కంటైనర్ బీభత్సం.. ఏకంగా పోలీసుల వాహనం పైకే !
-
Year Ender 2024: ఎన్నటికీ మరువలేని ఐదు విషాదాలు
కొత్త ఏడాది(2025)లోకి మనమంతా అడుగుపెట్టేందుకు ఇక కొద్దిరోజులే మిగిలున్నాయి. ఈ తరుణంలో మన మదినిండా కొత్త ఆశలు చిగురిస్తాయి. అదేసమయంలో పాత ఊసులు కూడా మదిలో మెదులుతుంటాయి. 2024లో దేశంలో పలు విషాదకర ఉదంతాలు చోటుచేసుకున్నాయి. వాటిలోని ముఖ్యమైన ఐదు ఉదంతాలను మనం ఎప్పటికీ మరువలేం. వాటిని ఒకసారి గుర్తుచేసుకుందాం. రాజ్‌కోట్ గేమింగ్ జోన్ 2024, మే 25న గుజరాత్‌లోని రాజ్‌కోట్‌లోని గేమింగ్ జోన్లో ఘోర అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో 24 మంది మృతిచెందారు. మృతుల్లో 12 మంది చిన్నారులు ఉన్నారు. ఇది సౌరాష్ట్రలోనే అతిపెద్ద గేమింగ్ జోన్‌గా పేరొందింది. ఈ ఘటన దరిమిలా పోలీసులు గేమింగ్ జోన్ యజమాని యువరాజ్ సింగ్ సోలంకితో పాటు మేనేజర్‌ను అరెస్టు చేశారు. అగ్నిమాపక శాఖ నుండి ఎన్ఓసీ లేకుండా ఈ గేమింగ్ జోన్ నిర్వహిస్తున్నారని, ఇదే ప్రమాదానికి ప్రధాన కారణమని తేలింది.హత్రాస్ తొక్కిసలాటయూపీలోని హత్రాస్‌లో చోటుచేసుకున్న తొక్కిసలాట పెను విషాదానికి దారితీసింది. సింకదారావులోని ఒక మైదానం.. సత్సంగం సందర్భంగా శ్మశాన వాటికలా మారింది. 2024, జూలై 2న హత్రాస్‌లోని పుల్రాయి గ్రామంలో సత్సంగం నిర్వహించారు. అనంతరం భోలే బాబా తన కారులో ఆశ్రమానికి తిరుగుపయనమయ్యారు. అదే సమయంలో బాబా పాదాలను తాకేందుకు జనం ప్రయత్నించారు. ఈ సందర్బంగా తొక్కిసలాట జరిగింది. ఈ దుర్ఘటనలో 121 మంది మృతిచెందారు. ఈ కేసులో ప్రధాన నిందితునిగా దేవ్ ప్రకాష్ మధుకర్‌తో సహా తొమ్మదిమందిని చేర్చారు. అయితే భోలే బాబా అలియాస్ సూరజ్‌పాల్‌ను ఈ కేసులో నిందితునిగా పేర్కొనకపోవడం విశేషం.వయనాడ్ విలయం2024, జూలై 30వ తేదీ రాత్రి కేరళలోని వయనాడ్‌లో ఘోర విపత్తు చోటుచేసుకుంది. ఇది యావత్‌దేశాన్ని కుదిపేసింది. వయనాడ్‌లో కొండచరియలు విరిగిపడటంతో వందలాది మంది మృతిచెందారు. 180 మంది గల్లంతయ్యారు. వారం రోజుల పాటు రెస్క్యూ ఆపరేషన్ కొనసాగింది. ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు, క్షతగాత్రులకు ప్రభుత్వం నష్టపరిహారం అందించింది.ఝాన్సీ ఆస్పత్రిలో మంటలు2024, నవంబర్ 15న ఉత్తరప్రదేశ్‌లోని ఝాన్సీ మెడికల్ కాలేజీలోని నియోనాటల్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో మంటలు చెలరేగాయి. ఈ అగ్ని ప్రమాదంలో 18 మంది నవజాత శిశువులు మృతి చెందారు. 16 మంది గాయపడ్డారు. కొందరు శిశువులను వారి తల్లిదండ్రులు కళ్లారా చూసుకోకముందే ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. ఈ అగ్నిప్రమాదం వెనుక ఆస్పత్రి పాలకవర్గ నిర్లక్ష్యం ఉన్నట్లు స్పష్టమయ్యింది. షార్ట్ సర్క్యూట్ల విషయంలో శ్రద్ధ చూపకపోవడం, సకాలంలో పిల్లలను ప్రమాదం బారి నుంచి తప్పించకపోవడం లాంటివి పెను ప్రమాదానికి దారితీశాయి. ఈ ఘటన దరిమిలా ఝాన్సీ మెడికల్ కాలేజీ ప్రిన్సిపల్‌ను విధుల నుంచి తొలగించగా, మరో ముగ్గురు సిబ్బందిని సస్పెండ్ చేశారు.జైపూర్ ట్యాంకర్ రాజస్థాన్‌లోని జైపూర్‌లో 2024, డిసెంబర్ 20న అజ్మీర్ రోడ్డులో ఘోర ప్రమాదం చోటచేసుకుంది. కంటైనర్ లారీ, ఎల్పీజీ ట్యాంకర్ ఢీకొన్నాయి. వెంటనే ఎల్పిజి ట్యాంకర్‌కున్న అవుట్లెట్ నాజిల్ విరిగిపోయి, గాలిలోకి విష వాయువు వ్యాపించింది. చిన్నపాటి స్పార్క్ ఇంతటి భారీ ప్రమాదానికి కారణమయ్యింది. ఈ ఘటనలో 17 మంది ప్రాణాలు కోల్పోయారు. చాలా మంది గాయపడ్డారు. పేలుడు ధాటికి దాదాపు 40 వాహనాలు దగ్ధమయ్యాయి. కంటైనర్ డ్రైవర్ అజాగ్రత్త కారణంగానే ఈ ప్రమాదం సంభవించినట్లు విచారణలో తేలింది.ఇది కూడా చదవండి: నాలుగు రాష్ట్రాల్లో ‘మహిళా పథకాలు’.. ప్రయోజనాల్లో తేడాలివే -
రోడ్డు ప్రమాదంలో తల్లి, కుమారుడి దుర్మరణం
భువనగిరి : యాదగిరిగుట్ట లక్ష్మీనర్సింహస్వామి దర్శనానికి వెళ్లి తిరిగి వస్తుండగా జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు మృతిచెందగా మరో ఇద్దరికి తీవ్రంగా గాయపడిన సంఘటన శుక్రవారం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. హైదరాబాద్, చంపాపేట్‌కు చెందిన బైగళ్ల జగన్ భార్య పావని(30), కుమార్తె సాత్విక, కుమారుడు ప్రణయ్(2)తో కలిసి శుక్రవారం ఉదయం బైక్‌పై యాదగిరిగుట్ల లక్ష్మీనర్సింహస్వామి దర్శనానికి వెళ్లాడు. దర్శనం అనంతరం శుక్రవారం రాత్రి యాదగిరిగుట్ట నుంచి నగరానికి తిరిగి వస్తుండగా భువనగిరి మండల పరిధిలోని హైదరాబాద్–వరంగల్ ప్రధాన రహదారిపై దీప్తి హోటల్ సమీపంలో వారు ప్రయాణిస్తున్న బైక్‌ను వెనకనుంచి గుర్తుతెలియని వాహనం ఢీకొట్టింది. ఈ ఘటనలో పావని అక్కడికక్కడే మృతి చెందింది. స్థానికుల సమాచారంతో సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు తీవ్రంగా గాయపడిన ప్రణయ్‌తో పాటు స్వల్పంగా గాయపడిన జగన్, సాతి్వకను జిల్లా కేంద్ర ఆస్పత్రికి తరలించారు. ప్రణయ్ పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్‌కు తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడు. వారి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు. జగన్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ సంతోష్ కుమార్ తెలిపారు. సెలవు రోజు కావడంతో.. జగన్ నగరంలోని ఓ ప్రైవేటు కళాశాలలో పనిచేస్తున్నాడు. వరుస సెలవులు రావడంతో యాదగిరిగుట్టతో పాటు స్వర్ణగిరిలో స్వామి వారి దర్శనానికి వచ్చారు. సాయంత్రం రాయగిరి చెరువు వద్ద సంతోషంగా గడిపిన వారు భోజనం చేసిన అనంతరం అక్కడి నుంచి బయలుదేరారు. ఈ క్రమంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందడంతో కుటుంబ సభ్యులు, బంధువులు కన్నీటి పర్యంతమయ్యారు. -
సిటీ చూసొద్దామని బయలుదేరి.. మృత్యుఒడికి..
మాదాపూర్: సరదాగా రాత్రి వేళ నగరాన్ని చూసొద్దామని బయలుదేరిన ఇద్దరు ఐటీ ఉద్యోగులు ‘అతివేగం’ కారణంగా మృత్యు ఒడికి చేరారు. అదుపు తప్పిన వేగంతో బైకు నడిపి అనంతలోకాలకు చేరారు. ఈ సంఘటన మాదాపూర్ పరిధిలో శుక్రవారం చోటుచేసుకుంది. మాదాపూర్ ఇన్స్పెక్టర్ కృష్ణమోహన్ తెలిపిన వివరాల ప్రకారం..కరీంనగర్‌కు చెందిన ఆకాం„Š (24), నెల్లూరుకు చెందిన రఘుబాబు స్నేహితులు. వీరిద్దరు సాఫ్ట్వేర్ ఉద్యోగులుగా పనిచేస్తున్నారు. గురువారం అర్థరాత్రి దాటాక దాదాపు 12.30 గంటల సమయంలో ఇద్దరు మోటార్ సైకిల్ (టీఎస్ 02 ఎఫ్ఈ 8983)పై బోరబండ నుంచి మాదాపూర్‌కు బయలుదేరారు. మార్గమధ్యలో పర్వత్‌నగర్ సిగ్నల్ దాటిన తరువాత ఆకాంక్షా నడుపుతున్న బైక్ అదుపుతప్పి రోడ్ డివైడర్‌ను వేగంగా ఢీకొని.. ఇద్దరు రోడ్డుపై పడిపోయారు. బైకు కొద్దిదూరం రోడ్డుపై ఈడ్చుకుంటూ వెళ్లింది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన వీరిని చికిత్స నిమిత్తం మెడికవర్ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మరణించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసునమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. బైక్ నడుపుతున్న వ్యక్తి… pic.twitter.com/ebLjSuNVrM— Telugu Scribe (@TeluguScribe) December 27, 2024 -
యమ డ్రింకరులు
కొన్నాళ్ల క్రితం కర్నూలు ప్రభుత్వాసుపత్రి ఎదురుగా మోటర్ సైకిల్ ఢీకొన్న ఘటనలో అనంతపురం జిల్లాకు చెందిన ఓ వృద్ధుడు మృతి చెందాడు. వాహనం నడిపిన యువకుడు బార్లో పని చేస్తాడు. రాత్రి ఫుల్‌గా మద్యం తాగి వాహనాన్ని వేగంగా నడపటంతో ప్రమాదం జరిగింది. కర్నూలు బాలాజీ నగర్‌కు చెందిన కొంతమంది యువకులు స్నేహితుని పుట్టిన రోజు వేడుకలను అలంపూరు గ్రామ శివారులోని ఓ తోటలో జరుపుకున్నారు. అనంతరం కర్నూలుకు వస్తుండగా వారు ప్రయాణిస్తున్న కారు తుంగభద్ర బ్రిడ్జి దగ్గర ప్రమాదానికి గురైంది.ఏ వాహనమూ వారికి అడ్డు రాలేదు. వేగంగా వెళ్లి బ్రిడ్జికి ఢీకొట్టడం వల్ల ఘటనా స్థలంలోనే ఒకరు మృతిచెందగా మరో నలుగురు గాయాలపాలయ్యారు. ఈ ప్రమాదం కూడా మద్యం మత్తులో వాహనం నడపటమే కారణమని పోలీసులు తేల్చారు. ఇలాంటి ఘటనలతో ఆయా కుటుంబాలు చీకటిలోకి జారుకుంటున్నాయి. కర్నూలు: వారు నడిస్తే.. కాళ్లు రకరకాలుగా అడుగులేస్తాయి. ఇక వాహనాలు నడిపితే యముడు వెనుక వస్తున్నట్లే. మృత్యువుకు ఎదురెళ్తారు. ఎందుకంటే వారి శరీరంలోకి మద్యం వెళ్లింది. ఏమి జరుగుతుందో తెలుసుకునేలోపే ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. మత్తులో రోడ్డు ప్రమాదానికి గురవుతున్నారు. అలా వాహనాలు నడుపుతూ ప్రజల ప్రాణాలతోనూ ఆడుకుంటున్నారు. మద్యం మత్తులోని యమకింకరులను పోలీసులు పట్టుకుంటున్నా, కోర్టు శిక్షలు విధిస్తున్నా నానాటికీ పెరిగిపోతున్న కేసులు మరింత కలవరపాటుకు గురి చేస్తున్నాయి. ఉమ్మడి కర్నూలు జిల్లాలో నిత్యం ఎక్కడో చోట మద్యం మత్తులో ప్రమాదాలు చోటు చేసుకుని మరణాలు సంభవిస్తున్నాయి. మద్యం తాగడం ఎంత హానికరమో.. వివరించే ప్రచార చిత్రాలు చాలా చోట్ల కనిపిస్తుంటాయి. పోలీసులు కూడా పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా డ్రంకెన్ డ్రైవ్‌పై అవగాహన కల్పిస్తుంటారు. ఇవి చాలా మందిలో మార్పు తీసుకురాలేకపోతున్నాయి. పండుగలు, ఉత్సవాలు, ఇళ్లలో జరిగే శుభకార్యాల పేరుతో మందుబాబులు తెగ తాగేస్తున్నారు. అదే సమయంలో వాహనాలతో రోడ్లపైకి రావడం ముప్పు తెస్తోంది. ఎక్కువగా 20 నుంచి 45 సంవత్సరాల మధ్య యువకులే తనిఖీల్లో పట్టుబడుతున్నట్లు పోలీసులు చెబుతున్నారు. 40 నుంచి 55 ఏళ్ల వయస్సు వారు తర్వాత స్థానంలో ఉన్నారు. ఇటీవల కాలంలో 18 నుంచి 22 సంవత్సరాల మధ్య వయసు వారు కూడా అధికంగానే మద్యం సేవించి తనిఖీల్లో పట్టుబడుతున్నట్లు పోలీసులు గుర్తించారు. చైతన్యపరుస్తున్నా.. లెక్క చేయని యువత మద్యం సేవించి వాహనాలు నడపటం ప్రమాదకరమని పోలీసులు జిల్లాలో నిత్యం ఎక్కడో చోట అవగాహన కల్పిస్తున్నప్పటికీ యువత లెక్క చేయడం లేదు. ఎంతో భవిష్యత్తు ఊహించుకున్న కన్నవారు తేరుకోలేని పరిస్థితిలోకి వెళ్లిపోతున్నారు. మద్యం తాగి వాహనాలు నడిపితే ఎంత ప్రమాదమో ఎక్కడికక్కడ చైతన్యం చేస్తున్నప్పటికీ కొందరు లెక్క చేయడం లేదు. చివరకు తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తోంది. వారిపై ఆధారపడినవారిని అంధకారంలోకి నెట్టేస్తున్నారు. జిల్లాలో ఏటా డ్రంకెన్ డ్రైవ్ కేసులు పెరుగుతూనే ఉన్నాయి. పోలీసులు కూడా ఎక్కడికక్కడ పకడ్బందీగా తనిఖీలు ముమ్మరం చేశారు. వారిని కూడా తప్పించుకుని వెళ్లిపోయినవారిని లెక్కల్లోకి తీసుకుంటే భయపడేంత స్థాయిలో మద్యం ప్రియులు వ్యవహరిస్తున్నారని తెలుస్తోంది. దొరికిన కొందరు కొన్ని రోజుల పాటు జైలు శిక్షకు కూడా గురవుతున్నారు. ఇన్ని ఘటనలు తమ చుట్టూ జరుగుతున్నా ‘నిషా’లో మునిగిన వారు వాహనాలు నడపటం మాత్రం ఆపడం లేదు. మూడేళ్లలో 2,596 డ్రంకెన్ డ్రైవ్ కేసులు నమోదు కావడమే ఇందుకు నిదర్శనం.జైలు.. జరిమానా మద్యం తాగి వాహనం నడపడం చట్టరీత్యా నేరం అని అందరికీ తెలిసిన విషయమే. ఇలా చేస్తే భారీ జరిమానాలు, జైలు శిక్ష వేస్తారని కూడా మందు బాబులు తెలుసుకోవాలి. మద్యం తాగి వాహనం నడుపుతూ పట్టుబడవితే మొదటిసారి రూ.10,000 వరకు జరిమానా, ఆరు నెలల జైలు శిక్ష విధిస్తారు. రెండో సారి కూడా ఇదే తప్పు చేస్తే రూ.15,000 వరకు జరిమానా, రెండు సంవత్సరాల జైలు శిక్ష విధిస్తారు. ఇలాంటి సంఘటనల్లో ఎవరికైనా ప్రాణాపాయం కలిగితే జైలు శిక్ష కూడా రెండేళ్లు ఉండేది. కొత్త చట్టం ప్రకారం మద్యం తాగి వాహనం నడపడం వల్ల కలిగే మరణాలకు ఐదు సంవత్సరాల వరకు తప్పనిసరి జైలు శిక్ష విధిస్తారు. అంతేకాకుండా జరిమానా కూడా ఎక్కువగా వేస్తారు. ఒకవేళ ప్రమాదం చేసిన వ్యక్తి చనిపోయిన వ్యక్తి మరణానికి సరైన కారణం చెప్పకపోతే 10 సంవత్సరాల వరకు జైలు శిక్షతో సహా అదనపు కఠినమైన శిక్షలు విధించే విధంగా చట్టాన్ని మార్చారు.మద్యం తాగి వాహనాలు నడిపితే చట్టరీత్యా నేరం మద్యం తాగి వాహనాలు నడపటం చట్టరీత్యా నేరం. ప్రమాదానికి గురైతే కుటుంబీకులు ఇబ్బంది పడతారనే విషయాన్ని విస్మరించవద్దు. ప్రధానంగా యువత మద్యం మత్తులో వాహనాలు నడపటం, ప్రమాదాలకు గురవటం ఆందోళనకరం. చాలా మందిలో మార్పు రావడం లేదు. వారి విలువైన భవిష్యత్తు నాశనం చేసుకోవద్దని కౌన్సెలింగ్‌లో సూచిస్తున్నాం. – మన్సూరుద్దిన్, ట్రాఫిక్ సీఐ, కర్నూలు -
చెట్టును ఢీకొన్న కారు
భువనగిరిటౌన్: స్నేహితులంతా కలిసి యాదగిరిగుట్టలోని లక్ష్మీనరసింహస్వామి దర్శనానికి వచ్చి వెళ్తుండగా.. కారు అదుపుతప్పి చెట్టును ఢీకొట్టడంతో ఇద్దరు మృతిచెందారు. మరో ఐదుగురికి గాయాలయ్యాయి. ఈ ఘటన వరంగల్–హైదరాబాద్ జాతీయ రహదారిపై భువనగిరి పట్టణంలో బుధవారం జరిగింది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. హైదరాబాద్‌లోని రామంతాపూర్‌లో వివిధ కాలనీలకు చెందిన అర్జున్, శ్రీరాం మితిన్, శ్రీను, సుంకరి మణిజయంత్, యశ్వంత్ (17) స్నేహితులు. వీరంతా బుధవారం తెల్లవారుజామున అదే ప్రాంతానికి చెందిన అబ్దుల్ సూఫియాన్ అలియాస్ రహీం (27) ఇన్నోవా కారును అద్దెకు తీసుకుని అతడితో పాటు యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకునేందుకు బయల్దేరారు. అదే కారులో అబ్దుల్ సూఫియాన్ బంధువు షాకీబ్ కూడా ఉన్నాడు. ఉదయం 7 గంటలకు యాదగిరిగుట్టకు చేరుకుని స్వామివారి దర్శనం పూర్తిచేసుకున్నారు. అనంతరం హైదరాబాద్‌కు తిరుగు పయణమయ్యారు. ఈ క్రమంలో యాదగిరిగుట్ట–భువనగిరి మధ్యలో ఓ హోటల్ వద్ద కారును ఆపి టిఫిన్ చేశారు. అనంతరం అక్కడి నుంచి హైదరాబాద్‌లో ఓ ఫంక్షన్‌కు హాజరయ్యేందుకు బయల్దేరారు. మార్గమధ్యలో భువనగిరి పట్టణంలోని టీచర్స్ కాలనీ సమీపంలో వరంగల్–హైదరాబాద్ జాతీయ రహదారి బైపాస్ వద్ద కారు అదుపుతప్పి రోడ్డు పక్కన రెయిలింగ్‌ను ఢీకొని అక్కడే ఉన్న చెట్టును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో డ్రైవింగ్ చేస్తున్న అబ్దుల్ సూఫియాన్‌తో పాటు వెనుక కూర్చున్న యశ్వంత్ అక్కడికక్కడే మృతి చెందారు. మిగతా ఐదుగురికి గాయాలయ్యాయి. భువనగిరి జిల్లా కేంద్ర ఆస్పత్రికి తరలింపు.. సమాచారం తెలుసుకున్న భువనగిరి పట్టణ పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని గాయపడిన ఐదుగురిని 108 వాహనంలో భువనగిరి జిల్లా కేంద్ర ఆస్పత్రికి తరలించారు. షాకీబ్తో పాటు మితిన్, మణిజయంత్కు తీవ్ర గాయాలవ్వడంతో మెరుగైన చికిత్స నిమిత్తం హైదరాబాద్‌కు తరలించారు. అనంతరం వాహనంలో ఇరుక్కుపోయిన సూఫియాన్, యశ్వంత్ మృతదేహాలను పోలీసులు వెలికితీసి పోస్టుమార్టం నిమిత్తం భువనగిరి జిల్లా కేంద్ర ఆస్పత్రికి తరలించారు. సెలవు రోజు కావడంతో.. అర్జున్, యశ్వంత్, మణిజయంత్, శ్రీరాం మితిన్, శ్రీను హైదరాబాద్‌లోనే వివిధ ప్రాంతాలలో ఇంటరీ్మడియట్ మొదటి సంవత్సరం చదువుతున్నారు. శ్రీను, అర్జున్, మితిన్ శ్రీచైతన్య జూనియర్ కళాశాలలో, యశ్వంత్ నారాయణగూడలోని నారాయణ జూనియర్ కళాశాలలో, మణిజయంత్ నల్లకుంటలోని నారాయణ జూనియర్ కళాశాలలో చదువుకుంటున్నారు. క్రిస్మస్ సందర్భంగా కళాశాలకు రెండు రోజులు సెలవులు ఇవ్వడంతో స్నేహితులంతా కలిసి యాదగిరిగుట్టకు వచ్చారు. మృతుల కుటుంబ సభ్యులు భువనగిరి జిల్లా కేంద్ర ఆస్పత్రికి చేరుకుని కన్నీటి పర్యంతమయ్యారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు భువనగిరి పట్టణ ఎస్ఐ కుమారస్వామి తెలిపారు.శాంతినగర్‌లో విషాద ఛాయలు రామంతాపూర్: తమ ఒక్కగానొక్క కుమారుడు యశ్వంత్ రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో రామంతాపూర్ శాంతినగర్‌కు చెందిన శ్రీనివాస్, మాధవి దంపతుల దుఃఖ సాగరంలో మునిగిపోయారు. కుమారుడి మరణ వార్త తెలియగానే శ్రీనివాస్ దంపతులు భువనగిరి జిల్లా ఆస్పత్రికి చేరుకుని గుండెలవిసేలా రోదించారు. సోదరుడి మరణంతో యశ్వంత్ సోదరీమణులు భవ్య, సమీక్ష భోరున విలపిస్తున్నారు. -
వేగంగా దూసుకొచ్చి.. బైకుని ఢీకొట్టి..
గచ్చిబౌలి: ఓ యువకుడి నిర్లక్ష్యపు డ్రైవింగ్..మితిమీరిన వేగం కారణంగా బీటెక్ విద్యార్థిని దుర్మరణం పాలైంది. మరో యువకుడు తీవ్రగాయాలతో ఆస్పత్రి పాలయ్యాడు. రాయదుర్గం ఇన్స్పెక్టర్ సీహెచ్.వెంకన్న తెలిపిన ప్రకారం..కామారెడ్డి జిల్లా దోమకొండకు చెందిన నర్సయ్య, పూజ దంపతుల రెండో కుమార్తె ఐరేని శివాని(21) గండిపేట్‌లోని సీబీఐటీలో బీటెక్ 4వ సంవత్సరం చదువుతోంది. గండిపేట్‌లోని ఓ హాస్టల్లో ఉంటోంది. నిజాంసాగర్లోని నవోదయ స్కూల్ 10వ తరగతి విద్యార్థుల పూర్వ సమ్మేళనం కోసం ఈ నెల 22న ఉదయం 4.30 గంటలకు హాస్టల్ నుంచి బయలుదేరింది. తిరిగి రాత్రి 12 గంటలకు కూకట్‌పల్లిలో బస్సు దిగి హాస్టల్‌కు వెళ్లేందుకు తన స్నేహితుడైన సాఫ్ట్వేర్ ఇంజనీర్ వెంకట్‌రెడ్డిని పిలిచింది. ఇద్దరు కలిసి డిన్నర్ చేసి హాస్టల్‌కు బయలుదేరారు. రాత్రి 1.30 గంటల సమయంలో నానక్‌రాంగూడ రోటరీ నుంచి నార్సింగ్ సర్వీస్ రోడ్డులో బైకుపై వెళ్తున్నారు. అదే సమయంలో వెనుక నుంచి వేగంగా దూసుకొచి్చన స్కోడా కారు వీరి బైక్‌ను ఢీ కొట్టింది. దీంతో శివాని, వెంకట్‌రెడ్డి ఎగిరి కిందపడ్డారు. తీవ్ర గాయాలు కావడంతో ఇద్దరిని 108 అంబులెన్స్‌లో కొండాపూర్ ఏరియా ఆస్పత్రికి తరలించారు. అప్పటికే శివాని మృతిచెందినట్లు అక్కడి డాక్టర్లు ధృవీకరించారు. తీవ్ర గాయాలతో ఉన్న వెంకట్‌రెడ్డిని మెరుగైన చికిత్స కోసం మదీనాగూడలోని ఓ హాస్పిటల్లో చేరి్పంచారు. అతని ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని పోలీసులు తెలిపారు. నగరంలోని ఓ ఆస్పత్రిలో పనిచేసే వైద్యుని కుమారుడు శ్రీకాలేష్ (19) కారును అతి వేగంగా నడిపి ప్రమాదానికి కారణమయ్యాడని తేలింది. దీంతో అతన్ని అరెస్ట్ చేసి, స్కోడా కారును స్వాదీనం చేసుకున్నారు. బ్రీత్ ఎనలైజర్ చేయగా ఎలాంటి ఆల్కహాల్ తాగలేదని నిర్ధారణ అయిందని, అతి వేగమే ప్రమాదానికి కారణమై ఉంటుందని పోలీసులు పేర్కొంటున్నారు. కొండాపూర్‌లో నివాసం ఉండే శ్రీకాలేష్ అమెరికా నుంచి వచ్చిన తన స్నేహితులను నార్సింగిలో డ్రాప్ చేసేందుకు కారులో బయలుదేరగా మార్గమధ్యలో ప్రమాదం చోటు చేసుకుంది. మృతదేహానికి ఉస్మానియా ఆస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.ముగ్గురు బీటెక్ విద్యార్థుల అదృశ్యం -
బెంగళూరు యాక్సిడెంట్.. అసలేం జరిగింది?
బెంగళూరు రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మైనర్లతో సహా ఆరుగురు దుర్మరణం పాలవడంతో రహదారి భద్రత మరోసారి చర్చనీయాంశంగా మారింది. రోడ్ టెర్రర్‌పై భయాందోళన వ్యక్తం చేస్తూ నెటిజనులు ఆన్లైన్ కామెంట్లు పోస్ట్ చేస్తున్నారు. యాక్సిడెంట్లకు గల కారణాలను ఏకరువు పెడుతున్నారు. బెంగళూరు– తుమకూరు ఎన్‌హెచ్ మార్గంలోని తిప్పగొండనహళ్లి వద్ద శనివారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదం అందరినీ ఉలిక్కిపడేలా చేసింది. బెంగళూరు నుంచి మహారాష్ట్రకు వెళుతున్న ఓ కుటుంబం ఊహించని రీతిలో అంతమవడం తీవ్రంగా కలిచివేసింది. మృతులను బెంగళూరులోని ఐఏఎస్‌టీ సాఫ్ట్వేర్ సొల్యూషన్స్ కంపెనీ యజమాని చంద్రం యోగప్ప (48), ఆయన భార్య గౌరాబాయి(42), వారి పిల్లలు దీక్ష (12), ఆర్య (6), బంధువులు జాన్ (16), విజయలక్ష్మి (36)గా గుర్తించారు.అసలేం జరిగింది?బెంగళూరులోని హెచ్ఎస్ఆర్ లేఔట్లో నివాసం ఉంటున్న చంద్రం యోగప్ప తన సొంతూరిలో క్రిస్మస్ వేడుకలు జరుపుకునేందుకు కుటుంబ సభ్యులతో కలిసి వోల్వో కారులో మహారాష్ట్రలోని విజయపురకు బయలుదేరారు. హైవేపై వెళుతుండగా నెలమంగళ వద్ద భారీ కంటైనర్ లారీ హఠాత్తుగా వీరి కారుపై పడిపోయింది. ప్రమాదం ధాటికి కారులోని వారు కారులోనే ప్రాణాలు కోల్పోయారు. స్థానికులు వెంటనే స్పందించి క్రేన్ సహాయంతో కంటైనర్‌ను తొలగించినా ఫలితం లేకపోయింది. కంటైనర్ లారీ డ్రైవర్ ఆరిఫ్ నియంత్రణ కోల్పోవడం వల్లే ప్రమాదం జరిగిందని పోలీసులు గుర్తించారు.ముందు వెళ్తున్న కారు సడన్‌గా బ్రేక్ వేయడమే ప్రమాదానికి కారణమని కంటైనర్ లారీ డ్రైవర్ ఆరిఫ్ మీడియాతో చెప్పాడు. తన ముందున్న కారు సడన్ బ్రేక్ వేయడంతో దాన్ని ఢీకొట్టకుండా తప్పించుకునే క్రమంలో నియంత్రణ కోల్పోవడంతో కంటైనర్ డివైడర్‌ను దాటి ఎదురుగా వస్తున్న కారుపై పడిందని వివరించాడు. అయితే ఈ ప్రమాదంలో ఆరిఫ్‌కు కాలిరిగింది. అతడిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయిన తర్వాత అతడిని అదుపులోకి తీసుకుంటామని పోలీసులు తెలిపారు. ప్రమాదం దృశ్యాలు సీసీకెమెరాల్లో రికార్డయ్యాయి. విచారణలో భాగంగా పోలీసులు సీసీటీవీ ఫుటేజీని పరిశీలిస్తున్నారు. కాగా, కంటైనర్ లారీలో 26 టన్నుల అల్యూమినియం స్తంభాలు ఉన్నట్టు పోలీసులు గుర్తించారు.సోషల్ మీడియాలో చర్చబెంగళూరు రోడ్డు ప్రమాదంపై సోషల్ మీడియాలో తీవ్రమైన చర్చకు దారి తీసింది. మనం ప్రయాణించే వాహనం ఎంత సురక్షితమైనప్పటికీ ఇలాంటి ప్రమాదాల నుంచి తప్పించలేవని చాలా మంది అభిపప్రాయపడ్డారు. సురక్షితమైన రోడ్లు, సుశిక్షితుడైన డ్రైవర్, రక్షణ ప్రమాణాలు కలిగిన వాహనం.. ఈ మూడింటితో ప్రమాదాలు నివారించవచ్చని ‘డ్రైవ్ స్మార్ట్’ పేర్కొంది. దీనిపై పలువురు నెటిజనులు తమ అభిప్రాయాలు వ్యక్తం చేశారు. చెత్త రోడ్లు, ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘన, ఓవర్‌లోడ్ కారణంగా ప్రమాదాలు ఎక్కువ అవుతున్నాయని పలువురు పేర్కొన్నారు. కంటైనర్లు, లారీల్లో ఓవర్‌లోడ్ తీసుకెళ్లకుండా ప్రభుత్వం నియంత్రించాలని సూచించారు.చదవండి: తప్పతాగి ఫుట్‌పాత్‌పైకి ఎక్కించి.. పుణేలో ఘోరంఊహించని విధంగా మరణం.. ‘ప్రపంచంలోని అత్యంత సురక్షితమైన కార్లలో ఒకటిగా వోల్వో XC90 ప్రసిద్ధి చెందింది. 2002లో మార్కెట్లోకి వచ్చినప్పటి నుంచి యూకేలో ఒక్క ప్రాణాంతక ప్రమాదానికి గురికాలేదు. అలాంటి సురక్షితమైన కారులో ప్రయాణిస్తూ ఓ కుటుంబం ప్రాణాలు కోల్పోవడం అత్యంత విషాదకరం. కంటైనర్ ట్రక్ అదుపు తప్పి, డివైడర్‌ను దాటి కారుపై పడి యజమానితో పాటు అతడి కుటుంబ సభ్యులను బలితీసుకోవడాన్ని ఎవరూ ఊహించరు. ఎంత మంచి ప్రమాణాలు కలిగిన కారు అయిన ఇంత భారీ బరువు మీద పడితే కచ్చితంగా నలిగిపోతుంది. సురక్షితంగా ప్రయాణించేందుకు మనం అన్ని ఏర్పాట్లు చేసుకున్నా కూడా ఎవరూ ఊహించని విధంగా మరణం మన దరికి చేరడం విషాదమ’ని స్కిన్ డాక్టర్ ఒకరు సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు.చదవండి: చంద్రం కుటుంబానికి కన్నీటి వీడ్కోలుప్రతిగంటకు 19 మంది బలి‘మీరు సురక్షితమైన కార్లను తయారు చేయవచ్చు, కానీ భారతదేశం అత్యంత అసురక్షిత రహదారులను నిర్మిస్తుంది. జాతీయ రహదారులు గందరగోళంగా ఉంటాయి. కొన్ని వందల రూపాయలు ఖర్చు చేస్తే చాలు డ్రైవింగ్ లైసెన్స్‌లు వచ్చేస్తాయి. నిర్లక్ష్య డ్రైవింగ్, చెత్త రోడ్ల కారణంగా మనదేశంలో ప్రతిగంటకు 19 మంది బలైపోతున్నారు. వాస్తవంగా చెప్పాలంటే భారతీయ రహదారులు దేశ భవిష్యత్తును చంపేస్తున్నాయ’ని మరో నెటిజన్ పేర్కొన్నారు. -
తప్పతాగి ఫుట్‌పాత్‌పైకి ఎక్కించి.. పుణేలో ఘోరం
ముంబై: పుణేలో అర్ధరాత్రి ఘోరం జరిగింది. ఫుల్‌గా మద్యం సేవించిన ఓ వ్యక్తి ఫుట్‌పాత్‌పైకి ట్రక్కుతో దూసుకెళ్లాడు. ఈ ఘటనలో ఫుట్‌పాత్ నిద్రిస్తున్న ఇద్దరు చిన్నారులు సహా ముగ్గురు మృతి చెందారు. మరో ఆరుగురు తీవ్రగాయాలతో ఆస్పత్రిలో చేరారు. ఆదివారం అర్ధరాత్రి దాటాక ఈ ఘటన చోటు చేసుకుంది.సుమారు ఒంటి గంట సమయంలో ఓ వ్యక్తి వాహనం నడుపుతూ వాఘోలి చౌక్ ఏరియాకు చేరుకున్నాడు. హఠాత్తుగా తన బండికి అక్కడే ఉన్న ఫుట్‌పాత్‌పైకి పోనిచ్చాడు. ఈ ఘటనలో ఫుట్‌పాత్‌పై నిద్రిస్తున్న ముగ్గురు మృతి చెందారు. మద్యం మత్తులో ఉన్న వ్యక్తిని అదుపులోకి తీసుకుని.. నిర్లక్ష్యంగా వాహనం నడిపి ప్రాణాలు పోవడానికి కారణమైనందుకు మోటార్ వెహికిల్స్ యాక్ట్‌తో పాటు బీఎన్ఎస్ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.మృతుల్లో.. ఏడాది, రేండేళ్ల వయసున్న చిన్నారులు, విశాల్ పన్వర్(22) ఉన్నారు. అమరావతిలో నిర్మాణ పనుల కోసం వచ్చిన కూలీలు.. కేశ్నాథ్ ఫాటా ఏరియాలో ఫుట్‌పాత్‌పై పడుకున్నారని, వాళ్లపై నుంచి ట్రక్కు దూసుకెళ్లిందని, వాహనం నడిపిన వ్యక్తి బాగా తాగి ఉన్నాడని పోలీసులు వెల్లడించారు.#महाराष्ट्र के पुणे में भयानक सड़क हादसा..नशे में धुत #डंपर ड्राइवर ने फुटपाथ पर सो रहे 9 लोगों को कुचला, 3 की मौत#Maharashtra #Pune #accident #footpath #Dumper #drunkdriving pic.twitter.com/y71i5EtaAQ— mishikasingh (@mishika_singh) December 23, 2024Pune: Dumper Truck Driver Claims Three Lives, Injures Nine In Wagholi Near Kesnand Phata In a tragic incident on Pune’s Wagholi area near Kesnand phata, a speeding dumper truck ran over 12 people sleeping on a footpath, killing three and injuring nine. The accident, reportedly… pic.twitter.com/K6T09Om7v4— Pune Pulse (@pulse_pune) December 23, 2024 -
చంద్రం కుటుంబానికి కన్నీటి వీడ్కోలు
దొడ్డబళ్లాపురం: శనివారంనాడు నెలమంగల వద్ద కంటెయినర్ లారీ పడి కారు నుజ్జయిన ప్రమాదంలో మరణించిన ఒకే కుటుంబానికి చెందిన ఆరుమందికి స్వగ్రామంలో అంత్యక్రియలు జరిగాయి. మహారాష్ట్రలోని సాంగ్లి జిల్లా జత్ తాలూకా మొరబగి గ్రామంలో అశృ నయనాలతో బంధువులు, గ్రామస్తులు వీడ్కోలు పలికారు. నెలమంగళ ఆస్పత్రిలో పోస్టుమార్టం ముగించి ఆదివారం ఉదయం ఆరు మృతదేహాలను అంబులెన్సుల్లో గ్రామానికి తీసుకువచ్చారు. అప్పటికే గ్రామంలో అంత్యక్రియలకు ఏర్పాట్లు చేశారు. కుటుంబ పెద్ద చంద్రం యోగప్ప, ఆయన భార్య, ఇద్దరు పిల్లలు, ఇద్దరు బంధువుల మృతదేహాలకు సహోదరుడు మల్లికార్జున్ నిప్పు అంటించారు. చంద్రం ఐటీ కంపెనీకి చెందిన ఉద్యోగులు తరలివచ్చారు. చంద్రంపై గ్రామంలోనే కాకుండా చుట్టుపక్కల గ్రామాల్లో మంచి పేరు ఉంది. నిరుద్యోగులు ఎవరున్నా వారికి ఉద్యోగం కల్పించేవాడు. చంద్రం పేద కుటుంబంలో జన్మించి ఈ స్థాయికి ఎదిగారు.ఉసురు తీసిన కంటైనర్ లారీ