బ్రేకులు ఫెయిలై.. షాపులోకి దూసుకెళ్లి..
బీభత్సం సృష్టించిన లారీ
ఒకరు మృతి.. డ్రైవర్‌కు గాయాలు
ప్రమాదం నుంచి తప్పించుకున్న మహిళ
అక్కిరెడ్డిపాలెం: బ్రేకులు ఫెయిలైన ఇసుక లారీ బీభత్సం సృష్టించింది. ఎత్తు నుంచి వేగంగా దూసుకొచ్చిన లారీ ఓ షాపులోకి దూసుకెళ్లడంతో ఒకరు మృతి చెందారు. డ్రైవర్‌కు తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాదాన్ని గమనించిన ఓ మహిళ త్రుటిలో తప్పించుకుని ప్రాణాలతో బయటపడింది. గాజువాక ట్రాఫిక్ ఎస్‌ఐ విజయ్‌కుమార్ తెలిపిన వివరాలివీ..
సుందరయ్య కాలనీలోని పాత కర్ణవానిపాలెంలో నివాసం ఉంటున్న గొలిశెట్టి వెంకటరమణ(58) స్టీల్ ప్లాంట్‌లోని కోక్ ఓవెన్స్ విభాగంలో సీనియర్ ఫోర్‌మెన్‌గా పనిచేస్తున్నారు. మంగళవారం మధ్యాహ్నం తన ఇంటి దగ్గరలోని జిరాక్స్ షాపునకు పనిమీద వెళ్లారు. అదే సమయంలో ఇసుక లోడుతో వస్తున్న లారీ ఎత్తు నుంచి దిగుతుండగా బ్రేకులు ఫెయిల్ అవ్వడంతో అదుపు తప్పి నేరుగా షాపులోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో లారీ వెంకటరమణను ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందారు.
లారీ డ్రైవర్ రామసత్యప్రసాద్ చేతికి తీవ్ర గాయాలయ్యాయి. లారీ దూసుకొస్తుండటం చూసిన ఓ మహిళ వెంటనే పక్కకు తప్పుకోవడంతో ప్రాణాపాయం తప్పింది. సమాచారం అందుకున్న గాజువాక ఎస్‌ఐ విజయ్‌కుమార్ ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. వెంకటరమణ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కేజీహెచ్‌కు తరలించారు. వెంకటరమణకు భార్య నాగలక్ష్మి, కుమార్తె ఉన్నారు. ఆయన మధ్యాహ్నం విధులకు వెళ్లాల్సి ఉందని ఎస్‌ఐ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment