
సాక్షి, పల్నాడు: పల్నాడు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాద ఘటన చోటుచేసుకుంది. లారీని కారు ఢీకొన్న ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతిచెందారు. ఈ ప్రమాదంలో మృతిచెందిన వారు ప్రకాశం జిల్లాలకు చెందినట్టు పోలీసులు గుర్తించారు.
వివరాల ప్రకారం.. పల్నాడు జిల్లాలోని రాజుపాలెం మండలం పెదనెమలిపూరి దగ్గర ఆదివారం ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది. హైదరాబాద్ నుంచి ప్రకాశం జిల్లా మద్దిపాడు వెళ్తున్న కారు.. లారీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారు ప్రయాణిస్తున్న ముగ్గురు మృతిచెందారు. మృతుల్లో తల్లి షేక్ నజీమా (50).. ఆమె కుమారులు ఇద్దరు షేక్ నూరుల్లా (26), షేక్ హబీబుల్లా(24) ఉన్నారు. ఇక, వీరిని ప్రకాశం జిల్లా మద్దిపాడు మండలం కొత్తపల్లి చెందిన వారిగా గుర్తించారు. ప్రమాద సమాచారం అందిన వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టం కోసం ఆసుపత్రికి తరలించారు.
Comments
Please login to add a commentAdd a comment