మరో నలుగురికి తీవ్ర గాయాలు
ఎదురుగా వస్తున్న రెండు ఆటోలను ఢీకొట్టిన కారు
సంగారెడ్డి జిల్లా గుమ్మడిదలలో ఘటన
జిన్నారం (పటాన్‌చెరు): అతివేగంగా వస్తున్న ఓ కారు..ఎదురుగా ఉన్న రెండు ఆటోలను ఢీకొట్టడంతో నలుగురు అక్కడికక్కడే మృతి చెందగా, మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మండల పరిధిలోని నర్సాపూర్–బాలానగర్ జాతీయ రహదారిపై శుక్రవారం చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. గుమ్మడిదల పరిధిలోని నల్లవల్లి అటవీ ప్రాంతంలోని మేడాలమ్మ ఆలయం వద్ద రహదారిపై నర్సాపూర్ నుంచి అతివేగంగా వస్తున్న ఓ కారు.. ఎదురుగా వస్తున్న రెండు ఆటోలను ఢీకొట్టింది. మొదటి ప్యాసింజర్ ఆటోలో ప్రయాణిస్తున్న ఐశ్వర్య లక్ష్మి (20), పాపగారి మనీషా (25), ప్రవీణ్ (30), అక్కడికక్కడే మృతి చెందగా.. అనసూయ (62) న గరంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో ప్రాణాలొదిలారు. డ్రైవర్ మాత్రం ప్రాణాలతో బయటపడ్డారు. రెండో ఆటోలో ప్రయాణిస్తున్న వారిలో సంతో‹Ù, వడ్డే రాజు, గూని ప్రవీణ్, నవీన్‌లు తీవ్రంగా గాయపడ్డారు. వీరిని గుమ్మడిదల ఎస్సై మహేశ్వర్ రెడ్డి చికిత్స నిమిత్తం నగరంలోని వేర్వేరు ప్రైవేట్ ఆస్పత్రులకు తరలించారు.
⇒ ఐడీఏ జీడిమెట్ల సంజయ్ గాంధీనగర్‌కు చెందిన పాపగారి మనీషా నర్సాపూర్‌లోని పంచాయతీరాజ్ శాఖలో ఏఈగా పనిచేస్తోంది. ఈమె విధుల నిమిత్తం నర్సాపూర్ వెళ్లేందుకు ప్యాసింజర్ ఆటో ఎక్కారు. æ నర్సాపూర్ మండలం రుస్తుంపేటకు చెందిన ఐశ్వర్య లక్ష్మి (20) కొంపల్లిలోని ఇగ్నైట్ ఐఏఎస్ అకాడమీలో డిగ్రీ మూడవ సంవత్సరం చదువుతోంది. ఉదయం కాలేజీకి వెళ్లి అక్కడ విద్యార్థులు లేకపోవడంతో తిరిగి బహుదూర్‌పల్లిలో ఆటో ఎక్కింది.
⇒ ప్రవీణ్ నర్సాపూర్ మండలం ఎల్లారెడ్డిగూడ తండా వాసిగా, అనసూయ కౌడిపల్లి గ్రామానికి చెందిన వారుగా గుర్తించారు. æ కారు నడిపిన వ్యక్తి మెదక్‌లో తన పిల్లలను హాస్టల్‌లో వదిలి తిరిగి హైదరాబాద్ వస్తున్నారని తెలిసింది. ఈయన వివరాలు ఇంకా తెలియలేదు. ప్రమాదంలో 2 ఆటోలు నుజ్జునుజ్జు అయ్యాయి. మితిమీరిన వేగమే ప్రమాదానికి కారణమని పోలీసులు చెబుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment