పండుగ వేళ భయానక రోడ్డు ప్రమాదాలు.. 14 మంది మృతి | 14 Members Died In Uttarakhand And Nasik Roads Accidents, Check More Details Inside | Sakshi
Sakshi News home page

పండుగ వేళ భయానక రోడ్డు ప్రమాదాలు.. 14 మంది మృతి

Published Mon, Jan 13 2025 7:38 AM | Last Updated on Mon, Jan 13 2025 10:28 AM

Uttarakhand And Nasik Roads Accidents Many People Dead

ముంబై/డెహ్రాడూన్‌: ఉత్తరాఖండ్‌, మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాద ఘటనలు చోటుచేసుకున్నాయి. ఆదివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదాల కారణంగా 14 మంది మృతిచెందారు. మరో 20 మందికి పైగా ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. దీంతో, గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

ఉత్తరాఖండ్‌లో ఘోర బస్సు ప్రమాదం జరిగింది. పౌరీ జిల్లాలోని దహల్చోరి ప్రాంతంలో బస్సు అదుపు తప్పి 100 మీటర్ల లోతైన లోయలో పడిపోయింది. ఈ ప్రమాదంలో ఆరుగురు మృతి చెందగా, 16 మంది తీవ్రంగా గాయపడ్డారు. ప్ర‌మాదంపై సమాచారం అందుకున్న రెస్క్యూ టీం ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టింది. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించిన‌ట్టు అధికారులు తెలిపారు. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 22 మంది ప్రయాణికులు ఉన్నట్లు అధికారులు తెలిపారు.

ఈ ప్రమాదంపై ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.

మరోవైపు.. మహారాష్ట్రలోని నాసిక్‌లోని ద్వారకా సర్కిల్‌ వద్ద ఆదివారం రాత్రి టెంపో-ట్రక్కు ఢీకొన్న ప్రమాదంలో ఎనిమిది మంది మృతిచెందారు. ఈ ఘటనంఓ మరో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. దీంతో, వారిని స్థానిక ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ప్రమాదం జరిగిన సమయంలో టెంపో వాహనంలో 16 మంది ప్రయాణిస్తున్నట్టు పోలీసులు తెలిపారు. వీరంతా పుణ్యక్షేత్రాలు దర్శించుని ఇంటికి వెళ్తున్న సమయంలో ప్రమాదం జరిగినట్టు సమాచారం. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement