nasik
-
ఫైరింగ్ ప్రాక్టిస్‌లో విషాదం.. ఇద్దరి అగ్ని వీరుల మృతి
ముంబై: మహారాష్ట్రలోని నాసిక్ జిల్లాలోని ఆర్టిలరీ సెంటర్ విషాదం చోటు చేసుకుంది. ఫైరింగ్ ప్రాక్టీస్ చేస్తున్న సమయంలో ఇండియన్ ఫీల్డ్ గన్ నుంచి షెల్ పేలడంతో ఇద్దరు అగ్నివీరులు మరణించారు. ఈ ఘటన గురువారం మధ్యాహ్నం నాసిక్ రోడ్ ప్రాంతంలోని ఆర్టిలరీ సెంటర్లో జరిగిందని పోలీసు ఉన్నతాధికారులు వెలిపారు. ఈ పేలుడులో అగ్నివీరులు.. గోహిల్ విశ్వరాజ్ సింగ్ (20), సైఫత్ షిత్ (21) మృతి చెందినట్లు తెలిపారు.STORY | Two Agniveers killed as shell explodes during firing practice in #NashikREAD: https://t.co/lPzSFYotFb pic.twitter.com/lBdQhzJcyQ— Press Trust of India (@PTI_News) October 11, 2024క్రెడిట్స్: Press Trust of Indiaఅగ్నివీర్ల బృందం ఇండియన్ ఫీల్డ్ గన్‌తో కాల్పులు జరుపుతుండగా అందులోని షెల్ ఒకటి పేలిపోయింది. దీంతో ఇద్దరు అగ్ని వీరులు తీవ్ర గాయాలపాలు అయ్యారు. వెంటనే వారిని డియోలాలిలోని ఎంహెచ్ ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే వారు మృతిచెందనట్లు డాక్టర్లు ప్రకటించారు. హవల్దార్ అజిత్ కుమార్ ఫిర్యాదు మేరకు డియోలాలి క్యాంపు పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి తదుపరి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. -
నాసిక్‌లో హిట్ అండ్ రన్.. మహిళ మృతి
నాసిక్: ముంబయిలో బీఎండబ్ల్యూ కారు ఢీకొట్టి మహిళ మృతి చెందిన ఘటన మరువక ముందే మరో హిట్ అండ్ రన్ ఘటన మహారాష్ట్రలో జరిగింది. నాసిక్ నగరంలోని గంగాపూర్ రోడ్డులో 36 ఏళ్ల వైశాలి షిండేను వెనుక నుంచి వేగంగా వచ్చిన కారు ఢీకొట్టింది. కారు వేగంగా ఢీకొట్టడంతో ఆమె ఏకంగా 20 మీటర్ల దూరంలో ఎగిరి పడింది. ఈ దృశ్యాలు సీసీ కెమెరాలో నమోదయ్యాయి. ఈ ఘటనలో మహిళ ప్రాణాలు కోల్పోయింది. మహిళను ఢీకొట్టిన అనతరం కారు ఆగకుండా వెళ్లిపోయింది. ఈ మధ్యే ముంబయి నగరంలోని వర్లిలో దంపతులు స్కూటర్‌పై వెళుతుండగా వెనుక నుంచి వేగంగా వచ్చిన బీఎండబ్ల్యూ కారు వారిని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో మహిళ దుర్మరణం పాలయింది. కారు ఢీకొట్టడమే కాకుండా మహిళను ఒకటిన్నర కిలోమీటరు దూరం ఈడ్చుకెళ్లింది. ఈ కేసులో నిందితుడు, అధికార శివసేన నేత కొడుకు అయిన మిహిర్షాను మూడు రోజుల తర్వాత అరెస్టు చేశారు. అంతకుముందు ఇదే ఏడాది పుణెలో పోర్షే కారు ఢీకొట్టిన ఘటనలో ఇద్దరు సాఫ్ట్వేర్ ఇంజినీర్లు మృతిచెందిన ఘటన దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. -
ఏం బుర్రరా అయ్యా! చిరుతకే షాకిచ్చాడు..!
చిరుతపులి వస్తే పెద్దవాళ్లమే కంగారు పడిపోతాం.. అస్సలు ఏం చేయాలో తోచదు.. కానీ ఒక 12 ఏళ్ల బుడ్డోడు మాత్రం భలే చాకచక్యంగా వ్యవహరించాడు. అదీ చాలా తాపీగా...దీనికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజీ వైరల్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. సీసీటీవీలో రికార్డైన ఈ ఘటన నాసిక్‌లోని మాలేగావ్‌లో వెలుగుచూసింది. మోహిత్ అహిరే (12) ఇంటి మెయిన్ డోర్ తలుపు దగ్గరే ఉన్న సోఫాలో కూర్చుని స్మార్ట్‌ఫోన్ మొబైల్ గేమ్‌లో మునిగిపోయాడు. ఇంతలో ఎక్కడినుంచి వచ్చిందో తెలియదుగానీ, నేరుగా ఇంట్లోకి వచ్చేసింది చిరుతపులి. అనూహ్యంగా మోహిత్‌కి అతి సమీపంనుంచే లోపలికి దర్జాగా ఎంట్రీ ఇచ్చేసింది. ఇది చూసిన మోహిత్ ఏమాత్రం కంగారు పడకుండా అక్కడినుంచి లేచి, బయటికి వచ్చేసి, తలుపు లాక్ చేశాడు. ఈ దృశ్యాలు సీసీటీవలో రికార్డ్ అయ్యాయి. అతని రియాక్షన్ ఇపుడు ఇంటర్నెట్లో ప్రశంసల్ని దక్కించు కుంటోంది. వన్య ప్రాణులు ఎదురుపడి నపుడు ప్రశాంతంగా ఉండటం, అక్కడినుంచి తప్పించుకోవడం అనే విషయాలను గుర్తు చేసింది. What an amazing presence of mind Mohit Ahire, a 12-year-old boy, locked a leopard inside an office cabin until assistance arrived in Malegaon & the leopard was rescued. Mohit immediately informed his father, who is a security guard, that he trapped a leopard inside the office. pic.twitter.com/FELlOGac1t — Anshul Saxena (@AskAnshul) March 6, 2024 మోహిత్ అహిరే తండ్రి మ్యారేజ్ హాల్లో సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్నాడు. ఆఫీస్ క్యాబిన్లో కూచుని గేమ్ ఆడుకుంటుండగా మంగళవారం ఉదయం 7 గంటల ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఫారెస్ట్ అధికారులు వచ్చేంతవరకు ఆఫీసు క్యాబిన్లో దానిని బంధించారు. ‘‘ముందు దాన్ని చూడగానే షాక్ అయ్యా..కానీ, వెంటనే తేరుకుని బైటపడ్డా..తలుపును వేగంగా లాక్ చేశా..’’అంటూ తన అనుభవాన్ని గుర్తు చేసుకున్నాడు మోహిత్ అంతకుముందే సమీప నివాస ప్రాంతంలో చిరుతపులిని గమనించారు స్థానికులు. తరువాత మ్యారేజ్ హాల్ యజమానికి ఫిర్యాదు మేరకు పోలీసులు, అటవీశాఖ అధికారులు , అధికారులు వేగంగా స్పందించారు. ఐదేళ్ల మగ చిరుతపులిని బంధించారు. సమీపంలోనే వ్యవసాయ పొలాలు, నది ఉండటం వల్ల ఈ ప్రాంతంలో అప్పుడప్పుడు చిరుతపులులు కనిపిస్తున్నాయని అటవీశాఖ అధికారులు తెలిపారు. -
మూడు కొండలెక్కితేగానీ చేరుకోని ఆ ఆలయానికి..
హిందూ దేవుళ్లలో హనుమంతుని ఉన్న స్థానం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. చిన్న పెద్ద తారతమ్యం లేకుండా అంతా హనుమంతుడిని భక్తిగా కొలుస్తారు. అలాంటి హనుమంతుని జన్మస్థలంగా భావించే నాసిక్‌లో అంజనేరి కొండల వద్ద ఉన్న ఆ స్వామి గుడిని సందర్శించడాని భక్తులు ఎన్నో ప్రయాసలు పడి వెళ్లాల్సి వస్తోంది. నిటారుగా ఉన్న ఆ రహదారి వెంబడి వెళ్లాలంటే సుమారు రెండు నుంచి మూడు గంటలు పడుతోంది. దీంతో కేంద్ర ప్రభుత్వం ఈ ఆలయానికి త్వరితగతిన చేరుకునేలా రోప్‌వే నిర్మించాలని నిర్ణయించింది. వచ్చే రెండేళ్లలో బ్రహ్మగిరి ట్రెక్కింగ్ పాయింట్ నుంచి అంజనేరి కొండల వరకు ఈ రోప్ వేని నిర్మించనుంది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా(ఎన్హెచ్ఏ1) పర్వరత్మల పథకం కింద ఈ ప్రాజెక్ట్‌కి సంబంధించిన టెండర్లను ఆహ్వానించింది. ఇక హనుమంతుని జన్మస్థలం అయిన అంజనేరి కొండలు వద్ద ఆ స్వామికి సంబంధించిన గుహ తోపాటు అంజనీమాత ఆలయం కూడా ఉంది. వీటిని యాత్రికులు, ట్రెక్కర్లు సందర్శిస్తారు. సుమారు 4 వేల అడుగులకు పైగా ఎత్తులో ఉన్న ఈ ఆలయానికి చేరుకోవాలంటే మూడు పర్వతాలు ఎక్కాలి. ఇక్కడకు 5.7 కి.మీ పొడవున్న రోప్‌వే మూడు పర్వతాల మీదుగా వస్తే పైకి వెళ్లే ప్రయాణం కొన్ని నిమిషాలకు తగ్గిపోతుంది. కాగా, 2024 నాటికి మొత్తం 18 రోప్‌వే ప్రాజెక్టులను కేంద్ర ప్లాన్ చేస్తునట్లు సమాచారం. (చదవండి: కోడి ముందా.. గుడ్డు ముందా? ఎట్టకేలకు సమాధానం ఇచ్చిన శాస్త్రవేత్తలు) -
నాసిక్: బావిలో పడిపోయిన రెండు చిరుతలు
-
బాలికల నెత్తిన బరువు
‘నో వాటర్ ల్యాండ్’ ఇది త్వరలో రాబోతున్న డాక్యుమెంటరీ. మహారాష్ట్రలో నీళ్లు లేని ప్రాంతాలలో బాలికల జీవితం నీళ్లు మోయడంలోనే ఎలా గడిచిపోతున్నదో ఈ డాక్యుమెంటరీ తెలియచేయనుంది. యు.కెలోని స్వచ్ఛంద సంస్థ ‘వెల్స్ ఆన్ వీల్స్’ స్థాపకుడు షాజ్ మెమొన్ దీనిని నిర్మిస్తుండగా అవార్డ్ విన్నింగ్ దర్శకుడు సౌమిత్రా సింగ్ దర్శకత్వం వహించాడు. నీళ్లు బాలికల బాల్యాన్ని మన దేశంలోని చాలా చోట్లఎలా ధ్వంసం చేస్తున్నాయో ఈ డాక్యుమెంటరీ కళ్లకు కట్టనుంది. మహారాష్ట్రలోని నాసిక్ జిల్లాలో దందిచి బరి అనే చిన్న గ్రామం ఉంది. దానికి ‘భార్యలు పారిపోయే ఊరు’ అనే పేరు ఉంది. ఆ ఊరికి కోడళ్లుగా వచ్చిన వారు రెండో రోజున, మూడో రోజున పుట్టింటికి పారిపోతారు. దానికి కారణం ఆ ఊళ్లో నీళ్లు ఉండవు. దూరం వెళ్లి తేవాలి. మిట్టలు పల్లాలు ఎక్కి దిగాలి. గంటల తరబడి నీరు ఊరే వరకు ఆగాలి. ఆ తర్వాత మోయాలి. ఇవన్నీ చేయడం కంటే భర్త లేకుండా బతకడం మేలు అని ఆ ఊరి భార్యలు పారిపోతుంటారు. ఇప్పుడైతే ఆ ఊరికి పిల్లనిచ్చేవారు లేరు. నాసిక్ జిల్లాలో నీటి సమస్య అంత తీవ్రం దీని పొరుగునే ఉన్న మరో జిల్లా థానేలో దింగన్‌మల్ అనే గ్రామం ఉంది. దీనికి ‘బహు భార్యల ఊరు’ అనే పేరు ఉంది. ఎందుకంటే అక్కడ ఒక్క మగాడు ఇద్దరు లేక ముగ్గురిని వివాహం చేసుకుంటాడు. ఒకరు వంట చేసేందుకు, ఒకరు నీళ్లు మోసేందుకు. ఎందుకంటే ఆ ఊరి నుంచి నీరు తెచ్చుకోవడానికి రోజులో ఆరు గంటలు వెచ్చించాలి. అంతసేపు నీళ్లకే పోతే వంటా గింటా జరిగే చాన్సు లేదు. అందుకని ‘నీటి భార్యలు’ ఇక్కడ ప్రతి ఇంటా ఉంటారు. పెద్ద భార్యే వెతికి ‘నీటి భార్య’ను తెస్తుంది. భర్త తనకు పోషించే శక్తి లేకపోయినా ఇద్దరిని కట్టుకోవాల్సిందే. లేకుంటే బతకడం కష్టం. పెద్దలకే ఇన్ని కష్టాలు ఉంటే మరి ఆడపిల్లల పరిస్థితి ఏమిటి? మహారాష్ట్రలో నీటి కరువు ఉన్న అన్ని ప్రాంతాల్లో నీటి సమస్య బాధిస్తున్నది బాలికలనే. భర్త సంపాదించడానికి వెళ్లాలి కాబట్టి కొడుకులు బాగా చదువుకోవాలి కాబట్టి నీటి బాధ్యత వారికి ఉండవు. తల్లి కాని కుమార్తెగాని నీరు మోయాలి. ‘బడికి వెళ్లి చదువుకోవాలనే మా కలలు కల్లలే అవుతున్నాయి’ అని అక్కడి ఆడపిల్లలు అంటారు. స్కూళ్లలో పేర్లు నమోదు చేసుకున్నా వీరు రోజూ స్కూలుకి వెళ్లడం సాధ్యం కాదు. అరగంట దూరంలో ఉండే బావి నుంచి ఒక బిందెను మోసుకు వస్తారు. అలా నాలుగు బిందెలు తేవాలంటే రెండు గంటల సమయం గడిచిపోతుంది. ఆరు బిందెలకు మూడు గంటలు. నిత్య నరకం 7 సంవత్సరాల బాలికల నుంచి 18 సంవత్సరాల యువతుల వరకు ఈ నీటి మోతకు బానిసలుగా మార్చబడతారు. తల్లిదండ్రులకు వేరే మార్గం కూడా ఉండదు. ముఖ్యంగా వేసవిలో బాలికల కష్టాలు చెప్పనలవి కావు. ‘తల మీద మోయడం వల్ల తల దిమ్ముగా ఉంటుంది. భుజాలు నొప్పి పెడతాయి. ఛాతీలో బరువు. కాళ్లు లాగుతాయి’ అని ఇక్కడి ఆడపిల్లలు చెబుతారు. వేసవిలో ఈ ప్రాంతంలో 40 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత ఉంటుంది. ‘ఆ ఎండలో వెళ్లి నీళ్లు తేవాలంటే చాలాసార్లు ఆడపిల్లలు స్పృహ తప్పి పడిపోతుంటారు. హాస్పిటల్లో చేరిస్తే అదో ఖర్చు’ అని తల్లిదండ్రులు వాపోతుంటారు. ఏ సంవత్సరం తీసుకున్నా కనీసం 2000 మంది ఆడపిల్లలు మహారాష్ట్రలో నీళ్లు లేని జిల్లాల్లో స్కూళ్లకు నాగా పెడుతుంటారు. వీరి చదువు ఇలా ఒడిదుడుకుల్లో పడటం వీరి భవిష్యత్తుగా పెద్ద విఘాతంగా మారుతోంది. డాక్యుమెంటరీ అయితే తను ఒక్కడే ఈ పని చేస్తే నీటి సమస్య తీరదు. దేశంలో ఎక్కడెక్కడ నీళ్ల వల్ల ఆడపిల్లలు చదువుకు దూరం అవుతున్నారో ఆ ప్రాంతాలన్నిటినీ గుర్తించి తరుణోపాయాలు ఆలోచించాలని పిలుపునిస్తాడు షాజ్. అందుకే ‘నో వాటర్ ల్యాండ్’ అనే డాక్యుమెంటరీ నిర్మించాడు. దీనికి గతంలో నసీరుద్దీన్ షాతో షార్ట్ ఫిల్మ్ తీసి అవార్డు పొందిన సౌమిత్రా సింగ్ దర్శకత్వం వహించాడు. త్వరలో ఈ డాక్యుమెంటరీ ప్రేక్షకుల ముందుకు రానుంది. l వెల్స్ ఆన్ వీల్స్ యు.కెలో డెంటల్ రంగంలో పని చేస్తున్న వ్యాపారవేత్త షాజ్ మెమెన్ మహారాష్ట్రలో బాలికల నీటి కష్టాలను తగ్గించి వారిని చదువుకు దగ్గర చేర్చాలని నిశ్చయించుకున్నాను. ‘నాకు కూతురు పుట్టాక హటాత్తుగా నాకు ఈ విషయం గుర్తుకు వచ్చింది. నా కూతురు ఉదయాన్నే లేచి నీళ్లకోసం కష్టపడాల్సిన పని లేదు. నేరుగా స్కూల్‌కి వెళ్లిపోయేంత నీటి సౌకర్యం ఇక్కడ ఉంది. కాని భారత్‌లో అలా కాదు. ఆడపిల్లలు నీటి బరువు కింద నలిగిపోతున్నాడు. వారి కోసం ‘వెల్స్ ఆన్ వీల్స్’ అనే సంస్థను స్థాపించాను’ అంటాడు షాజ్ మెమెన్. ఇతను నేల మీద దొర్లించుకుంటూ (లాక్కుంటూ) వచ్చే నీళ్ల డ్రమ్ముల సరఫరా మహారాష్ట్రలో మొదలెట్టాడు. ఒక్కో డ్రమ్ములో 45 లీటర్ల నీళ్లు పడతాయి. హై క్వాలిటీ ప్లాస్టిక్ డ్రమ్ములు కనుక (అవి 7000 కిలోమీటర్ల దూరం లాగినా పాడు కావు) వీటిని సులువుగా లాక్కుంటూ రావచ్చు. మూడు బిందెల నీళ్లు ఈ ఒక్క డ్రమ్ములో పడతాయి కనుక మూడు ట్రిప్పుల కాలం మిగిలి ఆడపిల్లలు ఇప్పుడు స్కూళ్లకు వెళుతున్నారు. నాసిక్‌లోని ఐదు ఊళ్లలో వెల్స్ ఆన్ వీల్స్ పేరుతో నీళ్ల డ్రమ్ముల సరఫరా జరిగింది. -
Viral: కళ్లు పోతేనేం.. అతని పట్టుదలముందు ఏ కష్టమైనా దిగదుడుపే!
కష్టాలు అందరికీ వస్తాయి! ఐతే అవి కొందరిని ఉతికి ఆరేస్తాయి. మరికొందరేమో వాటినే ఉతకడంలో రాటుతేలిపోతారు. ఇటువంటి వాళ్లకి ఓడిపోవడం అస్సలు ఇష్టముండదు. ఇప్పుడు మీరు తెలుసుకోబోయే వ్యక్తి ఈ రెండో కోవకి చెందినవాడు. కష్టపడే తత్వం, పట్టుదల కలిగిన ఇటువంటి వారిముందు విధి సైతం తలవంచవల్సిందే! తాజాగా చూపుకోల్పోయిన వృద్ధుడి జీవనపోరాటానికి చెందిన వీడియో ఒకటి నెట్టింట వైరల్ అవుతుంది. మొత్తం క్లిప్ చూస్తే అతని అంకిత భావం అవగతమౌతుంది. విధి నిర్థాక్షిణ్యంగా చూపుకోల్పోయేలా చేసినప్పటికీ ప్రతిరోజూ తను చేసే పనిని మాత్రం ఆపకుండా చేసుకుపోతున్నాడండీ! దీనిని చూసిన నెటిజన్లు ప్రశంశలతో ముంచెత్తుతున్నారు. అసలీ వీడియోలో ఏముందంటే.. నాసిక్‌లోని మఖ్మలబాద్ రోడ్డు పక్కనే ఇతని అరటి చిప్స్ దుకాణం ఉంది. మరుగుతున్న నూనెలో అరటి చిప్స్ చకచకా వేసి, బాగా వేగాక వాటిని ఒక పెద్ద గరిటెతో పక్కనే ఉన్న బేసిన్లో వేస్తాడు. తర్వాత హెల్పర్ వాటిని ఉప్పుకారంతో బాగాకలిపి ప్లాస్టిక్ కవర్లో ప్యాక్‌చేయడం ఈ వీడియోలో కన్పిస్తుంది. దీనికి సంబంధించిన వీడియోను శాన్స్కర్ స్కేమణి అనే వ్యక్తి ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశాడు. ‘ఈ ఓల్డ్మాన్కి మర్యాద ఇవ్వండి. నాసిక్‌లో మీకు తెలిసిన వారెవరైనా ఉంటే ఈ వృద్ధుడు తయారు చేసిన చిప్స్ కొనమని చెప్పండి. ఇలా చేయడం ద్వారా అతనికి తిరిగి చూపును ప్రసాదించడంలో మనమందరం సహాయపడగలం’ అనే కాప్షన్‌ను ఈ పోస్టుకు జోడించాడు. ఈ వీడియో ద్వారా అతని చూపుకోసం విరాళాలు సేకరిస్తున్నాడట కూడా. కాగా ధర్మల్ పవర్ ప్లాంట్‌లోని వేడి, ఆవిరి కారణంగా అతను చూపు కోల్పోయాడని అధికారిక సమాచారం. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఇప్పటికే 12 లక్షల మంది దీనిని వీక్షించారు. దీనిని చూసిన నెటిజన్లు ఈ వ్యక్తి స్థితిని చూసి చలించిపోతున్నారు. అతని హార్డ్ వర్క్‌ను ప్రశంశించకుండా ఉండలేకపోతున్నారు. మీరు కూడా చూడండి!! చదవండి: నెలకు అక్షరాలా రూ. 3 లక్షలు సంపాదిస్తున్న బాతు.. ఎలాగంటే.. View this post on Instagram A post shared by Sanskar Khemani 🐒 (@sanskarkhemani) -
మల్చింగ్.. ఇక సులభం!
ఎత్తు మడులపై మల్చింగ్ షీట్ పరిచి ఉద్యాన పంటలు పండించడానికి సాధారణంగా ట్రాక్టర్‌కు అనుసంధానం చేసే పరికరాన్ని ఉపయోగిస్తుంటారు. ఎకరానికి 6 నుంచి 8 మంది కూలీల అవసరం ఉంటుంది. ఒక రోజు నుంచి రోజున్నర సమయం పడుతుంది. అయితే, సులువుగా, తక్కువ ఖర్చుతో మల్చింగ్ షీట్‌ను పరిచే పరికరాన్ని మహారాష్ట్రలోని నాసిక్‌కు చెందిన యువకుడు రూపొందించారు. కేవలం ఇద్దరు మనుషులతో, 8 గంటల్లోనే ఎకరంలో మల్చింగ్ షీట్ పరచడానికి ఉపయోగపడే మల్చింగ్ పరికరాన్ని యువ ఉపాధ్యాయుడు, రైతు నితిన్ ఘలే పాటిల్ రూపొందించారు. నాసిక్‌లోని శివాజీ నగర్లో గల అభినవ్ బాల్‌వికాస్ మందిర్ పాఠశాలలో నితిన్ ఉపాధ్యాయుడుగా పనిచేస్తూనే వ్యవసాయాన్ని మక్కువతో చేస్తుంటారు. గత ఏడాది మే నెలలో తన 7 ఎకరాల భూమిలో టమాటో, మిరప, బంతిపూలను సాగు చేయటం కోసం ఎత్తుమడులపై మల్చింగ్ షీట్ పరవాలని అనుకున్నాడు. అయితే, కూలీల కొరత వల్ల సాధ్యంకాలేదు. ఆ క్రమంలో మల్చింగ్ షీట్ పరిచే ప్రక్రియను సులభతరం చేసే పరికరాన్ని తయారు చేసుకునే ప్రయత్నం చేశాడు. తన వద్ద ఉన్న పాత ఇనుము వస్తువులను ఉపయోగించి, సొంత ఆలోచన ప్రకారం వెల్డింగ్ చేయించి ఒక పరికరాన్ని రూపొందించాడు. ట్రాక్టర్‌కు అనుసంధానం చేసి దీన్ని ఉపయోగించే ప్రయత్నం చేశాడు. మల్చింగ్ షీట్ చిరిగిపోతుండటంతో.. ట్రాక్టర్ లేకుండా మనుషులు ఈడ్చుకుంటూ వెళ్తూ మల్చింగ్ షీట్ పరిచేలా మార్పులు చేశాడు. పరికరం అడుగున చక్రాలను అమర్చటంతోపాటు.. పరిచిన షీట్‌పై మట్టి ఎగదోయడానికి వీలుగా రెండు ఇనుప బ్లేడ్లను అమర్చడంతో ఈ పరికరం సిద్ధమైంది. 15 రోజులు కష్టపడి అనేక విధాలుగా మార్పులు చేస్తూ చివరికి విజయం సాధించారు. తన పొలంలో ఉపయోగించడంతోపాటు మరో ఇద్దరు రైతులకు కూడా ఈ పరికరాన్ని ఇచ్చి పరీక్షించానన్నారు నితిన్. ‘మా ప్రాంతంలో ఎకరంలో మల్చింగ్ షీట్ పరచడానికి 12 మంది కూలీలు అవసరం. వారి కూలి, తిండితో కలిపి రూ. 8 వేల వరకు రైతుకు ఖర్చవుతుంది. నేను ఈ పరికరాన్ని రూ. 10 వేలకే తయారుచేసి ఇస్తున్నాను. ఒక్కసారి కొనుక్కుంటే చాలు. ఇద్దరు మనుషులతో దీనితో మల్చింగ్ షీట్ పరచవచ్చు. ఎకరాన్ని 8 గంటల్లోనే పూర్తి చేయవచ్చు. చిన్న రైతులకు ఇది చాలా బాగా ఉపయోగపడుతోంది. కూలీలతో కూడా పనిలేకుండా రైతు కుటుంబ సభ్యులే దీన్ని ఉపయోగించవచ్చు. సోషల్ మీడియా ద్వారా తెలుసుకొని కొద్ది రోజుల్లోనే వంద మంది రైతులు ఇది కావాలన్నారు..’ అని నితిన్ (98909 82432) సంతోషంగా చెప్పారు. తన టొమాటో తోటలో నితిన్ పాటిల్ -
Fact Check: వ్యాక్సిన్ తీసుకుంటే అయస్కాంత లక్షణాలు!
ముంబై: కరోనా మహమ్మారి రాకతో ప్రపంచం మొత్తం పూర్తిగా అతలాకుతలామయ్యింది. ప్రపంచ వ్యాప్తంగా లక్షల సంఖ్యలో మరణాలు సంభవించాయి. కరోనా సెకండ్ వేవ్‌తో మన దేశం కూడా పూర్తిగా కుదేలయ్యింది. కరోనా వైరస్‌ను ఎదుర్కొడానికి వ్యాక్సిన్ ఒక్కటే శ్రీ రామ రక్ష..! అని పరిశోధకులు, ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇప్పటికే తెలిపారు. కాగా ప్రపంచంలోని పలు దేశాల్లో ఇప్పటికే వ్యాక్సినేషన్ ప్రక్రియ మొదలైంది. మన దేశంలో కూడా వ్యాక్సినేషన్ ప్రక్రియను కేంద్ర ప్రభుత్వం వేగవంతం చేసింది. వ్యాక్సిన్ తీసుకున్నవారికి జ్వరం, జలుబు, ఒళ్లు నొప్పులు వస్తాయనే విషయం తెలిసిందే. కాగా, నాసిక్ చెందిన 71 ఏళ్ల అరవింద్ సోనార్ అనే వ్యక్తి వ్యాక్సిన్ తీసుకున్న తరువాత అతడి శరీరం అయస్కాంతంలాగా మారిపోయింది. అరవింద్ మమూలుగానే దగ్గరలో ఉన్న ఆసుపత్రిలో కోవిషిల్డ్ రెండో డోసును వేయించుకున్నాడు. కొన్ని రోజుల తరువాత అతని శరీరం అయస్కాంతంలాగా మారిపోయింది. అతణ్ని శరీరం ఇనుప వస్తువులను, కాయిన్స్‌ను, చెంచాలను అయస్కాంతంలాగా ఆకర్షించుకుంటుంది. అందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌మీడియాలో హల్చల్ చేస్తోంది. ప్రసుత్తం ఈ వీడియో వైరల్‌గా మారింది. నెటిజన్లు ఆ వ్యక్తిని రియల్ లైఫ్ మ్యాగ్నటో(ఎక్స్ మెన్ లోని ఒక సూపర్ హీరో పాత్ర) అని కామెంట్లు చేస్తున్నారు. ఈ విషయంపై జిల్లా మెడికల్ అధికారులు స్సందించారు. ప్రస్తుతం ఈ విషయంపై విచారణ చేస్తున్నామని పేర్కొన్నారు. ఇదిలా ఉండగా.. ఈ విషయంపై సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (సిడిసి) తన వెబ్సైట్లో వ్యాక్సిన్‌ను తీసుకున్న వారి శరీరం ఎలాంటి అయస్కాంత పదార్థాలుగా మారదని తెలిపింది. కోవిడ్-19 టీకాలు తీసుకున్న ప్రదేశంలో ఎలాంటి విద్యుదయస్కాంత క్షేత్రాన్ని ఉత్పత్తి చేయగల పదార్థాలను కలిగి ఉండవని తెలిపారు. కోవిడ్-19 టీకాల తయారీలో ఇనుము, నికెల్, కోబాల్ట్, లిథియం, వంటి మిశ్రమాలకు తావులేదని తెలిపింది. అంతేకాకుండా కరోనాను జయించాలంటే వ్యాక్సినేషన్ ఒక్కటే సరైన మార్గమని తెలిపింది. ఇలాంటి వార్తలను నమ్మకూడదని సీడీసీ పేర్కొంది. View this post on Instagram A post shared by Bol Bhidu (@bolbhidu) చదవండి: వైరల్: మాస్క్ పెట్టుకున్నాడు.. మొహం వింతగా మారిపోయిందే! -
నిర్లక్ష్యమే కాటేసింది
కరోనా వైరస్ మహమ్మారి ఉగ్రరూపం దాల్చిన వేళ మహారాష్ట్రలోని నాసిక్లోవున్న డాక్టర్ జాకీర్ హుస్సేన్ మున్సిపల్ ఆసుపత్రిలో బుధవారం సంభవించిన ఆక్సిజన్ లీక్ ఉదంతంలో 24మంది రోగులు మరణించటం ఎంతో విషాదకరం. ఆసుపత్రికున్న స్టోరేజీ ట్యాంక్ లీక్ కావడంతో ఇంత పెద్ద ప్రమాదం జరిగింది. అయితే ఒక రోగికి సంబంధించిన బంధువు లీక్ సంగతిని సిబ్బందికి చెప్పేవరకూ ఎవరూ గమనించలేదంటే అక్కడ పరిస్థితి ఎంత అధ్వానంగా వుందో అర్థమవుతుంది. కోలుకుంటున్నట్టు కనబడిన తన బంధువు హఠాత్తుగా కళ్లు తేలేయడం చూసి ఆక్సిజన్ సరఫరా కావడం లేదని గ్రహించిన యువకుడు ఆదరాబాదరాగా పరుగెత్తి సిబ్బందికి విషయాన్ని చెప్పేసరికే అంతా అయిపోయింది. ఉదయం పది గంటల ప్రాంతంలో స్టోరేజీ ట్యాంకుకున్న వాల్వు విరిగి లీక్ మొదలుకాగా మధ్యాహ్నానికిగానీ దాన్ని గమనించలేకపోయారు. ఆ సమయానికి పరిస్థితి చేయి దాటి భారీ మొత్తంలో గ్యాస్ లీక్ కావడంతో వెంటిలేటర్లపై వున్న రోగులకు దాదాపు గంటసేపు ఆక్సిజన్ అందకుండా పోయింది. పర్యవసానంగా 24మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ఏడాది మొదట్లో ముంబైలో చిన్న పిల్లల ఆసుపత్రిలో నిప్పురవ్వ రాజుకుని పదిమంది ప్రాణాలు తీసింది. ప్రమాదం జరిగిన సమయానికి అక్కడ వైద్యులుగానీ, నర్సులుగానీ లేరని వెల్లడైంది. ఇప్పుడు జరిగిన ఆక్సిజన్ లీక్ కూడా అలాంటిదే. స్టోరేజీ ట్యాంకు నుంచి ప్రాణవాయువు సక్రమంగా సరఫరా అవుతున్నదో లేదో ఎప్పటికప్పుడు తనిఖీ చేస్తూ సరిదిద్దవలసిన సిబ్బంది నిర్లక్ష్యంగా వున్నారు. వారిని పర్యవేక్షించాల్సినవారూ నిర్లిప్తంగా వుండిపోయారు. ఎవరో రోగి తాలూకు బంధువులు చెబితే తప్ప ఏదో జరిగిందన్న అనుమానం ఎవరికీ కలగలేదు. ప్రజారోగ్య రంగంలో వున్న ఆసు పత్రుల్లో మౌలిక సదుపాయాలు సక్రమంగా వుండవన్న ఫిర్యాదు చాన్నాళ్లుగా వుంది. అవసరమైన పరికరాలు అందుబాటులో వున్నా వాటిని నిర్వహించటానికి అవసరమైన సిబ్బంది కొరత వుంది. తక్కువమంది సిబ్బంది వుండటం వల్ల వున్నవారిపై పని ఒత్తిడి బహుశా ఎక్కువ వుండొచ్చు. కానీ ఇలాంటి సంక్షోభసమయాల్లో అప్రమత్తంగా వుండి ఎక్కడా లోటుపాట్లు లేకుండా చూడాల్సిన బాధ్యత ఆసుపత్రి నిర్వాహకులకు లేదా? ఒకపక్క రోజురోజుకూ కరోనా కేసులు అడ్డూ ఆపూ లేకుండా పెరుగుతున్నాయి. 24 గంటల్లో దేశవ్యాప్తంగా 3.14 లక్షల కేసులు నమోదుకావడం ప్రపంచ రికార్డు. ఆసుపత్రుల్లో రోగులను చేర్చుకోవడానికి అవసరమైన బెడ్లు లేక, వారికి చికిత్స చేసేందుకు తగిన సంఖ్యలో వైద్యులు లేక ప్రస్తుతం పెను సంక్షోభాన్ని ఎదుర్కొనవలసి వస్తోంది. ఇక ఆక్సిజన్ గురించి రాష్ట్రాల మధ్య చిచ్చు రగిలింది. అటు బొంబాయి హైకోర్టు, ఇటు ఢిల్లీ హైకోర్టు ఆక్సిజన్ సరఫరా అరకొరగా వుండటంపై ఆగ్రహావేశాలు వ్యక్తం చేశాయి. ఆక్సిజన్ కొరత ఇంతగా దేశాన్ని వేధిస్తుండగా వున్న నిల్వలను సక్రమంగా వినియోగించలేని స్థితి ఏర్పడటం బాధాకరం. అంతవరకూ కోలుకుంటున్నట్టు కనబడిన వారు... ఒకటి రెండు రోజుల్లో ఆసుపత్రినుంచి క్షేమంగా ఇళ్లకు వెళ్తారనుకున్నవారు కన్నుమూయడం దారుణం. ఇంతకన్నా దారుణమేమంటే... ఆసుపత్రి సిబ్బందిలో ఏ ఒక్కరికీ ఇలాంటి లీకేజీ ఏర్పడితే ఏం చేయాలన్న అంశంలో పెద్దగా అవగాహన లేకపోవడం. అగ్నిమాపక సిబ్బందికి వర్తమానం అందిన వెంటనే వారు రంగంలోకి దిగి గంటలో దాన్ని అదుపు చేయ గలిగారు. కానీ ముందే దాన్ని గమనించి, సరిదిద్దగలిగిన వారుంటే ఇంతమంది ప్రాణాలు కోల్పోయేవారు కాదు. ఆక్సిజన్ లీక్ పర్యవసానంగా దట్టమైన పొగలు ఆవరించి ఏమీ కనబడక పోవడంతో అగ్నిమాపక సిబ్బంది కష్టపడాల్సివచ్చిందంటున్నారు. మన ప్రజారోగ్య రంగం పరమ నాసిరకంగా వుంటున్నది. ఏదో మేరకు సదుపాయాలున్నాయని భావించేచోట కూడా నిర్వహణ సరిగాలేదు. మన దేశీయోత్పత్తిలో ఆరోగ్య రంగానికి వ్యయమవుతున్నది 4 శాతం. ఇందులో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వాటా ఒకటిన్నర శాతమైతే మిగతాదంతా జనం భరించాల్సివస్తోంది. అట్టడుగు ప్రజానీకం సహజంగానే ప్రభుత్వాసుపత్రులను ఆశ్రయిస్తారు. తీరా అక్కడ అడుగడుగునా లోపాలే దర్శనమిస్తాయి. ఆసుపత్రులు ఎలాంటి భవంతుల్లో వుండాలో, అక్కడ భద్రతాపరంగా ఎలాంటి చర్యలు తీసుకోవాలో, వాటి పర్యవేక్షణ ఎలావుండాలో తేటతెల్లం చేసే అంతర్జాతీయ ప్రమాణాలున్నాయి. వాటికి అనుగుణంగా మన ఆసుపత్రులు వుంటున్నాయా లేదా అన్న సంగతిని ఎప్పటికప్పుడు ప్రభుత్వ యంత్రాంగం పర్యవేక్షిస్తున్నప్పుడే అవి సజావుగా వుంటాయి. ఇప్పుడు ప్రమాద ఘటనపై ఎఫ్ఐఆర్ నమోదైంది. బాధ్యులెవరో నిర్ధారించి చర్యలు కూడా తీసుకుంటారు. కానీ ఇలాంటి సమస్యలు మరెక్కడా తలెత్తకుండా ఒక్క మహారాష్ట్ర ప్రభుత్వమే కాదు... దేశంలోని అన్ని రాష్ట్రాలు ముందస్తు చర్యలు తీసుకోవాలి. అన్ని స్థాయిల్లోనూ ఎప్పటికప్పుడు తనిఖీలు, ఎలాంటి ప్రమాద ఘటనలు చోటుచేసుకునే అవకాశం వున్నదో సిబ్బందికి అవగాహన కలిగించటం, అలాంటి సమయాల్లో వెనువెంటనే చేయాల్సిన పనులేమిటో చెప్పటం ముఖ్యం. కళ్లముందు లోటుపాట్లు కనిపిస్తున్నా ఏం జరగదులే అనే భరోసాతో వుండటం క్షేమం కాదు. ఒకపక్క దేశంలో చాలాచోట్ల ఆక్సిజన్ సరఫరా సరిపోక సమస్యలు ఏర్పడుతున్నాయని వార్తలు వస్తుండగా... నాసిక్‌లో ఇలాంటి దుర్ఘటన చోటుచేసుకోవటం విచారకరం. -
‘ఊపిరి’ ఆగింది.. గాల్లోకి 22 ప్రాణాలు
సాక్షి ముంబై: మహారాష్ట్ర నాసిక్‌లో అత్యంత హృదయ విదారకమైన సంఘటన చోటుచేసుకుంది. ఆసుపత్రిలోని ఆక్సిజన్ ట్యాంకుకు లీకేజీ ఏర్పడి ప్రాణవాయువు అందక 24 మంది కోవిడ్ రోగులు ప్రాణాలు కోల్పోయారు. నాసిక్ మున్సిపల్ కార్పొరేషన్‌కు చెందిన జాకీర్ హుస్సేన్ ఆసుపత్రిలో బుధవారం ఈ దారుణం చోటుచేసుకుంది. దుర్ఘటన జరిగిన సమయంలో ఆసుపత్రిలో 150 మంది ఉండగా... అందులో 11 మంది వెంటిలేటర్‌పై... మిగతా వారు ఆక్సిజన్ సపోర్టుపై ఉన్నారు. ఉన్నట్లుండి ఆక్సిజన్ సరఫరా నిలిచిపోవడంతో ఆసుపత్రి బెడ్స్‌పై గిలగిల్లాడుతూ ప్రాణాలు వదిలారు ఈ అభాగ్యులు. లీకేజీ జరిగిన కొద్దిసేపట్లోనే 22 మంది మరణించారు. వీరిలో 11 మంది మహిళలు, 11 మంది పురుషులు ఉన్నారు. అనంతరం సాయంత్రం మరో ఇద్దరు చనిపోయినట్లు అధికారులు వెల్లడించారు. మృతుల్లో 34 నుంచి 77 ఏళ్ల వయసు వాళ్లు ఉన్నారని తెలిపారు. బుధవారం 12.30 గంటల ప్రాంతంలో లీకేజీ గుర్తించిన ఆసుపత్రి సిబ్బంది... ప్రత్యామ్నాయ సిలిండర్లను తెప్పించి ఆక్సిజన్ సరఫరాను పునరుద్ధరించారు. ఈలోపే ఘోరం జరిగిపోయింది. సీరియస్‌గా ఉన్న పేషెంట్లను మరోచోటికి తరలించేందుకు బ్బంది పరుగులు పెట్టడం, ఏం జరుగుతుందో తెలియక రోగుల బంధువుల అర్తనాదాలతో ఆసుపత్రి ఆవరణలో గందరగోళం నెలకొంది. మృతుల బంధువుల రోదనలు మిన్నంటాయి. ఈ దుర్ఘటనలో మొత్తం 24 మంది చనిపోయారని నాసిక్ కలెక్టర్ సూరజ్ మందారే విలేకరులకు తెలిపారు. దేశవ్యాప్తంగా ఈ సంఘటన తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించింది. అసలేమి జరిగింది? నాసిక్‌లోని మున్సిపల్ కార్పొరేషన్ ఆసుపత్రి అయిన జాకీర్ హుస్సేన్ ఆసుపత్రిలో 150 మంది కోవిడ్ రోగులు చికిత్స పొందుతున్నారు. ఆసుపత్రి ఆవరణలో 13 కిలో లీటర్ల సామర్థ్యం కలిగిన ఆక్సిజన్ ట్యాంకు ఉంది. బుధవారం ఉదయం 10 గంటల ప్రాంతంలో ఆక్సిజన్ ట్యాంక్ సాకెట్ ఒకటి విరిగి లీకేజీ ప్రారంభమైంది. అయితే ట్యాంకర్ ద్వారా ట్యాంకులో ఆక్సిజన్ నింపుతుండగా ఇది జరిగిందనేది మరో వాదన. ఇది చూస్తుండగానే అధికమైంది. 12.30 ప్రాంతంలో ఆక్సిజన్ భారీగా లీకవ్వడం మొదలైంది. దీంతో అందరూ ముందుగా భయాందోళనలకు గురయ్యారు. అనంతరం ఈ లీకేజీని అరికట్టేందుకు ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి. కాని లీకేజీ ఆగలేదు. అప్పటికి ట్యాంకులో 25 శాతం మేర మాత్రమే ఆక్సిజన్ ఉండగా... లీకేజీతో అది ఇంకా తగ్గిపోయింది. ట్యాంకులో ప్రెషర్ తగ్గి... పేషెంట్లకు ఆక్సిజన్ అందలేదు. మరోవైపు ఆసుపత్రిలో అరుపులు, కేకలు ప్రారంభమయ్యాయి. అప్పటి వరకు ఆక్సిజన్ లీకేజీ కారణంగా ఇటువైపు ఉన్న అందరి దృష్టి ఒక్కసారిగా అటువైపు మళ్లింది. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న అనేక మంది రోగులు ఆక్సిజన్ అందక నీటి నుంచి బయటపడ్డ చేప పిల్లల్లా కొట్టుకోసాగారు. అక్కడే ఉన్న వారి కుటుంబసభ్యులు, నర్సులు, వైద్యులు ఈ సంఘటనతో అవాక్కయ్యారు. అందుబాటులో ఉన్న సిలిండర్లతో ఆక్సిజన్ అందించేందుకు ప్రయత్నించారు. ఇతర ఆసుపత్రులు నుంచి హుటాహుటిన డ్యూరా సిలిండర్లను తెప్పించారు. ఈ సమయంలో ఆసుపత్రి వర్గాలు కొందరు రోగులకు వేరే ఆసుపత్రికి తరలించే ప్రయత్నాలు కూడా చేపట్టారు. ఆక్సిజన్ ట్యాంకు నిర్వహణ బాధ్యతను చూస్తున్న ప్రైవేటు కంపెనీకి సమాచారం ఇచ్చి వారిని పిలిపించారు. ఇలా సుమారు గంటకుపైగా చేసిన ప్రయత్నాలు అనంతరం మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో లీకేజీని ఆపగలిగారు. కాని అప్పటికే జరగరాని ఘోరం జరిగింది. ఒక్కరు కాదు ఇద్దరు కాదు. ఏకంగా 24 మంది ఆక్సిజన్ అందక మృతి చెందారు. ఈ సంఘటన అనంతరం బంధువుల ఆర్తనాదాలు, రోదనలతో ఆ పరిసరాలలో విషాదం అలుముకుంది. మృతుల కుటుంబాలకు రూ.10 లక్షలు అత్యంత విషాదకరమైన ఈ సంఘటన అనంతరం మృతుల కుటుంబీకులకు మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్దవ్ ఠాక్రే రూ. అయిదు లక్షల చొప్పున పరిహారం ప్రకటించారు. ఈ సంఘటన అత్యంత దురదృష్టకరమైన సంఘటనగా పేర్కొంటూ... ఏం మాట్లాడాలన్నా మాట పెగలడం లేదన్నారు. ముఖ్యంగా ఈ ఘటనకు సంబంథించి అన్ని కోణాల్లో దర్యాప్తు జరిపి దోషులపై చర్యలు తీసుకుంటామన్నారు. ఈ దుర్ఘటనపై విచారణకు ప్రభుత్వం ఏడుగురు సభ్యులతో కమిటీని నియమించింది. మరోవైపు ఈ సంఘటన అనంతరం ఆసుపత్రికి చేరుకున్న నాసిక్ జిల్లా ఇంచార్జీ మంత్రి ఛగన్ భుజ్‌బల్ కూడా మృతుల కుటుంబీకులకు నాసిక్ మున్సిపల్ కార్పొరేషన్ తరఫున రూ. అయిదు లక్షల మద్దతు అందించనున్నట్టు ప్రకటించారు. ఇలా మొత్తం రూ.10 లక్షలు మృతుల కుటుంబీకులకు ఆర్థిక సహాయం అందనుంది. రాష్ట్రపతి, ప్రధాని దిగ్భ్రాంతి న్యూఢిల్లీ: ఆక్సిజన్ సరఫరాలో ఆటంకాలు ఏర్పడి 24 మంది కోవిడ్ రోగులు మృతిచెందడంపై రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ దురదృష్టకర ఘటన తనను తీవ్రంగా కలచివేసిందని పేర్కొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కూడా ఈ ప్రమాదంపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ‘గుండెలను మెలిపెట్టే దురదృష్టకర సంఘటన. తీవ్ర వేదనను కలిగించింది. ఆత్మీయులకు కోల్పోయిన కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నాను..’అని మోదీ ట్వీట్ చేశారు. హోంమంత్రి అమిత్ షా కూడా సంతాపం ప్రకటించారు. మిగిలిన పేషెంట్లు త్వరగా కోలుకోవాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నానన్నారు. నిర్లక్ష్యం కారణంగానే.. ఆసుపత్రి నిర్లక్ష్యం కారణంగానే ఈ సంఘటన చోటుచేసుకుందని మృతుల కుటుంబీకులు ఆరోపించారు. 60 ఏళ్ల తన తల్లిని మంగళవారమే ఈ ఆసుపత్రిలో చేర్చించామని, ఆమె వెంటిలేటర్‌పై ఉందని... ఇలా చనిపోవడానికి ఆమెను ఇక్కడ చేర్పించలేదని లీలా సర్కార్ అనే మహిళ గుండెలవిసేలా రోదించారు. ఊపిరి ఆడట్లేదని అమ్మ చెప్పగానే... నర్సింగ్ సిబ్బందిని పిలిచానని, ఎవరూ పట్టించుకోలేదని వాపోయారు. మరోవైపు తన తమ్ముణ్ని రక్షించుకోలేకపోయానంటూ మరోవ్యక్తి రోదించడం అక్కడున్న వారికి కన్నీళ్లు తెప్పించింది. ఆక్సిజన్ సరిగా సరఫరా కావడంలేదని ముందునుంచే తెలుపుతూ వచ్చామని, అయినా ఆసుపత్రి వారు పట్టించుకోలేదని మరి కొందరు వాపోయారు. ఆసుపత్రి నిర్లక్ష్యానికి ఇంత మంది మరణించారని ఆరోపించారు. చదవండి: ప్రశ్నలు సంధించాల్సిన సమయమిది చదవండి: ప్రపంచ విప్లవోద్యమ చుక్కాని లెనిన్ -
నాసిక్ ఆసుపత్రిలో ఆక్సిజన్ లీక్...
-
ఆక్సిజన్ ట్యాంక్ లీక్ : 22 మంది మృతి
సాక్షి,ముంబై: దేశంలో కరోనా మహమ్మారి తీవ్రతతో ఆక్సిజన్ సిలిండర్ల కొరత పట్టి పీడిస్తోంది. మహారాష్ట్రలోని పలు నగరాల్లో ఆక్సిజన్ కొరత తీవ్రంగా ఉంది. ఈ క్రమంలో మహారాష్ట్ర నాసిక్‌లోని ఓ ఆసుపత్రి వద్ద జరిగిన షాకింగ్ ఘటన తీవ్ర విషాదాన్ని నింపింది. ఈ ప్రమాదంలో 22 మంది రోగులు ప్రాణాలు కోల్పోయారని జిల్లా కలెక్టర్ ప్రకటించారు. ఆక్సిజన్ నింపుతుండగా ఆక్సిజన్ ట్యాంక్ అకస్మాత్తుగా లీక్ కావడం ప్రారంభమైంది. దీంతో ఆ ప్రాంతమంతా గ్యాస్ వ్యాపించడంతో అక్కడ తీవ్ర భయాందోళన వాతావరణం ఏర్పడింది. అగ్నిమాపక దళ సిబ్బందిని తరలించి పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. నగరంలోని జాకీర్ హుస్సేన్ ఆసుపత్రిలో బుధవారం ఈ సంఘటన జరిగింది.ఈ పరిణామంతో ఆక్సిజన్ సరఫరా 30 నిమిషాల పాటు నిలిచిపోయింది. ఫలితంగా ఆక్సిజన్ అవసరమయ్యే 80 మందిలో 31 మంది రోగులను ఇతర ఆసుపత్రులకు తరలించారు. దీనిపై మహారాష్ట్ర ఆరోగ్య మంత్రి డాక్టర్ జాకీర్ హుస్సేన్ స్పందించారు. మరింత సమాచారం సేకరించిన తరువాత ప్రకటన విడుదల చేస్తామని తెలిపారు. (పరిస్థితి చేయిదాటింది.. ప్లీజ్.. జాగ్రత్త: ఏడ్చేసిన డాక్టర్) The tragedy at a hospital in Nashik because of oxygen tank leakage is heart-wrenching. Anguished by the loss of lives due to it. Condolences to the bereaved families in this sad hour. — Narendra Modi (@narendramodi) April 21, 2021 మృతుల బంధువులకు రాష్ట్ర ప్రభుత్వం రూ.5 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించింది. నాసిక్ సంఘటనపై దర్యాప్తునకు ఉన్నత స్థాయి విచారణకు ఆదేశించినట్టు, ముఖ్యమంత్రి కార్యాలయం (సీఎంఓ) వెల్లడించింది. మరోవైపు నాసిక్ విషాదంపై కేంద్ర హోంమంత్రి అమిత్‌షా దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సానుభూతి ప్రకటించారు. కాగా మహారాష్ట్రలో గత 24 గంటల్లో 58,924 కొత్త కోవిడ్-19 కేసులు నమోదయ్యాయని రాష్ట్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. 351 మంది మరణించారు. దీంతోమొత్తం కేసులు 38,98,262కు చేరుకోగా, మరణాల సంఖ్య 60,824కు చేరుకుంది. చదవండి : సూపర్ హీరోలకే హీరో: ప్రశంసలు, బంపర్ గిఫ్ట్ -
ఘోర ప్రమాదం: ఎన్సీపీ నేత సజీవ దహనం
ముంబై: నాసిక్‌లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. కారులో మంటలు చెలరేగిన ఘటనలో నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ) నేత, వ్యాపారవేత్త సంజయ్ షిండే దుర్మరణం చెందారు. డోర్లన్నీ లాక్ కావడంతో బయటపడే మార్గం లేక సాయం కోసం అర్థిస్తూ సజీవ దహనమయ్యారు. వివరాలు.. ద్రాక్ష తోటలు సాగుచేస్తున్న సంజయ్ షిండే ఎరువులు కొనుగోలు చేసేందుకు మంగళవారం సాయంత్రం పింప్లాగావ్‌కు బయల్దేరారు. ముంబై- ఆగ్రా హైవే గుండా ప్రయాణిస్తున్న సమయంలో షార్ట్ సర్య్యూట్ కారణంగా కారులో ఒక్కసారిగా మంటలు అంటుకున్నాయి. సెంట్రల్ లాకింగ్ సిస్టమ్ యాక్టివేట్ అయిపోయింది. (చదవండి: ఒంటికి నిప్పంటించుకున్న వివాహిత) దీంతో డోర్లన్నీ జామ్ అయిపోయాయి. అద్దాలు బద్దలుకొట్టుకుని బయటకు వచ్చేందుకు సంజయ్ షిండే ఎంతగా ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది. ఈ విషయం గురించి ఘటనాస్థలంలో ఉన్న స్థానికులు మాట్లాడుతూ.. కడ్వా నదిపై ఉన్న ఓవర్‌బ్రిడ్జి మీద మంటల్లో కాలిపోతున్న సమయంలో సాయం కోసం ఆయన కేకలు వేశారని, వెంటనే తాము అగ్నిమాపక సిబ్బందికి సమాచారమిచ్చినట్లు తెలిపారు. మంటలార్పేందుకు తాము ప్రయత్నించామని, అయితే అప్పటికే లోపల ఉన్న వ్యక్తి మృతి చెందారని పేర్కొన్నారు. కాగా నాసిక్ జిల్లాకు చెందిన సంజయ్ షిండే ద్రాక్ష పళ్లను ఎగుమతి చేస్తూ వ్యాపారవేత్తగా ఎదిగారు. ఎన్సీపీలో చేరి రాజకీయ నాయకుడిగా స్థానికంగా గుర్తింపు పొందారు. -
నువ్వు నిజంగా సూపర్ బామ్మ!
ముంబై: ఏదైనా సాధించాలనే కోరిక ఉండాలే కానీ వయస్సు కేవలం ఒక సంఖ్య మాత్రమే. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ 70 ఏళ్ల బామ్మ వీడియోను చూస్తే మీరు కూడా తప్పకుండా అది నిజమేనేమో అని అంటారు. ఈ వీడియోలో ఒక మహిళ నాసిక్‌లో ఏటవాలుగా ఉండే హరిహర్ కోటను 70 ఏళ్ల వయసులో ఎక్కి చూపించింది. ఈ వీడియోని చూసిన వారందరూ ఆమెను ప్రశంసిస్తున్నారు. ఈ వయసులో ఎంతో మందికి ఆదర్శంగా నిలిచారంటూ కీర్తిస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా నిలుస్తోంది. హరిహర్ కోట నాసిక్ లోని ఇగత్పురి నుంచి 48 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇది రాక్ కట్ మెట్లకు ప్రసిద్ది చెందింది. ఐఎఫ్ఎస్ ఆఫీసర్ సుధా రామన్ దీనిపై ట్వీట్ చేస్తూ ధృడసంకల్పం ఉండటం వలనే ఆమె ఈ వయసులో కూడా అనుకున్నది సాధించగలిగింది అని చెప్పారు. At the age of 70 yrs, with her sheer determination she made it. Salutes to that willpower. #Inspired pic.twitter.com/fKkk8e7nw8 — Sudha Ramen IFS 🇮🇳 (@SudhaRamenIFS) October 10, 2020 చదవండి: బెడిసికొట్టిన రసగుల్లా బిర్యానీ; నెటిజన్ల ఫైర్ -
సోషల్ మీడియాలో పరిచయం.. ఆపై
ముంబై: భారత యుద్ధ విమానాల రహస్యాలను పాకిస్తాన్ నిఘా సంస్థ ఇంటర్ సర్వీస్ ఇంటలిజెన్స్‌కు(ఐఎస్ఐ) చేరవేస్తున్న హిందుస్తాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్(హెచ్ఏఎల్) ఉద్యోగిని అరెస్టు చేసినట్లు మహారాష్ట్ర పోలీసులు తెలిపారు. దీపక్ శిర్సాత్(41)నాసిక్‌లోని హెచ్ఏఎల్లో అసిస్టెంట్ సూపర్వైజర్గా విధులు నిర్వర్తిస్తూ, సామాజిక మాధ్యమాల ద్వారా పాకిస్తానీ మహిళగా పరిచయం చేసుకున్న వ్యక్తుల ట్రాప్‌లో పడ్డాడు. (చదవండి: రిపబ్లిక్ టీవీ సీఎఫ్ఓకు సమన్లు) ఈ నేపథ్యంలో ఐఎస్ఐతో నిత్యం సంబంధాలు నెరపుతున్నట్టు విశ్వసనీయ సమాచారం అందడంతో, మహారాష్ట్ర యాంటీ టెర్రరిజం స్క్వాడ్ నాసిక్ యూనిట్ అతడిని అదుపులోకి తీసుకున్నట్టు పోలీసులు చెప్పారు. యుద్ధ విమానాల రహస్య సమాచారాలను పాకిస్తాన్‌కు దీపక్ పంపుతున్నట్టు పోలీసులు వెల్లడించారు. అతడి దగ్గర 3 మొబైల్ ఫోన్లు, ఐదు సిమ్ కార్డులు, రెండు మెమొరీ కార్డులను స్వాధీనం చేసుకున్నారు. కోర్టు అతడికి పదిరోజుల ఏటీఎస్ కస్టడీకి అనుమతించింది. -
నాలుగు పిల్లలకు జన్మనిచ్చిన చిరుత
ముంబై: మహారాష్ట్ర నాసిక్‌లోని ఇగత్పురి ప్రాంతంలో ఓ గుడిసెలో ఆడ చిరుత నాలుగు పిల్లలకు జన్మనిచ్చింది. మంగళవారం భూమ్మీద పడ్డ ఈ పసికూనలు ఆరోగ్యంగా ఉన్నాయని అటవీ శాఖ అధికారులు తెలిపారు. మరోవైపు అప్పుడే కళ్లు తెరిచి ఈ లోకాన్ని చూస్తున్న చిరుత పులి కూనలు అటూ ఇటూ తిరుగుతూ ఆడుకుంటున్నాయి. తల్లి మాత్రం అక్కడే ఓ మూలన కూర్చుని ఉంది. పిల్లలు గుడిసంతా కలియదిరుగుతూ పిల్లిపిల్లలా శబ్ధాలు చేస్తున్నాయి. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. (రైల్వే ట్రాక్‌పై చిరుత మృతదేహం) 'పులి పిల్లలే కానీ పిల్లిలా కన్పిస్తున్నాయి', 'ఎంత ముద్దొస్తున్నాయో..', 'మీ కుటుంబం అద్భుతంగా ఉంది' అంటూ నెటిజన్లు వారి స్పందనలను తెలియజేస్తున్నారు. 51 సెకండ్ల నిడివి ఉన్న ఈ వీడియోను ఇప్పటివరకు లక్ష మందికి పైగా వీక్షించారు. మరోవైపు వాటిని ఉన్నఫళంగా అక్కడి నుంచి పంపించివేయడానికి అటవీ అధికారులకు మనసొప్పలేదు. దీంతో తల్లే వాటిని వేరే చోటుకు తీసుకు వెళ్లే సమయం కోసం ఎదురు చూస్తున్నారు. కాగా ఇగత్పురి ప్రాంతంలో పెద్ద సంఖ్యలోనే పులులు ఉన్నట్లు అటవీ శాఖ అధికారి గణేశ్ రావు జోలె పేర్కొన్నారు. (చిరుత కోసం రిస్క్, ‘రియల్ హీరో’పై ప్రశంసలు) -
ఐదు నిమిషాల్లో కరోనా నిర్థారణ
లక్నో: ఉత్తరప్రదేశ్ నాసిక్‌లో ఉన్న ఐటీ సొల్యూషన్స్ కంపెనీ, ఈఎస్డీఎస్ సాఫ్ట్వేర్ కరోనాను నిర్ధారించే పరికరాన్ని కనిపెట్టింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా పనిచేసే ఈ పరికరం ఛాతీ ఎక్సరే ద్వారా కరోనాను నిర్థారణ చేయగలుగుతుంది. దీనికి సంబంధించి ఆ కంపెనీ ప్రతినిధులు మాట్లాడుతూ... తమ టెస్టింగ్ టూల్ ఐదునిమిషాల్లో కరోనాను నిర్థారించగలదని తెలిపారు. ఇంకా వారు మాట్లాడుతూ ఇది పూర్తిగా కాంటాక్ట్ లెస్ పరీక్షా విధానమని తెలిపారు. దీనిలో ఛాతి ఎక్స్- రే రిపోర్టలను తీసుకొని వాటిని వెబ్బ్రౌసర్లో అప్లోడ్ చేయాలని, తరువాత సబ్మిట్ బటన్ నొక్కాలని తెలిపారు. తరువాత వెంటనే అది ఆ వ్యక్తి కరోనాతో బాధపడుతున్నాడో లేదో తెలియజేస్తోందని కంపెనీ ప్రతినిధులు తెలిపారు. (డబ్ల్యూహెచ్ఓలో కేంద్ర మంత్రికి కీలక పదవి) ఈ విధానాన్ని చైనా, ఫ్రాన్స్, ఇజ్రాయిల్, యూకే లాంటి ఇతర దేశాలు కూడా అనుసరిస్తున్నాయని కూడా కంపెనీ పేర్కొంది. దీని ద్వారా ప్రభుత్వ ఆసుపత్రుల్లో పరీక్షలు చేస్తోన్నామని, ఇప్పటి వరకు 8,500 ఛాతి ఎక్స్-రేలను పరీక్షించామని వాటిలో 96 శాతం మంచి ఫలితాలను ఇచ్చాయని తెలిపారు. గవర్నమెంట్ ఆసుపత్రుల్లో ఈ పరీక్షలను ఉచితంగా నిర్వహిస్తున్నామని తెలిపారు. కరోనా కేసలు రోజు రోజుకు పెరిగిపోతున్న ఈ నేపథ్యంలో కరోనాను తొందరగా నిర్థారించడానికి ఇది బాగుంటుందని ఈఎస్డీఎస్ సంస్థ సీఈఓ పియ్యూష్ సొమానీ తెలిపారు. (త్రీస్టార్.. తిరుపతి వన్) -
కొత్త బంగారులోకం చేద్దాం!
నాసిక్: భూతల స్వర్గం కశ్మీర్‌ను మరోసారి కొత్త బంగారు లోకంగా మార్చేద్దామని ప్రధాని మోదీ ఆకాంక్షించారు. ప్రతి కశ్మీరీని హత్తుకుని, కశ్మీర్‌ను మళ్లీ స్వర్గసీమగా మారుద్దామని పిలుపునిచ్చారు. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా గురువారం నాసిక్‌లో జరిగిన ఒక బహిరంగ సభలో ప్రసంగించిన మోదీ.. దశాబ్దాల కశ్మీరీ కష్టాలకు గత కాంగ్రెస్ ప్రభుత్వాలే కారణమని దుయ్యబట్టారు. కశ్మీర్లో హింసను ప్రజ్వరింపజేసేందుకు సరిహద్దులకు ఆవలి నుంచి నిర్విరామ ప్రయత్నాలు కొనసాగుతున్నాయని పాకిస్తాన్‌పై ధ్వజమెత్తారు. ఉగ్రవాదం, హింసల నుంచి కశ్మీర్, లద్దాఖ్ ప్రజలను దూరం చేసేందుకు ఆర్టికల్ 370 రద్దు నిర్ణయం తీసుకున్నామన్నారు. ‘దశాబ్దాల హింసాత్మక వాతావరణం నుంచి బయటపడాలని యువత, తల్లులు, సోదరీమణులు నిర్ణయించుకున్నారు. వారికి ఉద్యోగాలు, అభివృద్ధి కావాలి. జమ్మూకశ్మీర్, లద్దాఖ్‌లలోని సమస్యలన్నింటినీ పరిష్కరించేందుకు మేం కట్టుబడి ఉన్నాం’ అని మోదీ వివరించారు. దేశంలోని యాభై కోట్ల పాడి పశువులకు టీకాలు వేయించాలని తమ ప్రభుత్వం నిర్ణయిస్తే.. ఇదో రాజకీయ నిర్ణయమని విమర్శిస్తున్నారని, పశువులు ఓట్లు వేయవన్న సంగతి వారు గుర్తుచేసుకోవాలని మోదీ ఎద్దేవా చేశారు. ఛత్రపతి శివాజీ వంశస్తుడు బహూకరించిన తలపాగాతో మోదీ బహిరంగ సభలో పాల్గొన్నారు. సైనిక అవసరాలను వారు పట్టించుకోలేదు జాతీయ భద్రతపై గత యూపీఏ ప్రభుత్వం కనీస శ్రద్ధ చూపలేదని మోదీ విమర్శించారు. సైనిక బలగాల కోసం 2009లో 1.86 లక్షల బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లు కావాలన్న డిమాండ్‌ను పట్టించుకోలేదని గుర్తు చేశారు. ‘2014లో బీజేపీ నేతృత్వంలోని ప్రభుత్వం కేంద్రంలో అధికారంలోకి వచ్చిన తరువాత మాత్రమే ఆ డిమాండ్ నెరవేరింది. అప్పటివరకు సరిహద్దుల్లో మన జవాన్లు అవి లేకుండానే ప్రాణాలొడ్డి విధులు నిర్వర్తించేవారు. అంతేకాదు, ఇప్పుడు భారత్‌లో తయారయ్యే బుల్లెట్‌ప్రూఫ్ జాకెట్లు దాదాపు 100 దేశాలకు ఎగుమతి అవుతున్నాయి’ అని మోదీ వివరించారు. పవార్‌పై విమర్శలు... పాకిస్తాన్ అంటే తనకిష్టమన్న ఎన్సీపీ సీనియర్ నేత శరద్ పవార్ వ్యాఖ్యలపై మోదీ ధ్వజమెత్తారు. ‘శరద్ పవార్‌కు ఏమైంది? అంతటి సీనియర్ నేత పాకిస్తాన్ విషయంలో ఇలాంటి వ్యాఖ్యలు చేస్తూంటే బాధగా ఉంది. ఆయనకు పొరుగు దేశమంటే ఇష్టం కావచ్చుగానీ.. ఉగ్రవాదం మూలాలు ఎక్కడున్నాయో అందరికీ తెలుసు’ అని మోదీ వ్యాఖ్యానించారు. జమ్మూ కశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్ 370ని రద్దు చేయాలన్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయానికి ఎన్సీపీతోపాటు ఇతర ప్రతిపక్షాలు సహకరించలేదని, మద్దతుగా నిలవలేదని మోదీ విమర్శించారు. కాంగ్రెస్ నేత రాహుల్ పేరు ప్రస్తావించకుండానే... కొందరు నేతలు చేస్తున్న వ్యాఖ్యలను భారత వ్యతిరేక శక్తులకు ఊతమిస్తున్న దేశాలు తమకు అనుకూలంగా మార్చుకుంటున్నాయని మోదీ చెప్పారు. రామమందిర నిర్మాణంపై.. మిత్రపక్షం శివసేనపైనా మోదీ విమర్శలు గుప్పించారు. సేన పేరును ప్రస్తావించకుండా.. రామ మందిర నిర్మాణం విషయంలో కొందరు పెద్ద నోరేసుకుని మాట్లాడుతున్నారని, వారంతా సుప్రీంకోర్టు తీర్పు వచ్చేవరకు సంయమనం పాటించాలన్నారు. న్యాయవ్యవస్థపై నమ్మకముంచాలని చేతులు జోడించి కోరుతున్నానన్నారు. మందిర నిర్మాణం కోసం ఇంకా ఎన్నాళ్లు ఎదురుచూడాలని, అందుకు కేంద్రం ఓ కొత్త చట్టం రూపొందించాలని తాము చాన్నాళ్లుగా కోరుతున్నామని శివసేన నేత ఉద్ధవ్ ఠాక్రే సోమవారం వ్యాఖ్యానించడం తెల్సిందే. -
పంచవటి ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణికుల విధ్వంసం
ముంబై : తేజాస్ ఎక్స్‌ప్రెస్ విధ్వంసం గుర్తుండే ఉంటుంది. ఆకతాయిలైన ప్రయాణికులు, సీట్లకు ముందున్న ఎల్సీడీ స్క్రీన్లను ధ్వంసం చేయగా.. మరికొందరు హెడ్ఫోన్లను ఎత్తుకెళ్లారు. వ్యాక్యూమ్ టాయిలెట్‌ను కంపు కంపు చేశారు. ఈ సంఘటన ఇంకా మర్చిపోనే లేదు. అప్పుడే ముంబై-నాసిక్ పంచవటి ఎక్స్‌ప్రెస్‌లోనూ ఇదే రకమైన విధ్వంసకర వాతావరణం చోటు చేసుకుంది. ఈ రైలు సర్వీసును అప్‌గ్రేడ్ చేసిన నాలుగు నెలల్లోనే, ట్రే టేబుల్స్‌ను, కర్టెన్లను చెల్లాచెదురు చేశారు. అంతేకాక కిటికీలను పగులగొట్టారు. హెల్త్‌కు చెందిన రెగ్యులేటర్లను, కుళాయిలను, లగేజ్ ర్యాక్‌ల గ్లాస్‌లను ప్రయాణికులు బ్రేక్ చేశారు. చెత్తాడబ్బాలను, అద్దాలను ఎత్తుకుపోయారు. రైళ్లలో తరుచూ జరుగుతున్న ఈ సంఘటనలతో, సెంట్రల్ రైల్వే ఇప్పటికీ రిఫైర్ బిల్లుగా రూ.9 లక్షల మేర ఖర్చు చేసింది. ప్రయాణికులు వారికి అందిస్తున్న సౌకర్యాలను సరిగ్గా వినియోగించుకోవడం లేదని రైల్వే అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇదే విషయంపై ఫిబ్రవరి 7న రైల్వే మంత్రిత్వశాఖ అన్ని జోనల్ రైల్వేస్‌కు ఒక లేఖ రాసింది. ఈ విషయాన్ని రైల్వే బోర్డు విచారణ జరుపుతుందని తెలిపింది. గంటకు 200 కిలోమీటర్ల స్పీడుతో, తేజాస్ ఎక్స్‌ప్రెస్ లాంచ్ అయిన సంగతి తెలిసిందే. సెమీ-లగ్జీర ట్రైన్ అయిన దీన్ని గోవా నుంచి ప్రారంభించారు. గోవా నుంచి ఇది ముంబైకు ఒక ట్రిప్ వేసింది. ఇక అంతే తిరుగు ప్రయాణంలో ప్రయాణికులు ఈ రైలు విండోలను పగలగొట్టారు. హెడ్ఫోన్లను దొంగలించారు. ఈ సంఘటనలతో రైళ్లలో అందిస్తున్న సౌకర్యవంతమైన సర్వీసులను తీసివేయాలని రైల్వే శాఖ భావించింది. అయితే రోజూ ట్రాక్‌లపై చాలామంది ప్రాణాలు తీసుకుంటున్నారని, అలాగని ముంబై సబ్అర్బన్ సర్వీసులను రైల్వే ఆపివేస్తుందా అని రైల్ యాత్రి పరిషద్ అధ్యక్షుడు సుభాష్ గుప్తా ప్రశ్నించారు. అలాగే పగిలిపోయిన ఎల్సీడీ స్క్రీన్లను మొత్తంగా తీసివేయడం కంటే, వాటిని బాగు చేయడం మంచిదని పేర్కొన్నారు. ఒకవేళ ఆ సౌకర్యాలను తీసివేస్తే, టిక్కెట్ ఛార్జీలను కూడా తగ్గించాలని ప్రయాణికుల అసోసియేషన్ డిమాండ్ చేస్తోంది. -
శంబాజీకి షోకాజ్ నోటీసులు
సాక్షి, ముంబై : తన తోటలోని మామిడి పళ్లు తింటే కొడుకులు పుడతారంటూ వివాదస్పద వ్యాఖ్యలు చేసిన హిందుత్వ నేత శంబాజీ బిదేకు నాసిక్ మున్సిపల్ కార్పొరేషన్ షోకాజ్ నోటీసు జారీ చేసింది. ‘మీ తోటలోని పళ్లు తిని మగ పిల్లల్ని సంతానంగా పొందిన జంట వివరాలు పేర్లతో సహా వెల్లడించాల్సి ఉంటుంది. మీరు చేసిన వ్యాఖ్యలను నిరూపించుకోవాల్సిన ఆవశ్యకత ఉందంటూ’ నోటీసులో పేర్కొంది. కాగా రాయ్‌గఢ్‌లో మరాఠాల యోధుడు చత్రపతి శివాజీ మహారాజ్ బంగారు సింహాసనాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ నాసిక్‌లో ర్యాలీ నిర్వహించిన శంబాజీ.. ‘మామిడి పళ్లలో మంచి పోషకాలుంటాయని, తమ తోట మామిడి పళ్లు తిన్న జంటలకు మగ పిల్లలే పుట్టారని’ వ్యాఖ్యానించారు. ‘ఇప్పటి వరకు ఈ విషయాన్ని నా తల్లికి మినహా ఎవరికి చెప్పలేదు. నాతోటలోని మామిడి పండ్లు తిన్న 150 జంటలకు 180 మంది మగపిల్లలు జన్మించారు. ఎవరికైనా మగపిల్లలు కావాలనిపిస్తే ఈ మామిడి పండ్లు తినండి. సంతానలేమి సమస్యతో బాధపడే దంపతులకు కూడా ఈ మామిడి పండు ఉపయోగపడుతోంది.’ అని శాంబాజీ చెప్పుకొచ్చారు. ఈ వ్యాఖ్యలపై మండిపడిన న్యాయవాది, సామాజిక వేత్త అబా సింగ్... మూఢనమ్మకాలను ప్రచారం చేస్తోన్న శంబాజీపై చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్ చేశారు. -
దైవ దర్శనానికి వెళ్లొస్తూ.. మృత్యు ఒడిలోకి..
సాక్షి ముంబై: 23 మందితో తీర్థ యాత్రలకు వెళ్లి తిరిగి వస్తున్న మినీ ట్రావెల్ బస్సు రోడ్డుపై ఉన్న ఇసుక ట్రక్కును ఢీ కొనడంతో బస్సులో ఉన్న 10 మంది దుర్మరణం చెందారు. మరో 13 మందికి తీవ్రగాయాలయ్యాయి. వీరిలో 9 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిసింది. ఈ ఘటన నాసిక్ జిల్లా చాంద్‌వడ్ తాలూకా సోగ్రాస్ గ్రామం వద్ద గురువారం వేకువ జామున 5.30 గంటల ప్రాంతంలో చోటుచేసుకుంది. మృతుల వివరాలు పూర్తిగా తెలియరాలేదు. మృతి చెందిన వారిలో ఏడుగురు మహిళలు, ఓ బాలుడున్నారు. మరణించిన వారందరూ కల్యాణ్, ఉల్లాస్‌నగర్‌తోపాటు నాసిక్ వాసులుగా గుర్తించారు. తెల్లవారు జామున.. సాయిట్రావెల్స్‌కు చెందిన మినీ బస్సులో డ్రైవర్‌తోపాటు మొత్తం 23 మంది సోమవారం తీర్థయాత్రలకు బయలుదేరారు. మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయినీ ఓంకారేశ్వర్ పుణ్యక్షేత్రాలను దర్శించుకుని బుధవారం రాత్రి తిరుగు ప్రయాణమయ్యారు. తెల్లవారుజాము వరకు ప్రయాణం సాఫీగానే సాగింది. తెల్లవారుతుండటంతో నిద్రలోనుంచి అçప్పుడప్పుడే కొందరు మేల్కొనసాగారు. అంతలోనే ఊహించని సంఘటన చోటుచేసుకుంది. ఒక్కసారిగా భారీ శబ్దం.. అసలేం జరిగిందో తెలుసుకునేలోపే ఆ పరిసరాలన్నీ రక్తపు మడుగులో ఎర్రగా మారిపోయాయి. క్షతగాత్రుల అర్తనాధాలతో ఆ పరిసరాలన్నీ మారుమోగాయి. ఇలా సూర్యోదయం చూడకముందే ఘటనా స్థలంలోనే ఐదుగురు విగత జీవులయ్యారు. ప్రమాద సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. స్థానికులు, ఇతర వాహన చోదకుల సహాయంతో గాయపడ్డ వారందరినీ స్థానిక ఆసుపత్రులకు తరలించారు. అయితే మరో ఐదుగురు చికిత్స పొందుతూ మరణించారు. మిగిలిన 13 మందిలో తొమ్మిది మంది పరిస్థితి విషమంగా ఉండటంతో నాసిక్ జిల్లా ఆసుపత్రికి తరలించారు. వీరిలో ఉల్లాస్‌నగర్‌కు చెందిన మినీ బస్సు డ్రైవర్ సంతోష్ పిఠలే (38)కూడా ఉన్నారు. అయితే మృతుల వివరాలు ఇంకా తెలియరాలేదు. గాయాలైన వారిలో కాలిదాస్ వాసోదా (38) రాధీ రాఠోడ్ (40), జమునా చవాన్ (70), మంజూ గుజరాతీ (31), ప్రగతీ గుజరాతి (12, కాశిక్ ధావ్ (14), కల్యాణ్ గుజరాత్ (60), ధనూ పరమార్ (60), వసూదుమయా (54), బ్రిజేష్ మల్హోత్రా (20), అజయ్ మల్హోత్రా (45), డ్రైవర్ సంతోశ్ పిఠలేతోపాటు ట్రక్కు క్లీనర్ మాలీకిలు ఉన్నారు. టైర్ పగలడంతోనే....? మినీ బస్సు టైరు పగలడంతోనే ఈ సంఘటన జరిగిందని పోలీసులు ప్రాథమికంగా భావిస్తున్నారు. ఇసుక లోడ్‌తో వెళ్తున్న ట్రక్కు మొరాయించడంతో రోడ్డు పక్కన నిలిపి మరమ్మతులు చేయసాగారు. అయితే అంతలోనే వేగంగా వస్తున్న మినీ బస్సు ట్రక్కును ఢీ కొట్టింది. టైర్ పగలడంతో మినీ బస్సుపై డ్రైవర్ నియంత్రణ కోల్పోయాడని దీంతోనే ట్రక్కును ఢీ కొట్టిందని తెలిసింది. దీంతో దైవ దర్శనానికి వెళ్లి.. చివరికి మృత్యు ఒడిలోకే వెళ్లిపోయారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. -
కూతుర్ని రేప్ చేసిన కొడుకుని కాపాడేందుకు..
- ఐదేళ్ల చిన్నారిపై తండ్రి అత్యాచారం - కొడుకును కాపాడేందుకు మనవరాల్ని చంపిన నానమ్మ నాసిక్: ఐదేళ్ల పసిమొగ్గను కన్నతండ్రే చిదిమేశాడు. ఈ విషయం బయటికి తెలిస్తే పరువుపోతుందని నానమ్మే ఆ పాపను చంపేసింది. మహారాష్ట్రలోని నాసిక్‌లో చోటుచేసుకున్న ఈ దారుణ సంఘటన గురించి పోలీసులు తెలిపిన వివరాలిలాఉన్నాయి.. సచిన్ షిండే అనే వ్యక్తి కుటుంబంతో కలిసి నాసిక్ సమీప జవులేక్‌వాని గ్రామంలో నివసిస్తున్నాడు. శుక్రవారం రాత్రి ఇంట్లో డ్యూటీ నుంచి తిరిగొచ్చిన అతను.. ఐదేళ్ల కూతురిపై అత్యాచారానికి ఒడిగట్టాడు. సచిన్ ఈ దారుణానికి పాల్పడుతుండగా అతని తల్లి అనుసాయా చూసింది. మృగాన్ని అడ్డుకొని, పాపను కాపాడాల్సిందిపోయి ఆమె మరింత రాక్షసంగా ఆలోచించింది. కూతుర్ని రేప్ చేశాడని తెలిస్తే సచిన్‌ను పోలీసులు పట్టుకెళతారని భయపడి.. మనవరాలి గొంతు నులిమి చంపేసింది! ఆ సమయంలో సచిన్ భార్య ఇంట్లో లేదు. పాప శవాన్ని తీసుకెళ్లి సమీపంలోని ఓ స్కూల్ గోడ వద్ద పడేసింది అనుసాయా. అనంతరం పోలీస్ స్టేషన్‌కు వెళ్లి, తన మనవరాలిని ఎవరో కిడ్నాప్‌చేసి, హత్యచేశారని తప్పుడుకేసు పెట్టింది. రంగంలోకి దిగిన పోలీసులు డాగ్ స్క్వాడ్‌తోపాటు పాప మృతదేహా వద్దకు వెళ్లరు. వాసన పసిగట్టిన పోలీసు జాగిలాలు షిండే ఇంటివైపునకు పరుగెత్తాయి. దీంతో పోలీసులకు అనుమానాలు మొదలయ్యాయి.. సచిన్, అతని తల్లి అనుసాయాలను అదుపులోకి తీసుకుని విచారించగా నేరాన్ని అంగీకరించారని, సచిన్‌పై అత్యాచారం, పోక్సో చట్టంకింద, అనుసాయాపై హత్యానేరంకింద కేసులు నమోదుచేసి రిమాండ్‌కు తరలించామని డీఎస్పీ దేవిదాస్ పాటిల్ మీడియాకు చెప్పారు. -
నాసిక్‌లో తగ్గని ఆందోళనలు
-
9 గంటల్లో 99 సెం.మీ. వర్షపాతం
నాసిక్‌లో భారీ వర్షాలు.. పొంగుతున్న గోదావరి నాసిక్/న్యూఢిల్లీ : ఎడతెగని వర్షాలతో మహారాష్ట్రలోని నాసిక్ జిల్లా అతలాకుతలమవుతోంది. జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో కలిపి ఆదివారం ఉదయం 8 నుంచి సాయంత్రం 5 గంటల మధ్య 99.1 సెం.మీ వర్షపాతం నమోదైంది. కేవలం 9 గంటల్లోనే ఇంత వర్షం పడడంతో గోదావరి నదిలో వరద మొదలై జనజీవనం స్తంభించిపోయింది. గోదావరి తీరంలో నిలిపిఉంచిన మూడు కార్లు వరదలో కొట్టుకుపోయాయి. ఈ వర్షాలకు నాసిక్ నగరానికి ప్రధాన తాగునీటి వనరైన గంగాపూర్ ఆనకట్ట 23 శాతం నిండింది. కరువు కారణంగా మేలో వట్టిపోయిన చారిత్రాత్మక రామ్‌కుండ్ ఆనకట్ట కూడా ఇప్పుడు పూర్తిగా నిండి పొంగిపొర్లుతోంది. నాసర్ది నదిలోనూ ప్రవాహం పెరిగింది. రాబోయే 24 గంటల్లో నాసిక్‌లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం తెలిపింది. మధ్యప్రదేశ్‌లో కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలకు మృతుల సంఖ్య 15కు పెరిగింది. దేశంలోని 89 శాతం ప్రాంతాల్లో సాధారణ, అధిక వర్షపాతాలు నమోదయ్యాయి. గుజరాత్‌లోని అధిక భాగాలు, సిక్కిం మినహా మిగతా ఈశాన్య రాష్ట్రాలన్నీ లోటు వర్షపాతాన్ని చవిచూశాయి. దేశం మొత్తం మీద జూన్1 నుంచి జూలై 10 మధ్యలో 25.4 సెం.మీ వర్షపాతం నమోదైంది. దేశంలో 26 శాతం ప్రాంతాల్లో అధిక, 63 శాతం ప్రాంతాల్లో సాధారణ, 11 శాతం ప్రాంతాల్లో లోటు వర్షపాతాలు నమోదయ్యాయి.