నాసిక్: స్థానిక పారిశ్రామికవేత్త ఒకరు కారుకు మంటలు అంటుకోవడంతో సజీవ దహనమయ్యారు. స్థానిక పారిశ్రామిక వేత్త రిచర్డ్ మార్షల్ డిసౌజా ఉత్తర మహారాష్ట్ర గోవర్ధనే గ్రామం సమీపంలో మారుతి 800 కారులో వస్తుండగా హఠాత్తుగా మంటలు అంటుకున్నాయి. అంగవైకల్యం వలన ఆయన కారును ఆధునీకరించి బ్రెక్, క్లచ్ చేతితోనే ఉపయోగిస్తారు. మంటులో చుట్టుముట్టడంతో కారు నుంచి బయటకు రాలేక అందులోనే సజీవంగా దాహనమయ్యాడని తెలిసింది.
సీ అండ్ ఎం ఫార్మింగ్ కంపెనీకి డిసౌజా వ్యవస్థాపకుడే కాక చెర్మైన్‌గా వ్యవహరిస్తున్నారు. కారులో మంటలు ఎలా చెలరేగాయనే విషయంలో ఇంకా అంచనాకు రావాల్సి ఉందని పోలీసు అధికారులంటున్నారు.