industrialist
-
భారత రత్న ఇవ్వాల్సిన మనిషి
ఇటీవల మరణించిన పారిశ్రామిక దిగ్గజం రతన్ టాటా దేశ అత్యున్నత పౌర పురస్కారం ‘భారత రత్న’కు అన్ని విధాలుగా అర్హుడు. ఆయన సమర్థుడైన వ్యాపారవేత్త. దార్శనిక దృక్పథమున్న పారిశ్రామివేత్త మాత్రమే కాదు... మనుషుల పట్ల సహానుభూతి, ఆప్యాయతలు కలిగిన మంచి మనిషి. రతన్ టాటాను చాలామంది కేవలం ఆరాధించలేదు; హీరోగా భావించారు. ఇప్పటికీ సమయం మించిపోలేదు. మరణానంతరమైనా ఆయనకు భారత రత్న ఇవ్వడం ద్వారా మనల్ని మనం గౌరవించుకునే పని మొదలు కావాలి. వేర్వేరు రంగాల్లో అర్హులైన వాళ్లు ఇంకా చాలామందే ఉన్నారు. వాళ్లకూ ఈ పుర స్కారం దక్కి ఉంటే బాగుండేది. భారత రత్న విషయంలో రాజకీయ అనుకూలతల కంటే, అర్హతలకు ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరం ఉంది.పారిశ్రామిక దిగ్గజం రతన్ టాటా ‘భారత రత్న’కు అన్ని విధాలుగా అర్హుడే. అయితే బతికున్న రోజుల్లోనే అవార్డు ఇచ్చి ఉంటే బాగుండేది. ఇటీవలే రతన్ టాటా మరణించిన నేపథ్యంలో మరణానంతరం ఆయనకు దేశ అత్యున్నత పౌర పురస్కారం ఇస్తారా?మరణానంతరమైనా సరే... రతన్ టాటాకు భారత రత్న పురస్కారాన్ని ఇవ్వాలి అనేందుకు బోలెడు కారణాలు కనిపిస్తాయి. వాటిల్లో ఒకటి, ఆయన సమర్థుడైన వ్యాపారవేత్త. దార్శనిక దృక్ప థమున్న పారిశ్రామివేత్త కూడా. మనుషుల పట్ల సహానుభూతి, ఆప్యాయతలు కలిగిన మంచి మనిషి. అయితే ఇలాంటి లక్షణాలు కలిగిన వాళ్లు చాలామందే ఉన్నారు. టాటాను వీరందరి నుంచి వేరు చేసే లక్షణం ఏదైనా ఉందీ అంటే... అది ఆయన అందరి నుండి పొందిన గౌరవం, మర్యాద, మన్ననలు. రతన్ టాటాను చాలా మంది కేవలం ఆరాధించలేదు; హీరోగా భావించారు. ఒకరకంగా చెప్పాలంటే పూజించారు అనాలి! ఇలాంటి వాళ్లు కొందరే కొందరు ఉంటారు. వారిలో రతన్ టాటా ఒకరు!రెండో విషయం... మనం ఆదర్శంగా భావించే వ్యక్తికి లభించే గుర్తింపు కూడా ఆ స్థాయిలోనే ఉండాలని ఆశిస్తాం. ఎందుకంటే వీళ్లు కేవలం సాధకులు మాత్రమే కాదు... చాలా ప్రత్యేకమైన వాళ్లు. అందుకే దేశంలోనే అత్యున్నత పౌర పురస్కారం అలాంటి వారికి దక్కడం ఎంతైనా ఆహ్వానించదగ్గ విషయం.దేశంలో ఇప్పటివరకూ 53 మందికి భారత రత్న పురస్కారం లభించింది. టాటా వీరందరిలోనూ ఉన్నతుడిగానే నిలుస్తారు. బి.సి. రాయ్, పి.డి. టండన్ , కె. కామరాజ్, వి.వి. గిరి, ఎం.జి. రామచంద్రన్ , రాజీవ్ గాంధీ, అరుణా అసఫ్ అలీ, గుల్జారీలాల్ నందా, గోపీనాథ్ బోర్డోలోయి, కర్పూరీ ఠాకూర్, చౌధురీ చరణ్‌సింగ్... లాంటి రాజకీయ నాయకుల విషయంలో అది నిజం కాదా?ఇంకోలా చెబుతాను. మదర్ థెరీసా, ఎం.ఎస్.సుబ్బులక్ష్మి, అమర్త్య సేన్ , పండిట్ రవిశంకర్, లతా మంగేష్కర్, బిస్మిల్లా ఖాన్ , భీమ్సేన్ జోషీ, సచిన్ టెండూల్కర్... అందరూ భారత రత్నకు అర్హుల నుకుంటే, రతన్ టాటాకు ఎలా కాదనగలం?వాస్తవం ఏమిటంటే... ఈ అవార్డు ఇచ్చేది రాజకీయ నాయకులు. వాళ్లు ఎక్కువగా రాజకీయ నాయకులకే ఇస్తూంటారు. ఇప్పటివరకూ అందుకున్న 53 మందిలో 18 మంది మాత్రమే ఇతర రంగాల్లో అత్యు న్నత ప్రతిభను కనబరిచినవారు. 1954 నుంచి తొలిసారిగా భారత రత్న పురస్కారం ప్రదానం చేయడం మొదలుపెట్టినప్పటి నుంచీ ఇప్పటి వరకూ ఒకే ఒక్క పారిశ్రామిక వేత్త, అత్యంత అర్హుడైన జేఆర్డీ టాటాకు మాత్రమే ఆ అవార్డు దక్కింది. అంతే!వేర్వేరు రంగాల్లో అర్హులైన వాళ్లు ఇంకా చాలామందే ఉన్నారు. వాళ్లకూ ఈ పురస్కారం దక్కి ఉంటే బాగుండేదని నేను అనుకుంటూంటాను. బాలీవుడ్ నటుడు దిలీప్‌కుమార్, అమితాబ్ బచ్చన్ , ఫీల్డ్ మార్షల్ మానెక్‌శా, సల్మాన్ రుష్దీ, జూబిన్ మెహతా వంటి వాళ్లు ఒక్కొక్కరూ తమ వైయక్తిక ప్రతిభతో ఆ యా రంగాల్లో అత్యున్నత శిఖరాలను అందుకున్న వారే. ప్రపంచం వీరి ప్రతిభను గుర్తించింది, కీర్తించింది. దురదృష్టవశాత్తూ మనం ఆ పని చేయలేకపోయాం.ఇప్పటికీ సమయం మించిపోలేదు. రతన్ టాటాకు భారత రత్న ఇవ్వడం ద్వారా మనల్ని మనం గౌరవించుకునే పని మొదలు కావాలి. బి.ఆర్.అంబేడ్కర్, సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్, అబుల్ కలావ్‌ు ఆజాద్, మదన్ మోహన్ మాలవీయా వంటి వారికి మరణానంతరం దశాబ్దాల తరువాత భారత రత్న ఇవ్వగలిగినప్పుడు... 2008లో మరణించిన ఫీల్డ్ మార్షల్ మానెక్శాకు, 2021లోనే కన్ను మూసిన దిలీప్‌కుమార్‌తోపాటు మనతోనే ఉన్న అమితాబ్ బచ్చన్,సల్మాన్ రుష్దీ, జూబిన్ మెహతా వంటి వారిని భారత రత్నతో సత్కరించడం సాధ్యమే! అయితే ఇక్కడ మనం ఇంకో నిష్ఠుర సత్యాన్ని అర్థం చేసు కోవాలి. భారత రత్న విషయంలో రాజకీయ అనుకూలతల కంటే అర్హతలకు ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరం ఉంది. పేర్లు అవసరం లేదు. వారి భేషజాలను దెబ్బతీయాలన్న ఆలోచన కూడా నాకు లేదు. కానీ, వారందరూ రాజకీయ నేతలే. జవహర్లాల్ నెహ్రూతో మొదలుపెట్టి... నరేంద్ర మోదీ వరకూ అన్ని ప్రభుత్వాలూ ఈ పని చేశాయి.విషాదం ఏమిటంటే... మనం తరచూ కొంతమంది అనర్హులకు భారత రత్న ఇచ్చాం. ఇంకోలా చెప్పాలంటే అర్హులకు నిరాకరించాం. ఎలాగైతేనేం, ఆ అవార్డు గౌరవమైతే మసకబారింది. అర్హులకు ఇవ్వలేదు, అనర్హులకు ఇచ్చారన్న వాదాన్ని కాసేపు పక్కనపెట్టి... జరిగిన దానికి ప్రాయశ్చిత్తం చేసుకోవాల్సిన సమయం ఇదే. దేశమాత అసలు ఆణిముత్యాలను ప్రజలెప్పుడూ గుర్తుంచుకుంటారు. సందేహం ఏమీ లేదు. రతన్ టాటా అంత్యక్రియలకు హాజరైన వేలాది మంది సామాన్యులు ఈ విషయాన్ని మరోసారి నిర్ధ్ధరించారు. వార్తాపత్రికల్లో పేజీలకు పేజీ కథనాలు, టెలివిజన్ ఛానళ్లలో గంటల లైవ్ కవరేజీలన్నీ రతన్ టాటాపై ఈ దేశ ప్రజలకు ఉన్న అభిమానాన్ని చాటేవే! ఎవరూ కాదనలేని సత్యమిది. అలాగని రాజ్యం ఆయనను గుర్తించదంటే మాత్రం సరికాదు. నన్నడిగితే అలా చేయడం క్షమించలేనిది.కరణ్ థాపర్వ్యాసకర్త సీనియర్ జర్నలిస్ట్ -
అక్షరాలా భారత రత్నమే!
నిదానంగా కదులుతూ... ముక్కుసూటిగా మాట్లాడుతూ... విలువలను ఎత్తిపడుతూ కూడా అన్యులకు అసాధ్యమైన సమున్నత శిఖరాలను చేరుకోవచ్చని ఆరు దశాబ్దాల తన ఆచరణతో దేశానికి చాటిచెప్పిన దిగ్గజ పారిశ్రామికవేత్త రతన్ టాటా బుధవారం రాత్రి కన్నుమూశారు. ఆయన అక్షరాలా రత్నం. సార్థక నామధేయుడు. చెదరని వినమ్రత, సడలని దృఢ సంకల్పం, లక్ష్యసాధనకు ఎంత దూరమైనా వెళ్లే లక్షణం... విశాల టాటా సామ్రాజ్యంలో ఆయనను విలక్షణ వ్యక్తిగా నిల బెట్టాయి. కనుకనే మూడు దశాబ్దాల పాటు ఆ సామ్రాజ్యానికి ఆయన అక్షరాలా చక్రవర్తిగానే వ్యవహరించారు. నిజమే... ఆయన 1962లో సాధారణ ఉద్యోగిగా చేరిననాటికే దేశంలో అదొక అత్యున్నత శ్రేణి సంస్థ కావొచ్చుగాక. పైగా సంస్థ సారథులకు ఆయన అతి దగ్గరివాడు, బంధు వర్గంలో ఒకడు కూడా! కానీ ఆయన ఎదుగుదలకు తోడ్పడినవి అవి కాదు. ఆయన అంకితభావం, దీక్షాదక్షతలు, నిరంతర తపన ఆయనను అంచెలంచెలుగా పైపైకి చేర్చాయి. పేరుకు ఒక సంఘటిత సంస్థే అయినా, అప్పటికే లక్షలమంది సిబ్బందికి చల్లని నీడనిచ్చే కల్పవృక్షంగా పేరుతెచ్చుకున్నా... టాటాల సామ్రాజ్యం విభిన్న సంస్థల సమాహారం మాత్రమే! అందులో సమష్టితత్వం, దిశ, దశా నిర్దేశించే ఉమ్మడి తాత్విక భూమిక శూన్యం. జమ్షెడ్జీ టాటా, జేఆర్డీ టాటా వంటివారు నేతృత్వం వహించిన ఆ సంస్థలో నాయకత్వ స్థానం దక్కాలంటే అడుగడుగునా అవరోధాలు తప్పలేదు. నెత్తురు చిందకపోవచ్చు... గాయాల జాడ లేకపోవచ్చు, కానీ రోమన్ సామ్రాజ్యకాలం నాటి కలోసియంలను తలపించే బోర్డు రూంలో తన ఆలోచనలనూ, తన భావనలనూ బలంగా వినిపించి ప్రత్యర్థుల వాదనలను పూర్వపక్షం చేయటం మాటలు కాదు. తన ప్రతి పలుకూ, ప్రతి వివరణా నిశితంగా గమనించే, ప్రశ్నించే ఆ బోర్డు రూంలో గెలవటం సాధారణం కానే కాదు. కానీ రతన్ అవన్నీ అవలీలగా చేయగలిగారు. నిష్క్రమిస్తున్న చైర్మన్జేఆర్డీ టాటా ఆశీర్వాదం పుష్కలంగా ఉన్నా అప్పటికే భిన్న సంస్థలకు సారథులైనవారు సామాన్యులు కాదు. అప్పటికింకా టిస్కోగానే ఉన్న టాటా స్టీల్‌కు రూసీ మోదీ సారథి. పారిశ్రామిక రంగంలో ఆయన మోత మోగిస్తున్నాడు. జమ్షెడ్ఫూర్లో కొలువుదీరిన ఆ సంస్థకాయన మకుటంలేని మహారాజు. అజిత్ కేర్కర్ ఇండియన్ హోటల్స్‌లో తనదైన ముద్ర వేసుకున్నాడు. దర్బారీ సేల్ టాటా కెమికల్స్‌లో తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నాడు. వీళ్లెవరూ రతన్ టాటాను సీరియస్‌గా తీసుకోలేదు. అతన్ని అవలీలగా అధిగమించవచ్చనుకున్నారు. రతన్ తన పేరులో చివరున్నరెండక్షరాల పుణ్యమా అని ఇంత దూరం వచ్చాడు తప్ప ‘సరుకు’ లేదనుకున్నారు. ఆయన రాకపై ఆలోచించటం సమయాన్ని వృథా చేసుకోవడమే అనుకున్నారు. కానీ రతన్ పరిశీలనాశక్తి అమోఘ మైనది, అనితర సాధ్యమైనది. ఈ మహాసామ్రాజ్యంలో ఏం జరుగుతున్నదో, లోపాలేమిటో అచిర కాలంలోనే పసిగట్టాడు. తళుకుబెళుకులకు తక్కువేం లేదు. మదుపుపరులకు ఎప్పటికప్పుడు లాభాల పంటా పండుతోంది. కానీ అట్టడుగున అవాంఛనీయమైన పోకడలు కనబడుతున్నాయి. వాటిని చక్కదిద్దితేసంస్థను మరిన్ని రెట్లు పెంచి ఘనతరమైనదిగా తీర్చిదిద్దటం అసాధ్యమేమీ కాదని ఆయన నిర్ణయించుకున్నాడు. 1991 నాటికే దేశంలో అడుగుపెట్టిన ఆర్థిక సంస్కరణల నేపథ్యంలో పాత పద్ధతిలోనే టిస్కోను కొనసాగిస్తే త్వరలోనే అది గ్రూపు చేజారటం ఖాయమన్న నిర్ణయానికొచ్చాడు.జేఆర్డీ మంచితనమో, గమనించలేని తత్వమో గానీ... టాటా స్టీల్‌లో అప్పటికి టాటాలకున్న ప్రమోటర్ వాటా కేవలం అయిదు శాతం మాత్రమే. ఇదే కొనసాగితే ఏదోనాటికి అది ఎవరి చేతుల్లోకైనా పోవచ్చని రతన్ గ్రహించారు. అదొక్కటే కాదు... గ్రూపు సంస్థల్లో ఏ ఒక్కటీ చేజారకుండా ప్రమోటర్ వాటాను గణనీయంగా పెంచారు. సొంత సంస్థలను పదిలపరచుకోవటమే కాదు, ఖండాంతర ఆంగ్లో–డచ్ స్టీల్ సంస్థ కోరస్‌ను వశపరుచుకున్నారు. ఒకప్పుడు తనకు అవరోధంగా నిలిచిన అమెరికన్ దిగ్గజ సంస్థ ఫోర్డ్ నుంచి జాగ్వార్ ల్యాండ్రోవర్ను టాటాల తీరానికి చేర్చారు.వర్తమానంలో పారిశ్రామికవేత్తల ఎదుగుదల ఎలా సాధ్యమవుతున్నదో బాహాటంగానే కనబడుతోంది. కానీ రతన్ టాటా ఇందుకు భిన్నం. టాటా సంస్థలపై మచ్చపడకుండా, వక్రమార్గాల జోలికిపోకుండా నిదానంగా తన ప్రస్థానం సాగించారు. ఆయన పట్టిందల్లా బంగారమేనని చెప్పడానికి లేదు. కోరస్ టేకోవర్ అయినా, నానో కారు ఉత్పత్తి ఉబలాటమైనా, టాటా గ్రూప్ సంస్థల చైర్మన్‌గా సైరస్ మిస్త్రీ ఆగమన, నిష్క్రమణల్లో అయినా రతన్ వైఫల్యాలు స్పష్టంగా కనబడతాయి. అందుకాయన విమర్శలను ఎదుర్కొనక తప్పలేదు. అలాగే టాటా స్టీల్‌ను దాదాపు 1,200 కోట్ల డాలర్ల విలువైన సంస్థగా తీర్చిదిద్దినప్పుడూ, దేశీయ విద్యుత్ ఆధారిత వాహన రంగంలో టాటా మోటార్స్‌ను మార్కెట్ లీడర్‌గా ముందుకు ఉరికించినప్పుడూ ఆయన గర్వం తలకెక్కించుకోలేదు. ఇవాళ్టి రోజున బహుళజాతి సంస్థల సమాహారంగా ఖండాంతరాల్లో వెలుగు లీనుతున్న టాటా గ్రూప్ నిరుటి రెవెన్యూ 16,500 కోట్ల డాలర్లు. ఆయన వ్యక్తిగత ఆదాయమే కొన్ని వందల కోట్లు. అయినా చివరి వరకూ అతి సాధారణ జీవితం గడిపి, అసహాయులకు అండదండలందించి జీవితాన్ని ధన్యం చేసుకున్న రతన్‌కు కొందరు కోరుకుంటున్నట్టు ‘భారతరత్న’ ప్రకటిస్తే అది ఆ అత్యున్నత పురస్కారానికి మరింత వన్నె తెస్తుంది. ఆ మహామనీషికి ‘సాక్షి’ వినమ్రంగా నివాళులర్పిస్తున్నది. -
బజాజ్ కుటుంబంలో విషాదం..
ప్రముఖ పారిశ్రామికవేత్త రాహుల్ బజాజ్ కుమార్తె, కమల్‌నయన్ బజాజ్ హాల్ అండ్ ఆర్ట్ గ్యాలరీ డైరెక్టర్ సునైనా కేజ్రీవాల్ (53) మృతి చెందారు. క్యాన్సర్‌తో సుదీర్ఘ పోరాటం తర్వాత శనివారం ఆమె ముంబైలో కన్నుమూశారు.సునైనాకు ఆమె భర్త, ఇద్దరు కుమారులు ఉన్నారు. సునైనా భర్త మనీష్ కేజ్రీవాల్ కేదారా క్యాపిటల్ వ్యవస్థాపకుడు, మేనేజింగ్ పార్ట్నర్. సునైనా గత మూడేళ్లుగా క్యాన్సర్‌తో పోరాడుతోంది. దాతృత్వం, కళల పట్ల ఆసక్తి ఉన్న ఆమె కమల్‌నయన్ బజాజ్ హాల్, ఆర్ట్ గ్యాలరీ డైరెక్టర్‌గా దేశ ఆర్థిక రాజధానిలో కళారంగాన్ని సుసంపన్నం చేయడంలో కృషి చేశారు.బజాజ్ కుటుంబం ఇప్పటికే దాతృత్వంలో ఉంది. అనేక ఛారిటబుల్ ట్రస్ట్‌లను కలిగి ఉంది. తన భర్త మనీష్‌తో కలిసి సునైనా కేదారా క్యాపిటల్‌ను స్థాపించారు. ప్రైవేట్ ఈక్విటీ సంస్థ 5 బిలియన్ డాలర్ల కంటే ఎక్కువ నిర్వహణలో ఆస్తులను కలిగి ఉంది. -
జీఎస్డీపీ పెరగడానికి సూచనలు ఇవ్వండి
సాక్షి, అమరావతి: పేదరికం లేని స్వర్ణాంధ్రప్రదేశ్‌గా రాష్ట్రాన్ని తీర్చిదిద్దాలని ప్రభుత్వం లక్ష్యం నిర్దేశించుకుందని, ఇందులో భాగస్వాములు కావాలని రాష్ట్ర పరిశ్రమల శాఖ పారిశ్రామికవేత్తలకు పిలుపునిచ్చింది. వికసిత్ ఆంధ్రప్రదేశ్‌లో భాగంగా 2047 నాటికి రాష్ట్ర స్థూల ఉత్పత్తి (జీఎస్డీపీ)ని రూ.199 లక్షల కోట్లకు పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపింది. ఇదే సమయంలో రాష్ట్ర తలసరి ఆదాయాన్ని రూ.35,69,000కు పెంచాలని లక్ష్యం నిర్దేశించుకున్నామని వెల్లడించింది. ఇందుకోసం చేపట్టాల్సిన చర్యలకు సంబంధించి పారిశ్రామికవేత్తలు సూచనలు, సలహాలు ఇవ్వాలని పరిశ్రమల శాఖ కోరింది.వికసిత్ ఆంధ్రప్రదేశ్‌కు రాష్ట్ర ప్రభుత్వం సమగ్ర కార్యాచరణ ప్రణాళికను రూపొందిస్తోందని తెలిపింది. ప్రతి సూచన, సలహాను పరిగణనలోకి తీసుకోవడమే కాకుండా పారిశ్రామికవేత్తల చొరవను గుర్తిస్తూ ఈ–సర్టిఫికెట్‌ను కూడా ప్రదానం చేస్తామని వెల్లడించింది. ఈ మేరకు పరిశ్రమల శాఖ, ఏపీ ఎకనమిక్ బోర్డు, ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక మౌలిక సదుపాయాల కల్పన సంస్థ (ఏపీఐఐసీ) సామాజిక మాధ్యమాల ద్వారా పారిశ్రామికవేత్తలకు పిలుపునిచ్చాయి. సూచనలు, సలహాలను http:// swarnandhra.ap.gov.in/Suggestions ద్వారా తెలియజేయొచ్చు. -
సీఎం వైఎస్ జగన్ చేయూత.. పారిశ్రామికవేత్తలుగా మహిళలు
సాక్షి, అమరావతి: సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి అందించిన చేయూతతో రాష్ట్రంలో మహిళలు పారిశ్రామికవేత్తలుగా ఎదుగుతున్నారు. రాష్ట్రంలోని యువతకు ఉపాధి కల్పించేందుకు జగన్ ప్రభుత్వం ఎంఎస్ఎంఈలకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తోంది. సూక్ష్మ, చిన్న, మధ్య తరహా (ఎంఎస్ఎంఈ) పరిశ్రమలు ఏర్పాటు చేసే వారికి పలు ప్రోత్సాహకాలు అందిస్తోంది. వీటిని సది్వనియోగం చేసుకుంటూ మహిళలు సొంతంగా ఎంఎస్ఎంఈలను ఏర్పాటు చేసి, మరికొందరికి ఉపాధి చూపుతూ ఆదర్శంగా నిలుస్తున్నారు. రాష్ట్రంలో గత నాలుగేళ్లలో అంటే.. 2022 జూలై నుంచి 2024 జనవరి వరకు రాష్ట్రంలో మహిళలు సొంతంగా 2,17,359 ఎంఎస్ఎంఈలను ఏర్పాటు చేసి నిర్వహిస్తున్నట్లు కేంద్ర సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల మంత్రిత్వ శాఖే వెల్లడించింది. ఈ మహిళా ఎంఎస్ఎంఈల ద్వారా 1,8,03,672 మంది యువతకు ఉద్యోగాలు లభించాయని తెలిపింది. ఈ మహిళా ఎంఎస్ఎంఈల ఏర్పాటుకు రూ.7,229.41 కోట్లు పెట్టుబడిగా పెట్టారని, వీటి టర్నోవర్ రూ.73,435.96 కోట్లుగా ఉందని వెల్లడించింది. ఇవన్నీ అధికారికంగా ఎంఎస్ఎంఈ మంత్రిత్వ శాఖ వద్ద నమోదైన ఎంఎస్ఎంఈలు కాగా, ఇప్పటికీ నమోదు కాని ఎంఎస్ఎంఈలు రాష్రంలో 2023 జనవరి 11 నుంచి 2024 జనవరి 31 వరకు ఒక్క ఏడాదిలోనే మరో 4,73,932 మహిళా ఎంఎస్ఎంఈలు ఏర్పాటు చేశారని, వీటి ద్వారా 6,,22,389 మందికి ఉద్యోగావకాశాలు లభించాయని పేర్కొంది. మహిళా యాజమాన్యంలోని ఎంఎస్ఎంఈలను ప్రోత్సహించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనేక చర్యలు తీసుకుంటున్నట్లు కేంద్ర మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ ఎంఎస్ఎంఈలకు ప్రధానమంత్రి ఎంప్లాయిమెంట్ జనరేషన్ పోగ్రామ్ (పీఎంఈజీపీ) కింద క్రెడిట్ గ్యారెంటీ నిధి నుంచి ఆరి్ధక సాయం అందిస్తున్నట్లు తెలిపింది. మహిళల్లో వ్యవస్థాపకతను ప్రోత్సహించడానికి నైపుణ్యాలను అమలు చేస్తోందని పేర్కొంది. ప్రత్యేకంగా మహిళల ఎంఎస్ఎంఈలను ఉద్యమం పోర్టలో రిజి్రస్టేషన్‌కు ప్రత్యేక డ్రైవ్‌లు నిర్వహించి, వారికి అవరమైన సహాయ సహకారాలు అందిస్తున్నట్లు పేర్కొంది.పారిశ్రామికవేత్తలకు సీఎం జగన్ చేయూత రాష్ట్రంలో వైఎస్ జగన్ ప్రభుత్వం కూడా సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలను పలు విధాలుగా ప్రోత్సహిస్తోంది. ముఖ్యంగా మహిళలు స్థాపించే ఎంఎస్ఎంఈలకు మరిన్ని ప్రోత్సాహకాలు అందిస్తోంది. దీంతో రాష్ట్రంలో మహిళలు పెద్ద ఎత్తున సూక్ష్మ, చిన్న పరిశ్రమలు ఏర్పాటు చేస్తున్నారు. గత చంద్రబాబు ప్రభుత్వం ఎంఎస్ఎంఈలతో పాటు పరిశ్రమలకు రాయితీలు ఇవ్వకుండా పెద్ద ఎత్తున బకాయిలు పెట్టింది. దీంతో ఎంఎస్ఎంఈలు కోలుకోలేని దెబ్బతిన్నాయి. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గత ప్రభుత్వ బకాయిలను కూడా చెల్లించడంతో పాటు ఎంఎస్ఎంఈలకు రూ.2,087 కోట్లు రాయితీలుగా చెల్లించారు. ముఖ్యంగా కోవిడ్ సమయంలో ఎంఎస్ఎంఈలను రాష్ట్ర ప్రభుత్వం ఆదుకుంది. దీంతో ఆ పరిశ్రమలన్నీ కోవిడ్ సంక్షోభం నుంచి కోలుకొని, నిలదొక్కుకోవడమే కాకుండా, రాష్ట్రంలో మరిన్ని పరిశ్రమల ఏర్పాటుకు మార్గం సుగమమైంది. -
యూఎస్‌లోనే అత్యంత సంపన్న మహిళగా..ఏకంగా రూ. 75 వేల కోట్లు..!
భారతదేశంలోనే పుట్టి, పెరిగిన ఒక మహిళ ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లి అక్కడే అతిపెద్ద వ్యాపార సామ్రాజ్యాన్ని నిర్మించింది. ఆహర్నిశలు కష్టపడి కంపెనీని వృద్ధిలోకి తీసుకొచ్చింది. యూఎస్‌లోనే అత్యంత పిన్నవయస్కురాలైన మహిళా వ్యాపారవేత్తగా నిలవడమే గాక ఫోర్బ్స్‌లో కూడా చోటు దక్కించుకుంది. ఎవరీమె అంటే.. భారత్‌కి చెందిన నేహా నార్ఖేడే పుట్టింది, పెరిగింది పూణేలోనే. ఆ తర్వాత యూఎస్‌లోని జార్జియా టెక్‌లో కంప్యూటర్ సైన్స్‌లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసింది. అక్కడే లింక్డ్ఇన్, ఒరాకిల్ వంటి కంపెనీల్లో పనిచేసి కాన్ఫ్లూయెంట్ అనే కంపెనీని స్థాపించింది. ప్రారంభంలో గణనీయమైన ఇబ్బందులను ఎదుర్కొన్నప్పటికీ అనతి కాలంలోనే రూ. 75 వేల కోట్ల టర్నోవర్‌తో దూసుకువెళ్లడం ప్రారంభించింది. అలా నేహా అత్యంత పిన్న వయస్కురాలైన పారిశ్రామిక వేత్తగా, అమెరికాలో ఎనిమిదొవ అత్యంత సంపన్న మహిళగా అవతరించింది. చిన్నతనంలో తాను ఇందిరా గాంధీ, కిరణ్‌బేడి, ఇంద్రానూయి వంటి ప్రముఖులు గురించి చదవడం వల్ల విజయవంతమైన వ్యాపారవేత్తగా రాణించగలిగానని చెబుతోంది. ఆమె కంపెనీ పబ్లిక్‌గా మారిన తర్వాత 2021 నాటికల్లా రూ. 13 వేల కోట్లకు చేరుకుంది. అనూహ్యంగా ఆమె సంపద 2022లో దారుణంగా పడిపోయి దాదాపు రూ. 8 వేల కోట్ల నష్టాన్ని నష్టాలను చవిచూసింది. అయినప్పటికీ మళ్లీ కంపెనీని లాభాల బాటపట్టించింది. ప్రస్తుతం నేహా కంపెనీ నికర విలువ ఏకంగా రూ. 75 వేల కోట్లు. అంతేగాదు మార్చి 2023లో నార్ఖేడ్ మోసాలను గుర్తించే సంస్థ ఓస్కిలార్ అనే కొత్త కంపెనీను కూడా స్థాపించింది. అంతేగాదు ఫోర్బ్స్ మ్యాగ్జైన్లో స్వీయ సంపన్న మహిళల జాబితాలో నేహా చోటు దక్కించుకోవడం విశేషం. (చదవండి: మహిళా ఎన్ఆర్ఐ ‘చెత్త’ బిజినెస్.. రూ.1000 కోట్లు టార్గెట్) -
Rajasthan Election 2023: మోదీ నినాదం.. అదానీజీ కీ జై
బుందీ/దౌసా: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బడా పారిశ్రామికవేత్త అయిన గౌతమ్ అదానీ సేవలో తరిస్తున్నారని, ఆయన కోసమే పని చేస్తున్నారని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత రాహుల్ గాంధీ మండిపడ్డారు. ‘భారత్ మాతా జై’ అని చెప్పే మోదీ అదానీ కోసం నిత్యం 24 గంటలూ పరితపిస్తున్నారని ఎద్దేవా చేశారు. ‘భారత్ మాతాకీ జై’ అనడానికి బదులు ‘అదానీజీ కీ జై’ అని నినదించాలని మోదీకి హితవు పలికారు. భరతమాత అంటే పేదలు, రైతులు, కారి్మకులేనని స్పష్టం చేశారు. ఆదివారం రాజస్తాన్‌లోని బుందీ, దౌసా జిల్లాల్లో కాంగ్రెస్ అభ్యర్థులకు మద్దతుగా రాహుల్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. బహిరంగ సభల్లో ప్రసంగించారు. ప్రధాని మోదీ రెండు హిందూస్తాన్‌లను సృష్టించాలని భావిస్తున్నారని, అందులో ఒకటి అదానీ కోసం, మరొకటి పేదల కోసం ఏర్పాటు చేయాలని అనుకుంటున్నారని రాహుల్ ఆరోపించారు. దేశవ్యాప్తంగా కుల గణన ఎందుకు నిర్వహించడం లేదని మోదీని నిలదీశారు. కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే దేశమంతటా కుల గణన ప్రారంభిస్తామని ప్రజలకు హామీ ఇచ్చారు. రాజస్తాన్‌లోనూ అధికారంలోకి రాగానే కులగణనకు మొట్టమొదటి ప్రాధాన్యం ఇస్తామన్నారు. కులగణనతోనే భరతమాత విజయం సాధిస్తుందని వివరించారు. రోజుకు మూడుసార్లు దుస్తులు మారుస్తారు మనదేశంలో బడా పారిశ్రామికవేత్తల్లో ఎవరైనా ఓబీసీలు, దళితులు, గిరిజనులు ఉన్నారా అని రాహుల్ ప్రశ్నించారు. రాజస్తాన్‌లో బీజేపీ అధికారంలోకి వస్తే అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు ఆగిపోతాయన్నారు. మోదీ రూ.12,000 కోట్లతో విమానం కొనుక్కున్నారని, రోజుకు మూడు సార్లు దుస్తులు మారుస్తారని, రూ.12 కోట్ల విలువైన కారులో ప్రయాణిస్తుంటారని మోదీపై ధ్వజమెత్తారు. తమ జనాభా ఎంత ఉందో చెప్పాలని ఓబీసీ, దళిత, గిరిజన యువత అడిగితే మాత్రం కులాలు లేవని ప్రధానమంత్రి అంటున్నారని దుయ్యబట్టారు. మోదీ 90 మంది ఐఏఎస్ అధికారులతో పరిపాలన నడిపిస్తున్నారని, వారిలో ఓబీసీలు ముగ్గురే ఉన్నారని వెల్లడించారు. దేశంలో ఓబీసీల జనాభా 50 శాతం ఉందని, ఐఏఎస్‌లు మాత్రం జనాభాకు తగ్గట్టుగా లేరని తెలిపారు. -
ఆప్తమిత్రులకు గోల్డెన్ పాస్‌పోర్టా?: రాహుల్
న్యూఢిల్లీ: పారిశ్రామికవేత్త గౌతమ్ అదానీ అన్న వినోద్ అదానీ సహా 66 భారతీయులు సైప్రస్ వెళ్లేందుకు కేంద్ర ప్రభుత్వం ‘గోల్డెన్ పాస్‌పోర్ట్’ మంజూరు చేసినట్లు వస్తున్న వార్తలపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ తీవ్రంగా స్పందించారు. ‘అమృత్‌కాల్‌లో ఆప్తమిత్రులైన ఆ సోదరులిద్దరూ దేశం విడిచి ఎందుకు వెళ్లారు? గోల్డెన్ పాస్‌పోర్టు అంటే ప్రజాధనాన్ని దోచుకుని, డొల్ల కంపెనీలు పెట్టుకుని, విదేశాల్లో జల్సా చేసేందుకు బంగారంలాంటి అవకాశం’అని బుధవారం రాహుల్ గాంధీ ‘ఎక్స్’లో ఎద్దేవా చేశారు. రాహుల్ ఆరోపణలపై బీజేపీ దీటుగా స్పందించింది. సైప్రస్ ఇన్వెస్టిమెంట్ ప్రోగ్రామ్ లేదా గోల్డెన్ పాస్‌పోర్ట్ పథకాన్ని 2007లో కాంగ్రెస్ ప్రభుత్వమే తీసుకువచ్చిందని గుర్తు చేసింది. పన్ను ఎగవేతదారులకు లాభించేలా సైప్రస్‌తో ఒప్పందం కూడా కుదుర్చుకుందని తెలిపింది. బీజేపీ సారథ్యంలోని ఎన్డీఏ అధికారంలోకి వచ్చాక, ఈ విధానంపై నియంత్రణలు తీసుకువచ్చామని పేర్కొంది. -
పారిశ్రామిక పార్కుల్లో 16.2 శాతం భూమి ఎస్సీలకు
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ పరిశ్రమలు, మౌలిక సదుపాయాల సంస్థ (ఏపీఐఐసీ) అభివృద్ధి చేసే పారిశ్రామిక పార్కుల్లో ఎస్సీ పారిశ్రామికవేత్తలకు 16.2 శాతం, ఎస్టీలకు 6 శాతం భూమి తప్పనిసరిగా కేటాయించాలని రాష్ట్ర ప్రభుత్వం నిబంధన విధించింది. ఈ మేరకు నూతన మార్గదర్శకాలను జారీ చేసింది. నూతన పారిశ్రామిక పాలసీ 2023 –27 కింద వివిధ పరిశ్రమలు, పారిశ్రామిక పార్కులకు ఏపీఐఐసీ భూ కేటాయింపులకు ఈ మార్గదర్శకాలు జారీ చేసింది. ఏపీఐఐసీ ఇండ్రస్టియల్ పార్క్స్ అలాట్మెంట్ రెగ్యులేషన్ 2020 కింద కేటాయించిన భూములకు ఈ కొత్త నిబంధనలు వర్తించవని, తాజాగా చేసిన కేటాయింపులకు మాత్రమే వర్తిస్తాయని ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.తాజా మార్గదర్శకాల ప్రకారం.. పారిశ్రామిక పార్కుల్లో 10 శాతం భూమిని కామన్ ఫెసిలిటీ సెంటర్, 5 శాతం వాణిజ్య ప్లాట్స్‌కు కేటాయించాలి. ఎంఎస్ఎంఈలకు 15 శాతం కేటాయించాలి. రూ.500 కోట్ల పైబడి పెట్టుబడితో కనీసం 1,000 మందికి ఉపాధి కల్పిస్తూ కనీసం మరో ఐదు అనుబంధ యూనిట్లు వచ్చే యాంకర్ యూనిట్లకు 25 శాతం తక్కువ ధరకు భూమి కేటాయిస్తారు. మండలస్థాయిలో ఏర్పాటు చేసే యాంకర్ యూనిట్లకు 20 నుంచి 33 శాతం వరకు తగ్గింపు ఇస్తారు. 33 ఏళ్లపాటు లీజుకు భూమిని ఇస్తారు. ఆ తర్వాత లీజును 66, 99 సంవత్సరాలకు పెంచుకోవచ్చు. ఉత్పత్తి ప్రారంభించి 10 ఏళ్లు దాటి నిబంధనలను పూర్తి చేసిన యూనిట్లకు ఆ భూమిని కొనుక్కొనే హక్కు కల్పిస్తారు. వివిధ కంపెనీలకు భూకేటాయింపులు రాష్ట్రంలో పారిశ్రామిక ప్రోత్సాహక విధానంలో భాగంగా వివిధ పరిశ్రమలకు భూములను కేటాయిస్తూ రాష్ట్ర ప్రభుత్వం పలు ఉత్తర్వులు జారీ చేసింది. నంద్యాల జిల్లా కొలిమిగుండ్ల మండలం కల్వట్ల గ్రామం వద్ద ఉన్న రామ్‌కో సిమెంట్ ఫ్యాక్టరీని సంజమల రైల్వే స్టేషన్‌కు అనుసంధానిస్తూ రైల్వే లైన్ నిర్మాణం కోసం 211.49 ఎకరాలు కేటాయించింది. ఎన్టీఆర్ జిల్లా మల్లవల్లి వద్ద బయో ఇథనాల్ ప్లాంట్ ఏర్పాటుకు అవిశా ఫుడ్స్‌కు 101.81 ఎకరాలు, విజయనగరం జిల్లా బొబ్బిలి వద్ద సత్య బయోఫ్యూయల్‌కు 30 ఎకరాలు కేటాయించింది. తిరపతిలో హిందుస్థాన్ స్టీల్ వర్క్స్‌కు కేటాయించిన 50.71 ఎకరాల యూనిట్ పూర్తి కావడానికి గడువును పెంచింది. కియా వెండర్స్‌కు రాయితీలకు సంబంధించిన విధివిధానాలు, శ్రీకాళహస్తి వద్ద ఎలక్ట్రో స్టీల్ కాస్టింగ్ (గతంలో శ్రీకాళహస్తి పైప్స్) కొత్తగా ఏర్పాటు చేస్తున్న ఫెర్రో అల్లాయిస్ యూనిట్‌కు, గుంటూరు టెక్స్టైల్ పార్క్, తారకేశ్వర టెక్స్టైల్ పార్కులకు వాటి పెట్టుబడి, ఉద్యోగ కల్పన ఆధారంగా టైలర్‌మేడ్ రాయితీలను ప్రకటించింది. -
ఉరివేసుకుని పారిశ్రామికవేత్త ఆత్మహత్య
అన్నానగర్: కరుంగల్ సమీపంలో ఆదివారం రాత్రి ఓపారిశ్రామికవేత్త ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. వివరాలు.. కన్యాకుమారి జిల్లా కరుంగల్ సమీపంలోని నెడియవిలకం ప్రాంతానికి చెందిన తంబిదురై సొంత ట్రక్కులతో వ్యాపారం చేస్తున్నాడు. ఇతనికి స్మైలీన్ ప్రభుదాస్ (32) అనే కుమారుడు ఉన్నాడు. తండ్రి నడుపుతున్న ట్రక్కుతో వ్యాపారంలో బాధ్యతలు నిర్వర్తించేవాడు. అతను ఆల్డ్రిన్ ఎస్తేర్ బాయ్ (29)ని వివాహం చేసుకున్నాడు. ఇతనికి ఐదేళ్ల కుమారుడు, 6 నెలల కుమార్తె ఉన్నారు. స్మైల్ ప్రభుదాస్ వ్యాపారంలో నష్టాలను చవిచూశారని, అప్పుల బాధలు ఉన్నాయని చెబుతున్నారు. దీంతో ఆయన గత కొన్ని రోజులుగా నిరుత్సాహంగా కనిపించారు. ఈ స్థితిలో ఆదివారం స్మైలీన్ ప్రభుదాస్ ఇంటిపై అంతస్తులో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఇది చూసిన అతని కుటుంబ సభ్యులు స్మైల్ మృతదేహాన్ని చూసి కన్నీరుమున్నీరుగా విలపించారు. అతని భార్య ఆల్డ్రిన్ ఎస్తేర్ భాయ్ కరుంగల్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు స్మైల్ మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం ఆచారిపాళ్యం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
రిలయన్స్ ఫౌండర్ అంబానీ: తొలి జీతం రూ.300, ఆసక్తికర విషయాలు
సక్సెస్ఫుల్ బిజినెస్ మేన్ రిలయన్స్ ఇండస్ట్రీస్ ఫౌండర్ ధీరజ్‌లాల్ హీరాచంద్ అంబానీ (ధీరూభాయ్) ఏం చదువుకున్నారో తెలుసా? దిగ్గజ కార్పొరేట్ సామ్రాజ్యాన్ని స్థాపించిన ధీరూభాయ్ పదో తరగతి మాత్రమే పూర్తి చేశారంటే నమ్ముతారా? ఒకప్పుడు పెట్రోల్ పంపులో పని.. కానీ ఆ తరువాత వేల కోట్ల రూపాయలతో వ్యాపార దిగ్గజంగాఎదిగిన ధీరూభాయ్ అంబానీ గురించి అంతగా తెలియని ఆసక్తికరమైన విషయాలు సాధారణ కుటుంబంలో జననం, కష్టాలు ధీరూభాయ్ అంబానీ గుజరాత్, జునాగద్ జిల్లాలో చోర్వాడ్ అనే చిన్న గ్రామంలో 1932, డిసెంబరు 28న జన్మించారు. సామాన్య టీచర్ కుటుంబంలో నలుగురు తోబుట్టువులతో జీవితం కష్టాలతోనే ప్రారంభమైంది. ముఖ్యంగా కుటుంబ ఆర్థిక ఇబ్బందుల కారణంగా ధీరూభాయ్ అంబానీ తన చదువును కూడా మధ్యలోనే వదిలివేసి కుటుంబానికి అండగా ఉండేందుకు చిన్న చిన్న పనులు చేశారు. పెట్రోలు బంకులో పని, నెలకు రూ.300 బిలియన్ డాలర్ల కంపెనీ వ్యవస్థాపకుడు ధీరూభాయ్ అంబానీ ప్రారంభంలో బ్రిటిష్ కాలనీ ఆఫ్ అడెన్‌లోని పెట్రోల్ బంకులో అటెండెంట్‌గా పనిచేశారు. ఆ సందర్భంగా నెలకు 300రూపాయలు జీతంగా తీసుకునేవారట. అంతకుముందు కుటుంబ పోషణ కోసం అనేక పనులు చేశారు.కానీ అవి నచ్చకపోవడంతో మిడిల్ ఈస్ట్ ఆసియా దేశమైన యెమెన్‌కు వలస వెళ్లి పెట్రోల్ బంకులో పని మొదలు పెట్టారు. అదే ఆయన జీవితాన్ని మలుపు తీప్పింది. సూయజ్‌కు తూర్పున ఉన్న అతిపెద్ద ఖండాంతర వాణిజ్య సంస్థలో ట్రేడింగ్, అకౌంటింగ్, ఇతర వ్యాపార నైపుణ్యాలను నేర్చుకున్నారు. కొన్నేళ్లలోనే మంచి స్థానానికి ఎదిగారు. ఆ తరువాత అన్నింటినీ వదిలి తిరిగి భారతదేశానికి తిరిగి వచ్చేశారు. రిలయన్స్ కమర్షియల్ కార్పొరేషన్ ఇండియాకి వచ్చిన తరువాత 1958లో తన బంధువు చంపక్లాల్దమానీతో కలిసి తొలి కంపెనీ రిలయన్స్ కమర్షియల్ కార్పొరేషన్ (సుగంధ ద్రవ్యాలు, నూలు వ్యాపారం) కంపెనీ స్థాపించారు. నూలు వ్యాపార పరిశ్రమలో పెరుగుతున్న అవకాశాలను గుర్తించిన తర్వాత ధీరూభాయ్ తన వ్యాపారాన్ని మార్చేశారు. మూడేళ్ల తర్వాత 1962లో రిలయన్స్ టెక్స్టైల్ ఇండస్ట్రీస్ లిమిటెడ్‌ను లాంచ్ చేశారు. బంధువు చంపక్లాల్ దమానీతో విడిపోయిన తరువాత 1966లో గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో 'రిలయన్స్ టెక్స్టైల్స్' అనే బట్టల మిల్లును ప్రారంభించారు. దీంతో అతని జీవితంలో అత్యంత మలుపు తిరిగింది. ఇక తరువాత మళ్ళీ ఎప్పుడూ వెనుదిరిగి చూసింది లేదు. అంచెలంచెలుగా రిలయన్స్ సామ్రాజాన్నివిస్తరించారు. అలాగే భారతదేశంలోని సగటు పెట్టుబడిదారులకు స్టాక్ మార్కెట్‌ను పరిచయం చేసిన ఘనత అంబానీకి దక్కుతుందని మార్కెట్ నిపుణులమాట. భారతదేశంలో అతిపెద్ద ఎగుమతిదారుగా ఫార్చ్యూన్ 500లోచోటు దక్కించుకున్న తొలి ఇండియన్ ప్రైవేట్ కంపెనీగా రిలయన్స్ టెక్స్టైల్స్ నిలిచింది. అలాగే 1996, 1998, 2000 సంవత్సరాల్లో ఆసియావీక్ పత్రిక 'పవర్ 50- ఆసియాలో మోస్ట్ పవర్ఫుల్ పీపుల్' జాబితాలో చేరారు. దీంతోపాటు1999 సంవత్సరంలో బిజినెస్ ఇండియా 'బిజినెస్ మ్యాన్ ఆఫ్ ది ఇయర్' అవార్డును కూడా అందుకున్నారు. 69 ఏళ్ల వయసులో ధీరూభాయ్ అంబానీ 2002 జూలై 6న ముంబైలో కన్నమూశారు. (టాటా, బిర్లా సక్సెస్ సీక్రెట్ ఇదే? అనంత్, రాధికా మర్చంట్ అడోరబుల్ వీడియో వైరల్) ఖరీదైన రెస్టారెంట్లలో టీ తాగేవారు తాజా వ్యాపార ఆలోచనలకోసం, తన సామ్రాజ్యాన్ని విస్తరించడానికి, ధీరూభాయ్ అంబానీ సంపన్న వ్యాపారవేత్తలతో కలిసి తిరిగేవారట. నెట్వర్క్ , పరిశ్రమ గురించి తెలుసుకోవడానికి, ఖనీదైన రెస్టారెంట్లలో టీ తాగేవారని చెబుతారు. (అమెరికాలో ఉద్యోగం వదిలేసి: ఇండియాలో రూ.36 వేలకోట్ల కంపెనీ) ధీరూభాయ్ అంబానీ భార్య పేరు కోకిలాబెన్. వీరికి ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు. వీరు ముఖేశ్ అంబానీ, అనిల్ అంబానీ, నినా కొఠారి, దీప్తి సల్గోకర్. ఆస్తులను తన ఇద్దరు కుమారులు ముఖేశ్, అనిల్ అంబానీలకు పంచి ఇచ్చారు. 2002లో ఆయన మరణించే ముందు వరకు కంపెనీని పర్యవేక్షించిన ఆయన 1980ల మధ్యకాలంలో తన కుమారులు ముఖేశ్ అంబానీ, అనిల్ అంబానీలకు అప్పగించారు, ఆయన వారసత్వాన్ని అందుకున్న ముఖేశ్ అంబానీ రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేతగా ఆసియా బిలియనీర్, భారతదేశంలో అత్యంత సంపన్నుడుగా నిలిచిన సంగతి తెలిసిందే. (షాకింగ్! ప్రపంచంలోనే ఖరీదైన లిక్విడ్: చిన్న డ్రాప్ ధర పదివేలకు పైనే) -
బర్ఫీబామ్మ.. ఈ జన్మకు ఇంతేలే అనుకోలేదు.. తొంభైలలోనూ వ్యాపారం
‘‘జీవితంలో నాకు కావాల్సిన సంతోషాలన్నీ దొరికాయి. అది లేదు, ఇది లేదు అన్న అసంతృప్తిలేదు. కానీ ఇంతవరకు నా కాళ్ల మీద నేను నిలబడడానికి ప్రయత్నించిందిలేదు. సొంతంగా డబ్బులు సంపాదించలేదు’’ అని చాలా మంది మలివయసులో దిగులు పడుతుంటారు. అచ్చం ఇలాంటి ఆలోచనా ధోరణి ఉన్న తొంభై ఏళ్ల హర్భజన్ కౌర్ తన మనసులో బాధను దిగమింగుకుని, ఈ జన్మకు ఇంతేలే అని సరిపెట్టుకోలేదు. ‘‘వయసు అయిపోతే ఏంటీ నేను ఇప్పుడైనా సంపాదించగలను’’ అని బర్ఫీలు తయారు చేసి విక్రయిస్తోంది. తొంభైలలోనూ వ్యాపారాన్ని లాభాల బాట పట్టిస్తూ బర్ఫీబామ్మగా ఎంతోమందికి ఆదర్శంగా నిలుస్తోంది. అమృతసర్‌లోని తారన్‌తారన్ ప్రాంతంలో పుట్టిపెరిగింది హర్భజన్ కౌర్. పెళ్లికావడంతో భర్తతో లుథియాణాలో కొత్తజీవితం మొదలు పెట్టింది. సంసారం, పిల్లలతో తొంభై ఏళ్లు గడిచిపోయాయి కౌర్ జీవితంలో. పదేళ్లక్రితం భర్త చనిపోవడంతో చంఢీఘడ్‌లోని తన చిన్నకూతురు దగ్గర ఉంటోంది కౌర్. తొంభై ఏళ్ల వయసులో అన్ని బాధ్యతలు నెరవేరినప్పటికీ..తన కాళ్ల మీద తను నిలబడలేదు, సొంతంగా ఒక్క రూపాయి సంపాదించలేదన్న అసంతృప్తి మాత్రం ఆమె మనసులో ఉండిపోయింది. ఓ రోజు మాటల మధ్యలో తన మనసులో మాటను కూతురు దగ్గర చెప్పింది. అప్పుడు.. కూతురు సరే..ఇప్పుడు నువ్వు ఏం చేయాలనుకుంటున్నావు అని అడిగింది. అందుకు కౌర్.. శనగపిండితో బర్ఫీలు చేసి విక్రయించాలనుకుంటున్నాను’’ అని చెప్పింది. అందుకు కూతురు సాయం చేయడంతో చంఢీఘడ్‌లోని సెక్టార్–18లో చిన్న స్టాల్ పెట్టి శనగపిండితో చేసిన బర్ఫీలను విక్రయించింది. ఐదు కేజీల బర్ఫీలు విక్రయించగా మూడు వేల రూపాయలు వచ్చాయి. వ్యాపారం ప్రారంభించిన తొలిరోజే మూడు వేల రూపాయలు రావడంతో ఆమె బర్ఫీల వ్యాపారానికి మరింత ప్రోత్సాహం లభించినట్లు అనిపించింది. ఇదే సమయంలో హర్భజన్ బర్ఫీ తయారు చేస్తోన్న వీడియోను ప్రముఖ పారిశ్రామిక వేత్త ఆనంద్ మహీంద్రా ట్విటర్లో షేర్ చేయడంతో వీడియో బాగా వైరల్ అయ్యింది. ఈ వీడియో ద్వారా వచ్చిన పాపులారిటీతో బర్ఫీల ఆర్డర్లు విరివిగా పెరిగి వ్యాపారం చక్కగా సాగుతోంది. నాన్న నుంచి నేర్చుకుని.. హర్భజన్ తండ్రికి వంటబాగా చేసేవారు. ఆయన నుంచి వంట నైపుణ్యాలను చక్కగా అవపోసన పట్టిన కౌర్... శనగపిండి బర్ఫీ, బాదం సిరప్, టొమాటో చట్నీ, నిమ్మకాయ, మామిడికాయ పచ్చడి, దాల్ హల్వా, పిర్నీ, పంజిరి, ఐస్‌క్రీమ్‌లు వంటివి తయారు చేసి విక్రయిస్తోంది. ముందుగా తనకోసం చేసుకుని రుచి చక్కగా కుదిరిన తరువాత మార్కెట్లో విక్రయిస్తోంది. కౌర్ వంటలకు కస్టమర్లనుంచి విరివిగా ఆర్డర్లు వస్తున్నాయి. గత ఆరేళ్లుగా ఒకపక్క బర్ఫీలు చేస్తూనే తనకు ఏమాత్రం ఖాళీసమయం దొరికినా తన మనవ సంతానానికి చిన్నచిన్న గౌన్లను కుడుతుంది. సోషల్ మీడియాలో తన వీడియోలతో వ్యూవర్స్‌ను ఆకట్టుకోవడమేగాక, ఈ వయసులో కృష్ణా రామా అంటూ కూర్చోకుండా తనకు తెలిసిన పనితో సంపాదిస్తూ మలివయసులో ఊసుపోని వారెందరికో ప్రేరణగా నిలుస్తోంది. మరో తరానికి... నూటపదేళ్లకుపైగా చరిత్ర ఉన్న శనగపిండి బర్ఫీని విక్రయించడం నాకు చాలా గర్వంగా ఉంది. చిన్నప్పడు మా నాన్నగారు ఈ బర్ఫీని ఎంతో రుచికరంగా చేసేవారు. అది చూసి నేర్చుకున్న నేను నా పిల్లలు, తరువాత మనవళ్లకు వండిపెట్టాను. బర్ఫీ ప్రతిముక్కలో నా చిన్నతనం నాటి జ్ఞాపకాలు గుర్తుకొస్తాయి. ఇంట్లో నేను చేసిన బర్ఫీలను అంతా ఇష్టంగా తినేవారు. ఇప్పుడు బయటివాళ్లు సైతం ఇష్టపడుతున్నారు. ‘చైల్డ్‌హుడ్ మెమొరీస్’ పేరిట ఆన్లైన్లో ఫుడ్ విక్రయిస్తున్నాం. ప్రారంభంలో ఆర్డర్లు తక్కువగా ఉన్నప్పటికీ, ఇప్పుడు బాగా వస్తున్నాయి. నా కూతురు రవీనా సాయంతో నేను ఇదంతా చేయగలుగుతున్నాను. సోషల్ మీడియా అంటే ఏంటో కూడా తెలియని నేను.. నా వీడియోలతో వేలమందిని ఆకట్టుకోవడం సంతోషాన్నిస్తోంది’’. – హర్భజన్ కౌర్ -
చాటింగ్, హాట్ ఫొటోలతో పారిశ్రామికవేత్తకు టోకరా
బెంగళూరు: యువతి పేరుతో పంపిన హాట్ ఫోటోలకు స్పందించిన వృద్ధ పారిశ్రామికవేత్తను కేటుగాళ్లు పోలీసుల పేరుతో బ్లాక్మెయిల్ చేసి రూ.14.90 లక్షలు కొల్లగొట్టారు. బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు యువరాజు అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్న హలసూరుగేట్ పోలీసులు కవనా, నిధి అనే వారిపై కేసు నమోదు చేశారు. పోలీసులపేరుతో రైడ్ హోసూరురోడ్డులో సదరు పారిశ్రామికవేత్తకు స్వంత కంపెనీ ఉంది. నాలుగేళ్ల క్రితం ఇన్సూరెన్స్ విషయంపై కవనా అనే యువతి పరిచయమైంది. వారం క్రితం నిధి అనే యువతిని పారిశ్రామికవేత్తకు పరిచయం చేసింది. ఆమె పారిశ్రామికవేత్తతో వాట్సాప్‌లో చాటింగ్ చేస్తుండేది. ఈ విషయాన్ని తెలుసుకున్న నిధి స్నేహితుడు యువరాజు నిధి పేరుతో మరో ఫోన్ నంబర్ ద్వారా ఆ పారిశ్రామికవత్తకు హాట్ పొటోలు పంపాడు. ఈనెల 3 తేదీన నిధి సెల్ నుంచి పారిశ్రామికవేత్తకు మెసేజ్ పంపించి హొసూరురోడ్డు పెట్రోల్‌బంక్ వద్దకు పిలిపించాడు. మరో వ్యక్తితో కలిసి తాము క్రైం పోలీసులమంటూ ఆ పారిశ్రామికవేత్త కారు కీ, మొబైల్‌ను లాక్కున్నారు. యువతితో చాటింగ్ చేసిన వీడియో స్క్రీన్‌షాట్, హాట్ ఫొటోలకు సంబంధించి మీపై ఎఫ్ఐఆర్ నమోదైందని, ఈ కేసు మూసివేయాలంటే డబ్బు ఇవ్వాలని డిమాండ్ చేశారు. మొత్తం 14.90 లక్షలు తీసుకున్నారు. చదవండి: (కాళ్ల పారాణి ఆరకముందే.. నవ వధువు మృతి) ఈనెల 10 తేదీన ఫోన్ చేసి కేజీ.రోడ్డు బసప్పపార్కు వద్దకు పిలిపించి రూ.50 వేలు తీసుకున్నారు. అయితే ఆ వ్యక్తులు నకిలీ పోలీసులని పసిగట్టిన సదరు పారిశ్రామికవేత్త హలసూరుగేట్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు గాలింపు చేపట్టి యువరాజ్ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకొని విచారణ చేపట్టగా ఈ వ్యవహారంలో అతనే సూత్రధారి అని తేలిందని సీనియర్ పోలీసు అధికారి తెలిపారు. జిమ్ ట్రైనర్ అయిన యువరాజు అప్పుల ఊబిలో కూరుకుపోయాడని, స్నేహితురాలు నిధి పారిశ్రామికవేత్తకు మెసేజ్ చేయడాన్ని గమనించి మరో నెంబరు నుంచి అదే పేరుతో చాటింగ్ చేయించి నకిలీ పోలీసుల అవతారమెత్తి నగదు దోచుకున్నట్లు తేలిందని పోలీసులు తెలిపారు. -
బజాజ్ గ్రూప్ మాజీ ఛైర్మన్ రాహుల్ బజాజ్ అరుదైన ఫోటోలు
-
పారిశ్రామికవేత్తపై ఐటీ దాడులు: సమారు రూ.200 కోట్లు
సాక్షి, ఆదిలాబాద్: ప్రముఖ పారిశ్రామికవేత్త రఘునాథ్ మిత్తల్ ఇంటితో పాటు ఆయన పరిశ్రమల్లో ఇన్‌కం టాక్స్ అధికారుల బృందం మంగళవారం దాడులు చేసింది. జిల్లాలోని నాలుగు చోట్లతో పాటు హైదరాబాద్‌లోని పలు వ్యాపార స్థావరాలపై ఏకకాలంలో ఐటీ అధికారుల దాడులకు చేశారు. రఘునాథ్ మిత్తల్ వ్యాపార లావాదేవీలు, ఆస్తులుకు సంబంధించిన వివరాలపై ఐటీ అధికారులు సోదాలు నిర్వహించారు. ఉదయం నుంచి కొనసాగుతున్న ఇన్‌కం టాక్స్ సోదాలకు సంబంధించిన విషయం సాయంత్రం వరకూ బయటకు తెలియలేదు. ఐటీ అధికారులు ఈ సోదాల్లో రఘునాథ్ మిత్తల్‌కు సంబంధించిన సుమారు రూ. 200 కోట్లు లెక్కల్లో తేలని ఆస్తులను గుర్తించినట్లు తెలస్తోంది. కాని అధికారికంగా మాత్రం సంబంధిత అధికారులు దీనిపై స్పందించలేదు. ఆదిలాబాద్‌కు చెందిన రఘునాథ్ మత్తల్‌కు సంబంధించి ఢిల్లీ, పంజాబ్ రాష్ట్రాల్లో పలు వ్యాపారాలు, ఆస్తులు ఉన్నప్పటికీ.. ఆయా చోట్ల ఐటీ దాడులకు సంబంధించిన సమాచారం తెలియరాలేదు. -
మన నైపుణ్యమే మనకు గుర్తింపు
నా జీవితాన్ని నాలుగు సెగ్మెంట్లుగా విభజించుకున్నాను. మొదటిది నా ప్రొఫెషన్, రెండు భార్యగా తల్లిగా నా ఇంటి బాధ్యత, మూడవది నన్ను నేను సంతోషంగా ఉంచుకోవడానికి దోహదం చేసే నా ప్యాషన్, నాలుగవది సాటి మహిళల కోసం స్వచ్ఛందంగా నిర్వహిస్తున్న సామాజిక బాధ్యత. ప్రొఫెషన్లో మన సర్వీస్ నూటికి నూరు శాతం ఇవ్వగలగాలంటే మన పర్సనల్ స్పేస్‌ను సంతృప్తి పరుచుకుంటూ ఉండాలి. తొమ్మిది భారతీయ భాషల్లో త్యాగరాజ కృతులు పాడినా, ఇంట్లో సీతారామ కల్యాణం చేసినా అవన్నీ నా సంతోషం కోసమే. పారిశ్రామికవేత్తగా కష్టపడేది నన్ను నేను గెలిపించుకోవడం కోసం. లా నన్ను నేను గెలిపించుకోవడం సాధ్యమయ్యేది నన్ను నేను సంతోషంగా ఉంచుకున్నప్పుడే. ఈ చిన్న చిట్కా తెలిస్తే జీవితంలో అసంతృప్తులు ఉండవన్నారు నీరజ గొడవర్తి. ఇటీవలే ఎమినెంట్ ఉమన్ ఎంటర్ప్రెన్యూర్ అవార్డు అందుకున్న నీరజ తన ప్రస్థానాన్ని ‘సాక్షి’తో పంచుకున్నారు. ‘‘మాది మద్రాసులోని తెలుగు కుటుంబం. మా తాతగారు మద్రాసు నుంచి బాపట్ల వచ్చి స్థిరపడ్డారు. మా నాన్న అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ ఉద్యోగరీత్యా తెలంగాణలో పెరిగాను. పెళ్లితో పూర్తి స్థాయిలో హైదరాబాద్‌లో స్థిరపడ్డాను. సంగీతంలో ప్రవేశం ఉన్న కుటుంబం కావడంతో నేను కూడా కర్ణాటక సంగీతం నేర్చుకున్నాను. చిన్నప్పుడు స్కూల్లో నేర్చుకున్న క్రమశిక్షణ నాలో ఇప్పటికీ సజీవంగా ఉంది. ఆ క్రమశిక్షణే జీవితాన్ని సక్రమంగా చక్కదిద్దుకునే నైపుణ్యాన్నిచ్చింది. టైప్, షార్ట్ హ్యాండ్ అర్హతలు కూడా ఉండడంతో బీకామ్ పరీక్షలు రాసిన వెంటనే ఓ పెద్ద కంపెనీలో అకౌంట్స్ విభాగంలో ఉద్యోగం వచ్చింది. చదువు మాత్రమే సరిపోదు, లైఫ్ స్కిల్స్ కూడా ఉండాలని నాకు తెలిసిన సందర్భం అది. ఉద్యోగం చేస్తూనే కరస్పాండెన్స్లో పీజీ చేశాను. ఎనిమిదేళ్ల ఉద్యోగానుభవం నాకు పెళ్లి తర్వాత నా భర్త కంపెనీని నిర్వహించడంలో చాలా బాగా దోహదం చేసింది. మావారి ఏకశిలా కెమికల్స్ లిమిటెడ్‌లో మొదట కంప్యూటర్ విభాగం బాధ్యతలు తీసుకున్నాను. ఇప్పుడు అదే కంపెనీకి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ని. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే... సక్సెస్‌కి ఎప్పుడూ షార్ట్ కట్ ఉండదు. కంపెనీ మనదైనా సరే, అందులో ఉన్నత స్థాయిలో నిలదొక్కుకోవాలంటే మన శ్రమ, మనం కంపెనీకి ప్రయోజనకరంగా ఉండడం వల్లనే సాధ్యమవుతుంది. అంతేతప్ప మనలో అంకితభావం, పట్టుదల, నైపుణ్యం లేకపోతే పెద్ద బాధ్యతలు అప్పగించే సాహసాన్ని భర్త కూడా చేయడు. మొక్కలు పెంచాను మా బాబు కోసం మూడేళ్లపాటు నా కెరీర్లో గ్యాప్ తీసుకున్నాను. అప్పుడు నాకు టైమ్ వృథా చేస్తున్నానా అనిపించేది. అప్పుడు హిందూస్తానీ సంగీతం నేర్చుకున్నాను. బాబు స్కూల్‌కెళ్లడం మొదలైన తర్వాత బంజరుగా పడి ఉన్న రెండెకరాల పొలాన్ని సాగులోకి తెచ్చే బాధ్యత తీసుకున్నాను. అమెరికా వెళ్లినప్పుడు న్యూయార్క్‌లో చూసిన బటర్ ఫ్లై పార్క్‌ను దృష్టిలో పెట్టుకుని పొలం మధ్యలో వాకింగ్ ట్రాక్ నిర్మాణంతోపాటు సీతాఫలం, గోరింటాకు, అశ్వత్థ, రుద్రాక్ష, ఖర్జూరం, అంజూర్ చెట్లు వేశాను. హార్టికల్చర్ డిపార్ట్మెంట్ నుంచి రెండేళ్లు అవార్డు అందుకున్నాను. హార్టికల్చర్ అవార్డుకి గీటురాయి ప్రధానంగా ఒక్కటే. మనం పెంచిన ప్రతి చెట్టుకీ ఏదో ఒక ప్రయోజనం ఉండి తీరాలి. చూడడానికి అందంగా కనిపించడం కోసం క్రోటన్స్ నాటానంటే ఒప్పుకోరు. పువ్వులు, కాయలు, ఔషధ గుణాల వంటి ఉపయోగకరమైనవే అయి ఉండాలి. గార్డెన్‌కి నేను రోజూ చేయాల్సిందేమీ లేదిప్పుడు. కంపెనీ పనులు చూసుకుంటున్నాను. ఒకప్పటి పురుష సామ్రాజ్యం పరిశ్రమ నిర్వహణలో ఉన్న మహిళలు సక్సెస్‌బాట పట్టిన తమ విజయాలను చూసుకుని సంతోషపడితే సరిపోదు. తమ వంతుగా సామాజిక బాధ్యతను చేపట్టి తీరాలి. ఎందుకంటే ఓ దశాబ్దం వరకు కూడా ఇది పూర్తిగా మగవాళ్ల సామ్రాజ్యం. ఇప్పుడు మహిళలు ముందుకు వస్తున్నారు. ముందుతరం మహిళాపారిశ్రామిక వేత్తలు తాము నడిచిన దారితో కొత్తవారికి మార్గదర్శనం చేయగలగాలి. పరిశ్రమ నిర్వహణలో దాగిన మెళకువలను కొత్త వారికి నేర్పించాలి. కేవలం అందుకోసమే కోవే (కన్ఫెడరేషన్ ఆఫ్ ఉమెన్ ఎంటర్‌ప్రెన్యూర్స్ ఆఫ్ ఇండియా) లో మెంబర్‌గా చేరాను. ఇందులో వందల సంఖ్యలో మహిళలున్నారు. తమ పరిశ్రమలను విజయవంతంగా నడిపించుకుంటున్న వాళ్లు దాదాపుగా ఎనభై మంది ఇందులో క్రియాశీలకంగా ఉన్నారు. స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్‌లు పెట్టి కొత్తవాళ్లకు దిశానిర్దేశం చేయడం, కుటీర పరిశ్రమలు నడుపుతున్న వాళ్ల ఉత్పత్తులను మార్కెట్ చేయడం కోసం కోవే మార్ట్లు నిర్వహించడం నాకు చాలా సంతృప్తినిస్తున్నాయి. సమాజంలో ఒకింత విస్తృతమైన పరిచయాలు ఉండడంతో నోటి మాట ద్వారా మా కోవే నెట్‌వర్క్‌లో ఉన్న మహిళలకు ఆర్డర్లు ఇప్పించగలుగుతాం. అవసరం ఉన్న వాళ్లకు– సర్వీస్ ఇవ్వగలిగిన వాళ్లకు మధ్య వారధిగా పని చేయడం అన్నమాట. ఇందుకోసం ఓ పది నిమిషాల ఫోన్ కాల్ మినహా మాకు ఖర్చయ్యేది ఏమీ ఉండదు. సక్సెస్ బాటలో ఉన్న మహిళా పారిశ్రామికవేత్తలను నేను కోరేది ఒక్కటే... మీరు ఎక్కిన నిచ్చెన మెట్లు మిమ్మల్ని మీ లక్ష్యానికి చేర్చాయి. తొలి అడుగు ఎలా వేయాలో తెలియక దిక్కులు చూస్తున్న మహిళలెందరో ఉన్నారు. వారికి చేయి అందించండి. ఏదో ఒక నైపుణ్యం ఉంటుంది కొత్త తరం యువతులు ఉత్సాహంగా ఉంటున్నారు. కానీ చదువుకుని కూడా గృహిణిగా ఉండిపోయిన వాళ్లలో చాలా మంది పిల్లలు పెద్దయ్యే కొద్దీ జీవితంలో తెలియని వెలితి ఫీలవడాన్ని చూస్తున్నాం. ఈ వ్యాక్యూమ్ అనేది ఎవరికి వాళ్లు ఏర్పరుచుకునేదే. వాళ్లకు నేను చెప్పగలిగిన చిన్న సలహా ఏమిటంటే... ప్రతి ఒక్కరిలో ఏదో ఒక నైపుణ్యం ఉంటుంది. దానిని గుర్తించి, దానినే మీకు గుర్తింపుగా మలుచుకోండి. ఇంటిని అందంగా అలంకరించడం, చక్కగా చీర కట్టుకోవడం, రుచి వంట చేయడం... ప్రతిదీ ఇప్పుడు మార్కెట్ వస్తువులే. స్నేహితులకు, బంధువులకు హాబీగా చేసివ్వచ్చు. ఆర్థిక అవసరాలుంటే వీటినే ఉపాధిగా మార్చుకోవచ్చు. ఏ పనినీ తక్కువగా చూడకూడదు. గడచిన తరం మహిళలకు ఇన్ని అవకాశాల్లేవు. ఇప్పుడు అవకాశాలకు ఆకాశమే హద్దు’’. – ఇంటర్వ్యూ: వాకా మంజులారెడ్డి ఫొటోలు : గాలి అమర్ పూలకు పాట ఇకబెనా ఫ్లవర్ అరేంజ్మెంట్ ఆర్ట్ గురించి ఒక ఫ్రెండ్ చెప్పింది. ఆ కళను నేర్చుకోవడమే కాకుండా అందులో అడ్వాన్స్ కోర్సు కూడా చేశాను. ఇకబెనా మీద పాట రాసి, స్వయంగా మ్యూజిక్ కంపోజ్ చేసి రెండేళ్ల కిందట హాంగ్‌కాంగ్‌లో జరిగిన ఏషియన్ రీజనల్ కాన్ఫరెన్స్‌లో పాడాను. కోవే మహిళలను ఉత్తేజితం చేయడానికి కూడా పాట రాశాను. మార్కులు తక్కువగా వచ్చాయని ఒక విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నప్పుడు, దిశ సంఘటన మీద కూడా పాట రాశాను. మనసులో అలజడి రేగినప్పుడు పాట రాయడం, మనసు బాగున్నప్పుడు పూలు అలంకరించుకోవడం, కీర్తనలు పాడడం ఇవన్నీ నాకు జీవితం మీద ఇష్టాన్ని పెంచే పనులు. ఏ ఉద్వేగాన్నీ అణుచుకోకూడదు. ఉద్వేగం ఏదో ఒక కళ రూపంలో బయటకు తీసుకురావాలి. అప్పుడే జీవితంలో ప్రతి క్షణాన్నీ ఫలవంతంగా జీవించగలుగుతాం. – నీరజ గొడవర్తి, ఎమినెంట్ ఉమన్ ఎంటర్ప్రెన్యూర్ అవార్డు గ్రహీత -
ఎవర్ గ్రీన్ టీ మ్యాన్ ఇక లేరు
ప్రముఖ పారిశ్రామిక వేత్త, ఎవరెడీ ఇండస్ట్రీస్ మాజీ అధిపతి బ్రిజ్ మోహన్ ఖైతాన్ (92) శనివారం కన్నుమూశారు. ‘ఎవర్ గ్రీన్ టీ మ్యాన్ ఆఫ్ ఇండియా’ అని పిలుచుకునే ఖైతాన్ వృద్ధాప్యంలో వచ్చే సమస్యలతో ఇబ్బంది పడుతూ ఆయన తుదిశ్వాస విడిచారు. విలిమ్సన్ మేగర్ గ్రూప్ వ్యవస్థాపకులు అయిన ఖైతాన్.. వయసు పైబడినకారణంగా గత ఏడాది తన గ్రూప్‌నకు చెందిన ఎవరెడీ ఇండస్ట్రీస్, మెక్లాయిడ్ రస్సెల్ సంస్థల్లో ఛైర్మన్ పదవికి రాజీనామా గౌరవాధ్యక్షునిగా కొనసాగుతున్నారు. భారత్‌లోని టీ పరిశ్రమకు ఆయన్ను పెద్దదిక్కుగా భావించే బీఎం ఖైతాన్ మృతికి పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సంతాపం వ్యక్తం చేశారు. ఖైతాన్ బెంగాలీలు అత్యంత గౌరవించే వ్యాపారవేత్త అని ఆయన మృతి తీవ్ర విషాదాన్ని నింపిందంటూ ట్వీట్ చేశారు. ఆయన కుటుంబ సభ్యులకు, మిత్రులకు, సహచరులకు తన సానుభూతి ప్రకటించారు. వ్యాపార వర్గాలకు ఖైతాన్ మరణం తీరని లోటని ఐసీసీ డైరెక్టర్ జనరల్ రాజీవ్ సింగ్ పేర్కొన్నారు. అటు ఖైతాన్ మృతికి భారత టీ అసోసియేషన్ కూడా సంతాపం తెలిపింది. ఆయన మృతితో ఒక శకం ముగిసిందంటూ తీవ్ర విచారం వ్యక్తం చేసింది. ఒక మార్గదర్శి, నాయకుడిని టీ పరిశ్రమ కోల్పోయిందని ప్రకటనలో పేర్కొంది కాగా కోలకత్తా యూనివర్సిటీ నుంచి బాచిలర్ ఆఫ్ కామర్స్‌లో పట్టా పొందిన ఖైతాన్ ఎవరెడీ బ్యాటరీస్, మెక్లాయడ్ రస్సెల్ వ్యాపారంతో ఒక వెలుగు వెలిగారు. ఈ క్రమంలో పలు కీలక పదవులను చేపట్టారు. ముఖ్యంగా న్యూఢిల్లీలోని ఇంటర్నేషనల్ మేనేజ్మంట్ ఇన్సిట్యూట్ వ్యవస్థాపక సభ్యుడుగా పనిచేశారు. 1986 -1987 మధ్యకాలంలో అంతర్జాతీయ చాంబర్ ఆఫ్ కామర్స్ ఇండియన్ నేషనల్ కమిటీ అధ్యక్షుడిగా ఉన్నారు. 1973లో ఐసీసీ అధ్యక్షుడిగా పనిచేశారు. 1994-2018 వరకు సీఈఎస్ఈకి స్వతంత్ర డైరక్టర్‌గా ఉన్నారు. 2013లో ఇండియన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ (ఐసీసీ) కోల్‌కతా జీవిత సాఫల్య పురస్కారం అందుకున్నారు. కాగా రుణ సంక్షోభంలో చిక్కుకున్న నూరేళ్ల బ్రాండ్ ఎవరెడీ వ్యాపారాన్ని విక్రయించేందుకు ప్రయత్నించారు. Saddened at the passing away of noted industrialist BM Khaitan Ji. He was a much respected elder statesman of the business community of Bengal. My condolences to his family, his colleagues and his friends — Mamata Banerjee (@MamataOfficial) June 1, 2019 -
శంషాబాద్ సాతంరాయి పారిశ్రమికవాడలో అగ్ని ప్రమాదం
-
పారిశ్రామికవేత్త అదృశ్యం
చెన్నై: ఊటీలో హైదరాబాద్‌కు చెందిన పారిశ్రామికవేత్త భీమరాజు అదృశ్యమయ్యాడు. భీమరాజు ఆదివారం నుంచి కనిపించకుండా పోయినట్లు తెలిసింది. భీమరాజును ఎవరైనా కిడ్నాప్ చేసి ఉంటారని కుటుంబసభ్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు కోతగిరి పోలీసులకు కుటుంబసభ్యులు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. -
తాగిన మైకంలో అంబులెన్స్ ఎత్తుకెళ్లాడు
టి.నగర్: మద్యం మత్తులో పారిశ్రామికవేత్త వీరంగం సృష్టించడమేగాక ఆస్పత్రి అంబులెన్స్‌ను అపహరించాడు. ఈ సంఘటన చెన్నైలో ఆదివారం జరిగింది. చెన్నై నుంగంబాక్కంకు చెందిన నిఖిల్ (36) గాయపడిన తన స్నేహితుడిని చికిత్స కోసం థౌజండ్ లైట్స్‌లో ఉన్న ప్రముఖ ప్రైవేటు ఆస్పత్రికి ఆదివారం తెల్లవారుజామున తన లగ్జరీ కారులో తీసుకొచ్చాడు. అతడిని ఆస్పత్రిలో చేర్చి ఇంటికి వెళ్లాలనుకున్న పారిశ్రామికవేత్త మద్యం మత్తులో తన కారును అక్కడే వదిలి అక్కడున్న అంబులెన్స్ తాళం తీసుకున్నాడు. దాని సైడ్ అద్దాలు పగులగొట్టాడు. చివరకు దాన్ని నడుపుకుంటూ వేగంగా వెళ్లిపోయాడు. మద్యం మత్తులోనే నేరుగా పాలవాక్కంలోని తన ఇంటికి చేరాడు. ఆ తర్వాత తేనాంపేటలోగల ఆస్పత్రి బ్రాంచిలో అంబులెన్స్‌ను అందజేయాలని తన కారు డ్రైవర్‌ను పురమాయించాడు. డ్రైవర్ అక్కడికి వెళ్లి అంబులెన్స్ తాళాలు అందజేయడంతో అంబులెన్స్ అపహరణకు గురైనట్లు ఆస్పత్రి సిబ్బంది తెలుసుకున్నారు. ఈ సమాచారం థౌజండ్ లైట్స్ ఆస్పత్రికి తెలపడంతో ఆస్పత్రి ఉద్యోగులు, సెక్యూరిటీ సిబ్బంది కంగుతిన్నారు. దీనిగురించి థౌజండ్‌లైట్స్ పోలీసు స్టేషన్లో ఆస్పత్రి నిర్వాహకులు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి పారిశ్రామికవేత్తను విచారించారు. చివరకు మద్యం మత్తులో అతను అంబులెన్స్‌ను తీసుకువెళ్లినట్లు తెలిసింది. ఆస్పత్రి యాజమాన్యాన్ని పారిశ్రామికవేత్త క్షమాపణ కోరారు. -
టాపర్ల.. షికార్లు!
నర్వ, మరికల్: ‘మంచి మార్కులు తెచ్చుకుంటే ముంబాయికి విహారయాత్రకు తీసుకెళ్తానని.. విమానంలో చక్కర్లు కొట్టిస్తానని.. నగరంలో ఉన్న చూడదగ్గ ప్రదేశాలన్నింటిని చూయిస్తానని పారిశ్రామికవేత్త నర్వ లక్ష్మికాంత్‌రెడ్డి ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు మాటిచ్చారు. చెప్పినట్టుగానే ఉత్తమ గ్రేడులు సాధించిన వారికి విమానంలో తీసుకెళ్లి.. నగరంలో విహారం చేయించారు. విద్యార్థుల్లో నూతనోత్సాహం... నర్వ, మరికల్ మండలాలకు చెందిన టెన్త్ టాపర్లతోపాటు ఈ ఏడాది పదవ తరగతి చదివే విద్యార్థులకు స్ఫూర్తి యాత్ర నూతనోత్సాహం కలిగించింది. రెండు రోజులు కొనసాగిన ఈ యాత్రలో లక్ష్మీకాంత్‌రెడ్డి స్వయంగా శంషాబాద్ నుంచి ముంబైకి తీసుకెళ్లారు. అక్కడి చారిత్రక, ప్రసిద్ధ స్థలాలను విద్యార్థులు వీక్షించారు. తాజ్హోటల్లో కాఫీలు, టిఫిన్లు.. జుహుబీచ్లో అరేబియా సముద్రపు అలల సోయగం.. గరంగరం మసాల దినుసుల ఆరగింపు.. ఆకాశాన్ని తాకే అంభానీ భవంతులు.. వింతలు.. విశేషాలు చూస్తూ విద్యార్థులు ఆనందంతో మునిగిపోయారు. అక్కడి జ్ఞాపకాలు వారి మాటల్లోనే విందాం.. మరిచిపోని అనుభూతి టెన్త్ పరీక్షల్లో టాపర్‌గా వచ్చినందుకు విమానంలో వెళ్లడానికి అవకాశం కల్పించారు. ఇందుకు లక్ష్మీకాంత్‌రెడ్డికి కృతజ్ఙతలు. ఇంకా బాగా చదివితే ఇలాంటి అవకాశాలు మెండుగా ఉంటాయని అనిపిస్తోంది. –శ్రావణి ఇంటర్ మీడియట్ మరికల్ గ్రామం విమాన ప్రయాణం బాగుంది టెన్త్‌లో మండల టాపర్‌గా వచ్చాను. ప్రస్తుతం మహబూబ్‌నగర్‌లోని ప్రతిభ కళాశాలలో ఇంటర్ ఫస్టియర్ చదువుతున్నాను. సర్కారు బడుల్లో సత్తా చాటితే ఇలాంటి యాత్రలుంటాయని తెలిస్తే అందరు పోటీపడి చదువుతారు. – నర్మద, మరికల్ గ్రామం ముంబైలో మస్తుగ తిరిగినం ముంబై వీధుల్లో మస్తుగ తిరిగినం. అంబానీ భవంతి.. తాజ్‌హోటల్, ఆకాశాన్ని తాకే పెద్దపెద్ద ఇళ్లు చూసినం. బీచ్‌లోని బాగా తిరిగినం. ఈ అవకాశం నాకు రావడం అదృష్టంగా భావిస్తున్నా. – నందిని, నర్వ గ్రామం పిల్లలకు కొత్త ఉత్సాహం సర్కారు బడుల్లో చదివే పిల్లలు కారు ప్రయాణానికి కూడా నోచుకోరు. అలాంటిది లక్ష్మీకాంత్‌రెడ్డి సహకారంతో పేద విద్యార్థులు విమానంలో తిరిగారు. అందరు కష్టపడి చదివితే భవిష్యత్‌లో ఇలాంటి రోజులు నిత్యం వస్తాయి. – బాల్‌రాజు, ఎంఈఓ, నర్వ -
నమ్మించి.. ముంచారు...
గుణదల (రామవరప్పాడు): తెలుగు రాష్ట్రాల సీఎంలతో తమకు పరిచయాలున్నాయని మాయమాటలు చెప్పి ఓ పారిశ్రామికవేత్తను నిలువునా మోసం చేసిన ఘటన కృష్ణా జిల్లాలో వెలుగులోకొచ్చింది. పోలీసుల కథనం ప్రకారం.. టిక్కిల్ రోడ్డుకు చెందిన మేదరమెట్ల వైకుంఠలక్ష్మీనారాయణ కొలవెన్నులో మైక్రోకాస్ట్ ప్రైవేటు లిమిటెడ్ కంపెనీ నిర్వహిస్తున్నారు. కొంతకాలంగా ఆయన కంపెనీ నష్టాల్లో నడుస్తోంది. సన్నిహితుల ద్వారా ఆయనకు నందిగామకు చెందిన నర్రా కృష్ణారావు, ఇంద్రాణి దంపతులతోపాటు చెరుకూరి శ్రీలత పరిచయమయ్యారు. నష్టాల్లోని కంపెనీల ను లాభాల్లోకి తెచ్చిన అనుభవం తమకు ఉందంటూ వారు ఆయనను నమ్మించారు. కృష్ణారావుకు కంపెనీలో డైరెక్టర్‌గా అవకాశం కల్పిస్తే తమకున్న పరిచయాలతో రుణాలు తెస్తామని, పెద్ద వాళ్లతో పెట్టుబడులు పెట్టిస్తామని నమ్మబలికారు. లక్ష్మీనారాయణ తన కంపెనీలో కృష్ణారావుకు డైరెక్టర్ స్థానాన్ని కల్పించారు. తర్వాత కృష్ణారావు ఆ ఖర్చులు, ఈ ఖర్చులు, రుణాలు కావాలంటే మేనేజ్ చేయాలని సాకులు చూపుతూ డబ్బులు దండుకోవడం మొదలెట్టాడు. నెలలు గడుస్తున్నా ఎటువంటి ఫలితం లేకపోవడంతో కృష్ణారావును అనుమానించి డైరెక్టర్ స్థానం నుంచి తప్పించారు. అయినా కృష్ణారావు అదే తీరులో రూ.99 లక్షల వరకూ మోసం చేశాడు. తీసుకున్న డబ్బు చెల్లించాలని ఒత్తిడి తేవడంతో కృష్ణారావు సుమారు రూ.62 లక్షలు చెల్లించాడు. మిగిలిన సొమ్ము చెల్లించాలని ఎంతగా ఒత్తిడి తెచ్చినా స్పందించకపోవడంతో లక్ష్మీనారాయణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కృష్ణారావు, ఇంద్రాణి, శ్రీలతను అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచారు. -
15 కోట్లు డిమాండ్.. టీవీ చానల్ చీఫ్ అరెస్ట్
జయనగర(బెంగుళూరు) : పదిహేను కోట్ల రూపాయలు లంచం ఇవ్వాలని లేని పక్షంలో మీకు వ్యతిరేకంగా ప్రచారం చేస్తానని పారిశ్రామికవేత్తను బెదిరించిన ఓ ప్రైవేటు టీవీ చానల్ చీఫ్ ప్రసాద్ తో పాటు అతడి అనుచరుడు నితిన్‌ను కోరమంగల పోలీసులు అరెస్ట్ చేశారు. వివరాలు... ప్రైవేటు టీవీ.చానల్లో చీఫ్‌గా ఉన్న ప్రసాద్ ఓ పారిశ్రామికవేత్త కు వ్యతిరేకంగా కథనాన్ని టీవీలో ప్రసారం చేశాడు. అనంతరం అతడికి ఫోన్ చేసి రూ.15 కోట్లు లంచం ఇవ్వాలని లేని పక్షంలో మీకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున దుష్ప్రచారం చేస్తామని బెదిరించాడు. రూ.15 కోట్లలో ముందుగా రూ.10 కోట్లు చెల్లించాలని, మాకు తెలిసిన వ్యక్తుల పేరుతో అకౌంట్‌కు జమ చేయాలని పారిశ్రామికవేత్తను సూచించాడు. దీనిపై సదరు పారిశ్రామికవేత్త కోరమంగల పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఇరువురిని శనివారం అరెస్ట్ చేశారు. వీరిపై కోరమంగల పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. -
'వైఫ్ స్వాపింగ్' ఒప్పుకోనందుకు..!
అత్తింటి వేధింపులపై పోలీసులకు ఫిర్యాదు బాధితురాలు ప్రముఖ వ్యాపారవేత్త త్రైలోక్య నాథ మిశ్రా కోడలు భువనేశ్వర్: అత్తింటి వారి నుంచి తన ప్రాణాలకు ముప్పు ఉందని రాష్ట్రంలో ప్రముఖ పారిశ్రామికవేత్త త్రైలోక్యనాథ మిశ్రా కోడలు లోపముద్ర మిశ్రా పోలీసులను ఆశ్రయించారు. మంగళ వారం రాత్రి తన ప్రాణానికి ముప్పు ఉందని బెదిరించారని స్థానిక బర్గడ్ పోలీసు ఠాణాలో బుధవారం ఉదయం ఫిర్యాదు చేశారు. తన కుమారుడిని అపహరిస్తామని అత్త, మామ బెదిరించారని పేర్కొన్నారు. పెళ్లయిన కొత్తలో హానీ మూన్ నేపథ్యంలో విదేశీ పర్యటనకు వెళ్లారు. అక్కడ వైఫ్ స్వాపింగ్ (భార్యల బదిలీ) కాలక్షేపానికి ఆమె నిరాకరించడంతో వైవాహిక జీవితం తొలి దశలోనే తనపట్ల భర్త అమానుషంగా వ్యవహరించినట్లు ఆలస్యంగా వెలుగులోకి తెచ్చారు. పెద్దింటి కోడలిగా సమాజంలో గౌరవం కాపాడుకుంటు పుట్టింటికి అగౌరవం కలగకుండా జాగ్రత్తపడేందుకు చాల కాలం ఓపికతో వ్యవహరించడంతో రోజు రోజుకు వేధింపులు తీవ్రంగా మారాయి తప్ప పరిస్థితులు కుదుటపడనట్లు ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. నెల రోజుల కిందట వేధింపుల గురించి స్థానిక ఠాణాలో ఫిర్యాదు చేసినా పోలీసులు చర్యలు తీసుకోలేదని ఆరోపించారు. దీంతో తనను హత్య చేస్తామని అత్తింటి వారు బెదిరించారని పేర్కొన్నారు. 2006 సంవత్సరం జనవరి నెల 27వ తేదీన పారిశ్రామికవేత్త త్రైలోక్యనాథ మిశ్రా కుమారుడు సవ్యసాచి మిశ్రాతో ఆమెకి వివాహం జరిగింది. భర్త వేధింపులకు అత్త ఆశా మంజరి మిశ్రా, మామ త్రైలోక్యనాథ మిశ్రా పరోక్షంగా మద్దతు ఇచ్చి ప్రోత్సహించినట్లు బహిరంగపరిచారు. ఈ మేరకు స్థానిక మహిళా ఠాణాలో ఆమె ఫిర్యాదు దాఖలు చేశారు. ఫలితం శూన్యం కావడంతో ఈసారి స్థానిక బర్గడ్ ఠాణాలో మరో ఫిర్యాదు దాఖలు చేశారు. పోలీసుల నిర్వీర్యతపట్ల నగర డీసీపీ సత్యబ్రొతొ భొయి స్పందించారు. లోపముద్ర ఆరోపణల నేపథ్యంలో తక్షణమే చర్యలు చేపడతామని ఆయన బుధ వారం మీడియాకు తెలియజేశారు. మహిళా ఠాణా పోలీసుల నిర్వీర్యత ఖాతరు చేయకుండా నగర పోలీసు కమిషనరేటు ఆధ్వర్యంలో కౌన్సిలింగుకు అభ్యర్థించి చేసిన ప్రయత్నాలు కూడ ఫలించనట్లు ఆమె విచారం వ్యక్తం చేశారు. -
జోగులాంబ సేవలో నిమ్మగడ్డ ప్రసాద్
ఆలంపూర్ (మహబూబ్‌నగర్) : ప్రముఖ పారిశ్రామికవేత్త నిమ్మగడ్డ ప్రసాద్ మహబూబ్‌నగర్ జిల్లా ఆలంపూర్లోని జోగులాంబ ఆలయంలో పూజలు చేశారు. కుటుంబసభ్యులతో కలసి గురువారం ఉదయం ఆలయానికి చేరుకున్న ఆయనకు అర్చకులు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం వారు జోగులాంబకు ప్రత్యేక పూజలు నిర్వహించారు.