
కృష్ణా జిల్లాకు పారిశ్రామికవేత్తకు బెదిరింపులు
విజయవాడ: కృష్ణా జిల్లాకు చెందిన పారిశ్రామికవేత్త పుట్టగుంట సతీష్‌కు మావోయిస్ట్‌ల పేరుతో బెదిరింపు ఫోన్‌కాల్స్ వస్తున్నాయి. భారీ మొత్తంలో నగదు తమ బ్యాంకు అకౌంట్‌లో జమ చేయాలని ఆగంతుకులు బెదిస్తున్నారు.
మావోయిస్టు అగ్రనేత గణపతి పేరుతో ఆగంతకులు ఫోన్ చేస్తున్నారు. బాధితుడి ఫిర్యాదు మేరకు జిల్లా పోలీసులు రహస్య విచారణ చేపట్టారు. ఈ ఫోన్ కాల్స్ వరంగల్, కరీంనగర్ నుంచి వస్తున్నట్లుగా గుర్తించారు. ఆంగతకులను పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.