జయనగర(బెంగుళూరు) : పదిహేను కోట‍్ల రూపాయలు లంచం ఇవ్వాలని లేని పక్షంలో మీకు వ్యతిరేకంగా ప్రచారం చేస్తానని పారిశ్రామికవేత్తను బెదిరించిన ఓ ప్రైవేటు టీవీ చానల్ చీఫ్ ప్రసాద్ తో పాటు అతడి అనుచరుడు నితిన్‌ను కోరమంగల పోలీసులు అరెస్ట్ చేశారు.
వివరాలు... ప్రైవేటు టీవీ.చానల్‌లో చీఫ్‌గా ఉన్న ప్రసాద్ ఓ పారిశ్రామికవేత్త కు వ్యతిరేకంగా కథనాన్ని టీవీలో ప్రసారం చేశాడు. అనంతరం అతడికి ఫోన్ చేసి రూ.15 కోట్లు లంచం ఇవ్వాలని లేని పక్షంలో మీకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున దుష్ప్రచారం చేస్తామని బెదిరించాడు. రూ.15 కోట్లలో ముందుగా రూ.10 కోట్లు చెల్లించాలని, మాకు తెలిసిన వ్యక్తుల పేరుతో అకౌంట్‌కు జమ చేయాలని పారిశ్రామికవేత్తను సూచించాడు. దీనిపై సదరు పారిశ్రామికవేత్త కోరమంగల పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఇరువురిని శనివారం అరెస్ట్ చేశారు. వీరిపై కోరమంగల పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
15 కోట్లు డిమాండ్.. టీవీ చానల్ చీఫ్ అరెస్ట్
Published Sun, Apr 16 2017 8:02 AM | Last Updated on Mon, Aug 20 2018 4:30 PM
Advertisement