రాష్ట్రంలో నాలుగేళ్లలో మహిళలు సొంతంగా 2.17 లక్షల ఎంఎస్‌ఎంఈలు ఏర్పాటు
రూ.7,229.41 కోట్లు పెట్టుబడి.. టర్నోవర్ రూ.73,435.96 కోట్లు
18.03 లక్షల మందికి ఉద్యోగాలు
కేంద్రం వద్ద నమోదు కాని మహిళా ఎంఎస్‌ఎంఈలు మరో 4.73 లక్షలు
వీటి ద్వారా 6.22 లక్షల మందికి ఉద్యోగాలు
కేంద్ర సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల మంత్రిత్వ శాఖ వెల్లడి
సాక్షి, అమరావతి: సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అందించిన చేయూతతో రాష్ట్రంలో మహిళలు పారిశ్రామికవేత్తలుగా ఎదుగుతున్నారు. రాష్ట్రంలోని యువతకు ఉపాధి కల్పించేందుకు జగన్ ప్రభుత్వం ఎంఎస్‌ఎంఈలకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తోంది. సూక్ష్మ, చిన్న, మధ్య తరహా (ఎంఎస్‌ఎంఈ) పరిశ్రమలు ఏర్పాటు చేసే వారికి పలు ప్రోత్సాహకాలు అందిస్తోంది. వీటిని సది్వనియోగం చేసుకుంటూ మహిళలు సొంతంగా ఎంఎస్‌ఎంఈలను ఏర్పాటు చేసి, మరికొందరికి ఉపాధి చూపుతూ ఆదర్శంగా నిలుస్తున్నారు.
రాష్ట్రంలో గత నాలుగేళ్లలో అంటే.. 2022 జూలై నుంచి 2024 జనవరి వరకు రాష్ట్రంలో మహిళలు సొంతంగా 2,17,359 ఎంఎస్‌ఎంఈలను ఏర్పాటు చేసి నిర్వహిస్తున్నట్లు కేంద్ర సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల మంత్రిత్వ శాఖే వెల్లడించింది. ఈ మహిళా ఎంఎస్‌ఎంఈల ద్వారా 1,8,03,672 మంది యువతకు ఉద్యోగాలు లభించాయని తెలిపింది. ఈ మహిళా ఎంఎస్‌ఎంఈల ఏర్పాటుకు రూ.7,229.41 కోట్లు పెట్టుబడిగా పెట్టారని, వీటి టర్నోవర్ రూ.73,435.96 కోట్లుగా ఉందని వెల్లడించింది.
ఇవన్నీ అధికారికంగా ఎంఎస్‌ఎంఈ మంత్రిత్వ శాఖ వద్ద నమోదైన ఎంఎస్‌ఎంఈలు కాగా, ఇప్పటికీ నమోదు కాని ఎంఎస్‌ఎంఈలు రాష్రంలో 2023 జనవరి 11 నుంచి 2024 జనవరి 31 వరకు ఒక్క ఏడాదిలోనే మరో 4,73,932 మహిళా ఎంఎస్‌ఎంఈలు ఏర్పాటు చేశారని, వీటి ద్వారా 6,,22,389 మందికి ఉద్యోగావకాశాలు లభించాయని పేర్కొంది. మహిళా యాజమాన్యంలోని ఎంఎస్‌ఎంఈలను ప్రోత్సహించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనేక చర్యలు తీసుకుంటున్నట్లు కేంద్ర మంత్రిత్వ శాఖ తెలిపింది.
ఈ ఎంఎస్‌ఎంఈలకు ప్రధానమంత్రి ఎంప్లాయిమెంట్ జనరేషన్ పోగ్రామ్ (పీఎంఈజీపీ) కింద క్రెడిట్ గ్యారెంటీ నిధి నుంచి ఆరి్ధక సాయం అందిస్తున్నట్లు తెలిపింది. మహిళల్లో వ్యవస్థాపకతను ప్రోత్సహించడానికి నైపుణ్యాలను అమలు చేస్తోందని పేర్కొంది. ప్రత్యేకంగా మహిళల ఎంఎస్‌ఎంఈలను ఉద్యమం పోర్టలో రిజి్రస్టేషన్‌కు ప్రత్యేక డ్రైవ్‌లు నిర్వహించి, వారికి అవరమైన సహాయ సహకారాలు అందిస్తున్నట్లు పేర్కొంది.
పారిశ్రామికవేత్తలకు సీఎం జగన్ చేయూత
రాష్ట్రంలో వైఎస్ జగన్ ప్రభుత్వం కూడా సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలను పలు విధాలుగా ప్రోత్సహిస్తోంది. ముఖ్యంగా మహిళలు స్థాపించే ఎంఎస్‌ఎంఈలకు మరిన్ని ప్రోత్సాహకాలు అందిస్తోంది. దీంతో రాష్ట్రంలో మహిళలు పెద్ద ఎత్తున సూక్ష్మ, చిన్న పరిశ్రమలు ఏర్పాటు చేస్తున్నారు. గత చంద్రబాబు ప్రభుత్వం ఎంఎస్‌ఎంఈలతో పాటు పరిశ్రమలకు రాయితీలు ఇవ్వకుండా పెద్ద ఎత్తున బకాయిలు పెట్టింది. దీంతో ఎంఎస్‌ఎంఈలు కోలుకోలేని దెబ్బతిన్నాయి. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి గత ప్రభుత్వ బకాయిలను కూడా చెల్లించడంతో పాటు ఎంఎస్‌ఎంఈలకు రూ.2,087 కోట్లు రాయితీలుగా చెల్లించారు. ముఖ్యంగా కోవిడ్ సమయంలో ఎంఎస్‌ఎంఈలను రాష్ట్ర ప్రభుత్వం ఆదుకుంది. దీంతో ఆ పరిశ్రమలన్నీ కోవిడ్ సంక్షోభం నుంచి కోలుకొని, నిలదొక్కుకోవడమే కాకుండా, రాష్ట్రంలో మరిన్ని పరిశ్రమల ఏర్పాటుకు మార్గం సుగమమైంది.
Comments
Please login to add a commentAdd a comment