యశ్ బిర్లా కోసం లుకౌట్ నోటీసు | Lookout notice issued against Yash Birla in cheating case | Sakshi
Sakshi News home page

యశ్ బిర్లా కోసం లుకౌట్ నోటీసు

Published Sat, Feb 1 2014 4:25 PM | Last Updated on Sat, Sep 2 2017 3:15 AM

యశ్ బిర్లా కోసం లుకౌట్ నోటీసు

యశ్ బిర్లా కోసం లుకౌట్ నోటీసు

పారిశ్రామికవేత్త యశ్ బిర్లా కోసం ఓ చీటింగ్ కేసులో లుకౌట్ నోటీసు జారీ అయ్యింది. అతడిపైన, అతడి సంస్థ బిర్లా పవర్ సొల్యూషన్స్పైన ఫిర్యాదులు వచ్చినట్లు పోలీసులు తెలిపారు. ముంబై పోలీసు శాఖలోని ఆర్థిక నేరాల విభాగం (ఈవోడబ్ల్యు) వారు ఈ నోటీసు జారీ చేశారు. తొలిసారిగా ముంబై మెరైన్ డ్రైవ్ పోలీసులు 2013 డిసెంబర్ 31వ తేదీన ఈ కేసు నమోదు చేశారు. వర్లి ప్రాంతానికి చెందిన ఓ వ్యాపార వేత్తను బిర్లా పవర్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ కోటి రూపాయల మేర మోసం చేసిందని కేసు నమోదైంది.

తాను చేసిన ఫిక్స్డ్ డిపాజిట్ కాలపరిమితి తీరినా తిరిగి చెల్లించలేదని అతడు కేసు పెట్టాడు. అనంతరం ఈ కేసు ఈవోడబ్ల్యు విభాగానికి బదిలీ అయ్యింది. ఇప్పటివరకు ఇలా 28 మంది పెట్టుబడిదారులు ఈవోడబ్ల్యును ఆశ్రయించారు. అంతా కలిసి రూ. 20 కోట్ల మేర యశ్ బిర్లా తమను మోసం చేశాడని పేర్కొన్నారు. పోలీసులు ఇప్పటికే బిర్లా పవర్ మాజీ ఎండీ పీవీఆర్ మూర్తిని ఈ కేసులో అరెస్టు చేశారు. బిర్లాపై లుకౌట్ నోటీసును అన్ని అంతర్జాతీయ విమానాశ్రయాలు, నౌకాశ్రయాలకు పంపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement