పారిశ్రామికవేత్తపై ఐటీ దాడులు: సమారు రూ.200 కోట్లు | Income Tax Officers Raid On Industrialist In Adilabad District | Sakshi

పారిశ్రామికవేత్తపై ఐటీ దాడులు: సమారు రూ.200 కోట్లు

Dec 17 2019 8:15 PM | Updated on Dec 17 2019 8:58 PM

Income Tax Officers Raid On Industrialist In Adilabad District - Sakshi

సాక్షి, ఆదిలాబాద్‌: ప్రముఖ పారిశ్రామికవేత్త రఘునాథ్ మిత్తల్ ఇంటితో పాటు ఆయన పరిశ్రమల్లో ఇన్‌కం టాక్స్ అధికారుల బృందం మంగళవారం దాడులు చేసింది. జిల్లాలోని నాలుగు చోట్లతో పాటు హైదరాబాద్‌లోని పలు వ్యాపార స్థావరాలపై ఏకకాలంలో ఐటీ అధికారుల దాడులకు చేశారు. రఘునాథ్‌ మిత్తల్‌ వ్యాపార లావాదేవీలు, ఆస్తులుకు సంబంధించిన వివరాలపై ఐటీ అధికారులు సోదాలు నిర్వహించారు.

ఉదయం నుంచి కొనసాగుతున్న ఇన్‌కం టాక్స్‌ సోదాలకు సంబంధించిన విషయం సాయంత్రం వరకూ బయటకు తెలియలేదు. ఐటీ అధికారులు ఈ సోదాల్లో రఘునాథ్‌ మిత్తల్‌కు సంబంధించిన సుమారు రూ. 200 కోట్లు లెక్కల్లో తేలని ఆస్తులను గుర్తించినట్లు తెలస్తోంది. కాని అధికారికంగా మాత్రం సంబంధిత అధికారులు దీనిపై స్పందించలేదు. ఆదిలాబాద్‌కు చెందిన రఘునాథ్‌ మత్తల్‌కు సంబంధించి ఢిల్లీ, పంజాబ్‌ రాష్ట్రాల్లో పలు వ్యాపారాలు, ఆస్తులు ఉన్నప్పటికీ.. ఆయా చోట్ల ఐటీ దాడులకు సంబంధించిన సమాచారం తెలియరాలేదు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement