charred to death
-
బస్సులో మంటలు : ఐదుగురు సజీవ దహనం
సాక్షి, బెంగళూరు : కర్ణాటకలోని చిత్రదుర్గ జిల్లాలో బుధవారం తెల్లవారుజామున ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. విజయపుర నుండి బెంగళూరు వెళ్తున్న ఒక ప్రైవేట్ బస్సు మంటల్లో చిక్కుకోవడంతో ఐదుగురు సజీవ దహనమయ్యారు. చిత్రదుర్గ జిల్లాలో హిరియూర్ తాలూకాలోని కెఆర్ హళ్లి వద్ద జాతీయ రహదారిపై అకస్మాత్తుగా బస్సులో మంటలు చెలరేగడంతో ఈ విషాదం చోటు చేసుకుంది. 32 మంది ప్రయాణికులతో వస్తున్న ఈ బస్సులో ఇంజీన్ సమస్య కారణంగా ప్రమాదం జరిగినట్టు ప్రాథమిక సమాచారం ద్వారా తెలుస్తోంది. మృతుల్లో ఇద్దరు పిల్లలు, ఒక మహిళ ఉన్నారు. క్షతగాత్రులను జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. హిరియూర్ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాద స్థలానికి చేరుకున్న హిరియూర్ ఎస్పీ రాధిక సహాయ కార్యక్రమాలను పర్యవేక్షిస్తున్నారు. ఈ ప్రమాదంపై మరిన్ని వివరాలు అందాల్సి ఉంది. Karnataka: Five people, including a baby, charred to death and 27 injured, last night in Hiriyur near Chitradurga district, after their bus caught fire on National Highway 4. The injured have been shifted to hospital. pic.twitter.com/Je1PxEbTv4 — ANI (@ANI) August 12, 2020 -
పానిపట్‌లో అగ్నిప్రమాదం: ఏడుగురు సజీవదహనం
చంఢీఘడ్(హరియాణ): పానిపట్‌లోని కోహాడ్ గ్రామంలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. దుప్పట్ల పరిశ్రమలో మంటలు చెలరేగడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. మంటల్లో ఏడుగురు సజీవ దహనం అయ్యారు. మరో 15 మందికి గాయాలయ్యాయి. మృతులందరూ పరిశ్రమలో పని చేసే కూలీలుగా సమాచారం. షార్ట్ సర్క్యూట్ కారణంగానే మంటలు వ్యాపించినట్టు తెలుస్తోంది. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. -
అగ్నిప్రమాదం : ఆరుగురు సజీవదహనం
లాహోర్ : పాకిస్థాన్‌లోని లాహోర్ నగరంలో గురువారం విషాదం చోటు చేసుకుంది. మూడంతస్తుల భవనంలో అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ఆరుగురు సజీవదహనమైయ్యారు. ఈ ఘటన ఈ రోజు తెల్లవారుజామున 3.30 ప్రాంతంలో చోటు చేసుకుందని ఉన్నతాధికారులు వెల్లడించారు. స్థానికులు వెంటనే స్పందించి... అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. అయితే ఘటన స్థలం ఇరుకు ప్రాంతంలో ఉండటంతో ఫైరింజన్లతో అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకోలేపోయారు. దీంతో కొద్ది దూరం నుంచి అగ్నిమాపక సిబ్బంది దాదాపు ఐదు గంటల పాటు శ్రమించి మంటలార్పివేశారు. మృతులంతా ఒకే కుటుంబానికి చెందిన వారని పోలీసులు తెలిపారు. మృతుల్లో నాలుగేళ్ల బాబు కూడా ఉన్నారని చెప్పారు. ప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. అలాగే నలుగురిని రక్షించినట్లు పోలీసులు పేర్కొన్నారు. -
బస్సు ప్రమాదం పై స్పందించిన యాజమాన్యం
-
అతివేగమే బస్సు ప్రమాదానికి కారణం
-
వామ్మో వోల్వో....
-
కర్ణాటకలో బస్సు ప్రమాదం, ఏడుగురు సజీవ దహనం
-
కారులో సజీవ దహనమైన పారిశ్రామిక వేత్త
నాసిక్: స్థానిక పారిశ్రామికవేత్త ఒకరు కారుకు మంటలు అంటుకోవడంతో సజీవ దహనమయ్యారు. స్థానిక పారిశ్రామిక వేత్త రిచర్డ్ మార్షల్ డిసౌజా ఉత్తర మహారాష్ట్ర గోవర్ధనే గ్రామం సమీపంలో మారుతి 800 కారులో వస్తుండగా హఠాత్తుగా మంటలు అంటుకున్నాయి. అంగవైకల్యం వలన ఆయన కారును ఆధునీకరించి బ్రెక్, క్లచ్ చేతితోనే ఉపయోగిస్తారు. మంటులో చుట్టుముట్టడంతో కారు నుంచి బయటకు రాలేక అందులోనే సజీవంగా దాహనమయ్యాడని తెలిసింది. సీ అండ్ ఎం ఫార్మింగ్ కంపెనీకి డిసౌజా వ్యవస్థాపకుడే కాక చెర్మైన్‌గా వ్యవహరిస్తున్నారు. కారులో మంటలు ఎలా చెలరేగాయనే విషయంలో ఇంకా అంచనాకు రావాల్సి ఉందని పోలీసు అధికారులంటున్నారు.