ముంబై: కరోనా మహమ్మారి రాకతో ప్రపంచం మొత్తం పూర్తిగా అతలాకుతలామయ్యింది. ప్రపంచ వ్యాప్తంగా లక్షల సంఖ్యలో మరణాలు సంభవించాయి. కరోనా సెకండ్ వేవ్‌తో మన దేశం కూడా పూర్తిగా కుదేలయ్యింది. కరోనా వైరస్‌ను ఎదుర్కొడానికి వ్యాక్సిన్ ఒక్కటే శ్రీ రామ రక్ష..! అని పరిశోధకులు, ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇప్పటికే తెలిపారు. కాగా ప్రపంచంలోని పలు దేశాల్లో ఇప్పటికే వ్యాక్సినేషన్ ప్రక్రియ మొదలైంది. మన దేశంలో కూడా వ్యాక్సినేషన్ ప్రక్రియను కేంద్ర ప్రభుత్వం వేగవంతం చేసింది. వ్యాక్సిన్ తీసుకున్నవారికి జ్వరం, జలుబు, ఒళ్లు నొప్పులు వస్తాయనే విషయం తెలిసిందే.
కాగా, నాసిక్ చెందిన 71 ఏళ్ల అరవింద్ సోనార్ అనే వ్యక్తి వ్యాక్సిన్ తీసుకున్న తరువాత అతడి శరీరం అయస్కాంతంలాగా మారిపోయింది. అరవింద్ మమూలుగానే దగ్గరలో ఉన్న ఆసుపత్రిలో కోవిషిల్డ్ రెండో డోసును వేయించుకున్నాడు. కొన్ని రోజుల తరువాత అతని శరీరం అయస్కాంతంలాగా మారిపోయింది. అతణ్ని శరీరం ఇనుప వస్తువులను, కాయిన్స్‌ను, చెంచాలను అయస్కాంతంలాగా ఆకర్షించుకుంటుంది. అందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌మీడియాలో హల్‌చల్ చేస్తోంది.
ప్రసుత్తం ఈ వీడియో వైరల్‌గా మారింది. నెటిజన్లు ఆ వ్యక్తిని రియల్ లైఫ్ మ్యాగ్నటో(ఎక్స్ మెన్ లోని ఒక సూపర్ హీరో పాత్ర) అని కామెంట్లు చేస్తున్నారు. ఈ విషయంపై జిల్లా మెడికల్ అధికారులు స్సందించారు. ప్రస్తుతం ఈ విషయంపై విచారణ చేస్తున్నామని పేర్కొన్నారు. ఇదిలా ఉండగా.. ఈ విషయంపై సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (సిడిసి) తన వెబ్‌సైట్‌లో వ్యాక్సిన్‌ను తీసుకున్న వారి శరీరం ఎలాంటి అయస్కాంత పదార్థాలుగా మారదని తెలిపింది. కోవిడ్-19 టీకాలు తీసుకున్న ప్రదేశంలో ఎలాంటి విద్యుదయస్కాంత క్షేత్రాన్ని ఉత్పత్తి చేయగల పదార్థాలను కలిగి ఉండవని తెలిపారు. కోవిడ్-19 టీకాల తయారీలో ఇనుము, నికెల్, కోబాల్ట్, లిథియం, వంటి మిశ్రమాలకు తావులేదని తెలిపింది. అంతేకాకుండా కరోనాను జయించాలంటే వ్యాక్సినేషన్ ఒక్కటే సరైన మార్గమని తెలిపింది. ఇలాంటి వార్తలను నమ్మకూడదని సీడీసీ పేర్కొంది.
చదవండి: వైరల్: మాస్క్ పెట్టుకున్నాడు.. మొహం వింతగా మారిపోయిందే!
Comments
Please login to add a commentAdd a comment