పెరిగిన ఉల్లి ధర | Onion price rise | Sakshi
Sakshi News home page

పెరిగిన ఉల్లి ధర

Published Sun, Nov 10 2013 11:48 PM | Last Updated on Sat, Sep 2 2017 12:30 AM

Onion price rise

నాసిక్:  టోకు మార్కెట్‌లో ధరల పెరుగుదల ప్రభావం చిల్లర మార్కెట్‌పై పడింది. కిలో ఉల్లిపాయలను చిల్లర వ్యాపారులు రూ. 65కి విక్రయిస్తున్నారు. దీంతో సామాన్యులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. మరోవైపు దీపావళి తర్వాత టోకు మార్కెట్‌కు ఉల్లిపాయ ల రాక కూడా బాగా తగ్గింది. గతవారం కిలో ఉల్లిపాయలు రూ.50 పలికిన సంగతి విది తమే. గడిచిన తొమ్మిదిరోజుల వ్యవధిలో జిల్లాలోని లసల్గావ్‌లోని వ్యవసాయ మార్కెట్‌లో ఉల్లిపాయల ధరలు రూ. 56 శాతంమేర పెరి గాయి. గత నెల 31వ తేదీన క్వింటాల్ ఉల్లిపాయలు రూ. 3,200గా ఉండగా అది ఈ నెల ఎనిమిది నాటికి రూ.5,000లకు చేరుకుంది. ఇందుకు కారణం ఈ మార్కెట్‌కు ఉల్లిపాయల రాక గణనీయంగా తగ్గిపోవడమే.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement