పట్టాలు తప్పిన రైలు.. ఐదుగురి మృతి | Mangala Express derails, 5 dead and 50 injured | Sakshi
Sakshi News home page

పట్టాలు తప్పిన రైలు.. ఐదుగురి మృతి

Published Fri, Nov 15 2013 8:00 AM | Last Updated on Sat, Sep 2 2017 12:38 AM

Mangala Express derails, 5 dead and 50 injured

మహారాష్ట్రలోని నాసిక్ సమీపంలో శుక్రవారం తెల్లవారుజామున రైలు ప్రమాదం జరిగింది. నాసిక్కు దగ్గరలో ఉన్న ఘోటి అనే ప్రాంతం వద్ద మంగళ ఎక్స్ప్రెస్ పట్టాలు తప్పింది. ఆరు బోగీలు పట్టాలు తప్పినట్లు తెలుస్తోంది. కేరళలోని ఎర్నాకులం నుంచి హజ్రత్ నిజాముద్దీన్ వెళ్తున్న ఈ రైలు పట్టాలు తప్పింది.  

ఈ ప్రమాదంలో ఐదుగురు మరణించగా సుమారు 50 మందికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను సమీపంలోని ఆస్పత్రికి తరలించి చికిత్సలు అందిస్తున్నారు. రైలు ఎందుకు పట్టాలు తప్పిందన్న విషయం ఇంకా తెలియరాలేదు. మరిన్ని వివరాలు ఇంకా అందాల్సి ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement