ముంబై: మహారాష్ట్రలోని నాసిక్ జిల్లాలోని ఆర్టిలరీ సెంటర్ విషాదం చోటు చేసుకుంది. ఫైరింగ్ ప్రాక్టీస్ చేస్తున్న సమయంలో ఇండియన్ ఫీల్డ్ గన్ నుంచి షెల్ పేలడంతో ఇద్దరు అగ్నివీరులు మరణించారు. ఈ ఘటన గురువారం మధ్యాహ్నం నాసిక్ రోడ్ ప్రాంతంలోని ఆర్టిలరీ సెంటర్‌లో జరిగిందని పోలీసు ఉన్నతాధికారులు వెలిపారు. ఈ పేలుడులో అగ్నివీరులు.. గోహిల్ విశ్వరాజ్ సింగ్ (20), సైఫత్ షిత్ (21) మృతి చెందినట్లు తెలిపారు.
STORY | Two Agniveers killed as shell explodes during firing practice in #Nashik
READ: https://t.co/lPzSFYotFb pic.twitter.com/lBdQhzJcyQ— Press Trust of India (@PTI_News) October 11, 2024
క్రెడిట్స్: Press Trust of India
అగ్నివీర్‌ల బృందం ఇండియన్ ఫీల్డ్ గన్‌తో కాల్పులు జరుపుతుండగా అందులోని షెల్ ఒకటి పేలిపోయింది. దీంతో ఇద్దరు అగ్ని వీరులు తీవ్ర గాయాలపాలు అయ్యారు. వెంటనే వారిని డియోలాలిలోని ఎంహెచ్ ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే వారు మృతిచెందనట్లు డాక్టర్లు ప్రకటించారు. హవల్దార్ అజిత్ కుమార్ ఫిర్యాదు మేరకు డియోలాలి క్యాంపు పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి తదుపరి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment