నాసిక్‌లో హిట్‌ అండ్‌ రన్‌.. మహిళ మృతి | Another Hit And Run Case In Maharashtra | Sakshi
Sakshi News home page

నాసిక్‌లో హిట్‌ అండ్‌ రన్‌.. మహిళ మృతి

Published Wed, Jul 10 2024 9:11 AM | Last Updated on Wed, Jul 10 2024 9:22 AM

Another Hit And Run Case In Maharashtra

నాసిక్‌: ముంబయిలో బీఎండబ్ల్యూ కారు ఢీకొట్టి మహిళ మృతి చెందిన ఘటన మరువక ముందే మరో హిట్‌ అండ్‌ రన్‌ ఘటన మహారాష్ట్రలో జరిగింది.  నాసిక్‌ నగరంలోని గంగాపూర్‌ రోడ్డులో 36 ఏళ్ల వైశాలి షిండేను వెనుక నుంచి వేగంగా వచ్చిన కారు ఢీకొట్టింది. 

కారు వేగంగా ఢీకొట్టడంతో ఆమె ఏకంగా 20 మీటర్ల దూరంలో ఎగిరి పడింది. ఈ దృశ్యాలు సీసీ కెమెరాలో నమోదయ్యాయి.  ఈ ఘటనలో మహిళ ప్రాణాలు కోల్పోయింది. మహిళను ఢీకొట్టిన అనతరం కారు ఆగకుండా వెళ్లిపోయింది. ఈ మధ్యే ముంబయి నగరంలోని వర్లిలో దంపతులు స్కూటర్‌పై వెళుతుండగా వెనుక నుంచి వేగంగా వచ్చిన బీఎండబ్ల్యూ కారు వారిని ఢీకొట్టింది. 

ఈ ప్రమాదంలో మహిళ దుర్మరణం పాలయింది. కారు ఢీకొట్టడమే కాకుండా మహిళను ఒకటిన్నర కిలోమీటరు దూరం ఈడ్చుకెళ్లింది. ఈ కేసులో నిందితుడు, అధికార శివసేన నేత కొడుకు అయిన మిహిర్‌షాను మూడు రోజుల తర్వాత అరెస్టు చేశారు.  అంతకుముందు ఇదే ఏడాది పుణెలో పోర్షే కారు ఢీకొట్టిన ఘటనలో ఇద్దరు సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్లు మృతిచెందిన ఘటన దేశవ్యాప్తంగా సంచలనం రేపింది.  

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
Advertisement
 
Advertisement
 
Advertisement