ఏం బుర్రరా అయ్యా! చిరుతకే షాకిచ్చాడు..! | 12 Years Old Boy Mohit Ahire Locked A Leopard Inside An Office Cabin, Video Goes Viral On Social Media - Sakshi
Sakshi News home page

ఏం బుర్రరా అయ్యా! చిరుతకే షాకిచ్చాడు..!

Published Wed, Mar 6 2024 5:11 PM | Last Updated on Wed, Mar 6 2024 6:14 PM

amazing video Mohit Ahire boy locked a leopard inside an office cabin - Sakshi

చిరుతపులి వస్తే పెద్దవాళ్లమే కంగారు పడిపోతాం.. అస్సలు ఏం చేయాలో తోచదు.. కానీ ఒక 12 ఏళ్ల బుడ్డోడు మాత్రం భలే చాకచక్యంగా వ్యవహరించాడు.  అదీ చాలా తాపీగా...దీనికి  సంబంధించిన సీసీటీవీ ఫుటేజీ వైరల్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

సీసీటీవీలో రికార్డైన ఈ ఘటన నాసిక్‌లోని మాలేగావ్‌లో వెలుగుచూసింది. మోహిత్ అహిరే (12)  ఇంటి మెయిన్‌ డోర్‌ తలుపు దగ్గరే ఉన్న సోఫాలో కూర్చుని స్మార్ట్‌ఫోన్‌ మొబైల్ గేమ్‌లో మునిగిపోయాడు. ఇంతలో ఎక్కడినుంచి వచ్చిందో తెలియదుగానీ, నేరుగా ఇంట్లోకి వచ్చేసింది చిరుతపులి. అనూహ్యంగా  మోహిత్‌కి అతి సమీపంనుంచే లోపలికి దర్జాగా ఎంట్రీ ఇచ్చేసింది. 

ఇది చూసిన మోహిత్‌ ఏమాత్రం కంగారు పడకుండా అక్కడినుంచి లేచి, బయటికి వచ్చేసి, తలుపు లాక్‌ చేశాడు.  ఈ దృశ్యాలు సీసీటీవలో రికార్డ్‌ అయ్యాయి. అతని రియాక్షన్‌ ఇపుడు ఇంటర్నెట్‌లో ప్రశంసల్ని దక్కించు కుంటోంది. వన్య ప్రాణులు  ఎదురుపడి నపుడు ప్రశాంతంగా ఉండటం, అక్కడినుంచి తప్పించుకోవడం అనే విషయాలను గుర్తు చేసింది.

మోహిత్ అహిరే తండ్రి మ్యారేజ్‌ హాల్‌లో సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్నాడు. ఆఫీస్ క్యాబిన్‌లో కూచుని గేమ్‌ ఆడుకుంటుండగా మంగళవారం ఉదయం 7 గంటల ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఫారెస్ట్‌ అధికారులు వచ్చేంతవరకు ఆఫీసు క్యాబిన్‌లో దానిని బంధించారు.  ‘‘ముందు దాన్ని చూడగానే షాక్‌ అయ్యా..కానీ, వెంటనే తేరుకుని బైటపడ్డా..తలుపును వేగంగా లాక్ చేశా..’’అంటూ  తన అనుభవాన్ని గుర్తు చేసుకున్నాడు మోహిత్‌ 

అంతకుముందే సమీప నివాస ప్రాంతంలో చిరుతపులిని గమనించారు స్థానికులు. తరువాత  మ్యారేజ్‌ హాల్‌ యజమానికి ఫిర్యాదు మేరకు పోలీసులు, అటవీశాఖ అధికారులు , అధికారులు వేగంగా స్పందించారు. ఐదేళ్ల మగ చిరుతపులిని బంధించారు. సమీపంలోనే వ్యవసాయ పొలాలు, నది ఉండటం వల్ల ఈ ప్రాంతంలో అప్పుడప్పుడు చిరుతపులులు కనిపిస్తున్నాయని అటవీశాఖ అధికారులు తెలిపారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement