Boy escaped from Kidnapper in Karnataka Goes Viral - Sakshi
Sakshi News home page

పక్కా ప్లాన్‌ వేసి కిడ్నాప్‌.. చిన్నారి దెబ్బకు దిమ్మతిరిగింది కదా!

Published Mon, Mar 27 2023 5:13 PM | Last Updated on Mon, Mar 27 2023 5:36 PM

Boy Escaped From Kidnapped Karnataka Goes Viral - Sakshi

చిన్న పిల్లల కిడ్నాప్‌లు ఇటీవల పెరిగిపోతున్నాయి. అందుకు కిడ్నాపర్లు వివిధ మార్గాలను ఎంచుకుంటున్నారు. కిడ్నాప్‌ చేసే ముందు జాగ్రత్తతో వ్యవహరిస్తున్నారు. ఇటీవల ఓ వ్యక్తి అందరి ముందే పిల్లాడిని కిడ్నాప్‌ చేసేందుకు ప్లాన్‌ వేశాడు. అనుకున్నదే తడవుగా అమలు కూడా చేశాడు. అయితే ఆ చిన్నారి చిచ్చర పిడుగులా ప్రవర్తించే సరికి చివరిక అక్కడి నుంచి మెల్లగా జారుకున్నాడు. ఇంతకీ ఆ బాలుడు ఏం చేశాడు..?

వివరాల్లోకి వెళితే.. చిక్కమగళూరు నగరంలోని ఎంజీ రోడ్డులో ఫుట్‌పాత్‌పై ఆడుకుంటున్న చిన్నారిని కిడ్నాప్ చేసేందుకు ఓ అజ్ఞాత వ్యక్తి ప్రయత్నించాడు. అది కూడా అందరూ చూస్తుండగానే ఈ ప్లాన్‌ వేశాడు. ఇంకేముంది సైలెంట్‌గా అపహరించి, భుజాలపై ఎత్తుకుని, అక్కడి నుంచి జారుకునేందుకే సిద్ధమయ్యాడు. అయితే అదే సమయంలో అప్రమత్తమైన బాలుడు కిడ్నాపర్ భుజం నుంచి సినిమాటిక్‌గా తప్పించుకున్నాడు. దీంతో ఖంగుతిన్న ఆ కిడ్నాపర్ వెంటనే పారిపోయాడు. కిడ్నాపర్ బారి నుంచి తప్పించుకుని ఆ చిన్నారి చూపిన ధైర్యానికి సర్వత్రా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ఈ ఘటన సీసీటీవీలో రికార్డ్‌ కాగా ప్రస్తుతం అది వైరల్ అవుతోంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement