♦ రూ. 3 కోట్ల విలువైన బంగారం స్వాధీనం
♦ హరిద్వార్‌లో పట్టుబడిన నిందితుడు
♦ రూ.15.70 కోట్ల బంగారు బిస్కెట్ల
♦ దోపిడీ కేసులో పురోగతి
థానే : గత ఏప్రిల్‌లో నాసిక్‌లో జరిగిన భారీ దోపిడీ కేసులో నిందితులను పోలీసులు పట్టుకున్నారు. దాదాపు రూ.15.70 కోట్ల విలువైన బంగారు బిస్కెట్లు దోపిడీ చేసిన కేసులో హరిద్వార్‌కు చెందిన ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. దీంతో ఈ దోపిడీ కేసు త్వరలో పరిష్కారమవుతుందని చెప్పా రు. ‘నిందితుడిపై సెక్షన్ 397 సెక్షన్ 398 కింద కేసు నమోదు చేశాం. 2015 ఏప్రిల్ 25న శిర్పూర్ గోల్డ్ రిఫైనరీ నుంచి సిక్‌వెల్ లాజిస్టిక్స్ కంపెనీకి వాహ నంలో మొత్తం బాంగారు తరలిస్తుండగా, నాసిక్ వద్ద బాంబే-ఆగ్రా రహదారిపై ఐదుగురు కారులో వచ్చారు.
రివాల్వర్లతో బెదిరించి మొత్తం రూ.15.70 కోట్ల విలువైన 58 కిలోల బంగారు దోపిడీ చేశారు’ అని థానే జాయింట్ కమిషనర్ వీవీ లక్ష్మినారాయణ తెలిపారు. నిందితుల కోసం ఎం పీలోని భోపాల్, యూపీలోని అజాం గఢ్, గుజరాత్‌లోని సూరత్, నేపాల్ బోర్డర్‌లోని సునియోలిలో గాలించి నట్లు పేర్కొన్నారు. అయితే దుండగులు చేయితిరిగిన నేరస్తులు కావడంతో ఇన్నాళ్లు దొరకలేదని తెలి పారు. నింది తులు పలు సిమ్ కార్డులు మార్చారని, 100 నుంచి 150 కిలోమీటర్ల వరకు పనిచేసే సెల్యూలార్ ఫోన్లు కూడా వాడారని చెప్పారు.
అయితే పట్టుబడిన నిందితుడు హరి ద్వార్‌లో కొన్ని వస్తువుల కొన్నట్లు థానే పోలీసులకు సమాచారం అందిందని, వెంటనే పథకం ప్రకారం మాటు వేసిన తమ సిబ్బంది నిందితుడిని అరెస్టు చేసి రూ. 3 కోట్ల విలువైన బంగారు బిస్కెట్లు స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. అలాగే రూ. 12.5 లక్షల నగదు, 14 లక్షల విలువైన కారు, ఐ ఫోన్, టీవీ, రివాల్వర్, నేపాల్ కరె న్సీ, కొన్ని పత్రాలు జప్తు చేసినట్లు పేర్కొన్నారు.
‘నాసిక్’ దోపిడీ నిందితుడి అరెస్టు
Published Thu, Jul 30 2015 2:52 AM | Last Updated on Thu, Aug 30 2018 5:24 PM
Advertisement
Advertisement