![YS Jagan expresses shock over Palnadu tractor mishap](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/9/YS-Jagan_Mohanr.jpg.webp?itok=-Iz16hwo)
తాడేపల్లి : పల్నాడు జిల్లాలో జరిగిన ట్రాక్టర్ ప్రమాదంపై వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ట్రాక్టర్ బోల్తా పడి నలుగురు మహిళలు మృత్యువాత పడటంపై విచారం వ్యక్తం చేశారు వైఎస్ జగన్. మృతుల కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని వైఎస్ జగన్ విజ్ఞప్తి చేశారు. అదే సమయంలో ప్రమాదంలో గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలన్నారు.
కాగా, పల్నాడు జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. మిర్చి కోత కోసి పోలం నుంచి ఇంటికి తిరిగి వస్తుండగా ముప్పాళ్ళ మండలం బొల్లవరం అడ్డరోడ్డు వద్ద 30మంది మిర్చి కూలీలతో వెళ్తున్న ట్రాక్టర్ బోల్తా పడింది. ఈ దుర్ఘటనలో నలుగురు కూలీలు మృతి చెందారు. పలువురు గాయపడ్డారు. గాయపడ్డ క్షతగాత్రుల్ని అత్యవసర చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.
Comments
Please login to add a commentAdd a comment