
రోడ్డు ప్రమాదంలో నిండు గర్భిణి మృతి
స్కూటీని ఆర్టీసీ బస్సు ఢీకొనడంతో దుర్ఘటన
జిల్లా కేంద్రంలోని డేఅండ్‌నైట్ కూడలి సమీపంలో ప్రమాదం
మరో రెండు రోజుల్లో ఆమెకు ప్రసవం. ఆ దంపతుల ఆలోచనలన్నీ పుట్టబోయే బిడ్డపైనే ఉన్నాయి. అంతా సవ్యంగా జరగాలని దేవుళ్లందరికీ మొక్కారు. డాక్టర్లు సోమవారం నుంచే ఆస్పత్రిలో ఉండిపొమ్మన్నారు. కానీ వారి విధిరాత మరోలా ఉంది. వస్తువులన్నీ సర్దుకుని వస్తామని చెప్పి వచ్చేశారు. అదే వారి తప్పైపోయింది. ఇంటికి వెళ్తుంటే బస్సు రూపంలో మృత్యువు ఎదురొచ్చింది. తల్లిని, కడుపులోని బిడ్డను తనతో తీసుకెళ్లిపోయి.. కుటుంబానికి శోకం మిగిల్చింది.
శ్రీకాకుళం క్రైమ్ : జిల్లా కేంద్రంలోని డేఅండ్‌నైట్ కూడలి సమీపంలో సోమవారం జరిగిన ప్రమాదంలో యంపాడ రాజేశ్వరి(20)(Rajeshwari) అనే నిండు గర్భిణి దుర్మరణం పాలయ్యారు. మరో 48 గంటల్లో ఆమె ప్రసవానికి సిద్ధమవుతుండగా.. ఈ దుర్ఘటన జరగడంతో కుటుంబం తల్లడిల్లిపోతోంది. స్కూటీని(Scooty) ఆర్టీసీ బస్సు (rtcbus)ఢీకొట్టడంతో ఆమె బస్సు చక్రాల కింద నలిగిపోయి ప్రాణాలు విడిచారు. ఘటనలో ఆమె భర్త దుర్గారావు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. ట్రాఫిక్ సీఐ నాగరాజు, మృతురాలి కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల మేరకు..
ఎచ్చెర్ల మండలం కుంచాల కూర్మయ్యపేటకు చెందిన యంపాడ దుర్గారావు అర్బన్ కాలనీలో తన ఇంటికి సమీపంలోనే టిఫిన్‌షాపు నడుపుతున్నారు. ఆయనకు అదే గ్రామానికి చెందిన రాజేశ్వరితో నాలుగేళ్ల కిందట వివాహమైంది. వీరికి ఏడాదిన్నర వయసు గల పాప ఉంది. రాజేశ్వరి మళ్లీ గర్భం(pregnant woman) దాల్చడంతో శ్రీకాకుళం రిమ్స్‌లో తరచూ చూపిస్తున్నారు. ఆ క్రమంలోనే సోమవారం ఉదయం 9:30 గంటలకు దంపతులిద్దరూ స్కూటీపై బయల్దేరారు. రిమ్స్‌లో వైద్యులకు చూపించాక బుధవారం ప్రస వం జరిగే అవకాశం ఉందని, ఇప్పుడు వెళ్తే రావడం కష్టమవుతుంది కాబట్టి సోమవారమే ఇక్కడ ఉండిపోవాలని వైద్యులు సూచించారు. కానీ వస్తువులన్నీ సర్దుకుని వచ్చేస్తామని భార్యాభర్తలు తిరుగు ప్రయాణమయ్యారు.
డేఅండ్‌నైట్ కూడలి సమీపానికి ఉదయం 11.48గంటలకు వారు బండిపై చేరుకున్నారు. కూడలి దాటుకుని బ్రి డ్జి వైపు వెళ్లిన కొద్ది సేపటికే విశాఖ వెళ్తున్న ఆర్టీసీ పల్లెవెలుగు బస్సు వీరిని దాటుకుంటూ వెళ్లింది. అయితే బస్సు స్కూటీ అద్దాన్ని తాకడంతో.. బండి అదుపు తప్పి దుర్గారావు డివైడర్ వైపు పడిపోయా రు. రాజేశ్వరి మాత్రం బస్సు వెనుక చక్రాల కింద పడిపోవడంతో తీవ్ర రక్తస్రావమైంది. ప్రమాదం జ రిగినా బస్సు డ్రైవర్ ఆపకుండా వెళ్లిపోవడం అక్కడి వారిని నిశ్చేషు్టలను చేసింది.
వెంటనే అక్కడున్న వా రి సాయంతో భర్త దుర్గారావు రాజేశ్వరిని ఆటోలో మెడికవర్ ఆస్పత్రికి తీసుకెళ్లాడు. కానీ తీవ్రంగా గాయపడిన ఆమె సాయంత్రం నాలుగు గంటలకు మృతిచెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. ప్రమాద దృశ్యాలన్నీ మెడిల్యాబ్ సీసీ కెమెరా ఫుటేజీలో నిక్షిప్తమయ్యాయి. దాని ప్రకారం పోలీసులు బస్సును గుర్తించి డ్రైవర్‌కు ఫోన్ చేసి రమ్మని పిలిచారు. అయితే తనకు ఏం జరిగిందో తెలియ దని డ్రైవర్ చెప్పడం గమనార్హం. దీనిపై కేసు నమో దు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ మెట్ట సుధాకర్ తెలిపారు.
20 ఏళ్లకే ..
చనిపోయిన రాజేశ్వరి వయసు కేవలం 20 ఏళ్లు. పదహారేళ్లు దాటాక పెళ్లి చేసుకుని 18 ఏళ్లకు తల్లిగా మారిన రాజేశ్వరికి 20 ఏళ్లకే ఆయుష్షు రేఖ ఆగిపోయింది. ఇంత చిన్న వయసులో అది కూడా గర్భిణిగా చనిపోవడంతో ఊరంతా శోకసంద్రమైంది.
Comments
Please login to add a commentAdd a comment