రోడ్డు ప్రమాదంలో దంపతుల దుర్మరణం
చెన్నంపల్లిలో విషాదఛాయలు
తుగ్గలి/పెద్దవడుగూరు: అనంతపురం జిల్లా పెద్దవడుగూరు మండలం క్రిష్టిపాడు వద్ద శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో తుగ్గలి మండలం చెన్నంపల్లికి చెందిన దంపతులు మృతి చెందారు. గ్రామానికి చెందిన వలుకూరు రాజు(35), సుమలత (30) దంపతులు వ్యవసాయం చేసుకుంటూ జీవ నం సాగిస్తున్నారు. వీరికి కూతురు, కుమారుడు ఉన్నారు. ఊర్లో ఈనెల 22న జరిగే దేవర ఉత్సవాలు ఉన్నందున నేత చీరల తెచ్చుకునేందుకు ద్విచక్ర వాహనంపై అనంతపు రం జిల్లా యాడికి వెళ్లారు.
అక్కడ పట్టుచీరలు కొనుగోలు చేసిన అనంతరం తిరిగి మోటారు సైకిల్‌పై వ స్తుండగా పెద్దవడుగూరు మండలం క్రిష్టిపాడు సమీపంలో 67వ జాతీయ రహదారిపై పెట్రోల్ బంక్ వద్ద గుత్తి వైపు నుంచి యాడికికి శరవేగంగా వెళుతున్న బొలెరో వాహనం ఢీకొంది. ఘటనలో దంపతులిద్దరూ మృతిచెందారు. బొలెరో వాహనంలో ఉన్న యాడికి గ్రామానికి చెందిన యువకుడు సాయి మణికంఠకూ తీవ్ర గాయాలయ్యాయి.
విషయం తెలుసుకున్న యాడికి ఎస్‌ఐ ఆంజనేయులు, సిబ్బంది అక్కడికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. సమాచారం అందుకున్న మృతుల కుటుంబ సభ్యులు ఘటనా స్థలానికి చేరుకుని బోరున విలపించారు. మృతుడి తండ్రి శంకరయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. దంపతుల మృతితో చెన్నంపల్లి గ్రామంలో తీవ్ర విషాదఛాయలు నెలకొన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment