
కాశీకి వెళ్లి తిరిగి వస్తుండగా ప్రమాదం
మధ్యప్రదేశ్‌లో లోయలో పడిన బస్సు
మహిళ మృతి ∙11 మందికి గాయాలు
మోతీనగర్: విహారయాత్రలో విషాదం నెలకొన్న సంఘటన సనత్‌నగర్ పోలీస్ స్టేషన్ వీ రామారావునగర్‌లో చోటు చేసుకుంది. మృతురాలి బంధువులు, యాత్రికుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. కూకట్‌పల్లి నియోజకవర్గం, అల్లాపూర్ డివిజన్ వీ రామారావు నగర్‌కు చెందిన 12 మంది యాత్రికులు ఈ నెల 16న కాశీ యాత్రకు వెళ్లారు.
తిరుగు ప్రయాణంలో ఆదివారం తెల్లవారుజామున వారు ప్రయాణిస్తున్న బస్సు మధ్యప్రదేశ్ రాష్ట్రం పియోలి జిల్లాలోని ఘాట్‌రోడ్డులో లోయలో పడిపోయింది. బస్సులో ప్రయాణిస్తున్న మల్లమ్మ అక్కడికక్కడే మృతి చెందగా మరో 11 మందికి గాయాలు కావడంతో సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న స్థానిక బీఆర్‌ఎస్ నాయకులు నాగుల సత్యం ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు దృష్టికి తీసుకెళ్లారు. ఎమ్మెల్యే నాగపూర్ అధికారులు, పోలీసులతో మాట్లాడి నగరానికి మృతదేహాన్ని నగరానికి తీసుకు వచ్చేందుకు ఏర్పాట్లు చేశారు. గాయపడిన వారికి ప్రథమ చికిత్స నిర్వహించారు.
Comments
Please login to add a commentAdd a comment