Excursion Trip
-
విషాదయాత్రగా మారిన విహార యాత్ర.. 21 మంది విద్యార్థుల్లో..
సాక్షి, వేటపాలెం (బాపట్ల జిల్లా): విహార యాత్ర విషాదయాత్రగా మారింది. సరదాగా వాగులో దిగిన ముగ్గురు విద్యార్థినులు ఆ నీటి ప్రవాహానికి బలయ్యారు. అల్లూరి సీతారామరాజు జిల్లా చింతూరు మండలం సోకిలేరు వద్ద జరిగిన ఈ ఘటనతో బాపట్ల జిల్లా వేటపాలెం మండలం దేశాయిపేటలో విషాదఛాయలు అలుముకున్నాయి. దేశాయిపేట పంచాయతీ అనుజ్ఞ హైస్కూల్లో పదో తరగతి చదువుతున్న 21 మందిలో 15 మంది విద్యార్థులు, ఆరుగురు విద్యార్థినిలను ఆదివారం ఉదయం బస్‌లో భద్రాచలం, అరకు ప్రాంతాలకు విహారయాత్రకు యాజమాన్యం తీసుకెళ్లారు. ఆదివారం సాయంత్రానికి భద్రాచలం చేరుకున్నారు. అక్కడ ప్రసిద్ధిగాంచిన ప్రాంతాలను సందర్శించుకొని అక్కడ నుంచి సోమవారం ఉదయానికి చింతూరు చేరుకున్నారు. చింతూరు వ్యూపాయింట్ వద్ద సోకిలేరు వాగు నీటిలో సరదాగా విద్యార్థులు దిగారు. అయితే వాగు నీటిలో దిగిన విద్యార్థినిలు గుమ్మడి జయశ్రీ (14), సువర్ణకమల (14), గీతాంజలి (14) లోతు గమనించకపోవడంతో వారిలో ఒక అమ్మాయి వాగునీటిలో జారి పడిపోయింది. పక్కనే ఉన్న ఇద్దరు అమ్మాయిలు స్నేహితురాలి చేయి పట్టుకునే సమయంలో ప్రమాదవ శాత్తు ముగ్గురూ లోతైన నీటి గుంటలో పడి వాగులో గల్లంతై మృతి చెందారు. బాలికల కుటుంబాల్లో విషాద ఛాయలు.. విహార యాత్రకు వెళ్లిన కొన్ని గంటల వ్యవధిలోనే వాగులో గల్లంతై ప్రాణాలు విడిచిన తమ పిల్లల సమాచారం అందుకున్న తల్లిదండ్రులు తల్లడిల్లిపోయారు. దేశాయిపేట పంచాయతీ పరిధిలోని కేపాల్ కాలనీకి చెందిన వెంకారెడ్డికి గీతాంజలి (14) ఒకే ఒక్క కుమార్తె. వెంకారెడ్డి విజయవాడలో ప్రైవేట్ ఉద్యోగం చేస్తూ కుమార్తెను మంచి చదువులు చదివించాలని ప్రైవేట్ స్కూల్లో చేర్పించాడు. విహార యాత్రకు వెళతానని చెప్పగానే కుమార్తె ఆనందానికి అడ్డుచెప్పకుండా పంపించాడు. యాత్రకు వెళ్లిన ఒక్క రోజు గడవక ముందే తన కుమార్తె ఇకలేదని వార్త తెలియడంతో హతాశుడయ్యాడు. భార్యకు గుండె సంబంధిత సమస్య ఉండటంతో తన కూతురు మరణించిన విషయం భార్యకు చెప్పుకోలేక తల్లడిల్లుతున్నాడు. తన భార్య తట్టుకోలేదని భోరున విలపించాడు. ఔ చదవండి: (నాకు మాత్రమే తెలుసు ఎందుకుపోతున్నానో.. మరో జన్ముంటే మళ్లీ కలుద్దాం) విలేకర్లు చెప్పిందాక తెలియదు.. దేశాయిపేట పంచాయతీ పరిధిలోని సిలోన్ కాలనీకి చెందిన గౌరీ రవికుమార్ చేనేత పనులు చేసుకుంటూ జీవిస్తున్నాడు. వీరికి ఒక అబ్బాయి, ఒక అమ్మాయి ఉన్నారు. అమ్మాయి సువర్ణకమల ప్రైవేట్ స్కూల్లో పదో తరగతి చదువుతోంది. ‘‘విహార యాత్రకు వెళతామంటే పంపించాం. అయితే విహార యాత్రకు వెళ్లిన ప్రాంతంలో ప్రమాదంలో నీటిలో పడి తమ కూతురు మరణించిందని విలేకర్లు చెబితే తెలుసుకున్నాను. హైస్కూల్ యాజమాన్యం ఎలాంటి సమాచారం ఇవ్వలేదు. మా కూతురు విషయాలు ఇంతవరకు తెలియలేదు. మీరైనా తెలిసి ఉంటే చెప్పాలని’’ విషాద వదనంతో వాపోయాడు. ఇద్దరు బిడ్డల్లో ఒకరిని కోల్పోయా.. వేటపాలెం నాయినపల్లి కాయల లంపకు చెందిన శేషగిరి ప్రైవేట్ వ్యాపారం చేస్తుంటాడు. వీరికి ఇద్దరు కుమార్తెలు కాగా వారిలో గుమ్మడి జయశ్రీ అనుజ్ఞ హైస్కూల్లో పదో తరగతి చదువుతోంది. ‘‘విహార యాత్రకు వెళతామంటే పంపించాను. యాత్రకు వెళ్లిన ఒక రోజు గడవక ముందే ప్రమాదం జరిగిందని తెలిసింది. నా భార్యకు ఆరోగ్యం బాగాలేదు. జరిగిన విషయం భార్యకు చెప్పలేదు. కూతురు విషయం తెలిస్తే భార్య ఏమవుతుందో ఆందోళనగా ఉంది. ఇంత నిర్లక్ష్యంగా యాజమాన్యం ఉంటే మా పిల్లలు పరిస్థితి ఏమిటి? ఇద్దరు బిడ్డల్లో ఒకరిని కోల్పోయా..’’ అని కన్నీటి పర్యంతమయ్యారు. -
భార్యతో విదేశాలకు చిరంజీవి టూర్.. నెల తర్వాత ఇంటికి..
చిరంజీవి బ్యాక్ టు హోమ్. గత నెల 3న తన సతీమణి సురేఖతో కలిసి చిరంజీవి విదేశాలకు విహార యాత్రకు వెళ్లారు. నెల రోజుల హాలిడే తర్వాత శుక్రవారం ఉదయం హైదరాబాద్ చేరుకున్నారు. వెకేషన్లో ఫుల్‌గా రిలాక్స్ అయిన చిరంజీవి ఇక షూటింగ్స్‌తో బిజీ కానున్నారు. ప్రస్తుతం మెహర్ రమేశ్ దర్శకత్వంలో ‘బోళా శంకర్’, బాబీ (కేఎస్ రవీంద్ర) దర్శకత్వంలో ‘వాల్తేరు వీరయ్య’, మోహన్‌రాజా దర్శకత్వంలో ‘గాడ్ ఫాదర్’ సినిమాలు చేస్తున్నారు చిరంజీవి. ఈ మూడు సినిమాల షూటింగ్స్‌లో పాల్గొనడానికి ప్లాన్ చేసుకున్నారు. ‘గాడ్ ఫాదర్’లోని ఓ సాంగ్ సీక్వెన్స్, ‘బోళా శంకర్’ షూట్, ‘వాల్తేరు వీరయ్య’ ఫారిన్ షెడ్యూల్లో చిరంజీవి పాల్గొంటారట. ఇక ఈ రెండు సినిమాలే కాక.. చిరంజీవి హీరోగా ‘ఛలో’, ‘భీష్మ’ చిత్రాల ఫేమ్ వెంకీ కుడుముల దర్శకత్వంలో ఓ సినిమా రూపొందనున్న సంగతి తెలిసిందే. చదవండి: చిరంజీవితో ఏ గొడవ లేదు.. వారే దూరం పెంచుతున్నారు: జీవిత ఆ సినిమా నా కంటే వెంకటేశ్ చేస్తేనే బాగుండేది : చిరంజీవి var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_4311451212.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
హైదరాబాద్‌లో విషాదం.. విహారయాత్రకు వెళ్లి పదో తరగతి విద్యార్థి మృతి
సాక్షి, హైదరాబాద్: బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో విషాదం చోటుచేసుకుంది. పాఠశాల తరపున విహార యాత్రలకు వెళ్లిన 10వ తరగతి విద్యార్థి ప్రమాదవశాత్తు మృతిచెందాడు. వివరాలు.. స్థానిక సరస్వతి స్కూల్‌కు చెందిన 60 మంది విద్యార్థులు బాసర విహారయాత్రకు వెళ్లారు. ఈ క్రమంలో గోదావరి నది ఒడ్డున తోటివారితో ఆడుతుండగా ప్రమాదవశాత్తు నీటిలో పడి విశాల్ అనే విద్యార్థి మృతి చెందాడు. హైదరాబాద్ నుంచి ఉదయం 5గంటలకు బాసరకు వెళ్లగా...12 గంటలకు మృతి చెందినట్లు పాఠశాల యాజమాన్యం తలిదండ్రులు ఫోన్ చేసి చెప్పింది. అయితే మృతదేహాన్ని హైదరాబాద్ తీసుకువచ్చిన స్కూల్ యాజమాన్యం.. ఎలాంటి సమాచారం ఇవ్వకుండా కుటుంబ సభ్యుల వద్ద వదిలి వెళ్లింది. దీంతో విశాల్ మృతదేహంతో స్కూల్ వద్ద కుటుంబ సభ్యులు ఆందోళన చేపట్టారు. బాలుడి మృతికి స్కూల్ యాజమాన్యం బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో సరస్వతి స్కూల్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. చదవండి: Drugs Case: డ్రగ్స్ కేసులో కీలక సూత్రధారి అరెస్ట్ కాగా బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 10 సరస్వతి విద్యానికేతన్ తరఫునుంచి గత 30 సంవత్సరాలుగా పేద విద్యార్థులను పర్యాటక ప్రాంతాలకు తీసుకెళ్తుంటారు. అందులో భాగంగానే బాసర క్షేత్రానికి తీసుకెళ్లిన విద్యార్థుల్లో ఒక విద్యార్థి గోదావరి నదిలో మునిగి మృతి చెందారు. -
చిన్న విరామం చిటికెలో వచ్చేస్తా
2018 సమంతకు గోల్డెన్ ఇయర్ అని చెప్పొచ్చు. ఆమె నటించిన ‘రంగస్థలం, మహానటి, ఇరంబుదురై (తెలుగులో అభిమన్యుడు), యు టర్న్’ సినిమాలు బాక్సాఫీస్ వద్ద సక్సెస్ అయ్యాయి. ఇటు నటన పరంగానూ సమంతకు మంచి పేరు తెచ్చాయి. అందుకే నెక్ట్స్ సినిమా స్టార్ట్ చేసేముందు చిన్న బ్రేక్ తీసుకోవాలని డిసైడ్ అయ్యారు. తుర్రుమని విహారయాత్రకు వెళ్లారు. ‘‘ఫైనల్లీ.... వెకేషన్’’ అంటూ సోషల్ మీడియాలో పంచుకున్నారామె. తన భర్త నాగ చైతన్యతో కలసి సమంత ఓ చిత్రంలో నటించనున్న సంగతి తెలిసిందే. ఈ కొత్త చిత్రం చైతూ, సమంత పెళ్లి రోజు (అక్టోబర్ 6) న ఆరంభం కానుంది. ఈ షూటింగ్ స్టార్ట్ కాకముందే చిన్న బ్రేక్.. చిటికెలో రీఫ్రెష్ అయి, సెట్లో జాయిన్ అవ్వనున్నారు. శివ నిర్వాణ దర్శకత్వం వహిస్తారు. ఇందులో చైతూ, సమంత దంపతుల్లానే కనిపిస్తారట. -
సెల్ఫీ తీసుకుంటూ చూస్తుండగానే..
సాక్షి, ముంబై : సరదాగా కుటుంబంతో గడుపుదామని విహారయాత్రకు వెళ్లిన ఓ వివాహిత ప్రమాదవశాత్తు లోయలో పడి మరణించింది. ఈ ఘటన రాయ్‌గఢ్ జిల్లాలోని మాథెరన్ హిల్ స్టేషన్లో చోటుచేసుకుంది. జిల్లా ఎస్పీ సంజయ్ పాటిల్ ప్రకారం.. ఢిల్లీకి చెందిన సరితా రామేష్ చౌహన్(33) తన భర్త, ముగ్గురు పిల్లలతో కలిసి మంగళవారం చుట్టూ కొండలతో, ప్రకృతి రమణీయంగా ఉండే మాథెరన్ హిల్ స్టేషన్‌కు విహారయాత్రకు వెళ్లారు. ఎత్తయిన కొండ ప్రాంతం లూసియా పాయింట్ వద్ద సాయంత్రం అందరూ సెల్ఫీలు తీసుకుంటున్నారు. సెల్ఫీ తీసుకునే క్రమంలో సరితా 500 అడుగుల లోయలో కాలుజారిపడిపోయారు. ఊహించని పరిణామంతో షాక్ తిన్న కుటుంబ సభ్యులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారని ఎస్పీ వెల్లడించారు. అప్పటికే చీకటి పడడంతో స్థానికుల సహాయంతో అర్ధరాత్రి సమయంలో మృతదేహాన్ని వెలికి తీశామని పోలీసులు తెలిపారు. కాగా, తమిళనాడుకు చెందిన పర్యాటకులు సెల్ఫీ తీసుకునే క్రమంలో సోమవారం గోవా సముద్ర జలాల్లో నీటిలో మునిగి చనిపోయిన సంగతి తెలిసిందే. వాషింగ్టన్ పోస్టు రిపోర్టు ప్రకారం.. 2015లో ప్రపంచ వ్యాప్తంగా చోటుచేసుకున్న సెల్ఫీ ప్రమాద మరణాల్లో భారత్ వాటా సగమని తెలిపింది. -
కుటుంబాన్ని రక్షించబోయి వ్యక్తి మృతి
సాక్షి, హసన్‌పర్తి: విహార యాత్రలో విషాదం అలుముకుంది. చెన్నైలోని మెరినో బీచ్‌లో నీటి అలలకు వరంగల్ నగరానికి చెందిన పాలకుర్తి సురేష్(44) కొట్టుకుపోయాడు. శుక్రవారం జరిగిన ఈ ఘటన వివరాలు ఇలా ఉన్నాయి. విహార యాత్ర నిమిత్తం వారం రోజుల క్రితం సురేష్ కుటుంబంతోపాటు మరో రెండు కుటుంబాల సభ్యులు చెన్నైలోని వివిధ ప్రాంతాలను సందర్శించారు. చివరిగా రామేశ్వరస్వామి ఆలయంలో పూజలు చేసి శుక్రవారం తిరుగు ప్రయాణానికి సిద్ధమయ్యారు. రైలు ఆలస్యం ఉండడంతో సమీపంలోని మెరినో బీచ్‌కు వెళ్లారు. అందరూ స్నానం చేసే క్రమంలో అలలు ఎగిసి పడి సురేష్ భార్య మాధవి, కుమారుడు సాత్విక్, కూతురు శ్రీజ నీటిలో మునిగిపోతుండగా వారిని రక్షించడానికి సురేష్ వెళ్లాడు. ఈ క్రమంలో అతడు నీటిలో కొట్టుకుపోయినట్లు బంధువులు తెలిపారు. పదినిమిషాల తర్వాత సురేష్ మృతదేహాం ప్రత్యక్షం కావడంతో కుటుంబ సభ్యులు అక్కడక్కడే కుప్పకూలిపోయారు. రామన్నపేటలో అద్దె ఇంట్లో నివాసం.. సురేష్ కుటుంబం నగరంలోని రామన్నపేటలో అద్దె ఇంటిలో నివాసం ఉంటోంది. అయితే ఇటీవల అతడు హసన్‌పర్తిలో ఓ ఇంటిని కొనుగోలు చేసి అద్దెకు ఇచ్చాడు. రామన్నపేటలో ఉంటూ హన్మకొండలో మెడికల్ షాపు నిర్వహిస్తున్నట్లు స్థానికులు చెప్పారు. సురేష్ అంత్యక్రియలు ఆదివారం హసన్‌పర్తిలోని ఆర్యవైశ్య శ్మశానవాటికలో నిర్వహిస్తున్నట్లు బంధువులు తెలిపారు. -
విషాదం మిగిల్చిన విహార యాత్ర
కోనేరులో పడి ప్రాణాలు కోల్పోయిన ఇద్దరు మిత్రులు పెనుకొండ: విహార యాత్ర విషాదాన్ని మిగిల్చింది. పట్టణంలోని పెనుకొండ కొండపై పర్యాటక అందాలను తిలకించాలని వచ్చిన ముగ్గురు స్నేహితుల్లో ప్రమాదవశాత్తు ఇద్దరు కోనేరులో పడి మృతి చెందారు. మరొకరు తృటిలో ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు. కొండపైన లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం సమీపంలోని కోనేరులో గురువారం మధ్యాహ్నం ఈ ఘోరం చోటు చేసుకుంది. వివరాల్లోకెళితే.. హిందూపురం సమీపంలోని సంతేబిదనూరుకు చెందిన మహబూబ్ బాషా (26) వృత్తిరీత్యా బెంగళూరులో బేకరిలో పని చేస్తూ ఇటీవల స్వగ్రామానికి వచ్చాడు. హిందూపురం పట్టణానికి చెందిన యూసుఫ్ (19) పట్టణంలో ద్రాక్ష వ్యాపారం చేస్తూ కుటుంబానికి చేదోడు వాదోడుగా ఉంటున్నాడు. అదే పట్టణానికి చెందిన ఖలీద్ చిల్లర వ్యాపారం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. పర్యాటక అందాలను చూడడానికి వెళ్లి.. గురువారం మధ్యాహ్నం వారు పెనుకొండ కొండపైన పర్యాటక అందాలు చూడడానికి ఒకే ద్విచక్ర వాహనంలో వెళ్లారు. కొండపై కోనేరు వద్దకు వచ్చి ముఖాలు కడుక్కుంటూ నీటిలో చేపలు ఉన్నాయేమోనని ముందుకు వంగగా పాచి కారణంతో మహబూబ్ బాషా నీటిలోకి జారిపోయాడు. బాషాను పట్టుకోబోయిన ఖలీద్ సైతం నీటిలోకి జారిపోయాడు. వీరిని రక్షించడానికి ప్రయత్నించిన యూసుఫ్ సైతం నీటిలోకి జారిపోయాడు. ఖలీద్‌కు చెట్టు వేరు దొరకడంతో బయటకు చేరుకున్నాడు. మిగిలిన ఇద్దరు ఈత రాకపోవడంతో నీటిలో మునిగి మృతిచెందారు. అక్కడున్న ఇతర ప్రాంతాల వ్యక్తులు వీరిని రక్షించడానికి ప్రయత్నించి విఫలమయ్యారు. ఖలీద్ ద్వారా సమాచారం అందుకున్న ఎస్ఐ లింగన్న, అగ్నిమాపక అధికారి ఆంజనేయులు సిబ్బందితో వెళ్లి కోనేరులో మృతదేహాలను వెలికితీశారు. సమాచారం అందుకున్న కుటుంబసభ్యులు పెనుకొండకు చేరుకుని మృత దేహాలను చూసి బోరున విలపించారు. మృతదేహాలను పెనుకొండ ప్రభుత్వాసుపత్రికి తరలించి పోస్ట్‌మార్టం అనంతరం కుటుంబ సభ్యులకు అందించారు. ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. ఈతకు వెళ్లి మరొకరు.. ధర్మవరం అర్బన్ : పట్టణంలోని సూర్యప్రతాప్‌రెడ్డి కాలనీకి చెందిన ఆటో డ్రైవర్ ప్రతాప్(34) స్విమ్మింగ్‌పూల్‌కు ఈతకెళ్లి మృతి చెందాడు. అతడికి భార్య లక్ష్మి, కుమారులు ఉదయ్‌కిరణ్, జస్వంత్ ఉన్నారు. గురువారం కుమారులిద్దరినీ తీసుకుని ఈతకెళ్లాడు. అతడికి ఈతరాక నీటిలో మునిగి మృతి చెందాడు. స్థానికులు గమనించి మృతదేహాన్ని ఇంటికి చేర్చారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు శవాన్ని పోస్టుమార్టం నిమిత్తం ధర్మవరం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
మృతిచెందిన వారికి కొవ్వొత్తులతో నివాళులు