చిన్న విరామం చిటికెలో వచ్చేస్తా | Samantha 2018 Golden Year | Sakshi

చిన్న విరామం చిటికెలో వచ్చేస్తా

Sep 24 2018 12:31 AM | Updated on Sep 24 2018 11:08 AM

Samantha 2018 Golden Year - Sakshi

సమంత

2018 సమంతకు గోల్డెన్‌ ఇయర్‌ అని చెప్పొచ్చు. ఆమె నటించిన ‘రంగస్థలం, మహానటి, ఇరంబుదురై (తెలుగులో అభిమన్యుడు), యు టర్న్‌’ సినిమాలు బాక్సాఫీస్‌ వద్ద సక్సెస్‌ అయ్యాయి. ఇటు నటన పరంగానూ సమంతకు మంచి పేరు తెచ్చాయి. అందుకే నెక్ట్స్‌ సినిమా స్టార్ట్‌ చేసేముందు చిన్న బ్రేక్‌ తీసుకోవాలని డిసైడ్‌ అయ్యారు. తుర్రుమని విహారయాత్రకు వెళ్లారు.

‘‘ఫైనల్లీ.... వెకేషన్‌’’ అంటూ సోషల్‌ మీడియాలో పంచుకున్నారామె. తన భర్త నాగ చైతన్యతో కలసి సమంత ఓ చిత్రంలో నటించనున్న సంగతి తెలిసిందే. ఈ కొత్త చిత్రం చైతూ, సమంత పెళ్లి రోజు (అక్టోబర్‌ 6) న ఆరంభం కానుంది. ఈ షూటింగ్‌ స్టార్ట్‌ కాకముందే చిన్న బ్రేక్‌.. చిటికెలో రీఫ్రెష్‌ అయి, సెట్లో జాయిన్‌ అవ్వనున్నారు.  శివ నిర్వాణ దర్శకత్వం వహిస్తారు. ఇందులో చైతూ, సమంత దంపతుల్లానే కనిపిస్తారట.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all

Video

View all
Advertisement